In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, October 25, 2017

శ్రీ సాయి సత్చరిత అధ్యాయము - 4


పరమ యోగీశ్వరులైన సాయి షిర్డీలో మనలను ఉద్ధరించడానికి, సరైన మార్గంలో నడిపించడానికే అవతరించారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరిస్తాను అని భగవానుడు గీతలో చెప్పారు. అలానే భగవానుడు యోగీశ్వరుల రూపంలో అవతరించి ధర్మాన్ని రక్షిస్తారు. వారు సమాజానికి సరైన దారి చూపిస్తారు. ఇదే విషయాన్ని సత్చరిత నాలుగో అధ్యాయం మొదటిలో చెప్పారు. షిర్డీ క్షేత్రం సాయి నాధుని కృపతో పుణ్య క్షేత్రం అయ్యింది. షిర్డీ కోపర్గామ్ తాలూకా, అహమద్ నగరు జిల్లాలో ఉంది. కోపర్గామ్ వద్ద గోదావరి నది దాటి షిర్డీ చేరవలిసి ఉంది. షిర్డీ అంటేనే సాయి. సాయి అంటేనే షిర్డీ. 

సాయి నడిచిన ఆ నేల అతిపవిత్రం. సాయి మూర్తీభవించిన జ్ఞానభండారం. శాంతి వారి భూషణం. వారు పరమార్థ వితరణలో అపర గురు స్వరూపం. సారాలలో సారం సాయి. వారు ఎప్పుడు ఆత్మ స్వరూపంలో లీనమై ఉంటారు. అందరి పట్ల అన్ని ప్రాణుల పట్ల వారి దృష్టి సమానము. వారు మానావమానాలకు అతీతులు. సర్వ జీవులలోను నిండియున్న భగవత్స్వరూపులు. భగవంతుని నామం వారి ముద్ర. వారి అంతఃకరణం శాంత సముద్రం వంటిది. వారు షిర్డీనుంచి శారీరక పరంగా అక్కడే ఉన్నట్లు అనిపించినా  వారు అంతటా ఉంటారు. షిర్డీలోనే అన్ని పుణ్యక్షేత్రాలు నెలకొని ఉన్నాయి. సాయి సమర్ధుని దర్శనమే మనకు యోగసాధనం. వారితో సంభాషణే మనకు పాప ప్రక్షాళనము. వారి చరణసంవాహనే మనకు త్రివేణి సంగమ స్నానం. వారి విభూతి ప్రసాదాల సేవనం అన్ని విధాలా పుణ్యపావనం. సాయియే మనకు పరబ్రహ్మ. అందుకే మహాభక్తుడైన 95 సంవత్సరాల గౌలి బువా సాయియే పండరినాథుడు అని సెలవిచ్చారు.

సాయికి నామస్మరణ చాలా ప్రీతికరము అందుకే దాసగణుకు నామసప్తాహం చేయమని చెప్పారు. అప్పుడు దాసగణు మహారాజ్ తనకు విఠల దర్శనం అవుతుంది అంటే చేస్తాను అని అన్నారు. బాబా అప్పుడు భక్తిభావం ఉంటె విఠలుడు తప్పక ప్రకటమౌతాడు అని చెప్పారు. అదే విధంగా ఆయనకు ఆ దర్శనం అయింది అని చెప్తారు. అలానే దీక్షిత్ గారికి కూడా ఆ దర్శన భాగ్యం కలిగింది. ఏ సన్నివేశాన్ని చక్కగా సత్చరితలో మనము చదవచ్చు. అలానే బాబా చెప్పినట్టు చిత్రపటం రూపంలో కూడా విఠలుడు వస్తారు. భగవంతరావు క్షీర సాగర్ షిర్డీకి వస్తే తన తండ్రి ఎంత విఠల భక్తుడో తెలిపి తనను సరైన దారిలో పెట్టారు. మన పూర్వ జన్మ వాసనలను ఆధారంగా మనకు ఏ దారి మంచిదో ఆ దారిలో బాబా నడిపిస్తారు. 

దాసగణు మహారాజకు త్రివేణి సంగమాన్ని తన పాదాల దగ్గరే చూపించి పావనం చేశారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం బాబా తన గురువుని వదిలి ఎక్కడకు వెళ్ళలేదు. అలానే షిర్డీ వదిలి వెళ్ళలేదు. అందుకే మనం బాబాను గురువుగా స్వీకరిస్తే అన్ని తీర్ధాలు ఆయన లోనే
 ఉన్నాయి అన్న సత్యం తెలుసుకోవాలి. దాసగణు మహారాజ్ సాయి పాదాలలో త్రివేణి స్నానం చేసిన తరువాత పరవశంతో స్తోత్రం చేస్తారు. ఇది మనం పెద్ద సత్చరితలో చదవవచ్చు.మనం త్రివేణి సంగమంలో గంగ, యమునలను చూడవచ్చు కాని సరస్వతి అంతర్వేది అంటే మనకు బయటకు కన్పించదు. అలానే బాబా రెండు పాదాలలోనుంచి గంగ యమున బయటకు కన్పించాయి. బాబా అనుగ్రహం మాత్రం (సరస్వతి) బయటకు కన్పించేది కాదు. ఈ అనుగ్రహం అంతర్ శుద్ధిని కలుగ చేస్తుంది. సాయి భక్తులమైన మనము కూడా బాబా నుంచి ఈ అంతరశుద్ధిని కోరుకుందాము. 


బాబా షిర్డీ ఆగమనం ఒక మదురమైన ఘట్టం. వారు పదహారు ప్రాయాన  షిర్డీలో అత్యంత సుందర రూపంతో వేపచెట్టు క్రింద స్థిరాసనంలో కన్పించారు. ఆయనకు పగలు రాత్రి అనే బేధం లేదు. అతడు మూర్తీభవించిన వైరాగ్య మూర్తివలె దర్శనమిచ్చేవారు. అందరు ఎక్కడనుంచో వచ్చి దర్శనం చేసుకునే వారు. ఇతడు ఎవరు అనే ఆశ్యర్యం అందరిలోను ఉండేది. ఇద్దరి ముగ్గురికి ఖండోబా ఆవేశమై ఊగుతూఉంటే జనం వారిని బాబా గూర్చి అడిగారు. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఖండోబా దేవుడు చెప్పిన విధంగా ఊరిచివరి వేపచెట్టు క్రింద తవ్వగా ఒక సొరంగం వెలుగుతున్న నాలుగు పెద్ద కుందులు కనిపించాయి. బాబా అది తన గురు స్థానం అని దాన్ని మూసివేయమని చెప్పారు. అక్కడ బాబా పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసినట్లు చెప్పబడింది. 


