In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, October 29, 2014

మానసిక పరివర్తన



మన జీవితంలో మార్పు రావాలని మరియు మన నడవడిక  మారాలని బోధించే వారు బాబా. 
ఒక సారి దీక్షిత్కు బాబా ఈ విధంగా చెప్పారు.

 "నువ్వు వేరే వాళ్ళ గురుంచి చెడుగా మాట్లాడినా లేక వాళ్ళ తప్పులు ఎంచినా, నాకు అమితమైన బాధ కలగుతుంది" అని బాబా అనే వారు. 

అప్పట్లో దీక్షిత్ కు కూడా కోపం ఉండేది. తరువాత  కోపాన్ని నియంత్రించాడు. ఒక సారి వాడాలో క్రిస్టియన్ మతం 
గురుంచి మాట్లాడుతూ వారిని  విమర్శించాడు  దీక్షిత్. అదే రోజు బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు, దీక్షిత్ తో బాబా మాట్లాడ లేదు. దీక్షిత్ తన తప్పు తెలుసుకొని, బాబా ను క్షమించమని మనసులోనే ప్రార్ధిస్తాడు.
అప్పుడు బాబా "ఎవరిని నిందించ వద్దు" అని ప్రేమతో చెప్తారు.

ఒకసారి  దీక్షిత్ రోజు తను చేసుకునే  పూజ చేసుకొని బాబాకు తాంబూలం ఇవ్వడం మరిచాడు. తరువాత బాబా దగ్గరకు వెళ్ళితే, బాబా వెంటనే "నాకు ఈ రోజు తాంబూలం ఇవ్వ లేదు " అని అంటారు. అప్పుడు దీక్షిత్ కు
సాయి యొక్క సర్వజ్ఞత అర్ధం అవుతుంది. ఇక నుంచి నేను మనస్పూర్తిగా బాబాకు పూజ చెయ్యాలి అని అనుకొంటాడు. ఎక్కడ పూజ చేసినా బాబానే స్వయంగా ఎదురుగా ఉన్నారు అన్న భావనతో ప్రార్ధన చేసేవాడు.

సాయి బంధువులారా! 
చూసారా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 

యద్భావం తద్భవతి అని అంటారు. సాయి ఎప్పుడూ మనలను ఒక కంట కనిపెట్టి  ఉంటారు. మనలో నమ్మకం దృడంగా ఉండాలి.

అలానే దీక్షిత్ కూతురు చనిపోయినప్పుడు, బాబా చావు పుట్టుకల గురించి చెప్పి, తనలో వ్యామోహం పోగొట్టారు. 

ఇంకోసారి దీక్షిత్  ఒక కేసు గెలిచి దాదాపు 1000 రూపాయలు ఒక ట్రంకు పెట్టెలో తెచ్చి, బాబాకు ఇదంతా నీదే బాబా అని చెప్పాడు. అప్పుడు బాబా ఆ డబ్బంతా క్షణాల్లో పంచి పెట్టారు.
కాని  దీక్షిత్ లో ఎటువంటి వ్యామోహం కనిపించదు. 

ఇలా బాబా ఒక్కో విషయంలో దీక్షిత్ లో మానసిక పరివర్తన తెచ్చి, మెల్లగా తనను ముక్తి పధం వైపు నడిపించారు. తరువాత అతనికి బాబా ఒక కఫిని కూడా ఇచ్చారు.  దీక్షిత్ ఆ కఫినీని షిర్డిలో ఉన్నప్పుడు ధరించేవాడు. 

మనం బాబాను పూర్తిగా నమ్మితే మనలో కూడా ఈ మానసిక పరివర్తన వస్తుంది.


        ఓం శ్రీ సాయి రాం

Wednesday, October 22, 2014

Changes in personality:




Sai once told Dixit that he should never talk bad about people and it hurts Baba when some one does that. Dixit also had some temper issues at that time. Baba helped him to regulate that in course of time. Once they were having discussion in wada about Christianity and Dixit criticizes the religion. Afterwards when he went to see Baba, Sai was quiet and didn’t speak to Dixit. He immediately realizes that Baba knows every thing and asks Baba’s to forgive him in his mind. Then Baba talks to him. Baba then says not to criticize any thing.

Once Dixit performed his daily worship to Baba but forgot to give betel leaves to Sai. When he goes to Dwarakamai, Baba says “Kaka you did not give me betel leaves today”. Dixit was very happy that Baba is watching over him and receiving all his Puja (worship). Since that time, he always did his worship thinking that Baba is in front of him.

