In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, February 24, 2016

ఖపర్డె - దాదాసాహెబ్ -1



Play Audio



శ్రీ సాయి సచ్చరిత ద్వారా మనకు బాబా గురించిన విషయాలు చాలా తెలుస్తాయి. ఖపర్డె గారు వ్రాసిన డైరి సాయి భక్తులందరకు ఒక గొప్ప వరం. ఎందుకంటే ఆయన బాబా దైనందిన కార్యక్రమం మరియు బాబా చూపిన కరుణ, దయ మొదలగు అంశాలను ఉన్నది ఉన్నట్లుగా వర్ణించారు. బాబా చెప్పిన కథలను యధాతధంగా చెప్పారు. ఖపర్డె గారు సంస్కృత మరియు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. ఆయన భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో బాలగంగాధర్ తిలక్ గారికి కుడి భుజం లాగా వ్యవహరించారు. ఆయన యొక్క ఆశయాలకు రూపకల్పన చేసి అవసరం అయినప్పుడు తన న్యాయవాద వృత్తితో అందరికి సహాయపడ్డారు. ఖపర్డె గారు బాబా గురించి విని షిర్డి రావడం జరిగింది. ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం ఒక విప్లవకారుడిగా పట్టుకోవాలని చూస్తారు. కాని షిర్డిలో బాబా రక్షణలో కొన్ని రోజులు ఉంటారు. బాబా తన భక్తులను ఎట్లాంటి పరిస్థితుల నుంచైన కాపాడతారు.

                   ఖపర్దెగారి పూర్తిపేరు గణేశ్ శ్రీ కృష్ణ ఖపర్డె. ఆయన ఆగస్టు 27, 1854వ సంవత్సరంలో ఇంగ్రోలి అనే ఊరిలో జన్మించారు. అప్పట్లో ఇది బెరార్ అనే ప్రదేశంలో ఉండేది.  ఆ తరువాత ఈ ప్రాంతం మహరాష్ట్రలో కలిసింది. దీన్ని నిజాం రాజులు కూడా పాలించారు. ఖపర్డె తండ్రి గారు పేరు శ్రీ కృష్ణ నరహరి. ఖపర్డె గారు వినాయక చవితి రోజు జన్మించారు. అందుకే ఆయనకు గణేశ్ శ్రీ కృష్ణ ఖపర్డె అని నామకరణం చేసారు.
    
                 ఖపర్డె గారి విద్యాబ్యాసం నాగపూర్ మరియు అమరావతిలో జరిగింది. ఆయనకు సంస్కృత భాష అంటే చాలా మక్కువ. అకోల అనే ఒక చిన్న గ్రామంలో ఒక పండితుడి దగ్గర ఖపర్డె సంస్కృతం నేర్చుకున్నారు. అట్లానే ఇంగ్లీషులో కూడా ఆయనకు మంచి పట్టు ఉంది. కొన్నాళ్ళు ఎల్ఫిన్‌స్టన్ కాలేజీలో టీచర్‌గా పనిచేసి, 1884లో లా చదివి డిగ్రీ సంపాదిస్తారు. తరువాట క్రిమినల్ లాలో మంచి ప్రాక్టీస్‌తో ప్రముఖ న్యాయవాదిగా పేరు సంపాదిస్తారు. కపర్డె ఆదాయం ఆ రోజుల్లోనే దాదాపు సంవత్సరానికి లక్ష రూపాయలు ఉండేది.
               
ఖపర్డె గారికి ముగ్గురు కుమారులు. ఖపర్డె గారికి డైరి వ్రాయడం చాలా ఇష్టం. ఆయన వ్రాసిన డైరీలను నేషనల్ మ్యూజియంలో ఉంచడం జరిగింది. బాబా ఆయనను దాదాసాహెబ్, సర్కార్ అనే పేర్లతో పిలిచేవారు. ఆయన శ్రీమతి కూడా మంచి సంస్కారంతో తన ధర్మాన్ని నిర్వర్తించేది. ఆమె కూడా బాబాను సేవించడం జరిగింది. ఆమె పేరు లక్ష్మీబాయి ఖపర్డె. ఆమె పెద్దగా చదువుకో పోయినా మంచి సదాచార సంపన్నురాలు. ఆమెకు రామాయణ, మహభారతాలు మరియు కీర్తన కారులు గురించి, పాండవ ప్రతాపము మరియు శివలీలామృతము అనే గ్రంధాలపై ఆమెకు మంచి పట్టు ఉంది. అప్పట్లో ఖపర్డె గారి ఇల్లు చాలా మందితో కళాకళాలాడుతూ ఉండేది. దాదాపు ఇంట్లో 50 మంది దాకా మనుషులు ఉండేవారు.  ఖపర్డె గారి ముగ్గురు పుత్రులు, వారి భార్యలు, పిల్లలు, వేరే 3 కుటుంబాలు, 12-15 మంది చదువుకునే విద్యార్ధులు, ఇద్దరు వంటవాళ్ళు, వారి కుటుంబాలు, ఇద్దరు గుమస్తాలు, గుర్రాల దగ్గర పనిచేసే పనివాళ్ళు, 2 ఎద్దులబండ్లు, వాటిని నడిపేవారు, ఇలా ఎంతో మంది ఆ ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. ఎప్పుడు ముగ్గురు అతిధులకు తక్కువ లేకుండా ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండేది. మరి ఇవన్ని చూసుకోవాల్సిన బాధ్యత శ్రీమతి ఖపర్డె గారి పైన ఉంది. ఆమె ఎవరి మధ్య భేదము లేకుండా అందరిని ప్రేమతో చూసుకొనేవారు. ఇంతమంది పనివాళ్ళు ఉన్నా ఆమె స్వయంగా వంటచేసి పిల్లలందరికి తినిపించేవారు.

                 ఒకసారి తమ ఇంట్లో చదువుకునే నీల్‌కరి అనే విద్యార్ధికి ఒక కురుపు వచ్చి బాగా జ్వరం వస్తుంది. ఆ కుర్రవాడికి ఆసుపత్రిలో ఉండి సేవచేసిన విధానము ఆమె వ్యక్తిత్వాన్ని చాటిచెప్పింది. ఆ కుర్రవాడు "లక్ష్మీబాయి అమ్మగారు చేసిన సేవ మా అమ్మకూడా చెయ్యగలిగేది కాదు. ఆమె లేకపోతే నేను చనిపోయి ఉండేవాడిని" అని చెప్పాడు. ఆమె ఎవరికి లేదనకుండా ఇచ్చేవారు. ఖపర్డెకు చిన్నవయసులోనే పెళ్ళి జరిగింది. పెళ్ళి అయిన తరువాత ఆయన లా చదవడం జరిగింది. ఖపర్డె తండ్రిగారు తహసిల్దార్ పనిచేసారు. ఇలా వారి కుటుంబం ఎంతో ధనవంతులైన, సంస్కారాన్ని ఎన్నడూ వదలలేదు.
 
                 ఖపర్డె గారు చాలా మంచి వక్త, ఆయనకు తిలక్ గారి సిద్దాంతాలు బాగా నచ్చాయి. వీరు చాలా మంచి మిత్రులై ఖపర్డె గారు బాల గంగాధర్ తిలక్ గారికి ముఖ్యమైన అనుచరుడుగా ఉన్నారు. జూన్ 24, 1908లో తిలక్ గారిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెడతారు. ఆయనకు ప్రజలను రెచ్చకొట్టినందుకు 6 సంవత్సరాలు శిక్ష
విధించారు. అప్పుడు ఖపర్డె గారు లండన్ వెళ్ళి మరి ఈ విషయం మీద అప్పీలు చేసారు. ఈ ప్రయత్నంలో తన సొంత డబ్బు చాలా ఖర్చుచేసారు. ఆయన దాదాపు 2 సంవత్సరాల 82 రోజులు ఇంటికి దూరంగా ఉన్నారు.  జాతీయ కాంగ్రెస్‌లో ముఖ్యమైన లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి ప్రముఖులతో మంతనాలు చేసేవారు. పోరాటాన్ని చాలా గుప్తంగా బ్రిటిష్ ప్రభుత్వంకు తెలియకుండా సమాచారాలు చేరేటట్లు చేసేవారు. జాయింట్ పార్లమెంటరి కమిటీలో సభ్యుడుగా 1919 - 20లో లండనులో సమావేశానికి వెళ్ళారు. ఇలా ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తూ తిలక్ గారు నడిపిన స్వాతంత్ర పోరాటానికి సూత్రదారులయ్యారు. 

