In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, March 30, 2016

ఉపాసని బాబా- 3



Play Audio




కాశీనాధ్‌కి సాయి బోధ 
సాయి చాలామంది భక్తులకు తన సర్వంతర్యామి తత్వాన్ని భోదించారు. అలానే కాశీనాధ్‌కి కూడా తెలియచెప్పారు. ఒక రోజు బాబా కాశీనాధ్‌తో నేను ఖండోబా ఆలయంకు వస్తాను. నాకు ప్రసాదం పెట్టు అన్నారు.

              కాశీనాధ్ వంట చేసి, ఆహారం తయారు చేస్తుండగా ఒక నల్లటి కుక్క ఆ ఆహారం చూస్తూ నిలబడింది. కాశీనాధ్ ఆ ప్రసాదం తీసుకుని ద్వారకామాయి దగ్గరకు వస్తున్నా, ఆ కుక్క తన వెంబడే వస్తూ ఉంటుంది. ద్వారకామాయి చేరిన తర్వాత బాబాకు ప్రసాదం సమర్పించగా బాబా ఇంత దూరం ఎందుకు వచ్చావు నేను నీ దగ్గరకు వచ్చాను కదా అంటారు. నాకు నువ్వు ప్రసాదం ఇవ్వలేదు.

కాశీనాధ్ : మీరు నాకు కనబడలేదు. ఒక నల్ల కుక్క తప్ప ఇంకెవరు లేరు.
బాబా:   ఆ నల్ల కుక్కను నేనే.

ఇలా బాబా చెప్పగా కాశీనాధ్ ఈ సారి ఈ తప్పు చేయకూడదు అనుకుంటాడు.
మరొకసారి వంట వండుతూ ఉంటే ఒక అంటరాని వాడు వచ్చి ఆహారాన్ని చూస్తూ ఉంటాడు. ఆ ప్రసాదానికి దిష్టి తగులుతుంది అని అతనిని వెళ్ళమని కాశీనాధ్ హెచ్చరిస్తాడు. అప్పుడు అతడు వెళ్ళి పోతాడు. తరువాత బాబా దగ్గరకు వెళ్ళగా సాయి కోపంతో నువ్వు నాకు ప్రసాదం ఇవ్వలేదు నీ దగ్గరకు నేను వచ్చాను అంటారు.

కాశీనాధ్: ఎక్కడ బాబా! నువ్వు రాలేదు
బాబా: నేను వచ్చాను
కాశీనాధ్ : అయితే నువ్వు ఆ అంటరాని వాడి  రూపంలో వచ్చావు. నేను అజ్ఞానంతో నిన్ను గుర్తించలేదు.

ఇలా సాయి కాశీనాధ్‌లో మార్పులు తీసుకువచ్చి, ఈ ద్వైత భావనలకు స్వస్తి పలికించారు. సకల సృష్టిలో నేనున్నాను అని నిరూపించి బాబా తన భక్తులలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేస్తారు.
  
కాశీనాధ్-ఉపాసని మహారాజ్‌గా అవతరణ
ఇలా కాశీనాధ్ ఖండోబా ఆలయంలో మూడు సంవత్సరాలకి పైగా ఉంటారు. ఆ ఆలయంలో పాములు తిరుగుతూ ఉండేయి అయినా కాశీనాధ్ అక్కడే పడుకుని ఎంతో దీక్షతో తన సాధనను సాగిస్తారు. ఇంతలో తను మూడో భార్య కూడా చనిపోయిందని వార్త. 1912లో అందుతుంది. ఇప్పుడు ఉపాసనికి ఇక ఏ బందం లేదు. ఆయన ఒక గోనె సంచి మాత్రం నడుముకి చుట్టుకునేవారు.

ఒక రోజు బాబా చంద్రబాయి అనే ఆమెను కాశీనాధ్ దగ్గరకు పంపించి నన్ను పూజించినట్లే కాశీనాధ్‌ని పూజించు అని చెప్తారు. ఆమె వెళ్ళి కాశీనాధ్‌ని పూజించాలని సంకల్పం చేయగా కాశీనాధ్ అడ్డు చెప్తారు. కాని తరువాత బాబా ఆజ్ఞను పాటించారు.  బాబా ఆయనను సద్గురు ఉపాసని మహారాజ్‌గా మారుస్తారు.

షిర్డి నుంచి పయనం
తరువాత బాబా చాలా మంది భక్తులను ఉపాసని మహారాజ్ దగ్గరకు పంపిస్తూ ఉంటారు. 1914లో ఉపాసని మహారాజ్ షిర్డి నుంచి బయలుదేరి సింది మరియు నాగపూర్‌లకు వెళ్తారు. 1911 తర్వాత షిర్డి నుంచి వెళ్ళడం అదే మొదటిసారి. తనకు జనసందోహాలతో ఉండటం ఇష్టంలేక పోయినా జనం మాత్రం తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఆయన భిక్షను స్వీకరిస్తూ ఒక సన్యాసి లాగా జీవిస్తారు. అప్పట్లో కులమతాలు పెద్ద అడ్డుగోడలుగా ఉండేవి. ఆయన దీన్ని వ్యతిరేకిస్తూ 1915 ఫిబ్రవరి నెలలో ఒక అంటరాని వాని ఇంటిలో బస చేస్తారు. బాగా డబ్బున్న వారు పై కులాల వారు సైతం ఆ అంటరాని వాడింటికి రావలసి వస్తుంది. అయినా జన సందోహం ఆగదు. తరువాత కొన్ని రోజులకు ఉపాసని మహారాజ్ షిర్డికి తిరిగి వస్తారు. మరల ఖండోబా ఆలయంలో ఉంటారు. ఆయన ఎక్కడ ఉన్నా బాబా ఆయనలోనే ఉన్నారు. ఇప్పుడు ఖండోబా ఆలయం పరిస్థితి మారిపోతుంది. చాలా మంది భక్తులు రావడం మొదలు పెడ్తారు. తరువాత ఆయన సకోరి అనే గ్రామంలో తన నివాసం ఏర్పాటు చేసుకుంటారు. బాబా అక్కడకు కూడా భక్తులను వెళ్ళమని ఆదేశించేవారు.

 మత్తు లేకుండా శస్త్ర చికిత్స
ఉపాసని మహారాజ్ గారు ఒకసారి సింధి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయనను మొల్లలు ఇబ్బంది పెడతాయి. దానికి శస్త్రచికిత్స అవసరం అని వైద్యులు చెప్తారు. వాటిని బయటకు లాగి తీసివేయాలి. మహారాజ్ వైద్యులను మత్తులేకుండానే శస్త్ర చికిత్స చేయమంటారు. వైద్యులు అట్లానే చేస్తారు. ఆయన మనో నిగ్రహాన్ని చూసి వారు ఆశ్చర్యపడతారు. ఇలా ఉపాసని మహారాజ్ తన శక్తి చేత ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తారు. ఆయన ఒక సిద్ధ గురువుగా అందరిచేత పూజింపబడ్డారు. ఆయన తన దగ్గరకు వచ్చిన భక్తుల మనస్సులలో ఏముందో తెలుసుకుని వారిని అనుగ్రహించేవారు.

