Tuesday, July 8, 2014

సాయి అనుగ్రహ మాలిక




సాయి నామమే పవిత్రం ! సాయి బోధలే విచిత్రం !

సాయి పాదమే పవిత్రం ! సాయి పలుకులే విచిత్రం !!    సాయి నామమే !!


కలరా వ్యాధి కాఠిన్యమ్ ! గోధుమపిండి ఔషధం !

హేమాద్పంతుకి  ఆశ్చర్యం ! పలికించెనులె సచ్చరితం  !!


పెళ్ళికి  వచ్చెను ఒక బృందం ! మహాల్సా నోటిలో ఒక మంత్రం !

సాయి అనే పావనమంత్రం ! జగతికి ఇదియే ఆధారం !!  


శ్రీరామనవమి సంభరం ! ఉర్సు చందన ఉత్సవం !

ముస్లిం హిందూ సహవాసం ! జాతికి ఎంతో ప్రీతికరం !!  


బాబా చేసెను అద్భుతం ! ప్రేగులనే పరిశుభ్రం !

ఖండం చేసెను శరీరం ! అది పాపాలకు పరిహారం !!        


గాలించెనులె  బయజా అరణ్యం ! పెట్టెను ప్రేమతో నైవేద్యం !

బాబా ఇ చ్చెను ఒక వరం ! తాత్యాకిచ్చేను తన ప్రాణం !!  


బల్లపై విచిత్ర శయనం ! గుడ్డముక్కల ఆధారం !

చూసినవారికి పరవశం ! తలపించేనులే అది వైకుంఠమ్  !!


గణు మదిలో సంకల్పం ! ప్రయాగ తీర్థ ప్రయాణం !

బాబా చూపెను మహత్యం ! గంగాయమునల సంగమం !!


రాధా భాయి ఉపవాసం ! కావాలన్నది ఒక మంత్రం !

బాబా చూపెను గురు మార్గం ! ఆమెకు కల్గెను మరిజ్ఞానం !!


దుకాణదారుల  అజ్ఞానం ! నూనె లేదని అబద్ధం !

నీ ళ్ళ ను నూనెగా పోయడం ! షిర్డీ అంతా కాంతిమయం !!  


వ్రాయాలని గణు ఒక బాష్యం ! కాకా ఇంటిలో శ్రీకారం !

నౌకరు పిల్లతో బోధనం ! జగతికి ఈశా వాస్యం !!              


దాము అన్న వ్యాపారం ! బాబా వద్దనే ఆ భేరం !

తొలగించేనులే మరి లోభం ! అదియే ముక్తికి సోపానం !!  


నానా మనసులో సందేహం ! పసిగట్టేను బాబా చిరుగర్వమ్ !

బోధించేనులే గీతా రహస్యం ! కదిలేను ఆతని హృదయం !!


కుమ్మరి వనిత పరద్యానం ! కొలిమిలో బిడ్డకు అపాయం !

బాబా చూపెను కారుణ్యం ! అది ఆమెకు మమతావేశం !!    !


వచ్చెను మైనకు ఒక గండం ! మూడు దినముల వేదనం !

జామ్నేరులో బాబా చమత్కారం ! కల్గెను ఆమెకు సుఖప్రసవం !!


మేఘా చూసేను ఒక స్వప్నం ! కనిపించెనులే త్రిశూలం !

బాబా పంపెను శివలింగం ! ద్వారకమాయే కైలాసం !!      


వణిలో కాకా కలవరం ! సప్తశ్రుంగి సందేశం !

బాబా కోసం పరితాపం ! చివరికి కల్గెను అనుగ్రహం !!    


షిర్డీ వాసుల కలకలం ! తుఫాను తాకిడి బీభత్సమ్ !

బాబా ఇచ్చెను ఆదేశం ! అప్పుడు అంతా ప్రశాంతం !!      


మహాల్సా పల్లకి పయనం ! బంధిపోట్ల విహారం !

జిజూరిలొ బాబా దర్శనం ! కష్టాలన్నీ మటుమాయం !!  


సాయి నోటిలో ఒక కథనం ! పాము కప్పల జీవనమ్ !

మానవ జన్మల రహస్యం ! లోకానికిదియే ఆధారం !!      


ఇచ్చెను బాబా ఒక దానం ! అది లక్ష్మిబాయి సుకృతం !

నవవిధి భక్తీ విధానం ! ఇదియే కలియుగ ధర్మం !!        


ఇటుక రాయితో సంకేతం ! మహాసమాధి సన్నాహం !

బూటి వాడలో నివాసం ! అదియే మనకు పరమపదం !!  


సాయి నామమే పవిత్రం ! సాయి బోధలే విచిత్రం !

సాయి పాదమే పవిత్రం ! సాయి పలుకులే విచిత్రం !!      








No comments:

Post a Comment