In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, December 27, 2017

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం - 13




 సాయిసచ్చరితలో భీమాజీ పాటిల్ కథకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మహానుభావుని చేత సాయి సత్య వ్రతము ప్రారంభించబడింది. వీరి యొక్క కథ పడుమూడవ అధ్యాయంలో చెప్పబడింది. ఈ అధ్యాయంలో బాబా వివిద వ్యాధులను నివారించడం గురించి మనము చదువుతాము. కాని అధ్యాయం మొదట మాయ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ మాయ గురించి ఇక్కడ ఎందుకు చెప్పటం జరిగింది అనే విషయాన్ని పరిశీలిస్తే దానిలో ఉన్న గూడార్ధం వ్యక్తమవుతుంది.

బాబా ఈ మాయ గురించి ఈ విధంగా చెప్పారు. నేను ఇల్లు, వాకిలి లేని ఫకీరుని ఏ బాధలు లేకుండా ఒక చోట స్థిరంగా కూర్చున్నాను. అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్నుకూడా తరచు వేదిస్తూ ఉంటుంది. నేను మరచిపోయినా అది నన్ను మరవకుండా నిరంతరం పెనవేసుకొని ఉంది.  అది హరి యొక్క ఆది మాయ. బ్రహ్మాదులను కూడా ఎగర కొట్టేస్తుంది. మరి నేనెంత? హరిప్రసన్నుడైతే అది విచ్చినమవుతుంది. అఖండ హరి భజన లేకుండా మాయ నిరసనం కాదు. ఇట్లా చెప్పి సాయి మరికొన్ని రహస్యాలు కూడా చెప్పారు.

ఎల్లప్పుడూ "సాయి! సాయి!" అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా రక్షిస్తాను. ఈ మాటల యందు విశ్వాసం ఉంచితే తప్పక మేలు కలుగుతుంది. నాకు పూజా సామాగ్రి కాని, అష్టోపచార, షోడోపచార పూజలు కాని అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్నచోటే నా నివాసం.  ఈ మాటలు ఎంతటి వారికైన ఊరట కలిగిస్తాయి. మరి భీమాజి పాటిల్ అందుకనే బాబాని నమ్మి ద్వారకామాయికి చేరుకున్నాడు.

సరే మనము అసలు కథ చెప్పుకొనే ముందు ఈ మాయ యొక్క పుట్టుపూర్వొత్తరాలు, ఇది ఈ అధ్యాయం మొదట్లో ఎందుకు చెప్పబడింది, అనే అంశం చూద్దాము. మాయను మనము విష్ణు మాయగా పిలుస్తాము. బాబా కూడా అదే చెప్పడం జరిగింది. 

హింస మరియు అధర్మం రెండింటి కలయిక మూలానా అనృతము మరియు నికృతి అనే సంతానం కలిగింది. అనృతము అంటే ఏమి చేయకుండా ఉండటం. నికృతి అంటే అసత్యాలతో మోసాలు చేయడం. 

ఈ రెండింటి తరువాత తరం :  నాలుగు ప్రవృత్తులు వచ్చినవి.
అవి 1. భయం            2. నరకం          3. మాయ         4. వేదన
వేదన నుంచి - నొప్పి (బాధ) - దుఃఖము వచ్చినవి. ఇక మాయ నుంచి - మృత్యువు వచ్చింది.

మృత్యువు నుంచి ఈ 5 వచ్చినవి
1. వ్యాధి            2. జర (ముసలితనం)        3. శోకము          4. తృష్ణ      5. క్రోధము
వీటిని పరిశీలిస్తే మాయ నుంచి ఈ వ్యాధి మొదలుగా గల బాధలన్ని ఎలా వచ్చినవో మరియు ఈ అధ్యాయంలో మాయ గురించి ఎందుకు చెప్పారో అర్ధం అవుతుంది.

భీమాజి పాటిల్ కథ మనం చాలా సార్లు విన్నాము. కాని క్లుప్తంగా ఇక్కడ చెప్పుకుందాము. భీమాజి పూన జిల్లాలో నారాయణగాం అనే పల్లెలో ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. అందరికి లేదనకుండా దానం ఇచ్చే సుగుణం కల్గినవాడు. చూసే వారందరికి చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న పెద్ద మనిషి, భక్తి పారాయణుడు కూడా. మరి ఇన్ని మంచి గుణములు ఉన్న ఈ భీమాజీకి క్షయ రోగం వచ్చి పట్టుకుంది. ఆరోగ్యం బాగా క్షీణించి, రక్తం కక్కుకోవడం ప్రారంభిస్తాడు. చాలా వైద్యులను కలుస్తాడు. ఇంకా రకరకాల చిట్కాలను పాటిస్తాడు. కాని ప్రయోజనం ఉండదు. చివరకు నానా ద్వారా బాబా గురించి తెలుసుకొని బాబా దగ్గరకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత అతని జబ్బు నయం అవుతుంది. ఇది మనందరికి తెలిసిన కథ. మనము ఇప్పుడు దీనిలో ఉన్న పరమార్దాలను పరిశీలిద్దాము.

భీమాజి ద్వారకా మాయికి రాగానే బాబా ఈ విధంగా అన్నారు.
“శ్యామా! ఈ దొంగను ఎక్కడ నుండి తీసుకు వచ్చి నా మీద పడవేశారు. ఇదేమైన మంచి పనేనా!” అని అన్నారు.
అప్పుడు భీమాజి తన తలను బాబా పాదముల వద్ద ఉంచి, రక్షించమని వేడుకొనెను. నేను అనాధను నన్ను కరుణించండి అని భీమాజి పల్కెను. ఇక్కడ భీమాజి శరణాగతి చేసి అనాధను అనడంలో ఎంతో నమ్మకము, ఇక నీవే నాకు దిక్కు, నన్ను ఈ భవసాగరము నుంచి రక్షించు. నేను అనాధను అంటే నాకు, నా అనే వాళ్లు ఉన్నా ఎవరు లేనట్లే మృత్యువు సమీపిస్తుంటే ఈ శరీరం వదిలి ఇంకో శరీరంలోకి వెళ్తా, ఇక్కడ మిగిలింది ఏమి లేదు. ఇక్కడ ఉన్న వారంతా నావారు కారు.

అప్పుడు బాబా, కూర్చో ఏం బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు. షిర్డిలో అడుగు పెట్టిన మరుక్షణమే నీవు అనుభవించాల్సిన కర్మ అంతా కరిగిపోయింది. కంఠం వరకు కష్టాల్లో ఉన్నా మహామహా బాధల లోతుల్లో  పాతుకుపోయినా ఈ మశీదు మాత మెట్లు ఎక్కిన వారు ధుఃఖాన్ని అదిరోహించినట్లే. ఇక్కడి ఫకీరు చాలా దయాళువు, నిన్ను రక్షిస్తారు.

