In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, June 27, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 41



హేమద్పంత్ గారు 40వ అధ్యాయంలో బాబా చిత్రపటం రూపంలో భోజనానికి వచ్చినట్లు చెప్పారు. బాబా ఆయనకు కలలో కన్పించి నేను భోజనానికి వస్తున్నాను అని చెప్పి ఆయన కోరికను సరైన సమయంలో పూర్తిచేసి అందరిని సంబ్రమాశ్చర్యాలలో ముంచివేస్తారు. కాని హేమద్పంత్ గారి మదిలో బాబా చిత్రపటం అలీమొహమ్మద్ ద్వారా బాబా చెప్పిన సమయానికి ఎలా చేరింది అన్న ఉత్సుకత మిగిలిపోయింది. ఈ విషయాన్నే ఆయన 41వ అధ్యాయంలో చెప్పారు. 

అలీమొహమ్మద్ గారు 7 నెలల తరువాత హేమద్పంత్ మదిలో ఉన్న ఉత్సుకతను సమాధానపరుస్తారు. ఒకసారి అలీ బజార్లో నడుస్తూ ఉంటె ఒక వర్తకుని దగ్గర మహానుభావుల చిత్రపటాలు కనిపిస్తాయి. అందులో బాబా పటం పట్ల తాను ఆకర్షితుడై, ఆ పటం కొని తన ఇంట్లో గోడకు ఉంచి రోజు బాబా దర్శనం చేసుకుంటూ బాబాపై ప్రేమను పెంచుకుంటాడు. హేమద్పంత్ గారికి ఈ పటం ఇచ్చే మూడు నెలల ముందు అలీ ఆరోగ్యం దెబ్బతిని ఆయన సోదరి ఇంట్లో ఉంటాడు. సోదరి భర్త పేరు నూర్ మొహమ్మద్ పీర్ భాయ్. అలీ కాలు వాచి శస్త్రచికిత్స కూడా అవసరం అవుతుంది. తన బాంద్రా ఇంట్లో ఎవరు లేక తాళం పెట్టి ఉంచుతారు. ఆలీకి మహానుభావుల చిత్రపటాలు కొనే అలవాటు ఉంది. అలానే నూర్ మోహామ్మద్ కు అబ్దుల్ రహమాన్ బాబా చిత్రపటం ఇస్తాడు. నూర్ మౌలానా సాహెబును గురువుగా భావిస్తాడు. ఈ పటం ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకువెళ్లి సజీవప్రమాణమంత పెద్దదిగా
చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెడతాడు. అందులో ఒకటి ఆలీకి కూడా ఇస్తాడు. ఇంకొక ప్రతిని తన గురువైన మౌలానా గారికి  కానుకగా  ఇవ్వగా ఆయన కోపగించి నూర్ను అక్కడనుంచి తరిమివేస్తారు. విగ్రహారాధన గురువుకి ఇష్టం లేకుండెను. ఈ విషయం అర్ధం చేసుకొని అన్ని ప్రతులను తన వారిదగ్గర నుంచి తెప్పించి సముద్రంలో ముంచివేసెను. యోగుల పటాలు సముద్రంలో పడవేసిన తన వ్యాధి నయం అవునని అనుకోని అలీ కూడా తన మేనేజర్ను  తన ఇంటికి పంపించి ఆ పటాలు నీటిలో పడవేయమని చెప్తాడు. రెండు నెలల తరువాత అలీ తన ఇంటికి వెళ్లగా అక్కడ బాబా పటం అలానే ఉంటుంది. మిగిలిన చిత్రాలన్ని తీసివేసి బాబా పటం ఒక్కటే ఎలా మిగిలింది అని ఆశ్చర్యపోతాడు. వెంటనే దానిని తీసి తన బీరువాలో దాచిపెడతాడు. ఈ పటాన్ని నూర్ చూస్తే దీన్ని కూడా నాశనం చేయునని తలచి ఎవరికైనా ఈ చిత్రం ఇచ్చేయాలి అని అనుకుంటాడు. అలీ ఇస్ముముజావర్ను కూడా కలిసి అలోచించి హేమద్పంత్ గారికి ఇస్తే మంచిది అనుకోని ఆయనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాబాకు జరుగుతున్న జరగపోయే విషయాలు తెలిసి హేమద్పంత్ గారిని కరుణించడం జరిగింది. బాబా తన భక్తుల కోరికలను ఎప్పుడు తీరుస్తూనే ఉంటారు.    
   

మనం ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అని శ్రద్ద చూపిస్తే బాబా తప్పక మనలను ప్రేమించి అనుగ్రహించి మన కష్టాలను తీర్చి మన దారి సుగమం చేస్తారు. అలాంటి సన్నివేశమే బి వి దేవ్ గారి విషయంలో కూడా జరిగింది. దేవ్ గారు మరాఠి భాషలో మరియు సంస్కృత భాషలో మంచి ప్రావిణ్యతో ఉంటారు. ఆయనకు మంచి గ్రంధాలు పరాయణచేయడం ఇష్టం. వీటి ద్వారా తాను ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్న కోరిక. అలానే తను జ్ఞానేశ్వరిని అర్ధం చేసుకొని పారాయణ చేయాలి అని ఎన్ని సార్లు ప్రయత్నం చేసిన మనసు కుదిరేది కాదు. ఆ భగవద్గీత సారం బోధపడేది కాదు. అప్పుడు తనకు బాబా అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే అది చదవాలి అని నిర్ణయించుకుంటాడు. 1914లో కుటుంబసమేతంగా షిర్డీకి వెళ్తాడు. జోగ్ తనతో మాట్లాడుతూ జ్ఞానేశ్వరి ప్రస్తావన వస్తుంది. అప్పుడు జోగ్ ఒక పుస్తకము బాబాకు ఇచ్చి ఆయన అనుగ్రహంతో మరల తీసుకుంటే నువ్వు చదవగలుగుతావు అని చెప్తాడు. బాబాకు తన ఉద్దేశ్యం తెలుసుకదా ఆయన చెప్పినప్పుడే నేను చదువుతాను అనుకోని జోగ్ చెప్పినట్లు చేయడు. 

దేవ్ బాబా దగ్గరకు వెళితే దక్షిణ ఇవ్వమంటే 20 రూపాయలు ఇస్తాడు. తరువాత వాడాలో బాలకరామ్ అనే వ్యక్తిని బాబా అనుగ్రహం ఎలా సాధించారు అని అడుగుతాడు. ఆ తరువాత రోజు ద్వారకామాయి వెళ్లగా బాబా తనను మరల 20 రూపాయల దక్షిణ అడిగితె చెల్లిస్తాడు. తరువాత ఒక మూలకు వెళ్లి కూర్చొని మరల బాలకరామ్ కలిస్తే తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పబోతూ ఉంటె, బాబా ఇంకో భక్తుని పంపి దేవ్ గారిని తన దగ్గరకు పిలిపించుకుంటారు. బాబా ఏమిచేస్తున్నావు అని అడిగితె బాలకరామ్ విషయం చెప్తాడు. మరల బాబా 20 రూపాయల దక్షిణ అడుగుతారు. అప్పుడు బాబా " నా గుడ్డ పీలికలు నాకు తెలియకుండా ఏల దొంగిలించితివి? అని అంటారు. దేవ్ అప్పుడు " నాకు ఈ గుడ్డ పీలికల గురించి ఏమి తెలియదు" అని అంటాడు. బాబా అప్పుడు " ఇక్కడ నీవు తప్ప ఇంకెవరు లేరు నీవే దొంగిలించితివి" అని గట్టిగా చివాట్లు పెడతారు. తరువాత వాడకు వెళ్లి జోగ్ బాలకరాములకు జరిగిన విషయం చెప్తాడు దేవ్. తరువాత బాబా అందరిని మసీదుకు రమ్మంటారు. బాబా మరల 12 రూపాయల దక్షిణ అడిగితె దేవ్ వసూల్ చేసి బాబాకు ఇచ్చి సాష్టాంగనమస్కారము చేస్తాడు. అప్పుడు బాబా జ్ఞానేశ్వరి చదువు అని చెప్తారు. ప్రతిరోజూ కొంచెం అయినా చదువు నేనే నీకు అర్ధం అయ్యేలా చేస్తాను. నీకు మంచి వస్త్రాలు నేనే ఇస్తానైతే గుడ్డపీలికల కోసం అందరిని అడగవలిసిన అవసరం లేదు అని అంటారు. దేవ్ కు అప్పుడు ఆ గుడ్డపీలికల విషయం అర్ధం అవుతుంది. 