సకోరి ఆశ్రమం
ఉపాసని మహారాజ్ అన్ని ప్రదేశాలు తిరిగి చివరకు సకొరి అనే గ్రామంలో తన ఆశ్రమాన్ని స్థాపించారు. సకోరి గ్రామం షిర్డికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆయన జూలై 1917లో సకోరిలో ఉంటారు. సాయి 1918లో
తన శరీరాన్ని వదిలినప్పుడు ఉపాసని మహారాజ్ దగ్గర ఉండి అంత్యక్రియలు జరిపించారు. ఆయన 1921 లో తన భక్తుల కోసం ఒక వెదురు కర్ర బోనులో 13నెలలు ఉంటారు. ఆ బోనులో ఎటూ కదిలేందుకు వీలుగా ఉండదు. అక్కడ నుంచే రోజూ సత్సంగ్ చెప్పేవారు. జనవరి 31న 1924లో ఆ బోను నుండి బయటకు వస్తారు. ఆయన ఒక బాలికను అనుగ్రహించేందుకు బయటకు వచ్చారు. ఆ బాలిక పేరు గోదావరి వాసుదేవ్ హట వాలికర్. ఆమె తర్వాత గోదావరి మాతగా ఉపాసని మహారాజ్ గారి శిష్యురాలై ఆశ్రమ భాద్యతలు వహించేది.

              ఆయన ముఖ్యశిష్యుడైన మెహర్‌బాబా, ఉపాసని మహారాజ్ యొక్క పేరును ప్రపంచానికి తెలిసేలా చేసారు. ఇలా సాయికీర్తి కూడా నలదిశలు ప్రాకింది. సకోరి ఆశ్రమం ఎంతో మంది భక్తులతో అలరాడుతూ ఉన్నది. గోదావరి మాత ఆద్వర్యంలో అది కన్యాస్థాన్‌గా ఎంతోమంది స్త్రీలకు అధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఉంది. ఉపాసని మహారాజ్ డిసెంబర్ 29, 1941 తెల్లవారు జామున తన దేహాన్ని వదిలేస్తారు. తరువాత రోజు సకోరిలోనే అంత్యక్రియలు జరుగుతాయి.


ఉపాసని మహారాజ్ సాయి కృపకు పాత్రులై సాయి చెప్పినట్లుగా ఎంతో మందికి వెలుగు చూపించారు. సాయి తనకు నిజమైన వారసులు ఉన్నట్లు ఎప్పుడు చెప్పలేదు. కాని ఉపాసని మహారాజ్ దాదాపు ఆస్థానాన్ని పొందారు.


ఓం శ్రీ సాయి రామ్ !

Monday, March 28, 2016

Sri Upasini Maharaj - Part 3


Sai’s teachings to Kasinath:
Sri Sai declared himself to be the one Iswara, the Antaryami of all and, therefore, he wanted his best pupils to realize him as their God first and next find him and feel him in every creature that they met.

To Kasinath as to most of us this was a very, very, tough lesson that all souls are one and the same, that Iswara or the Guru God was, and is, in all and was and is All. Yet Baba determined to teach, him this lesson. So, even in the first year of his probation, Baba taught him some portion of this truth.

Baba coming as a Black dog for food (Naivedyam):
 Kasinath was cooking his food at Khandoba temple, and naturally wanted to take the food to his Guru Sai Baba, and to get back the same or rather part of it as prasad from him to eat. But while he was cooking his food, a black dog was watching, and even when he took the food towards Sai's Masjid, it followed him part of the way and suddenly disappeared. When first the dog was present and anxiously looking for the food, Upasani with his orthodox ideas thought it would be absurd to give that low creature, a dog, any food before offering it to God and before men ate (for that was against orthodox ideas). So he did not give any food to that dog. But when he went in the hot sun at noon, with his food to Sai Baba, Baba asked him,  'What have you come for?' Kasinath said.  To bring you my naivedya',  'Why did you come all the way here in the sun? I was there'  Baba said. Kasinath said that there was none but a black dog there. Baba said 'I was that black dog. So, as you refused to give me food there, I am not going to take this food'. So, Upasani returned that day bitterly repenting his orthodox frame of mind refusing to give food first to the dog.

Baba coming as a low caste man for food (Naivedyam):
Next day, he was determined to avoid that mistake. So, when he was cooking his food, he looked out for the black dog but found no dog. Then, when he was proceeding with his cooking, he noticed that a sickly Sudra was leaning against a wall  and watching the cooking. To the orthodox mind of the Brahmin Kasinath, it was drishtii dosha and improper for a Sudra to look on when a Brahmin was cooking. So he said, 'Get away', and accordingly, the Sudra left.
When that day Kasinath came near Baba with his food, Baba was very angry. He said, 'Yesterday, you did not give me food, and today you told me to go away.' 'Where were you, Baba?'   asked  Kasinath.  Baba said, 'I was leaning against that wall'.  'Could it be you, that untouchable man?' Kasinath asked.  'Yes, I am in everything and beyond', said Sai.
Baba used these kinds of techniques to teach his devotees the omnipresence of God. His doctrine reveals that he exists in every living and nonliving thing. This way he eradicated the ignorance in his devotees.

Upasini emerging as Maharaj:
Kasinath was living in Khandoba temple. He was almost sleeping with snakes as there were more snakes in that area. He was fearless. He continued his penance. In this process he learns that his third wife also died. He got this news in February of 1912. Now Upasini is totally free of any close relations. He was wearing only a gunny bag wrapped around his waist.
One day Baba sent a lady by name Chandrabai to worship Upasini as she worships Baba. She followed the direction of Baba and came to Khandoba temple. Kasinath does not appreciate this. But she insisted saying this is Baba’s order. From that day onwards Baba made him a Sadguru. Baba started sending the crowds to Upasini Maharaj.

Upasini Maharaj leaving Shirdi:
Sai Baba would now send His devotees to Shri Sadguru Upasni Maharaj for darshan. In 1914 Shri Upasi Maharaj left Shirdi for the first time after several years and traveled to Sindi and Nagpur. Here also He would beg for food and live away from cleanliness and comforts. People started visiting Him to pay homage and would worship Him.

Upasini Maharaj’s stay in a poor man’s (low cast) house:
The Hindu social life of 1915 was full of the feelings of cast and creed barriers. To end this barrier of castism, in February 1915, Shri Upasni Maharaj moved to a poor man Namdeo Mahar's house in Kharagpur. Maharaj belonging to a high brahmin caste voluntarily stayed in a cow stable, and ate food in the house of Namdeo who belonged to a lower and untouchable class. The high caste disciples of Maharaj were forced to come to Namdeo Mahar's house to seek Maharaj's blessing, and be prepared to receive a warm welcome by Namdeo.

Return to Shirdi and moving to Sakori:
After some time Maharaj went to Nagpur and then returned to Shirdi to inhabit once again Khandoba's temple. But the atmosphere at the temple was different this time, as devotees began to gather in larger numbers, and happy times began. The seeker, who lived a life of hard penance at this temple, was now a Master. The beggar of truth was now the King.

Gradually it became customary for those who came for Sai Baba's darshan, to also visit the Khandoba temple and meet Upasni Maharaj. Even Baba would ask some of the disciples to go to Sakori, and Maharaj was now being known as His spiritual heir. It so happened one day that a Swami came to meet Sai Baba. This arrogant Swami considered himself next to none in spiritual knowledge. Sai Baba soon asked this Swami for a favor "Will you please go to Sakori and bring me four hundred rupees from Upasni, as I am in urgent need of money" said Sai. "It is very important", He further added. The Swami proudly walked up to Sakori, expecting a warm welcome, being an Ambassador of Sai Baba. Upasni Maharaj was as usual sitting naked under a tree when this arrogant Swami arrived, and started demanding for four hundred rupees. Upasni Maharaj got up immediately as if the matter was really urgent, and before the Swami could understand what he was going to receive so urgently, Maharaj grabbed the Swami and beat him up. The shaken Swami returned to Shirdi to find Sai Baba, smiling over the warm welcome at Sakori. Indeed the Swami had received the real blessings.