ఆ తరువాత భీమాజీని  భీమా భాయి యింట్లో ఉండమని బాబా చెప్తారు. భీమాజీకి తెలిసిన వాళ్ళు ఎంత మంది షిర్డిలో ఉన్నా భీమాబాయి ఇంట్లో సాదాసీదాగానే సంచులే పక్కగా పరిచి నిద్రించి ఉండవలసి వచ్చింది.
నారాయణగాంలో ఊరి పెద్దగా ఉన్న భీమాజీని అందరు ధర్మాత్ముడు, చాలా మంచి వాడని చెప్పేవారు. కాని ఇంత మంచివాడికి కూడా పూర్వ జన్మ కర్మలు అనుభవింప చేసి మోక్షానికి దగ్గరకు చేర్చడమే బాబా చూపించే కృప. మనకు జబ్బులు బాధలు వచ్చినవని కృంగిపోరాదు. ఇది మన మంచికే అని బాబా ఇక్కడ కర్మ సిద్దాంతం గురించి చెప్పి మనందరికి ధైర్యం చెప్తున్నారు.


భీమాజీ పూర్వకర్మలను వదిలించటానికి బాబా రెండు స్వప్నాలను వాడుకున్నారు.

1. భీమాజీని ఒక బెత్తంతో మాష్టారు కొట్టడం
భీమాజీ కలలో ఒక టీచరు పద్యం కంఠస్తం చేయమని కొట్టడం. ఆ పద్యం ఏమిటంటే 
పరుల గృహాలలో పాదం పెట్టడం - పాము తలపై పాదం మోపటమని భావించే స్త్రీ||
లోభి చేతినుండి అతి కష్టంగా రాలే డబ్బులా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ||
ఇంట్లో డబ్బు లేకపోయినా పతి సహచర్యాన్నే సుఖంగా భావించే స్త్రీ||
తన పతి కోరిన విధంగా ప్రశాంత మనసుతో ప్రవర్తించే స్త్రీ||
ఈ స్వభావం గల స్త్రీయే నిజమైన సతి

2. భీమాజీ చాతిపై ఒక గృహస్తుడు పొత్రంతో తిప్పడం
ఒక గృహస్తుడు భీమాజీ చాతిని గట్టిగా అదిమి పట్టి కూర్చున్నాడు. చేతిలోకి ఒక పొత్రాన్ని తీసుకొని దాన్ని భీమాజీ చాతిపై తిప్పుతూ ఉంటే భయంకరమైన భాద.
ఇలా రెండు కలలు తర్వాత భీమాజి వ్యాధి నయమవుతుంది.

బాబా ఈ రెండు స్వప్నాలని ఎందుకు ఎంచుకున్నారు. ఇది కేవలము భీమాజీ పూర్వ జన్మ కర్మలకు నివృత్తి అయి ఉండాలి. వాటి గురించి తెలుసుకోవాలంటే కర్మ సిద్దాంతం వాటికి సంబంధించిన వ్యాధులు అనేవి తెలియాలి.
మనము కలలో ఒక స్త్రీ గురించిన పద్యం ఆమె ఎట్లా జీవితంలో ప్రవర్తించాలి అనే విషయం గురించి చెప్పబడింది. మరి భీమాజీ పూర్వ జన్మలలో ఎక్కడా ఈ ధర్మాన్ని పాటించకుండా ఉండటం జరిగిందా!

దానినే ఇంకోరకంగా చూడచ్చు, ఆధ్యాత్మిక పథంలో
1. ఒకవ్యక్తి (జీవుడు) తను జన్మ తీసుకొన్న విషయం వదిలి వేరే వాటిని పట్టించుకోవడం. అదే కలలో పరుల గృహాలలో కాలు మోపడం అంటే.

2. ఒక లోభి ఎంత తక్కువ ఖర్చు పెడ్తాడో మనం అంత తక్కువగా మన మాటల్ని వాడాలి. ఎవరి గురించి అనవసరంగా చెడుగా మాట్లాడరాదు.

3. పతి సహచర్యాన్ని సుఖంగా భావించే స్త్రీ. అంటే విషయానందాన్ని వదిలి కేవలం భగవంతుడే తన సుఖం అని అర్ధం చేసుకొని ప్రవర్తించడం.

4. తన పతి కోరిన విధంగా ఉండటం అంటే భగవంతుడు చూపిన మార్గంలో ఉండటం.

ఇది ఒక వ్యక్తి సరిగ్గా చేయలేనప్పుడు ఈ మాయలో పడి రకరకాల కష్టాలతో, భాదలతో ఈ భవసాగరంలో కొట్టుకుంటూ ఉంటాడు.

ఇక రెండో కల చాతిపై పొత్రం తిప్పడం. కర్మ మరియు వ్యాధుల గురించి చూస్తే ఒక వ్యక్తి ఒక జంతువు గాని, మనిషిగాని ఊపిరి సల్పకుండా హింస పెడితోనో లేక వారిని ఏ దిక్కు తెలినీకుండా కష్టపెట్టితే లేదా చంపితే ఇట్లాంటి క్షయ రోగ సంబంధమైన ఊపిరి తిత్తుల వ్యాధులు రావచ్చు అని చెప్పబడింది.
బాబా ఈ రెండు కలలతో భీమాజీ యొక్క పూర్వ జన్మ కర్మలను పోగొట్టి తనను ముక్తి పథంలో నడపడానికి దారి ఏర్పరిచారు.

అట్లానే సచ్చరిత పదమూడవ అధ్యాయంలో రకరకాల జబ్బులను వింతైన పద్దతులలో తగ్గించడం జరిగింది. ఒక్కోదానికి ఒక్కో అర్ధం ఉంటుంది. ఇవన్ని గరుడ పురాణంలో కూడా చెప్పబడతాయి. మనం ఎటువంటి కర్మలు చేస్తే ఎట్లాంటి జన్మలు వస్తాయి అనే విషయాలు కూడా దీనిలో ఉంటాయి. బాబా చాలా సార్లు వీటి గురించిన ప్రస్తావన తేవడం జరిగింది. అందుకే మనము ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించ రాదు. ధర్మాన్ని తెలుసుకొని మసలు కోవాలి. దారి తప్పకూడదు. మనము పూర్వ జన్మలలో చేసిన వాటి గురించి బాబాకు వదిలేసి ఇప్పుడు మనము బాబాపై అమిత శ్రద్ధతో ఉండి ఆయనే మనల్ని రక్షించే ఏకైక గురువుగా నమ్ముకొని ముందుకు సాగితే ఆయన మనల్ని తప్పక రక్షిస్తాడు. అవతల తీరానికి అంటే ముక్తి మార్గంలోకి తీసుకువెళ్తారు.

ఈ మాయ సిద్దాంతానికి పరిష్కారము ఆ విష్ణువే. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఆయనే పరమాత్మ, ఆయనే సత్యము అందుకే ఆయనను సత్యనారాయణుడని అంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయికే సత్యనారాయణుడు. అందుకే భీమాజీకి బాబా సత్యవ్రత సంకల్పం కలుగచేసి మనందరిని ఉద్దరించడం జరిగింది. మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి కూడా అర్ధం ఇదే. కాని బాబాని గురువుగా భావించిన వారు సాయి సత్యవ్రతం చేస్తే మంచిది. బాబాయే పరమాత్మా, పరమాత్మే బాబా.



శ్రీ సాయినాథార్పణమస్తు !

Sri SaiSatcharita Chapter - 13



In this chapter, Hemadpanth talks about Maya theory in the introduction of 13th Chapter. How Bhimaji Patil started Sai Satyavrata along the lines of Sri Satyanarayana Swami Vrata.  This chapter also talks about all kinds of diseases, how they were cured by Baba. 