So Sai devotees, what can we learn from this. 
Sai is always watching us and we have to worship him with lot of love. 

We should have utmost faith in Baba. 

He was teaching Dixit different means to improve his personality so that he can 
prepare him for the ultimate goal of life that is Salvation. 

When his daughter died, Baba taught him about death and dying, so that Dixit can understand what human life is about. 

Another time, Dixit won a case and brings 1000 rupees in a box to Baba. He says to Baba “Baba all this is yours”. Then Baba gives away all the money in seconds to everyone around him. Dixit does not even flinch. People were watching his feelings but Dixit eyes were focused on Baba’s feet. This way he proved that he is not attached to money either.
 
Along these lines, Dixit personality slowly changed and Baba made him walk towards self- realization. Baba also gave him kaphni (Robe) and Dixit used to wear this when he was in Shirdi.



Wednesday, October 15, 2014

SATSANGH




The importance of satsangh was described as follows in Sri Sai Satcharita:
By listening and reflecting over the stories of the Saints, we will be purified. 

When we learn about our Great Parama Guru Sri Shirdi Sai through studious application,  and intense contemplation,our minds will be purified.

If we surrender to Sai, he will bless us there by our intent to understand his teachings will ripen. By listening to Guru's teachings and his teachings through satsangh will free us from the difficulties of this material world. This is the best way to reach our goals.

We have to love our Sai with out any second thoughts. Our heart should become the abode of Sai.


 To fill our hearts with love for Sai:
We have to recite Sai's name all the time.


We have to understand the gist of Sai's teachings.


When  we memorize Sai's teachings and practice them in real life,  Sai will bring knowledge of light in to our lives.

 
This love will make us understand Sai even more.


If one needs to stay in this happy state. we need to resort to satsangh. 



Let us offer a prayer to our beloved Sai to give us the blessing to be in the company of a Satsangh. We will also ask Sai to give us the strength to sustain in Satsangh 
until we reach our goal.




The ardent desire does not arise without the Lord’s Grace. Only when the Lord chooses to bless (grace) the desire to listen (to his praises) is awakened.

This light will show us the path and will increase the love towards Sai. 

Bad company is absolutely harmful. It is the abode of severe miseries. Unknowingly, it would take you to the by-lanes, bypassing the highway of happiness. 

Without the one and only Sainath or without a Sadguru, who else can purify the ill-effects of bad company?

Words spoken by the Guru, out of compassion, oh devotees retain them in your heart! Your bad deeds will be washed away.

‘Satsangh’ completely destroys bodily pride or ego. Therefore, there is no other
means than ‘Satsangh’.

Hold on to the good company of the Guru and the virtuous. Disentangle from the worldly ties. Definitely herein is your fulfillment. Have no doubts. 

Abandoning all the million clever and cunning ways, recall always “Sai, Sai” . You will be able to cross the worldly ocean. Have no doubts.

In order to attain final emancipation, the only remedy is to have detachment of the senses. Unless one has a keen desire for ‘Satsangh’, one cannot realize one’s true identity.

Happiness is followed by unhappiness; and unhappiness follows happiness. One welcomes happiness, while one turns away from unhappiness.

Whether you face happily or turn your back on your destiny, what will be, will be,. But to liberate oneself from both kinds of destined experiences, the company of the Saint is the only way.

Because of ‘Satsangh’ bodily attachment is destroyed. It is ‘Satsangh’ that breaks the cycle of birth and death. 

It is ‘Satsangh’ that gains the treasure of supreme energy and separates one from the worldly ties immediately.

OM SRI SAI RAM!

Wednesday, October 8, 2014

సత్సంగమే మహాభాగ్యం


సత్సంగ మహిమ గురించి శ్రీ సాయి సచ్చరితలో (మూలంలో) ఈ విధంగా చెప్పబడింది.

సత్పురుషుల చరిత్రలు మనలను సన్మార్గంలో ఉంచుతాయి. మన గురువైన శ్రీ సాయినాథుల చరిత్రను శ్రవణం, మననం, అధ్యయనం, నిధి ధ్యాసనం చేస్తే మనలో పవిత్రత పెరుగుతుంది. 

సాయిని శరణు వేడితే, ఆ సాయి మన మీద అనుగ్రహ వర్షం కురిపించినప్పుడు మనలో ఈ శ్రవణ లాలస పెరుగుతుంది. గురు కథా శ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించి మనం ఈ ప్రాపంచిక బాధలనుంచి దూరం కావచ్చు. ఇదే మన జీవితానికి సార్ధకతను చేకూర్చే సాధనం. 