Surgery with out anesthesia:  Once Upasini Maharaj happened to go to Sindi where he had trouble with piles. The doctors suggest that they need to be cauterized otherwise they will cause lot of trouble to him. He gets ready for surgery and tells the doctors to go ahead and do surgery with out anesthesia. They were surprised to see his control of his body and mind. Te surgery was completed with out any problems. Upasini Maharaj was worshipped as a Siddha Guru by lots of people.  

Sakori ashram and Kanyasthan:
Upasini Maharaj finally settles down in Sakori after his travels to different places. Sakori is only 5 kilometers away from Shirdi. He was there in 1917 and when Sai left his mortal body in 1918, Upasini performed the last rites. He stayed in a wooden bamboo cage in 1921 for 13 months.
He used to do satsangh from the cage it self. That was so narrow and it was difficult to move even a little bit in the inside of cage. On January 31st 1924, he comes out of it to welcome  a girl by name Godavari vasudev Hatawalikar. Later she will be known as Godavari maa.
Sri Meher Baba was one of his disciples. Meher Baba became world renowned and Upasini Maharaj’s name spread across the continent.  Kanyasthan became spiritual center for so many people. Lots of people were visiting the place. 

On December 29th 1941, Upasini Maharaj left his mortal body. Next day all the last rites were performed. Upasini Maharaj was blessed by Sai and as Baba predicted, Upasini Maharaj showed the path to so many people. 


OM SAI RAM  

Wednesday, March 23, 2016

ఉపాసని బాబా- 2



Play Audio

       
      

ఉపాసనిబాబా షిర్డికి వచ్చి బాబాను కలిసిన తర్వాత తన శ్వాస మామూలు స్థితికి వస్తుంది. చాలా రోజుల తర్వాత ఉపాసని బాబా పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. ఒక రోజు గడిచిన తర్వాత బాబా దగ్గరకు వెళ్ళి సెలవు అడుగుతాడు. అప్పుడు బాబా ఇంత తొందరగానా! నువ్వు ఎప్పుడు తిరిగివస్తావు? అని అడుగుతారు. అప్పుడు కాశినాథ్ (అంటే మన ఉపాసనిబాబా) తనింక వెనుకకు రాను అని చెప్తారు.అప్పుడు బాబా నువ్వు ఇక్కడ ఉంటే మంచిది లేదా ఎనిమిది రోజుల్లో తిరిగివస్తావు అని చెప్తారు. బాబా శక్తిని అర్ధం చేసుకున్నవారు అయితే షిర్డి విడిచి వెళ్ళరు. కాని ఉపాసని బాబాకు ఇంటిపై ధ్యాస ఉండటంతో దీన్ని బాబా అనుమతిగా భావించి ప్రయాణం అవుతారు. తను ఇంతవరకు గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించ లేదు. ఇంట్లో కొత్తగా పెళ్ళిచేసుకున్న భార్య ఎలాగైనా ఇంటికి చేరాలి అనుకుంటారు. కాని అన్ని అవాంతరాలే. ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండానే ఆగిపోతాడు. కోపర్‌గావ్‌లో దత్త ఆలయం దగ్గర ఒక బ్రహ్మచారి కలసి, ఉపాసనిని షిర్డి వెళ్ళవలసిందిగా కోరుతాడు. ఇంతలో కొంతమంది యాత్రికులు షిర్డి ప్రయాణంలో భాగంగా కోపర్‌గావ్‌లో ఆగుతారు. వారు ఉపాసని బాబా పై ఒత్తిడి తెచ్చి వారితో పాటుగా మరల షిర్డికి తీసుకువస్తారు. బాబాను కలిసినప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది నీవు వెళ్ళి? అని అడుగుతారు. అప్పుడు ఉపాసని "ఎనిమిది రోజులు" అని సమాధానం చెప్తారు. నేను ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళలేక పోయాను, నాకు ఏమి అర్ధం కావడం లేదు. మీరే ఏదో చేశారు. అని అంటారు. సాయి తనతో ఉండి తనపైన సమ్మోహన శక్తిని ప్రయోగించారు అని కాశీనాధుడు అర్ధం చేసుకుంటాడు. ఇక అక్కడ ఉండేందుకు నిశ్చయించి శ్యామాచేత తను ఏంచేయాలో అడిగిస్తారు.  బాబా "తను ఏమిచేయనక్కరలేదు" అని అంటారు. ఇదే బాబా విశిష్టత. ఎవరికి ఏ రకమైన సాధన అవసరమో అదే చేయించేవారు. ఇక్కడ ఉపాసని బాబా ఏమి చేయకుండా ఉండాలి అదే సాధన. ఉపాసని బాబాకు మంత్రజపమో లేదా గ్రంధపఠనం చెయ్యాలి. కాని బాబా వద్దని ఆజ్ఞ వేస్తారు.
  
బాబా కాశినాదుడ్ని ఏకాంతంగా ఉండమంటారు. ఖండోబా ఆలయంలో ఉండాలి అని ఆదేశిస్తారు. కాశినాధుడుకి సంస్కృతంలో మంచి ప్రావీణ్యం వచ్చింది. ఏదో చదవాలి అని తపన, మంత్రజపం చెయ్యాలి అన్న భావన. కాని బాబా ఈ వాసనలు ఉపాసనికి మంచివికావని వీటికి దూరంగా ఉంచుతారు. బాబా ఆయనను తన తనువు మనస్సు ధనము అర్పించవలసినదిగా కోరతారు. ఉపాసనికి తన కొత్త కాపురం మీదనే మనస్సు. బాబా ఉపాసని దగ్గర డబ్బులు లేకుండా దక్షిణ తీసుకుంటూ ఉండేవారు. ఆహారం మొదట్లో దొరికినా తరువాత ఆకలి బాధ తీరేదారులే కనబడలేదు. అయినా ఉపాసనిబాబా దిగులుచెందలేదు. బాబా ఆయనకు అంతర్ నిష్ట నేర్పెందుకు నిశ్చయించుకున్నారు. ఉపాసని బాబా జీవనం అతి భారమైంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత దీక్షిత్ ఆయనను ధీక్షిత్‌వాడాలో భోజనం చేయవలసింది అని అడిగితే కొన్ని రోజులు ఆహారం లభించింది. కాని అక్కడ కూడా ఆయన పద్ధతులు నచ్చక కొందరు శత్రువులవుతారు. ఒక రోజున అక్కడి ఉద్యోగి కాశీనాధుని రేపట్నుంచి భోజనానికి రావద్దని ఆదేశిస్తారు. ఇంతటితో ఇది కూడా దక్కకుండా పోతుంది. 3 రోజులు ఉపవాసం ఉంటారు. ఆయనకు ఇదే సమయంలో పైల్సు (మొల్లలు) వ్యాధి వచ్చి బాగా అజీర్ణం చేస్తుంది. ఇదంతా బాబాకు తెలుసుకాని బాబా మౌనం వహిస్తారు. శిష్యునకు ఇదంతా అవసరం. ఈ సాధనలో నుంచే ఉపాసనిని ఒక వజ్రంలా తయారుచేయాలి అని బాబా సంకల్పం. ఇలానే మెల్లగా శ్రద్ధ, సబూరిలను నేర్పడం కూడా బాబా ఉద్దేశ్యం.
  