తరువాత ఈ అధ్యాయం చివరలో మూడు వాడాలు ఎలా షిర్డీలో వచ్చాయో చెప్పడం జరిగింది. మొట్టమొదట గురు స్థానం దగ్గర సాఠె వేపచెట్టు చుట్టూ అరుగు, దక్షిణోత్తరంగా భవనాన్ని నిర్మించారు. చాలా రోజులు షిర్డీకి వచ్చిన యాత్రికులకు ఇదే బసగా ఉండేది. తరువాత దీక్షిత్ వాడా కట్టించారు. షిర్డీలో సెజ్ ఆరతి మొదలైన రోజే ఈ దీక్షిత్ వాడాకు కూడా పునాది వెయ్యడం జరిగింది.   తరువాత 1911 శ్రీరామ నవమి రోజున గృహప్రవేశం జరిగింది. తరువాత శ్రీమంతుడైన బూటీ చేతులమీదుగా ఇప్పుడు సమాధిమందిరమున్న వాడా నిర్మాణం జరిగింది. ఈ ప్రదేశాన్నే సాయి తన మందిరంగా ఎంచుకున్నారు. సాయినాథుడే మురళీకృష్ణుడై అక్కడ వెలిశారు.  

మొట్టమొదటి వాడా హరివినాయక్ సాఠే గారు కట్టించారు.
 ఆయన ఒక డెప్యూటీ కలెక్టర్ మరియు కలెక్షన్స్ ఆఫీసర్. బాగా డబ్బు సంపాయించి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలనే మనసుతో ఉండే వారు. ఆయనకు మగ బిడ్డలు లేకపోవడంతో బాబా భక్తుడైన దాదా కేల్కర్ కూతురిని రెండోవివాహం చేసుకుంటాడు. అదికూడా బాబా మగబిడ్డ పుడతాడు అని చెప్తే చేసుకుంటాడు. ఇలా ఆయన బాబాను ఆశ్రయించి సాఠే వాడాను కట్టిస్తారు. కాని తరువాత వచ్చిన దీక్షిత్ గారు మాత్రము ఆధ్యాత్మిక సాధన కోసం వాడాను కట్టారు. ఇక చివరిగా మనము ఈ సాధనలో పరిపక్వత చెందితే మోక్షము సమాధి మందిర రూపంలో సాయి పరమాత్మ దర్శనం కలుగుతుంది. 




శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు !




  

Sri Saisatcharita chapter - 4



Sai is a great ascetic, by the great good fortune of Shirdi, for the sake of deliverance of the world, appeared on the banks of Godavari River. To protect the dharma, to annihilate the sinfulness and to protect the down-trodden, poor and weak, the saints incarnate. In Bhagavadgita, Lord Krishna says that he will incarnate whenever there is deterioration of dharma and increase of adharma. This is what mentioned in the beginning of fourth chapter. The Shirdi became holy place because of Sai. This is in Kopergaon taluk, Ahammadnagar district. There were so many saints who were born in the banks of Godavari River. As we cross over to the other side of banks of Godavari at Kopergaon, at a distance of about six miles, as the tanga enters Neemgoan, Shirdi is immediately within sight.  Shirdi became intertwined with Sai's name.

Blessed are the stones and blades of grass of Shirdi which, without any effort, were able to kiss the feet of Sai and were able to bear the dust of his feet on their heads. The very association with Sai in Shirdi is like the study of scriptures. He is the easy way to Supreme God. Sai's darshan is itself a means for our union with the divine. By conversing with him our sins will be washed away. His command is like Vedic sermon for us. His udi (sacred ash) and prasad are purifying and sacred. He used to recite the God's name all the time. He is omnipresent. He was unaffected by the worldly abundance or the absence there of, unmoved by the joys and sorrows of the other world. His heart was pure as a mirror and his speech showered nectar. Pressing his feet is like bathing in the confluence of three rivers (Ganga, Yamuna and Saraswathi) and partaking of the water from washing his feet will uproot all desires. Goulibhuva, a great vaarkari to Pandharpur, said Baba is Vittal. He was 95 year old and he visited Baba every year. 

Sai loved recitation of God's name. He advised Dasaganu to do continuous recitation of God's name for 7 days. Dasganu was promised to have the vision of Vittal. It was reported that he ultimately had the darshan of Vittal. Kaka Deekshit also had vision of Vittal in his meditation. Later Baba tells him to hold on to Vittal otherwise he will disappear. Then Deekshit bought a picture of Vittal from a hawker. This happened to be the same image that he saw in his meditation. Bhagavanta rao Ksheerasagar came to Shirdi and his father was a great devotee of Vittal. Baba reminded him to put him on the correct path as he took backseat in worshiping Vittal. Baba always keeps us on the track even we are immersed in worldly affairs. All we have to do is have faith in him. 

Baba showed a miracle to Dasganu by showing Triveni oozing out from his feet when he wanted to visit the confluence of three rivers on a holy day. Dasganu put his head at Baba's feet. Having witnessed this miracle, Dasganu was overcome with emotion. His speech was inspired and love brimmed up in his
heart. He praises Baba after this experience and this stotra can be seen in Original Satcharita. Here triveni sangamam was shown from Baba's both feet. At triveni sangamam we can see both Ganga & Yamuna and Saraswathi is flowing underneath. This is not visible. The Saraswathi is called as antervedi. In a similar way Baba showed Ganga & Yamuna from both feet but other river is his grace which is not visible outside but you can only experience it when you surrender.


Sainath appeared in Shirdi as a 16 year old handsome boy and he was seen sitting under the neem tree most of the time. He was immersed in internal bliss and there was no difference between day and night. He appeared as a pure ascetic. People used to come from all around to see this young boy. Sai Samardh appeared in Shirdi for the sake of his devotees. Even in the dreams he had no passions. No one knew where he is from and who his parents were. He kept no company during the day and he was not scared in the night. 