ఆలా బాబా తనను కరుణించి జ్ఞానేశ్వరి పారాయణము చేయాలి అన్న తన కోరికను నెరవేర్చారు. ఊరికినే పారాయణ చేయడమే కాకుండా, మరల బాబా తనకు స్వప్నంలో కనిపించి "జ్ఞానేశ్వరి అర్ధం అవుతున్నదా? అని నీవు తొందరపడుతున్నావు. నా ముందర చదువుము అని అంటారు. అప్పుడు దేవ్ ఏమి చదవవలెను అని అడిగితె ఆధ్యాత్మ చదువు అని బాబా చెప్తారు. ఇలా తన భక్తులను సరైన దారిలో నడిపించి పరమార్ధం బోధించే సద్గురువులే మన సాయి. 

సాయి భక్తులమైన మనం ముఖ్యంగా అర్ధం చేసుకోవాల్సిన సత్యం సాయే మన ప్రేరణ. శాస్త్రాల్లో చెప్పిన శాశ్వత సుఖమే సాయి. సాయే మన సాధన కావాలి. సాయి కృపే మన ద్యేయం. ఈ కృపే మనలను లక్ష్యం వైపు నడిపిస్తుంది. 

ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!





Sri Saisatcahrita chapter 41




In the previous chapter Hemadpanth mentioned how Sai’s picture arrived unexpectedly through someone and how it fulfilled his desire at the right time. He had a dream in which Baba told him that he will come for a meal on Holi festival day. This picture was brought by Alli Mohammed and he was asked to narrate the story behind this miracle. As everyone was about to eat, Alli said that he will tell the story later and left. This chapter is a continuation of chapter 40.
Once Alli was walking on the street and saw a shopkeeper having pictures of all great people. He buys Sai’s picture and hangs it in his house. Every day he used to have darshan of Baba and loved Baba greatly.   Three months before he gave this picture to Hemadpanth, he was not well and had gone to live with his sister’s husband (Noor Mohammed Peerbhoy). My leg was swollen and he had surgery also. He stayed there for 3 months. There was no one at his home during that period. Once Alli gave his brother-in-law the picture of Saint Baba Abdul Rahman and he liked this picture so much that he printed this in bigger portrait and made 6 copies. He gave it to different people and one copy he took
it to give it to his Guru (Abdul Rahman), Guru gets very angry with him as they were not supposed to do idol worship. Then Noor wanted to get rid of all the pictures in the sea. He also tells Alli to get rid of all the pictures from his home. Then Alli asked his manager to get rid of all the pictures from his house also. Few days later when he got better he returns home. All the pictures were taken but Baba’s picture was still on the wall. He was surprised to see this and later with the help of Mujavar Isamusa brings the Sai’s picture to Hemadpanth. They did not want to just get rid of the picture but give it someone who is worthy of it. Then Mujavar suggested Heamdpanth’s name. That’s how Baba came to Hemadpanth’s house and fulfilled the dream.     

Sai always lovingly took care of his devotees. Sai is very fond of those who have true love for spirituality. Removing all their difficulties, he enjoins them to bliss. Balasaheb Deo also had similar experience. Once he had the desire to read Jnaneswari (Bhagavadgita) but had some difficulty doing so. He was having so many interruptions but he was able to read other religious books without any problems. Once he took three months leave and wanted to read Jnaneswari but could not read properly and even if he sat down to read he could not understand. He felt frustrated. What is the point in being distressed when he could not succeed in his resolution? He could not read even five stanzas every day. Then he decided to read this only when Sai gives him his blessings. When he goes to Shirdi Jog asked him about his reading and Deo mentioned his difficulties. Then Jog suggested that he should give Baba his book and get blessings from Baba. Jog also said “If Sai blesses the book and gives it to you then you will have no problem reading”. Then next day they go to Dwarakamai and it was crowded. Baba asked Deo Rs. 20 as dakshina and he happily gave it to Baba. Deo goes to a corner and sits there. Then Baba asks him why he was hiding in a corner and to come and sit near him with a calm mind. He goes and sits near Baba while Arathi was going on. There Deo met Balakram in Wada and asked him as follows. “Have you been told how to meditate? Please satisfy my desire,” At the same time when he was about to answer Baba wanted Deo to come to Dwarakamai. As soon as he went, Deo bowed to him. Baba then asked him, “Where, with whom, and what were you talking?” Then Deo replied: “On the upper story of Kaka’s house, I was hearing about your glory from Balakram and talking about it”. Baba ordered Deo “Bring twenty-five rupees”. Bringing the money immediately, he tendered them to Baba. “How many did you bring?” Baba asked. Deo replied: “Twenty-five”. Baba said: “Come, sit down” and Deo went with Baba to the Masjid. Baba sat near the pillar and there was no one else in the Masjid. He said: “You have stolen my rags, without my knowledge”. “I know nothing about any rags”, explained Deo. “Then, look for them somewhere here”, Sai told him. Deo could not find anything there and begged Baba to explain. Sai became very angry and showers him with abuses. Seeing that Sainath was furious, Deo stood still watching him with wonder and full of inner amazement. He then goes to Wada and Baba asked again for dakshina. This time he did not have enough money to give Baba. He collects the Rs.20 and gives it to Baba. Then Baba says “Go and sit in Wada and read the Pothi regularly”. “I am sitting here ready to give you a whole Zari embroidered mantle, then why should you steal rags? Have you got in the habit of stealing? This assurance gave Deo confidence that he got the blessings of Baba to read the Jnaneswari.

Here Baba accusing Deo of stealing rags is nothing but asking Balakram about his experience and how he worshiped Paramatma. Though Sai appeared outwardly to be angry he was always calm within. He appeared angry outwardly but he was full of bliss within. The anger that was shown outwardly was on account of affection but Within he was in divine bliss. One must be fortunate to sing of the grandeur of that Sai’s leela. Deo also later mentioned that on 2nd April 1914, on Thursday morning, he had a boon of a dream. Sai Samartha appeared in the dream and was sitting on the first floor. He asked me if I understood the pothi, to which I replied in the negative. Another question then followed. ‘When will you understand it then?’ My eyes were filled with tears and hear the answer I gave. ‘Reading the pothi is mere worry unless you shower your grace and understanding it is even more difficult. Baba, I confess this clearly.’ Baba said: “While reading the pothi, you make too much haste. Read it, in my presence, sitting near me”. When Deo asked what he should read, he was told to read Adhyatma. As Deo went to fetch the book, his eyes opened. Deo awakened then. The devotees experienced on many occasions such leelas of Sai Samartha and enjoyed the heavenly bliss.

  Sai alone is my motivation. Sai alone is the supreme happiness of spirituality; Sai alone can fulfil this. This should be our firm conviction.  


Om SriSainatharpanamasthu!

Wednesday, June 20, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం - 40



భక్తులు ఎప్పుడైతే భక్తిభావంతో సద్గురు సాయినాథునికి అనన్య శరణుజొచ్చితే వారు భక్తుల భక్తిని గమనించి తమ శక్తిని ప్రసాదిస్తారు. భక్తులు ప్రేమగా భోజనం పెడితే సాయికి సంతోషం. కన్నతల్లికి పసిబిడ్డలపై ప్రేమ. అట్లే భక్తులకు సాయి ప్రత్యక్ష కన్నతల్లి. వారు ఎక్కడున్నా సరే పరుగుపరుగున వస్తారు. వారి రుణాన్ని ఎవరు తీర్చుకోగలరు?

 దేవుగారింట ఉద్యాపన వ్రతం 
బి . వి . దేవ్ గారి తల్లి చాలా నోములు నోచి ఉద్యాపన చెయ్యాలి అని నిశ్చయించి 100, 200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలిసియుండెను. ఈ శుభకార్యమునకు మంచి ముహూర్తం నిర్ణయించి బాబా వస్తే బాగుంటుంది అని జోగ్ గారికి ఒక లేఖ రాస్తారు. జోగ్ ఆ ఉత్తరం చదివి బాబాకు వినిపించెను. అప్పుడు బాబా ఇట్లా అన్నారు " నన్నే గుర్తుంచుకున్న వారిని నేను మరువను. నాకు బండి కాని, టాంగా గాని, రైలు గాని, విమానము గాని అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరిగెత్తి పోయి ప్రత్యక్షమయ్యెదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయుము" అని బాబా చెప్పారు. జోగ్ బాబా చెప్పినదంతా ఒక జవాబుగా దేవ్ గారికి ఉత్తరం వ్రాసారు. దేవ్ అది చూసి ఎంతో సంతోష పడ్డాడు. దేవ్ కి బాబా ఎక్కడకు రారు అని తెలుసు కాని సర్వాంతర్యామి అయిన బాబా ఏ రూపంలో అయినా రావచ్చు అని భావించి తన పనులలో నిమగ్నం అవుతాడు. 