కాశినాధ్‌కి బాబా ఇచ్చిన అనుభూతులు
పాపపురుషుడు
కాశినాధ్ ఒక రోజు కూర్చుని ఉండగా ఒక అనుభవం కల్గుతుంది. ఆయనకు బాబా వచ్చినట్లు, ఆయన "నీకు ఉపదేశం ఇస్తాను రా!" అని పిలుస్తారు. ఇంతలో కాశీనాధ్ లాగానే ఉన్న ఒక నల్లటి వ్యక్తి వెనుక నుంచి "ఆయన మాట వినద్దు, నా మాట విను" అని చెప్తాడు. అప్పుడు బాబా ఆ వ్యక్తిని పట్టుకుని కట్టెలపై కాల్చివేస్తారు. అప్పుడు కాశీనాధ్ "బాబా నువ్వు కాలుస్తున్నది నన్నె" అని అరుస్తాడు. బాబా అవును నిన్నే కాని నీలో ఉన్న పాపపురుషిడ్ని కాల్చేసాను అని చెప్తారు. నువ్వు ఇప్పుడు అన్ని పాపాల నుంచి విముక్తుడవు అయ్యావు, అని బాబా అంటారు.

              ఇంకోసారి కాశీనాధ్‌కి ఒక కల వస్తుంది. తను నడిచి వెళ్తూ ఉంటే ఒక పెద్ద నల్లని అగాధంలోకి ఎవరో లాగుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు కాశీనాధ్ "ఎవరు నన్ను లాగేది నన్ను వదలకపోతే సాయిబాబాకి చెప్తా" అని అనగానే కాశీనాధ్ ఆ బంధం నుంచి విముక్తుడవతాడు. ఈ అగాధమే నరకము. దాని దగ్గరకు ఎవరు వెళ్ళినా అది వాళ్ళను మింగేస్తుంది. కాని బాబా తోడు ఉంటే ఆ భక్తుడు బయపడవలసిన పనిలేదు.

బాబా దీపమివ్వడం
ఇంకోసారి కలలో బాబా కనిపించి ఒక దీపం కాశీనాధ్‌కి ఇస్తారు. దాన్ని నువ్వు తీసుకో ఇది నిన్ను రక్షిస్తుంది. నీ జీవితంలో వెలుగు నింపుతుంది. నీకు అడ్డంకులు రావు. నువ్వు వందల మందికి వెలుగును పంచుతావు అని చెప్తారు. కాశీనాధ్ ఆ దీపాన్ని తీసుకుంటాడు.

పుణ్యపురుషుడు
ఒకసారి కాశీనాధ్‌కి బాబా కలలో కనిపించి ఒక విచిత్ర ప్రదేశంకు తీసుకు వెళ్తారు. అక్కడ వెండి రూపాయలు ఒక పెద్ద కుప్పగా పోయబడి ఉంటాయి. ఆ కుప్ప 225 అడుగులు పొడవు, 120 అడుగుల వెడల్పు దాదాపు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. దాని మీద ఒక వ్యక్తి చక్కటి పాన్పు పై కూర్చుని ఉంటాడు. ఆ వ్యక్తి చక్కటి ఖరీదైన దుస్తులు ధరించి ఉంటాడు. అప్పుడు కాశీనాధ్ బాబాను చూసి బాబా ఈ వ్యక్తి ఎవరు అని అడుగుతాడు.

బాబా నువ్వు అతనిని గుర్తుపట్టలేదా, ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే. నీలో ఉన్న పాపపురుషుడు పోయి పుణ్య పురుషుడు మిగిలాడు. ఇక్కడ ఉన్న ఈ ఇళ్ళన్ని రూపాయలతో నిండి ఉన్నాయి అని చూపిస్తారు. ఈ విధంగా బాబా పాపపుణ్యాలకు అతీతమైన ఆధ్యాత్మిక సంపద మనిద్దరిది అని చెప్పడం వాటిని ఒక అనుభూతి రూపంలో చూపించడం కేవలం బాబా లాంటి పరమ గురువులకే సాధ్యం.

కాశీనాధ్‌లో ఉన్న ద్వంద్వాలను దూరంచేసి తను నేర్చుకున్న భక్తి కర్మ, జ్ఞాన సిద్దాంతాలన్ని ఏకం చేసి సరియైన మార్గంలో నడిపించేందుకు బాబా శ్రీకారం చుట్టారు.

 
ఓం శ్రీ సాయి రామ్ !

Sri Upasini Maharaj - Part 2




First meeting with Baba:
On 27th June 1911 he went to Shirdi just to pay a brief formal visit to Sai Baba. The first interview between Sri Sai Baba and Kasinath is a very interesting study of the personalities of both, and the method of operation of Sai Baba peculiar to each case. After staying a day, Kasinath went to take leave of Baba to go home.

Baba said, 'What! so soon? When are you returning?'

Kasinath protested that it was not easy for him to return,

Then Baba said, 'you had better stay. Do not go away'. Kasinath did not like both choices.

Then kasinath said “What, either to stay on forever or to go and return in eight days!"

Baba said, 'Well, go. I shall see what I can do'. 

This might appear a threat to those who knew Sai Baba's powers. But as Kasinath understood none of his powers, he simply thought permission had been given to him to go and then went away. He was anxious to get back home now that his health had been restored and have a pleasant family life with his young wife (third wife). 

Upasini trying to leave Shirdi:
He went out for few miles and stayed at a neighboring village for a bath in the Godavari. Next day he went a short distance, and again was stopped by something attractive. Like this for seven days, he was within a radius of eleven miles, and on the eighth day he was at Kopergaon with a Brahmachari at the Datta Temple on the bank of the river Godavari, i.e., only six miles from Shirdi.

Brahmachari told him to go to Shirdi and be with Sai Baba. Kasinath, however, declined to accept that proposal. As they were talking, some visitors came. They were asked by the Brahmachari, 'Where are you going?' They said, 'To Shirdi’. Then the Brahmachari said, 'Take this Kasinath with you'. Kasinath said, 'No, I have been there already'. Then the visitors said, 'That is the best reason. We have not been there. We want someone to be with us to guide us'. Kasinath said that he had not taken his meal and he had no carriage fare, and thus pleaded vain excuses. They said, 'We have the carriage fare, and we will give you food'- So, in spite of himself, out of a mere desire to oblige these visitors and to oblige the Brahmachari, he got into the cart which straightway sped on to Shirdi. There they all alighted. They all bowed before Baba.

Baba said to Kasinath, "You have come back! How many days is it since you left?' '
Kasinath said “This is the eighth day”.

'What!' Baba remarked, 'You said you would not come back in eight days'.

Then the spell over Kasinath seemed to disappear, and he woke up and said, 'What, Baba, I cannot understand this. I was eager to go home, and I wonder how I did not go back home. This must be all you’re doing’. Baba said, 'Yes. I have been with you all these eight days dogging your heels'. Then it flashed upon Kasinath that Sai Baba was (always) wielding vast powers over people's mind, that when he could not think of going home, and when the Brahmachari and others were asking him to go to Shirdi, it was all the work of Sai.