One day Lord Khandoba possessed the bodies of few people and villagers asked them about this young boy. They were told to dig under the neem tree and they found an underground cavern in which there were four burning brass lamps. This young boy told them to close that cavern and this is the place of his Guru. The holy place is his inheritance and he requested them to maintain as it is.  It was told that this boy did penance in that cavern for 12 years. 

At the end of the chapter, Hemadpanth talks about three buildings that were built in Shirdi during Baba's time. Harivinayak Sathe was the first one who bought the land around the Neem tree and built a platform around the neem tree. Then Sathe wada came and initially this was the only place where pilgrims used to stay when they came to see Baba. Then came Kaka Dixit's wada. He
built two floors and Baba made him do his penance on the upper floor. Other people used to use the lower floor. The foundation stone was laid on the day Sej arathi started in Chavadi. Around the same time Baba gave permission for Kapardhe to leave Shirdi after a long stay. Then on Sri Rama Navami day the house warming was done in 1911. Later, the rich Butti's building was also built on which lot of money was spent. But this was all worth it as it became Baba's samadhi mandir. Butti wanted to build Lord Krishna temple in that place. But this became the temple of Sai Krishna. 

If we look at three buildings, the first one was built by Hari vinayak Sathe who was mainly preoccupied with worldly issues and worshiped Baba. Then comes Dixit who did not want anything except Moksha and Baba helped him to do sadhana and to attain jnana. In the end, the samadhi mandir represents the final stage of salvation that is moksha. Baba wants to advance from one stage to the other. He himself said people might come to him for materialistic gains but later he shows them the real path. 


Sri Sadguru Sainathaarpanamasthu !



Wednesday, October 18, 2017

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 3



హేమద్పంత్ సాయి ఆశీస్సులతో సాయి సత్చరిత గ్రంధానికి శ్రీకారం చుట్టారు. మూడో అధ్యాయం ప్రారంభిస్తూ ఒక్క సారి బాబా ఇంకా ఏమి చెప్పారో చూద్దాము. "నీవు నీ పనిని చేయి. మనసులో ఏ మాత్రం బయపడకు. నా మాటలందు పూర్తీ విశ్వాసముంచు. నా లీలలను రచిస్తే అజ్ఞాన దోషం తొలిగిపోతుంది. భక్తి భావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది. శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతమనే అలలు లేస్తాయి. వానిలో మరల మరల మునకలు వేస్తె జ్ఞాన రత్నాలు లభిస్తాయి" అని చక్కగా చెప్పారు బాబా. 

ఎలాగైతే హేమద్పంత్ గారికి సత్చరిత వ్రాసే కార్యం అప్పచెప్పారో, అలానే ఒక్కో భక్తుడికి ఒక్కో పని అప్పచెప్తారు. మనలో ఉన్న వాసనలను బట్టి మనకు పనులు ఇస్తారు. ఒకరికి మందిర నిర్మాణం, ఒకరికి హరికథా కీర్తనాదులలో నిమగ్నులను చేశారు. మనందరం అర్ధం చేసుకోవాల్సిన విషయం బాబా శిష్యుడుగా ఏమి చేశారు అన్న సత్యం. మనందరం సత్చరితలో చదువుకున్నాము బాబా లాంటి శిష్యుడు వేరెవరు ఉండరు అని. ఎందుకంటే ఆయనకు గురువు తప్పితే వేరే ఆలోచనే లేదు. బాబాకు బయట హాంగులుతో పని లేదు. ఆయనకు కావాల్సినదల్లా ఆయన చూపించిన మార్గంలో నడవడమే.  

ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వారు ప్రక్క దారులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సముద్రంలో ఓడలు సుడిగుండాలలో చిక్కుకుపోకుండా, పెద్ద రాతి బండలు కొట్టుకోకుండా, నిరాటంకంగా సాగిపోవడానికి, అపాయాలను సూచించే ఎర్రటి దీపస్తంభాలను (లైట్ హౌసెస్) నిర్మిస్తారు. ఈ దీపపు స్తంభాలు ఆ నావలు ఓడ్డుకు చేరటానికి ఉపయోగపడ్తాయి. చీకటిలో వాటికి దారి చూపిస్తాయి. 

సాయినాథుని మధురమైన కథలు అమృతం సహితం సిగ్గుపడేలా, దుస్తరం అయిన భవసాగర మార్గాన్ని అతి సులువుగా దాటింపచేస్తాయి. సాయి కథలు ధన్యం. వారి కథలు శ్రవణం ద్వారా హృదయంలోకి ప్రవేశించి శరీరాభిమానాన్ని బయటకు నేట్టివేస్తాయి. సుఖదుఖాలనే ద్వంద్వాలు ఉండవు. సాయి కథలను హృదయంలో భద్రపరుచుకుంటే మనసులోని వికల్పాలు నలు దిక్కులా పారిపోతాయి. బాబా యొక్క నిర్మలమైన యశస్సును వర్ణిస్తే, ప్రేమతో శ్రవణం చేస్తే భక్తుల కల్మషాలు దహించుకు పోతాయి. 

సాయి ప్రేమను ఆవుతో పోల్చారు హేమద్పంత్. ఆవు పొదుగునిండా పాలు ఉన్నా దూడ లేకుండా పాలు ఇవ్వదు. బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది అంటారు. అలానే బాబా మనలను వెన్నంటి కాపాడుతూ ఉంటారు. ఒక రోజు గురు పూర్ణిమ రోజున అణ్ణా చించణీకర్ హేమద్పంత్ ఉద్యోగం లేక బాధల్లో ఉంటే సహాయం చేయమని అర్థిస్తాడు. అప్పుడు బాబా "ఇతనికి ఏదొక ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు మాత్రం నా సేవ చేయనీ. ఇతని పళ్ళాలు ఎప్పుడు నిండి ఉంటాయి. యావజ్జీవం అవి ఖాళీ కావు. భక్తితో నా వాడై ఉంటే ఇతని ఆపదలన్నీ హరింప చేస్తాను" ఇలా అతనికి భరోసా ఇచ్చారు. 

హేమద్పంత్ గారు ఈ అధ్యాయంలో ఆత్మ జ్ఞానం గురించి చక్కగా బాబా చెప్పిన చాలా విషయాలను పొందుపరిచారు. ఇవి పెద్ద సత్చరితలో మనం నేర్చుకోవచ్చు. సాయి చరిత్ర మనకు జ్ఞానాన్ని ప్రసాదించి, అహంభావాన్ని నశించేటట్లు చేస్తుంది. అహం నశిస్తే ఆత్మసాక్షాత్కారం కల్గుతుంది. 

