In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, February 28, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం - 24



హేమద్పంత్ గారు ఈ అధ్యాయంలో బాబా చమత్కారాన్ని శనగల కథ ద్వారా వివరిస్తూ మనం ఎలా భగవంతునికి అన్ని సమర్పించాలో నేర్పించారు. అలానే బాబా తన భక్తులను వారికి ఇష్టం వచ్చిన రీతిలో సేవ చేయనివ్వడం గురించి కూడా చెప్పారు.

శనగల కథ
ఒక ఆదివారం నాడు హేమద్పంత్ బాబా ముందు కూర్చొని పాదాలు వత్తుచూ సేవ చేస్తూ ఉంటారు. శ్యామా, వామన్ రావు, బూటీ మరియు కాకా దీక్షిత్ అక్కడే ఉంటారు. ఇంతలో శ్యామా నవ్వుచూ హేమద్పంత్ ని ఇలా అంటారు. "నీ కోటుకు శనగ గింజలు అంటినట్లున్నవి చూడు" అని అంటారు. అప్పుడు హేమద్పంత్ కోటు మడతలో నుంచి శనగ గింజలు రాలతాయి. అక్కడవున్న వారంతరికి ఆశ్యర్యం కలుగుతుంది. అప్పుడు బాబా ఇలా అంటారు. " వీనికి తానొక్కడే తినే దుర్గుణం ఉంది. ఈ నాడు సంతరోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని గురించి నాకు తెలియును. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలో ఆశ్యర్యపడవలసినదేమి లేదు" అని చెప్పారు.

హేమద్పంత్ అప్పుడు బాబా నేనెప్పుడూ వంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణము నా పై ఏల మోపెదరు? నేనెప్పుడూ సంతకు పోలేదు మరి నేనెలా శనగలు కొనెదను. నా దగ్గర ఉన్న వారికి పెట్టకుండా నేనెప్పుడూ తినలేదు అని అంటారు. బాబా వెంటనే "అవును నిజమే దగ్గర ఉన్న వారికి ఇచ్చెదవు. ఎవరు దగ్గర లేనప్పుడు నీవు మాత్రము ఏమి చేసెదవు. కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెప్పుడూ నీ చెంత లేనా ! నీవేదైనా తినుటకు ముందు నాకర్పించుచున్నావా? అని బోధ చేస్తారు.

ఇక్కడ బాబా శనగపప్పు మిషతో అసలు తత్వాన్ని చక్కగా బోధించారు. ముందు దేవతలకు, పంచప్రాణాలకు వైశ్వానర దేవతాగ్నికి అర్పించకుండా, అతిథికి భోజనం పెట్టకుండా భోజనం చేస్తే ఆ ఆహరం దోషపూరితం. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు కాని దీనిలో చాలా పరమార్ధం ఉంది. ఇది ఒక రసాస్వాదన  గురించి చెప్పినా పంచ విషయాలకు ఇది వర్తిస్తుంది. విషయ భోగాలకు బాగా అలవాటుపడి, విషయాల అధీనంలో ఉండేవాడు పరమార్ధాన్ని సాధించలేడు. వాటిని అధీనంలో ఉంచుకుంటే పరమార్ధం దాసోహం అంటుంది. 

యదా పంచావతిష్టంతే అన్న శృతి వాఖ్యం దీన్నే దృఢపరుస్తుంది. శబ్ద స్పర్శ రూప రస గంధాల తోటి సంబంధం కూడా ఇదే. మనసు బుద్ది మొదలగు ఇంద్రియాలు విషయాలను సేవించేటప్పుడు ముందుగా నన్ను స్మరిస్తే అవి మెల్ల మెల్లగా నాకు సమర్పించబడతాయి. ఈ విషయాలను గురు చరణాలకు అర్పిస్తే విషయాసక్తి సహజంగా తొలిగిపోతుంది. దేనినైనా కోరాలి అనిపిస్తే నా విషయాలనే కోరుకోండి. కోపమొస్తే నా పైనే కోపం తెచ్చుకోండి. అహంకారాన్ని దురభిమానాన్ని నాకు సమర్పించి నా పాదాలయందు భక్తి కలిగి ఉండండి. కామం క్రోధం, అభిమానం ఉదృతంగా లేచినప్పుడు వానిని నా వైపుకు మళ్లించండి. ఈ విధంగా శ్రీ హరి మనోవృత్తులను తొలిగిస్తాడు. నిజానికి ఈ మనోవృత్తులు నా లోనే లయం అవుతాయి. గురువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నారన్న దృఢమైన బుద్ది ఉన్న వారిని విషయాలు ఎప్పుడు బాధించవు. ఈ భావం బాగా నాటుకుంటే అన్ని విషయాలలో గురువు ప్రకటమవుతారు. అప్పుడు ఆ విషయాలు అనుభవించతగ్గవా కాదా అన్న విచక్షణ మనకు కలుగుతుంది. ఇలా మనం విషయలోలత్వం నుంచి బయట పడగలుగుతాము. ఇదే ఈ కధలోని సారం. పవిత్రమైన గురు సేవ లభిస్తే విషయవాసనలు నిర్మూలనమౌతాయి. బాబా ఈ శనగలు సృష్టించడం కేవలం చమత్కారం కాదు. ఈ లీల ఎంతో మహిమాన్వితమైనది. పంచ విషయాలలోని ఏ విషయమైనా బాబాను తలుచుకోకుండా అనుభవించరాదు. ఇదే మనకు బాబా నేర్పించాలి అనుకున్న విషయం. 

అలానే భగవంతుడు ఫలం పత్రం తోయం అని భగవద్గీతలో చెప్పారు. మనం మనస్ఫూర్తిగా ఏది సమర్పించినా చాలు అన్న సత్యం గ్రహిస్తే చాలు. సుదాముడు శ్రీకృష్ణునకు అటుకులు సమర్పించి సకల భోగాలు పొందాడు. కాని ఆయన శ్రీకృష్ణుని భక్తితో సేవించాడు. బాబా కూడా తన భక్తులను ఇలానే అనుగ్రహిస్తారు. భక్తులు ఎలా సేవ చేయాలి అనుకుంటే అలానే చేయనిస్తారు. అన్న చించణీకర్ ఒక సారి బాబా ఎడం చేతిని మర్దన చేస్తుంటాడు. సాయి భక్తులు అప్పట్లో ఒకరు కాళ్ళు పడితే, ఒకరు పొట్టను నొక్కే వారు, ఒకరు నడుము పట్టే వారు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన సేవ వారు చేసే వారు. అలానే మౌసీబాయి అనే ఆమె బాబా పొట్టను మర్దన చేస్తూ ఉంటే అన్నా మూతి ఆమె మొహం దగ్గరగా వస్తే ఆమెకు కోపం వచ్చి అన్నా తనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని ఆమె అంటుంది. ఇద్దరు కోపంతో గొడవపడతారు. అప్పుడు బాబా ఆమెతో ఒక తల్లిని కొడుకు ముద్దు పెట్టుకుంటే తప్పేమిటి అని వాళ్ళ గొడవ చల్లారుస్తారు. ఇంకోసారి మౌసీబాయి గట్టిగా బాబా పొట్టను అదిమి మర్దన చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు కంగారుపడతారు. అప్పుడు బాబా తన పొట్టను సట్కాతో అక్కడ ఉన్న స్తంబానికేసి వత్తుకుంటారు. అందరికి అప్పుడు అర్ధం అవుతుంది భక్తుల సేవలో వారు కల్పించుకోకూడదు  అని. 

సాయి సమర్థులు స్వయం సామర్ధ్యవంతులు, నిగ్రహానుగ్రహాలు ఎరిగిన జ్ఞానులు. సేవ చేసే వారి గుణాలు అవగుణాలు వారికి తెలుసు. భక్తుల అధీనంలో ఉండడం బాబా వ్రతం. 

ఓం శ్రీ  సాయినాథార్పణమస్తు !











Sri Saisatcharita Chapter -24


In this chapter Baba teaches us about the principle of surrender through a funny story of Hemadpanth. There was also mention of Sudama story and How Baba let his devotees serve him.

Grains story (Chana leela).

Once Hemadpant was massaging Baba’s feet and doing his service (seva). At that moment Shyama laughed and remarked: “What Annasaheb! What are these grains here which seem to be stuck? ” Saying so, Shyama touched the sleeve of the coat with his fingers, when from the folds of the coat, grains were found. How did the grains come to be stuck to the coat?  Everybody was wondering how these grains came there.