Upasini's stay at Shirdi:
So, he was under Sai's spell and that was how he could not think of his home under that spell! He was -aghast at this vast control over minds and bodies of not one but of many. Then he resigned himself to fate as he called it. He thought 'Some vast Power is seizing me. So, I must bend to it. Then he was staying on, hoping time and again to get leave of Baba to get back.
Through Shama he asked for permission. Baba said, 'let him stay on. Then Shama asked what he was to do. Baba's answer was, "To do nothing". Kasinath could not understand what he should do remaining there doing nothing. But doing nothing was only the external appearance. "Doing nothing" in Baba's parlance meant being receptive and receiving everything from him.
In Baba's Guru parampara, Sishya's work is simply nothing. The entire operation of moulding, remoulding, raising and reaching the top of the highest spiritual experience is the work of the Guru and the Guru alone. Baba asked him to go and live in solitude (as he already loved solitude) at Khandoba Temple, just outside the village, and not mix with people but to remain alone, doing nothing.

Kasinath’s learning, his mastery of Sanskrit and general information were far superior to those of the ordinary pandit. He was anxious to go on either with mantra or with study which alone he understood to be the constituents of real religion. Baba allowed him to indulge in these for a time, but these were not part of Baba's course for his pupil. Studies are hindrances, as they raise the thought in the minds of the pupil that he is learned, that he is something, and that he must understand everything put to him with his intellect and then rise with the help of that intellect and his book learning.

In Baba's course, the spiritual experience is a sort of chemical extract inherent in and constituting the spiritual body of Baba, the Guru, and is poured into the soul of the sishya which must receptively receive and absorb the same. The entire work is that of the Guru. Kasinath could not understand this, and went on with his studies especially when he met congenial spirits like G S. Khaparde, Chidambaram Pillai and others and later went on telling stories and lecturing. Anyhow Baba had given him directions, and set to work upon him in a number of ways.

The first essential preparatory step in Baba's course is not book learning, but the development of humility and receptivity. These would result from absolute faith in the Guru. The Guru must be everything to the sishya, the giver of bread, the giver of life and light and the giver of all that life is worth living for, and at one stroke. He must not regard anything else. This alone is the tyaga of Tan, Man, Dhan - body, mind and possessions. However anxious Kasinath might be to benefit from Baba's goodwill, absolute surrender of self was not there. Absolute ridding himself of all the contacts with external world was not there and no idea of giving up his family life. He was still thinking of his own home at Satana, his wife, his mother, and others. He hoped to join them after achieving progress under Baba and enjoying the result of that progress with his family. That was his idea. But that was not Baba's idea. Baba wanted him to be free from all shackles and absolutely independent of all family or other connections. Sai Baba wanted to make him feel that he was entirely dependent upon Sai and Sai alone at least during the period of probation.

Hence, Baba watched him to get into a number of difficulties for the very essentials of livelihood. Food was easy for a time to get, but very soon the food problem became the main problem of his life. At first he had some funds, and lived with the help of what he could get with this. But Baba deprived him even with these funds. Upasani Maharaj had given some dakshinas but retained Rs.10 with him thinking that he could bank upon it and live upon it till he could get further sums. But Sai Baba asked him for dakshina of Rs.10 and deprived him of his bank and reduced him to zero. Then suddenly Kasinath felt he was unsupported. That is just what Sai Baba wanted him to feel. That is, the sishya must feel that he has no earthly support barring the Guru. But no possessions or help is a very painful experience.

Later Dixit requested him to eat at Dixit wada and this also lasted only few days. Again life was difficult. He was on fast almost every day and his health deteriorates. He develops piles problem. This was bothering him but Baba kept quiet. Thus Baba was teaching him, faith and patience. Baba wanted to make him the best of his devotees. Baba's course was to give first nishta or full faith and secondly saburi or patience, to wait for the benefits of the course to be given at the time considered by the Guru to be proper. These are the two coins which Baba's own Guru wanted him to place at his (Sai Baba's Guru's) feet, and Sai Baba said he did give them to his Guru. Similarly Baba expected Kasinath to develop nishta and saburi and offer these as dakshina to him. Kasinath was slowly developing both nishta and saburi, and when these two were perfect, the seeds of instruction sown in the heart of the pupil would bear fruit.

Visions given to Upasini by Baba:

Sin bounded Upasini (Papa Purush):
As Kasinath sat up one day, he had the following visions. The first of these may be called Papa Purusha Nirasana. Baba came up to him at some mysterious place and sat up. Baba asked him to come near saying, 'I am going to give you Upadesh'.
When Kasinath was trying to approach the Guru, a dark and dirty person behind Kasinath exactly like him, that is, his replica pulled him up and said, "Don't listen to the Guru. But listen to me". Twice this interruption took place. Then Sai got up, seized that dark person behind Kasinath, took him and placed him on a pile of faggots and burnt him. All that time Kasinath was saying 'Baba, it is me whom you are burning, it is me whom you are burning'. After completely burning him out, Baba turned to Kasinath and said, 'Yes. That was you no doubt. But you were in that sin form, namely, Papa rupa. I have destroyed him. You are now free from sin. By our united efforts there are many things to be achieved in the future. How can that be done if sin remains?'

Another vision which Kasinath Maharaj had was this. As he was passing along, there was a deep dark pit. A hand came out of that pit as he stood on the brink of it, and tried to pull him down into that dark abyss. Kasinath cried, 'Hands off. Who are you? Why do you drag me? If you do not let me go, I will report to Sai Baba'. At the mention of Sai's name, his feet were released. In that very vision, he learnt that the black abyss and black hand were Hell, that Hell would seize anyone who came near, and it was a mistake to come near and tempt Hell. 

Baba offering lamp to Kasinath:
Later in another vision he was offered a lamp, and Baba told him, 'You must accept the lamp. It would light you and protect you everywhere. You will never be obstructed. You will escape obstacles, and will give light to hundreds in the future.' Kasinath accepted the light.

Kasinath’s alter ego with good deeds (Punya purush):
 Baba told him at one time, 'I will take away half of your head and give you half of my own'. Accordingly, Kasinath had a vision. Some ruffians came and cut his head off, scooped up the brain, ate the contents and ran away. Then in a later vision, Sai Baba took Maharaj to some mysterious place and showed him a heap of silver rupees, 225 feet long. 120 feet, broad, 4 feet high. Over that there was a princely bed with bolsters of lace cloth, and over all this was a richly dressed and gaily ornamented person. Sai Baba asked Kasinath to see that man. Kasinath asked, 'Who is that?' Baba said, 'Have you not recognized yourself? It is you. Your body of sin has gone. That papa purusha has gone. This is your punya purusha'. Then, pointing to all the rupees, vast hoards of rupees, Sai Baba showed him a big room full of rupees and said 'There are hundreds and thousands of such houses filled completely with rupees. All these are ours. You will come to know all this by yourself. Thus, the subconscious mind of Kasinath Maharaj was being impressed by Sai Baba with the feeling that it was cloyed and glutted with ample possession of wealth.


Baba thus took Kasinath beyond the world of duality so that he can advance in spiritual world. He gave him these experiences so that he can streamline whatever Kasinath learned in the form of scriptures. This learning could have been hindrance to his growth.


OM SAI RAM!

