In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, January 31, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 20



సాయి అసలు నిరాకారమే అయినా భక్తుల కొరకు సాకార రూపాన్ని ధరించారు. బాబా ఆరతి అయిన తరువాత పిడికిళ్లు నిండా విభూతి తీసుకొని భక్తుల చేతులో పోసేవారు. తమ బొటన వేలితో భక్తుల నుదుట అద్దేవారు. అందరిని ప్రేమతో పలకరించేవారు. 

ఒకసారి దాసగణు మహారాజు గారు ఈశావాశ్య ఉపనిషత్ మీద చక్కటి భాష్యం వ్రాయాలని సంకల్పించి, చందోబద్ధంగా ఓవిలతో వ్రాసారు. దానిని చాలామంది ఆమోదించి గౌరవించారు. అతని కోరిక నెరవెరినది. కాని అతనికి ఒక సందేహం తీరలేదు. దానిని అతడు పండితుల ముందు ఉంచాడు. చాలా చర్చలు జరిగినా అతని సందేహం తీరలేదు. ఆ తరువాత అతడు షిర్డి రావడం జరిగింది. బాబాను దీని అర్థం బోధించమని ప్రార్ధించాడు. అప్పుడు బాబా "దీనిలో కష్టం ఏముంది! నీవు ఎక్కడనుంచి వచ్చావో అక్కడికి మరల వెళ్ళినప్పుడు కాకా పని మనిషి నీ సందేహాన్ని తీరుస్తుంది" అని చెప్పారు. పని పిల్ల దీనికి అర్థం చెప్పడం ఏమిటి? సాయి పరిహాసం చేస్తున్నారు అని అక్కడ ఉన్న వారు అనుకొన్నారు. కాని దాసగణుకు బాబా చెప్పినది సత్యం అని తెలుసు. 

ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే? మనలో భావన ఎలా ఉంటే ఫలితం అలా ఉంటుంది. గురువు చెప్పిన ప్రతి మాట బ్రహ్మ లిఖితమే. వారు ఉపయోగం లేకుండా ఏమీ చెప్పరు.
 

సరే ఆ తరువాత గణు కాకా ఇంటికి వెళ్తాడు. తను నిద్రలో ఉండగా ఒక మధురగానం వినిపించింది. ఆ గానం ఆ ఇంట్లో పని చేసే ఒక నౌకరు యొక్క
 చెల్లెలుది . ఆ అమ్మాయికి ఎనిమిది ఏళ్ళు ఉంటాయి. తను ఒక చినిగిన గుడ్డ ముక్కను నడుముకు కట్టుకొని నారింజ చీర అందాన్ని వర్ణిస్తూ పాటపాడుతూ ఉంది. తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరిపడా బట్ట లేదు, ఐనా ఆమె ఎంతో సంతోషంగా ఉంది. 

ఆపిల్ల
 యొక్క స్థితిని చూసి, ప్రధాన్ గారి చేత ఒక కొత్త చీర ఇప్పించారు. మరునాడు ఆ అమ్మాయి ఆ చీర కట్టుకొని ఆనందంతో గంతులు వేసింది. తరువాతి రోజు కొత్త చీరను దాచుకొని మరల చినిగిన గుడ్డ కట్టుకొని పనిలోకి వచ్చింది. ఆ అమ్మాయిలో అదే ఆనందం. కొత్తచీర కట్టుకోలేదు అన్న బాధ ఎక్కడా కన్పించలేదు. ఇదంతా చూసిన దాసగణు మహారాజుకి  ఈశావాశ్య ఉపనిషత్ యొక్క అర్థం బోధపడింది. 

ఇక్కడ దాసగణు మహారాజుకు అర్థం అయిన విషయాలు ఏమిటి? ఈ విషయాలు బాబానే స్వయంగా షిర్డీలోనే చెప్పిఉండవచ్చుకదా! కానీ బాబా అలా చేయలేదు. బాబా ఎప్పుడూ అనుభవపూర్వకముగానె నేర్పిస్తారు.
 

ఈశావాశ్య ఉపనిషత్లో 18 మంత్రాలు ఉన్నాయి.
 

ఈశ అంటే ఈశ్వరుడు, వాశ అంటే అంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం.
 

బాబా షిర్డీలోనే ఈ విషయాన్ని నేర్పించవచ్చు. అంతటా నేనే ఉన్నా, పని పిల్లలో కూడా నేనే ఉన్నా, అని ఆమె ద్వారా నేర్పించడం అనేది ముఖ్యమైన విషయం.
 

భగవంతుడు సర్వవ్యాపి, పూర్ణుడు అని మొట్ట మొదటి మంత్రంలో చెప్పబడింది. ఈ ప్రపంచమంతా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నప్పుడు ఆయన లేని స్థలం ఉంటుందా.
 

పరమాత్మనుంచే పూర్ణ జగత్తు వచ్చింది.
 

పనిపిల్ల యొక్క పేదరికం ఈశ్వరుని అంశం.
 

చినిగిన చీర కూడా ఈశ్వరుని అంశమే.


దాత, దానం, దానం తీసుకునేవారు; ఇవన్నీ కూడా ఈశ్వరునిలో భాగాలే.


నేను నాది అన్న భావనను పారద్రోలి ఎప్పుడూ నిరభిమానంగా ఉంటూ సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి.
 

ఇక్కడ పని పిల్ల మంచి చీర కట్టుకున్నప్పుడు, అది లేనప్పుడూ ఆనందంగానే ఉంది. ఇదే బాబా మనకు నేర్పించాలనుకున్న సత్యం. ఈ భావం "తేన త్యక్తేన భుంజీధా" అనే మంత్రంలో చెప్పబడింది. దీన్నే బాబా మనకు సులభంగా నేర్పించారు. ఈ ప్రాపంచిక సుఖాలను త్యజించడం చాలా కష్టం. మనకి అంతర్ దృష్టి కలగడం కూడా కష్టమే. అందుకే "త్యక్తేన
 భుంజీధా" అని అన్నారు. సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. 

ఈ వస్తువులన్నీ పరమాత్మకు చెందినవి. ఆయనే మనకు వాటిని ప్రసాదించాడు. ఈ లోకంలో వేటిని మనం వెంట తెచ్చుకోలేదు, చనిపోయినప్పుడు దేన్నీ వెంట తీసుకువెళ్ళలేము. మనం ఇక్కడకు వచ్చేటప్పడికి అన్ని తయారుగా ఉన్నాయి. నీరు, గాలి, భూమి, అగ్ని, ఆకాశం, వెలుగు, చెట్లు మరియు నదులు ఇట్లా అన్ని తయారుచేసి మనకు ఇచ్చారు. వాటిని మనం పరమాత్మ ప్రసాదంగా అనుభవించాలి. ఇదే మన మనస్సుకు హత్తుకోవాల్సిన విషయం.
 