Then Baba said: “He has a bad habit – that of liking to eat alone. Taking advantage of the market day, he came rubbing the grams in his palms (to take off the skin). It is not good to eat alone. But I know his habit. These grams give the proof. What is there to be surprised about? ”.

 Then Hemadpant said: “Baba, till this day, I have not seen the Shirdi bazaar. If I went there, I could buy the grams. And the question of eating them would arise only later. I never eat anything without sharing it with someone who so ever has this liking may do so, but this is not my habit”.

Now observe Baba’s skill. How he made devotion firmer to himself! Hear with attention, to what he said after listening to my clear denial.

Baba then said; “You share the food with whosoever is near you. But what do you do, when you are alone? What can I also do? Do you remember me? Am I not beside you? Do you offer me a morsel? ”


Meaning behind the story:
Thus he made the grams a mere pretext and deeply impressed upon this principle. Eating food without offering to Indra and other deities, the five ‘pranas’, the fire and defrauding them of it or without offering to all deities made by presenting oblations to the fire before meals, or without offering it to the unexpected guest makes the food highly impure.

In principle, this appears insignificant. But its application in daily life is very important. Enjoying the flavor of the food is not the only implication – all the five senses and other enjoyments are included. One who panders to his senses can never hope to achieve spiritual progress. He who has a tight control over the senses alone can succeed.

The Shrutis proclaim: “Yada Panchavatishthante ” i.e. when all the five senses and the intellect become steady it is considered the highest state of Yoga. That was emphasized by Baba, through this joke.

Words, touch, form, are related to this principle. How full of advice is this teaching of Baba, in relation to this incident!

“Before the mind, the intellect and other senses enjoy these objects; remember me first so that they become an offering to me. The senses can never remain without their objects; but if these objects are first offered to the Guru, the attachment for them will naturally vanish.

If you desire anything, desire me only! If you are angry vent your anger on me only! Offer me your pride and stubbornness. Be devoted only to me.

 Whenever desire, anger, pride arise strongly make me the object towards which to direct them. In this way, one by one, the Lord will help you in eradicating all the ‘Vrittis’. The Lord will certainly calm the strong waves of these three venomous qualities. In fact, this disturbed mental state would be absorbed in my form or would become one with me. A state of peace will be yours at my feet”. If you practice this, desires will become weak, on their own, and with the passage of time desires will be destroyed from their very roots. The mind will be free from all such tendencies.

Knowing and believing that the Guru is close by such a person would never be disturbed by such tendencies. Once such a good habit takes firm root, the bondage of the world will loosen. The Guru’s form will be seen in every desirable object. Thus desire itself becomes the form of the Guru.

If there is the slightest desire for the enjoyment of these objects; and you think that Baba is close by, the question whether the object is fit to be enjoyed or not will at once arise. The object that is not fit to be enjoyed will be easily shunned. In this way, the devotee’s vicious addictions will disappear and an aversion towards the undesirable will develop.

He will be ready to obey the rules for the control of the senses, as mainly stated in theVedas. Then, the enjoyment of the objects will be as per the rules and there will be no indiscriminate indulgence. When such a habit is developed, the thoughts about enjoyment of the sense objects are weakened. The desire for the worship of the Guru arises and pure knowledge will sprout. When pure knowledge grows, the bondage of body-consciousness will break and the intellect will be merged in spirit consciousness, leading to infinite bliss. Even though the body is perishable, it is a means towards gaining enlightenment, which is really more desirable than salvation, because through it, we can experience ‘bhakti’. This fifth rung of gaining enlightenment is superior to the other four ‘kama, artha, dharma and moksha’. They cannot be compared to ‘bhakti’. Invaluable are the gains of ‘bhakti’.

One who achieves fulfillment by serving the Guru can fully understand the implication of this statement. He alone will achieve enlightenment by understanding the inherent meaning of ‘bhakti’, knowledge and detachment. One who thinks of the Guru as different from God is like a man reading the whole Bhagavat without realizing who God is.

 Desire for the objects of senses will be destroyed from the root when you serve the Guru, with a pure heart. The mind will become pure and sinless and your Self will manifest with effulgence. So be it. Given the strong desire, it was an easy matter for Baba to produce roasted grams! He needed no special time for the enactment of the most miraculous deeds. A popular conjurer or juggler, merely to earn his livelihood, can produce whatever you ask for, by waving his magic wand. But Sainath is a divine conjurer! What can be said about the prowess of his miracle? When he wished, he produced innumerable grams, on the spur of the moment.

 Moral of this story:

This story expands our horizons and if we can follow these principles in our daily life; we will become pure in our heart. Then we will be saved by our Guru from this life death cycle.

Let us concentrate on it. ‘Do not enjoy any object with any of our five senses without first remembering Baba’. When the mind is trained in this way, we will be always reminded of him. The attention will be at Sai’s feet in all transactions.

That Incarnation of Pure Brahman will ever remain before the eyes and then devotion, liberation and non-attachment would arise.

Salvation will be achieved. When this beautiful form is fixed before our mental vision, we forget hunger, thirst and the mundane existence.

The consciousness of worldly pleasures will disappear and our mind will attain peace.

Next Hemadpanth talks about Sri Krishna and Sudama when they were in the ashram of their guru Sandipani. Sudama offers krishna handful of parched rice and how Krishna blessed him with wealth. when we offer anything to God first before we enjoy them, we will be relieved of the consequences of those actions. 

Anna Chinchanikar was serving Baba by shampooing his left arm and on the right side Moushibai was serving Baba. Moushibai is an elderly widow and everyone called her mother. She was trying to massage Baba's trunk and abdomen. In the process, she accuses Chinchanikar that he is trying to kiss her. He gets upset with her and Baba intervenes to calm both of them down. Another time Moushibai was so forceful in massaging Baba's abdomen that everyone was worried that she might injure Baba. Then Baba go up from his seat and dashed his Satka on the ground. Then he took hold of one end of satka with both hands and pressed it in the hollow of his abdomen. The other end he fixed to the post and began to press. Everyone felt anxious and Baba calmed down after some time. From this time onward devotees learned their lesson not to interfere with anybody but allow them to serve Baba the way they want. 

This chapter is about our mindset on how we serve our Guru and our intentions. It is essential to surrender with full faith to once own Guru.



OM SRI SAINAATHARPANAMSTHU!


Wednesday, February 21, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం - 23



హేమద్పంత్ గారు ఈ అధ్యాయంలో బాబా యొక్క వినమ్రతను వర్ణిస్తూ భక్తులలో ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. బాబా ఎల్లప్పుడూ భగవంతుడే సర్వాధికారి అని చెప్తూ, నేను ఆయన దాసుడ్ని అనే భావంతో మెలిగేవారు. వారు ఎవ్వరితోను పోల్చుకునేవారు కాదు. అలానే ఇతరులను కూడా పోల్చుకోనిచ్చేవారు కాదు. వారు ఎవరిని తిరస్కించేవారు కాదు. ఎవరిని తుచ్ఛంగా చూసేవారు కాదు. పుణ్యసంచయం ఉంటె కాని సత్పురుషులను గురించిన విషయాలు విని ఆనందించాలన్న కోరిక జనించదు. 


ఒక సారి ఒక యోగాభ్యాసి నానా చాందోర్కర్ ద్వారా బాబా గురించి విని షిర్డీకి వస్తాడు.  ఈయన పతంజలి యోగ సూత్రములు మరియు ఇంకా యోగ శాస్త్రాన్ని పూర్తిగా అభ్యసించాడు. కాని దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోలేక, సమాధిస్థితి పొందలేక, బాబా అనుగ్రహం ఉంటె తాను ఈ స్థితి పొందగలనేమో అనే ఉద్దేశంతో బాబా దాగరకు వస్తాడు. అక్కడ బాబా ఒక ఎండు చద్ది రొట్టె మరియు ఉల్లిపాయను తింటూ ఉంటె చూసి బాబా తనకు ఏమి నేర్పించగలరు అని భావిస్తాడు. అప్పుడు బాబా "నానా ఉల్లిని జీర్ణం చేసుకోగలిగిన వారు మాత్రమే తినాలి" ఆ మాటలు విన్న యోగాభ్యాసి చకితుడయ్యాడు. అప్పుడు అతనికి బాబాపై నమ్మకం గలిగి తన సందేహాలకు సమాధానాలు పొంది బాబా ఆశీర్వాదంతో అది పొంది సంతోషంగా వెళ్ళిపోయాడు. 

