In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Monday, April 22, 2019

బాబా అనుగ్రహ వాక్యాలు -సాధన రహస్యం



భక్తులు ఒక సారి ద్వారకామాయికి మరమ్మత్తులు చేయాలి అని పనులు మొదలుపెడతారు. అప్పుడు  బాబా తాత్యా తలపాగాను మంటలో వేసి ఆయన గొంతుని పట్టుకుంటారు. తరువాత ఆయనే ఒక నగిషీ చెక్కిన తలపాగాను తెప్పించి తాత్యా తలకు చుడతారు. మన అందరకు మంచి పనులు చేయాలని, దైవ కార్యాలలో పాల్గోవాలని మంచి సంకల్పం ఉంటుంది. కాని మనలోని పూర్వ వాసనలు అహంకారమై మన తలలోనే ఉంటాయి. ఇదే మనం చుట్టుకొనే తలపాగా. ఈ అహంకారమనే తలపాగా బాబా తీసి జ్ఞానమనే ధునిలో వేస్తె కాని మనలో ఉన్న అహంకారం పోదు. మనం చేయాల్సింది ఏమిటి అంటే తాత్యా ప్రేమించినట్లు బాబాను ప్రేమించాలి, బాబాకు దగ్గర అవ్వాలి. ఆయన చెప్పిన మార్గంలో నడవాలి. అప్పుడే ఆయన మన తలపాగాను కూడా తీసి వేస్తారు. 

మనలో ఉన్న ఈ అహంకారం పోగొట్టుకోవాలి అంటే మనం ఏమి చేయాలి? మనం బాబాకు ఎలా దగ్గర అవ్వాలో అన్న విషయాలు బాబా స్వయంగా చెప్పారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము. వాటిని మన జీవితంలో భాగంగా చేసుకుందాము. ఇవి అనుసరించడం కష్టం అని మనం  అనుకోవచ్చు. ఒక లక్ష్యం పొందాలి అంటే సాధన కావాలి, వైరాగ్యం ఉండాలి.

నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నా యందె భక్తిశ్రద్ధలతో మనస్సు నిలిపిన వారి యోగక్షేమములు నేను చూచెదను. కావున వీటికొరకు ప్రయాస పడవద్దు.

ప్రపంచములో కీర్తిప్రతిష్టలకోసం ప్రాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణా కటాక్షములు పొందుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందుకొను బ్రమను వీడుము.

లోకులు గౌరవించినంత మాత్రాన తనను తాను మర్చిపోవాలా? ఆరాధ్య మూర్తి యొక్క అంతఃకరణం కరుణతో కరిగిపోయి చెమటలు పట్టాలి. ఈ ధ్యేయం మీదే ప్రీతి కలగాలి.

సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలి. ఇంద్రియవికారాలు భక్తివైపు మొగ్గాలి. ఇతర విషయాలపై ప్రీతిలేకుండా ఎల్లప్పుడూ మనసులో భజన జరగాలి.

మనస్సు నందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్త ఇంద్రియములను భగవంతుని ఆరాధనకు నియమించుము. ఇతర విషయములపైకి మనసుని పోనివ్వకము.

మనసు అన్నిటిని మర్చిపోయేలా నామస్మరణ యందు లగ్నం చెయ్యాలి. అప్పుడు శరీరం, గృహం, ధనం అవేవి గుర్తు ఉండవు. సత్సంగం చేసిన ఫలితంగా చిత్తవృత్తి శాంతించాలి. చిత్తం పరమానందంతో ప్రశాంతతను పొందుతుంది.

ఇలా బాబా మనకు సాధనలో ఉపయోగపడే చాలా విషయాలు చెప్పారు. మనం ఆధ్యాత్మిక పధంలో ఎదగాలి అంటే ఇవి పాటించక తప్పదు. బాబా పై నాకు భక్తి ఉంది అంటే సరిపోదు. ఆయన చెప్పిన సూచనలను తప్పకుండా పాటించాలి. అప్పుడే మనము నిజమైన సాయి భక్తులుగా ఎదగగలుగుతాము. సాయికి నిజంగా దగ్గర అవ్వగలుగుతాము. 

ఓం శ్రీ సాయిరాం!

Baba's blessed words - Secrets of Sadhana



Once devotees wanted to repair the floor of Dwarakamai. when they started repairing the Dwarakmai, Baba got hold of Tatya, removed his head scarf and threw it in the Dhuni.  Later on he calms down and gets a new Scarf and gives it to Tatya. We all want to celebrate these important festivals but some times we get carried away and forget the Bakthi part of it. The scarf here indicates the Ego, which Baba wants us to get rid off. He has to throw this in the fire that is Jnana. Then only we will be in the right path. If we follow his path, he will then take away our head scarf that is ego. 

If we have to get rid of our ego (ahamkara), what do we need to do and how we can stay close to Baba? These were well explained by Baba himself. Let us see what those words were because they are very useful to reach our goals. We need dispassion towards the worldly objects. This might be difficult to follow but if we have Baba in our lives nothing is difficult.
  

Those who wholeheartedly worship me and lovingly always serve me, I look after their well-being. This I know to be my motto. There will never be shortage of food and clothing. Therefore do not hanker after them. 

One should seek honor at the door of God; and should beg only from God. Ask only for his blessings. Worldly prestige should be left aside. 

Why are you satisfied by the honor given to you by the society? Why are you infatuated by this honor? Rather seek through intense devotion to move your chosen deity to compassion and to express your joy through copious streams of Satvik Bhava.  

May you find joy in such striving. Let all the faculties be seized with such a devotional urge so that the passions of the senses may be transformed completely and sprout devotional worship. What desire will then remain? 

May such devotion be your constant preoccupation leaving no relish fro anything else. 

May the mind be engaged in constant chanting of my name and let everything else be forgotten. Then there will be no thought of body, home, and wealth. The heart will be fixed in infinite happiness. The mind will be balanced and serene; and it will find fulfillment in it self. 

A contended mind is the surest sign of association with the holy.How can a wandering mind be considered as being surrendered to God?  

These are most provocative words spoken by Baba and we need to remember them always. 

OM SRI SAIRAM!