Baba describes Maya as follows. “Oh! Though I am a fakir and have no home nor household, sitting not involved in one place, leaving aside all mundane matters. Yet, Maya is inevitable. She even harasses me often. I forget her but she does not forget me. She always comes and embraces me. Adi Maya originates from God and bewilders even Brahman and others. Then what could be said about a poor fakir like me! Only the mercy of God can save you from its clutches. Without continuously reciting God’s name, this attachment will not be destroyed”. 

This Maya theory was described very well in Agni Purana. 

According to Agni Purana
Himsa (violence) married Adharma (foul deeds).
They had two children Anrutham (lack of action) and Nikruthi (dishonesty).

These two children in turn produced four children
    Bhayam (fear),
    Narakam (hell),
    Maya (illusion) 
    Vedana (pain).

Maya begot Mruthyu (death) and Vedana begot Dukha (sorrow).

Mruthyu produced these children
1) Vyadhi (disease),
2) Jara (old age),
3) Soka (sorrow),
4) Trushna (attraction)
5) Krodha (anger).

Our physical and mental problems are all coming from Maya. Now we can see why Maya was mentioned in the 13th chapter along with the diseases cured.

Bhimaji Patil is from Narayangaon village of Junnur Taluka; of Pune District. Bhimaji was a well-to-do person and is very hospitable to everyone. In 1909, Bhimaji developed severe form of Tuberculosis with cough, high temperature and was coughing blood. He lost hope and became bedridden. He tried all kinds of treatments with no use. He then turned to God and through Nana Saheb Chandorkar he hears about Baba. He decided to go to Shirdi.  He surrenders to Baba and prostrates before him. Then Baba asked him to sit down and stop worrying. He also says that whoever steps in to Dwarakamai, their troubles will come to an end and their sins will be uprooted. He asked him to stay at Bhimabai’s house and within no time his disease was cured through 2 dreams.

Those dreams are as follows: 

A teacher hitting Bhimaji in a dream expecting him to recite a poem. What is the Poem?

She is known as a real or ideal wife, who thinks she has stepped on the head of a serpent if she ever enters a stranger’s house. Her words are so rare that they are like wealth procured by a miser. She feels profoundly happy even they are poor and satisfies with what they have. She behaves according to her husband’s wishes, without hesitation. 

Stranger rolling a stone on Bhimaji’s chest:
He saw that an unknown person came and sat on his chest. He had a grinding stone rolling on his chest and Bhimaji experienced severe pain. When the dream ended, he felt better and slept with some comfort.   

Why Baba used these two dreams. This is in relation to Bhimaji’s past karmas from past lives. To understand this we have to go through his dreams and analyze them.

1st dream analysis: In the first dream Bhimaji was beaten by a teacher with a stick. The poem talks about a lady and how she is supposed to live her life. We can either take the meaning as it is or we can analyze in a philosophical way. Was he a female in the past lives and did not follow the above principles or Baba is talking about spiritual meaning but in a parable.  If we pay attention to outward objects rather than God, then it corresponds to a lady stepping in to a stranger’s house.

We have to talk very minimal like a miser who hesitates to spend his money. Here we have to realize that we cannot get involved in unnecessary matters and do not use our mouth to criticize others for little things. She feels profoundly happy in the company of her husband, even though there amy not be any money in the house. We need to be happy with God alone but not get attached to worldly objects. Living your life according to your husband’s wishes, that means, following scriptures and path of great guru Sai.

If we are unable to perform these prescribed duties, we fall in to this Maya (illusion) and get stuck in the ocean of birth and death.

2nd dream analysis: In the second dream a stranger rolls a stone on the chest of Bhimaji. Our scriptures talk about diseases that can occur if someone commits a specific karma. Who plugs up or blocks up the hole of a rat or a snake, whoever catches fish and causes them to die by suffocation, whoever stifles the life of any creature will suffer from major lung diseases. Sometimes humans have a tendency to cause lot of difficulties for other people for their own sake. People might enjoy short term benefits but in long term they have to suffer.

Final inference:
Here through these two dreams, Baba helped Bhimaji to burn his past karmas and takes him in to spiritual path. In a similar way Baba cured so many diseases some times in a strange way. Each one has its own meaning. All this was mentioned in Garuda Purana. This Purana describes what kind of karmas will give us what kind of life and how we suffer. Baba talks about this on several occasions and he wants us to be careful. He asks us to follow the Dharma. We should not deviate from the path. Whatever we did in past lives we have no control over them, so we have to leave that to Baba. We just have to believe in Sai and move on with our lives. He will guide us and protect us wherever he needs to. He will take us to other side of the ocean that is Mukti (salvation).

In this chapter Hemadpanth describes how Baba helped other devotees with their sufferings. Bapusaheb Buty was relieved of dysentery, Alandi Swami of ear pain, and Kaka Mahajani was freed from diarrhea. Baba used some non- traditional methods but the important issue here is getting rid of their past sins. All this is related to Maya that we talked about in the beginning.  


The solution to this Illusion (Maya) is God himself (Vishnu). Vishnu means one who is pervading all over the universe. He is the truth. That’s why we call him Sri Satyanarayana. Brahma, Vishnu and Maheswara together are called as Sri Satyanarayana. That’s why Baba made Bhimaji to perform Sri Sai Satyavrata. This way Baba blessed us with this vrata. This is the reason why we do Sri Satyanarayana Puja also. Whoever believes in Baba as their Guru or God, they can do Sri Sai Satyavrata alone. This is nothing but the original vrata. Baba is himself Paramatma. So Sai Bandhus we have to understand the life in such a way, so that we do not have to go through all these consequences so badly. We should start living our lives according to scriptures and dharma. If we believe in Sai with complete faith he will take care of us in every aspect of life.




SRI SAINAATHARPANAMASTHU!

Wednesday, December 20, 2017

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 12



భగవంతుడు దుష్ట శిక్షణ మరియు శిష్ట రక్షణ కోసం అవతారం తీసుకొంటాను అని గీతలో చెప్పారు. కాని గురువులకు అందరు సమానులే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్న భావన ఉండదు. సత్పురుషులు మొదట దుర్జనులను దారిలో పెడతారు. వారి మనసు దీనులకొరకు తపించిపోతుంటుంది. అజ్ఞానాంధకారాన్ని తొలిగించే జ్ఞాన భాస్కరులు వీరు. పరమాత్మే గురువు రూపంలో వస్తారు. సాయి మహారాజ్ కూడా ఈ కోవకు చెందిన వారే. వీరికి అన్ని ప్రాణుల యందు ప్రేమ. అన్ని విషయాలు పట్టించుకున్నట్లు ఉన్నా ఆయన అంతర్ వైరాగ్యంతో ఉండే వారు. వారికి ఎవరియందు మితృత్వము కాని, శతృత్వము కాని ఉండేది కాదు. అందరు వారికి సమానులే. 

పండితులమని అనుకునే వారు జ్ఞాన గర్వంతో మదోన్మత్తులై భక్తి మార్గానికి అడ్డు తగులుతారు. వారికి తరించే మార్గం లేదు. అమాయకులు విశ్వాసం ఆధారంతో భవ భయ సంకటాల నుండి విముక్తులౌతారు. ఎవరైనా బాబాను కలవాలి అంటే ఆయన కృప ఉండాలి. వారు షిర్డీ రావాలి అన్నా, అక్కడినుంచి వెళ్ళాలి అన్నా బాబా ఆశీర్వాదం లేకుండా ఏమి జరుగదు. బాబా అనుమతి ఉంటేనే ఉండాలి. వెళ్లిపొమ్మంటే తిరిగి వెళ్లాల్సిందే. 