శ్యామా శరణాగతి: ఒకసారి శ్యామాని ఒక పాము కరుస్తుంది. విషము బాగా నర నరాల్లో పాకుతుంది. వాళ్ళ ఆచారం ప్రకారం పాము కరచిన వారిని ఆ ఊరి గుడికి తీసుకువెళ్తారు. కాని శ్యామా దానికి ఒప్పుకోలేదు. చావు అయిన బ్రతుకు అయినా బాబానే నా దేవుడు అని గట్టి నమ్మకంతో చెప్పాడు. అప్పుడు ఆయన్ని బాబా దగ్గరకి తీసుకురావడం జరిగింది. బాబా శ్యామాని బతికించడం అంతా మనకి తేలిసినదే.  శ్యామా మహానుభావుడు. అంతటి నమ్మకం, భక్తి మనకి కూడా రావాలి.

ఒకసారి షిర్డీలో కలరా వ్యాధి బాగా ప్రబలి గ్రామవాసులు భయపడుతూ బయట ఊర్లతో రాకపోకలు మానేస్తారు. గ్రామ పంచాయతీ వారు సభచేసి రెండు అత్యవసర నిర్ణయాలు తీసుకుంటారు. మొట్టమొదటిగా ఆ ఊరిలోకి కట్టెల బళ్ళు రాకూడదని, రెండవ నిబంధన ఎవరు కూడా మేకలను కోయకూడదు. ఇలా ఉంటె ఒక రోజు ఒక కట్టెలబండి వస్తుంది. అందరు దాన్ని వెనుకకు పంపివెయ్యాలి అనుకుంటే బాబా వచ్చి ద్వారకామాయి వైపు రమ్మని తీసుకువెళతారు. బాబాకు తెలుసు ఈ నిభందనలు అర్ధం లేనివి మరియు మూఢనమ్మకాలతో కూడుకున్నవని. దీనికి తోడు కట్టెలు లేక ఆ ఊరివారందరు వంట చేసుకునేందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఈ సమస్యను బాబా పరిష్కరించి రెండో నిబంధనను ఈ విధంగా ఒక లీల ద్వారా ధిక్కరించెదరు. 

మేకను చంపేకథ
జీవుడు వాస్తవానికి త్రిగుణాతీతుడు కాని మాయా మోహితుడై తన సచ్చిదానంద స్వరూపాన్ని మరచిపోయి శరీరమే తాను అని అనుకుంటాడు. ఆ శరీరాభిమానంతో నేను కర్తను, నేను భోక్తను అని తలచి అనర్ధమైన జనన మరణ పరంపరలో పడి బాధపడతాడు. వాటి నుంచి బయటపడే మార్గమే ఎరుగడు. గురువు పాదాలయందు ప్రేమపూర్వకమైన భక్తి యోగమే అనర్ధాలను ఉపశమింపచేసే మార్గం. ఆ గురువు పట్ల శ్రద్ధను తెలియచేసేదే ఈ కథ.

             ఒకసారి మరణానికి సిద్ధంగా ఉన్న మేకను ఎవరో తీసుకొని వచ్చారు. దానిని చూడటానికి జనం వచ్చారు. ఏ దిక్కులేని వారిని రక్షించే దైవమే సాయిమాత. అప్పుడు బాబా ప్రక్కనే ఉన్న బడేబాబాను "ఒక దెబ్బతో దీన్ని చంపేసి బలి ఇవ్వు" అని అన్నారు. అప్పుడు బడేబాబా "దీన్ని ఊరికే ఎందుకు వధించాలి" అని అన్నాడు. అక్కడే ఉన్న శ్యామాతో బాబా "శ్యామా నీవైన వెళ్ళి కత్తి పట్టుకురా ఈ మేకను కోద్దాం, వెళ్ళు" అని ఆజ్ఞాపించారు. శ్యామా, రాధాకృష్ణబాయి దగ్గరకు వెళ్ళి కత్తి తెచ్చి బాబా ముందుంచాడు. ఇంతలో ఈ విషయం రాధాకృష్ణ బాయికి తెలిసి, ఆమె కత్తిని తెప్పించుకున్నది. శ్యామా మరో కత్తి తేవడానికి వెళ్ళి వాడాలో కూర్చుంటాడు. తరువాత కాకా దీక్షిత్ మనసు పరిక్షించాలని బాబా "నీవు వెళ్ళి కత్తిని పట్టుకురా, ఈ మేకను భాద నుండి విముక్తి చేద్దాం" అని ఆజ్ఞాపించారు. గురువు ఆజ్ఞ మేరకు సాఠె వాడాకు వెళ్ళి కత్తిని తెచ్చాడు. దీక్షిత్ కత్తిని దృడంగా పట్టుకున్నాడు. దీక్షిత్ పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించి, పుట్టినది మొదలు అహింసా వ్రతాన్ని ఆచరించినవాడు. గురువు ఆజ్ఞా పాలనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. కాని గుండె దడదడ లాడింది. శరీరం చెమటలు పట్టింది. దీక్షిత్ ఒకచేతిలో పంచెను నడుముకు బిగించి, రెండవ చేతిలో కత్తిని పుచ్చుకొని చొక్కాను పైకి జరుపుకుంటూ మేక దగ్గరకు వచ్చాడు. మరలా బాబాను అడిగాడు "బాబా దీన్ని నరకమంటారా" దీక్షిత్ మేకను చంపాలని త్వరపడినా అతని హృదయంలో కరుణ వలన చేయి వెనుకకే కాని ముందుకు సాగటం లేదు. "ఇంకా చూస్తూన్నావేమి? చంపేసేయి" అని బాబా అన్నారు. అప్పుడు కాకా చేయి ఎత్తి కత్తిని కిందకు దించపోతున్నాడు. ఇంతలో బాబా "వద్దులేరా ఊరుకో! బ్రాహ్మణుడవై ఇంత కఠోరంగా హింస చేయడానికి సిద్దమయ్యావు నీ మనసుకు ఆలోచనే లేదా" అని అడిగారు.
             అప్పుడు దీక్షిత్ కత్తిని కిందపడేశారు. కాకా అప్పుడు "బాబా! మీ అమృత వచనాలు మాకు ధర్మశాసనం మేము రెండో ధర్మాన్ని ఎరుగం, మాకు సిగ్గు, లజ్జ లేవు, గురువచనా పాలనే మా కర్తవ్యం. ఇదే మాకు వేదం. అహింస మేమెరుగం. మమ్ము తరింప చేసేవి సద్గురుచరణాలు. ప్రాణాలు ఉండనీ, పోనీ మాకు గురువు ఆజ్ఞయే ప్రమాణం" అని ఎంతో చక్కగా వివరించాడు. తరువాత బాబా కాకాతో ఈ నీళ్ళ డబ్బా పట్టుకో నేను ఇప్పుడు హలాల్ చేసి సద్గతిని కలిగిస్తానని అన్నారు. అంతలో ఫకీర్ బాబా ఈ మేకను తకియాలో వధించటానికి అనుమతి తీసుకున్నాడు. దాన్ని బయటకు తీసుకు వెళ్ళగానే చనిపోయింది. మేక చావటం తధ్యం అని అందరకు తెలుసు కాని బాబా ఈ లీల చూపించటానికే ఇదంతా చేశారు.

             ఈ విషయంలో దీక్షిత్ పరిక్షలో నెగ్గారు. అందుకే బాబా దీక్షిత్‌ను ఎప్పుడూ పొగిడేవారు. ఆయనకు నిన్ను విమానంలో తీసుకుపోతా అని వాగ్దానం చేశారు. ఇటువంటి శిష్యుడే బ్రహ్మజ్ఞానానికి అర్హుడు. గురుసేవా తత్పరులు, గురువు ఆజ్ఞ యందు గౌరవం ఉన్నవారు తమ ఇష్టాయిష్టాలను, ఆలోచనలను గురువు శిరసుపై ఉంచుతారు. గురువు ఆజ్ఞను పాటించేవారు మంచి చెడులను, సారాసారాలను చూడరు. వారి చిత్తం సాయి నామస్మరణలో, దృష్టి సాయి సమర్దుని చరణాలలో ఉంటాయి. మనోవృత్తి సాయిధ్యాన ధారణల యందు ఉంటుంది. వారి శరీరం సాయి కొరకే. గురువు ఆజ్ఞను, ఆజ్ఞా పాలనను రెండింటిలో ఒక్క క్షణమైన ఆలస్యం సహింపరానిది. ఇది విలక్షణమైన విధానం.