సాయితో మొదటి కలయిక
దాదాసాహెబ్ ఖపర్డె గారు మొత్తం 5 సార్లు షిర్డికి రావడం జరిగింది. మొట్టమొదటి కలయిక డిసెంబర్ 5, 1910లో జరిగింది. ఆయన 7 రోజులు షిర్డిలో ఉన్నారు. ఈ కలయిక గురించి ఆయన తన డైరీలో వ్రాసుకున్నారు.

                 ఖపర్డె గారు పూనాకు వెళ్ళి, బొంబాయికి వచ్చి తన పెద్ద కుమారుడైన బాలకృష్ణతో కలిసి డిసెంబర్ 5, 1910 న మొట్టమొదట షిర్డిలో కాలుపెట్టారు. వారిని సాఠె వాడలో ఉంచి, శ్యామా అతిధి మర్యాధలు చేసాడు. అదే సమయంలో తాత్యాసాహెబ్ నూల్కర్ గారి కుటుంబం మరియు బాబాసాహెబ్ సహస్ర బుద్దె గారి కుటుంబం వాడాలో ఉన్నారు. వెంటనే అందరూ కలసి బాబాను దర్శించేందుకు మసీదుకు వెళ్ళారు. బాబాకు నమస్కరించి వారు తెచ్చిన పండ్లను బాబాకు సమర్పించారు.

                 బాబా వారి దగ్గర నుంచి కొంత దక్షిణ అడిగి తీసుకుంటారు. అప్పుడు బాబా ఇలా చెప్పారు. రెండు సంవత్సరాలకు నాకు బాగుండలేదు. నేను బార్లి మరియు మంచినీరు మాత్రమే తీసుకున్నాను. ఈ కాలు మీద పుండు ఉంది. అది ఒక చిన్నతీగ పాము ద్వారా వచ్చింది. దాన్ని తీయటానికి ప్రయత్నించినప్పుడు కొంచెం తీగ లోపల ఉండిపోయింది. తరువాత మళ్ళీవచ్చింది. అది నా సొంత ఊరికి వెళ్ళిందాకా ఉంటుంది. నేను లెక్క చేయకుండా అందరి కోసం శ్రమిస్తున్నాను. కాని అందరు నాకు బాగా కష్టం కలిగిస్తున్నారు అని చెప్పి అందరిని ఆ రోజుకు వెళ్ళమన్నారు.
   
                 ఇలా ఖపర్డె డిసంబర్ 5న 1910 జరిగిన సంఘటనలను తన డైరిలో వ్రాసారు. ఖపర్డె గారి డైరి చదివితే మనము నిజముగా సాయి సన్నిధిలో ఉన్న భావన కలుగుతుంది. ఆయన సాయి మాటలను ఆయన వ్యవహరించిన తీరును యధాతధంగా వ్రాసారు. బాబా చెప్పిన కథలను చెప్పినట్లుగానే వ్రాసారు. బాబా మాటలు, నవ్వు, కరుణ, దయ మరియు ఆయన కన్నులలో నుంచి వచ్చే శక్తి మొదలగు అంశాలను మనకు కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆయన 1894 నుంచి 1938 వరకు దాదాపు 45 డైరీలు వ్రాయడం జరిగింది. ఇవన్ని భారతప్రభుత్వం నేషనల్ ఆర్త్కెవ్స్‌లో జాగ్రత్తగా భద్రపరిచింది.

                 ఖపర్డె గారు డిశంబర్ 5, 1960 నుంచి డిశంబర్ 12 వరకు షిర్డిలో ఉన్నారు. ఆ తరువాత బాబా నుంచి అనుమతి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ ఏడు రోజుల్లో బాబా చాలా విషయాలు మాట్లాడారు. కొన్నింటిని మనము పరిశీలిద్దాము.

                 ఒకసారి బాబా ఇలా అన్నారు "నేనిక్కడ 1000 ఏళ్ళ క్రితమే ఉన్నాను. ఈ ప్రపంచం వింతైనది. అందరూ నావాళ్ళే అందరూ నావాళ్లే, అందరూ నాకు సమానమే కాని కొందరు దొంగలయ్యారు. వాళ్ళకు నేనేం చేయగలను? చావుకు దగ్గరగా ఉన్నవాళ్ళు, అవతలి వాళ్ళను చంపాలనే ప్రయత్నంలో ఉంటారు. వాళ్ళూ నన్ను చాలా బాధ పెడ్తున్నారు. కాని నేనేం అనను, మౌనం వహిస్తాను ".  భగవంతుడు గొప్పవాడు, ఆయనకు పనిచేసే అధికారులు అంతట ఉన్నారు. వాళ్ళు చాలా శక్తివంతులు. ఎవరికివారు వారికున్న దాంతో తృప్తిపడాలి. భగవంతుడు ఆ స్థితిని వాళ్ళకు కల్పించడం జరిగింది. నేను చాలా శక్తివంతుడిని, నేను 8000-10000 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉన్నాను, అని బాబా తన ప్రసంగాన్ని ఆపారు.

                 అలానే ఖపర్డె గారు బాబా చూపిన కరుణ ప్రేమ ఆప్యాయత గురించి ఇలా వ్రాసారు. డిశంబర్ 9, 1910న ఇంటికి వెళ్ళాలని అనుకున్నారు, సాయి మహరాజ్ దగ్గరకు వెళ్ళారు. ఖపర్డె కొడుకు సాయిని వెళ్ళడానికి అనుమతి కోరతాడు. నిజంగా వెళ్ళాలా? అని అంటారు. అప్పుడు ఖపర్డె మీరు అనుమతి ఇస్తేనే అని సమాదానం చెప్తారు. నువ్వు రేపు గాని తరువాత రోజు కాని వెళ్ళు అంటారు. ఇది నీ ఇల్లే ఈ వాడా కూడా మనదే నేనిక్కడ ఉండగా ఎవరైన ఎందుకు భయపడాలి? ఇది నీ ప్రదేశంగానే భావించి ఉండు అని ఆప్యాయంగా చెప్తారు. తరువాత తన కొడుకుకి, సాయిని అలా ఎప్పుడూ అడగవద్దు, ఆయనకు అన్ని తెలుసు. మనము ఆయన ఆజ్ఞ పాటించడమే మనకు మంచిది అని చెప్తారు. ఇలా ఖపర్డె గారి మొదటి కలయిక జరిగింది. ఆయన డైరి ద్వారా మనకు ఎన్నో విషయాలను తెలియచేసారు. 

ఓం శ్రీ సాయి రామ్ !

Khaparde -1



The divine Sai Satcharita gives lots of details about Baba. Shirdi diary by Khaparde is a great blessing for Sai devotees. He depicted the daily routine of Sri Sai, his mercy, love, and humor, compassion towards his devotees and how he protected the devotees. Some of the parables that Baba used and the stories that were told by Baba were portrayed as they were given by Sai. Khaparde had good grasp of Sanskrit and English languages. He was the right hand person for the great freedom fighter Lokamanya Balaganghadhar Tilak. Mr. Khaparde formulated some of the strategies in the freedom fight. He also assisted Mr. Tilak with his Law profession by fighting against British Courts. When he heard about Baba, came to Shirdi and stayed under Baba’s protection for few months as they were trying to arrest him with charges of sedition. This proved that Baba protected his devotees from any difficulties.

Sri Khaparde’s full name is Sri Ganesh Sri Krishna Khaparde. He was born on August 27th 1854 in a village called Ingroli. That used to be in the province of Berar. He was named after Lord Ganesh as he was born on Vinayaka Chaviti day. This Berar province once was under Nizam rulers, later merged in to Maharashtra. His father’s name was Sri Krishna Narahari.