మనస్సులో ఏ సందేహాలను ఉంచుకోకుండా సాయిని ప్రేమించాలి. మన మనస్సే సాయి నిలయం అయిపోవాలి. 

మన మనస్సు సాయి ప్రేమతో నిండాలి అంటే!

ఎల్లప్పుడూ సాయి స్మరణ చేస్తూ ఉండాలి. 

సాయి తత్వాన్ని అర్ధం చేసుకోవాలి.

సాయి చెప్పిన బోధలను మననం చేసుకుంటూ, వాటిని ఆచరిస్తూ మన జీవితంలో వెలుగును నింపుకోవాలి. 

ఆ సాయి అనే వెలుగు మనకు దారి చూపిస్తూ మనలో ప్రేమను నింపుతుంది. 

ఈ ప్రేమే మనకు బాబా చెప్పిన తత్వాన్ని మరింత బోధపడేట్లు చేస్తుంది. 

ఈ స్థితి ఎల్లప్పుడూ ఉండాలి అంటే మనకు సత్సంగం చాలా అవసరం. 

చెడు సావాసం అంత మంచిది కాదు. ఇక్కడ చేడుసావాసం అంటే చెడ్డ వాళ్ళతో తిరగడం అనే అర్ధం మాత్రమె కాదు. మన లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళతో, అలానే బాబా కోసం పరితపించే వాళ్ళతో మెలగడం అలవాటు చేసుకోవాలి. అప్పడు మనలో మానసిక పరివర్తన వస్తుంది. 

సృష్టిలోని రూపాలు కళ్ళలో నిండినప్పుడు బాహ్య సౌందర్యాన్ని ఆపేక్షించే మనస్సు దానితో రమిస్తుంది. ఆ దృష్టి అంతర్ముఖం అయితే అది సత్సంగంలో రంజిల్లుతుంది. సత్సంగం యొక్క మహిమ అటువంటిది. అది శారిరాభిమానాన్ని సమూలంగా అణిచివేస్తుంది. అందువల్ల సత్సంగం కంటే మరో సాధన లేదు. అందుకే బాబా నిత్యం సత్సంగం చేయండి అనే చెప్పేవారు. మంచి వారితో ఉండండి అనే వారు. ఇతర సాంగత్యాలు దోషపూరితం అయినవి. శరీరం అంతటినీ నిర్మలం చేసేది, ఏ దోషాలు లేనిది సత్సంగం ఒక్కటే.

సత్సంగం శరీరం పైన ప్రీతిని, అభిమానాన్ని తొలగిస్తుంది. ఒక్క సారి దాని పట్ల శ్రద్ద కలిగితే, దాని బలవత్తర శక్తి వల్ల 
తప్పక సంసారం నుండి విముక్తి కలుగుతుంది. 

బాగ్యవశాత్తు సత్సంగం లభించిందా ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు. చెడు వాసనలన్నీ పోయి మనసు నిర్మలమైన స్థితిలో రమిస్తుంది. 

పరమార్ధంలో ప్రవేశించడానికి విషయసుఖాల యందు విరక్తి ఒక్కటే ఉపాయం. సత్సంగాన్ని ఆశ్రయించకుండా ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోలేము. 

సుఖాల వెంట దుఖాలు, దుఖాల వెంట సుఖాలు వస్తుంటాయి. జీవుడు ఎప్పుడూ సుఖాలనే ఆశిస్తూ దుఖాలకు విముఖంగా ఉంటాడు. సుఖ దుఖాలనే ఈ రెండు అనుభవాలనుంచి విముక్తిని కలిగించేది, సత్పురుషుల సాంగత్యం ఒక్కటే. 

సత్సంగం వలన జనన మరణాలు ఆగిపోతాయి. అప్పుడే మనం ఆ పరమాత్మను అనుభవ పూర్వకంగా తెలుసుకోగల్గుతాము. 

మనం అందరం సాయిని ఆ సత్సంగ భాగ్యం కలిగించమని వేడుకుందాము. ఆ సత్సంగం లభించిన తరువాత దాన్ని వదులుకోకుండా ఉండే శక్తి మనకిమ్మని ఆ సాయిని మనసా వాచా కర్మణా ప్రార్దించుదాము. 





ఓం శ్రీ సాయి రాం!