             ఈ విధంగా దీక్షిత్ బాబా మాటే వేదవాక్కు లాగా పాటించటానికి వెనకాడలేదు. ఈ మహాభక్తుని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. గురువు మీద అపార నమ్మకం ఉండటం అంటే ఇదేనేమో. ఎవరైనా గురువు చెప్పిన మంచి పనులు చేస్తారు. కాని గురువుని పూర్తిగా నమ్మి తన జీవితాన్నే పణంగా పెట్టగలిగిన శిష్యులు ఎంత మంది ఉంటారు.

ఈ అధ్యాయంలో చివరగా హేమద్పంత్ గారు శిష్యులను మూడురకములుగా చెప్పారు. ఉత్తములైన శిష్యులు గురువులకేమి కావాలో వారు అడగకుండానే తెలుసుకుని నెరవేర్చేవారు. మధ్యములు గురువు అడిగితే మాత్రమే చేసే వారు. ఇక చివరగా అధములు గురువు చెప్పినా  కాని ఆ పనిని వాయిదా వేస్తూ తప్పులు చేసే వారని చెప్పారు. మనం ఉత్తమ భక్తులుగా బాబా చూపిన మార్గంలో పయనిద్దాము. 

ఓం శ్రీ సాయినాథార్పణమస్తు 







Sri Saisatcharita chapter 23




In this chapter Hemadpanth talks about greatness of Baba and his humble attitude towards God. He used to say “I am a slave of God”. Sai never compared himself to others or allowed anyone to do so. He did not despise anyone nor considered anyone as insignificant.  Only a store of merits in the previous life will create an interest and love for listening to the stories of saints, to obtain happiness and contentment.


In this chapter Baba teaches an important lesson through a sadhaka who was well versed in Patanjali Yoga sutras and other scriptures. He was accompanied by Nana Chandorkar and came to see Baba thinking that he can attain Samadhi sthithi in meditation. Even though he practiced all these methods, he could not reach to the level of perfection. He was disappointed. He was hoping that Baba can show him the way. When he came to Dwarakamai, Baba was about to eat Bhakri with onion. Bhakri is  like a bread which happened a dry one. Immediately in his mind he thought, how can this person can teach me anything if he is eating onion. When such a notion arose in his mind, Sai Maharaj, the Knower of All hearts said: “Nana, only those who can digest onion should eat it. One who has the capacity to digest it, he can eat onion safely”. Hearing this, the yogi was startled and, from within, completely surrendered with full faith. Then he came near Baba and asked relevant questions and all his doubts were cleared. He returned with a happy mind.



Here we will make an effort to understand what Baba was teaching. Whenever we take a task we first need to understand what we are about to do. Then we need to understand the consequences of those acts. Without proper understanding we will be clueless. Sometimes we might feel we know everything and this can be tricky. If we are not influenced by our emotions we can handle any tough situation. Even in spiritual world, one needs to have solid foundation of fundamental principles by practice not by just theory. This is what Baba saying about eating the onion. Can we absorb the passions (rajo guna) that can arise by eating that?  


Next Hemadpanth talks about how Syama was saved by Baba from snake bite. Once Shyama was bitten by a snake and the posion was spreading all over the body. He is about to die. There was one custom in the Shirdi village that they will take a person who was bitten by a snake to a temple in the village. But Shyama told the villagers that no matter what happens to him, he has to go to Baba only.   By the time they reach the Dwarakamai, poison was already spreading all over. His condition presented to be very grave. Of course Baba saved him. Shyama is a great soul and he is a perfect example of pure devotion and faith. We have to thrive for that kind of devotion.

Once there was cholera epidemic in Shirdi and the village heads decided that no fuel carts should be allowed into the village. They also imposed a rule that no goat should be killed there. If anyone disobeyed these ordinances they will be punished. Baba knew that these ordinances are superstitious and meaningless. But at that time people felt they were appropriate. Baba let a fuel cart come in to the village as everyone was short of the fuel. No one can speak against Baba's actions. Baba kept his dhuni burning all the time. People were free to take the wood as they wished. Baba never said a word. He proved another ordinance wrong by following story. 

Story of Goat slaying:             

This story illustrates the extreme devotion and faith by Dixit towards Baba.

 Once there was cholera epidemic in Shirdi area and someone brought a sick goat to Baba which is about to die. Then at that time, Bade Baba was nearby. Baba said: “Offer it as a sacrifice. Kill it with one stroke”. When that Bade Baba was the first one to be asked to kill the goat, the excuse that came from his mouth was: “Why should it be unnecessarily killed?” 

Then Baba ordered Shyama, “Shyama, you at least bring a knife. We will cut the goat. Go now”. Madhavrao was a faithful devotee. He went to Radhakrishnamai and brought a big knife and placed it before Baba. Though Shyama was troubled about bringing the big knife, Baba would not have been satisfied in seeing him without the knife. In the meanwhile, Radhakrishnamai learnt about this matter and recalled the big knife because she felt pity. Then Shyama left to get another knife. He remained in the Wada, delaying his return, so that the killing would not have to be done at his hand.


Then to test Kaka’s mind, Baba ordered him: “Go, you bring a big knife to cut. Let the goat be freed from its misery”. Then he went to Sathe’s Wada and brought the instrument (to kill) as per the order. He got himself ready to kill the goat without the least hesitation. He was determined to undauntedly obey the Guru’s order. But his heart was palpitating and his body was soaked in perspiration. Then tucking in his dhoti with one hand and holding up the knife in the other, he folded up the sleeve of the hand that held the knife. He came forward where the goat was. Then, he tightened his grip on the big knife, raised his hand and said: “Baba, shall I kill it? Just tell me once.” Truly speaking, a weapon is held only to protect the weak; and yet it was now raised above an innocent goat! But he had dedicated his life to serve the Guru. Therefore, he had no hesitation. He wanted to kill it quickly. But pity arose in his heart and the big knife wavered. The hand would not descend. “Come on, kill now, what are you waiting for? Hearing this final order, he made a semi-circular turn for an effective strike. He lifted his hand with the big knife. Now he would certainly strike! Seeing this, Mother Sai, knowing that it would be a calamity said: “Oh let it be. Oh, Kaka, stop this. How cruel you are! Though you are a Brahmin, you are ready to kill! Have you no thought about this? ” Hearing this, he threw aside the big knife. The young and the old were surprised. The goat’s life was spared. Devotion to the Guru had scaled the peak!

 Then, Kaka, after throwing away the large knife said what? Pay attention: “Baba, your nectar-like words are the only ‘dharma’ and laws in our life. We have no other dharma. We have no shame. Obeying the Guru’s order is our only creed. It is our Veda(Scripture) and Shastra. To completely obey the Guru’s order, that is the meaning of discipleship for a disciple. That is our jewel. Disobedience is the greatest sin. We never consider the consequences of these actions whether they give pleasure or pain. Whatever is our fate will happen.  Our salvation is at the Sadguru’s feet. Why should we think of the reason behind the order? It is our duty to obey.

Then Baba wanted to take care of the business himself to give sadgati to that goat. Then Bade Baba wanted to avoid this and take it to Takiya. When they were taking the goat, it died on the way. Everyone knew that the goat’s death was imminent, but at the opportune time Baba enacted this drama.

Spiritual meaning behind the story:

This was a difficult test and Kaka was pure gold. Though Baba knew this fully, unless he had tested him in public, it would not be believed. Baba promised him that he will take him in “Vimana” that is providing him sadgati (Salvation). This is the kind of devotee who is eligible for Brahma-Jnana (Self-Realization).