ఒకసారి కాకామహాజని షిర్డీలో వారం రోజులు ఉండి వెళదామని అనుకోని వస్తారు. బాబాను కలవగానే ఎప్పుడు వెళ్తున్నావు అని అడుగుతారు. బాబా ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడే అని కాకామహాజని చెప్తారు. రేపే వెళ్ళమని బాబా అంటారు. కాకా గోకులాష్టమి వేడుకలు చూసి బాబాతో కొన్ని రోజులు ఉండాలి అని అనుకోని వస్తారు కాని బాబా వెంటనే వెళ్లమంటున్నారు. ఇక తప్పక తన ఊరు వెళ్తారు. అక్కడకు వెళ్లగానే తన యజమాని కాకా ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక గుమస్తాలకు జబ్బు చేస్తే కాకా అవసరం పడుతుంది. బాబాకు సర్వం ఎరుకే అందుకే వెళ్ళమని చెప్పారు. ఇంకోసారి ధుమాళ్ అనే వకీలు బాబాను దర్శించుకొని త్వరగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో షిర్డీ వస్తాడు. కాని బాబా మాత్రం అతనిని వారం రోజులు ఉంచుతారు. అతను నిఫాడ్ అనే ఊరిలో ఒక కేసుకి సంబంధించి త్వరగా వెళ్ళాలి అనుకుంటే బాబా అక్కడే ఉంచారు. తరువాత అసలు విషయం ధుమాలుకు తెలుస్తుంది. అక్కడ జడ్జికి ఎప్పుడూ లేనంత కడుపులో నెప్పి వచ్చి కేసులు వాయిదా వేయడం జరిగింది. బాబాకు సర్వం తెలుసు అలానే ఆయన తన భక్తులందరిని రక్షిస్తూ ఉంటారు. అలానే నిమోంకర్ భార్య కోరిక కూడా తీరుస్తారు. ఆమె కుమారుడు జబ్బు పడితే బేలాపూర్ వెళదామని అనుకుంటుంది. నిమోంకర్ ఆమెను తరువాత రోజే రమ్మంటాడు. ఆమె బాబా అనుమతి తీసుకోవడానికి వస్తే అందరి ముందు నాలుగు రోజులు ఉంది రమ్మని బాబా చెప్తారు. ఇలా వారు తన భక్తుల మనసులో ఏమి ఉందొ తెలుసుకొని వారికి ఏది మంచిదో అది చేస్తారు.   

తరువాత హేమద్పంత్ ముళే శాస్త్రి గారి కథను చెప్పారు. ఆయన మంచి పండితుడు మరియు హస్తసాముద్రికంలో దిట్ట. ఆయన శ్రీమంతుడైన బూటీ గారిని కలవడానికి షిర్డీ రావడం జరిగింది. అప్పుడు బాబా అందరికి మామిడి మరియు అరటిపండ్లు పంచిపెడుతూ ఉంటారు. ఈ ముళే శాస్త్రి బాబా చేయి చూసి జాతకం చూడాలని అనుకుంటాడు. కాని బాబా అందుకు ఒప్పుకోరు. శాస్త్రికి నాలుగు అరటిపండ్లు ఇస్తారు. తరువాత ఆయన వాడాకు వెళ్లి మడితో అగ్నిహోత్రాన్ని ఆరంభించాడు. ఇంతలో బాబా లెండీకి వెళ్తూ ఈ రోజు కాషాయ రంగు తీసుకొని రండి, కాషాయ వస్త్రాలు ధరిస్తాను అని చెప్తారు. బాబా ఆలా
ఎందుకు అన్నారో ఎవరికీ అర్ధం కాలేదు. తరువాత మధ్యాన్న ఆరతి జరుగుతూ ఉంటె, బూటిని పంపి దక్షిణ తెమ్మంటారు. శాస్త్రి నన్ను ఎందుకు దక్షిణ అడిగారు. నేను మడిలో ఉన్నాను అని అనుకుంటాడు. తరువాత మసీదుకు వెళ్తే ఎప్పుడో సమాధి చెందిన తన గురువైన ఘోలప్ స్వామి బాబా స్థానంలో కూర్చొని కనిపిస్తారు. తన గురువు కాళ్ళకు నమస్కరించి చేతులు కుదించి నిలబడిపోతాడు. సన్యాసి వలె కాషాయ వస్త్రాలు ధరించిన తన గురువు కనిపించడంతో సంభ్రమ ఆశ్యర్యాలకు గురి అవుతాడు. తరువాత ఆ స్థానంలో మరల బాబా కనిపిస్తారు. తన వద్ద నున్న దానిని బాబాకు దక్షిణ ఇస్తాడు. అప్పుడు బాబా కాషాయ రంగు గురించి ఎందుకు చెప్పారో అర్ధం తెలిసింది. ముళే శాస్త్రికి తన గురువు లభించారు. 

ఇలానే సాయి దర్శనంలో శ్రద్ధ గల ఒక మామలతదార్ తన స్నేహితుడైన ఒక డాక్టరును వెంటపెట్టుకొని షిర్డీ ప్రయాణం కట్టాడు. బ్రాహ్మణుడైన ఈ డాక్టర్ ఒక్క రాముడికి తప్ప ఎవరికీ నేను తలవంచి నమస్కారం చేయను, అలా అయితేనే నేను వస్తాను అంటాడు. బాబా ఎవరినీ ఆలా నమస్కారం చేయమని అడగరు కాబట్టి నీవు రావచ్చు అని ఆ మామలతదార్ అతనిని తీసుకువస్తాడు. అయితే షిర్డీలో బాబా దర్శనం చేయగానే అక్కడ తన రాముడు బాబా స్థానంలో కనిపిస్తే వెంటనే నమస్కారం చేస్తాడు. ఆ స్నేహితుడు ఎందుకు నాకన్నా ముందే నమస్కారం చేసావు అని అంటే, చూడు అక్కడ నా రాముడే కూర్చొని ఉన్నారు అంటుండగా ఆ స్థలంలో బాబా కూర్చొని కనిపిస్తారు. అప్పుడు ఈ డాక్టర్ ఇక్కడ ఉన్నది ముసల్మాను కాదు, వీరు అవతార పురుషులు అని అంటాడు. తరువాత తన అహంకారం పోగొట్టిన సాయినాథులు నన్ను కరుణించిన దాకా నేను మసీదుకు వెళ్ళను అని దీక్ష పడతాడు. కాని చాలా రోజుల తరువాత కలిసిన తన స్నేహితుడు అక్కడకు వస్తే, అతనితో కలిసి బాబా దర్శనం కోసం మసీదుకు వస్తాడు. అప్పుడు బాబా " ఎం డాక్టర్ నిన్ను ఎవరైనా రమ్మని పిలిచారా!  ఎందుకు వచ్చావో నాకు జవాబు చెప్పు" అని అడుగుతారు. ఆయనకు కళ్ళు చెమర్చి తన సంకల్పం గుర్తుకు వచ్చింది. ఆ రోజు రాత్రి నిద్రలో అతనికి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. పరమానందాన్ని అనుభవిస్తారు. ఈ అనుభూతి దాదాపు పదిహేను రోజులు ఉంటుంది. ఇలా బాబా ఆ డాక్టరును ఆధ్యాత్మిక పధంలో నడిపించారు. 