Wednesday, March 16, 2016

ఉపాసని బాబా- 1




Play Audio



ఉపాసని బాబా పూర్తి పేరు కాశినాధ గోవింద ఉపాసని శాస్త్రి. బాబా భక్తులలో ఉపాసని బాబాకు ఒక విశిష్ట స్థానం ఉంది. ఈయన గురించి సమాచారం సాయిలీల మాసపత్రికలో ప్రచురించబడింది. ఉపాసని బాబా ద్వారా సాయి ప్రచారం బాగా జరిగింది. ఆయనను కలవడం కోసం ప్రజలు గంటలు గంటలు నిలబడి మరీ దర్శనం చేసుకునేవారు. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలానే 1927లో మహాత్మగాంధి కూడా ఉపాసని బాబాను కలవడం జరిగింది. ఆయన ఒక సిద్ద పురుషుడిగా ఎన్నో మహిమలను చూపారు. స్త్రీ జాతికి ఆయన చేసిన మేలు ఎన్నటికి మరువరానిది. ఆడవాళ్ళకు వేదం మరియు ఆధ్యాత్మిక సంపద దక్కాలని ఆయన చేసిన కృషి అపారమైనది. శ్రీ నరసింహస్వామి గారు షిర్డి దర్శించుకునే ముందు ఉపాసన బాబా ఆశ్రమంలో చాలా రోజులు ఉన్నారు. ఆయన జీవితానికి సంబంధించి విశేషాలను చాలా రాశారు.ఉపాసని బాబా ఖ్యాతి 1920-1934 మధ్య బాగా లోకవిదితమైంది.

              ఉపాసని బాబా 1870వ సంవత్సరంలో మే 15వ తేదిన ఒక విశిష్టమైన బ్రాహ్మణ వంశంలో జన్మించారు. ఆయన తాతగారు శ్రీ గోపాలశాస్త్రి గారు అప్పట్లో బరోడా రాజు ఆస్థానంలో సలహాదారుగా ఉండేవారు. శాస్త్రాలకు సంభందించిన మరియు దైవసంబంద విషయాలలో వారు సలహాలు ఇచ్చేవారు. గోపాలశాస్త్రి గారు ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది. ఉపాసని బాబా తండ్రిగారి పేరు గోవింద శాస్త్రి, తల్లి పేరు రుక్మిణి బాయి. ఆయన  మంచి విద్యావంతులైనా వృత్తిరీత్య ధూలియా కోర్టులో ఉద్యోగం చేసేవారు. గోవింద శాస్త్రి గారికి 5గురు పుత్రులు ఉన్నారు. వీరి కుటుంబం సంప్రదాయబద్దంగా ఆలయ పూజారులుగా కూడా బాధ్యతలు నిర్వర్తించేవారు. వీరు సతాన అనే గ్రామంలో ఉండేవారు. వారి సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది. వారి సంపాదన తిండికి మాత్రమే సరిపోయేది.

              ఉపాసన బాబాకు చదువు మీద అసలు ఆసక్తి ఉండేది కాదు. ఆయన ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడు ఒకసారి పంతులుగారు ఉపాసనని కొడ్తారు. అప్పుడు బాలుడైన ఉపాసని గ్రామ మునసబు దగ్గరకు పోయి తనను పంతులుగారు కొట్టారని చెప్తారు. ఆ తరువాత ఆయన చదువు సాగలేదు. పౌరోహిత్యానికి సంబందించిన కొన్ని వివరాలను మాత్రం నేర్చుకుంటారు. కాని దాని మీద కూడా ఆయన మనసు నిల్వలేదు. ఉపాసని గారి పెద్ద అన్నయ్య బాలకృష్ణ శాస్త్రి గారు గొప్ప సంస్కృత విద్వాంసులు. ఆయన బొంబాయి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉండేవారు. ఉపాసని మాత్రం అందరు ఎందుకు పనికిరాని వాడని అనుకునేవారు. ఆయన తల్లి తండ్రులు పెళ్ళి చేస్తే నైనా బాగుపడ్తాడు అని 1883లో 14 ఏళ్ళ వయసులో 8 ఏళ్ళ అమ్మాయితో పెళ్ళిచేస్తారు. ఆ అమ్మాయి 1885లో  చనిపోతుంది. మరల ఇంకో అమ్మాయితో పెళ్ళిచేస్తే ఆ అమ్మాయి కూడా ఒక సంవత్సరం తర్వాత చనిపోతుంది. ఇట్లా పెళ్ళితో ఆయనను కట్టివేసారని ఉపాసని చాలా అసహనంతో ఉండేవారు. ఒకసారి ఇంట్లోనుంచి వెళ్ళి కొన్ని రోజులు బయట ఉండి మరల ఇంటికి వస్తారు.

              1890వ సంవత్సరంలో ఇక ఇంట్లో ఉండలేక తనకి ఇష్టమైన ఆథ్యాత్మిక సాధన కోసం ఇల్లు వదలి వెళ్తారు. ఆయన భూర్కడ్ కొండ అనే అరణ్య ప్రాంతంలో ఏకాంతం కోసం వెతుకుతూ ఉంటే ఆయనకు ఒక కొండ కనిపిస్తుంది. దానిలో ఎత్తైన ప్రదేశంలో ఒక గుహ, దానిలోకి వెళ్ళేందుకు ఒక చెట్టుకొమ్మ ఉంటాయి. ఉపాసని మెల్లగా ఆ చెట్టు ఎక్కి కొమ్మపై నుంచి ప్రాకి ఆ గుహలో ప్రవేశిస్తారు. ఈ ప్రదేశం ఏకాంతంగా ధ్యానం చేసేందుకు చాలా బాగుందని బావిస్తాడు. అక్కడ ఉంటే ఆహారం దొరకదు తను ఉపవాసం ఉండాలి. అక్కడ నుంచి క్రిందకు రావడం కూడా కష్టం. ఇలా ఆలోచిస్తూనే ధ్యానంలోకి దిగుతారు. ఇలా చాలా రోజులు ఆహార పానీయాలు లేకుండా ధ్యానం చేస్తూ ఉంటారు. అప్పుడు శరీరం అంతా గట్టిగా అయిపోయి అపస్మారక స్థితికి రావడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ స్థితిలో నుంచి బయటపడతారు. వెంటనే దాహం వేస్తుంది. ఇంతలో ప్రకృతి కరుణించి వర్షం కురుస్తుంది. ఆయన శరీరం అంతా మొద్దుబారుతుంది. ఒక్క కుడి చేతిలో మాత్రం కదలిక ఉంది. ఆ వర్షం నీరు ఆ గుహ అంచుల మీదగా కారి తన చేతిలో పడడంతో తన దాహం తీర్చుకొంటారు. తరువాత తన కుడి చేతితో శరీరాన్ని మర్ధన చేసి దానిలో కొంచెం చలనాన్ని తెప్పిస్తారు. కాని ఇంతలో ఆయనకు ఒక కల వస్తుంది. దానిలో ఒక హిందూ వ్యక్తి మరియు ముస్లిం వ్యక్తి తన చర్మాన్ని పూర్తిగా లాగేస్తూ ఉంటారు. ఇంతలో తన చర్మం పోగానే దాంట్లో ఒక కాంతివంతమైన శరీరం కనిపిస్తుంది. వాళ్ళిద్దరు ఈ విధంగా అంటారు. నీవు ఎందుకు చనిపోవాలని ప్రయత్నిస్తున్నావు. మేము నిన్ను చనిపోనివ్వము అని మాయమవుతారు. అప్పుడు ఉపాసని అక్కడ నుంచి వెళ్ళాలని అక్కడ ఉన్న కొమ్మ పైకి ప్రాకి బల్లిలా జరుగుతూ ఉంటాడు. శరీరంలో శక్తి పూర్తిగా నశించింది.

              ఇలా ప్రాకుతూ ఉండగా, పట్టుజారి 20 అడుగులు క్రిందకు పడ్తారు. అలా తను ప్రాకుకుంటూ ఎవరైన కనిపిస్తారని ఎదురుచూస్తూ ఉంటారు. అదృష్టమేమిటి అంటే తనకు దెబ్బలు ఏమి తగలకుండా బయట పడ్తారు. ఇంతలో కట్టెలు ఏరుకునేందుకు వచ్చిన గ్రామస్తులు ఆయనను తీసుకువెళ్ళి మరల మామూలు మనిషిని చేస్తారు. తరువాత కాలంలో ఆయన శిష్యులు అక్కడి గుహను ఒక మందిరంగా మలిచారు.

