సాయి నామమే పవిత్రం ! సాయి బోధలే విచిత్రం !
సాయి పాదమే పవిత్రం ! సాయి పలుకులే విచిత్రం !! సాయి నామమే !!
కలరా వ్యాధి కాఠిన్యమ్ ! గోధుమపిండి ఔషధం !
హేమాద్పంతుకి ఆశ్చర్యం ! పలికించెనులె సచ్చరితం !!
పెళ్ళికి వచ్చెను ఒక బృందం ! మహాల్సా నోటిలో ఒక మంత్రం !
సాయి అనే పావనమంత్రం ! జగతికి ఇదియే ఆధారం !!
శ్రీరామనవమి సంభరం ! ఉర్సు చందన ఉత్సవం !
ముస్లిం హిందూ సహవాసం ! జాతికి ఎంతో ప్రీతికరం !!
బాబా చేసెను అద్భుతం ! ప్రేగులనే పరిశుభ్రం !
ఖండం చేసెను శరీరం ! అది పాపాలకు పరిహారం !!
గాలించెనులె బయజా అరణ్యం ! పెట్టెను ప్రేమతో నైవేద్యం !
బాబా ఇ చ్చెను ఒక వరం ! తాత్యాకిచ్చేను తన ప్రాణం !!
బల్లపై విచిత్ర శయనం ! గుడ్డముక్కల ఆధారం !
చూసినవారికి పరవశం ! తలపించేనులే అది వైకుంఠమ్ !!
గణు మదిలో సంకల్పం ! ప్రయాగ తీర్థ ప్రయాణం !
బాబా చూపెను మహత్యం ! గంగాయమునల సంగమం !!
రాధా భాయి ఉపవాసం ! కావాలన్నది ఒక మంత్రం !
బాబా చూపెను గురు మార్గం ! ఆమెకు కల్గెను మరిజ్ఞానం !!
దుకాణదారుల అజ్ఞానం ! నూనె లేదని అబద్ధం !
నీ ళ్ళ ను నూనెగా పోయడం ! షిర్డీ అంతా కాంతిమయం !!
వ్రాయాలని గణు ఒక బాష్యం ! కాకా ఇంటిలో శ్రీకారం !
నౌకరు పిల్లతో బోధనం ! జగతికి ఈశా వాస్యం !!
దాము అన్న వ్యాపారం ! బాబా వద్దనే ఆ భేరం !
తొలగించేనులే మరి లోభం ! అదియే ముక్తికి సోపానం !!
నానా మనసులో సందేహం ! పసిగట్టేను బాబా చిరుగర్వమ్ !
బోధించేనులే గీతా రహస్యం ! కదిలేను ఆతని హృదయం !!
కుమ్మరి వనిత పరద్యానం ! కొలిమిలో బిడ్డకు అపాయం !
బాబా చూపెను కారుణ్యం ! అది ఆమెకు మమతావేశం !! !
వచ్చెను మైనకు ఒక గండం ! మూడు దినముల వేదనం !
జామ్నేరులో బాబా చమత్కారం ! కల్గెను ఆమెకు సుఖప్రసవం !!
మేఘా చూసేను ఒక స్వప్నం ! కనిపించెనులే త్రిశూలం !
బాబా పంపెను శివలింగం ! ద్వారకమాయే కైలాసం !!
వణిలో కాకా కలవరం ! సప్తశ్రుంగి సందేశం !
బాబా కోసం పరితాపం ! చివరికి కల్గెను అనుగ్రహం !!
షిర్డీ వాసుల కలకలం ! తుఫాను తాకిడి బీభత్సమ్ !
బాబా ఇచ్చెను ఆదేశం ! అప్పుడు అంతా ప్రశాంతం !!
మహాల్సా పల్లకి పయనం ! బంధిపోట్ల విహారం !
జిజూరిలొ బాబా దర్శనం ! కష్టాలన్నీ మటుమాయం !!
సాయి నోటిలో ఒక కథనం ! పాము కప్పల జీవనమ్ !
మానవ జన్మల రహస్యం ! లోకానికిదియే ఆధారం !!
ఇచ్చెను బాబా ఒక దానం ! అది లక్ష్మిబాయి సుకృతం !
నవవిధి భక్తీ విధానం ! ఇదియే కలియుగ ధర్మం !!
ఇటుక రాయితో సంకేతం ! మహాసమాధి సన్నాహం !
బూటి వాడలో నివాసం ! అదియే మనకు పరమపదం !!
సాయి నామమే పవిత్రం ! సాయి బోధలే విచిత్రం !
సాయి పాదమే పవిత్రం ! సాయి పలుకులే విచిత్రం !!
No comments:
Post a Comment