His education took place in Nagpur and Amaravati.  Ganesh had his primary and secondary education in Nagpur and Amraoti. He failed twice in Matriculation because he was more interested in study of subjects and books other than those prescribed in the curriculum. Besides, he was weak in mathematics. After matriculating in 1872, he joined the Elphinstone College in Bombay. He was a favorite student of Dr. Ramakrishna Bhandarkar who was the Professor of Sanskrit. Ganesh had studied Sanskrit extensively in a traditional manner under a shastri during his childhood at Akola and had, therefore, an excellent grounding in the subject. Professor Wordsworth who taught him English was the grandson of William Wordsworth, the famous nature-poet of the English language. Under these two professors he acquired a sound knowledge of these two languages. In fact his knowledge of Sanskrit was so good that he was selected unanimously to debate in Sanskrit with Swami Dayanand Saraswati, the founder of Arya Samaj, when the latter visited the Elphinstone College. No wonder that Ganesh was complimented by the Swami himself on his high standard of performance.

He became first a junior fellow and then a senior fellow in the Elphinstone College and in these capacities assisted in teaching Sanskrit and English. Sri Khaparde majored in law in 1884 and soon commenced his legal practice. After an early stint commenced as a munsiff between 1885 and 1889, he returned to the bar and soon established a name as a leading lawyer. From 1890, he started participating in public life and became the President of the District Council in 1890. His income used to be almost 90,000 rupees to 100,000 rupees in those days. That too there was no income tax. It could have been lot of money in those days.

Sri Ganesh Khaparde had 3 sons. He enjoyed writing diaries and his diaries were preserved by the Indian Government in national archives. Baba used to call him Dadasaheb or Sirkar.  His wife followed him and she was known to worship Baba with lots of love. Her name is Laxmibai Khaparde. Even though she did not have higher education, she was very righteous. She knew most of the Indian scriptures including Ramayana, Mahabharata, Pandava pratapa, Siva leela amrut and other kirtankars. Their house used to have at least 50 people at a given time. The household included Khaparde’s 3 sons, their wives, 3 other families that they support two cooks along with their families, two clerks, workers for horses, two bullock cart drivers and some poor students.

Laxmi Bai used to take care of this big family.  She treated everyone equally. She loved everyone. Even though she had this many workers in the family, she used to cook herself and feed the children by herself. Once a student called Nilkari who got a boil on his thigh and developed high fever was hospitalized.  Laxmibai would carry the food for him to the hospital and would feed him.  His sickness extended over a period of two months. He was grateful to Laxmibai all his life and would say, “Laxmibai did all for me what my own mother would not have done and but for her kindness I would have died.” There are a number of such examples. She never said no to anyone. Khaprde got married at a young age. He studied law after he got married. His father worked as Thahasildar. This family remained very righteous in spite of their wealth.

Khaparde’s freedom fight:


He was a good orator. He gravitated more towards Tilak’s principles. They become best friends and Khaparde became the right hand person for Bala Ganghadhar Tilak. On June 24th 1908 British government arrested Tilak. He was prisoned for 6 years for sedition. Then Khaparde went to London to fight an appeal. He stays there for almost 2 years. He spends his own money up to 200000 rupees. He used to mingle with great leaders like Lala Lajapati rai, and Bipin Chandra pal in National congress. He handled all the activities in secrecy. He attended a conference as a member of Joint parliamentary committee. He worked at different levels in the freedom movement and became the key person behind all Tilak’s strategies.

First meeting with Sai:

Dadasaheb came to Shirdi on five occasions.   His first visit was on 5th of December 1910. They stayed in Sathe wada. He stayed there for 7 days during the first visit.

He wrote about this incident in his diary as follows.
Last night I & my son Baba left by 10.15 P.M. train as proposed. Purandare, Pathare, Dhaujisha, his woodman, Bapu & others came to the station to see us off & the first two brought flowers. I slept as soon as I got into my compartment though I was awakened often. We reached Manmad about 9 A.M. today and stayed at the Railway station till nearly 1 P.M. I met one or two young men, on the station staff who very kindly helped us with things. One Haripant of Yeola also met us. In the train to Copargaon, we met an Englishman who appeared exceptionally good mannered and obliging. We reached Copargaon station about 2 P.M. hired two conveyances, one for things and the other for ourselves to travel in. Bhaskar Rao assisted us with tongas and gave us guavas to eat at his house and accompanied us to Shirdi, which we reached about 4 P.M.. We put up in the wada built for the convenience of people by Mr Chandkar. Madhavrao Deshpande was very obliging & helped us & treated us like guests. There are in the Wada  Tatyasaheb Nulkar with his family, Bapusaheb Jog and Babasaheb Sahasrabuddhe.
We all went to see Sayin Maharaj soon after our arrival. He was in the Masjid. After salutations I & my son offered the fruits brought by us & gave some money at his request. The Sayin Saheb then said that he has not been well for the last two years & more, that he used to eat only barley cake & take a little water. He showed his foot and pointed to a small sore, said it was the string worm, that it was extracted but the string snapped & then it reappeared & so on. He said he heard that it would not be well with him till he went to his native town. He said he kept it in view but that was all, he cared more for his people than even for his own life. He said he found no rest as people troubled him. It could not be helped. Then he told us to withdraw which we did. Towards evening he passed by the wada & we went & saluted him. I & Madhavrao Deshpande were together. After we saluted Baba said, “Go to the wada & sit quiet.” So I & Madhavrao returned. We all sat talking. They have many miracles to relate. I, Baba & Babasaheb Sahasrabuddhe had something to eat at night and after I returned to bed, a strange thing happened. The wife of Das Ganu who has written the “Arvachim Sant lilamrit ” & known as Tai came & lay down by my side. I do not know how long she lay like. 
He wrote about his first meeting with Baba in his diary. When we read his diary, we feel like we are in that situation and we are watching Sai. He described Sai’s words, his mannerisms as it is. He presented Baba’s stories and his parables as they were told. He stayed in Shirdi from December 5th 1910 to December 12th 1910 for 7 days. Then he took permission from Baba and left Shirdi. Baba spoke in parables and gave some direct teachings. We will examine some of these here.

Once Baba said, “I was here thousands years ago.” Then Sayin Maharaj turned to me & started on apparently a new track. He said “This world is funny. All are my subjects. I look upon all equally, but some have become thieves and what can I do for them? People, who are themselves very near death, desire & make preparations for the death of others. They offended me a great deal. They hurt me a good deal but I said nothing. I kept quiet. God is very great & has his officers everywhere. They are all powerful. One must be content with the state in which God keeps him. But I am very powerful. I was here eight or ten thousand years ago.”

Khaparde wrote about Baba’s affection in his diary dated December 9th 1910 as follows.I & my son intended going away today. In the morning, after prayer when we went as usual to see Sayin Maharaj, he asked my son if he intended going away & added that we may go away. We thought the necessary permission had been granted & made ready to start. My son packed all things, & engaged a spring cart & another to carry our things, & in the afternoon went to formally see the Sayin Maharaj before actually starting. On seeing me, Sayinsaheb said “Do you really intend going?” I replied “I wish to go but not if you do not permit.” He said “Then you may go tomorrow or the day after. This is our house. The Wada is our house & why anybody be afraid while I am here. This is our house & you should look upon it as your own house.” I agreed to stay & countermanded all arrangements for departure. We sat down talking. Sayin Maharaj was in a very pleasant mood, & said many pleasant things but I am afraid, I did not understand him. Next day morning after prayer, I told my son Baba never to mention anything about our going away to Sayin Maharaj. He knows all & would know when to send us away.

This was the description of his first visit to Shirdi. He related to us so many details through his diary.



OM SAI RAM!

Wednesday, February 17, 2016

దీక్షిత్- 4



Play Audio



మానసిక పరివర్తన
ఒకసారి దీక్షిత్‌కు బాబా ఈ విధంగా చెప్పారు. "నువ్వు వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడినా లేక వాళ్ళ తప్పులు ఎంచినా నాకు అమితమైన బాధ కలుగుతుంది." అప్పట్లో దీక్షిత్‌కు కూడా కోపం ఉండేది. తరువాత ఆ కోపాన్ని నియంత్రించాడు.