తరువాత ఒక రోహిల్లా కథను చెప్పారు. ఈ రోహిల్లా అర్ధరాత్రి కూడా "అల్లాహ్ అక్బర్" అని కల్మా చదువుతూ ఉంటే గ్రామస్తులకు ఇబ్బందిగా ఉండేది. వారు ఈ విషయం గురించి బాబాకు చెప్పుకున్నారు. అప్పుడు బాబా ఆతని కేకలు నాకు చాలా సుఖాన్ని ఇస్తాయి. అతడు ఆలా అరవడం చాలామంచిది. లేక పొతే దుష్టురాలైన అతని భార్య నాకు చాలా కష్టాన్ని కలుగచేస్తుంది. అతడు అలసి పోయినప్పుడు అతడే శాంతిస్తాడు అని గ్రామస్తులను ఓదార్చారు. ఇక్కడ నిజంగా ఆ రోహిల్లాకు భార్య లేదు. భగవన్నామ స్మరణ వల్ల మన చిత్తం సుద్ధి అవుతుంది. అలానే సాయి అనే స్మరణ సాయి భక్తులందఱకు మంచిది. 

ఒక రోజు బాబా మధ్యాన్న ఆరతి అయిన తరువాత ఇలా చెప్పారు. మీరెక్కడ ఉన్నా మీ చర్యలన్నీ నేను గమనిస్తూ ఉంటాను. ఇలా తెలిసిన నేను సర్వాంతర్యామినై అందరి హృదయాల్లో ఉండేవాణ్ణి. అంతటా చరించేవాణ్ణి. చరాచర సృష్టిలో ఉన్న అన్ని జీవ రాశులలో నేను ఉన్నాను. సకల ప్రాణులకు తల్లిని. ఇవన్నీ నడిపించే సూత్రధారిని నేనే. నా యందు శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవు. నన్ను మరిచిపోయిన వారిని మాయ కొరడాతో కొడుతుంది. ఈ దృశ్య జగత్తు నా రూపం. అంటే చీమ, క్రిమికీటకం, రాజు పేద స్థావర జంగమాలు అన్ని నా రూపమే అని తన నిజ స్వరూపం గురించి చెప్పారు. 

సమర్ధ సాయి అన్న మంత్రంతో వారి పవిత్ర పాదాలను ధ్యానం చేసే భక్తులకు ముక్తిని ప్రసాదించే ఆ సూత్రధారి చరిత్ర పావనమైనది. సాయి చరిత్ర విన్నా చదివినా వారి చిత్తం సుద్దమవుతుంది అని అధ్యాయం చివరలో చెప్పారు. 

శ్రీ సద్గురు సాయినాధార్పణమస్తు!  









Sri Saisatcharita Chapter 3



In the third chapter Hemadpanth continued to describe how baba blessed him to write the Satcharita and he gave the narration of Baba’s words as follows. You perform your duty. Do not have the least doubts in your mind. Have full faith in my words and be of resolute mind. If you write about my leelas, it will wipe out the faults which have arisen due to ignorance. And when you listen to it with faith your worldly involvements will disappear. It will cause waves of love and devotion to rise on the ocean of the mind; and, diving into them now and then, will bring up gems of knowledge. Whoever sings my praises, I will bestow upon him complete happiness, permanent pleasure and contentment. Believe this as the Truth.

Baba knows what kind of work needs to be assigned to each devotee. Some devotees were made to build temples; some were made to lose themselves in the joy of kirtan1; some were sent on pilgrimages. The simple fact that we all need to understand is what Baba did as sishya of his own Guru. He just followed him and he used to think about him all the time.

We see light houses anchored near the sea to guide the movement of ships by warning them to keep off the rocks and whirlpools. In a similar way, for people who tend to side track easily in everyday life, tales of Sai will navigate us safely and will smoothen the difficult paths of the ocean of existence. Blessed are the tales of the saints that penetrate into the consciousness through the ears and cleanse the bodily ego and destroy the sense of duality. Hemadpanth writes so much about the wisdom in the third chapter. He also describes about Brahman, and how we can reach that ultimate state. The third chapter also talks about how simply listening to Sai tales will get through so many problems of life, and free us from worldly vices. This will also free us from the shackles of bondage.

Sai’s love is compared to a cow’s love towards its own calf. Sai was portrayed as mother who knows everything about its child. He will take care of us in every life. Once Anna Chinchanekar pleaded with Baba about Hemadpanth’s financial situation after he retired. His pension was not enough to survive. Baba promised that he will get another job but for now he should resort to Baba’s feet only. Baba also promised that he will never have any difficulty with food or daily life. This reassurance was sufficient for Hemadpanth and he continued to serve Baba without any second thoughts.

Next he talks about the story of Rohilla who came to Shirdi and was attracted by Baba’s virtues. He stayed there for a long time and devoted himself to Baba. He used to recite Kalma and pray to God in the night time in a bigger voice. This used to bother the villagers who came home after day full of hard work. They spoke to Baba about this and Baba reassured them by saying “Do not harass the Rohilla. He is very dear to me. This Rohilla’s wife is a virago and not ready to stay with him. She is eager to come to me by eluding him. That woman does not observe the veil. She is without modesty and shameless. If driven out she comes back forcibly into the house. When he himself gets tired, he will keep quiet automatically”. The Rohilla does not have a wife but what Baba meant was by him reciting the God’s name his mind will be purified and the bad thoughts will not cripple him. Indirectly Baba is communicating to us to follow this recitation of God’s name to clear our hurdles in the spiritual path.

 Once, after the noon Arati, Baba spoke sweet words from his lips and they are as sollows.

“Wherever you are, and whatever you may be doing, always bear it in mind that I shall continue to be informed of the minutest details of your deeds. I dwell in the minds of all; I am in the hearts of all, and all pervading. I am the Lord of all. I fill the entire creation, within and without, to the point of overflowing. This universe is directed by God and I am the one who holds the reins. I am the Mother of all beings. I am the Creator, the Preserver and the Destroyer.
Baba continues “One who concentrates on me, for him nothing is difficult. But the moment he forgets me, Maya will attack him. Whatever is perceived is my image only, whether it is a worm, an ant, a poor wretch or a king”.

