In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Saturday, December 7, 2019

షిర్డీ క్షేత్రం - పరమ పవిత్రం




పరమ యోగీశ్వరులైన సాయి షిర్డీలో మనలను ఉద్ధరించడానికి, సరైన మార్గంలో నడిపించడానికే అవతరించారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరిస్తాను అని భగవానుడు గీతలో చెప్పారు. అలానే భగవానుడు యోగీశ్వరుల రూపంలో అవతరించి ధర్మాన్ని రక్షిస్తారు. వారు సమాజానికి సరైన దారి చూపిస్తారు. షిర్డీ క్షేత్రం సాయి నాధుని కృపతో పుణ్య క్షేత్రం అయ్యింది. షిర్డీ కోపర్గామ్ తాలూకా, అహమద్ నగరు జిల్లాలో ఉంది. కోపర్గామ్ వద్ద గోదావరి నది దాటి షిర్డీ చేరవలిసి ఉంది. షిర్డీ అంటేనే సాయి. సాయి అంటేనే షిర్డీ. 

సాయి నడిచిన ఆ నేల అతిపవిత్రం. సాయి మూర్తీభవించిన జ్ఞానభండారం. శాంతి వారి భూషణం. వారు పరమార్థ వితరణలో అపర గురు స్వరూపం. సారాలలో సారం సాయి. వారు ఎప్పుడు ఆత్మ స్వరూపంలో లీనమై ఉంటారు. అందరి పట్ల అన్ని ప్రాణుల పట్ల వారి దృష్టి సమానము. వారు మానావమానాలకు అతీతులు. సర్వ జీవులలోను నిండియున్న భగవత్స్వరూపులు. భగవంతుని నామం వారి ముద్ర. వారి అంతఃకరణం శాంత సముద్రం వంటిది. వారు షిర్డీనుంచి శారీరక పరంగా అక్కడే ఉన్నట్లు అనిపించినా  వారు అంతటా ఉంటారు. షిర్డీలోనే అన్ని పుణ్యక్షేత్రాలు నెలకొని ఉన్నాయి. సాయి సమర్ధుని దర్శనమే మనకు యోగసాధనం. వారితో సంభాషణే మనకు పాప ప్రక్షాళనము. వారి చరణసంవాహనే మనకు త్రివేణి సంగమ స్నానం. వారి విభూతి ప్రసాదాల సేవనం అన్ని విధాలా పుణ్యపావనం. సాయియే మనకు పరబ్రహ్మ. అందుకే మహాభక్తుడైన 95 సంవత్సరాల గౌలి బువా సాయియే పండరినాథుడు అని సెలవిచ్చారు.

సాయికి నామస్మరణ చాలా ప్రీతికరము అందుకే దాసగణుకు నామసప్తాహం చేయమని చెప్పారు. అప్పుడు దాసగణు మహారాజ్ తనకు విఠల దర్శనం అవుతుంది అంటే చేస్తాను అని అన్నారు. బాబా అప్పుడు భక్తిభావం ఉంటె విఠలుడు తప్పక ప్రకటమౌతాడు అని చెప్పారు. అదే విధంగా ఆయనకు ఆ దర్శనం అయింది అని చెప్తారు. అలానే దీక్షిత్ గారికి కూడా ఆ దర్శన భాగ్యం కలిగింది. ఏ సన్నివేశాన్ని చక్కగా సత్చరితలో మనము చదవచ్చు. అలానే బాబా చెప్పినట్టు చిత్రపటం రూపంలో కూడా విఠలుడు వస్తారు. భగవంతరావు క్షీర సాగర్ షిర్డీకి వస్తే తన తండ్రి ఎంత విఠల భక్తుడో తెలిపి తనను సరైన దారిలో పెట్టారు. మన పూర్వ జన్మ వాసనలను ఆధారంగా మనకు ఏ దారి మంచిదో ఆ దారిలో బాబా నడిపిస్తారు. 

దాసగణు మహారాజకు త్రివేణి సంగమాన్ని తన పాదాల దగ్గరే చూపించి పావనం చేశారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం బాబా తన గురువుని వదిలి ఎక్కడకు వెళ్ళలేదు. అలానే షిర్డీ వదిలి వెళ్ళలేదు. అందుకే మనం బాబాను గురువుగా స్వీకరిస్తే అన్ని తీర్ధాలు ఆయన లోనే
 ఉన్నాయి అన్న సత్యం తెలుసుకోవాలి. దాసగణు మహారాజ్ సాయి పాదాలలో త్రివేణి స్నానం చేసిన తరువాత పరవశంతో స్తోత్రం చేస్తారు. ఇది మనం పెద్ద సత్చరితలో చదవవచ్చు.మనం త్రివేణి సంగమంలో గంగ, యమునలను చూడవచ్చు కాని సరస్వతి అంతర్వేది అంటే మనకు బయటకు కన్పించదు. అలానే బాబా రెండు పాదాలలోనుంచి గంగ యమున బయటకు కన్పించాయి. బాబా అనుగ్రహం మాత్రం (సరస్వతి) బయటకు కన్పించేది కాదు. ఈ అనుగ్రహం అంతర్ శుద్ధిని కలుగ చేస్తుంది. సాయి భక్తులమైన మనము కూడా బాబా నుంచి ఈ అంతరశుద్ధిని కోరుకుందాము. 