ఒకసారి వాడాలో క్రైస్తవ మతము గురించి మాట్లాడుతూ, వారిని విమర్శించాడు దీక్షిత్. అదే రోజు బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు దీక్షిత్‌తో బాబా మాట్లాడలేదు. దీక్షిత్ తన తప్పు తెలుసుకొని బాబాను క్షమించమని మనసులోనే ప్రార్ధిస్తాడు. అప్పుడు బాబా "ఎవ్వరిని నిందించ వద్దు" అని ప్రేమతో చెప్తారు.

ఒకసారి దీక్షిత్ రోజూ పూజచేసుకునే విధంగా చేసి బాబాకు తాంబూలం ఇవ్వడం మరిచాడు. తరువాత బాబా దగ్గరకు వెళ్తే బాబా వెంటనే "నాకు ఈ రోజు తాంబూలం ఇవ్వలేదు" అంటారు. అప్పుడు దీక్షిత్‌కు అర్ధం అవుతుంది. సాయి యొక్క సర్వజ్ఞత.  నేను మనస్పూర్తిగా బాబాకు పూజ చెయ్యాలి, ఆయనకు అన్ని విదితమే అని అప్పటి నుంచి ఎక్కడ పూజ చేసినా బాబానే స్వయంగా తన ఎదురుగా ఉన్నారు అన్న భావనతో ప్రార్ధన చేసేవాడు. సాయి బందువులారా చూసారా! దాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సినది చాలా ఉంది. "యధ్భావమ్ తద్ భవతి" అంటారు. కాని సాయి ఎప్పుడూ మనల్ని ఒక కంట కనిపెట్టి ఉంటారు. మనలో నమ్మకం దృడంగా ఉండాలి. అలానే దీక్షిత్ కూతురు చనిపోయినప్పుడు చావు, పుట్టుకల గురించి చెప్పి, తనలో వ్యామోహం పోగొట్టారు. ఇంకోసారి దీక్షిత్ ఒక కేసు గెలిచి దాదాపు 1000 రూపాయలు ఒక ట్రంక్‌పెట్టెలో తెచ్చి, బాబా ఇదంతా నీదే అని ముందుంచాడు. అప్పుడు బాబా క్షణాల్లో ఆ డబ్బుల్ని పంచేస్తారు. దీక్షిత్లో కొంచెం కూడా ధన వ్యామోహం కనిపించదు.   

ఇలా బాబా ఒక్కో విషయంలో దీక్షిత్‌తో మానసిక పరివర్తన తెచ్చి మెల్లగా తనను ముక్తిపథం వైపు నడిపించారు. తరువాత అతనికి బాబా కఫనీ కూడా ఇస్తారు. దీక్షిత్ దాన్ని షిరిడిలో ఉన్నప్పుడు ధరించేవారు.

బాబా మహా సమాధి
అక్టోబర్ 1918 లో బాబా మహాసమాధి అయిన రోజు అందరూ సాయి బౌతిక శరీరం దగ్గర చేరి ఎవరు సాయి సమాధికి బాధ్యత వహించాలి అనే అంశంపై హిందువులకు, ముస్లింలకు అభిప్రాయ బేదాలు వచ్చాయి. బాబా మసీదులో నివసించారు అని వాళ్ళ ఆదిక్యతను ముస్లింలు ప్రకటించుకున్నారు. కాని బాబా "నన్ను వాడాలోకి (బూటివాడ) తీసుకు వెళ్ళండి" అని చెప్పారు. బూటి కట్టించిన కృష్ణ మందిరం బాబాకు నిలయమయింది. ఆయన నేను సమాధి నుంచే మాట్లాడతాను అని కూడా చెప్పారు. అంతలో కోపర్‌గావ్‌కు చెందిన మామల్తాదార్ వచ్చారు. ఆయన మీరు కనుక ఒక అభిప్రాయానికి రానట్లయితే కేసు అహ్మద్‌నగర్ కోర్టుకు వెళ్తుంది. అక్కడ తేల్చుకోవచ్చు అని చెప్తారు. దీక్షిత్ కోర్టుకు వెళ్ళి వాదించడానికి తయారు అవ్వడం చూసి ముస్లింలకు కంగారు పుట్టింది. ఆయన కోర్టుకు వెళ్తే  కేసు తప్పక గెలుస్తారు. కాబట్టి ఒక అభిప్రాయానికి వద్దామని ఒప్పుకుంటారు. అప్పుడు బాబాను సమాధి మందిరంలో ఉంచడం జరిగింది. ఈ విధంగా దీక్షిత్ యొక్క దక్షత బాబా యొక్క ఆజ్ఞను అందరూ పాటించేలా చేసింది.

బాబా మహాసమాధి అనంతరం - దీక్షిత్ జీవితం

బాబా మహాసమాధి అనంతరం, దీక్షిత్ చాలా చాకచక్యంతో సమాధి మందిరానికి సంబందించిన పనులన్ని చక్కబెట్టారు. ఆయన తీసుకొన్న జాగ్రత్తలు తరువాత షిరిడిసాయి సంస్థాన్ ఏర్పాటు చేయడానికి ఉపయోగపడ్డాయి . ఆయన దానికి గౌరవ సెక్రటరిగా పనిచేశారు. ఆయన కార్య దీక్షత అన్ని వర్గాల వారిని సంతోష పరిచింది. ఆయన బాబా సిద్దాంతాన్ని చక్కగా జీర్ణించుకున్నారు. ఆయనకు హిందూ, ముస్లిం అనే తేడా లేదు. ఒకసారి బడే బాబాను వాడాలో ఉండనీయద్దని అందరూ చెప్తే దీక్షిత్ దానికి ఒప్పుకోలేదు. ఆయనను వాడాలో ఉండనిచ్చారు. అప్పుడు నానా చందోర్కర్ కూడా ఈ విషయంలో అడ్డు చెప్పారు. కాని దీక్షిత్ తన సమత్వ బుద్దిని పాటించారు. ఆయన మనుషుల పట్ల, జంతువుల పట్ల బాబా బోధించిన దయా గుణాన్ని ఆయన పునికి పుచ్చుకున్నారు. తన వద్దకు ఎవరు వచ్చిన భోజనం పెట్టకుండా పంపించేవారు కాదు. ఆయన ఇంట్లో చాలా పిల్లులు ఉండేవి. అలానే కుక్కలకు, చీమలకు ఆయన ఆహారం ఇచ్చేవారు.

ఒకసారి బాబాను పాములు, మనుషులను చంపుతాయి కాబట్టి వాటిని చంపవచ్చా అని అడిగారు. అప్పుడు బాబా దేవుడి ఆజ్ఞ లేకుండా పాములు కూడా మనలను కరవలేవు. కాబట్టి వాటిని చంపాల్సిన పనిలేదు అని చెప్పారు. ఈ విషయాలు గుర్తుకు ఉంచుకుని ఒకసారి ఒక తేలు కనిపిస్తే ఆయన అక్కడ ఉన్న వాళ్ళను దాన్ని చంపవద్దని చెప్పారు. ఒక చిన్న కర్రపుల్ల తెచ్చి దాన్ని బయట నిర్జల ప్రదేశంలో వదిలేశారు. ఆయన నిద్రపోయేటప్పుడు గాఢంగా నిద్రపోయేవారు. అందరూ దోమల మందు వాడితే ఆయన దానికి కూడా ఇష్టపడే వారు కారు. ఈ దోమల వల్ల నా నిద్రకేమి భంగం లేదు. అవి నాలోని రక్తం కొంచెం తీసుకుంటే నాకేమి ఇబ్బంది లేదు. వాటిల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్తే అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్య పోయారు. ఆయనకు సాయి ధ్యానం, భజనలు చేయడం ఎంతో ఇష్టం. ఒకసారి ఆయన కొన్ని భజనలు వ్రాస్తారు. తరువాత కావాలని రాయడం ఆపేస్తారు. ఎవరో దీక్షిత్ గారు మీరు వ్రాయండి అని అడిగితే లేదండి అవిరాస్తే నేను వ్రాసాను అన్న అహంకారం నాలో ప్రవేశిస్తుంది. నాకు ఆ కీర్తి కూడా అక్కరలేదు. సాయి సేవయే నాకు చాలు అని సమాధానం చెప్పారు.