If one wishes to surrender at the feet of the Guru, one should sing the praises of the Guru or recite the life-story of the Guru or listen to the tales about him with devotion. We need to have utmost devotion so that the Supreme Energy will appear before us and the mind will be elevated. Even we are engrossed in worldly affairs and if we hear the tales of a saint, without making the slightest efforts, they will still do better because such is their nature. Then if they are listened to with faith and devotion, how much good can be gained.

The devotion to the Guru’s feet is enough and no other rites or rituals are necessary. The Supreme Good will be attained by doing so. Once the mind is disciplined in this way, the longing to listen to the stories will increase. The bonds of sense objects will easily break away and extreme happiness will pervade.  



Sri Sainathaarpanamastu!  

Wednesday, October 11, 2017

శ్రీ సాయి సత్చరిత - అధ్యాయం 2



మనం మొదటి అధ్యాయంలో హేమద్పంత్ గారికి సత్చరిత రాయాలని ప్రేరణ ఎలా కలిగిందో చెప్పుకున్నాము. ఇక రెండో అధ్యాయంలో ఆయన ఈ సంకల్పాన్ని శ్యామా ద్వారా ఎలా బయట పెట్టి సాయి ఆశీర్వాదాన్ని పొందారు. తనలో కలిగిన సందేహయాలు, సందిగ్తత బాబా ఎలా పోగొట్టారు, ఆయనకు హేమాడపంత్ అనే పేరు ఎలా వచ్చింది? ఇంకా గురువు యొక్క ఆవశ్యకత అనే అంశాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. 

హేమద్పంత్ బాబా లీలలను ఒక చోట గ్రంధంగా సంకలనం చేస్తే సాయి భక్తులకు మేలుచేస్తుందని భావించారు. కాని తనలో ఒకరకమైన భయం, సరిగ్గా రాయగలనో లేదో అన్న సందిగ్ధం. అప్పటికే బాబా గురించి కొంతమంది వ్రాయడం జరిగింది. దాసగణు మహారాజ్, శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ మరియు అమీదాస్ భావాన్ని మెహతా ఇలా చాలా మంది బాబా గురించి వ్రాసారు. మహానుభావుల చరిత్రలు వ్రాయాలి అంటే సామాన్యమైన విషయం కాదు. కాని వారి లీలలు ఎన్ని సార్లు, ఎంతమంది రాసినా ఇంకా చదువుకోవచ్చు. సాయి లీలలు నీతిని బోధిస్తాయి. శాంతిని కలుగచేస్తాయి. మన మనోభీష్టాలు నెరవేరుస్తాయి. ఇహపరములకు కావాల్సిన జ్ఞాన బుద్ధిని ప్రసాదిస్తాయి. ఇంకా ఎదిగిన సాధకులకు బ్రహ్మైక్య జ్ఞానాన్ని, అష్టాంగ యోగ ప్రావీణ్యాన్ని మరియు ధ్యానానందాన్ని అనుభవపూర్వకంగా కలుగచేస్తాయి. 

హేమద్పంత్ గారు శ్యామా ద్వారా బాబాకు సత్చరిత వ్రాయాలనే సంకల్పాన్ని తెలియచేస్తే బాబా తన ఆశీస్సులను అందచేశారు. తనలో ఉన్న సందేహాలు, అనుమానాలు పోగొట్టారు. అందుకే బాబా ఇలా చెప్పారు. "నేను వ్రాస్తున్నాను అన్న భావనను వదిలి, అహంకారాన్ని పక్కకు పెట్టి, అందరి దగ్గరనుంచి విషయాలను సేకరించి ఈ కార్యానికి పూనుకుంటే, నా చరిత నేనే వ్రాసుకుంటాను. ఈ కథలు చదివిన వారికి భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమను బ్రహ్మానందమును పొందెదరు" అని బాబా చెప్పారు. 

మనం భగవత్కార్యాలలో లేదా ఏ మంచి పని అయినా చేసేటప్పుడు మనలో బాగా చేయాలి అన్న తపన సహజంగా ఉంటుంది. అది మంచిదే. కాని నేను చేస్తున్నాను, నేను లేకపోతె ఈ పనులు సరిగ్గా జరగవు అన్న భావన కొంతమందిని వేధిస్తుంది. మనలో సాయి మీద భక్తి ఉండచ్చు కాని ఈ భావన మనలను పూర్తిగా భక్తి పారవశ్యాన్ని పొందనివ్వదు. మనం పూర్తిగా సాయిని నమ్మితే ఆయనే అవన్నీ చేయించుకుంటారు అన్న సత్యం బోధపడుతుంది. అప్పుడు మన పని మనం నిశ్చింతగా చేయగలుతాము. ఇక్కడ నేను చేస్తున్నాను అన్న భావన ఉండదు. అలానే మనం మన కుటుంబ వ్యవహారాల్లో కూడా ఈ సమర్పణ భావాన్ని మర్చిపోతాము. బాబా ఎప్పుడు మనతో ఉన్నాడు అని మనం నమ్మితే ఈ అహంభావన మనలను మానసిక సంఘర్షణకు గురి చేయదు. అప్పుడు మన బాధ్యతను మనం చక్కగా నిర్వర్తించగలుగుతాము. నేను లేకపోతె నా వాళ్ళు ఎలా బతుకుతారో అన్న ఆలోచన చాలామందిని వేధిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలుసు. మన తాతలు లేకుండా మన తల్లితండ్రులు బతికారు. అలానే రేపు రాబోయే తరం కూడా. మనం పుట్టకు ముందు ఈ ప్రపంచం ఉంది, మనం పోయిన తరువాత సాగిపోతుంది. ఇక్కడ బాధ్యతలు మాత్రమే ముఖ్యం. అందుకే ఈ రెండో అధ్యాయంలో నేను అన్న భావన గురించి తెలుసుకోమని చెప్పి, అది మనలను ఎంతవరకు ఇబ్బంది పెడుతుందో తెలుసుకుంటే అప్పుడు అంతా సాయి మయమే అవుతుంది. 