బాబా షిర్డీ ఆగమనం ఒక మదురమైన ఘట్టం. వారు పదహారు ప్రాయాన  షిర్డీలో అత్యంత సుందర రూపంతో వేపచెట్టు క్రింద స్థిరాసనంలో కన్పించారు. ఆయనకు పగలు రాత్రి అనే బేధం లేదు. అతడు మూర్తీభవించిన వైరాగ్య మూర్తివలె దర్శనమిచ్చేవారు. అందరు ఎక్కడనుంచో వచ్చి దర్శనం చేసుకునే వారు. ఇతడు ఎవరు అనే ఆశ్యర్యం అందరిలోను ఉండేది. ఇద్దరి ముగ్గురికి ఖండోబా ఆవేశమై ఊగుతూఉంటే జనం వారిని బాబా గూర్చి అడిగారు. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఖండోబా దేవుడు చెప్పిన విధంగా ఊరిచివరి వేపచెట్టు క్రింద తవ్వగా ఒక సొరంగం వెలుగుతున్న నాలుగు పెద్ద కుందులు కనిపించాయి. బాబా అది తన గురు స్థానం అని దాన్ని మూసివేయమని చెప్పారు. అక్కడ బాబా పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసినట్లు చెప్పబడింది. 


 మొట్టమొదట గురు స్థానం దగ్గర సాఠె వేపచెట్టు చుట్టూ అరుగు, దక్షిణోత్తరంగా భవనాన్ని నిర్మించారు. చాలా రోజులు షిర్డీకి వచ్చిన యాత్రికులకు ఇదే బసగా ఉండేది. తరువాత దీక్షిత్ వాడా కట్టించారు. షిర్డీలో సెజ్ ఆరతి మొదలైన రోజే ఈ దీక్షిత్ వాడాకు కూడా పునాది వెయ్యడం జరిగింది.   తరువాత 1911 శ్రీరామ నవమి రోజున గృహప్రవేశం జరిగింది. తరువాత శ్రీమంతుడైన బూటీ చేతులమీదుగా ఇప్పుడు సమాధిమందిరమున్న వాడా నిర్మాణం జరిగింది. ఈ ప్రదేశాన్నే సాయి తన మందిరంగా ఎంచుకున్నారు. సాయినాథుడే మురళీకృష్ణుడై అక్కడ వెలిశారు.  

మొట్టమొదటి వాడా హరివినాయక్ సాఠే గారు కట్టించారు. 
 ఆయన ఒక డెప్యూటీ కలెక్టర్ మరియు కలెక్షన్స్ ఆఫీసర్. బాగా డబ్బు సంపాయించి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలనే మనసుతో ఉండే వారు. ఆయనకు మగ బిడ్డలు లేకపోవడంతో బాబా భక్తుడైన దాదా కేల్కర్ కూతురిని రెండోవివాహం చేసుకుంటాడు. అదికూడా బాబా మగబిడ్డ పుడతాడు అని చెప్తే చేసుకుంటాడు. ఇలా ఆయన బాబాను ఆశ్రయించి సాఠే వాడాను కట్టిస్తారు. కాని తరువాత వచ్చిన దీక్షిత్ గారు మాత్రము ఆధ్యాత్మిక సాధన కోసం వాడాను కట్టారు. ఇక చివరిగా మనము ఈ సాధనలో పరిపక్వత చెందితే మోక్షము సమాధి మందిర రూపంలో సాయి పరమాత్మ దర్శనం కలుగుతుంది.
ఓం శ్రీ సాయిరాం!

Shirdi -Divine land



Sai is a great ascetic, by the great good fortune of Shirdi, for the sake of deliverance of the world, appeared on the banks of Godavari River. To protect the dharma, to annihilate the sinfulness and to protect the down-trodden, poor and weak, the saints incarnate. In Bhagavadgita, Lord Krishna says that he will incarnate whenever there is deterioration of dharma and increase of adharma. The Shirdi became holy place because of Sai. This is in Kopergaon taluk, Ahammadnagar district. There were so many saints who were born in the banks of Godavari River. As we cross over to the other side of banks of Godavari at Kopergaon, at a distance of about six miles, as the tanga enters Neemgoan, Shirdi is immediately within sight.  Shirdi became intertwined with Sai's name.