ఉద్యాపనకు కొన్ని రోజుల ముందు గోరక్షణకు చందాలు వసూలు చెయ్యాలి అని ఒక బెంగాలీ దుస్తులు ధరించిన సన్యాసి వస్తాడు. ఆయన మొట్టమొదట అక్కడ స్టేషన్ మాస్టారును కలుస్తాడు. ఆయన మామలతదార్ అయిన దేవ్ గారిని కలిస్తే మంచిది అని స్టేషన్ మాస్టర్ చెప్తారు. ఆ సన్యాసి దేవ్ గారిని కలిసి తాను గోరక్షణార్థం చందాలు వసూల్ చేస్తున్నానని, అందుకు దేవ్ గారు సహాయం చెయ్యాలి అని కోరతాడు. అప్పుడే ఇంకొక ఉద్దేశం కోసం మరొకరు చందాలు వసూలు చేస్తున్నట్లు చెప్పి నాలుగు నెలలు ఆగి వస్తే మంచిది అని చెప్తారు. తరువాత ఉద్యాపన రోజున మరల ఆ సన్యాసి రావటం చూసి ఆయన చందాల కోసం వచ్చాడు అనుకుంటాడు. కాని నేను భోజనానికి వచ్చాను అని చెప్తారు. దేవ్ చాలా సంతోషంతో ఆయనను ఆహ్వానిస్తాడు. తనతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు అని ఆ సన్యాసి చెప్తే వారిని కూడా తీసుకురమ్మని చెప్తాడు దేవ్. అందరికి దేవ్ చక్కగా మర్యాదలు చేసి భోజనం
వడ్డిస్తాడు. ఉద్యాపన అయిన తరువాత దేవ్ బాబా రాలేదు అనుకుంటూ జోగ్ కి మరల ఉత్తరం వ్రాస్తాడు. బాబా ఈ విషయం విని తాను వచ్చినా దేవ్ గుర్తు పట్టలేదని ఆ సన్యాసిగా వచ్చింది తానే అని, తనతో పాటు మరో ఇద్దరిని కూడా తెచ్చాను అని బాబా ఉత్తరం వ్రాయమంటారు. దేవ్ ఈ ఉత్తరం చూసి సన్యాసి రూపంలో వచ్చింది బాబానే అని తెలుసుకొని సంతోషపడతాడు. తాను బాబాను తప్పుపట్టినందుకు సిగ్గు పడతాడు. ఇక్కడ బాబా ముందుగానే సన్యాసి రూపంలో చందాలు అడిగే వాడి లాగా వచ్చి దేవ్ ని సందిగ్ధంలో పడవేశారు. పూర్వ పరిచయం లేని వారు వచ్చిఉంటే సాయే అని నిశ్చయంగా అనిపించేది. కాని సత్పురుషుల పద్దతే ఇంత. ఎన్నడూ సంభవించని అద్భుతమైన లీలలను చేస్తారు. వారు భక్తుల గృహాలలోని కార్యాలను, ప్రణాళికను ముందుగానే తయారుచేసి ఉంచుతారు. వారికి అంకితమైన భక్తుల యొక్క శుభకార్యాలను ఇలా చక్కగా ఊహించని విధంగా జరిపిస్తారు. చింతామణి తలిచినదానిని ఇస్తుంది. కాని గురుదేవులు అంతఃకరణానికి అతీతమైన దాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడ ఆహ్వానింపబడి వచ్చారు. ఒక్కోసారి పిలవకుండానే వస్తారు. ఏ రూపంలోనైనా సాయి రావచ్చు. 

తరువాత హేమాడపంత్ గారు ఒక పటం రూపంలో తన ఇంటికి ఎలా వచ్చారో చెప్పారు. 1917 లో ఒక రోజు హేమాడపంత్ నిద్రలో ఉండగా బాబా కలలో కన్పించి తన ఇంటికి భోజనానికి వస్తున్నానని చెప్తారు. హేమద్పంత్ భార్యతో ఈ విషయం చెప్పి ఆ రోజు కొంచెం ఎక్కువ వండాలి అని చెప్తారు. అదే రోజు హోళీ పర్వదినం కాబట్టి తన బంధువులందరూ భోజనానికి వచ్చి ఉంటారు. మధ్యలో బాబాకోసమని ఒక పీట వేసి అన్ని వడ్డించి ఉంచారు. అక్కడ చుట్టూ మంచి మంచి ముగ్గులతో అలంకరిస్తారు. పన్నెండు కాగానే ఒక్కక్కరే వచ్చి భోజనానికి కూర్చున్నారు. మధ్య పళ్లెం వద్ద మాత్రం ఎవరూ లేరు. అందరూ చాలా సేపు ఎదురు చూస్తారు. బాబా వస్తారా! కాని బాబా ఎదో ఒక రూపంలో రావచ్చు అనే నమ్మకం. వారు భగవంతునికి ప్రార్థన చేస్తుంటే బయట అడుగుల చప్పుడు వినపడుతుంది. వెంటనే హేమద్పంత్ తలుపు తీస్తారు. ఇద్దరు వ్యక్తులు తలుపు దగ్గర ఉంటారు. వారిలో ఒకరు అలీ మొహమ్మద్. రెండవ వారు మౌలానా శిష్యుడు ఇస్మూముజావర్. అందరూ భోజనానికి కూర్చొని ఉండటం చూసి క్షమించమని అడిగి ఒక ప్యాకెట్టును టేబుల్ మీద ఉంచి దానిని విప్పాడు అలీ.   విప్పగానే బాబా చిత్రం చూసి హేమద్పంత్ తన శరీరం రోమాంచితం అయ్యింది అని వ్రాస్తారు. అప్పుడు గద్గద హృదయంతో బాబా చరణాలయందు తన శిరస్సును ఉంచి ఆ చిత్రాన్ని మధ్యలో పీట వేసిన చోట ఉంచుతారు. హేమద్పంత్ ఈ చిత్రం ఎక్కడ నుండి తెచ్చారు అని అలీ అడుగుతారు. ఇది అంగడిలో కొన్నాను కాని ఇప్పుడు ఆ పటం గురించి చెప్పాలి అంటే చాలా సమయం పడుతుంది. మీరు భోజనాలు చేయండి. ఇంకో సారి ఎప్పుడన్నా మీకు ఆ విషయం చెప్తాను అని అలీ వెళ్ళిపోతారు. సమయానికి బాబా పటం రూపంలో వచ్చినందుకు చాలా సంతోషం. అక్కడ ఉన్నవారందరికి బాబా లీల అద్భుతంగా అనిపించింది. అప్పటినుంచి హేమద్పంత్ గారి ఇంట్లో హోళీ పండగ రోజు బాబా పటాన్ని ఉంచి అందరూ భోజనం చేయడం ఆనవాయితి అయ్యింది. 


ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!













Sri Saisatcharita chapter 40





When the devotee whole-heartedly surrenders with faith to the Sadgurunatha, then he bestows upon the devotee his own greatness, taking into consideration the true devotion of the devotee. He embraces and holds near his heart those who prostrate themselves before him with no sense of duality and unconditionally surrender to him. Sai is exactly as caring towards his devotees as a mother is to her nursing child. He comes running wherever you may be. How can one repay his obligation?