               ఆ తరువాత ఉపాసని బాబా పూణాకు వెళ్తారు. అక్కడ తన అన్నయ్య ప్రొఫెసర్‌గా ఒక కాలేజీలో పనిచేస్తూ ఉంటారు. తన అన్న దగ్గరకు వెళ్ళకుండా అక్కడే భిక్షాటన చేసి కాలం వెళ్ళబుచ్చుతుంటాడు. ఒక్కో రోజు ఆహారం కూడా దొరొకేది కాదు. 1891లో తన తాత అయిన గోపాలశాస్త్రి గారు చనిపోతారు. అప్పుడు ఉపాసని తను ఏదో రకంగా సంపాధన చెయ్యాలని నిశ్చయించు కొంటారు. సంగ్లీ అనే ప్రదేశానికి వెళ్ళి వెంకట రమణాచారి గారి దగ్గర ఆయుర్వేదం మరియు సంస్కృతం నేర్చుకుంటారు. ఆ తరువాత 1896 నుంచి 1905 దాకా వైద్యుడిగా ఉన్నారు. ఆయన సొంతంగా కొన్ని ఔషధాలను తయారుచేసి అమ్మేవారు. అక్కడే ఆయనకు బాలగంగాధర్‌కి కుడి భుజమైన జి.ఎస్. కపర్డె గారితో పరిచయం అవుతుంది. కపర్డె గారు ఉపాసనిగారి దగ్గర మందులు కోసం వచ్చేవారు. ఇలా కొంత ధనాన్ని కూడబెట్టి మాలగుజారి అనే 2000 ఎకరాల స్థలాన్ని కొంటారు. తరువాత తనుచేసిన పెద్ద తప్పు ఏమిటో తెలుస్తుంది. అక్కడ ఉన్న అద్దె వారు డబ్బులు సరిగ్గా కట్టరు. దీనితో ఆయన కట్టాల్సిన డబ్బు కట్టలేక ఆ స్థలాన్ని పోగొట్టుకుంటారు.అప్పటికే ఆయనకు మూడోసారి పెళ్ళి జరిగి భార్యతో కలసి తీర్ధయాత్రలు చేయాలని అనుకొంటారు.

              ఆయన ఇటు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని అటు డబ్బులేక చాలా కష్టాలు పడ్తారు. నర్మదా, కావేరి నదుల దగ్గర సోమనాథ్ ఆలయం దగ్గర శివారాధన చేస్తారు. ఆయన ప్రాణాయామం చేస్తుండగా ఆయన స్పృహ కోల్పోతారు. భార్య కొంచెం నీళ్ళు తెచ్చి ఆయన మీద చల్లగా, స్పృహ వస్తుంది. కాని ఆయన శ్వాస మాత్రం సరిగ్గా ఉండదు. అతి కష్టం మీద కొద్దిగా శ్వాస మాత్రం ఆడుతూ ఉంటుంది. దానికి మందు కోసం వైద్యులను సంప్రదించినా ఉపయోగం లేకపోతుంది. ఎవరో యోగులను కలిస్తే వాళ్ళె సహాయం చేయగలరు అని చెప్తారు. ఏప్రియల్ 1911లో రాహరి యోగి అనే ఆయనను కలుస్తారు. ఉపాసని కథ అంతా విని ఆ యోగి, నువ్వు సాయిబాబా దగ్గరకు వెళ్ళు అని సలహా ఇస్తారు. ఈ పేరు ముస్లిం పేరులాగ ఉంది. నేను ఆయనకు వంగి నమస్కరించడం ఏమిటి? అని వెళ్ళడానికి నిరాకరిస్తారు. ఇంతలో ఒక ముస్లిం వృద్ధుడు కనిపించి ఏమిటి నీ బాధ అని అడుగుతాడు.

              చల్లగా ఉండే నీరు తాగవద్దని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ఉపాసని బాబా ఈ విషయం పట్టించుకోక జిజూరిలో ఉన్న హిందూయోగిని కలుద్దామని వెళ్తారు. అక్కడ కూర్చుని ధ్యానం చేస్తుండగా మరల దాహం వేసి నీరు తాగుటకు ఒక సెలయేరుని సమీపిస్తారు, నీరుత్రాగబోతూ ఉండగా ఇంతకు ముందు కనిపించిన ముస్లిం వ్యక్తి వచ్చి ఏమిటి చనిపోదాము అనుకుంటున్నావా! చల్లని నీరు తాగవద్దని చెప్పానా? అని హెచ్చరించి వెళ్తాడు. ఈ వ్యక్తి 150 మైళ్ళ దూరం వచ్చి మరల నాకు ఈ విషయం చెప్పాడు అని ఊరిలోకి వెళ్ళి మంచినీరు తాగి తన దాహం తీర్చుకుంటాడు.


              ఆ తరువాత నారాయణ మహరాజ్ అనే సిద్దయోగిని కలసి తనకు సహాయంచేయమని అడుగుతారు. అక్కడ ఏమి ప్రయోజనం లేక మరల రాహోరి యోగి దగ్గరకు వస్తే ఆయన మరల సాయిబాబా దగ్గరకు వెళ్ళమని చెప్తారు. ఇష్టం లేక పోయినా ఆ బాధ భరించలేక షిర్డి ప్రయాణమై జూన్ 27వ తేది 1911లో బాబా దగ్గరకు వస్తారు.

ఓం శ్రీ సాయి రాం !

Sri Upasini Maharaj Part-1

Sri Upasani  Maharaj’s real name is Kasinath Govinda Upasani Sastri . He has a distinctive place among Sai’s devotees.  Most of the details about his life were published in Sai leela magazine. Upasini Baba contributed to Sai’s legacy both directly and indirectly. At one point in his life, people had to stand in lines to have his darshan. People flocked to him in thousands where ever he went. In 1927, Mahatma Gandhi also visited him. He was a divine master and showed so many miracles to his devotees. He established Kanyasthan where he helped so many females in the spiritual path as they were ignored during those times. Sri Narasimha Swami visited Upasini Baba prior to his arrival to Shirdi. He wrote biography on Upasini baba with name “The sage of Sakori”. Upasini Baba was very popular from 1920 to 1934.

Birth, family, education and work details: 
 Kasinath was born on May 15th, 1870. He was born of a very orthodox sect of Brahmins who were village priests, that is, priests in the village of Satana. His grandfather Sri Gopal Sastri had left the village to stay at Baroda as the Raja's Court adviser in religious as well as literary matters for a number of years. Gopal Sastri was also the adviser to many other Petty States on matters of religion and was the author of several books, none of which has probably been printed, Govinda Sastri, the father of Upasani, though a good scholar had
to earn bread for the family by being a copyist in Dhulia Civil Court. Upasani was one of the five sons of Govinda Sastri, and stayed with his grandfather Gopal Sastri at Satana. The family during the time that we are considerirg was really not very well off. The earnings of village priests being very small, they had just enough to eat and get along.