If one had doubts about the words of a saint, his efforts for achievement are unsuccessful. His words become meaningless, futile, fruitless chatter. Not even a bit of spiritual growth is gained. One who respects the words of the Guru will achieve his welfare and the supreme goal of his life. But he who finds fault with them and thinks them vile, he is ruined. One who is always ready to serve the Guru, respects and obeys the Guru’s orders; he makes the Guru responsible for what is correct or incorrect in all respects. He is the servant of the Guru’s orders. He does not think independently. Always, obeying the orders of the Guru, he does not distinguish what is good or bad. Mind should be engrossed in remembering Sai’s name; the eyes should be fixed at the feet of Sai; the attitude should be of meditation on Sai – the whole being should be dedicated to Sai. Even if a moment is lost between receiving the orders and executing them, that time also cannot be tolerated. This is a strange level of awareness! 

Dixit was a man of pure heart. He was truthful, courageous, and unshakable as a rock in his determination. It did not even occur to him to question the righteousness of killing the goat. The mind should be always at the Guru’s feet, whether I live or die. We obey the order of the Guru. He alone knows the consequence or the end result.


  Hemadpanth talks about best disciples who will guess what Guru needs and does it even before the Guru asks them. The  average disciple will do things when Guru asks them to do. Where as the ordinary disciples will postpone the service to Guru or make mistakes even if they do it. The devotes should have firm faith in their Guru backed up by intelligence and patience.   

Om Sri Sainatharpanamasthu!
 


Tuesday, February 13, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 22



సాయి సద్గురు! మీరు ఆనందసాగరం. మీరు ఏ ఆకారంలేని నిరాకారం. మీరే శ్రుతులు చెప్పిన ఆత్మ తత్త్వం. మిమ్ములను ప్రార్థిస్తే చాలు కలి కష్టాలన్నీ నశిస్తాయి. మిమ్ములనే ఎల్లప్పుడూ ఈ మనసు ధ్యానిస్తూ ఉండాలి. అందుకే బాబాను ఇలా ప్రార్ధించాలి. ఓ సాయి! మీ స్వరూప దర్శనం తప్ప మాకు ఏది రుచించదు. పరమ సుఖాన్ని పొందటానికి శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ చరణాలు తప్ప మాకు వేరే గతి లేదు.  అందుకే బాబా కూర్చునే విధానం సాయిభక్తులకు అనువుగా ఉంటుంది. వారు కాళ్ళను ఒక దానిపై ఇంకొకటి వేసి కూర్చుంటారు. ఎడమ చేతి వేళ్ళు కుడిపాదంపై వేసి ఉంటారు. కుడికాలి బొటనవేలిపై చూపుడు వ్రేలున్ను, మధ్య వ్రేలున్ను ఉంటాయి. ఈ కూర్చున్న విధానాన్ని బట్టి బాబా మనకు ఇలా తెలియచేస్తున్నారు. "నా ప్రకాశం చూడాలి అంటే అహంకారం విడిచి మిక్కిలి అణుకవతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశం చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము". 

బాబా తన భక్తులను ఎలా విషజంతువులనుంచి కాపాడారో అనే విషయాలను ఈ అధ్యాయంలో హేమద్పంత్ గారు పొందుపరిచారు. 

బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంకు మామలతదారుగా ఉండేవారు. అతను చితలీ గ్రామ పర్యటనకు వెళ్తూ బాబాను కలిసేందుకు షిర్డీ వస్తారు. బాబా అతని యోగక్షేమాలు అడిగి "నీకు ద్వారకామాయి తెలియునా? నీవిప్పుడు కూర్చున్నదే అది. ఎవరైతే ఆమె వొడిలో కూర్చొనెదరో వారిని ఆమె కష్టములనుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆమె ఆపదలనుండి తప్పించును. అని చెప్తూ "నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియునా? అదే సర్పము". అని అంటారు. బాబా తమ ఎడమ చేతిని మూసి కుడి చేతివద్దకు తెచ్చి పాము పడగవలె నుంచి, అతడు మిక్కిలి భయంకరమైన వాడు కాని ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుతుండగా పాము ఏమి చేయగలదు అనెను.  తరువాత మిరీకర్ వెళ్ళబోతూ ఉంటె శ్యామాను కూడా వెళ్ళమని బాబా చెప్తారు. కాని మిరీకర్ అనవసరంగా శ్యామాను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మొదట వద్దని తరువాత ఇద్దరు కలిసి వెళ్తారు. వారు చితలీ వెళ్లి అక్కడ ఉన్న మారుతి ఆలయంలో బస చేస్తారు. ఆయన వార్తాపత్రిక చేదువుతూ ఉంటె ఒక పాము ఆయన అంగ వస్త్రంపై జారుచు కిందకు దిగి వెళ్ళిపోతుంది. కాని ఆయనకు ఎట్లాంటి హాని జరగదు. అప్పుడు మిరీకర్ బాబా చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు. ఆయన కళ్ళు భక్తిభావంతో నిండిపోతాయి. 

 ఒక సారి బాపుసాహెబు బూటీ గారిని నానా డేంగ్లే అను జ్యోతిష్కుడు తనకు ఆ రోజు అశుభము అని, ప్రాణ గండం ఉన్నది అని హెచ్చరిస్తాడు. తరువాత బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు బాబా ఇలా అంటారు. "ఈ నానా ఏమంటున్నాడు? నీకు మరణమున్నదని చెప్తున్నాడా, ఏమి బయపడనక్కర్లేదు. మృత్యువు ఎట్లు చంపునో చూచెదము గాక! అని చెప్పారు. ఆనాటి సాయంకాలం బాపుసాహెబు బూటీ మరుగు దొడ్డికి పోయెను. అప్పుడొక పామును చూచెను. అతని నౌకరు దానిని చూసి ఒక రాయి ఎత్తి కొట్ట బోయెను. బూటీ గారు కర్ర తెమ్మని చెప్తారు. ఇంతలో ఆ పాము అక్కడనుంచి అదృశ్యమవుతుంది. బూటీ గారికి అప్పుడు బాబా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. 

 బాబా తన భక్తులను రక్షించిన విధానాలు భక్తుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ అనుభవాలగురించి ఎంత చెప్పుకున్నా తనివితీరదు. అలానే ఇంకొక భక్తుని బాబా ఎలా రక్షించారో ఇప్పుడు చూద్దాము. అమీర్ శక్కర్ కమీషను వ్యాపారం చేస్తూ ఉండే వాడు. ఆయనకు కీళ్ల వాతం ఉండేది. మిక్కిలి బాధ పడే వాడు. ఆయన షిర్డీకి వచ్చి బాబాను శరణు వేడుతాడు. అప్పుడు బాబా అతనిని చావడిలో ఉండమని చెప్తారు. అక్కడ చాలా తేమగా ఉండి ఇంకా నెప్పులు ఎక్కువ అవ్వచ్చు కాని బాబా ఆదేశం కూడా ఔషధమే. బాబా కూడా రోజుమార్చి రోజు అక్కడే ఉండే వారు. ఈ విధంగా బాబా దర్శన భాగ్యం కూడా కలిగింది. పూర్తిగా తొమ్మిది మాసములు అక్కడ ఉండెను. తరువాత అతనికి విసుగు కలిగి ఒక రోజు చెప్పకుండా కోపర్గామ్ పారిపోయెను. అక్కడ ఒక ఫకీరు చనిపోయే స్థితిలో ఉంటె ఆయనకు మంచి నీళ్లు ఇస్తే అవి తాగి ఆ ఫకీర్ చనిపోతాడు. అక్కడ ఉంటె తన మూలానే చనిపోయాడని తనని అనుమానిస్తారని మరల షిర్డీకి వెళ్తాడు. బాబా మాట వినకుండా వచ్చినందుకు తనకు ఈ శాస్తి జరిగింది అని అనుకుంటాడు. మరల అక్కడ చావడిలోనే ఉండి తన కీళ్ల వాతం పోగొట్టుకుంటాడు. ఒక రోజు మధ్య రాత్రి బాబా "అబ్దుల్ నా పరుపువైపు ఎదో దుష్ట ప్రాణి వచ్చుచున్నది" అని అరిచెను. లాంతరు తీసుకొని అబ్దుల్ వస్తే అక్కడ ఏమి ఉండదు కాని అమిర్ శక్కర్ దిండుకి సమీపంలో ఆ పాము కనిపిస్తుంది. వెంటనే దానిని అక్కడ ఉన్న వారు చంపేస్తారు.  ఇలా సకాలంలో హెచ్చరించి అమిర్ శక్కర్ను రక్షిస్తారు. 