ఈ సృష్టిలో మనందరి అవసరాల కోసం భగవంతుడు అవసరం అయినంత వరకు ఇచ్చాడు. అందులో మన వాటా మనం అనుభవించాలి. అప్పుడు ఇతరులు తమ వాటా
 తాము అనుభవించగలుగుతారు. కాని కొందరు స్వార్ధంతో అధికభాగాన్ని అన్యాయంగా లాక్కుని మరి కూడబెడ్తారు. ఇట్లా చేసిన వారి గతి ఏమిటి? వారు ఏ లోకాలకు వెళ్తారు అనే విషయాన్ని కూడా ఈ ఉపనిషత్ చెప్తుంది. 

ఇక్కడ త్యజించి
 అనుభవించడం అంటే మనం అరటి పండు తొక్క తీసేసి లోపల ఉన్న దాన్ని తింటాము. అలానే ఈ నామరూపాత్మకం అయిన జగత్తులో ఉన్న తొడుగు తీసేస్తే అప్పుడు మనకు పరమాత్మ కన్పిస్తారు. 

మన కథలో పని పిల్ల, చిరిగిన చీర, కొత్త చీర, దానం ఇట్లా చాల విషయాలు ఉన్నాయి.


పరిస్తితులు ఎట్లా ఉన్నా మన పని చేస్తూ ఆనందంగా ఉండటమే పరమాత్మ తత్త్వం.
 

బాబా ఈ విషయాలను నోటితో చెప్పవచ్చు, కాని దాసగణు మహారాజుకి ఈ దివ్యానుభవం ద్వారా ఆయన అనుమానాలన్నీ తీర్చారు. అంతేకాకుండా ఆయనకు పరమ ఆనందానుభూతిని కలుగచెసారు. 

శ్రీ సాయినాథార్పణమస్తు !


Sri SaiSatcharita Chapter - 20


Sai is our eternal support. By mere darshan of Sai, the worldly fatigue is removed. Our Tamoguna is laid off. He will take care of our Rajoguna which is worldly impressions. He makes us walk with Satva Guna so that e can reach the heights of spiritual world. Baba used to address everyone with affection and make sure they were well taken care off when they come to Shirdi.


Dasganu Maharaj once wanted to write commentary on Isavasyopanishad and fulfills his desire by writing this complicated scripture. So many people appreciated his writing and praised for doing so. But Dasganu had lot of questions and he put his doubts in front of some great scholars. But they could not satisfy his mind. He was unhappy about this. He approaches Baba and requested him to bless him with this knowledge. Then Baba says that there is nothing difficult about this and when you go back, visit kaka’s house. His maid will clarify your doubts.


Every one felt that Baba is joking and how a maid can teach a scripture. But Dasganu knew that he has to go to Kaka Dixit’s house. What Baba said is the truth.

Here the take home point is the belief in your Guru in Baba’s words Shradda (Faith). Guru’s word is God’s word.

Then he goes to Kaka’s house and rests that night. He suddenly wakes up to a sweet voice who was singing about a saree. Then he woke up and wanted to check who that lady was? He started thinking is this the lady Baba was talking about? She was the sister of another worker by name Namya. Then he listens closely to the song she was singing about Saree (dress) which is in color orange. She was wearing a rag yet she was singing about a beautiful dress. She was very happy in singing this song.


Then he felt for her poverty and asked Moreswar Pradhan to give her a Saree. Then she wore that dress next day and started singing again. She came back to work next day with her original rag and still she was happy. She was singing and there was no difference in her attitude. After observing all this, Dasganu felt that he understood the Isavasyopanishad. He was able to satisfy his zeal in understanding the scripture.

What did Dasganu learn from observing this maid?

Baba could have taught him this in Shirdi itself. Why send him to kaka’s house?

What can we learn from the maid, the Saree, the work she was doing, the happiness that she showed by singing even when she was not wearing the new saree. What is the link and relation to Isavasyopanishad?



Isavasyopanishad has 18 verses. This is the smallest Upanishad of all of the Upanishads. Eesa means God and Vaasa means “who is omnipresent.

Baba could have told him this in Shirdi itself. But he wanted to show Dasganu that he can teach through a maid to prove that he is everywhere.

The initial verse teaches us that God is every where and is all pervading. The universe came from this completeness.

The maid’s poverty, ragged Saree, person who donated the saree, and all this is part of God.

If we can get rid of ego, the sense of me, mine and enjoy with out expectation, then we will succeed in spiritual path.

In this story, maid was happy when she was in a rag or new Saree. This did not affect her happiness. This is what Baba wanted Dasganu to learn. This teaching is confirmed in the verses of Isavasyopanishad. It is really hard to reject the materialistic happiness. But we have to enjoy them by rejecting them. They both are contradicting each other. What it really means is to enjoy the worldly things with out getting attached to the object. All these objects were given to us by God. He gave air to breath, water to drink, and all the required elements to live. We did not bring any thing when we came in to this world and we do not take any thing with us when we die. We have to appreciate God for giving all this. The scripture says that we should not take any thing that does not belong to us. In this universe we were given enough and we have to understand our piece of the pie. If we try to snatch from others and accumulate, what will happen? Some people by their crooked ways gulp every thing around them. This is not fair and we can not even imagine what they have to go through after wards.  There will be balance in the nature.

The word “Tena Tyaktena Bhunjida” also denotes another meaning. When we eat banana, we eat the pulp and throw the skin. In a similar way, we have to reject the materialistic world by grasping the force behind this that is Paramatma (Supreme God).

In our story we have lot of elements like the maid, saree, and rag, person who donated the saree etc. But the happiness that she was in irrespective of what she was wearing is the concept of ultimate happiness (Paramatma tatva).

Baba not only provided this situation for Dasganu to learn but he also gave him an extraordinary out of body experience. This is what great Gurus do! They will make you experience the scripture rather than just telling you. With this ultimate experience Dasganu’s doubts were cleared once for all about Isavasyopanishad.


OM SRI SAI RAM! 

Wednesday, January 24, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయాలు 18-19


  
సాయిలాంటి సద్గురువులు మన బుద్ధిని వికసింపచేసి, మనలో భక్తిని వృద్ధి చేసి ఆత్మజ్ఞానమనే బీజాన్ని నాటుతారు. మనం వివేక వైరాగ్యాలతో సాధన చేస్తే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. సత్చరిత 18-19 అధ్యాయాలలో హేమద్పంత్ గారు తన ఆలోచనా విధానాన్ని బాబా ఎలా మార్చారో, అలానే సాఠే గారి గురించి, రాధాబాయి కథను, ఇంకా బాబా చెప్పిన అతి ముఖ్యమైన అద్ధ్యాత్మిక సాధనను గురించి చెప్పారు. 