బాబా మహాసమాధి తర్వాత, దీక్షిత్ వైరాగ్యం ఎక్కువై తన సంపాధన తగ్గిపోయి ఒకసారి 30000 రూపాయలు ఒక మార్వాడికీ బాకీ పడ్తాడు. తను తీసుకున్న గడువు ముగిసి సొమ్ము కట్టవలసిన సమయం వచ్చింది. ఒక రోజు నిద్రలో ఆ మార్వాడి కలలో కనిపించి డబ్బులు అడుగుతూ ఉంటే నాకు చున్నిలాల్, చిమన్ లాల్ అనేవాళ్ళు తెలుసు, వాళ్ళు నాకు డబ్బు ఇస్తారు అని అంటారు. ఇంతలో మెలుకువ వచ్చి తనకు వచ్చిన కల గురించి బాధపడ్తాడు. నేను సాయిని నమ్మకుండా ఎవరెవరి పేర్లో చెప్తున్నాను అని దిగులుపడ్తాడు. ఇంతలో డబ్బు కట్టే రోజు వచ్చింది. తన ఆఫీస్ రూంలో కూర్చుని ఉండగా ఒక ధనవంతుడైన స్నేహితుడి కొడుకు 30,000 రూపాయలతో ఆయన కార్యాలయంకు వస్తాడు. తన తండ్రి చనిపోయారని ఈ డబ్బుని దీక్షిత్ సహాయంతో ఏదైన వ్యాపారంలో గాని ఇంకా ఎక్కడైన జాగ్రత్త చేయాలని చెప్తాడు. అప్పుడు దీక్షిత్ తనకే అవసరమని తనున్న పరిస్థితిని పూర్తిగా వివరిస్తారు. అప్పుడు ఆ కుర్రవాడు, అయ్యో మీకివ్వడం కన్న నాకు గొప్ప విషయం లేదు. మనస్పూర్తిగా మీరు ఈ డబ్బులు తీసుకోండి అని ఆ గండం నుంచి గట్టెంకించడం జరిగింది. ఆయన బాబాని నమ్ముకోవడం,  ఈ విధంగా బాబా దారి చూపించడంలో ఆశ్చర్యం లేదు.

దీక్షిత్ అంతిమ యాత్ర
జూలై నెల 1926 వ సంవత్సరం, దీక్షిత్, హేమద్‌పంత్, తెండుల్కర్ కూడా ఉన్నారు. జూలై 4వ తేది 1926న దీక్షిత్ గజేంద్ర మోక్షము అనే భాగవత ఘట్టాన్ని పారాయణం చేశారు. ఆరోజు రాత్రి బాబా కలలో కనిపించారు. ఆ కలలో హేమద్‌పంత్ బాబాను కౌగిలించుకున్నట్లుగా కనిపించింది. ఆ తరువాత రోజు ఈ కల గురించి అందరికి చెప్పారు. జూలై 5వ తేది 1926న దీక్షిత్ విల్లేపార్లే నుండి బొంబాయిలో నున్న డా|| దేశ్‌ముఖ్ వైద్యశాలకు బయలు దేరాడు. అక్కడ తన కుమారుడైన రామకృష్ణ అస్వస్థతతో ఉన్నారు. ఆయనను చూసేందుకు బయలు దేరాడు. ఆరోజు రైలు ఆలస్యంగా వచ్చింది. ఇంతలో హేమద్‌పంత్, తెండూల్కర్ కూడా అక్కడకు వచ్చి అందరూ రైల్లో ఎక్కారు. అప్పుడు దీక్షిత్ ఈ విధంగా అన్నారు. అన్నాసాహెబ్ చూడు సాయి ఎంత దయామయుడో ఈ రైలు ఆలస్యంగా వచ్చేట్లు చేశారు. ఇది ఆలస్యంగా రాబట్టి మనందరం కలుసుకోగలగాము. అలా వారు సాయి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కొంతసేపట్లో దీక్షిత్ ధ్యానంలోకి వెళ్ళినట్లుగా అనిపించింది. ఏమిటా అని పలకరిస్తే పలకలేదు. అప్పుడు అర్ధమైంది. ఆయనను బాబా విమానంలో తీసుకువెళ్ళారని. ఈ విధంగా ఏకాదశి రోజున జులై 5, 1926 న దీక్షిత్ తన శరీరం వదిలి వేశారు. బాబా ఆయనకు సద్గతి ప్రసాధించారు.

దీక్షిత్ యొక్క జీవితం మనందరికి ఆదర్శం కావాలి ఆయన సంసార జీవితంలో ఉండి కూడా పరమార్ధాన్ని సాధించగలిగారు. ఇది కేవలము సాయి సమర్దుల దయవలన మాత్రమే సాధ్యం.



ఓం సాయిరామ్

Tuesday, February 16, 2016

DIXIT Part - 4



Changes in personality:

Sai once told Dixit that he should never talk bad about people and it hurts Baba when some one does that. Dixit also had some temper issues at that time. Baba helped him to regulate that in course of time. Once they were having discussion in wada about Christianity and Dixit criticizes the religion. Afterwards when he went to see Baba, Sai was quiet and didn’t speak to Dixit. He immediately realizes that Baba knows every thing and asks Baba’s to forgive him in his mind. Then Baba talks to him. Baba then says not to criticize any thing.

Once Dixit performed his daily worship to Baba but forgot to give betel leaves to Sai. When he goes to Dwarakamai, Baba says “Kaka you did not give me betel leaves today”. Dixit was very happy that Baba is watching over him and receiving all his Puja (worship). Since that time, he always did his worship thinking that Baba is in front of him.

So Sai devotees, what can we learn from this. 

Sai is always watching us and we have to worship him with lot of love. 

We should have utmost faith in Baba. 

He was teaching Dixit different means to improve his personality so that he can prepare him for the ultimate goal of life that is Salvation. 

When his daughter died, Baba taught him about death and dying, so that Dixit can understand what human life is about. 


Another time Dixit won a case and brings 1000 rupees in a box to Baba. He says to Baba “Baba all this is yours”. Then Baba gives away all the money in seconds to everyone around him. Dixit does not even flinch. People were watching his feelings but Dixit eyes were focused on Baba’s feet. This way he proved that he is not attached to money either. 

Along these lines, Dixit personality slowly changed and Baba made him walk towards self- realization. Baba also gave him kaphni (Robe) and Dixit used to wear this when he was in Shirdi.

Baba’s Mahasamadhi:
When Baba left his mortal body in October of 1918, there was a disagreement between Muslims and Hindus about performing last rites. Muslims felt that Baba belongs to them as he lived in a Masjid. Hindu’s did not agree with the idea. But Baba told prior to his Mahasamadhi, that he wanted to go to Buty wada (Building built by Mr. Buty). The lord Krishna Mandir (Shrine) that was planned became Baba’s abode. He also said that he can communicate to his devotees through his Samadhi. Then District officer came as this issue became
controversial. Dixit gets ready to take up the case if this issue goes to Kopergao court. People then backed off as they heard Dixit. It was known that Dixit was invincible in court so Muslim group came to compromise. Then Baba was kept in Samadhi Mandir. This way Dixit made sure that every one followed Baba’s orders.

Dixit’s life after Baba’s Mahasamadhi: 
Dixit took care of Samadhi mandir issues after Baba’s Mahasamadhi very effectively. He laid the foundation for Shirdi Sai sansthan for later years. In 1922 they got permission from Ahmednagar court to form Sai Sansthan. Dixit worked as honorary secretary for the sansthan. People from allwalks of life supported his ideas and liked him personally. He understood Baba’s mission very well. He never showed any discrimination towards Muslims. He treated everyone equally. One time every one was against Bade Baba staying in Wada but Dixit did not agree with them and let Bade Baba stay in Wada. Even Nana Chandorkar was against this decision but Dixit felt that unity was necessary. He followed Baba’s teachings to be compassionate towards animals as well as humans. He did not let any one leave with out eating at his house. He used to rear lot of cats, feed dogs and ants.