తరువాత హేమద్పంత్ బాబాను ఎలా కలిశారో చెప్పుకుందాము. హేమద్పంత్ గారి అసలు పేరు అన్నా సాహెబ్ దాభోల్కర్. ఆయనను షిర్డీ వెళ్ళమని సాయిని కలవమని నానా చాందోర్కర్ చాలాసార్లు చెప్పడం జరిగింది. చివరికి నానా హేమద్పంత్ గారిని కలిసి గట్టిగా వెళ్ళమని చెప్తారు. అప్పుడు ఆయన షిర్డీవచ్చి బాబాను దర్శించుకుంటారు. ఆయనలో ఈ సందేహాలు, తన స్నేహితుడి కుమారుడ్ని ఒక గురువు రక్షించలేదు అనే భావన ఆయనను అలా ఆలోచింప చేసినవి. మనం కూడా ఒక్కొక్కసారి బాబాకు మానసికంగా దూరం అవుతాము.  సంసార సంబంధ విషయాలలో పడి తీరికలేనంతగా అవుతాము. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. బాబా మీద బాగా నమ్మకం ఉన్న వాళ్లతో మెలగాలి. ఒక వేళ మనం దారి తప్పినా నానా లాంటి భక్తులు మన జీవితంలో ఉంటే, వాళ్ళ ద్వారా బాబా మనలను దారిలో పెడతారు.  

వాగ్వివాదాలు వద్దు అని, ఎప్పుడు మనం చెప్పినదే జరగాలి అని, మనం చెప్పేదే సరి అయినది అనే భావనను వదలమన్నారు.  అలా అని మంచిమాటలు చెప్పద్దు అని కాదు. వాదం మంచిది కాదు అని మాత్రమే చెప్పారు.  అందుకే హేమద్పంత్ అనే పేరు నాకు పెట్టారు అని ఆయన భావించి ఇంక ఎప్పుడు బాబా చెప్పిన విధంగానే ఉండాలి. ఈ పేరే ఆ విషయాన్ని నాకు గుర్తు చేస్తుంది అని ఆయన వ్రాసుకున్నారు. గురువు యొక్క ఆవశ్యకతను చివరిగా ఈ అధ్యాయంలో చెప్పారు. 

మనం ఎన్నో జన్మలనుంచి ఈ పుట్టటం, పెళ్లిళ్లు చేసికోవడం, పిల్లల్ని పెంచడం, ముసలి తనంతో బాధపడటం చివరికి ఈ శరీరాన్ని వదిలివేయడం అనే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ఇలా ఎందుకు అనే ప్రశ్న మనలో ఉదయింపచేసే వారే గురువు. గురువు అనే మార్గదర్శి ఎంత అవసరమో బాబా ఈ అధ్యాయంలో చెప్పారు. హేమద్పంత్ గారి జీవితంలో సాయిని మొట్టమొదట కలిసినప్పుడు ఆయనలో కలిగిన భావనలను ఇలా తెలిపారు. 

నేను ధన్యుణ్ణి అయ్యాను. నా నయనాలు సజలమయ్యాయి. దృష్టి నిశ్చలమైనది. నా ఆకలి దప్పులు హరించుకుపోయాయి. ఎవరైతే నాకు సాయి దర్శనం  కలిగించారో వారే నాకు ఆప్తులు. వారి కంటే నాకు దగ్గర బంధువులు లేరు. సాయి దర్శన భాగ్యముతో కాకి వంటి నేను సాయి చరణ మానస సరోవరంలో హంసను అయ్యాను. ఈ సాయి ఒక్కరు మనసులోకి ప్రవేశిస్తే సకల సృష్టి సాయిమయం అని అనిపిస్తుంది అని ఏంతో చక్కగా అభివర్ణించారు. 

సాయి భక్తులారా! సాయిని గురువుగా మన జీవితంలో ప్రవేశించమని వేడుకుందాము. ఆయనను గురువుగా కొలుద్దాము. ఆయన గురువుగా మన జీవితంలో ఉంటే, ఇంకా దేని గురించిన చింతన మనకు అక్కర లేదు. ఆయనే మనలను ముందుకు నడిపిస్తారు. అప్పుడు మనలోనే ఒక సత్చరిత వ్యక్తం అవుతుంది. 

సద్గురు శ్రీ సాయినాధార్పణమస్తు!

Sri Sai Satcharita - Chapter -2



We have heard in the first chapter how Hemadpanth was inspired to write about Baba's miracles in a book form. Now we are going to talk about how he got blessings of Baba to proceed and how he cleared his ambiguity and doubt. How Baba gave him the name Hemadpanth. Finally why Guru is essential in our lives. 

Hemadpanth felt it will be great to put all the stories in one place in the form of a book especially for Sai devotees.  But he had some kind of fear, doubt in his mind that whether he can write such a book or not. Already some people wrote about Baba here and there. Dasaganu Maharaj, Smt. Savitribai Raghunath Tendulkar and Amidas Bhavani Mehta already wrote a little bit about Baba. But there was no comprehensive account of Baba's leelas. Mainly his dilemma was writing about a great Guru like Baba and how can he understand his life? So he decided to talk to Syama who put this desire in front of Baba. Then Baba gave his blessings to Hemadpanth. Baba said " Make a good collection of stories, episodes and experiences. I shall write my story my self. I should fulfill the devotees wishes myself. When the ego diminishes and finally disappears, then I will dwell in him and I will write with my own hands. If you listen to my stories, recite them and meditate upon them, devotion for me arise and ignorance will be completely destroyed. If there is devotion and full faith there comes heavenly bliss and utmost happiness. The devotees shall get self realization". Such is the reassurance of Baba in his own words. Let us see how we can apply this in our life.

When ever we are participating in good deeds and worldly affairs, we tend to over involve ourselves at times. This could be working in temples or some volunteering work where we get carried away and we want to have our own stamp on every task that we perform. We may not like what others suggest or propose. But we tend to forget that we are involved in a noble thing. If we can put a side our ego, then we will definitely be blessed by God. Even in our daily life, we want to take care of everything in our loved ones lives and we feel it is difficult for them to survive with out us. But so many generations passed and life goes on. This is what Baba was suggesting to Hemadpanth to let his ego set a side prior to writing Satcharita. If we really trust Sai, what is there to worry about? If we are worried means we need to improve our faith. All we have to do is fulfill our duties in the society and leave rest to Baba. If we can do this, then everything in this world is filled with Sai energy. 