Once Balasaheb Deo’s mother performed so many vows and wanted to do Udyapan to complete the process. As soon as a number of vows are completed, it is necessary to do the ‘Udyapan’. Otherwise one does not have the merit (‘punya’) and the vow is incomplete without it. So, a day was fixed according to the Hindu calendar to perform the Udyapan’. Deo wrote to Jog to make a request to Baba. In the letter he requested that without Baba’s presence the Udyapan is not complete. Then Jog took the letter to Baba and Baba knew what was in the letter before he even read it. Baba listened with full attention to this pure-hearted invitation and said: “He who remembers me is always in my mind. I need no conveyance – a carriage, or a horse, a plane or a train. I appear without an instant’s delay, when I am lovingly called”. He told him to write back that he along with two other people will visit him. Deo became very happy and felt blessed that Baba will attend. Deo had full faith now that Baba would certainly come. But when he would experience it, it would be a golden day. But Deo was also fully aware that besides Shirdi, there were only three villages where Baba rarely went. He used to remain at Shirdi always. Baba’s movements were impossible to understand. All that is movable and immovable is filled by him. Then, where is the question of coming and going for him? He manifests at his will. So be it.


Approximately a month prior to this, a Sanyasi came to the station master at Dahanu station, for his own work. He wanted to collect donations for protection of cows. The station master refers him to Deo. Deo told the sanyasi that someone is collecting the donations at that time so it is better to wait for another 2-4 months. So the sanyasi leaves. When the Udyapan day came this
sanyasi comes again. Deo thought he came for donation but he tells him that he came for meals. Deo happily agrees and the sanyasi brings with him two more people. Then everyone was served with all kinds of food and in the end was given betel leaves. The sanyasi leaves and Deo later thinks that Baba promised him but did not come. Then he writes a letter to Jog again. Baba asks Jog to write to him back saying that Deo did not recognize him when he came as sanyasi along with two other people. When Deo read the letter, his eyes overflowed with tears of love. He reproached himself for having unnecessarily blamed Sai and felt very dispirited.


Here Baba appeared to Deo way before he invited him for the Udyapan. This is Baba’s greatness that he knew the Udyapan will happen and he will be invited. So Deo thought that this sanyasi came for donations for the cow protection. But these are the ways of the Saints! Their leelas are unfathomable and their deeds marvelous! They themselves plan the functions in their devotees homes even before the devotees know of it. When the devotee is humbly surrendered at his feet, the execution of his auspicious work is accomplished without his knowledge. Inconceivable are the deeds of the Saints!  

Baba coming to Hemadpanth's house
One day in 1917 Baba appears in a dream as a sanyasi to Hemadpanth and tells him that he will be coming to lunch that day. This was an ealry morning dream and Hemadpanth was excited and felt blessed. He knows that Baba himself won't come but he can come in any form. So he tells his wife about this dream and asks her to cook extra food that day. It was Holi festival that day and all his family members and relatives were there. He arranged a center seat for Sai and that place was beautifully decorated with rangoli. All kinds of food items were served in leaf plates. He was hoping that someone will tap on the door anytime and he was wondering how long should he wait? As they were about to do prayer prior to taking the food, Hemadpanth heard some foot steps near the door. He goes there and opens the door. It was Ali Mohammad and a disciple of Saint Moulana by name Ismu Mujaver and by seeing everyone about to eat they asked their forgiveness. They gave him a packet and when they opened, it was Baba's picture. Hemadpanth felt blessed and prostrated to Baba's feet. He kept that picture in the center where Baba's plate was arranged. Ali told him that it was a long story and he will tell him later as they were all waiting to eat. Everyone was happy and they were expecting a guest but Baba came in the form a picture. Inscrutable are the ways of Sai. He made the dreams come true by coming in the form of a picture indicating that there is no difference between him and his picture. Hemadpanth kept this picture in the main puja mandir and worshiped Baba with utmost devotion.

Om SriSainatharpanamasthu!


Wednesday, June 13, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 39



షిర్డీ క్షేత్రం ధన్యం. షిర్డీ జనులు ధన్యులు. మొదట షిర్డీ గ్రామము చాలా చిన్నది. కాని సాయి బాబా అక్కడ నివసించడంవల్ల గొప్పది  అయ్యింది. వారి వలనే షిర్డీ పుణ్య క్షేత్రం అయింది. షిర్డీ స్త్రీలు రోజువారీ పనులు చేసుకుంటూ బాబా మహిమను గానం చేస్తూ ఉండే వారు. వారి ప్రేమ ధన్యం. బాబా చాలా చోట్ల కర్మల గురించి, భక్తి గురించి చెప్పడం జరిగింది. నానా సాహెబ్ చందోర్కరు ద్వారా, బాబా మనకు చాలా విషయాలు నేర్పడం జరిగింది. మానవులకు సుఖదుఃఖాలు మరియు ఇతర కష్టాలు ఈ జీవితంలో అనుభవించక తప్పదు. కాని బాబా చూపించిన దారిలో మనము పయనిస్తే మనము ఆ ముక్తి మార్గాన్ని చేరుకోగలము.

ఒకసారి నానా చందోర్కరు మసీదులో కూర్చొని, బాబా పాదములను ఒత్తుతూ నోటిలో గీతను వల్లించుకుంటున్నాడు. ఆయన భగవద్గీతలోని 4వ అధ్యాయంలో శ్లోకాలను మనసులోనే అనుకుంటున్నాడు.
బాబాకి నానా మీద దయకలిగి, 34వ శ్లోకం వద్ద ఆయన పఠనం ఆపాడు. నానాని ఏమిటి నానా నీలోనే గొణుక్కుంటున్నావు, అని అడిగాడు. నానా వినమ్రతతో ఆ శ్లోకం వినిపించాడు .  ఇక్కడ నానాకి చాలా అనుమానాలు కలిగియుండవచ్చు. బాబాకి సంస్కృతం తెలుసా? నానాకి గీత గురించి బాగా తెలుసు. చాలా అధ్యయనం చేశాడు. ఆ శ్లోకం ఈ విధంగా ఉంటుంది.

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా|
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః||

దీనికి చాలా మంది భాష్యకారులు భాష్యం ఇవ్వటం జరిగింది. వారందరిది ఒక్కటే అభిప్రాయం. బాబా నానాని అర్ధం చెప్పమని అడిగాడు. అప్పుడు నానా ఇలా చెప్పారు. గురుచరణాలకు సాష్టాంగ ప్రణామము చేసి, గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి గురువును ఆదరంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్ధాన్ని ఉపదేశిస్తారు.

సాయి మొదటి సగం శ్లోకానికి ఉన్న అర్ధాన్ని అంగీకరించారు. కాని మిగతా సగం శ్లోకానికి సరైన అర్ధం చెప్పమని నానాని అడగడం జరిగింది. జ్ఞానులు మరియు తత్వదర్శులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. జ్ఞానమనే శబ్ధానికి నీవు చెప్పిన అర్ధం విన్నాను, కాని దానికి జ్ఞానమని కాకుండా అజ్ఞానమనే పదం వేస్తే పోయేదేముంది. అజ్ఞానం వాక్కుకు సంబంధించిన విషయం, జ్ఞానం వాక్కుకు అతీతమైన విషయం.

గర్భానికి చుట్టుకున్న మావి వలె, అద్దం మీది ధూళివలే, అగ్నికి కప్పిన బూడిద వలె జ్ఞానాన్ని అజ్ఞానం  కప్పివేస్తుంది. అజ్ఞానంతో  జ్ఞానం కప్పబడి ఉంది అని గీతలో భగవానుడు చెప్పాడు. అందువలన అజ్ఞానాన్ని తొలగిస్తే స్వభావసుద్దంగా ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది. నాచుతో కప్పబడ్డ శుద్దమైన నీరువలె జ్ఞానం స్వతఃసిద్దంగా ఉంటుంది. నాచును తొలగించిన బుద్ధిమంతునికి శుభ్రమైన నీరు లభిస్తుంది. వస్తువులను కళ్ళతో చూచి తెలుసుకునే శక్తి జ్ఞానం. కాని కళ్ళకు పొరలువస్తే అది అజ్ఞానం. దానిని తొలగించటం అవసరం. ఒక్క గురుకృప ద్వారా మాత్రమే ఈ అజ్ఞానం నశించి జ్ఞానం వెలుగులోకి వస్తుంది.

మనము ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు, ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ అనే అంశాలు చాలా అవసరం. వాటిలో గురువు పట్ల పూర్తి శ్రద్ధ, శరణాగతి, ఓర్పు ఉండాలి. ఇవి లేనినాడు, నీవు ఆయన కాళ్ళు వత్తినా, మనస్సులో భావం లేకపోతే లేదా గురువు మీద పూర్తి నమ్మకం లేకపోతే, ఆ గురుకృప మనకు ఎట్లా లభిస్తుంది. ఇక్కడ నానా పరిస్థితి కూడా అదే. నానాకి బాబా మీద నమ్మకం ఉంది. కాని ఎక్కడో మూలలో దాగిఉన్న అజ్ఞానపు పొరలను పరమ గురువైన బాబా పసికట్టారు. వాటిని తొలగించే ప్రయత్నమే ఈ భగవద్గీత పారాయణ లీల.