 సాఠే అనే ఒక పెద్దమనిషి వ్యాపారంలో దాదాపు అంతా పోగొట్టుకున్నాడు. మానసికంగా ఎంతో కృంగిపోయాడు. ఎవరో షిరిడికి వెళ్ళమని చెపితే వచ్చి బాబాను దర్శించాడు. గురు చరిత్ర పారాయణం చేశాడు. ఆ ఏడవ రోజు స్వప్నంలో బాబా గురుచరిత్రను వివరిస్తునట్లుగా చూశాడు. ఈ విషయం దీక్షిత్‌కు చెప్పగా అక్కడే ఉన్న హేమద్ మనసులో కలవరం మొదలయింది. ఈ సాఠే ఒక్కసారి పారాయణం చెయ్యగానే బాబా స్వప్న దర్శనం ఇచ్చారు. కాని నేను 40 ఏళ్ళుగా చేస్తున్నా నాకు ఎన్నడు ఇటువంటి అదృష్టము కలగలేదు అని అనుకున్నాడు. ఇది పసిగట్టిన బాబా హేమద్‌ను 15 రూపాయల దక్షిణ తెమ్మని శ్యామా ఇంటికి పంపించారు. ఆ తరువాత శ్యామా చెప్పే మాటలను జాగ్రత్తగా వినమన్నారు. ఆ తరువాత కథ మనము చదివిందే. శ్యామా 15 నమస్కారాలు దక్షిణగా ఇచ్చి రాధాబాయి దేశ్‌ముఖ్ కథ చెప్పారు. 

రాధాబాయి సాయి కీర్తిని విని బాబాని గురువుగా స్వీకరించి ఆయన దగ్గర ఉపదేశం పొందాలి అని సంగమునేరు అనే ప్రాంతంనుంచి వస్తారు. ఆమె బాబా తనను అనుగ్రహించిన దాకా ఉపవాస దీక్షలో ఉండాలి అని నిర్ణయం తీసుకుంటుంది. శ్యామా కలుగచేసుకుని బాబాకు ఆమెను కరుణించమని అర్ధిస్తాడు. అప్పుడు బాబా ఆమెకు ఈ విధంగా చెప్తారు. " అమ్మా! నేను నా గురువుకి 12 సంవత్సరాలు సేవ చేసాను, ఆయన నా దగ్గర నుంచి రెండు పైసలు దక్షిణగా అడిగారు, కాని నాకు ఏ మంత్రము ఇవ్వలేదు. కేవలము ఆయన సన్నిహిత్యంలోనే చాలా నేర్చుకున్నాను. ఆయన ద్యాస తప్పితే వేరే ఆలోచనే ఉండేది కాదు. ఆయన చల్లని చూపులు నాపై ఎల్లప్పుడు ఉండేవి. ఎప్పుడు ఆయన గూర్చే నా ధ్యానం. రోజూ ఆయనను తప్పితే మరో స్మరణ ఉండేది కాదు. ఆయన నన్ను అడిగిన రెండు పైసలు శ్రద్ధ, సభూరి. ఇదే ఆయన నాకిచ్చిన ఉపదేశము. ఎంత దైన్య పరిస్థితి ఎదురైనా గురువుపై నమ్మకాన్ని వదలకూడదు. ఇక్కడే సహనం కావాలి. గొప్ప పండితుడైన, గుణవంతుడైనా సహనం లేకపోతె వారి జీవితం వ్యర్థం. నన్ను ఒకప్పుడు ఆయన పాదాల వద్ద లేక సముద్రపు వడ్డున ఆవలి వైపు ఉంచేవారు. ఎలాగైతే తాబేలు తన పిల్లలకు తన దృష్టి ద్వారానే ఆహారాన్ని సమకూర్చేదో అలానే మా గురువుగారు కూడా కృపాదృష్టితో పోషిస్తారు. అందుకే నీవు కూడా ఈ మంత్రాల జోలికి వెళ్లకుండా చక్కగా గురువుని అనుసరించు అని బాబా చెప్పారు. ఈ సంఘటన ద్వారా బాబా హేమద్‌కి చాలా విషయాలు నేర్పించారు. అవి ఏమిటో మనము ఇప్పుడు పరిశీలిద్దాము.

                మొట్టమొదటగా హేమద్‌కు ఆ రోజు ఒక నియమ భంగం కలిగింది. ఆయన రోజు భాగవతం పారాయణం చేస్తారు. కాని ఆ రోజు బాబా గోష్టిలో పాల్గొనాలి అని పారాయణం చేయకుండా మశీదుకు వెళ్తారు. శ్యామా ఇంటిలో ఉన్న భాగవత పుస్తకంలో సరిగ్గా అదే పుటను చూపించి తను ఎక్కడైతే పారాయణం ఆపాడో అక్కడే మరల చదివిస్తారు. ఇదే బాబా మనకు బోదిస్తున్న విషయం. మనము చేసే పనిలో శ్రద్ధ ఉండాలి. మన ఆలోచనలు మనల్ని బానిసలుగా మార్చుకోకూడదు. తరువాత రాధాభాయి కథను మసీదులో బాబాకు హేమద్ వినిపిస్తాడు. అప్పుడు సాయి హేమద్‌కు ఈ విధంగా బోధచేస్తారు.

                ఆత్మజ్ఞానమే సమ్యక్ విజ్ఞానం. ఈ సమ్యక్ విజ్ఞానం ధ్యానం ద్వారానే సంభవం. ధ్యానమే ఆత్మనుష్టానం. దీని ద్వారా మనలోని చిత్తవృత్తులు అన్ని సమాధాన పడ్తాయి.ముందుగా నువ్వు ఈ సర్వ ఈషణలు  నుండి ముక్తుడవు అవ్వాలి. (ఇక్కడ ఈషణలు అంటే మనకు జీవితంలో కలిగే కోరికలు, తపనలు, ప్రేమానురాగాలు). తర్వాత సర్వ భూతస్థ ఆత్మను ధ్యానించాలి. (అంటే నిరాకార ధ్యానం) అప్పుడు ధ్యానం చక్కగా కుదురుతుంది. ఇది కనక కష్టమైతే నా ఈ సగుణ రూపాన్ని ధ్యానించు. ఇలాచేస్తే నీ మనసు ఏకాగ్రమవుతుంది. నువ్వు బ్రహ్మంతో ఏకమవుతావు. అని చక్కని బోధ బాబా హేమద్‌కు చేయడం జరిగింది. ఆ తరువాత బాబా వీటన్నింటిని చక్కగా శ్రవణ మన్న నిధి ధ్యానాల ద్వారా మహదానందాన్ని పొందవచ్చు అని చెప్పారు.