బాబా ఈ అధ్యాయంలో గురువుపైన ఎలాంటి నమ్మకం, ప్రేమ ఉండాలో ఈ కథల ద్వారా చూపించారు. గురువే పరమాత్మ అన్ని రూపాలలో ఆయనే ఉంటారు అని రాముడి రూపంలో, ఇతర గురువుల రూపంలో కనిపించారు. ముళే శాస్త్రిగారికి నాలుగు అరటిపండ్లు ఇచ్చి ధర్మార్ధకామాలనే వాటిని దాటి నాలుగోది అయిన మోక్షం వైపు వెళ్ళాలి అంటే గురువే ముఖ్యం అని నేర్పించారు. అలానే డాక్టర్ కథ ద్వారా మనలో ఉన్న భక్తిపరంగా ఉండే మొండితనాన్ని పోగొట్టారు. ఇలా ఏ సాధకుడికి ఏది అవసరమో అది అనుగ్రహిస్తూ ఉండే వారే పరమగురువులు. అందుకే సాయి సమర్ధ సద్గురువులు. ఆయన మన జీవితంలో ఉంటే ఇంక మనకు ఏమి అక్కరలేదు. ఆయనే దగ్గర ఉండి మనలను నడిపిస్తారు.
 
ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!

Sri Saisatcharita chapter 12





God appears on earth to protect the virtuous and to annihilate the evil. Saints however are different. For the Saints, the virtuous and the evil are the same. They do not know the difference between the great and the lowly. For them, both are the same. Saints are greater than God. They set the evil-doers on the right path. Their hearts ache with love and compassion for the suffering. Sai is one such! He has manifested for the sake of his devotees – the embodiment of knowledge, in whom the luster of divinity is firmly established. He had great love for all living creatures, yet he was totally detached. Though he had powers he cared nothing for them. He had no animosity towards anyone and treated all alike.


Nobody will leave or enter Shirdi without Baba's will. On one occasion, Kaka Mahajani went to Shirdi from Bombay. He intended to stay for one week at Shirdi and then return. Kaka arrived at Shirdi at the opportune time of the Gokul Ashtami festivities, desiring to enjoy and witness the festival. The moment he saw Baba, he was asked “ When are you returning to your home? ” Kaka then says Whenever you want me to go. Then Baba says "Go tomorrow". When he returned to his office, he found that his employer was eagerly waiting for him. This is how Baba helped him to go back quickly so that he can go back to work. 

On the other extreme, Baba Saheb Dhumal wanted to come to Shirdi, have darshan of Baba and leave quickly. On his way back, Dhumal had to stop at Niphad. It was necessary for him to go there, for the hearing of a case. But Sai keeps him there for a week. Later he finds out that the Judge was sick and hearing was postponed. 

Onetime Nana Saheb Nimonkar was staying with his wife in Shirdi and his son fell ill in Belapur. His wife wanted to go there to see his son and other relatives.  But Nimonkar tells her to come back to Shirdi next day. She did not want to travel as next day is Amavaasya day. She was worried about travelling on that day. She was disappointed but kept quiet. While leaving Shirdi, she came to see Baba and he was near Sathe wada with Nimonkar and others. Baba then said "Go, go quickly, be calm and unperturbed. Stay in Belapur for 4 days! see all your relatives and come back to Shirdi". Baba was able to rescue her and granted her wish. 

On one occasion, An Agnihotri Brahmin, named Muley Shastri from Nashik came to Shirdi. He is well versed in astrology and palmistry. He actually came to Shirdi to see Bapusaheb Booty. In reality, he came to Shirdi because of his past spiritual merits. At that time Baba was giving mangoes and plantains to people around him. This Shastri wanted to read Baba’s hand as he knows the palmistry. But Baba would not allow him to do that. Baba gave him 4 plantains. Then everyone returned to the Wada and Muley Shastri took bath and wore sacred clothes. Baba started going to Lendi and told him to wear Saffron colored
clothes. Then after a while at the noon arathi, Baba asked Booty to go and get Dakshina from Shastri. This Shastri got surprised and felt why he should give Baba dakshina. Somehow he comes to Dwarakamai and sees his Guru Gholap Swami in Baba’s place. He could not believe his eyes. He then falls on Baba’s feet with folded hands. He was casting off all his pride of caste and ideas of sacredness. He then gave dakshina to Baba. This is what Baba meant when he told him to wear saffron colored clothes because Shastri is going to have his Guru’s darshan.


There was another doctor who is a friend of a Mamlatadar came to Shirdi. He told this friend that he is will not bow to Baba because he is a Muslim and this doctor is devotee of Lord Rama. He does not want to bow to anyone other than his Rama. Then Mamlatadar told him Baba would never ask anyone to bow down and touch his feet. But, the moment they arrived in Shirdi and went to the Masjid for darshan, right at the beginning he himself prostrated. His friend then asked how come you prostrated before a Muslim. Then the Doctor said “I saw the image of Rama sitting there and immediately I bowed”. When his friend asked him to see Baba sitting there still and talking to everybody, he was surprised to see Baba there. Then he understood the greatness of Baba and felt that Baba has punished his ego. The next day he took a vow that unless Baba grants his grace he won’t put a foot in Masjid. He stayed fasting in Shirdi.  Three days passed like this and on the fourth day one of his friends came from Khandesh. With all of them he goes to Masjid. As soon as he arrives there, Baba asks him “Oh Doctor, did anyone come to call you? Why have you come? Answer me”. The doctor understood what Baba meant. That night he experienced heavenly bliss in his sleep. His devotion to Sai intensified and he continued to worship Sai later on.



This chapter teaches us to have firm faith in our own Guru; and, it should not be anywhere else. We also need to understand that Guru knows what is best for us and we need not wish for anything. In this chapter Baba also taught us through Mule Sastri, how important to stay with our own Guru no matter what. But at the same time we have to see our Guru in everybody. Baba gave 4 plantains which represent Darma, Ardha, Kaama and Moksha. But to reach the moksha, we have to get rid of the ego. We can be proud of our good qualities, ritualistic behaviors but they can be an obstruction sometimes. Baba taught Doctor Pandit by giving darshan as Sri Rama that Guru is the God. Once we have Guru in our life we do not need anything and we should learn to stay with utmost faith and patience. 

OM SRI SAINATHARPANAMASTHU!


Wednesday, December 13, 2017

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 11



భగవంతుడిని సగుణం మరియు నిర్గుణం అనే రెండువిధాలుగా చెప్తారు. సగుణ స్వరూపమునకు ఆకారము ఉంటుంది కాని నిర్గుణము అంటే ఆకారము లేదు. రెండును పరబ్రహ్మ స్వరూపములే. మొదట్లో సగుణ స్వరూపమే మనకు అనువుగా ఉంటుంది. భక్తి వృద్ధి చెంది, జ్ఞానం కలిగితే అప్పుడు నిర్గుణ ఆరాధన కుదురుతుంది. బాబా అందుకే తనను నిర్గుణంగా ఆరాధించమని చెప్పి అలా కుదరకపోతే అప్పుడు నన్ను సగుణంగా పూజించండి అని చెప్పారు. 