One time he asked Baba whether we can kill snakes as they are poisonous. Baba then said, “Kaka with out God’s will even snakes won’t kill you, so we don’t have to kill them”.  Remembering this, Dixit one time had an encounter with a scorpion. He did not let people kill that scorpion, but helped to get rid of it out side with a stick. He used to sleep very deep and did not worry about mosquitoes biting him. When everyone is using Mosquito nets, he did not use them. He used to say what’s wrong if they take my blood little bit. He used to see God in the mosquitoes too. He loved to do meditation on Sai and was very fond of singing Sai bhajans. He wrote some lyrics and stopped writing them afterwards. Some one asked him to write bhajans again and his answer was “If I write them; I have a feeling that I wrote them and this will create ego in me. All I need is Sai worship and seva only”.

After Baba’s Mahasamadhi, Dixit’s dispassion towards world increased. His income dropped significantly. He owed a Marwadi Rs.30000. The dead line was approaching but he could not pay. He dreamt about this Marwadi and was telling him that he knew Chunni laal and Chiman laal, who will give him money. So that he can this Marwadi back. He gets up from the dream and feels terrible that he did not think about Sai. Then he goes to his office and that is the day he has to pay his loan back. He left it to Sai. Then one person comes to his office. He tells him that he is son of his friend. His father died and asked him to invest his money some where. Then Dixit explains his situation and he willingly offers him money. He felt that it is an honor to give Dixit the money rather than investing. Even here Baba showed the way and got him out of that bad situation.

Dixit’s final days:
Dixit was reading Gajendra Moksha from great scripture Bhagavata on July 4th 1926. That night Baba appeared in his dream and he saw Baba hugging Hemadpant. Next day he told about this dream to every one including Hemadpant and Tendulkar. His son was in a hospital as he was ill. He wanted to visit him and goes to train station. There he meets Hemadpant and Tendulkar and together they get on the train. Then he tells Hemadpant, “Anna Saheb see Baba is merciful, he made sure that the train came late so that we can all catch the train”. They talked about Sai for some time. Dixit closed his eyes and felt like he was doing meditation. Hemadpant waited for a while and continued to watch Dixit. He was so peaceful and calm. After a while, hemadpant tries to get his attention by touching him and he does not respond. Then he shakes him and realizes that he left his body. Baba took him in Vimana (Flight) like he promised, to give him salvation. 

He died on July 5th, 1926 on Ekadasi day. Baba gave him Sadgati and his death was so peaceful.


Dixit is a role model for Sai devotees in fact for any seekers of the truth. 

He stayed in worldly life and still able to reach the highest goal of human life that is Moksha (salvation) with the blessing of Sai. 

This is dream come true for so many seekers in this spiritual quest. 

Sai bandhus please trust Baba in every aspect of your life and he will not disappoint us and he will lead us all the way.

OM SAI RAM!       

Wednesday, February 10, 2016

దీక్షిత్- 3




Play Audio



ఆధ్యాత్మిక ప్రగతి
సాయినాధుడు అపరదయామయులు. తనని నమ్మిన వారిని దగ్గర ఉండి మరీ రక్షిస్తారు. మానవులకు గమ్యమైన మోక్షమార్గం వైపు నడిపిస్తారు. దీనికి మనలను బాబా దగ్గర ఉండి మరీ ప్రయాణం చేపిస్తారు. ఈ విధంగా దీక్షిత్‌ను కూడా నడిపించడం జరిగింది.

             ఇప్పటి వరకు దీక్షిత్ బాబా పై శ్రద్ధ, భక్తి మొదలగు వాటిని నిరూపించుకున్నాడు. ఒక సాధకుడు ఆధ్యాత్మిక పథంలో ఎదగాలి అంటే మరణాన్ని కూడా అర్ధం చేసుకోవాలి. మరణం అనేది భయంకరమైనది కాదు అనే నిజాన్ని బాబా దీక్షిత్‌కు నేర్పించారు.

             ఒకసారి ఒక ముసలామె పాముకరచిన తన కొడుకును బాబా వద్దకు తీసుకువచ్చి ఊది ఇమ్మని అడిగింది. బాబా ఊది ఇవ్వలేదు. అప్పుడామే ఏడుస్తూ బయటకు వెళ్ళింది. మరలా వెంటనే మశీదుకు వచ్చి తన కొడుకు చనిపోయాడని గుండెలు బాదుకొని ఏడ్చింది. బాబా ఏమి మాట్లాడలేదు. దీక్షిత్ ఇది చూసి ఆశ్చర్యపోయి బాబాను ఆమెకు న్యాయం చేయమని ఆమె కొడుకును బతికించమని అడుగుతాడు. దానికి బాబా నువ్వు దీంట్లో ఇరుక్కోవద్దు. జరిగిందేదో మంచికే జరిగింది. ఈ కుర్రవాడు కొత్త శరీరంలో చాలా అద్భుతకార్యాలు చేస్తాడు. ఆ పనులు ఇప్పుడున్న శరీరంలో చేయడం కుదరదు అని జనన మరణాల గురించి తెలుపుతారు.

కూతురి మరణం
దీక్షిత్ కూతురు వత్సలిని కాపాడి గండం నుంచి బయట పడేస్తారు. అల్మారా మీద పడినప్పుడు, బరువైన వస్తువులు ఏమి తనకు తగలకుండా కాపాడారు. ఒకసారి దీక్షిత్ కూతురు వత్సలి షిర్డిలో ఉంది. ఆమెకు బాగా జ్వరం వచ్చింది. కాని ఈ సారి బాబా ఆమెను రక్షించలేదు, ఆమెకు కలలో కనిపించి "నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావు, వచ్చి వేపచెట్టు కింద పడుకో" అని చెప్పారు. తరువాత రోజు ఉదయం బాబా శ్యామాను "శ్యామా కాకా కూతురు చచ్చిపోయిందా" అని అడిగారు. శ్యామా అప్పుడు దేవా అశుభమైన మాటలు చెప్తారేంటి అంటారు. శ్యామా మధ్యాహ్నం కల్లా ఆ అమ్మాయి చనిపోతుంది. అట్లానే వత్సలి చనిపోతుంది. దీక్షిత్‌కు బాధ ఉంది కాని బాబాను ఏమి అర్ధించడు. అప్పుడు కాకా దగ్గర భావార్ధ రామాయణము చేతుల్లో ఉన్నది. బాబా అది తీసుకొని ఒక పేజీ తీసి దీక్షిత్‌కు ఇస్తారు. అది కిష్కిందకాండ. శ్రీ రాముడు వాలిని చంపిన తరువాత తారను ఓదార్చి అద్భుతమైన బోధ చేస్తారు. బాబా ఈ పుస్తకంలో వేలు దూర్చి సరిగ్గా అదే పేజీ తీస్తారు.

             ఇక్కడ బాబా వత్సలిని వేపచెట్టు కింద పడుకోమన్నారు. అంటే ఆయన్ని చేరుకోమని అనుట. తరువాత వత్సలి గురించి దీక్షిత్‌కు ఈ విధంగా చెప్తారు. కాకా వత్సలి ఒక దివ్యాత్మ, ఆమె కర్మ శేషము చిన్నపిల్ల గానే అయిపోయింది. ఆమెకు సద్గతి కలుగుతుంది. చనిపోవడం అనేది ఆమె విషయంలో చాలా మంచిది, అని బోధచేస్తారు. ఈ విధంగా దీక్షిత్‌కు అనేక బోధలు చేసి జీవిత సత్యాన్ని అనుభవింప చేసి తన ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేశారు.