                సద్గురువులు మనకు ఎన్నోవిషయాలు చెప్పవచ్చు కాని అవి మన నిజజీవితంలోకి అన్వయించుకుంటేనే అవి మనకు ఉపయోగపడ్తాయి. ఇక్కడ రాధాభాయి కథ ద్వారా శ్రద్ధ, సబూరి అనే గొప్ప మంత్రాల్ని బాబా మనకు ఇచ్చారు. మనకు ఉపనిషత్తులు అన్ని బాగా తెలియవచ్చు. కాని నిజజీవితంలో మార్పులు రాకపోతే ఆ జ్ఞానం మనల్ని ముందుకు తీసుకువెళ్ళదు. ఇక్కడ హేమద్‌పంత్ యొక్క అంతర్ శత్రువులను బాబా వెలికి తీసుకువచ్చి ఒక్కొక్కటిగా పారద్రోలి, తను ముందు ముందు చేయించబోయే సత్కర్మలకు సిద్ధం చేసారు. ఈ సందర్భంలోనే బాబా చాలా సూక్తులు వినిపించారు. పూర్వజన్మ బంధనం లేనిదే ఎవరూ ఎక్కడికి వెళ్ళలేరు. కాబట్టి మనిషి, పశువు, పక్షి ఏదైనా నిన్ను చేరవస్తే చీ కొట్టి తరిమేయకు. నీవద్దకు ఎవరు వచ్చినా తగినట్లుగా ఆదరించు. దాహార్తులకు మంచినీళ్ళు ఇవ్వు, ఆకలిగా ఉన్నవారికి అన్నము పెట్టు. వస్త్రాలు లేని వారికి దుస్తులు ఇవ్వు. అనాశ్రితులకు  ఆశ్రయమివ్వు ఇలా చేస్తే భగవంతుడు తృప్తి పడతాడు. ఒకరు నిన్ను దానం అడుగుతారు ఇస్తే ఇవ్వు అంతేకాని వారిని నిందించవద్దు. ఇతరులు నిన్ను మాటలతో గాయపరుస్తారు. ఆ నిందలను నువ్వు ఓర్పుతో భరిస్తే నీకు అపరిమితమైన ఆనందం అనుభూతమవుతుంది. ఈ లోకం అడ్డదిడ్డంగా పోవచ్చు, కాని మనం మాత్రం తడబడరాదు. మనం మననేలపై స్థిరంగా నిలచి ఈ విశ్వక్రీడను తిలకిస్తూ ఉండాలి. నీకూ నాకూ మధ్యన ఉండే గోడను పూర్తిగా కూల్చివేయి. అప్పుడు మనకు దారి ఏర్పడుతుంది. నీవు నేను అన్న భావనే ఈ అడ్డుగోడ అని చక్కని ఉపదేశాన్ని బాబా చెప్పారు. ఇక్కడే బాబా పరనింద  కూడా  వద్దు అని చెప్పారు.
  
                మనం ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి అంటే పూజలు, ధ్యానాలతో బాటు మనజీవితంలో బాబా చెప్పిన మార్పులు రావాలి. అవి రాకుండా మనకు బ్రహ్మా జ్ఞానానికి కావలసిన అర్హత రాదు. అందుకే బాబా తన భక్తులను ముందుగా ఈ విషయంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించేవారు. కాని మనకి ఆయన మీద నమ్మకం లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేము.

శ్రీ సాయినాథార్పణమస్తు!




Sri SaiSatcharita Chapters 18 & 19



Sadgurus, like Sai open our intellect and show us the divine beauty of the self, and fulfill our tender longings of devotion. when this is done our desire for sense objects vanishes and we develop dispassion. Then knowledge sprouts. All this happens when we come in contact with saints. These chapters talk about how Hemadpanth was  blessed, stories about Sathe and Mrs Deshmukh and other teachings by Baba. 


Baba sending Hemadpant to Shyama's house:

A great business man by name Sathe lost every thing in his life. He became distressed and despondent about his situation. Some one suggested to him that if he goes to Shirdi he might feel better. He came and visited Baba, started reading Guru Charitra (Scripture). After seven days, he saw Baba in his dream and Baba was explaining the scripture that he was reading. He came and told Dixit about the dream and Hemadpant was also there. Hemadpant then felt in his mind that he read this scripture several times and Baba never appeared in his dream. He felt sorry for himself. Baba realized this and told him to go to Shyama’s house. He was supposed to ask for rupees 15 as Dakshina (offering) and stay with him little while to talk. Baba taught so many things by just sending him to Shyama.

Usually Hemadpant reads his daily scripture but he did not read that day. When he went to Shyama’s house, Shyama was busy and asked him to make himself comfortable. Then he saw Bhagavata scripture and opened the book. He exactly opens where he stopped earlier. He was surprised by this. Baba is teaching here that we need to have dedication in what ever we do. Our mind should not control us. Then Shyama talks about the story of Radhabai Deshmukh. 

In Sai Sathcharita, this Radhabhai Deshmukh story is so important as it contains the essence of Baba's teachings. If we can understand this very well and follow, we do not need anything else in our lives. Radhabhai comes to Shirdi asking Baba to bless her with a mantra as she wanted to accept Baba as her Guru. She wanted to fast until Baba blesses her. Baba later intervenes and says " Oh Mother! why do you have to subject yourself to unnecessary tortures? You are my mother and I am your child. Take pity on me and hear me through. My Guru was a great saint and he never gave me any mantra but he asked me two coins. One is firm faith and and the other one is patience. I gave these two paise to him and he was pleased. I served him for 12 years and he was My sole refuge." 

Baba continued " Do not try to get any mantra or upadesh from anbody. Make me the sole object of your thoughts and actions and you will no doubt, attain the ultimate goal of life that is Moksha. Have faith and confidence in your Guru. " 

Hemadpant goes and repeats the story to Baba during the afternoon arathi time. Then Sai gives a discourse which goes as follows. 


Then Baba said, 'Wonderful is the story. Did the story strike you, and did you catch its significance?' Anna Saheb said, 'Yes. The restlessness of my mind has vanished. I have got true peace and come to know the true path'. 

Then Baba said, 'My method is quite unique. Remember well this one story, and it will be very useful. To get knowledge (realization) of the self, dhyana (meditation) is necessary. If you practice it continuously, the vrittis (thoughts) will be pacified. 

Being quite desire less, you should meditate on the Lord who is in all the creatures, and when the mind is concentrated, the goal will be achieved. 

Meditate always on my formless nature, which is Knowledge Incarnate, Consciousness and Bliss. If you cannot do this, meditate on my form from top to toe as you see here night and day. As you go on doing this, your vrittis will be one-pointed and the distinction between the dhyata (meditator), dhyana (act of meditation) dhyeya (thing meditated upon) will be lost, and the meditator will be one with the consciousness and be merged in Brahman. 

The mother tortoise is on one bank of the river and her young ones are on the other side. She gives neither milk nor warmth to them. The mere glance gives them nutrition. The young ones do nothing but remember (meditate upon) their mother. The tortoise glance is, to the young ones, a downpour of nectar, the only source of sustenance and happiness. Similar is the relation between the Guru 'and disciples.' 

Baba gave him sugar candy and said, 'If you take this story to heart, remember it well, your state will be equally sweet. Your desires will be fulfilled and you will be happy. Meditate on the story; assimilate its spirit; then you will always remember and meditate on the Lord who will manifest himself to you.'

Great Gurus will teach us so many things but if we can not relate them to our daily life there is no use. By giving Radhabai Deshmukh story Baba gave us two great things in the form of Faith and patience. Even if we are well versed in different Upanishads, what is the use; if we can not change our lives and get rid of ignorance?

At the end of the chapter 19 Hemadpanth talks about Baba's advise regarding our behaviors. 