ఇంకా ఈ అధ్యాయంలో చివరగా స్వయానా హేమద్పంత్ గారిని తేలునుంచి మరియు పాము నుంచి రక్షిస్తారు.   బాబా సర్వ ప్రాణులపట్ల ప్రేమ భావంతో ఉండేవారు. విషజంతువులను కూడా కరుణించి దయ చూపాలి అని బోధించేవారు. అందరిని రక్షించేవాడే దైవం.


ఓం శ్రీ సాయినాథార్పణమస్తు ! 




the time. 

Sri Saisatcharita chapter - 22




Sai Sadguru is the cloud of happiness, the Incarnation of Supreme Knowledge and Holiest of the Holies. Hail to thee the Remover of the Fears of this world and the Destroyer of the sins of Kaliyug by burning them. We need to pray to Baba like this. Baba! Nothing else pleases me than your darshan. I feel that I should keep your form in front of my eyes all the time, and meditate on it. You are the incarnation of pure knowledge. To achieve the goal of happiness, there is no other path to us than to be at your feet. Baba’s posture is in such a way so that we have easy access to his feet. His left index and middle fingers hold the right foot with his legs crossed. The fingers form a V shape and the nail of the big toe is close to his thumb. This shines like a moon on the second day. This is to tell us that to be most humble before everyone, concentrate on the toe and this is a very easy way of devotion.


In this chapter we can learn how much Baba cared for his devotees and how he cautioned them to protect from life threatening situations. One such story is about Kaka Saheb Mirikar who was a Mamlatdar of Kopergaon. A large group of people along with Syama were sitting there in Dwarakamai. Then Baba asked Mirikar “Oh, this is our Dwarkamayi. Do you know it? ”This is our Dwarakamai! When sitting in the lap of the Masjid, she safeguards the children and there will never be any question of worrying. This Masjidmai is very kind. She is the Mother of all the innocent and faithful devotees. Anyone may face any difficulty, she will readily protect. Once a person settles in her lap, all his difficulties are solved. He who lies in her shadow, he will be on the throne of happiness. This is that Dwarka, Dwaravati! ” Then Baba gave him udi and kept his protective hand on his head, after which Mirikar got up to leave. Baba again thought of putting a question to Mirikar: “Do you know the long ‘bava’ (serpent)? And it’s mysterious powers? ” Then he closed his fist and took his left arm near the elbow of his right arm, and holding it moved it around and said: “He is terrible like this! But what can he do to us? We are Dwarkamai’s offspring’s. Nobody can comprehend her activities. Just quietly watch her wonders. When Dwarkamayi is there to protect, how can the long ‘bava’ dare to attack? The strength of the attacker is not comparable to that of the savior? How can it be explained! ”


Mirikar did not understand Baba’s words, prostrated and asked his permission to leave. While he was leaving Baba asked Syama to accompany him as Mirikar is about to leave to another place. Mirikar initially did not want Syama to come along with him but later agrees to take him. They go to a place called Chithali and decided to stay at Maruthi temple that night. While he was reading newspaper, a worker observes a snake crawling from his body and it goes down without causing any harm. Then Mirikar realizes what Baba told him to be careful about a snake. His eyes filled with devotion and love towards Baba.


Baba Protecting Butti:

Once Butti was told by Nana Saheb Dengle, an astrologer that he is going to have some calamity and to be careful. Then Butti became restless and worried. Later on, the whole group went to the Masjid at the usual time. Bapusaheb, Nana and all others went along and sat with Baba. Immediately Baba asked Butti: “Well what does this Nana say?

Does he predict your death? You have nothing to fear”.  In the evening, Bapusaheb went outside to the toilet to ease himself; and, in the toilet there came a snake, at that time. Looking at that terrible creature, Bapusaheb came out and called his servant. By the time he went to get a stick the snake drifted into hole nearby. The incidence reminded him of Baba’s words and how Baba protected him.


By making the devotees undergo such and similar experiences, he has attracted the hearts of his devotees; and to describe them in words, it would be always inadequate. Here is another such story and this time it is about a devotee by name Amir Shakkar. He was a broker by occupation and he is from Butcher caste. He was suffering from Rheumatic arthritis in his limbs. He was going through extreme pain and could not even walk properly. He went to Shirdi and bowed down to Baba for help. Baba asked him to live in Chavadi where lepers and other diseased persons live. He lived there for 9 months and his joints became very stiff. Sai’s darshan every day worked for him as medicine. But he became confined and left to a dharmasala in Kopergaon. He gives a fakir some water to drink who was thirsty. Then the fakir dies after drinking the water. He got scared thinking that there will be an enquiry for his death and they will blame him. He leaves that place and prays to Baba to protect him. He felt terrible for not listening to Baba. Then somehow he comes back to Shirdi. One day he was sleeping near Chavadi and all of a sudden Baba started yelling and hitting ground with his Satka. Then everyone woke up. Then Abdul came with a lamp and they found a snake near the pillow of Amir Shakkar. The calamity was averted. Then Amir realized how Baba protected him. After a while all his pains were alleviated and he felt better with his Arthritis.


Finally Hemadpanth talks about how Baba protected him on two occasions. Once from a scorpion sitting on his shoulder and other time from a snake at Kaka Saheb’s place.

Baba said God lives in all organisms and all creatures. He helped his devotees all the time. 

Sri Sainaatharpanamasthu!








the time and averted so many difficulties.

Wednesday, February 7, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం -21




ఈ అధ్యాయంలో హేమద్పంత్ గారు వినాయక హరిశ్చంద్ర ఠాకుర్, అనంతరావు పాటంకర్ మరియు పండరీపూర్ ప్లీడర్ గార్ల గురించి చెప్పడం జరిగింది . మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కాని మహాత్ములను కలవలేము అని చెప్తూ హేమద్పంత్ గారు పీర్ మౌలానా గారిని ఎలా కలవలేక పోయారో చెప్తారు. చివరికి బాబా లాంటి సద్గురువుని కలవగలిగాను అనికూడా చెప్తారు. యోగీశ్వరుల వ్యవస్థ చాలా గొప్పది. ఒకరు చేసేవి ఇంకొకరికి తెలుస్తాయి. అందరు ఒక్కటే సత్యాన్ని బోధిస్తారు. ఇలాంటి సన్నివేశమే ఠాకూర్ గారి జీవితంలో జరిగింది. ఆయన ఒకసారి కన్నడ గురువులైన అప్ప గారిని కలవడం జరిగింది. ఆయన విచార సాగర అనే గ్రంధాన్ని చదవమని, అలా చదివితే ఒక గొప్ప మహానుభావునిని కలుస్తావు, ఆయన నీకు మంచి మార్గాన్ని చూపిస్తారు అని అప్పా  చెప్పారు. ఆ తరువాత ఠాకూర్ గారికి జున్నూర్ బదిలీ అవుతుంది. అక్కడకు వెళ్ళాలి అంటే ఒక లోయను దాటి వెళ్ళాలి. ఎనుబోతుని ఎక్కితే గాని దాటటం కుదరదు. అక్కడ నానా చాందోర్కరును కలిసి బాబా గురించి తెలుసుకొని షిర్డీ వెళ్ళాలి అనుకుంటాడు. తరువాత షిర్డీ వచ్చి బాబాని కలిసినప్పుడు బాబా ఇలా అంటారు. "ఇచ్చటి మార్గము అప్పా బోధించు మార్గమంత సులభం కాదు. లోయ దగ్గర ఎనుబోతు ప్రయాణం కంటే కష్టం. ఈ ఆధ్యాత్మ మార్గం చాలా కఠినమైనది, దీనికి చాలా కృషి అవసరం" అని బాబా చెప్తారు. ఈ మాటలను ఠాకూర్ ఒక్కడే అర్ధం చేసుకొని పరవశం పొందుతాడు.  తరువాత అప్పా చెప్పినదంతయు నిజమే కాని పుస్తక జ్ఞానం ఒక్కటే చాలదు గురువు యొక్క అనుగ్రహం కావాలి అని కూడా చెప్తారు. 