అసలు జ్ఞానం అంటే ఏమిటి? 
కనిపించే దృశ్య ప్రపంచం అంతా నిజం కాదు లేదా మిధ్యా అని తెలుసుకొని, బ్రహ్మము ఒక్కటె సత్యం అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే జ్ఞానము.

అసలు ఇలాంటి అనుభవం ఒకటి ఉంటుంది అని శ్రవణం ద్వారా తెలుసుకొని, మన జీవితాలు మార్చుకొనే ప్రయత్నం చేస్తేనే మనకి దాంట్లో ఉన్న ఆనందం అర్ధం అవుతుంది. ఇంక దాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకుంటే వచ్చేది నిశ్చలానందము. ఉన్న వస్తువులు, కనిపించే వస్తువులు నిజం కాదు. మిథ్య అంటే ఎట్లా? మనకు ఈ ప్రపంచం కనిపిస్తుంది. మిథ్య అంటే ఇప్పుడు లేదు అని కాదు. ఒక కాలంలో ఉన్నా మరియొక కాలంలో నశిస్తుంది. మనము ఒక్కసారి ఈ విశ్వాన్ని పరిశీలిస్తే, చాలా గోళాలు వాటి మధ్య ఖాళీస్థలం. ఒక గోళం ఈ శూన్యంలో కలిసిపోవచ్చు. చివరకు ఏమీ మిగలదు. అట్లానే మన యొక్క శరీరం ఒక కణం నుంచి వచ్చి పెద్ద శరీరం అవుతుంది. చనిపోయిన తర్వాత అంటే ఈ చైతన్యం వీడితే, శరీరం కుప్ప కూలుతుంది. అది తగలపెడ్తే బూడిదే మిగులుతుంది.

సరే ఈ జ్ఞానం అనేది ఎందుకు తెలుసుకోవాలి? మనం రోజూచేసే పనుల్లో ఈ జ్ఞాన దృష్థిని మనము అన్వయించుకోవచ్చు. మనము విశాలదృక్పధంతో ఆలోచించకపోతే మనసుకు కష్టం కలుగుతుంది. దుఃఖం కలుగుతుంది. ఒక వస్తువుని సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం మూలాన, అది భిన్నంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తిని మనము సరిగ్గా అర్ధం చేసుకుంటే మనము వాళ్ళతో ఉండగల్గుతాము. ప్రతి విషయంలో ప్రాక్టికల్‌గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ మన అహంకారాన్ని ప్రక్కకు పెట్టడం నేర్చుకోవాలి. అందుకే బాబా జ్ఞానంతో పాటు భక్తిని నేర్పించడం జరిగింది. అప్పుడు ఈ మాయ అనే అజ్ఞానం మనల్ని వెంటాడదు. జ్ఞానులకు, వారు జ్ఞానులమన్న భావన ఉండొచ్చు. కాని జ్ఞానంతో కూడుకున్న భక్తితో మనం మన కర్మలను ఆచరించినప్పుడు మనకు తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది.

అందుకే ఈ భగవద్గీత శ్లోకం అంత ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. బాబా మనకు బోధించిన వాటిలో, అందులో ప్రత్యేకంగా భగవద్గీతలో నుంచి ఈ శ్లోకాన్ని బాబా ఎందుకు ఎంచుకున్నారో మనం అర్ధం చేసుకోవాలి. జ్ఞానానికి కావల్సిన అర్హతలను బాబా ఇక్కడ  బోధించడం జరిగింది. ఇదంతా విన్న నానా ఇంకా వినమ్రుడై  బాబా పాదాలకు సాష్థాంగ ప్రణామం చేసి రెండు చేతులతో వందనం చేశాడు. తరువాత భక్తి శ్రద్దలతో  "బాబా నాకు చక్కగా శిక్షణ నిచ్చి నా అజ్ఞానాన్ని పారద్రోలండి. నా దురభిప్రాయాన్ని శిక్షించండి అని ప్రార్ధించాడు".

సాత్విక గుణాలు పైపైకి కనిపిస్తున్నా మనసులో అనేక వికల్ఫాలుండి ఒక క్షణమైన అవమానాన్ని సహించలేము. అజ్ఞానం అంటే వేరే ఏమీ లేదు. మనసులో కీర్తి ప్రతిష్ఠలయందు కోరిక, పైకి ధ్యానం చేస్తున్నట్లు నాటకము, కామాక్రోధాలు లోపల రగులుతుంటే ఇక  ఇంతకన్నాఅజ్ఞానం వేరే ఏముంటుంది.

మనసులో చెడు భావాలు ఉండి పైకి మహాభక్తునిగా జ్ఞానిగా ఉండటం ఎంత దుర్భరము. ఈ భావాలు ఒక్కోసారి బయటికి తెలియవచ్చు లేదా కొన్నిసార్లు వీటిని పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మానవుడు ఆచారవ్యవహారాల పేరు మీద ఒక్కొసారి తన ఉనికిని మర్చిపోతాడు. తను చేసే ప్రతిపని తనకు న్యాయమనిపిస్తుంది. అహంకారం ఆలోచనాశక్తిని హరింపచేస్తుంది. బయటకు నిష్ఠా గరిష్ఠులు కాని అహంకారం వాళ్ళకి తెలియకుండా మిగేస్తుంది. సాయి కొన్ని వ్యవహారములను ఎవరికి తెలియకుండా చేస్తారు. చిన్న పనైన పెద్ద పనైన కారణం ఎప్పుడూ తెలిసేది కాదు. కాని చెప్పకుండానే ఎప్పుడూ ఆ కార్యం మాత్రం క్రమక్రమంగా జరిగేది. కొన్ని పనులు సహజంగా ఉపక్రమింపబడేవి. కాని వానికి మూలకారణం, పేరు, నిర్దేశింపబడేవి కావు. పైగా ఇవన్నీ బాబా లీలలుగా కనిపించేవి. ఇటువంటి పరమగురువులు పరోపకారం కోసమే జగత్తులో అవతరిస్తారు. సంకల్పించిన కార్యం పూర్తి కాగానే చివరకు అవ్యక్తంలో కలిసిపోతారు.

మనం ఎక్కడ నుంచి వచ్చాం? ఎక్కడికి వెళతాం? ఎందుకొరకు పుట్టాము. ఈ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి? అన్న ప్రశ్నలకు మూలకారణాలు మనకు తెలియవు. ఇష్టమొచ్చిన రీతిలో జీవితాన్ని గడిపేస్తున్నాము. తరువాత మరణ కాలం సమీపిస్తుంది. మన ఎదురుగా మన బంధువులంతా చనిపోవడం చూస్తున్నాము. అయినా మన మనసులో ఇట్లాంటి ఆలోచనలు రావు. నాకు ఈ రోజు ఏం జరుగదు అన్న ధీమా. అందుకే మన గురువులు చెప్తారు. నలుగురితో నారాయణ అనుకోవడం కాదు. నారాయణుడవు నీవే అని తెలుసుకో. మనము ఈ సత్యాలను గురించి తెలుసుకోవడమే జ్ఞానమార్గం. ఇవి ఎప్పుడో ముసలితనం వచ్చిన తరువాత నేర్చుకొనేవి కాదు. అప్పుడు దాని ఉపయోగం ఎంత? మన శరీరం కదల్లేనప్పుడు ఇది తెలిసి ఏమిటి ప్రయోజనం.