The following words of Baba are general and invaluable. If they are kept in mind and acted upon, they will always do you good. "Unless there is some relationship or connection, nobody goes anywhere. If any men or creatures come to you, do not discourteously drive them away, but receive them well and treat them, with due respect.


Next we will see what Baba said about good thoughts. Baba said “If you get a good thought in the night, ponder over it, when you get up in the morning put that thought in to works. This is the first step in the direction of the truth that is Jnana (knowledge). This is what gives us mental peace”. Baba always encouraged his devotees to implement good thoughts immediately. God always protects us and takes us forward with positive thoughts and good intentions. Baba always provided his blessings and will continue to give us enough patience to carry out those fruitful good thoughts.

Baba says not to waste our life by criticizing other and he compares this to a pig eating the filth. By doing this we create negative energy around us. 

The chapter was concluded with Baba climbing up on the roof of Vaman Gondkar;s house, passed over the roof of Radhakrishnamai to help her get rid of fever. Baba not only saved Radhakrishnamai but also taught us how to give remuneration for labor by paying someone who brought the ladder. 




Om Srisainathaarpanamasthu! 






Wednesday, January 17, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయాలు - 16 & 17



మనము మన చిత్తాన్ని శుద్ది చేసుకొని, సాధన చతుష్టయాన్ని (అంటే వివేకము, వైరాగ్యము, శమదమాది షట్ సంపత్తి మరియు ముముక్షత్వము) బాగా అలవరుచుకుని, ఈ జ్ఞాన భూమికలలో మొట్టమొదటిది రెండవది అయిన శుబేఛ్ఛ మరియు విచారణలను పెంపొందించుకొని గురువు అనుగ్రహము పొందితే అప్పుడు తురీయస్థితికి చేరాలంటే పరమగురువుల అనుగ్రహం తప్పక ఉండాలి. దానికి ఎంతో కృషి చెయ్యాలి. అదే ప్రతి మానవుని యొక్క ముఖ్య లక్ష్యము. మనలో ఈ బ్రహ్మ జిజ్ఞాస బాగా రావాలి. బాబా ఎప్పుడూ మనలను ఈ దారిలో తీసుకువెళ్ళాలని, మనము దాన్ని తప్ప వేరే ఏదీ కోరుకోకూడదని బాబా ఉద్దేశ్యము. కాని ఆయన మన ప్రాపంచిక కోరికలు కూడా తీరుస్తూ మనల్ని ఒక్కోమెట్టు ఎక్కిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మము గురించి తెలుసుకోవడానికి మనము ఏం చేయాలి అనే విషయాలను బాబా సాయి సచ్చరితలో 16,17 అధ్యాయాలలలో చెప్పడం జరిగింది.

సంపన్నుడు మరియు లోభి అయిన ఒకరు బాబాని బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వమని అడగటం జరిగింది. ఈ సంఘటనలో బాబా చాలా చమత్కారంగా అయిదు రూపాయల కోసం ఒక కుర్రవాడిని పంపించడం జరుగుతుంది. కాని 5 రూపాయలు దొరకవు. ఈ సంపన్నుడి దగ్గర చాలా ధనం ఉన్నా, ఆయన దానిని ఇచ్చేందుకు సిద్దంగా లేడు. అప్పుడు బాబా అతని జేబులో ఎంత ధనం ఉందొ చెప్పి, లోభం మనిషికి మంచిది కాదని, అదే సాధనకు అడ్డు అని చెప్తారు. ఇక్కడ బాబా ఆ సంపన్నుని అడ్డుపెట్టుకుని మనందరకు జ్ఞానభోధ చేసారు.

బాబా అడిగిన ఆ అయిదు ఏమిటి ?
1) పంచప్రాణాలు
2) పంచ జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు
3) మనస్సు
4) బుద్ధి
5) అహంకారము.

బ్రహ్మజ్ఞానం లభించే మార్గం కఠినం. అది అందరికీ సులభ సాధ్యం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రకటమై అదృష్టమున్న వారికి అది  వెంటనే లభిస్తుంది. కించిత్తయిన విరక్తి లేని వారికి, ఎవరైనా ఈ బ్రహ్మ తత్వోపదేశం చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? 

ఉత్తమ అధికారులు బ్రహ్మజ్ఞాన బోధనను గ్రహిస్తారు. కాని సంప్రదాయానికి బద్దులైన  మధ్యమాదికారులకు క్రమక్రమంగా బోధించాలి. ఒక్క ఆత్మజ్ఞానం తప్ప బ్రహ్మప్రాప్తికి శ్రేష్టమైన మార్గం లేదు. అభ్యాసం మరియు శ్రమ తప్పనిసరి. ఎముకలు పుల్లలై పోవాలి. అప్పుడు గురుకృపా ప్రకాశంతో బ్రహ్మజ్ఞానం మెల్లమెల్లగా చేజిక్కుతుంది.

నేనే బ్రహ్మను అనే జ్ఞానం కలిగినప్పుడు జ్ఞాత ఆత్మ స్వరూపంలో విలీనమైపోయినప్పుడు, అదే విశ్వాభాస విసర్జన అని శ్రుతి చెప్తుంది. ఆత్మజాగృతి కాగా అంతఃకరణ వృత్తి బ్రహ్మతో ఏకరూపమైనప్పుడు బ్రహ్మాగ్నిలో విశ్వం ఆహుతియై సృష్టి అంతా భస్మమై పోతుంది.

ఆత్మస్థితి లేక బ్రహ్మస్థితి అంటే ఏమిటి?
బ్రహ్మము సత్యము. ఏదైతే అన్ని కాలాలకు అతీతంగా ఉందో, దేనికైతే ఆద్యంతములు లేవో, ఏదైతే మార్పు చెందదో అంటే దేశకాల పరిస్థితులకు మార్పు చెందదో అదే బ్రహ్మము. ఈ బ్రహ్మము మనమే అని అనుభవ పూర్వకంగా తెలుసుకొని, పంచకోశములు  (అన్నమయ. ప్రాణమయ, మనోమయ, బుద్ధిమయ, ఆనందమయ కోశములు) మనము కాము అని తెలుసుకొని, సచ్చిదానందస్థితి మాత్రమే మన నిజస్వరూపమని తెలుసుకొని, ఆ స్థితిలో ఉండటమే బ్రహ్మస్థితి. ఒక్క ఆత్మజ్ఞానం తప్ప, బ్రహ్మ ప్రాప్తికి శ్రేష్ఠమైన సాధనం లేదు. మరి ఇది అంత తేలికైన విషయం కాదు. దీనికి అభ్యాసం శ్రమ తప్పక ఉండాలి. సాధనలో ఎముకలు పుల్లలు అయిపోవాలి, అప్పుడే గురుకృపా ప్రకాశంతో బ్రహ్మ జ్ఞానం మెల్ల మెల్లగా చేజిక్కుతుంది.  





బ్రహ్మజ్ఞానము (ఆత్మసాక్షాత్కారము) నకు యోగ్యత.
బాబా అందరూ తమ జీవితములో బ్రహ్మమును చూడలేదు అని చెప్తున్నారు. దానికి కావలసిన యోగ్యతలు ఇక్కడ చెప్పడం జరిగింది.