 భక్తిపై గట్టి నమ్మకం ఉండాలి అని సాయి చెప్పారు. ఆయన రకరకాల దేవతలా రూపంలో దర్శనం ఇచ్చారు. అలానే వేరే గురువుల రూపంలో కూడా దర్శనం ఇచ్చారు. అలాఅంటే ఒక సన్నివేశమే డాక్టర్ పండిట్ గారి కథ.  ఒక సారి తాత్యా సాహెబ్ నూల్కర్ స్నేహితుడైన డాక్టర్ పండిట్ అనే ఆయన షిర్డీ వచ్చారు. బాబా అతనిని దాదా భట్ వద్దకు పంపిస్తారు. వారు ఇరువురు బాబా దగ్గరకు వచ్చినప్పుడు, ఈ డాక్టర్ పండిట్ బాబాకు నుదిటిపై త్రిపుండ్రం పెడతాడు. అందరికి ఆశ్చర్యం ఎందుకంటే బాబా ఎవరిని అలా బొట్టు పెట్టనివ్వరు. దాదా తరువాత ఆలా ఎందుకు చేయనిచ్చారు
అని అడిగితె బాబా ఇలా చెప్పారు. ఈ డాక్టర్ నాలో తన గురువైన రఘునాథ్ (కాకా పురానిక్) గారిని చూసుకున్నాడు. అందుకే అతను ఆలా చేయగలిగాడు అని సమాధానం ఇచ్చారు.  ఇక్కడ ఆయన చూపించిన నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడివేసింది అని కూడా బాబా చెప్పారు. దాదా భట్ తరువాత డాక్టర్ పండిట్ ఈ విషయం గురించి అడగగా తన గురువుని బాబాలో చూసినట్లు చెప్తారు. సాయి ఈ విధంగా మన గురువుని మనం ఎలా ఆరాధించాలో నేర్పించారు. మనం మన గురువుతో మమేకం అవ్వాలి. ఆయన దారే మన దారి కావాలి. సాయి ఆరాధన అన్నిదేవతల ఆరాధన కన్నా గొప్పది అని తెలుసుకోవాలి. ఒక్క సారి మనకు గురువు లభిస్తే ఆ గురువు తప్ప మనకు వేరే ఆరాధనలతో అవసరం ఉండదు. ఎందుకంటే గురువే పరబ్రహ్మము. 


ఒకసారి కళ్యాణి నివాసియైన సిద్దిక్ ఫాల్కే అనే ముస్లిం, మక్కమదీనా యాత్రలు చేసి షిర్డికి రావడం జరిగింది. ఆ వృద్దుడైన హాజీ ఉత్తరాభిముఖంగా ఉన్న చావడిలో దిగాడు. బాబా దర్శనం చేసుకోవాలని అని అనుకుంటాడు. కాని తొమ్మిది నెలలు అయినా బాబా అతనిని ద్వారకామాయిలో అడుగు పెట్టనివ్వలేదు. ఫాల్కే దుఃఖానికి అంతేలేదు. ఇదేమిటి ద్వారకామాయి తలుపులు అందరికి తెరిచే ఉంటాయి కాని ఏమిటి నా కర్మ! నేనేం పాపం చేశాను అని అనుకుంటాడు. ఎవరో శ్యామాను పట్టుకుంటే పని జరుగుతుందని చెప్తే ఆశతో ఆయనను సంప్రదించాడు.ఫాల్కే శ్యామాతో ఇలా అన్నాడు. ఒకసారి నా తపనను తొలగించు, దుర్లభమైన బాబా దర్శనాన్ని కలిగించు అని బ్రతిమాలాడు. 

 అప్పుడు శ్యామా బాబా దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. దేవా! ఆ వృద్దుడు చాలా భాద పడుతున్నాడు అతనిని కరుణించండి, హాజీ మక్కామదీనా యాత్రలు చేసి షిర్డికి తమ దర్శనార్ధమై వచ్చాడు. అతనిపై దయ చూపడం లేదు ఎందుకు? అతనిని మసీదులోకి రానివ్వండి. జనులు అసంఖ్యాకంగా వచ్చి మసీదులో మీ దర్శనం చేసుకొని వెళ్తున్నారు కదా! మరి ఇతని విషయంలో విషమ భావం ఎందుకు? ఒక్కసారి మీ కృపా దృష్టిని ప్రసరించండి. అతనిని మసీదులో మిమ్మల్ని కలుసుకోనివ్వండి. తన మనసులోని మాటను చెప్పుకొని వెళ్ళిపోతాడు.
అప్పుడు బాబా శ్యామా! నువ్వు ఇంకా ముక్కుపచ్చలారని పసివాడవు అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే అతనిని నేనేం చేయగలను. అల్లామియాకు ఋణపడి ఉండకపోతే ఎవరైన మసీదు ఎక్కగలరా? ఇక్కడి ఫకీరు లీల అపూర్వం. నేను అతనికి యజమానిని కాను, ఇంకా ఈ సంభాషణ ఇలా సాగుతుంది.  


బాబా అడిగిన ప్రశ్నలకు హాజీ  సమాధానాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ సంభాషణ శ్యామా మద్యవర్తిగా జరుగుతుంది.

బాబా : సరే అక్కడ బారవి బావి సమీపంలో వెనుక వైపున ఇరుక బాట ఉండి. అతడు ఆ మార్గంలో వస్తాడా అని వెళ్ళి స్పష్టంగా అడుగు అని అన్నాడు.

హాజీ  : ఎంతటి కష్టమైన మార్గమైన వస్తాను, నేను వారిని ప్రత్యక్షంగా కలుసుకోవాలి నన్ను వారి చరణాల వద్ద కూర్చోనివ్వాలి.


బాబా : నాలుగు వాయిదాలతో నాకు నలభై వేల రూపాయలను ఇస్తాడా!

హాజీ  : ఈ మాట అడగాలా, వేలు ఏమిటి, అడగాలేకాని నలభై లక్షలైనా ఇస్తాను.

బాబా : ఈ రోజు మా మసీదులో మేకను కోయాలని ఉంది. మరి నీకు మాంసం కావాలా! ఎముక మాంసం కావాలా లేక వృషణాలపై కోరికా? ఆ ముసలి వాణ్ణి నిశ్చయంగా ఏది కావాలో వెళ్ళి అడుగు.

హాజీ  : ఇవేమి నాకు వద్దు. వారికి ఇవ్వాలని ఉంటే నా కోరిక ఒక్కటే    కొళంబో లోని  ఒక ముక్క లభిస్తే చాలు కృతజ్ఞుణ్ణి అని చెప్పాడు.


ఇది విని బాబా ఉగ్రులయ్యారు మట్టి పాత్రను, నీళ్ల కుండను స్వయంగా పైకి ఎత్తి ద్వారం వైపు విసిరివేసారు. తమ చేతిని కరకరా కొరుకుతూ హాజీ  దగ్గరకు వచ్చారు.


బాబా తమ కఫినీని రెండు చేతులా పట్టుకుని నీ మనసులో ఏమనుకుంటున్నావు?  నా ముందా,  నీ ప్రతాపం. ముసని వానిలా బడాయి చూపిస్తున్నావు. ఇలాగేనా ఖురాను పఠించడం? మక్కా యాత్ర చేసానని గర్విస్తున్నావు గాని నన్ను ఎరుగలేకున్నావు. ఇలా ఆయనను మందలించి బాబా అక్కడ నుంచి వెళ్తారు. 