Hemadpanth's real name is Anna Saheb Daabolkar. He was friends with Nana Chandorkar and Kaka Deekshith. Nana told him to visit Shirdi and to see Baba. But Hemadpanth was preoccupied with other worldly issues. He had a close friend whose son died in his early age and his Guru could not save him. This was the dilemma Hemadpanth had and felt What good is if I pursue a Guru? One day Nana happened to be near his home and saw him. He insisted that he should go and visit Baba. Then One day he visits Baba and realizes the bliss that he missed. He wrote beautifully his first experience with Baba. He says " I had never seen such a revered personality. I lost my hunger and thirst and my senses stood still. I achieved highest plenitude of my life. A new life began thence. Every fibre of my being was filled with joy. I felt who ever is close to Sai are my real kith and kin. Beyond them there are no close relations. Memories of past deeds disappear and dislike developed for worldly pleasures. He is the destroyer of sins, difficulties and miseries. By sai's darshan and touching his feet, he transformed me from a crow to a Swan in Sai Maanasa Sarovar. 

Finally in this chapter Hemadpanth talks about how the unnecessary arguments are not good for us and how they make our minds diluted with poison. He realized the importance of having a Guru in everybody's life. He understood that he needs a guru in his life and has to put a aside his ego. The name Hemadpanth reminded him this through out his life.  We took so many births, got married several times, raised kids in every life, and suffered through old age and illness. We left this body several times and the cycle continues. We are addicted to suffering by not realizing the truth. This truth is revealed to us only by Guru. By worshiping God, we will get Guru. Guru then will show us God. 

Sai Bandhus, let us invite Sai as Guru into our lives and every time ask him to fulfill this wish. Then there will be no fear and he will take care of us in every birth. He will make us cross this Birth Death cycle to attain Moksha - Salvation. 



SADGURU SRI SAINATHAARPANAMASTHU!








Wednesday, October 4, 2017

శ్రీ సాయి సత్చరిత- మొదటి అధ్యాయము - ప్రేరణ

    

శ్రీ సాయి గురువరేణ్యులను పరబ్రహ్మగా, సర్వ దేవతా స్వరూపంగా ప్రణామాలు చేయుచు వారి చూపించిన మార్గంలో నడిచే శక్తిని మనందరికి ప్రసాదించమని వేడుకుందాము. వారు చూపించిన మార్గంలో నడవాలి అంటే మొట్ట మొదట వారు చూపించిన దారి ఏమిటి అనే విషయం అర్ధం చేసుకోవాలి. వారినుంచి మనం పొందవలిసిన అసలైన, శాశ్వతమైన సత్యం ఏమిటో తెలుసుకోవాలి. సాయి చరితకు సత్చరిత అనే పేరే ఎందుకు? వేరే పేరు పెట్టి ఉండచ్చు కదా. పేరులోనే ఈ సత్యం ఉంది. సాయి ఈ గ్రంధం ద్వారా సత్యాన్ని మాత్రమే బోధించారు. సత్యాన్ని చెప్పే గ్రంధం కాబట్టి ఇది శ్రీ సాయి సత్చరితగా బాబా మనకు ఇచ్చారు. మనం మన కోరికల కోసం పారాయణ చేసినా చివరికి సత్యాన్ని బోధించే గ్రంధం ఈ గ్రంధరాజం. బాబా అప్పట్లో గురు చరిత్ర చదవమని కొంతమందిని ప్రోత్సహించేవారు. ఎందుకంటే పరమగురువుల గురించి తెలుసుకుంటే మనకు సత్యం ఏమిటో బోధపడుతుంది.

సాయి ఎవరు? ఆయన దేవుడా! గురువా! ముస్లిం మతస్తులు భావించే ఒక పీరా!

 అసలు వారెవరో, వారు అందరిలాగా పుట్టి పెరిగారా! అనే విషయాలు ఎప్పుడు మాట్లాడలేదు. మనకు ఎందరో మహానుభావులు ఉన్నారు. వారి జీవిత చరిత్రలు మనం చదువుతాము. సాయి విషయంలో మాత్రం పుట్టు పూర్వోత్తరాలు ఉండవు. ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎన్నో భావనలు మనం చూస్తాము. ఒక్కొక మతం వారి వారి ఆలోచన పరిధిలో భగవంతుడు ఇలా ఉంటాడు, మనం ఇలా ఆరాధిస్తే ఆ భగవంతుడిని చేరుకుంటాము అనే విషయాలను చెప్పారు. ఏ మతం సరిఅయినది? ఏ దారి మనలను భగవంతుడి దగ్గరకు తీసుకుపోతుంది? అనే ప్రశ్నలు మనలను వేధిస్తూ ఉంటాయి. ఒక్కొక్క గురువు ఒక్కో మార్గం చెప్పారు. అప్పడు మనం ఏమి  చేయాలి? ఏ మార్గం ఎంచుకోవాలి? ఆ మార్గం ఎదో మనకు ఎలా తెలుస్తుంది? 

భగవంతుడు మాత్రం ఒక మార్గానికె పరిమితం కాదు, అన్ని దారులు మనలను భగవంతుడివైపే నడిపిస్తాయి అన్న సత్యాన్ని, అన్ని మతాల సారం ఒక్కటే అన్న నిజాన్ని జీవితంలో ఆచరించి చూపించారు బాబా.   మనం ఆ భగవత్ తత్వానికి ఎలా దగ్గర అవుతాము? అది ఎలా ఒక లీలా మాత్రంగా జరుగుతుంది అనే సంఘటనలను శ్రీ సాయి సత్చరితలో మొట్ట మొదటి అధ్యాయంలోనే చూపించారు బాబా. ఒక్కొక్క భక్తుడు బాబాకు ఎలా దగ్గర అవ్వటం జరుగుతుందో ఊహించుకుంటేనే పరవశం కలుగుతుంది. బాబా నా వారే, నా కోసమే బాబా ఇవన్నీ చేస్తారు అన్న నమ్మకం సాయి భక్తులను ముందుకు నడిపిస్తుంది. 