1) ముముక్షత : ఎవరయితే తాను బద్దుడనని గ్రహించి బందనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వారే ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు.

2) విరక్తి లేదా ఇహపర సుఖములందు విసుగు చెందుట : ఈ లోకములోని సుఖాలయందు , పరలోక సుఖాలయందు, అంటే స్వర్గాదిసుఖములందు ఆసక్తి లేకుండా ఉండటమే నిజమైన విరక్తి.

3) అంతర్ముఖత : మనకు (ఇంద్రియాలకు) బాహ్యమైన వస్తువులను చూచుటకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కనుక మానవులెప్పుడు బయటనున్న వానినే చూచును. కాని మనము ఆత్మసాక్షాత్కరము కోరుకుంటే మన దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను ఏకధ్యానముతో జూడవలెను.

4) పాపవిమోచన పొందుట : మానవుడు దుష్ట కర్మల నుండి మనస్సును మరలించలేనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు.

5) సరియైన నడవడి : మనము ఎప్పుడూ సత్యము పలుకుచూ, తపస్సు చేయిచూ, అంతర్‌దృష్టితో బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు.

6) ప్రియమైన వాటి కంటే, మనకి ఏది మంచిదో, అంటే శ్రేయాన్ని కోరుకోవడం ఎంతో ముఖ్యం.  ప్రియమైనవన్నీ శ్రేయం కాకపోవచ్చు. అలానే శ్రేయమైనది మనకు ప్రియం కాకపోవచ్చు. ఈ శ్రేయ, ప్రియాల మధ్య మన జీవితం ఊగిసలాడుతూ ఉంటుంది. 

7) మనస్సును, ఇంద్రియాలను స్వాధీనమునందుంచుకొనుట : శరీరం రధం, ఆత్మ ఆ రధమును నడుపు సారధి, మనస్సు- కళ్ళెము, ఇంద్రియములు - గుఱ్ఱములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమయినదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనములో లేవో, అట్టి వాడు గమ్యస్థానము చేరలేడు. ఎవరయితే వీటన్నింటిని ఆధీనములో నుంచునో వారు తప్పక గమ్యస్థానము చేరుకుంటారు.

8) మనస్సుని పావనము చేయుట :  మానవుడు ప్రపంచంలో తన విధులను సక్రమంగా నిర్వర్తించితే మరియు ధర్మమార్గంలో ప్రయాణించితే కాని అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారము పొందలేడు.

9) గురువు యొక్క ఆవశ్యకత : ఆత్మజ్ఞానము చాలా సూక్ష్మము అయినది. మనంతట మనము దానిని పొందలేము. దీనికి గురువు యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఆ గురువు ఆత్మసాక్షాత్కారము పొందినవారై యుండాలి. గురువుకు దానిలో ఉన్న లోటుపాట్లు తెలుసు. అందుకే వారు మనలను సరియైన మార్గములో నడిపించగలుగుతారు.

10) భగవంతుని కటాక్షము : "ఆత్మ ఎవరిని ధరించునో వారే దానిని పొందుదురు" అని కఠోపనిషత్తు చెప్పుచున్నది. భగవంతుని కటాక్షము లేనిదే వివేక వైరాగ్యములు కలగవని బాబా ఇక్కడ బోదించడం జరిగింది.

బాబా ఈ పది యోగ్యతలను బోధించి మనందరిని ఉద్దరించారు. వీటన్నింటిని మనము మన నిజజీవితంలో అన్వయించటం నేర్చుకోవాలి. ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం బ్రహ్మ తత్వాన్ని నిర్ధారించడమే. ఇది సాయిని శరణుజొచ్చిన వారిని భవసాగరాన్నుంచి దాటించే నౌక. మనము ఈ సత్యాన్ని ఆకళింపు చేసుకుంటే ప్రతి అధ్యాయంలో బాబా ఆత్మ జ్ఞానం గురించి మాత్రమే బోధిస్తున్నారు అని మనకు అర్ధం అవుతుంది.  అనేకమంది సన్యాసులు ఒంటరిగా ఉండి ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తారు. బాబా అలా కాకుండా సమాజంలోనే ఉంటూ అందరిని ఉద్ధరించడానికే అవతరించారు. ఇలాంటి పరమగురువుని పూజించేవారందరు ఆత్మ సాక్షాత్కారము కొరకు సాధన చేయవలసి ఉంటుంది. 


                                      శ్రీ సాయినాథార్పణమస్తు !

Sri Saisatcharita chapters - 16 & 17




As humans we have to cultivate four major practices of spiritual world (Sadhana Chatustaya), and dedicate ourselves in Guru’s worship. Then Guru will show his grace upon us. When we have the dispassion and a strong desire for liberation (Mukti), knowledge will be imparted by our Guru. Guru is the ultimate provider of happiness and bliss.  Guru always surprises us by giving what our mind does not expect. Guru can only give you that ultimate bliss and self- realization. 

Once a rich gentle man came to Baba and asked him to give him the knowledge of Brahman. Baba told him that he is very happy to do that and he told him that it is rare that people ask me for this. In the meanwhile, Baba sends a boy to borrow 5 rupees from a shop keeper and other people. He wanted to teach a lesson to this rich man as he was greedy. Baba then gave a good discourse on Brahman. He wanted 5 rupees and this signifies the following;

For seeing Brahman one has to give five things, i.e. surrendefive things and they are as follows.

(1) Five Pranas (vital forces),  Prana, Apana, Samana, Vyana and Udana.
(2) Five senses (five of action and five of perception),
(3) Mind,
(4) Intellect
(5) Ego.

What is Brahman or Universal consciousness?
Brahman is Sat, the Absolute, Reality. That which exists in the past, present and future; which has no beginning, middle and end; which is unchanging and not conditioned by time, space and causation; which exists during the waking, dream and deep sleep states; which is of the nature of one homogeneous essence, is Sat. This is found in Brahman, the Absolute.

Jnana (Knowledge) should be developed through a deep study of Atma Jnana Sastras and association with the wise and the performance of virtuous actions without any expectation of fruits. This is what every human being should be thinking about all the time. This is the truth and everything else is an illusion as per the scriptures and this is what Baba wanted us to pursue. 


Qualifications for Brahma-Jnana or Self-Realization All persons do not see or realize the Brahman in their life-time. Certain qualifications are absolutely necessary.

(1) Mumuksha or intense desire to get free:

He, who thinks that he, is bound and that he should get free from bondage and works earnestly and resolutely to that end, and who does not care for any other thinks, is qualified for the spiritual life.

(2) Virakti or a feeling of disgust with the things of this world: 

Unless a man feels disgusted with the things, emoluments and honors, which his action would bring in this world and the next, he has no right to enter into the spiritual realm.

(3) Antarmukhata (introversion):

Our senses have been created by God with a tendency to move outward and so, man always looks outside him self and not inside. He, who wants self-realization and immortal life, must turn his gaze inwards and look to his inner Self.