Kasinath’s early education was practically nil. He was sent to an elementary school and very early in that period, a merciless master named Gharpure birched him severely. The boy cried and roaring with pain went to the Village Munsif to lodge a complaint. There the matter ended and his education also ended. He could have picked up the rudiments of the Purohit's learning necessary for carrying on the work of the Village Purohit, but Kasinath did not care to do so. On the other hand, he had a strong dislike for any education, and so was treated as a very dull boy and an exception to the family traditions of love of learning. His elder brother, Balakrishna Sastri, was highly advanced in Sanskrit study and became a Professor of Sanskrit in the Fergusson College, Poona, and was an Examiner for Sanskrit in M.A. in the Bombay University.

But Kasinath was treated by everyone as good-for-nothing, and yet according to old customs, his parents insisted upon getting him married in spite of his protests, at the age of 14 (i.e. in 1883) to a girl of 8 (Durgabai), who died in 1885. He was again married in 1885 to another girl who also died a year later. The home was already bitter; this marriage obligation tied round his neck made it worse. So he did not like home that much and used to go to solitude at times.

Penance at Boorkhad Hill
In 1890, he leaves the house to pursue God. He goes to Boorkhad Hill. There he could see from a great distance that in the midst of a forest, the hill projected from the forest and disclosed a natural cave or cavern. There was luckily a tree near it. As he approached it, he discovered that he could climb up into the cave with the help of the tree growing adjoining it and sending one of its branches into the cave. He thought that this was excellent for his meditation. He sat up in the cave and tried to meditate. He spent days without food or drink, and finally before he became unconscious started chanting (namajapa) name of God, and his body was there in a fixed posture for an unknown period, and, due to lack of food, his muscles and skin were shrunk. 

He woke up to find that he was still alive, and there was the feeling of thirst. There was no water and he could not move. Luckily, the kind heavens poured down rain in a short time, and that rain, coming down the cavern, poured a mass of water into the cave that collected close to him. All his muscles were rigid except those of his right hand, and with this he could reach and pick up the collected water, and he drank up as much as he could. This restored some degree of vigour in him, and he massaged his rigid body.

He began again dreaming and he had a vision which was as follows; "A Hindu and a Muslim standing by his side pulled off his entire skin disclosing thereby his divinely bright body within him. 

Pointing to that body they said 'Why do you wish to die? We will not let you die! We are behind you1 and they vanished." 

He then ventured to move like a lizard on to the branch of the tree which adjoined the cave. And from that branch, he dropped down. He was glad to see that he did not break his limbs by a fall of about 20 feet or so. He moved on slowly on his haunches to an adjoining village where the poor residents were living by collecting fuel from forests and selling it. He passed some time living upon the milk and wild grain supplied by these villagers, and then came back to his home. This stay in Boorkhad cave is still remembered by his devotees who have tried to erect some memorial there of his early yoga practice in the cave.

Upasini as a doctor:
He went to Poona City where his elder brother was leading a respectable life as Professor of a College. Sri Upasani would not go to his brother's house. He went out begging his food in some nooks and corners, very often being refused any food. This bitter portion of his life may be said to end with his grandfather Gopal Sastri's death in 1891. After that, Kasinath began to realize that he must do something to earn his bread, and so, he went to Sangli and got coached up in Ayurveda and Sanskrit Grammar under Sangli Venkataramanachar (1892-1895). 

Thus equipped, he went out to Amraoti, and there practised medicine (1896-1905). He was unlucky at the outset but soon began to prosper. Amongst those who accepted medicines fiom him was G. S. Khaparde, a leading lawyer and the right hand man of Lokamanya Bala Gangadhar Tilak. Sri Kasinath started and conducted for three years (1902-1905) a Medical Mahratti monthly (Beshaja Ratnamala) in which he advertised the patent medicines that he manufactured and with his practice and sale of medicines, he collected a small capital for which he wanted good investment. This was about the year 1907 when, in Gwalior, the State was disposing of Malguzari lease estates. One estate of 2,000 acres could be had by merely paying down Rs. 600 as advance money and agreeing to pay fixed rents which might be collected from the tenants or from the forest or other produce. 

So, the doctor invested his money in Malguzari, and went to live on his estate (1906-1908) but found that he had made a huge mistake. The estate had been thrown up by the previous holder because he could not pay the fixed rental instalments as the tenants would not pay, and the forest and other lands would not yield. Not knowing all that, he had taken up the estate, and found it difficult to pay up the dues to the State, whereupon warrants for seizure of his goods were executed by the village officers even at night when his wife was alone. And to harass him, there were plenty of enemies. The tenants defied him to collect the rent, and the village officers, whose co-operation was necessary to collect the rents, withheld their co-operation. So, after a year or two of struggle with adverse circumstances, Kasinath could not get anything there, but lost his health and all that he had and returned home a broken man with broken fortune and ruined health.

Upasini’s breathing problem:
Soon after, he bethought himself once again of holy pilgrimages, and started with his wife (the 3rd) in April 1910 to Omkareswar Lingam on an island in the middle of a river (Narmada and its Branch Cavery), and there tried to practise Pranayama himself, and his wife was seated at the foot of that huge lingam (called Somanath or Gouri Shankar) with a diameter of about 6 or 7 feet.  He fell down unconscious and his wife sprinkled river water, and that restored his consciousness. But his breathing was not restored, and remembering the usual practice of artificial respiration, he began to heave his whole body and uttered groans so as to move the respiratory muscles of his chest slowly and with considerable groaning and effort, he began to breathe. But he felt that his breathing might stop at any moment. He was afraid to strain at stools or to go to sleep, lest during these times the breathing should stop. He tried to get medicine. But the doctors stated that he had got trouble in the course of his yogic practice and they could not furnish him with a cure.

Baba coming as an old Muslim man:
Thinking that he should resort to yogis only for a cure, he went (April 1911) to Rahuri where there was a yogi Kulkarni by name. But that yogi, after listening to his account, stated that he was not having any disease at all, that his breathing was one of the accidents of yogic practice, that it would become normal again, in due course, that his yogic condition was far advanced and advised him to go to Sai Baba   Hearing the name  'Sai Baba' uttered by the Rahuri yogi, he said, 'Sai Baba must naturally be a Mohamadan, and I am a Sastri's son and grandson, and so bowing to a Muslim is out of the question'. Therefore, Kasinath declined to go. 

But while staying with that yogi, he was walking in the streets, and he met an old Mohamadan who questioned him about his trouble, and then gave him the advice: 'This trouble is vatha and will be cured by your avoiding cold drink, and drinking water as hot as your mouth can bear'. Dr. Kasinath had no respect for this advice and treated it as worthless, and went away to Jejuri on his way to meet a Hindu yogi Phatak by name at Moregaon. 

At Jejuri he again sat up for yoga practice under a thick prickly pear bush, and there, after some time, he felt the pangs of thirst. He went to a stream and was about to drink its cold water. Suddenly the old man that appeared at Rahuri, 156 miles away, was seen at this stream, and he said, "What! Are you trying to kill yourself? I told you to drink hot water and avoid cold water". So, he went into the village and was taking hot drink only. With that i.e. with what he first thought to be a worthless recipe, health was fairly restored, for he got good sleep which he never had before.

Then he went to Narayan Maharaj of Kedgaonbet, Bombay, a famous Datta Upasaka possessed of marvellous powers. When he represented to Narayan Maharaj that he wanted help for health, Narayan Maharaj made him chew betel and nut, and said that he was finely painted inside and outside, and asked him to go away. Kasinath could not make out what he meant. When he went again and asked him, Narayan Maharaj said that there was nothing more for him to do, and so he started back for Satana, and, on the way, called at the Rahuri Yogi's house, and on the insistence of that Rahuri Yogi, he decided to go to Shirdi.



OM SAI RAM!