Blessed are the stones and blades of grass of Shirdi which, without any effort, were able to kiss the feet of Sai and were able to bear the dust of his feet on their heads. The very association with Sai in Shirdi is like the study of scriptures. He is the easy way to Supreme God. Sai's darshan is itself a means for our union with the divine. By conversing with him our sins will be washed away. His command is like Vedic sermon for us. His udi (sacred ash) and prasad are purifying and sacred. He used to recite the God's name all the time. He is omnipresent. He was unaffected by the worldly abundance or the absence there of, unmoved by the joys and sorrows of the other world. His heart was pure as a mirror and his speech showered nectar. Pressing his feet is like bathing in the confluence of three rivers (Ganga, Yamuna and Saraswathi) and partaking of the water from washing his feet will uproot all desires. Goulibhuva, a great vaarkari to Pandharpur, said Baba is Vittal. He was 95 year old and he visited Baba every year. 

Sai loved recitation of God's name. He advised Dasaganu to do continuous recitation of God's name for 7 days. Dasganu was promised to have the vision of Vittal. It was reported that he ultimately had the darshan of Vittal. Kaka Deekshit also had vision of Vittal in his meditation. Later Baba tells him to hold on to Vittal otherwise he will disappear. Then Deekshit bought a picture of Vittal from a hawker. This happened to be the same image that he saw in his meditation. Bhagavanta rao Ksheerasagar came to Shirdi and his father was a great devotee of Vittal. Baba reminded him to put him on the correct path as he took backseat in worshiping Vittal. Baba always keeps us on the track even we are immersed in worldly affairs. All we have to do is have faith in him. 

Baba showed a miracle to Dasganu by showing Triveni oozing out from his feet when he wanted to visit the confluence of three rivers on a holy day. Dasganu put his head at Baba's feet. Having witnessed this miracle, Dasganu was overcome with emotion. His speech was inspired and love brimmed up in his 
heart. He praises Baba after this experience and this stotra can be seen in Original Satcharita. Here triveni sangamam was shown from Baba's both feet. At triveni sangamam we can see both Ganga & Yamuna and Saraswathi is flowing underneath. This is not visible. The Saraswathi is called as antervedi. In a similar way Baba showed Ganga & Yamuna from both feet but other river is his grace which is not visible outside but you can only experience it when you surrender.


Sainath appeared in Shirdi as a 16 year old handsome boy and he was seen sitting under the neem tree most of the time. He was immersed in internal bliss and there was no difference between day and night. He appeared as a pure ascetic. People used to come from all around to see this young boy. Sai Samardh appeared in Shirdi for the sake of his devotees. Even in the dreams he had no passions. No one knew where he is from and who his parents were. He kept no company during the day and he was not scared in the night. 

One day Lord Khandoba possessed the bodies of few people and villagers asked them about this young boy. They were told to dig under the neem tree and they found an underground cavern in which there were four burning brass lamps. This young boy told them to close that cavern and this is the place of his Guru. The holy place is his inheritance and he requested them to maintain as it is.  It was told that this boy did penance in that cavern for 12 years. 

 Three buildings were built in Shirdi during Baba's time. Harivinayak Sathe was the first one who bought the land around the Neem tree and built a platform around the neem tree. Then Sathe wada came and initially this was the only place where pilgrims used to stay when they came to see Baba. Then came Kaka Dixit's wada. He
built two floors and Baba made him do his penance on the upper floor. Other people used to use the lower floor. The foundation stone was laid on the day Sej arathi started in Chavadi. Around the same time Baba gave permission for Kapardhe to leave Shirdi after a long stay. Then on Sri Rama Navami day the house warming was done in 1911. Later, the rich Butti's building was also built on which lot of money was spent. But this was all worth it as it became Baba's samadhi mandir. Butti wanted to build Lord Krishna temple in that place. But this became the temple of Sai Krishna. 

If we look at three buildings, the first one was built by Hari vinayak Sathe who was mainly preoccupied with worldly issues and worshiped Baba. Then comes Dixit who did not want anything except Moksha and Baba helped him to do sadhana and to attain jnana. In the end, the samadhi mandir represents the final stage of salvation that is moksha. Baba wants to advance from one stage to the other. He himself said people might come to him for materialistic gains but later he shows them the real path. 

OM SRI SAI RAM!