హేమాద్పంత్ మొట్టమొదటగా సాయి సత్చరిత ప్రారంభిస్తూ సర్వ దేవతలకు నమస్కరిస్తూ, శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు, సమర్ధ సద్గురువులనియు, వారు మనలను సంసారమును నదిని దాటించ గల పరమగురువులని కొనియాడిరి. 1910 సంవత్సరంలో బాబా కలరా వ్యాధిని తరిమికొట్టేందుకు గోధుమలు తిరుగలిలో వేసి పిండి చేసి, ఆ పిండిని గ్రామం నలుమూలల చల్లమని అక్కడకు వచ్చిన స్త్రీలకు సెలవిచ్చారు. ఈ వింతైన దృశ్యం చూసి తనకు బాబా గురించి ఒక గ్రంధం రాయాలి అనే సంకల్పం కలిగింది అని హేమద్ పంత్ చెప్పారు. ఈ గోధుమ పిండికి ఈ గ్రంధానికి ఉన్న సంబంధం ఏమిటి? రచయితకు ఈ ఘట్టం ద్వారానే ఎందుకు ప్రేరణ కలిగింది? 

బాబా ఎప్పుడు తిరుగలి విసురుతూనే ఉంటారు. కాని అందులో పిండి చేయబడేది గోధుమలు కావు, మన పాపములు మాత్రమే. బాబా గోధుమలు విసురుతున్నప్పుడు వనితలు వచ్చి గోధుమ పిండిని నాలుగు భాగాలుగా చేసి తీసుకువెళ్ళడానికి పధకం వేశారు. ఈ నాలుగు భాగాలు మన అంతఃకరణం (మనస్సు, చిత్తం, బుద్ధి మరియు అహంకారము). వీటిలోనే మన వాసనలన్ని దాగివుంటాయి. వాటిని ఒక గురువు సాయంతో వదిలించుకున్నప్పుడు మాత్రమే జ్ఞానబీజం మొలకెత్తుతుంది. ఊరి బయట ఈ పిండిని చల్లడం అంటే బయట విషయాలు మన మనోబుద్దులలో ప్రవేశించకుండా మన దృష్టి మనలో ఉన్న భగవంతునిపై తిరగాలి. ఇదే నిజమైన ఆధ్యాత్మిక సాధన. దీన్ని మించిన సత్యం ఇంకొకటి లేదు. అందుకే ఈ గ్రంధం సత్చరితగా పిలువబడింది. కర్మ భక్తి జ్ఞాన మార్గాలను ఏకం చేసి, అంతఃకరణ సుద్ధి జరిగే ఉపాయాలను చెప్తూ, జీవితం ఎలా ఉండాలో, ఏ మార్పులు అవసరమో, ఎలా నడుచుకోవాలో అన్న ప్రక్రియలను చూపించే గ్రంధమే శ్రీ సాయి సత్చరిత. 

సాయి బంధువులారా! శ్రీ సాయి సత్చరితను మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని, బాబా చూపించిన దారిలో నడుద్దాము.  ప్రతి ఒక్కరి జీవితంలో గురువుయొక్క ఆగమనం విశేషంగా ఉంటుంది. అది ఎలా జరుగుతుందో ఊహించుకుంటేనే సంభ్రమ ఆశ్యర్యాలు కలుగుతాయి. అందుకే సాయి భక్తులారా అంతఃకరణాన్ని సాయికి సమర్పించండి, శ్రద్ద సభూరి అనే మంత్రాలను నిత్యం జపం చేయండి. అప్పుడు మనలోనే ఉన్న సత్యం సత్చరిత రూపంలో వ్యక్తం అవుతుంది. ఇదే సాయి మన నుంచి కోరుకునే నిజమైన సమర్పణ. 



సద్గురు శ్రీ సాయినాధార్పణమస్తు!





Sri Sai Satcharita - Chapter 1-Grinding our impressions



Let us prostrate to our parama Guru who is the supreme soul and who is the embodiment of all the great qualities of divinity. We will make every effort to walk the path that Sai showed and ask Sai to give us the strength to do so. First we need to understand the Sai's path and then only we can follow that path. What is really the truth that needs to be experienced and Why the name Satcharita? Satcharita means the story of truth.  That's why Sai gave us this great scripture. Even we tend to read this for materialistic gains but in the end it will make us realize the truth. Baba used to encourage his devotees to read Guru Charitra at that time so that they can realize the truth.  

Who really Sai is? Is he God or Teacher? Is he a peer who Muslims worship? 

 Sai never talked about his birth or his greatness. We might have read the biographies of great saints but we do not talk about his biography. His main focus was to make us walk towards the ultimate truth. There could be so many religions in this world and they have their expression of God.  They might have showed us different paths but which is the right way.  How do we decide which is the right path? 

God is not limited to just one path and all the paths lead us towards God. The essence of truth is same no matter which religion and what ever the teaching might be. Baba showed this truth by living. Sai Satcharita shows this truth through routine incidents of life in the first chapter itself. This is all seen as miracles of Sai but through his devotees. We can not even imagine how these incidents take place and how we meet our Guru. Every devotee feels special and thinks that Sai belongs to them.  

When Hemadpanth started the Sri Sai Satcharita he praised Sai as the embodiment of all the Gods and beyond all the three qualities. He is the only who can lead his devotees through sea of life. When he was visiting Shirdi in 1910, he saw Baba trying to grind wheat so that he can use this flour to spread in the outskirts of the village.By watching this special circumstance, Hemandpanth had the urge to write about Baba. What is the relation between the wheat flour and him writing Sai Satcharita?   

Satcharita Says Baba always was grinding the handmill but trying to grind our sins. When he was grinding wheat there were some ladies who took over the grinding job and wanted to share the flour. They divided the flour into 4 parts. These four parts are nothing but Mind, Chitta, Buddhi and Ego. All the impressions are hidden in this faculty of mind. Only a Guru can plant a seed of wisdom. When this flour was asked to be spread in the out skirts of the village, baba is reminding that we can not let the outward objects other than God should enter into our psyche. Our mind should be turned inward not outwards. This is the real yoga. That's why this great book is called Satcharita as it shows the real path to reach God by shunning the mind. Sri Sai Satcharita shows us how to purify our inner mind by using Karma, Bhakti and Jnaana yogas. This will also show us how to live our lives effectively.  

Sai Bandhus, let us make the Sai Satcharita a part of our life and walk the walk. It is so amazing to watch how this miracle happens in every one's life and to make this happen we have to offer our heart to Sai. We have to internalize Sraddha and Sabhuri. Then the truth will reveal itself from inside us. This is what Sai wants us do and surrender with heart full of love. 
  




Sadguru Sri Sainathaarpanamastu!