మనకు జ్ఞానం అనేది ఎప్పుడూ కావాలి. జీవితం పట్ల అవగాహన రావాలి. కష్ట సుఖాలలో ఈ జీవన సమరం సాగించడమా లేక నిజాన్ని అర్ధం చేసుకొని శాశ్వత ఆనందాన్ని పొందడమా? మనము ఎప్పుడూ సుఖాన్నే కోరుకుంటున్నామని అనుకొంటాము.  కాని నిజానికి అది సుఖము కాదు. రోజు మనం నిర్వర్తించే కార్యక్రమాలలో సత్యాసత్యాలను అర్ధం చేసుకోవాలి. ఏవి ముందు ఏవి వెనుక, దేనికి మనము ప్రాముఖ్యత నివ్వాలి. ఏది మనకు శ్రేయమైనది. మనకున్నఈ అహంకారాన్ని ప్రక్కకు పెడ్తే, మనము ఎంత సుఖపడ్తామో మనకు అర్ధం కాదు. ఎప్పుడు నేను చెప్పే మాటే నెగ్గాలనే మన ప్రయత్నానికి గండి కొట్టితే, ఈ సంకెళ్ళలో నుంచి బయటపడ్తాము. స్వార్ధము మనలను అధోగతిపాలు చేస్తుంది. బాబా సర్వమానవాళిలో, సర్వప్రాణులలో, కదిలే వాటిలో కదలని వాటిలో తననే చూడమని చెప్పడానికి కారణం ఇదే. మనలో ఈ సద్గుణాలను ఏర్పరిచి చెడు గుణాలను అంతమొందించడానికే అని మనం అర్ధం చేసుకొని బాబా బోధించిన జ్ఞాన మార్గం తెలుసుకోవాలి. 

తరువాత ఈ అధ్యాయంలో  సమాధిమందిరం ఎలా కట్టబడిందో చెప్పబడింది. బాపుసాహెబు బూటీ సకుటుంబంగా వచ్చి షిర్డీలో ఉండేవాడు. తనకు అచ్చట ఒక సొంతభవనం ఉంటె బాగుంటుందని అనే ఆలోచన ఉండేది. ఒక సారి దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా బాబా స్వప్నంలో కనపడి అక్కడ మందిరంతో కూడిన ఒక వాడా కట్టమని చెప్తారు. అదే సమయంలో అక్కడే నిద్రించుచున్న శ్యామాకు కూడా బాబా ఇలాంటి దృశ్యమే చూపిస్తారు. అప్పుడు శ్యామాకు ఏడుపు వస్తుంది. అప్పుడు బూటీ కారణం అడిగితె శ్యామా తనకు బాబా వాడ గురించి చెప్పారు అని అంటాడు. ఇద్దరికీ ఒకే స్వప్నం రావడంవల్ల బూటీకి వాడా కట్టాలి అనే నిశ్చయం కలుగుతుంది. అప్పుడు బాబా దగ్గర అనుమతి తీసుకునేందుకు ద్వారకామాయికి వెళ్తారు. వారు ఒక నమూనా కూడా బాబాకు చూపెడతారు. బాబా వెంటనే అనుమతి ఇస్తారు. శ్యామా దగ్గరే ఉండి నిర్మాణ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ఉంటాడు. బాబా కూడా లెండీకి వెళ్తున్నప్పుడు తన సలహాలు చెప్పేవారు. బూటీకి మధ్యలో మురళీధరుని విగ్రహం పెట్టాలి అనే ఆలోచన కలిగింది. బాబా దీనికి కూడా సరే అని చెప్తూ , మనమే వాడాలో ఉందాము అంటారు. ఆ తరువాత బాబా మహాసమాధి చెందిన తరువాత ఈ మందిరమే బాబా మందిరం అయ్యింది. బాబా సమాధి చెందక ముందు నన్ను రాతి వాడాలో ఉంచండి అని చెప్పారు. అప్పట్లో ఈ మందిర నిర్మాణానికి దాదాపు లక్ష రూపాయలు ఖర్చు అయ్యింది అని చెప్పారు. ఇలా మురళీధరునికి నిర్ణయించిన స్థలంలో బాబాని ఉంచారు. బూటీ వాడానే సమాధిమందిరం అయ్యింది. సాయి భక్తులందరికీ బాబానే మురళీధరుడు. 
ఓం శ్రీసాయినాథార్పణమస్తు!


Sri Saisatcharita Chapter - 39




Baba gave us his teachings about Karma yoga and Bhakti yoga on several occasions through Nana Chandorkar. As humans, we go through so many difficulties in our life time. But if we follow Baba’s teachings, we can reach our goal that is self-realization.


Once, Chandorkar, the great devotee was sitting in the Masjid pressing Baba’s feet, while he muttered the Gita to himself. He knew by heart the fourth chapter of the Bhagvad Gita and used to repeat it, as a habit, while his hands pressed Sai’s feet. When the thirty-third verse ended, the next verse started: When the thirty-fourth verse started, Nana’s recitation came to rest as Baba decided to ask a question and to impress upon Nana his lesson.

He said: “Nana, what are you muttering? Speak slowly and clearly whatever you are saying, so that I can hear whatever you are mumbling”. When he was asked to recite, obeying the orders, he recited all the four lines of the verse. Then Baba asked him to explain it with all the details. Then, Nana with great humility and with folded hands, happily and in a sweet voice gave his reply, explaining what the Lord (Sree Krishna) had to say. Now, so that everyone should clearly understand the dialogue between Sai and Nana, we shall take the original verse from the Gita quoting word by word. To understand the correct meaning of this question, as also the Saint’s mind, this practice should be followed whereby the meaning becomes clear and free of doubts.

“ Tadviddhi pranipatena, pariprashnena sevya.
Upadekshyanti te gyanam, gyaninastattva darshinah” .


So many great people gave commentary on this and agree as to its meaning. Nana was well-versed and had deeply studied the Gita.

Baba asked nana to explain the meaning of this verse.
Nana, in a sweet melodious voice, modestly and humbly, thinking of the natural order of construction of the words, began explaining the meanings, with respect.

He said: “Making prostrations at the Guru’s feet, giving one’s life in the service of the Guru, and questioning the Guru respectfully, then those who have attained the real Knowledge will give instruction of that Knowledge”.

Baba accepted the meaning of the first two metric feet, but listen to what he said about the rest.

Where you say that philosophers and those who have attained 

Real Knowledge will give instruction of that Knowledge, if you use the word ‘Agyan’ (ignorance), then you will get the real meaning.

 ‘Gyan’ is not a subject matter of words’. How can it be taught? Therefore, take the opposite of the word ‘Gyan’ and then it can be experienced at every step. I have listened to the meaning that you have given using the word ‘Gyan’. What do you lose by taking it as ‘Agyan’? ‘Agyan’ is a subject, which can be discussed. ‘Gyan’ transcends words. Just as the caul envelops the embryo or dust covers the mirror or ashes cover the embers, so does ignorance cover knowledge.

The Lord has said in the Gita that ‘Gyan’ is veiled by ‘Agyan’. Therefore, when ‘Agyan’ is removed, ‘Gyan’ shines on its own. ‘Gyan’ shines with its own luster and is self-effected. It is like pure water covered with moss. The intelligent one, who removes this moss will, find the pure water. Similarly ‘Gyan’ is unobstructed. It is self-evident and in its place. The Power of the inner vision of the eyes is ‘Gyan’. The veil or the film over it which increases is ‘Agyan’ and it is necessary to dispel it. That veil or film should be removed with the skill of your hands and the inner vision should be allowed to manifest driving away the darkness of ignorance. ‘Gyan’ is something which has to be realized and not something that can be taught.




So let us understand what Baba is teaching us:
To make prostrations, to question respectfully and to serve the Guru are the only means for his Grace. When we do not have these qualities and we lack total faith, the service we perform for Guru is mere lip service. Here Nana’s situation is similar. He has faith in Baba but Sai wanted to burn his ego which cannot be burnt that easily. That’s why this whole thing was played out by Baba.


What is Jnana (Knowledge)?
Whatever we see is not real (illusion), only Brahman(supreme Soul) is real. Experiencing this truth is called Jnana.

First we have to know that there is something like this. By understanding this, we can experience some kind of bliss. If we experience the real truth, then that Satchidananda (Total Bliss) is indescribable.

The world we see is not real. What is that mean?
It does not mean that this does not exist. Anything that exits at one time but disappears after some time is called as Unreal. If we take our universe, all the planets exist at one point but they disappear in space and time. Nothing is left when a planet or solar system disintegrates. In a similar way human body started with a small cell and organizes in to a huge conglomeration of cells. When the soul leaves the body, human body collapses and when we cremate the body what is left?

Why do we have to gain Jnana (knowledge)?
We can relate this kind of concept in our daily lives. When we do not tackle our daily problems with mature thinking, we suffer.
When we do not understand life or a particular object correctly, our outlook on that particular issue will be tainted.

When we want to live with someone we have to understand them properly. We have to be practical in our thinking.