(4) Catharsis from (Purging away of) sins:

As humans we need to turn away from wickedness, and stop doing wrong things or acts.

We have to show great composure and put our minds at rest. Then only we can attain self-realization, even by means of knowledge.

(5) Right Conduct:

Unless, a man leads a life of truth, penance and insight, a life of celibacy, he cannot get God-realization.

6) Preferring Shreyas, (the Good) to Preyas (the Pleasant):

There are two sorts of things viz., the Good and the Pleasant; the former deals with spiritual affairs, and the latter with mundane matters.

Both these approach man for acceptance. He has to think and choose one of them.

The wise man prefers the Good to the Pleasant; but the unwise, through greed and attachment, chooses the Pleasant.

(7) Control of the mind and the senses:

The body is the chariot and the Self is its master; intellect is the charioteer and the mind is the reins; the senses are the horses and sense-objects their paths.

He who has no understanding and whose mind is unrestrained, his senses unmanageable like the vicious horses of a charioteer, does not reach his destination (get realization), but goes through the round of births and deaths; but he who has understanding and whose mind is restrained, his senses being under control, like the good horse of a charioteer, reaches that place, i.e., the state of self-realization, when he is not born again.

(8) Purification of the mind:

Unless a man discharges satisfactorily and disinterestedly the duties of his station in life, his mind will not be purified and, unless his mind is purified, he cannot get self-realization.

It is only in the purified mind that Viveka (discrimination between the Unreal and the Real), and Vairagya (Non- attachment to the unreal) crop up and lead on the self-realization.

Unless egoism is dropped, avarice got rid of, and the mind made desire less (pure), self-realization is not possible.

The idea that 'I am the body' is a great delusion, and attachment to this idea is the cause of bondage. Leave off this idea and attachment therefore, if you want to get to the Self-realization.

(9) The necessity of a Guru:

The knowledge of the self is so subtle and mystic, that no one could, by his own individual effort ever hope to attain it. So the help of another person-Teacher, who has himself got self-realization, is absolutely necessary.

What others cannot give with great labor and pains, can be easily gained with the help of such a Teacher; for he has walked on the path himself and can easily take the disciple, step by step on the ladder of spiritual progress.

(10) Lord's Grace is the most essential thing:

When the Lord is pleased with any body, He gives him Viveka and Vairagya; and takes him safe beyond the ocean of mundane existence, "The Self cannot be gained by the study of Vedas, or by intellect. He, whom the Self chooses, by him It is gained. To him the Self reveals Its nature", says the Katha Upanishad.


Summary of this chapter:



 The teachings of a Guru are of no use to a man who is full of egoism and who always thinks about the sense objects. Purification of mind is absolutely necessary, without it all endeavors are nothing but useless show. 

Baba during this discourse said the following words.
"My treasury is full and I can give anyone, what he wants, but i have to see, whether he is qualified to receive my gift. If you listen to me carefully, you will be certainly benefited. While sitting in this Masjid i never speak untruth."

In the stormy waters of hope, there are whirlpools of son, wife and friends; crocodiles of passion, rage etc., and sharks in the form of various diseases. some times there is a temporary aversion for hours together. There is a mental conflict, an eruption; but the bond cannot be broken.

You should teach your own mind that you are yourself the pure Brahman, but you are bound to the body like a parrot, clinging to the bar which goes around rotating. You have been lured away by illusions and temptations. Therefore, you have forgotten your own true self. Be aware and realize your real nature immediately.

Delusion creates more delusion; and thus the illusion about bodily pride takes place. Try to understand that the concept of ‘I and Mine’ is like a mirage. Therefore, why don’t you become detached?

Oh, you! Think well, whether you should get entangled in this notion of ‘I and Mine’ in this worldly existence. Oh, parrot! Leave the bar and fly high above in the sky.

Where there is liberty there is bondage; and bondage is accompanied by liberty. Ignoring both these conditions, you should live in the purest spirit within you.

This is subjective knowledge. Happiness and misery is total ignorance. Therefore, abandon that knowledge and acquire true knowledge, which is the knowledge of the Brahman, and which is with you.

The path of knowledge of Brahman is difficult. It is not easy to follow for all and sundry. When the time is ripe, it appears before that fortunate person, all of a sudden.

The knowledge of Brahman can be attained flawlessly by the highest category of aspirants but mediocre persons are always tradition bound and must proceed stage by stage. The former ones have a spiritual flight, like the path of a bird; the latter follow the steps of tradition, according to the Shastras (Scriptures). But for the incapable person, the whole effort about Brahman is useless.

Without that self-control and discrimination, there is no other sure means of achieving Brahman. Though this is the real truth told by the Vedas, can it be possible for everyone to practice?

It is only through diligence and practice, when even your bones seem ready to disintegrate, that the Guru’s grace descends and enlightenment dawns slowly.

When there is the true knowledge of the Self, that person’s entire nature becomes one with Brahman. At such a stage, the whole universe burns down in the fire of Brahman and the world turns into ashes. 



Sri Sainatharpanamasthu!





Wednesday, January 10, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 15




ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల సాయి మన జీవితంలో ప్రవేశించారు. సాయి తన భక్తులను జాగ్రత్తగా కాపాడుతు ఆధ్యాత్మిక పధంలో నడిపిస్తారు. సాయి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు ఉంటే చాలు మనం ఈ భవసాగరాన్ని దాటవచ్చు. సాయి భక్తులు ఎన్నడు నిరాశకు లోనవ్వరు. వారి జీవితంలో సుఖశాంతులికి కొదవ ఉండదు. సాయి ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉండమని చెప్పారు. ఒక్కోసారి మనం దైవ సేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు భక్తికి దూరం అవుతాము. దేవుడికి ఎంత చేసినా తక్కువే, కాని బాబా ఎందుకు నిరాడంబరతకు ప్రాముఖ్యత ఇచ్చారు అంటే ఆధ్యాత్మిక సాధనలో నిరాడంబరత అవసరం ఎంతో ఉంటుంది. లేక పొతే ఈ ఆడంబర పూజలే వాసనలై చివరికి మనలను వేధిస్తాయి. ఆత్మ సాక్షాత్కారానికి నేను, నాది అనే అహంకారమే అడ్డుగా నిలుస్తుంది. 