హాజీ  గాబరా పడ్తాడు. మసీదు ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ తోటమాలి మామిడి పళ్ళను అమ్మడం చూసారు. మొత్తం బుట్టను కొని హాజీకి  పంపించారు. వెంటనే వెనుదిరిగి మరల ఆ హాజీ  వద్దకు వెళ్ళారు. తమ జేబులో నుండి డబ్బు తీసి 55 రూపాయలను లెక్క పెట్టి అతని చేతిలో పెట్టారు. అప్పటి నుండి అతనిపై ప్రేమ కలిగి అతనిని భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరూ అంతా మరచి పోయారు. హాజీ ఆత్మానందంలో లీనమైపోయాడు.


ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలను పరిశీలిద్దాము.

బాబా హాజీ  మధ్య జరిగిన సంభాషణలలో ఉన్న అర్ధం ఏమిటి? సద్గురువులకు మాత్రమే ఇది అర్ధం అవ్వాలి.

బాబా బారవి బావి దగ్గర ఉన్న ఇరుకు మార్గం దగ్గరకు రమ్మన్నారు. బారవి బావి అనేది షిర్డిలో ఉన్నట్లుగా చెప్పలేదు. బారవి అంటే 12, ఇది ఆధ్యాత్మిక మార్గంలో కావాలసిన 12 సాధనాలు. ఇరుకు మార్గం అంటే శమధమాది సాధనాలతో, వివేక వైరాగ్యములతో, శ్రద్ద సబూరిలతో, మనస్సును నిర్మలం చేసి గురు కృప పొందడమే ముక్తికి సోపానము. ఈ పన్నెండు  ఆధ్యాత్మిక మార్గంలో ఉపయోగపడ్తాయి.


బాబా 40 వేలు నాలుగు దపాలుగా ఇవ్వమన్నారు. ఇవి మనస్సు, బుద్ది , అహంకారం, చిత్తము. వీటిని అంతఃకరణ చతుష్టయము అంటారు. వీటిని సమర్పిస్తే కాని మనకు గురు కృప కలగదు. ఈ నాలుగు అంతరించినప్పుడే మన నిజ స్వరూపం మనకు అవగతమవుతుంది.
  

తరువాత ఎముక మాంసం కావాలా లేక వృషణాలపై కోరికా అని అడుగుతారు, కాని పాల్కే బాబా దగ్గర ఉన్న కాళంబలోని ఒక్క మెతుకు లభిస్తే చాలు అని అంటారు.


ఇక్కడ బాబా అడిగింది ఏమిటి? ఈ ప్రాపంచిక వ్యవహారాల మీద ఇంకా ఆశ ఉందా, లేదా. 
ఎముకల్లో ఉన్న మజ్జ ద్వారా మన శరీరంలో కణాలన్ని సృష్టించబడతాయి. వృషణాలు  కోరికలకు ప్రతీక. మనలో ఉన్న కోరికలు నశిస్తే కాని హాజీ  కోరుకునే ఆ మోక్షం లభించదు. మక్కామదీన యాత్రలు చేయడం అంటే సామన్యం కాదు. దానికి పరిపూర్ణ హృదయం ఉండాలి. మనం కాశీ లాంటి యాత్రలు చేస్తాము కాని మన మనస్సు పవిత్రం కాకపోతే ఏమి ప్రయోజనం లేదు. ఇవన్ని విన్న తర్వాత బాబా వెళ్ళి హాజీ ను పోట్లాడతారు. ఖురాను చదువుతావు కాని నన్ను తెలుసుకోలేక పోతున్నావు. మక్కా యాత్ర చేసానని గర్విస్తున్నావు, అని మదలించారు. గురువు మందలిస్తే మన మనస్సులోని దుర్గుణాలు నశిస్తాయి. మనంతట మనము మార్చుకోలేని బుద్ది అహంకారములు నశిస్తాయి. గురువు ఆగ్రహం వీటి మీద మాత్రమే. మనం వాటిని అపార్ధం చేసుకోరాదు. గురువు తిట్టినా కొట్టినా గురువు పాదాలను మాత్రము వదలరాదు. గురువుకు మన కర్మ శేషములన్ని ఎరుకయె. వీటిని దగ్ధం చేస్తే కాని మనకు జ్ఞానం లభించదు. అందుకే మనము అహంకార రహితులమై నమ్రతతో జీవించాలి. బాబా 55 రూపాయలు ఇవ్వడంలో కూడా ప్రత్యేకత ఉంది. ఇది బ్రహ్మజ్ఞానికి కావాల్సిన అర్హత. ఇలా ఈ సంభాషణల్లొ ఎన్నో అర్ధాలు దాగి ఉన్నాయి. 
  

తరువాత హాజీ  12 సంవత్సరములు బాబాను సేవిస్తూ షిర్డికి వస్తూ ఉండేవాడు అని చెప్తారు.


 
మనలో కూడా ఈ హాజీ  లాంటి మనస్తత్వమే ఉంది. దానిలో అహంకారం మెండుగా ఉండచ్చు. కాని దాన్ని మనకి మనముగా తెలుసుకోలేము. మనం మంచి అలవాట్లతో ఉండచ్చు. ఎవ్వరికి తెలిసి అన్యాయం చేయకపోవచ్చు. దయా గుణాలు ఉండవచ్చు. భక్తి, జ్ఞానం ఉండచ్చు. వీటన్నింటికి  వెనుక దాగి ఉన్న ఆ అహంభావనను అర్ధంచేసుకోవాలి. అది చాలా లోతుల్లోకి వెళ్ళి ఆత్మ విశ్లేషణ చేస్తేకాని అర్ధం కాదు. ఈ మాయను చేధించాలి అంటే బాబా కృప తప్పక ఉండాలి. బాబా లాంటి సద్గురువులు అరుదు. అటువంటి వారిని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు మన మార్గం సుగమం  అవుతుంది.  



ఇక చివరగా ఈ అధ్యాయంలో బాబా ఎలా పంచభూతాలను తన అధీనంలో ఉంచుకున్నారో అన్న విష్యం గురించి చెప్పారు. ఒక సారి భయంకరమైన తుఫాను వచ్చి, గాలివానతో షిర్డీ గ్రామమంతా అల్లకల్లోలం అయితే, బాబా 
రక్షించడం జరిగింది. అలానే ఒక సారి ధుని మంటలు బాగా ఉదృతమై ద్వారకామాయి కప్పును తాకుతూ ఉంటె, తన సట్కాతో ఆ మంటను అదుపులో ఉంచడం జరిగింది. ఇలా పంచభూతాలను కూడా యోగులు శాసించగలరు. సాయి పరమగురువు మరియు యోగీశ్వరులు. ఆయన అధీనంలో ఈ ప్రకృతి అంతా ఉంటుంది. మనందరము సాయికి శరణాగతి చేస్తే ఆయన మనలను తప్పక రక్షిస్తారు. 

ఓం శ్రీ సాయినాథార్పణమస్తు 



Sri Sai Satcharita Chapter - 11



There are two aspects of God or Brahman : (1) the Unmanifested (Nirgun) and (2) the Manifested (Sagun). The Nirgun is formless, while the Sagun is with form, though both denote the same Brahman. Some prefer to worship the former, some the latter. Our love and devotion do not develop unless we worship Sagun Brahman for a certain period of time, and as we advance; it leads us to the worship (meditation) of Nirgun Brahman.