బాబా దీక్షిత్ చేత చేయించిన తపస్సు
మన చిత్త వృత్తి ప్రపంచం నుండి నివృత్తి కాకపోతే, భగవంతునిపై ప్రీతి కలగకపోతే ఇంతకంటే దుర్గతి ఏముంటుంది? సర్వేంద్రియాలు సాయిపైన భక్తి ఉండటమే నిజమైన ఆరాధన. లేకపోతే కళ్ళతో సాయిని చూస్తున్నా మాట్లాడాలని తలచినా నోరుపెగలదు. క్షణమైన సాయి నుండి విడిగా ఉండగలవాడు అసలు సాయిభక్తుడా? ప్రపంచమందు విరక్తి కలుగని వానికి భగవంతునిపై ఆసక్తి ఎలా కలుగుతుంది. తల్లిదండ్రులు మమతను పంచుతారు. పుత్రుడికి తన ఆస్తి పైన దృష్టి ఉంటుంది. భార్య తన పసుపు కుంకుమల కోసం తపిస్తుంది. పరమార్ధంలో సహాయం చేసేవారు ఎవ్వరూలేరు. పరమార్ధం సంపాదించుకోవడంలో సహాయపడే వారు ఎవరు అని ఆలోచిస్తే చివరకు మనమే మిగులుతాము. ఎవరి యందు ఏ ఆశా లేకుండా ఆత్మ యందు దృఢమైన విశ్వాసముంచి తమ ప్రయత్నాన్ని స్వయంగా చేసుకునేవారికి పరమార్ధం సిద్దిస్తుంది. గురువు యొక్క నామాన్ని జపించడం ద్వారా పరమానందం జనిస్తుంది. సర్వ ప్రాణులలో భగవంతుని దర్శనం కలుగుతుంది.

ఒకసారి దీక్షిత్ బాగవత పారాయణ చేస్తూ, నవనాధుల భక్తి తత్వం గురించి చెప్పుకొని అక్కడ ఉన్న వారితో ఈ విధంగా అంటారు. ఈ నవనాధుల చర్యలు, వారి మనోవృత్తి అంతుపట్టనివి. అక్కడ ఉన్న శ్యామాతో, "ఈ భక్తి ఎంత కఠినమైనది. మనవంటి మూడులకు అంతటి శక్తి ఎక్కడ ఉన్నది? జన్మజన్మలకు ఇది సాధ్యం కాదు. గొప్ప దిట్టమైన ఆ నవనాధులు ఎక్కడ, మొదటి నుండి పాపులమైన మనమెక్కడ" అని వాపోతాడు.

అప్పుడు శ్యామాకు కాకా యొక్క దైన్యం నచ్చలేదు. సాయిబాబా వంటి ఆభరణాన్ని పొందిన భాగ్యం ఉండీ ఇంత దైన్యం ఎందుకు? సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం ఉంటే మనసులో ఇంతటి తపన ఎందుకు? మీకు ఏకనాధ భాగవతంలోని ఏకాదశ స్కందము మరియు భావార్ధ రామాయణం చదవమని బాబా ఆజ్ఞ కాదా! దానిని బట్టి హరి నామస్మరణ, గురుస్మరణే సాధన అనే బాబా ఆజ్ఞ ప్రమాణం కాదా? దీనితో మనం భవాన్ని తరించగలం. మీకు ఎందుకు చింత అని చక్కగా చెప్పారు. భక్తి, జ్ఞాన మార్గంలో సత్సంగము చాలా అవసరం. ఒకరినొకరు ధైర్యం చెప్పుకుని ముందుకు సాగాలి. అట్లానే దీక్షిత్ కూడా వేరు వేరు సమయాల్లో వేరేవాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. ఆయనకు సాయి పట్ల ఎంతో నమ్మకం ఉన్నా ఇంకా బాబాపై ప్రేమ పెరగాలి అన్న తపనే కాని ఆయనకు బాబా పైన నమ్మకం లేక కాదు.

9 నెలల తపస్సు
1912 తర్వాత దీక్షిత్ దాదాపు వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నట్లే చెప్పవచ్చు. ఒకసారి బాబా దీక్షిత్‌ను వాడా పై గదిలో ఉండి సాధన చేయమని చెప్పారు. నువ్వు ద్వారకామాయికి కూడా రావద్దు, ఎందుకంటే ఇక్కడ జనం చాలామంది ఉంటారు. నీ ఏకాంతానికి అది భంగము. దీక్షిత్ బాబా దర్శనం లేకుండా ఎట్లా అనుకొని అయ్యో బాబా హారతికి వెళ్ళలేక పోతున్నాను అని శ్యామాకి చెప్తాడు. అప్పుడు శ్యామా బాబాను అడిగి మధ్యాన్న ఆరతి, శేష ఆరతికి వచ్చెట్లు అనుమతి సంపాదిస్తాడు. ఈ దీక్షిత్ వాడాలో పై గదిలోకి ఆడవాళ్ళకు అనుమతి లేదు. ఒకసారి దీక్షిత్ భార్య వచ్చి రెండు రోజులు ఉండి బాధతో బాబా దగ్గరకు వెళ్తుంది. అప్పుడు బాబా, అమ్మా దీక్షిత్ భాద్యత నాది అతని గురించి దిగులు పడద్దు అని చెప్తారు. ఈ విధంగా దీక్షిత్‌ను 9 నెలలు ఒక దీక్షలాగా చేపించడం జరిగింది . 

దీక్షిత్ ఏకనాధ బాగవతాన్ని పగలు చదివేవారు. రాత్రివేళ భావార్ధ రామాయణం చదివేవారు. నిరంతరం సాయి ధ్యానం చేసేవారు. అప్పట్లో కాకా 'హరివరదా' మరాఠిలో బాష్యం వ్రాయబడినటువంటి 10వ స్కందం (భాగవతం) ఇది పారాయణ పూర్తి చేసి బాబా దగ్గరకు వెళ్ళి, "బాబా ఇది చదివాను ఇంకొకసారి చదవమంటారా లేక ఇంకేమైన చదవమంటారా అని అడిగాడు. అప్పుడు బాబా ఏక్‌నాద్ బృందావన పోతి" చదువు అంటారు. ఆ తరువాత భాగవతము, భావార్ధరామాయణం మాత్రమే పారాయణ చేయమని చెప్తారు. ఇట్లా 9 నెలలు కఠిన బ్రహ్మచర్యముతో దీక్ష చేయించి దీక్షిత్ చేత ఆధ్యాత్మిక పథంలో ఎత్తైన శిఖరాలు అధిరోహించేలాగా చేస్తారు బాబా.

ఇక్కడ మనము అనుకోవచ్చు, బాబా దీక్షిత్ చేత ఎందుకు ఇలా చేయించారు ఆయన ఎంత అదృష్టవంతుడు అని.  అప్పుడు చాలా మందికి ఇలా చేయగల అవకాశం ఉంది. కాని దీక్షిత్ ఒక్కడే దీనికి సుముఖంగా ఉన్నారు. మనకు కూడా ఇలా చేయాలి అని పట్టుదల ఉంటే బాబా తప్పక దగ్గర ఉండి చేయిస్తారు. మనలో ఆ శ్రద్దా  భక్తులు ఉండాలే కాని, ఏదీ అసాధ్యం కాదు.  


బాబా ఇచ్చిన సాక్షాత్కారాలు
శివలింగ దర్శనం
ఒకసారి పూణే నుండి ఒక రామదాసు భక్తుడు మసీదుకు వచ్చాడు. బాబాకు నమస్కరించి ఒక శివలింగాన్ని కానుకగా ఇచ్చాడు. అంతలో మేఘా కూడా అక్కడకు వచ్చాడు. అంతకు ముందే బాబా అతనికి త్రిశూల దర్శనం ప్రసాదిస్తారు. మేఘా వచ్చి బాబాకు సాష్టాంగ ప్రమాణం చేస్తాడు. అప్పుడు బాబా " మేఘా ఇదిగో శంకరుడు వేంచాసాడయ్యా ఇక
అతని విషయం నువ్వే చూసుకో" అన్నారు బాబా. అదే సమయంలో దీక్షిత్‌కు కూడా ఒక అద్బుతమైన అనుభవం కలిగింది. దీక్షిత్ వాడాలో స్నానం చేసి హరినామ స్మరణలో మునిగిపోయాడు. తరువాత సాయినామం జపిస్తూ ఉంటే తనకు శివలింగ దర్శనం కలిగింది. అటుగా వెళ్తున్న మేఘా వచ్చి "ఇదిగో బాబా నాకు శివలింగం ఇచ్చారు" ఆని చూపిస్తాడు. ఆశ్చర్యం దీక్షిత్‌కు కనిపించిన శివలింగం కూడా అదే.  ఇదే శివలింగం మేఘా పరమపదించిన తర్వాత గురుస్థానములో ప్రతిష్ట చేయబడింది.