సాయి సమర్ధుని కృపతో దాసగణు మహారాజ్ సత్పురుషుల కథలను రచించి, ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందారు. సాయి భక్తి యందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపచేసారు. ఆత్మానంద సాగరం వంటి సాయి ప్రేమరసాన్ని పెంపొందించారు. దాసగణు  షిర్డీకి రావడానికి కారణం నానాచందోర్కర్. నానా వల్ల సాయి భక్తి నలుదిశలా వ్యాపించింది. ఒక సారి దాసగణు మహారాజ్ షిర్డీ గ్రామంలో హరికథా కీర్తన కోసమని శరీరంపై కోటు, కండువా, తలకు పాగా కట్టి బయలుదేరారు. బాబా  ఆశీర్వాదం కోసమని వస్తే బాబా ఇలా అంటారు. "వాహ్వా పెళ్ళికొడుకు లాగా అలంకరించుకుని, ఎక్కడకు వెళ్తున్నావు? అని అడుగుతారు. కీర్తన చెప్పడానికి ఇవన్నీ అవసరమా! వీనిని నా ఎదుట తీసివేయి అని చెప్తారు. అప్పటినుంచి దాసగణు మహారాజ్ ఒక్క పంచ కట్టుకొని చొక్కా లేకుండా, చేతిలో చిడతలు మరియు మేడలో మాల వేసుకొని హరికథ చెప్పేవారు. ఇదే ప్రసిద్ధమైన నారదీయ పద్దతి. బాబా ఈ నిరాడంబరతనే కోరుకునే వారు. ఇక్కడ మన ధ్యేయం అంతరంగ పరిశుద్ధత.  

ఒక సారి ఠాణా జిల్లాలో కౌపీనేశ్వర దేవాలయంలో దాసగణు గారి హరికథా ఏర్పాటు చేశారు. అక్కడకు చోల్కర్ అనే ఒక సామాన్య ఉద్యోగి కూడా వచ్చాడు. ఆయన సాయి మహిమల గురించి విని పరవశం పొందుతారు. అక్కడకు వచ్చిన వారు కొంతమంది దాసగణు గారి కీర్తన విధానం కోసం వస్తే, మరికొంత మంది గానం కోసం లేదా నృత్యం కోసం వస్తారు. కాని చోల్కర్ మాత్రం సాయి లీలామృతంలో మునిగిపోయాడు. సాయిపై అతనికి ప్రేమ ఉప్పొంగింది. అప్పుడు సాయిని ఈ విధంగా ప్రార్ధిస్తాడు. "సాయి దయామయా! ఈ దీనుని అనుగ్రహించు, నాది పేద సంసారం. ఉద్యోగంపైనే ఆధారపడ్డాం. ఉద్యోగం ఖాయం కావాలి అంటే పరీక్ష ఉత్తీర్ణుడవ్వాలి. నా జీవితం ఉద్యోగంపైనే ఆధారపడివుంది. మీ కృపతో ఇది నెరవేరితే మీ దర్శనం చేసుకొని మీకు పటిక బెల్లం సమర్పిస్తాను అని వేడుకుంటాడు. అతని కోరిక నెరవేరి ఉద్యోగం నిలబడుతుంది. షిర్డి వెళ్ళాలి అంటే చాలా ఖర్చు అవుతుంది అందుకని తన ఖర్చులను తగ్గించుకొన్నాడు. ఆఖరికి చెక్కర లేకుండా టీ తాగడం కూడా అలవాటు చేసుకుంటాడు. ఇలా కొంత డబ్బు ఆదా చేసి షిర్డీకి వెళ్తాడు.

బాబాను దర్శించుకొని పటిక బెల్లం మరియు కొబ్బరికాయను సమర్పించి ఈ రోజు నా సకల కోరికలు తీరి నా జీవితం సఫలం అయ్యింది. చోల్కర్ జోగ్ ఇంట్లో అతిధిగా ఉంటారు. చోల్కర్ జోగ్ తో బయల్దెరపోతే బాబా జోగ్ తో ఇలా అంటారు. "ఇతనికి త్రాగటానికి కప్పులో చెక్కెర బాగా ఎక్కువగా వేసి టీ ఇవ్వు". జోగ్ కి వింతగా అనిపిస్తుంది కాని చోల్కర్కి మాత్రం ఆనందాశ్రువులు దొర్లుతుండగా బాబా కాళ్లపై తన శిరసు ఉంచాడు. అప్పుడు బాబా " చోల్కర్ నువ్వు అనుకున్న పటిక బెల్లం అందింది. నీ త్యాగనియమం కూడా పూర్తిఅయింది.  మొక్కు త్వరగా తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. మీరెవరైనా ఎక్కడున్నా భక్తితో నా వైపు మళ్లితే ఎల్లప్పుడు మీతోనే ఉంటాను. ఈ శరీరం ఇక్కడ ఉన్నా మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. అన్ని జీవరాసులలో నేనే ఉన్నాను నన్ను తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు. బాబా ఎంతో ప్రేమతో చోల్కర్ భక్తిని స్థిరపరిచారు.  

బాబాకి సర్వం ఎరుక. అందుకే సాయి అష్టోత్తరంలో కాలాతీతాయా నమః అని చెప్పారు. మనం కాలాతీతులమైతే భూత భవిష్యత్తులు వర్తమానంలో వ్యక్తమవుతాయి. అందుకే బాబా అందరి జీవితాలలో ఏమి జరగపోతుందో దాన్ని బట్టి ఆయన మనలను హెచ్చరించేవారు. అలానే ఒక సారి చమత్కారంగా ఒక బల్లి తన చెల్లెలు కోసమే ఎదురుచూస్తుంది అని చెప్పారు. ద్వారకామాయిలో ఉన్న బల్లి సంతోషంతో టిక్కు టిక్కు మని పలుకుతూ ఉంటె, ఎక్కడో ఔరంగాబాద్ నుంచి ఎవరో గుర్రం మీద వచ్చి గుర్రానికి అలసటగా ఉందని అక్కడ ఆగుతాడు. తన భుజం మీద ఉన్న ఉలవలు సంచి విదిలిస్తే ఒక బల్లి కింద పది గోడ మీదకు పాకుతుంది. అప్పుడు ఆ రెండు బల్లులు అక్క చెల్లెళ్ళ వలె సంతోషంతో ముద్దులాడునవి అని హేమద్పంత్ గారు సత్చరితలో చెప్పారు. ఇలా బాబాకు సర్వం తెలుసు అనే సత్యాన్ని మనకు చిన్న చిన్న ఉదాహరణల ద్వారా చూపించారు. 

సాయి భక్తులుగా మనం మన జీవితాల్లో కూడా బాబా చెప్పిన నిరాడంబరతను అలవరచుకోవాలి. మనం అణుకువతో ఉండడటం నేర్చుకోవాలి. చోల్కర్ లాంటి భక్తిశ్రద్ధలు ఉండాలి. జీవితంలో కొన్నింటిని వదలటం నేర్చుకోవాలి. చోల్కర్ తీపి పదార్ధాలను వదలివేసాడు అని కథలో మనము చెప్పుకున్నాము. ఇక్కడ నిజమైన అర్ధం ఏమిటి అంటే, మనం సుఖాల కోసం కొంచెం కష్టాన్ని కూడా తట్టుకోవడానికి ఇష్టపడం. ఇది నేర్పించడానికి బాబా ఇలాంటి చమత్కారాలు చేయడం జరిగింది. బాబా సర్వజ్ఞులు అని మనం గుర్తు ఉంచుకోవాలి. ఎప్పుడు శ్రద్ధ సభూరి అనే మంత్రాలను మర్చిపోకూడదు. 

ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!