Shirdi Sai always emphasized the importance of faith in our devotion. He reassured us that he will bless us no matter what.  He appeared as Rama, Datta, Hanuman, Shiva, and all other forms when his devotees prayed to him in those forms. In this chapter Hemadpanth talks about Dr. Pandit’s story where Baba appeared as Sri Guru Raghunath from Dhopeswar (Kaka Puranik). Dr. Pandit came to to Shirdi only once to see Baba. When he went to Dwarakamai, Baba told him to go to Dada Bhat.  Later he came along
with  Dada for Baba's worhip. Dada is a staunch devotee of Baba and till then no one had dared to apply fragrant paste (gandh) “ tilak ” (circular, auspicious mark on the forehead) to Baba. Baba would not allow anyone to apply the fragrant paste to his forehead. Only Mhalsapati smeared it on his throat; others applied it to his feet. But this Pandit was full of devotion. He took away Dada's puja dish,  and holding Sree Sai’s head, he smeared him  with  the three  fingered  parallel  lines; (tripundra). Watching this Dada’s heart began to beat fast. He thought that Baba would be enraged. Thus the impossible had happened! Baba did not utter a word. On the contrary he seemed quite pleased and did not get angry with him at all. So be it.  He let that moment pass.  When Dada asked Baba why he let Dr. Pandit paste tilak and why not others.  Baba said, " He saw his Guru in me and I had no choice except to let him do the worship". Then when Dada spoke to Dr. Pandit he confirms that he saw his Guru Raghunath from Dhopeswar (kaka Puranik) in Baba. 

Sai is even greater than all the seven forms that we all worship – Image of God, Sacrificial altar, fire, supreme light, sun, water, Brahmin (those wearing the sacred thread). Through this story, Baba taught us how to merge with Guru with worship. Sai wanted us to learn how to love our Guru and to have single mindedness in worshiping your Guru.

Next Hemadpanth talks about Haji Siddik Falke from Kalyan who did the Pilgrimage to Mecca – Medina, arrived at Shirdi.  That old Haji stayed in the Chavadi facing the north. For the first nine months Baba was displeased with him and was not ready to meet him. He tried different ways and means but could never exchange glances with Baba. Falke became internally dejected.and somebody advised him to take the help of Shyama.  Then Falke approaches Shyama. Shyama spoke to Baba and told him that Haji has come to Shirdi seeking your blessings after doing the Mecca – Medina pilgrimage. How can you not be merciful to him? And not allow him to come into the Masjid?  Be merciful towards him, just once. Then Baba says "if God does not allow him to come what can I do". 

Then Baba says, There is a narrow foot path beyond the Barvi well. Go and ask him clearly if he will walk and come there correctly”. The Haji said: “However difficult it may be, I will walk correctly. But grant me a personal meeting, and let me sit near his feet”. 

Listening to the answer from Shama, Baba said, “Ask him further: Four times forty thousand rupees, will you give to me?” When Madhavrao gave him this message, the Haji said: “What are you asking? If he asks, I will give forty lakhs! Where lays the question of thousands! ”

Listening to this answer, Baba said: “Ask him. To-day we have a desire to slaughter a goat in our Masjid. What part of the meat, do you wish? Would he like bones with flesh, haunch or testicles? Go and ask that old man, what he definitely wants”.

Madhavrao related in detail to the Haji whatever Baba had said. Haji emphatically said: “I need nothing of all that. Give me whatever he wishes. But I have only one desire. If I only get a morsel from the kolamba, I will have attained my object and my well-being”.

“What do you think yourself to be? Are you boasting in front of me?  You are giving yourself airs because of your age! Is that the way you recite the Koran! You are vain because you have done the pilgrimage to Mecca! But you do not realize who I am! ”

The Haji was dumbfounded. Baba then turned back. While entering the courtyard of the Masjid, he saw the gardener’s wife selling mangoes. He purchased all the baskets and sent them immediately to the Haji. In the same way, he turned back immediately, and went again towards that Haji. He took out Rs. 55/- from the pocket and counted them on his (Haji’s) hands. Thereafter, there developed affection. The Haji was invited to eat and both of them forgot all the past. The Haji was delightfully blissful. Then he left and frequently came again. He took full pleasure in Baba’s affection. Then Baba gave him gifts of monies, from time to time.

Meaning behind this story:
We can learn so much from this story.
Baba said “There is a narrow foot path beyond the Barvi well. Go and ask him clearly if he will walk and come there correctly”.                                                     

There is no such thing as Barvi well physically but it could be the means of Sadhana (practice) and narrow path means treading the path of austerity.          


They can include Samadamadhi Shat sampatti. They are the six virtues:  (a)Sama: Quietude in holding the mind steadily on the object of attention. (b)Dama: Control—mastering of the powers of perception and of action, holding them from running away. (c) Uparati: Cessation from leaning on outer things and external objects. (d) Titiksha: Endurance of afflictions without rebelling against them and without lamentation or grumbling. (e)Shraddha: Faith or firm conviction of the truth about the soul, the science of the soul and the Teachers of that science. (f)Samadhana: Self-settled ness in the Pure Eternal in an increasing measure till permanency therein is attained.

Viveka is discrimination—discernment between the Eternal and the non-eternal. These two are not distant, somewhere far away, but here, near at hand. Both the Eternal and the non-eternal envelop everything, and we have to discriminate between them in eating and drinking, in waking and sleeping, in all the affairs of life.

Vairagya is dispassion or desirelessness, and freedom from self-indulgence. When we indulge the self of sense we follow the non-eternal; when we free ourselves from the senses it is because the Eternal has been glimpsed, however dimly.

Mumukshatavam - Desire to be free from birth death cycle.

In this process we need to control the mind and make it still, have patience for Guru’s grace and move towards the ultimate goal.

Next question was:  “Ask him further: Four times forty thousand rupees, will you give to me?”
Baba is asking here purity of faculty of mind (Mind, Buddhi, Chitta and Ahankara). If we can annihilate these four then we can experience self realization.

The third question was:  “Ask him. To-day we have a desire to slaughter a goat in our Masjid. What part of the meat, do you wish? Would he like bones with flesh, haunch or testicles? Go and ask that old man, what he definitely wants”.

He wanted to test him to see whether he is really interested in worldly activities with a passion. Bones with marrow indicates the creation. Bone marrow is responsible for the birth of so many cells in the body. When we become dispassionate about these worldly objects, we become eligible to walk this path. We can have so many pilgrimages under our belt, it does not matter. We need to purify our mind.    

Guru keeps us straight with his harsh words, so that he can get rid of some bad tendencies from our psyche. In the end Baba gave Falke mangoes which indicate auspiciousness and Rs. 55. This denotes the 5 qualities that he needs to acquire Knowledge of Self. We should never misunderstand this as Guru getting angry at us. In reality this is a blessing. We should never leave the feet of Guru. We have to learn to live with out this egotism and we have to humble.

In the end Hemadpanth talks about how Baba controlled the natural elements. When terrible storm created a panic in Shirdi  and people prayed to Baba o stop this calamity. Then he said "stop, stop your fury and be calm". In a few minutes the rains subsided and skies cleared. In a similar way Baba once controlled the uncontrollable fire from Dhuni. This is our Sai an incarnation of God who had the control of all the 5 elements. Let us surrender to Baba with utmost faith and devotion. 


OM Sri Sainatharpanamasthu!