విఠల దర్శనం
ఒకసారి దీక్షిత్ స్నానం చేసి ధ్యానానికీ కూర్చున్నాడు. అప్పుడు ధ్యానంలో విఠల దర్శనం కలిగింది. తరువాత ద్వారకామాయికి వెళ్ళాడు. అప్పుడు "అయితే విఠల్ పాటిల్ నీ వద్దకు వచ్చాడన్న మాట. ఔనా! నువ్వతన్ని కలుసుకున్నావు కదా! కాని జాగ్రత్త విఠలుడు చపలుడు. నీ కన్ను గప్పి క్షణాలలో మాయమయిపోతాడు. అతన్ని గట్టిగా పట్టుకో, అతన్ని ఒక్కచోటనే పెట్టుకో, లేకపోతే అతను మెల్లగా జారుకుంటాడు. నువ్వు ఏ మాత్రం ఒక్క క్షణం కూడా అజాగ్రత్తగా ఉన్నా, అతను మాయమవుతాడు” అని దీక్షిత్‌కు చెప్పారు. ఇంతలో షిరిడికి ఒకతను కొన్ని విఠలుడి చిత్రాలను అమ్ముదామని తెచ్చాడు. ఒక చిత్రంలో విఠలుడి స్వరూపం తన ధ్యానంలో కనిపించిన చిత్రంలాగా ఉంది. వెంటనే బాబా మాటలు గుర్తుకు వచ్చి ఆ చిత్రం కొనేశాడు. దాన్ని పూజా మందిరంలో ఉంచి పూజించాడు.

ఈవిధంగా బాబా ఎన్నో అనుభూతులను ఇచ్చి దీక్షిత్‌ను కరుణించారు.

Dixit Part -3



Progress in Spiritual world:

Sainath is an ocean of mercy. He will protect his devotees and make them walk towards the goal of human life. He is always with us. Dixit was no exception. Until now Dixit proved his faith (Shradda) and devotion towards Baba. He did not even care about his own ego so called image when Baba asked him to kill the goat. If a seeker has to reach new heights in spiritual realm, he or she has to understand death also. Baba is trying to teach all of us that death is not a scary and monstrous thing. Here in the next story Baba is using Dixit to teach us this reality.



Death of an old lady’s son:
Once there was a lady whose son was bitten by a snake and he is about to die. She brings him to Baba and asks him to save him by giving some Udi (Sacred ash). But Baba refuses to give. She starts crying and leaves Dwarakamai. As soon as she leaves the premises her son dies. She brings the dead body and starts weeping with a heavy heart. Watching all this Dixit says, “Baba can you please do some justice to her and save her son”. Then Baba says, “Kaka don’t get entangled in this and whatever happened is good for her son. He is going to do amazing and great things in his new body, which he can not do in this body”. These were enthralling words that Baba spoke about death.

Death of Dixit’s daughter:
 We all know that   Baba saved his daughter (Vatsali) once in the past. But this story is an eye opener. Once Vatsali was in Shirdi with her father and had a fever. Fever was not subsiding and her situation became critical. Baba appears in her dream and says, “ Why are you here, come and sleep under neem tree”. Next day Baba asks Shyama whether Dixit’s daughter is dead or not. Then Shyama says, “Deva why you say those kind of 
words”. Then the word comes out that his daughter did die. Dixit comes to Baba with Bhavartha Ramayana in his hand. Baba takes this book and opens a page and asks Dixit to read. That chapter is about a discourse Rama gives to Tara after Wali was killed. Baba exactly takes this page so that Dixit can understand this teaching about death and life. Dixit knows that he can trust Baba and he did not even talk about his daughter’s death.

Here Baba told Vatsali in her dream to come and sleep under neem tree, which means to come and join him. Baba later told Dixit about Vatsali that she was a special soul. She had to finish her remaining karma as a child and that’s why she died early. She attained salvation. For her to leave this body is a good thing. Baba taught so many intricacies and made Dixit experience the reality of life that is death. This helps any seeker to progress in their quest for higher meaning in their lives.

Baba guiding Dixit’s penance:
If our mind can not withdraw from worldly distractions and we do not have love towards God; what could be worse?  We can say that we have real devotion when all organs of action, senses and other human aspects of life converging as one and be able to love god. What is the use if this devotion does not exist and still we do sit in front of Sai? A real devotee should not tolerate the separation from Sai even for a minute. If we can not get rid of intense passion towards worldly objects, how can we increase our love towards God? Parents might love their children, progeny will expect your material belongings, and wife wants the stability in life and in her family. But no one helps you in the quest for salvation. Then who can help us? If we can not help ourselves no body will. We have to cut down the expectations from other people, and start showing self confidence. We need to examine ourselves and this is the only path to freedom. We are in bondage and we have to realize the intensity of this maze. Guru is the ultimate answer and by reciting Guru’s name we will achieve this goal. We will be able to see God in all creatures.

Once Dixit was reading about Navanatha’s devotion in Bhagavat Puran and expressed to the people there that their mindset and will power is hard to fathom. He also says, “How difficult is this Bhakti (Devotion path) marga and for ignorant people like us it is even more difficult. This could not be achieved even in multiple lives. We are all sinners and these Navanathas are special souls. Then Shyama did not like the melancholy expressed
by Dixit. He reminds him that we have Baba in our lives and we do not need to be that despondent. He also reminds him that Baba asked Dixit to read Bhagavat and Bhavartha Ramayana and is this not enough? He is guiding you and reciting Guru’s name or God’s name is the way to go. So we do not have to worry. Dixit knows this truth but he is looking for perfection in his love towards Sai. 

9 months Penance:
After 1912, Dixit almost gave up his worldly activities and spent most of the time in Shirdi. Once Baba asked him to stay in Dixit wada and start special penance. He told him to not come near Dwarakamai also. He said there are crowds and there is no solitude so stay in wada itself. Dixit was worried that he will not be able to see Sai and participate in his arathi.  Then Shyama intervenes and gets permission to attend Afternoon and Shej arathis. In Dixit wada, Baba never allowed any females in upstairs quarters. Dixit’s wife visits him during this 9 months penance. Baba would not give permission to her also. Baba reassures his wife and sends her back home. Dixit’s daily routine was as follows; he read Eknath Bhagavat during day time and Bhavartha Ramayana in the night. Most of the time, he was doing meditation on Sai. Baba guided him time and time again to read different chapters and through his meditation. Dixit followed strict celibacy and followed Sai for 9 months. With this penance Dixit was able to attain new heights in spiritual world and progressed well in this path.

Here we can think that Dixit was so blessed to be guided by Sai. But lot of devotees had this opportunity but only Dixit came forward to forego his worldly activities and really wanted to change. If we can desire with same intensity, Baba will definitely guide us. If we have Shradda and Sabhuri (Faith & Patience), nothing is impossible.

Spiritual experiences and visions: 

Vision of Siva Linga:
Once a Ramadasi Bhakta came toShirdi and gave Baba a Siva Linga. At the same time, Megha came there and prostrated in front of Baba. Then Baba said “Megha look Shankara came and you have to take care of him from now on”. Megha was so excited and became ecstatic. Exactly at the same time Dixit had an extraordinary experience. He took shower and started doing Hari Nama Smarana (Praying Lord Vishnu). Then he started doing Sai chanting and sees a vision of Siva Linga. He wonders why he saw Siva Linga while doing Hari Nama smarana. Then Megha comes and shows him the Siva Linga that was given by Baba. That was the same Siva Linga that Dixit just saw in his vision. Later after Megha’s death, this Siva Linga was placed at Guru Sthan under Neem tree.

Vittal Darshan (vision):
Once Dixit took a shower and sat for meditation. He then sees Lord Vittal in his meditation. After that he went to see Baba. Baba immediately says, “Vittal Patil came to you. Did you meet him? But be careful, don’t let him go. He is very fluid and slips away easily”. Then Dixit goes to his wada. There comes a person selling Lord Vittal’s photo frames. One of the pictures resembled exactly the same as he saw in his vision. He remembers Baba’s words, immediately buys that picture. He keeps that in his pooja mandir (Altar).


Baba gave so many experiences to Dixit and advanced him in the spiritual path. Sai will always protect us if we show faith and patience.

OM SAI RAM!