ఒకసారి అనంతరావు పాటంకర్, సాయి దర్శనానికై వచ్చి ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. బాబా నేను చాలా పుస్తకాలు చదివాను, విన్నాను. ఉపనిషత్తులు వాటి బాష్యాలు, మన పవిత్రగ్రంధాలు ఇలా చాలా పఠించడం జరిగింది. కాని మనస్సులో ఏదో వ్యాకులత. నేను చదివినదంతా వృధా అనిపిస్తుంది. నేర్చుకున్న దానికి అర్ధం లేకుండా పోయింది. ఈ జపతపాదులు ఎందుకు? ఇవి మనశ్శాంతిని ఇవ్వలేదు. ఈ పరమాత్మ అనుభూతి పొందని ఈ సాధనలన్నీ వ్యర్ధమేనా? నీ పాద పద్మాలే నాకు గతి, నన్ను ఉద్ధరించు మహారాజా అని దీనంగా అడగడం జరిగింది.

అప్పుడు బాబా ఒక కధ చెప్పడం జరిగింది. ఒక వర్తకుడు తొమ్మిది లద్దెలను తన పంచె కొంగులో సేకరించెను. ఇట్లు అతడు తన మనస్సును కేంద్రీకరించ కల్గెను అని చెప్పారు. దాని యొక్క అర్ధం తెలియక పాటంకరు, దాదా కేల్కురుని అడగటం జరిగింది. వీరిని అడ్డం పెట్టుకుని బాబా మనకు నవవిధభక్తిని ఇవ్వడం జరిగింది.

అవి:
1) శ్రవణం, 2) కీర్తనం, 3) స్మరణం , 4) పాదసేవనం, 5) అర్చనము, 6) నమస్కారము, 7) దాస్యము, 8) సఖ్యము, 9) ఆత్మ నివేదనము

వాటిని మూడు భాగాలుగా విభజిస్తే :
మొదటి మూడు శ్రవణం, కీర్తనం, స్మరణం - ఇవి మన మనస్సును శుద్ది చేస్తాయి. అప్పుడు భక్తి బీజం మొలకెత్తటానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ తరువాత పాదసేవ, అర్చనము మరియు నమస్కారము అనే మూడింటి ద్వారా ఈ బీజం పెరుగుతుంది. మనకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అప్పుడు దాన్ని దాస్యము, అంటే సేవ ద్వారా, ఆ గురువుకి భక్తి భావనతో గూడిన సఖ్యముతో ఆత్మనివేదన గావించటమే మన లక్ష్యము.

సరే ఈ నవవిధ భక్తికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది. సఛ్ఛరితలో గుర్రము గురించి చెప్పినపుడు ఆడ గుర్రము గురించి చెప్పడము జరిగింది. అలా ఎందుకు? ఇక్కడ ఆడగుర్రమునగా భగవంతుని అనుగ్రహము అని చెప్పటం జరిగింది.

మనకి సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు మనువును, శతరూపును స్త్రీ పురుషులుగా సృష్టించడం జరిగింది. వీరి కుమార్తె అయిన దేవహుతిని కర్ధమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. కర్ధమ ప్రజాపతి చాలా గొప్ప తపఃసంపన్నుడు. ఆయన జితేంద్రియుడు మరియు దివ్యాత్ముడు. కర్ధముడనగా ఇంద్రియములను నిగ్రహించిన వాడని అర్ధము. దేవహుతి అనగా దేవుని ఆహ్వానించునది అని భావము. దేవహుతి భర్తను భగవంతునిగా ఆరాధించి సేవచేస్తూ ఉండేది. కఠోరసాధనలతో, నిష్టలతో ఆమె శరీరం చిక్కి శల్యమైనా కూడా లెక్కచేయక భర్తకు సేవ చేసేది. ఆమె భక్తికి మెచ్చి భర్తయైన కర్ధముడు మరల ఆమెకు యవ్వనం ప్రసాదించి, ఆమె కోర్కె మీద సంతానం ప్రసాదించెను. వారికి తొమ్మిది మంది కుమార్తెలు పుట్టారు. నవవిధ భక్తి రూపాలుగా కుమార్తెలు పుట్టడం జరిగింది. ఆ కన్యలు తరువాత మహర్హులని వివాహం చేసుకోవడం జరిగింది.


కళ-మరీచిని, అనసూయ-అత్రిమహర్షిని, శ్రద్ధ అనే కన్యను అంగీరసునకు, హవిర్భువును పులస్త్యునకు, గతిని పులహమహర్షికి, క్రియను క్రతువునకు, ఖ్యాతిని భృగువునకు, అరుంధతిని వశిస్ఠునకు ఇవ్వడం జరిగింది. ఈ కన్యలే నవవిధ భక్తి స్వరూపాలు.

ఆ తరువాత దేవహుతికి స్వయానా భగవంతుడే కపిలదేవుడిగా జన్మించి ఆమెకు మోక్షం ప్రసాదించడం జరుగుతుంది. ఈ మహర్షులందరు పరమాత్మ స్వరూపులు. ఈ కన్యలందరు భక్తి స్వరూపాలు. ఎప్పుడైతే భక్తితో భగవంతుని సేవిస్తామో అప్పుడే ఆ భగవంతునిలో మనం కల్సిపోతాము. అప్పుడు భక్తికి భగవంతునికి తేడా ఉండదు. ఇదే శక్తి చైతన్య స్వరూపము.

నవవిధ భక్తి విధానాన్ని మనకి అనుభవ పూర్వకంగా అందించే పరమగురువే సాయి. బాబా ఈ నవవిధ భక్తుల విధానాన్ని చాలా చోట్ల నేర్పించడం జరిగింది. కాని మనకు బాగా తెలిసిన సందర్బాలు రెండు. ఒకటి అనంతరావు పాటంకర్ మరియు లక్ష్మీబాయి. బాబా తన మహా సమాధి ముందు, లక్ష్మీబాయికి తొమ్మిది నాణెములు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా గురువులు వీటి గురించి బోధిస్తారు కాని బాబా విధానము బోధంచడమే కాదు, మనకు అనుభూతి కల్పించి, ఆ స్థితిలోకి మనల్ని తీసుకువెళ్తారు.

ఇప్పుడు ఆ నవవిధ భక్తులను గురించి విడివిడిగా పరిశీలిద్దాము.
1) శ్రవణము: గురువు (దేవుడు) గురించి వినడం, తెలుసుకోవటం, ఆయన గుణగణాలని, ఆయన లీలలను ఎల్లపుడూ వింటూ ఉండటం, భక్తుడి యొక్క మనస్సు ఈ శ్రవణము ద్వారా తన్మయత్వం చెందుతుంది. ఒక స్థితిలో ఈ భక్తుడు తన కలల్లో కూడా దేవుడ్నే గుర్తు చేసుకుంటాడు. కాని ఈ శ్రవణము మనకి (మన మనస్సుకి) వంట బట్టాలి అంటే సత్సంగము కావాలి. మనకి గురువుల సాంగత్యము కావాలి. పాజిటివ్ ఎనర్జీ ఉన్నచోట, బాబా సచ్చరితతో, హారతులతో ముక్తిని పొందవచ్చు.

2)కీర్తనము: ఇక్కడ భక్తుడు భగవంతుని గుణగణాలను, లీలలను పాటల రూపంలోనూ, మరియు వేరే విధములుగా కీర్తిస్తుంటారు. దీనిలో వారికి ఒకరకమైన భావోద్రేకము వస్తుంది. గొంతుక పూడిపోతుంది. కంటి వెంట నీరుకారుతుంది. ఆ భక్తి సాగరంలో తేలియాడుతుంటారు. దాసగణు బాబా గురించి ఎప్పుడూ కీర్తిస్తుంటారు.  ఎందరో మహానుభావులు కీర్తనము ద్వారా ముక్తి పధంలో నడిచారు.

3) స్మరణము : అంటే ఎల్లప్పూడు భగవంతుని గూర్చి ఆలోచించడమే. మనము ఏ పని చేస్తున్నా మనసెప్పుడు ఆ గురువు మీద ఉంటంది. ఇంకా వేరే వస్తువులు ఆలోచనలోకి రావు. వాళ్ళు ఆ భగవంతుని గూర్చిన కథలో ఆయన నామాలను, ఆయన లీలలను ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు. జపము చేయడము, ధ్యానము చేయడము, సత్సంగము చేయడం, ఇట్లా ఏది చేసినా భగవంతుని స్మరణ అవుతుంది. బాబా ఎప్పుడూ అల్లామాలిక్ అనే స్మరణ చేస్తూ మనల్ని కూడా ఆ భగవంతుని గూర్చిన స్మరణ చేయమని చెప్పడం జరిగింది.