If we can ignore our ego in certain situations, we will really enjoy our life.
To lose our ego, we need devotion (Bhakti) and Baba really emphasized Bhakti so much.

A combined approach is essential:

A learned person (Jnani) can feel that he has the knowledge but wherever there is devotion, ego disappears. We have to perform our daily actions (karmas) with a devotional attitude along with a proper understanding (Jnana). That’s why this Bhagavadgita stanza demands that kind of respect. We can see why Baba chose that Sloka (stanza). Baba taught fundamental principles of Knowledge (Jnana) so that we can achieve our goal as human beings. After listening to this discourse, Nana prostrated to Baba and requested him to direct him in proper path. He begged for his mercy, so that his ego could be burnt.

Even we are sizzling with great qualities (Satva Guna), our mind will have some impurities and we cannot tolerate if someone insults us. Our ego will throw us off balance.

What is Ajnana?
When we have our mind set on fame, name, greed and all other ego boosting qualities, we cannot have peace. This is Ajnana.

What’s miserable is to appear as a person of Knowledge but cannot overcome ego.
Here these qualities are sometimes very deep, and difficult to recognize. This is Maya (illusion).
The so called devotee, can get stuck with ritualistic mind set and cannot tolerate a bruise on his ego. What very he or she does feels right and ego dominates. They will try to control the situation. We see this in spiritual organizations where they tend to fight over their ideas. Even to serve our Guru, we cannot overcome our ego.

The way of Sai:
Sai used to work in a mysterious way. How he accomplished any work without making any fuss about it. The real reason was never disclosed, whether the work was small or big. The work was completed gradually and there was no mention about it anywhere. When some work arises casually, it should be taken into hand without pondering over its root cause or any indication. On the contrary, there is a creation of confusion. Avatars like Baba manifest on this earth for the well-being of others. When their desired mission is finished they merge into that which is not perceptible.

Reality of Life and the solution:
We do not know the root cause of our being, where we have come from and where we will go; why we were created and what is the reason for our birth. We live a life as per our own will. Then the time comes for death and all the senses are unable to function. Even then the good thoughts do not come. Even though we watch with our own eyes the wife, son, brother, mother, other loved and dear ones dying, the mind does not have these good thoughts.

The saints are not of this nature. They are very aware and have full knowledge of their end and know of the time of their death. Till they are in body, they weary their bodies for their devotees with great love and at the end the place where the body is abandoned is utilized for the benefit of their devotees.

Jnana (knowledge) is nothing but learning about these realities. We cannot wait until old age to learn these concepts. They are a waste because your body will not cooperate at that time. We need this Knowledge throughout our life. We need to understand the realities of life death cycle. We think that we are asking for happiness all the time but that is not true.

We need to understand the importance of permanent bliss that is happiness forever.

We need to understand what will cause sorrow and what will give us the real happiness.

If we can put a side our ego, be selfless and perform our actions with humility, devotion and faith, we will succeed in our endeavor.

Baba always taught us to see God in every human being, every movable or immovable objects. 

Serving with humility takes us to new heights in Knowledge.


Construction of Samadhi mandir
Bapusheb Butti is from Nagpur and he used to come to Shirdi often with his family. He served Baba with utmost devotion. He stayed in Shirdi on and off and was always obedient to Sai and felt like staying there all the time. He felt like buying a small plot of land and thought about building a wada there so that he can stay in Shirdi. One day he was sleeping in Dixit Wada on the first floor and had a wonderful vision where sai asked him to build a wada there. Syama was also there sleeping and he also had a similar vision. Syama was weeping in his sleep and Butti wakes him up. Then Symaa tells him about the vision that he had where Baba told him ““Let there be a Wada with a temple. It will fulfil the desires of all”. When both of them had the same vision, Butti understood that his desire to bulid a wada was approved by Sai. Then next morning both go to Baba and Syama asked Baba “O Lord, what is this unfathomable sport of yours? You do not even allow us to sleep undisturbed! You make us rave then also”. Hearing this, Baba covered both his ears with his hands and said: “I have been here all the time, whatever else one may say”. Then Syama supervised the work and Butti took care of the financial issues. Baba while going to Lendi used to advise where the doors and windows need to be and how the gallery should be. Butti got an inspiration that in the innermost space of the building he could install the image of Lord Muralidhar. Baba approved this also but said we will all live there. Later on like Baba predicted this wada became Samadhi mandir.


Om SriSainatharpanamasthu!        
  



 

Wednesday, June 6, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 38



సాయియే ఆత్మా రాముడు.  సాయియే పూర్ణానందధాముడు. వారు స్వయంగా ఏ కోరికలు లేని వారు. భక్తులను నిష్కాములుగా చేస్తారు. సర్వ ధర్మాలను రక్షించేవారు. అన్న దానం చాలా గొప్పది అని మనం ఎప్పుడూ వింటాము. మనం ఏ ఇతర దానం ఇచ్చినా కాని అది అపాత్ర దానమొ కాదో మనకు తెలియకపోవచ్చు. ఆకలిగొన్న వారికి అన్నం పెడితే ఎప్పుడూ వృధా కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన శాస్త్రాలు చెపుతాయి. అన్నమునుండే ప్రాణులు ఉత్పన్నమౌతాయి. అందుకే బాబా కూడా లౌకిక రీతిని అనుసరించి అన్న సంతర్పణ చేసే వారు. రోగులకు, శక్తి హీనులకు, గుడ్డి, చెవిటి వారికి మరియు దీనులకు మొట్టమొదట అన్నం పెట్టాలి. వారి తరువాతనే ఆప్తులకు బంధుమిత్రులకు పెట్టాలని ఈ అధ్యాయంలో మనకు చెప్పారు.

బాబా మసీదు ప్రాంగణంలో ఒక పెద్ద పొయ్యిని పెట్టేవారు. బాబా రెండు పాత్రలలో చేసే వారు. ఒకటి 50 మందికి, ఇంకొకటి 100 మంది సరిపోయే విధంగా ఉండేవి. ఒకప్పుడు తీయటి పరమాన్నం మరొకప్పుడు మాంసంతో పలావు వండేవారు. ఒకప్పుడు గోధుమపిండితో ఉండలు చేసి ఉడుకుతున్నప్పుడు పప్పు పులుసులో మెల్లగా వేసే వారు. మసాలాను రాతి బండమీద బాగా నూరే వారు. అన్నింటిని సరైన పాళ్ళల బాబానే స్వయంగా వేసే వారు.
బాబా స్వయంగా వర్తకుల దగ్గరకు వెళ్లి సరకులు కొని తెచ్చేవారు. మసీదులో కూర్చొని స్వయంగా గోధుమలు. పప్పు, జొన్నలను విసిరేవారు. పొయ్యిలో కట్టెలు కూడా తానే స్వయంగా కిందకు పైకి జరుపుతూ ఉండేవారు. ఇంగువ, జీలకర్ర కొత్తిమీర వేసి వంటలు గుమగుమ లాడించేవారు. అలానే పిండి కలిపి రొట్టెలు తానే చేసే వారు. జొన్న పిండిలో సరిపడా నీరు పోసి పాత్రలో కాచి మజ్జిగను కలిపి అంబలిని కూడా చేసే వారు. వంట పూర్తి అయ్యాక పాత్రను పొయ్యి మీదనుంచి దించి తీసుకువెళ్లి మసీదులో ఉంచే వారు. మౌల్వితో విధిపూర్వకంగా ఫాతిహా చేయించేవారు. మాంసాహారమైతే అది తినే వాళ్ళకే పిలిచిపెట్టేవారు. మామూలు భోజనమైతే చక్కగా నైవేద్యంగా అందరికి బాబానే స్వయంగా వడ్డించేవారు. ఆ భోజనం కోసం వచ్చినవారు తృప్తిగా తినేవారు.

బాబా మాంసాహారం తినని వాళ్ళని ఆ ఆహారం తాకనిచ్చేవారు కాదు. ఒక సారి ఏకాదశి రోజున దాదా కేల్కరుతో తమాషాగా వెళ్లి మాంసం కొనుక్కురమ్మంటారు. కేల్కర్ బ్రాహ్మణుడు. చక్కటి ఆచారాన్ని పాటించేవాడు. సరే బాబా చెప్పారు అని వెళ్ళబోతూ ఉంటే అతనిని ఆపి తన సేవకుడిని పంపించిమంటారు. తరువాత అది కూడా వద్దని ఆపుతారు. ఇక్కడ కేల్కర్ బాబాను శ్రద్ధతో నమ్మేవాడు అందుకే ఆలోచించకుండా ఆ పని చేయడానికి ఉపక్రమించాడు. గురువు మనకు కొన్ని నేర్పించడానికి, మనలో ఉన్న నేను అన్న భావం పోగొట్టడానికి ఇలా చేస్తారు. కేవలం ధనధాన్యాలు, వస్త్రాలు వగైరా గురువుకి సమర్పించడమే గురు దక్షిణ కాదు. గురువుగారి ఆజ్ఞ పాటించి వారిని ప్రసన్నంగా ఉంచడమే నిజమైన దక్షిణ. కాయా వాచా మనసా అన్నింటిని గురువుకి అర్పించి గురుకృపను పొందినవారిదే నిజమైన శ్రద్ద. తమ పొట్ట నింపుకోవడానికి కేవలం భిక్ష ద్వారానే ఇంటింటికి తిరిగి అన్నం తినే వారు. ఇక్కడ బాబా నేర్పించింది ఏమిటి అంటే, అన్నదానం చేయాలి అంటే మనము కూడా స్వయంగా కష్టపడి పని చేయాలి. బాబా స్వయంగానే అన్ని చేసే వారు. అప్పుడే నిజమైన తృప్తి, ఫలితం. ఇదే కాకుండా ధుని కోసం కట్టెలు ఉంచే  గాడి యొక్క ముందు భాగం మూడు వంతుల గోడ కూడా బాబానే స్వయంగా తన చేతులతో కట్టారు. వారు చేయని పని ఏముంది? మసీదును స్వయంగా అలికే వారు. చేత్తో తన బట్టలు తానే కుట్టుకొనే వారు. పొయ్యిమీద బాగా ఉడుకుతున్న వంటలను తన చేతితో కలియపెట్టేవారు. వారి చేతికి కొంచెంకూడా కాలిన గుర్తులు ఉండేవి కావు. భక్తుల శిరస్సుపై పడగానే త్రితాపాలను తొలిగించే వారి హస్తాన్ని అగ్ని ఎలా బాధపెట్టగలదు? అగ్నికి వారి మహిమ తెలియదా!

తినకూడని వాటిని తినాలని మనసు పడే వారి వాసనలు అణిచివేసి, మనసుని నిగ్రహించుకునే వారిని బాబా ఉత్సాహపరిచేవారు. ఇంకోసారి దాదా కేల్కరును పలావు చేసాను ఎలా ఉందొ చూస్తావా? అని బాబా అడిగారు. అప్పుడు దాదా లాంఛనంగా చాలా బాగుంది అన్నాడు. అప్పుడు బాబా నీవు తినకుండా, కనీసం వాసం చూడలేదు ఎలా చెప్తున్నావు? ఇక చేయి తీసి గరిటతో పళ్లెంలోకి తీయి. మడికట్టుకున్నానని బడాయి పోకు అని అంటారు. సత్పురుషులు శిష్యులకు అనుచితమైనవి చెప్తారు అని అనుకోవడం పొరపాటు. వారు అపారమైన దయతో ఉంటారు. అలానే కేల్కరులో ఉన్న పాత వాసనలను కూడా దూరం చేశారు. గురు ఆజ్ఞా పాలనా మీమాంస ఒక్కోసారి ఎంతటి కఠిన పరీక్షకు దారి తీసిందంటే జీవితంలో ఎన్నడూ మాంసాన్ని తాకని భక్తుని నిశ్చయం ఊగిసలాడింది. వాస్తవానికి బాబా ఎప్పుడూ ఏ భక్తుని అయినా తప్పుదారిలో ప్రవేశపెట్టే వారు కాదు.  1910 తరువాత భక్తుల సంఖ్య పెరిగి బాబా బాబా స్వయంగా వంట చేయలేదు. వచ్చే నైవేద్యాలన్ని బాబా అందరికి పంచి పెట్టేవారు. అందరు తిన్నా ఇంకా నైవేద్యాలు మిగిలిపోయేవి.

బాబా ఎవరిని తమ మతం కాని, ఆచారం కాని మార్చుకోనిచ్చేవారు కాదు. అలానే ఏ ఆరాధ్యదైవాన్ని అనాదరం చేస్తే సహించేవారు కాదు. బాబా చైతన్యమూర్తులు. ఆత్మస్థితిలో ఉండే వారిని హిందువని ముస్లిం అని లేక ఇంకే మతస్థుడు అని అనగలము. బాబాను సర్వమత సమ్మతునిగా మనం కొలుస్తాము. వారు హిందూముస్లింల సమైక్యతను సమర్ధించారు. అలానే ఏ సంప్రదాయాన్ని విమర్శ చేయనిచ్చేవారు కాదు. ఒక సారి నానా చాందోర్కర్ తన చుట్టం అయిన భిన్నేవాలాతో షిర్డీ వస్తాడు. ద్వారకామాయికి రాగానే బాబా అతనిని కోపగించుకుంటారు. బాబా ఎందుకు కోపగించుకున్నారో మొదట అర్ధం కాక సతమతం అయ్యి, తన తప్పు ఏమిటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు బాబా ఇలా అంటారు " నీవు ఇది ఎలా మరిచిపోయావు? నా సాంగత్యంలో ఎన్నో రోజులు ఉండి నీవు నేర్చుకున్నది ఇదేనా? నీ మతి ఎందుకు ఇలా భ్రమించింది? నాకంతా చెప్పు అని అన్నారు. నానాకు వెంటనే ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తుకు రాలేదు. బాబా కాళ్లు పట్టుకుని అనేక రకాలుగా మొర పెట్టుకున్నాడు. తరువాత బాబా తను కోపర్గావ్లో దత్తమందిరంలో దత్తుడిని దర్శించకుండా వచ్చావు అని గుర్తు చేస్తారు. నానా చాందోర్కర్ ఎప్పుడు షిర్డీ వచ్చినా అక్కడ ఆగి వస్తాడు. కాని ఈ సారి భిన్నేవాలా అడిగినా కాని తొందరగా షిర్డీ చేరుకోవాలి అని వచ్చేస్తాడు. అక్కడ గోదావరిలో స్నానం చేస్తూ ఉంటె కాలులో ఒక ముల్లు గుచ్చుకుంటుంది. బాబా అప్పడు " ఇలా త్వరపడటం మంచిది కాదు. దర్శనం చేసుకోకుండా దత్త దేవుని అనాదరం చేసినా, నయమే నీవు కేవలం ఒట్టి ముల్లు గుచ్చుకొని బయట పడ్డావు. దత్త భగవానుని దర్శించుకోలేని వాడు నా వద్ద ఏమి పొందగలడు? అని బాబా బోధించారు.

హారతి అయిన తరువాత భక్తులందరికి ఊది ఇచ్చి ఆశీర్వదించేవారు. అప్పుడు భక్తులు బాబా అన్ని పదార్ధాలను కలిపిన నైవేద్యాలను ప్రసాదంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉండేవారు. భక్తులు రెండు వరుసలలో కూర్చుని ఉంటె శ్యామా, నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించేవారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూసేవారు.

ఒక సారి హేమద్పంత్ మసీదులో అందరితోపాటు కడుపునిండా తింటాడు. అప్పుడు బాబా ఒక గిన్నెడు మజ్జిగ ఇచ్చి తనను తాగమంటారు. అది తెల్లగా చూడడానికి ఇంపుగా ఉంటుంది. కాని అతని కడుపులో ఖాళీ లేదు. కొంచెం పీల్చగా మిక్కిలి రుచిగా ఉండెను. అతని కష్టం కనిపెట్టి బాబా ఇట్లా అంటారు. " దానినంతయు తాగుము. నీకిక మీదట ఇట్టి అవకాశం దొరకదు" అతను వెంటనే దానినంతయు తాగెను. బాబా చెప్పినట్లు కొన్నాళ్ళకు బాబా మహాసమాధి అయ్యారు. అందుకే బాబా మళ్ళా అవకాశం రాదు తాగు అని చెప్పారు.

హేమద్పంత్ గారి ద్వారా బాబా మనకు సాయిసత్చరిత అనే అమృతం అందచేశారు. ఈ అమృతాన్ని మనసారా శ్రద్ద సభూరిలతో మనం పానం చేస్తూనే ఉండాలి.


ఓం శ్రీ సాయినాథార్పణమస్తు !