4) పాదసేవ : భగవంతుని పాదాలకు సేవ చేయడం, లక్ష్మీపార్వతులు ఎప్పుడూ ఈ సేవ చేస్తూ ఉంటారు. ఇక్కడ లక్ష్మీ అంటే ఏమిటి? ఆ చైతన్య స్వరూపుడైన భగవంతుని యొక్క మాయారూపమే. ఈ మాయ వల్ల బంధం ఏర్పడుతుంది. ఈ మాయ మనల్ని భ్రమింపజేస్తుంది. ఆ భగవంతుడు ఈ చర్మచక్షువులకి దర్శనం ఇవ్వడం లేదు. మనము డైరెక్టుగా భగవంతుని సేవ చెయ్యలేక పోతున్నాము అన్న బాధ ఉండవచ్చు. అందుకే ఈ దేవాలయాలు, పూజామందిరాలు, విగ్రహాలు, వీటి ద్వారా మనము ఈ సేవను చేస్తాము. 

పాదసేవా లేక పదసేవా! 

భగవంతుడు నేను అంతటా ఉన్నాను అంటే దాని అర్ధం, మనము ఎవరికి సేవ చేసినా అది పాదసేవే అవుతుంది. కాని మనకు ఆ భావన ఉండాలి. భగవంతుడి విశ్వరూపమే ఈ జగత్తు. మానవ సేవయే మాధవ సేవ. దీన్నే మనం ఇట్లా చెప్పుకోవచ్చు. ఇది పదసేవ! భగవంతుని పాదములవైపు నడిచే మార్గం ఏదైన సరే అది పాద సేవ అవుతుంది. ఆయన చూపించిన మార్గంలో నడవడం మన కర్తవ్యము.

5) అర్చన: అర్చన నవవిధ భక్తులలో చాలా ప్రధానమైనది. మనము ఒక విగ్రహానికి లేదా ఒక పటమునకు పూజా రూపంలో ఈ అర్చనను చేస్తాము. భగవంతుని పూజించటమే అర్చన. అర్చన యొక్క ముఖ్య ఉద్ధేశ్యము. భగవంతుడిని ప్రసన్నుడను చేసుకోవడమే. అర్చన వలన మన మనస్సు శుద్ధి పడుతుంది. మన అహంకారం నశించి మనలో ప్రేమభావన నిండుతుంది.

మానవ సేవ మాధవసేవగా చెప్పబడింది. ఆ భగవంతుడు విరాట్ స్వరూపుడు. అందుకే గురుసేవ, మానవ సేవ కూడ అర్చనలో భాగమే. అర్చన చేసేటప్పుడు భక్తుని యొక్క మనస్సు ఆ భగవంతుని రూపమును గుణగణాలను మరియు ఆ శక్తి యొక్క అనంతతత్వాన్ని గుర్తు చేసుకోవాలి.

6) వందనము: మన శరీర ఉనికిని మార్చి పూర్తిగా భగవంతుని ముందు మోకరిల్లటమే వందనము. సాష్టాంగ నమస్కారం చేయడం వందనమే. భగవంతునికి మిక్కిలి శ్రద్ధతో, ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న ఆ దేవుడ్ని అన్నింటిలో చూస్తూ, భక్తి భావనతో అన్ని శరీర అంగములను అర్పించి నమస్కరించటమే వందనము.

7) దాస్యము : దాస్య భక్తి అంటే, భగవంతుని పూర్తి సేవక భావనతో ప్రేమించటమే. ఆయన యొక్క భావనలను (అంటే మన  శాస్త్రాలను) గౌరవించి, ఆ వేద వాక్కులను తప్పకుండా సేవా భావముతో పాటించడం చాలా ముఖ్యము. ఒక యజమాని గురించి నిజమైన సేవకుడు ఎట్లా ఆలోచిస్తాడు, ఆ యజమానికి  సేవకుడు కావల్సినవన్ని చేయడం మనం చూస్తాము. మనము పల్లకి సేవ చేయడం, మన దేవాలయములు, పూజా మందిరములను శుభ్రం చేయడం, ఇట్లా ఏ రకమైన సేవ చేసినా  ఈ దాస్యభక్తి కిందకు వస్తుంది.

8) సఖ్య భక్తి: భగవంతుని పట్ల సఖ్యభావనతో ఉండటమే సఖ్యభక్తి. మనకు బాగా ఇష్టమైన స్నేహితులకు మనము ఏమైన చేస్తాము. మనము మన పనులన్నీ ప్రక్కన పెట్టి మన పాత స్నేహితులకు ప్రాముఖ్యత ఇస్తాము. ఇదే భావన కనుక మనము భగవంతుని పట్ల పెంపొందించుకోగల్గితే మన జన్మ సార్ధకం అవుతుంది.

9) ఆత్మ నివేదన : తనువును, మనస్సును, ఆత్మను పూర్తిగా సమర్పించటమే ఆత్మనివేదన. ఇంక మనదంటూ ఏమీ ఉండదు. అంతా భగవంతునిదే. ఆయన దయ, కృప మరియు కరుణయే సర్వస్వము. మనము భగవంతునిలో భాగమైపోతాము. ఆ భగవంతుని లీలే ఈ ప్రపంచము. ఇక ఈ ప్రపంచములో శత్రువులే లేరు. కష్టమేలేదు. భక్తుడే భక్తియై పోతాడు. అతని కర్మలన్నీ నశిస్తాయి. ప్రపంచ భావన నశించి పరమాత్మ భావన మాత్రమే మిగిలిపోతుంది. మనిషి మహాత్ముడౌతాడు. ఇది మనకి  కష్టం అనుకోవచ్చు. కాని ఒక ఉదాహరణ మనము ఇక్కడ చెప్పుకుందాము. ఈ భావన ప్రతి మనిషికి సర్వసిద్దముగా ఉంటుంది. కాని మనము ఆచరించము. ఒక వ్యక్తి పట్టుదలతో ఒక వ్యాపారం చేస్తాడు. దాన్ని రాత్రింపగళ్ళు తన మనసులో నింపుకుంటాడు. చివరికి అదే తన గుర్తింపు, స్వభావము అవుతుంది. తన పేరే ఆ బిజినెస్‌గా గుర్తించబడుతుంది. అట్లానే మనకు శ్రద్ధ ఉండి, సబూరితో అంటే ఓర్పుతో వ్యవహరిస్తే ఈ నవవిధ భక్తుల ద్వారా భగవంతుడ్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. 

ఇక ఈ అధ్యాయం చివరలో మనం బాబా గారి సర్వజ్ఞతను మరియు పరనింద వద్దు అని కూడా బోధించిన సన్నివేశం గురించి చెప్పారు. ఒక సారి షిర్డీకి పండరిపురం నుంచి ఒక ప్లీడర్ వచ్చారు. ఆయన బాబా దాగరకు వచ్చి నమస్కరించి, దక్షిణ సమర్పించి, పక్కకు వెళ్లి కూర్చుంటారు. అప్పుడు బాబా " ప్రజలెంత టక్కరివారు, పాదములపై పడతారు, దక్షిణ ఇస్తారు కానీ, చాటున నిందించెదరు. ఇది చిత్రము కాదా! అని అంటారు. ఈ మాటలు ఒక్క ప్లీడరుకు తప్ప ఎవరికీ అర్ధం కాలేదు. ఆయన ఒక సారి మిగిలిన ప్లీడర్ల సమక్షంలో అక్కడి సబ్ జడ్జి అయిన నూల్కర్ గారిని విమర్శిస్తారు, నూల్కర్ గారి తన ఆరోగ్య రీత్యా బాబాను ఆశ్రయించినందుకు ఆయనను వారందరు ఎక్కిరిస్తారు. దీన్ని గురించి బాబా ఆ ప్లీడరుతో చెప్పడం జరిగింది. బాబా సర్వజ్ఞతను తెలుసుకొని ఆ ప్లీడర్ ఇంకెప్పుడు ఎవరిని నిందించకూడదని నిర్ణయించుకుంటాడు. ఈ ప్లీడర్ ద్వారా బాబా మనందరికి ఈ పరనింద వద్దు అని బోధిస్తున్నారు. 

సాయిబాబా మహిమ అగాధము. వారి లీలలు అమోఘము. వారు పరబ్రహ్మమే. 

శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు!