In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, April 25, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం -32




వేదవేదాంగ అధ్యయనాలు, శృతి శాస్త్ర పారాయణాలు చేసినా గురుకృప లేకుండా జ్ఞానప్రాప్తి లేదు. ఇతర సాధనాలన్నీ వృధా శ్రమ మాత్రమే. ఈ ప్రపంచాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చారు. దీని వేళ్ళు పైకి ఉంటాయి. దాని శాఖలు విస్తారంగా వ్యాపించి ఉంటాయి. ఇది దూరమునుండి రమణీయంగా కనిపిస్తుంది. అరటి చెట్టు స్థంభం వలె ఇది సత్తువ లేనిది. నిస్సారమైనది. ఇది అజ్ఞానంవలన కలిగిన కోరికల కారణంగా చేసే కర్మలనుండి ఉద్బవించింది. అవ్యక్త బీజములోనుండి పుట్టినది. ఆశతృష్ణ మొదలైన వాటితో నీరులాగా చుట్టబడి ఉంటుంది. ధనధాన్యాలు, భార్యాబిడ్డలు, పరివారం వగైరా శరీర బుద్ధి కారణంగానే. ఇది మాయోపాధి బ్రహ్మలో ఆవిర్భవించింది. ఇది వైరాగ్యమనే శస్త్రంతో నశిస్తుంది. సద్భావం దీనికి మూలాధారం. బ్రహ్మ సత్యం మరియు జగత్తు మిధ్య. ఇలా హేమద్పంత్ గారు ఈ ఉపోద్ఘాతంతో మొదలుపెట్టి తరువాత బాబా చెప్పిన కథను మనకు చెప్పారు.

ఇది బాబా స్వయంగా చెప్పిన ఒక మధురమైన కథ. ఒక సారి మేము నలుగురం పురాణాది గ్రంధాలను చదివి జ్ఞానసంపన్నులం అయిపోయామని తలిచి బ్రహ్మ నిరూపణ చేయసాగాము. ఉద్ధరేతాత్మా నాత్మానాం అనే గీతా వచనం ప్రకారం పరావలంబనం ఎప్పుడూ పనికిరాదు అని ఒకరు చెప్పారు. మనసు అధీనంలో ఉంచుకునే వాడే ధన్యుడు. సంకల్పవికల్పాలు లేకుండా ఉండాలి అని రెండవవాడు చెప్పాడు. వికారాలతో మార్పులు చెందేది అనిత్యం. ఒక్కటి మాత్రమే నిత్యం. అందువలన నిరంతరం ఈ నిత్యానిత్యాల గురించి చింతన చేయాలి అని మూడో వారు చెప్పారు. నాలుగవ వానికి పుస్తక జ్ఞానంపై నమ్మకం లేదు. అతని ఉద్దేశం శాస్త్రాలు చెప్పినవి ఆచరించాలి కాని పంచప్రాణాలు గురువు యొక్క చరణాలకు సమర్పించాలి. గురువే పరమాత్మ. నిర్మలమైన భక్తి ఉండాలి అని చెప్పారు. ఇలా మాట్లాడుకుంటూ మేము నలుగురం అడివిలో సంచరిస్తూ వుంటే ఒక వనజరి మాకు తారస పడి మీ ప్రయాణం ఎంత వరకు? దేని నిమిత్తం? అని అడిగాడు. అతనికి వారు నిజం చెప్పడం ఇష్టం లేక అక్కడినుండి వెళ్ళబోతూ ఉంటే అతను ఇలా అన్నాడు. ఈ అడవి చాలా దట్టమైనది. ఒక మార్గదర్శి ఉంటె దారితప్పకుండా ఉంటారు. రహస్యమైన విషయం అయితే చెప్పకండి కాని ఈ ఆహారం స్వీకరించి వెళ్ళండి అంటాడు. కాని వారు అతనికి బదులు ఇవ్వకుండా మల్లి అన్వేషణకై బయలుదేరతారు. చాలాసేపు తిరిగి మరల ఆ వనజరి ఉన్న ప్రదేశానికి వస్తారు. మరల అతను వారిని ఆహరం తీసుకోమని, మార్గదర్శి ఉంటే మంచిది అని చెప్తాడు. ఈ సారి నాకు చాలా ఆకలిగా ఉంది అతని మాటవిని ఉండాలి అని నేను ఉండిపోయాను. మిగతా ముగ్గురూ వెళ్లిపోయారు. ఇలా నిస్వార్ధ ప్రేమ చూపిస్తూ ఏ లాభాన్ని ఆశించని వాడే నిజమైన జ్ఞాని. నేను రొట్టె ముక్క తిని నీరు త్రాగిత్రాగిన తరువాత అకస్మాత్తుగా నా ముందు గురు మహారాజ్ ప్రత్యక్షమయ్యారు.

ఆయన మా గురించి తెలుసుకొని నన్ను తీసుకువెళ్లి ఒక బావిలో తాడుతో తలక్రిందులుగా వేలాడతీసి ఉంచి వెళ్లిపోయారు. అప్పుడు నాచేతులు నీటికి అందకుండా ఉండే విధంగా నన్ను ఉంచారు. కొంత సమయం తరువాత మరల వచ్చారు. నన్ను పైకి లాగి ఎలా ఉంది అని అడిగారు. చాలా ఆనందంగా ఉన్నాను. ప్రవాసం పొందాను అని చెప్పాను. అయన మెచ్చి నన్ను ఆయన తన పాఠశాలకు తీసుకువెళ్లారు. ఆ పాఠశాల చాలా రమ్యంగా ఉంది. అక్కడ మాయా మోహాలు తొలిగిపోయాయి. ముక్తి సునాయాసంగా లభించింది. గురువు ప్రతిబింబం లేని కళ్ళు వృధా అనిపించింది. క్షణంకూడా ఆయనను వదిలిఉండాలి అనిపించలేదు. నా ఇల్లు వాకిలి , తల్లి తండ్రి దైవం సర్వం ఆయనే అయ్యారు. గురుధ్యానమే ఏకైక లక్ష్యంగా మిగిలిపోయింది. మా గురువు నన్ను బాగా సేవలో నియమించి నాకు జ్ఞాననిధిని చూపించారు. దానిని వెతుక్కునే అవసరం కలుగలేదు. అన్ని వాటంతట అవే అర్ధం అవడం మొదలైంది. గురు కృప కారణంగా  శోధన అక్కడికక్కడే ఆగిపోయింది. గురువు తల్లక్రిందులుగా వెళ్లాడకట్టి ప్రపంచం నిత్యమూ సత్యము కాదని, నిత్యమైనది సత్యమైన దాన్ని తెలుసుకొనేలాగా చేశారు. ఇక్కడ శ్రద్ధ విశ్వాసాలు తప్ప ఏవి సాగవు.

పైన చెప్పిన కథలో సాయి తనను ఒక భాగంగా చెప్పి మనకు సరిఅయిన దారి చూపించారు. ఆయన గొప్ప వైరాగ్య మూర్తి, జ్ఞాని, పరమగురువు. తాను స్వయంగా అవతార పురుషులై ఉండి ఆ వనజరి ఇచ్చిన ఆహారం స్వీకరించి అన్నం పరబ్రహ్మ స్వరూపమని, దానిని తిరస్కరించకూడదని, అలానే గురువు యొక్క గొప్పతనం ఏమిటో తెలియ చెప్పి, శ్రద్ధ సభూరిల అవసరం ఏమిటో చేసి చూపించారు. అందుకే సాయి భక్తులమైన మనం సాయి చూపించిన మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి.

సాయి ఎప్పుడూ ఉపవాస దీక్షలను ప్రోత్సహించే వారు కాదు. పైన చెప్పిన కథలో ఆ వనజరి పెట్టిన భోజనం తిన్న తరువాతే తనకు గురువు సాంగత్యం కలిగింది అని చెప్పారు. బాబా ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చేవారు కాదు. ఉపవాసం చేస్తే మనసు స్థిమితంగా ఉండదని అట్టి వారికి పరమార్ధం ఎలా లభిస్తుంది అని చెప్పేవారు. ఉత్తకడుపుతో దేవుని చూడలేము అని చెప్పారు. అలా అని అమితంగా తినరాదు. మనకు ఎంత అవసరమో అంతే స్వీకరించాలి. ఒక సారి గోఖలేగారి భార్య బాబా పాదముల వద్ద ఉండి మూడు రోజులు ఉపవాసదీక్ష చేయాలి అనుకొని వస్తుంది. బాబా అంతకుముందు రోజు కేల్కరుతో హోలీ పండుగరోజు ఎవరినీ ఉపవాసం చేయనివ్వనని చెప్పారు. ఆమె అక్కడకు వచ్చినప్పుడు బాబా ఇలా అంటారు " ఉపవాసము చేయవలిసిన అవసరం ఏమి? కేల్కర్ ఇంటికి వెళ్లి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవును తినుము" అని అంటారు. ఆమె బాబా చెప్పిన విధంగా చేసి బాబా దగ్గరే ఉండి ఆనందాన్ని పొందుతుంది.

తరువాత బాబా చెప్పిన ఇంకో కథను హేమద్పంత్ గారు ఈ అధ్యాయంలో చెప్పారు. బాబా ఇలా చెప్పారు. " నా చిన్న తనంలో జీవనం కోసం బీడు గావ్ వెళ్ళాను. నేను బట్టలపై అల్లిక చేయు పని దొరికినది. శ్రమ అనుకోకుండా కస్టపడి పనిచేసాను. యజమాని సంతోషించి మిగిలినవారి కంటే నాకు ఎక్కువ మొత్తం ఇచ్చెను. నా తెలివితేటలు చూసి యజమాని నన్ను పేమించి మెచ్చుకొని నాకు బట్టలిచ్చి గౌరవించెను. ఇక్కడ బాబా మన సాధన ఎలా ఉండాలో చెప్తున్నారు. అందరూ ఈ ప్రాపంచిక విషయానందంలో మునిగి వారు చేయగలిగినంత సాధన చేయరు. ఇక్కడ యజమాని అంటే గురువు. అందుకే బాబా ఇలా అంటున్నారు. మానవుడు ఇచ్చినది త్వరలో సమసిపోవును. దైవమిచ్చునది శాశ్వతము. నా ప్రభువు "తీసుకో తీసుకో" అనును కాని, ప్రతివాడు నా వద్దకు వచ్చి "తే తే " యనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడు లేడు. నా సర్కారు యొక్క ఖజానా (ఆధ్యాత్మిక ధనం) నిండుగా నున్నది. అది అంచువరకు నిండి పొంగిపొరలుచున్నది. కాని దీని కోసం ఆరాటపడువారు కరువైయ్యారు. ఇట్టిఅవకాశం తిరిగిరాదు. ఎవరైనా వారి వారి సాధనను బట్టి అంత ఫలితం పొందెదరు. నా ఈ పలుకులను ఎవరైతే జ్ఞప్తియందుంచుకొనెదరో వారు అమూల్యమైన ఆనందం పొందెదరు అని బాబా చెప్పారు.


ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!


Sri Saisatcharita chapter 32



One can study all the scriptures but Guru’s grace is essential to advance in spiritual life and to experience the self. The srusti is compared to a tree with lots of branches and it spreads all over. This tree although non-existent in character, originates from actions and desires rooted in nescience; and has its own character undergoing a change every moment. This tree is of the nature of calamity; has its origin in ignorance. Surrounding this tree is a store of water in the form of desires and lust. The appearance of this tree is really within Brahman. This can be cut by the sword of detachment.




In this chapter Baba himself narrated a story and we will talk about this now. Baba says “Once, the four of us, having read the Shastras and the Puranas, began to describe the Brahman, believing ourselves to be very knowledgeable. One group quoted salvation by self-effort and decried the tendency to depend on anyone else for one’s salvation. The second one replied that who he controls his mind is blessed; and that we should be free from thoughts and ideas and there is nothing in the world except our own self. The third one said that the world is always changing. The formless is eternal. So we should discriminate between real and the unreal. The fourth one did not approve of bookish knowledge and suggested the prescribed duty should be carried out and we should surrender our body, mind, and five pranas at his Guru’s feet. The Guru is God, and all pervading. To get this conviction, strong unbounded faith is necessary. There is no point in arguments and discussions when does not experience the truth.
All these four people were wandering in the forest in quest of Brahman. In the process they meet a Vanjari and he asks them ‘The heat is scorching. Why and where are you going?’ We replied to him that we were searching the woods. The Vanjari then asked us on the nature of our quest and we replied to him ambiguously and evasively. They were moving around aimlessly and he advises them that they should not wander like that as this is a dense forest and they should have a guide. They had an arrogant attitude that they were very knowledgeable and could find their own way. After wandering for a while they came to the same place where vanjari was. He asks them to take rest and eat something. They refuse to do so but Baba felt different. A guide is always necessary to show the right way in small or great matters. No quest can be successfully carried out on an empty stomach. The flaws of the intellect are strange. He who loves others disinterestedly is really enlightened. I thought acceptance of his hospitality was the best beginning for getting Knowledge. Then Guru came and asks “Would you like to come with me and I will help you in your quest” So Baba followed him to a well where he was tied upside down for 5 hours with a rope. He could not reach the water but just hanging above the water. The other end of the rope was tied to a tree. After 5 hours Guru came and asked him about his experience. Then I replied “I was in supreme bliss. The joy I experienced is beyond my poor powers to describe”. Then I stayed with my Guru and attained salvation.

Nothing appeared impossible. My evil tendencies vanished. My previous ‘karmas’ were wiped out. I thought I should embrace this Guru’s neck and remain staring at him always. The Guru was the sole object of my meditation. The entire universe assumed his form. I was conscious of nothing else. This is known as ‘Singular Devotion’. By the Guru’s grace, realization flashed upon me by itself, without effort or study. I had not to seek anything but everything became clear to me as broad daylight.


Sai used this narration and told the story as he was part of it but he himself is parabrahman. He is teaching us the path to reach the goal of life that is realizing the self.


Baba never fasted nor permitted others to remain hungry. The mind of a person observing a fast is never at ease, then how can he attain his Parmartha? ‘God cannot be attained on an empty stomach. First, the Soul has to be appeased (by satisfying the physical hunger). When all the sense organs are strong and sound, then only it is possible to practice devotion. If one feels weak by starving, then one is unable to make progress towards the highest goal of life. Once a lady came to Shirdi for Sai’s darshan and wanted to fast for 3 days. One day prior to her arrival Baba said “Now during these Holi holidays, will my children go without food? How can I allow it? Then why should I be here?”  When she was serving Baba he encouraged her to go to dada Bhat’s house and make puran polis. It was the time of holi festival. Then she obeyed Baba’s order. She served everyone and ate herself. If one places faith, in this manner, in the Guru’s words, then there would be no delay in advancement.


Sai tells another story making him as part of the story. “Once, when I was young, and wishing to get a job to sustain me, I stinted on my own needs and set out. I walked on and on and arrived at Beedgaon, where I rested. The Fakir (God) had other plans for me. I was happy. There, I found zari (embroidery) work. I also worked tirelessly and my efforts were rewarded. Behold the Fakir’s power! Those who were employed before me were extremely clever and skilled. All four of us worked there and our wages were fixed on the quantum of work done. One had done work worth Rs. 50/-, the second had done Rs. 100/- worth; the third had done Rs.150/- worth; and mine was twice more than all of them put together. The owner was very pleased with my work and skill. He praised me a lot.  Sai talks about the generosity of God and how God provides and we always want to take. Baba feels people do not want to take knowledge but they always ask for worldly things. He wants us to be careful with Maya and not to fall for worldly ignorance.


In this chapter Baba gave valuable lessons to the devotees on how to attain Moksha with the help of a Guru. Important aspects are faith and patience. Unwavering devotion to Guru is the utmost principle.


Om Sri Sainatharpanamasthu!   











 











Wednesday, April 18, 2018

Sri Saisatcharita Chapter 31



Our scriptures say that a person is re-born according to his thoughts at the time of death. Insects, on account of fear, become bees; while King Jadabharat was born as a deer on account of the deer that he had reared and about whose welfare he remained concerned in his last moments. So it is important to think about God during the last moments of life. We need to keep good company with the saints and this will help us to advance in spiritual life. The strong impressions and passions during the time of death will determine our next life. In this chapter we can see how Baba made his devotees come to him in the last moments of their lives so that they can leave this world in Shirdi.


Vijayanand:
There was a sanyasi from Madras by name Vijayanand, who wanted to go to Manasa Sarovar after he heard about this through a Japanese travelers map. He had a great desire to go there. While traveling he stopped in Shirdi after he heard about Sai to have darshan. He met Swami Somadevji of Haridwar who happened in Shirdi at that time. They both hada conversation about Manasa sarovar pilgrimage and how tough it is. He heard that the conditions are much worse, it was snowing, the dialect changes every often and people there are very suspicious and the travelers are greatly harassed. Hearing this information Vijayanand became distressed. He was ambivalent about going there. When he went to Baba and prostrated at his feet, Baba said” Drive away the sanyasi. His company is not worthwhile”. He felt ashamed and sat there observing what was going on in the way of service. The other devotees are worshipping Baba in various ways. He felt peaceful. He stayed in Shirdi for two days and then he got a letter informing that his mother is sick. He felt sad and approached Baba to ask for permission to go and see his mother. Baba the said “If you are fond of your mother that much, then why did you don this garb of a sanyasi? Attachment does not benefit these clothes. You have blemished this ochre garb”. He tells him not to go anywhere and asked him to do Bhagavat parayan. He did parayan 2 times and while doing third parayan he fell ill. Two days later he died placing his head on fakir Baba’s lap. Baba asks them not to bury him immediately. Peole protected his body thinking that he would be alive as Baba wanted them to not bury. But police came and made enquiry after that the body was disposed.


Here Baba made Vijayanand realize by teaching him the importance of renunciation. Baba says “People need to be careful of both good deeds and bad deeds. Both will give us problems and they hinder our journey towards self-realization. Those who are fed up with worldly existence and have surrendered at the feet of Lord, the knots of their attachment are loosened and the hold of ignorance is removed. When one is unfailingly involved in singing the Lord’s name, the sins, sufferings and poverty disappear. The Lord runs and helps the person who meditates on him with love and affection. Your store of past merits is considerable, so you have come here. Now attend to what I say and realize the greater purpose of life”. By making him realize this truth Baba helped him to read Bhagavat at the right time.


Balaram Mankar story:


He was a great devotee of Baba and because of accumulation good deeds in the previous births; he got attached to Sai’s feet. When his wife died he lost peace of mind and could not attend to his regular duties. He wanted to give up all the worldly things and wanted to just pursue spiritual path. He gave all his responsibilities to his son and went to Shirdi. This is also a kind of sanyas. Once he goes there Sai asks him to go to Machindra Gad where it could be much peaceful. He wanted him to go there and do penance there. He gives him rupees 12 in cash and sends him. But he was disappointed as he thought he cannot have darshan of Baba every day. Then Bab tells him that he is not just in Shirdi and he is beyond the limits of time and space. Then Mankar felt ashamed that he had doubts and did not obey Baba’s word immediately. Once he goes there he understood why Baba send him there. It was so peaceful and the environment was so serene. He started his penance there. He used to just focus on Baba’s feet and chant his name all the time. He used to think that Baba is eternal Brahman and Paramathma. One day he finished his meditation and Baba appears in person in front of him. He then asks Baba that why he send him there? Then Bab tells him that “There was so much distraction there and you thought that I am only in Shirdi but I am everywhere”. Later he finished his penance there and Baba gave him other experiences.


He then decided to go back to his place and he gets another surprise in the form of a rustic who gives him a railway ticket. It was difficult to get a ticket as there were so many people in the line. He realizes the miracle and later goes to his place. After a while he comes back to Shirdi and leaves his body in Shirdi itself.


In a similar way Tatya Noolkar and Megha died in Shirdi and Baba gave his blessings to both of them. At the end of the chapter Hemadpanth also writes about a tiger and it was brought to Shirdi by its owners. The tiger was very ill and the owners were making their livelihood by exhibiting this tiger. They thought the tiger will be cured if they it was brought to Baba. When the tiger came in front of Baba and looked at Baba with love. It fluffed the tuft of its tail and thrashed the ground thrice with it. Then fell lifeless at Sai’s feet. The tiger gave one mighty roar and fell down dead at that very spot. The people were surprised that tiger had died. The dervishes were at first much dejected. But later, they seemed glad that this diseased animal, which was expected to die, had attained a release. This happened seven days before Baba’s mahasamadhi.


Death in the presence of saints and sages is immensely meritorious, whether it is a worm, an insect or a tiger. All their sins are pardoned. Anyone who dies while placing the head at the feet of a saint, he gets himself delivered and gains the benefits of a lifetime.        


Dying in the presence of Saints is not death but the bliss of heaven. He has won the transient world and has no worry about re-birth.


Om Sri Sainatharpanamasthu!

Tuesday, April 17, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం -31



అంతిమ సమయంలో ఉన్న మనోస్థితిని బట్టి వచ్చే జన్మ ఆధారపడి ఉంటుంది అని మన శాస్త్రాలు చెప్తాయి. కీటకం భయంతో భ్రమరం అవుతుంది. జడభరతుడు ఒక జింకపై ప్రీతితో దాన్నే మరణ కాలమునందు తలుచుకుంటూ జింక లాగా జన్మ తీసుకుంటాడు. అంతిమ సమయంలో ధ్యానించిన రూపమే పునర్జన్మలో కలుగుతుంది. మనం అంతిమ సమయంలో కనుక భగవంతుడిని తలుచుకోగలిగితే తన్నే చేరుకుంటారు అని గీతలో భగవానుడు చెప్పారు. కాని మనం జీవితం అంతా వేటికోసం తపిస్తామో అవే మనకు చివరలో కూడా గుర్తుకి వస్తాయి. అందుకే మనం వయసు వచ్చిన తరువాత ఆధ్యాత్మిక మార్గంలో వెళదామని అనుకుంటే ఆ భావన ఒక్క సారిగా రాదు. జీవితం అంతా సాధన చేయాలి. సత్సంగం చేస్తూ మహానుభావుల సాంగత్యంలో గడపాలి. ఈ అధ్యాయంలో బాబా తన భక్తులను అంతిమ కాలంలో తన వద్దకు రప్పించుకొని వారికి సద్గతిని ఏ విధంగా కలిగించారో చెప్పడం జరిగింది. 

విజయానంద
ఒక సారి విజయానంద్ అనే సన్యాసి మద్రాసు నుండి మానస సరోవర యాత్రకు వెళ్ళాలి అనే ఆలోచనతో బయలుదేరుతాడు. అతనికి ఒక జపాను ప్రయాణికుని దగ్గర ఉన్న మానస సరోవర చిత్రపటం చూసిన వెంటనే అక్కడకు వెళ్ళాలి అని అనిపిస్తుంది. మార్గమధ్యంలో షిర్డీలో ఉన్న సాయి కీర్తి ప్రతిష్టలు విని, అలాంటి మహాత్ముని కలిసి వెళ్ళచ్చు అని అక్కడ ఆగుతాడు. అక్కడే ఉన్న హరిద్వారపు సోమదేవ స్వామిని కలిసి మాట్లాడుకుంటూ మానస సరోవర యాత్ర ఎంత కఠినమో తెలుసుకొని నిరుత్సాహ పడతాడు. అతని మనసు వికలమైనది. అప్పుడు ఆ సన్యాసి బాబా దర్శనానికై ద్వారకామాయికి వస్తే బాబా వెంటనే "ఈ సన్యాసిని వెళ్ళగొట్టండి. ఇతని సాంగత్యం పనికిరాదు" అని అరుస్తారు. అతను భయపడిపోయి దూరంగా కూర్చుని మిగిలిన భక్తులను చూస్తూ ఉంటాడు. అందరూ బాబాకు సేవలు చేస్తూ పరవశిస్తూ ఉంటారు. అది చూసి ఈ సన్యాసికి కూడా భక్తి ఉప్పొంగుతుంది. షిర్డీలో రెండురోజులు ఉన్న తరువాత తన తల్లి చాలా జబ్బుతో ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు దుఃఖంతో బాబా దగ్గరకు వచ్చి శెలవు తీసుకొని వెళదామని వస్తాడు. అప్పుడు బాబా ఇలా అంటారు "తల్లికి  గారాల పట్టివైతే ఈ సన్యాసి వేషాన్ని ఎందుకు స్వీకరించావు? ఈ వేషానికి మమకారం శోభించదు. కాషాయానికి కళంకాన్ని తెచ్చావు. నీవేం చింతించకు. కొన్ని రోజులు గడవని అప్పుడు ఆలోచిద్దాము. ఇక్కడే ఉండు. వాడాలో దొంగలున్నారు. నీ మీద దాడిచేసి ఉన్నదంతా అపహరించుకుపోతారు. ఈ శరీరం ఎప్పుడూ అశాశ్వతం. మృత్యువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నదని తెలుసుకొని ధర్మాచరణలో ఉండాలి. ఈ ప్రాపంచిక విషయాసక్తి వదిలి ఏ కోరికలూ లేకుండా భాగవతాన్ని పారాయణ చేయి. భగవంతుడు ప్రసన్నుడై సకల దుఃఖాలను అంతం చేస్తాడు. నీ మాయా మొహాలు తొలిగి అత్యంత సుఖం లభిస్తుంది. మొహంనుండి విముక్తుడవు అవుతావు" అని చెపుతారు. అప్పుడు ఆ సన్యాసి ప్రశాంతమైన లెండి వనం దగ్గర రెండు సప్తాహాలు పూర్తి చేసి మూడో సప్తాహం చేస్తుంటే తీవ్రమైన అనారోగ్యం కలుగుతుంది. బాగా నీరసించి వాడాకు తిరిగివచ్చి రెండు రోజులు కష్టంగా గడిపి మూడో రోజున ఫకీరు బాబా ఒడిలో కన్ను మూస్తాడు.

బాబాకు ఆ సన్యాసి మరణం గురించి ముందే తెలిసి అతనిని తన తల్లి వద్దకు పోనివ్వలేదు. షిర్డీలోనే బాబా సన్నిధిలోనే ఉండి, భాగవతం పారాయణ చేస్తూ, చివరి రోజులలో భగవన్నామ స్మరణతో శరీరం వదలటం అనే భాగ్యం అందరికి కలుగదు. ఈ సన్యాసి పూర్వజన్మ సాధన ఫలించి బాబా సమక్షంలో సద్గతి పొందారు. 

బాలారాం మాన్కర్ 
బాలారాం బాబాకు మంచి భక్తుడు. అతని భార్య చనిపోతే తనకు ప్రపంచంపట్ల సంపూర్ణ విరక్తి కలిగి కుటుంబ బాధ్యతలను కొడుకుకి అప్పచెప్పి షిర్డీకి వస్తాడు. ఇది ఒక రకమైన సన్యాసమే. బాబా ఆయన భక్తికి మెచ్చి ఆయనను కరుణించడం జరిగింది. షిర్డీలో బాబా సన్నిధిలో గడుపుదామని ఆశతో వస్తే అతనిని బాబా మచ్చింద్ర గడ్ అనే ప్రదేశానికి వెళ్లి ధ్యానం చేయమంటారు. బాలారాంకు కొంచెం నిరుత్సాహం కలిగి మరల తేరుకుని బాబా ఆదేశాన్ని పాటిస్తాడు. బాబాతో లేని జీవనం వ్యర్థం అనుకుంటాడు. అక్కడకు వెళ్తే బాబా దర్శనం ఉండదు అని బాధపడతాడు. అక్కడకు వెళ్లి బాబా చెప్పినట్లు బాబా ధ్యానం చేస్తూ ఆ రమ్యమైన ప్రదేశంలో శాంతిని పొందుతాడు. మాన్కర్ ఒక రోజు ధ్యానంలో ఉండగా కొండ మీద బాబా ప్రత్యక్షంగా దర్శనం ఇస్తారు. అప్పుడు మాన్కర్ ఆనందానికి అవధులు లేవు. కేవలం దర్శనమే కాకుండా తనను అక్కడకు ఎందుకు పంపించారు అని  అడిగిన ప్రశ్నకు బాబా ఇలా సమాధానం చెప్పారు " షిర్డీలో ఉండగా నానారకాల తరంగాలు నీ మనసులో లేచేవి కదా. అందుకని నీ చంచలమైన మనసు కుదుటపడాలని పర్వత ప్రయాణాన్ని ఏర్పాటు చేసాను. నా ఈ పంచభూతాత్మకమైన శరీరం షిర్డీలోనే కాదు ఎక్కడైనా దర్శించవచ్చు. నేనంతట ఉన్నాను అని చెప్తారు. తరువాత కొన్ని రోజులకు మరల తన నివాస స్ధలమైన బాంద్రా చేరాలి అని పూణే స్టేషనుకు వెళ్తాడు. అక్కడ చాలామంది ప్రయాణికులు ఉండడం వల్ల టిక్కెట్ కొనడం కష్టం అయితే, ఒక రైతు వేషంలో బాబా వచ్చి అతనికి టిక్కెట్ ఇస్తారు. డబ్బులు ఇద్దామని చూసే లోపల ఆ రైతు మాయం అవుతాడు. ఇలా బాబా యొక్క లీలలను ప్రత్యక్షంగా అనుభవించి సాయి పాదాలయందు దృఢమైన ప్రేమను పెంచుకున్నాడు. తరువాత చాలా సార్లు షిర్డీకి వెళ్లి చివరకు షిర్డీలోనే ప్రాణాలు వదిలాడు. 

పూర్వజన్మలలో పుణ్యమున్న వారు సాయి దృష్టిలో పడి సాయి చరణాలలో లీనమై మరణాన్ని నిర్భయంగా పొందుతారు.  తాత్యాసాహెబ్ నూల్కర్ మరియు మేఘ శ్యాముడు కూడా ఇలానే షిర్డీలోనే తమ ప్రాణాలను వదలటం జరిగింది. భక్తులంతా రాగా గ్రామస్థులు మేఘాను స్మశానికి ఊరేగింపుగా  తీసుకువెళ్ళినప్పుడు బాబా కూడా వెళ్లి మేఘా శరీరంపై పుష్పాలను కురిపించారు. అలానే ఒక పులికి కూడా బాబా సద్గతి కలిగించడం జరిగింది. 

పులికి సద్గతి 
బాబా మహాసమాధికి 7 రోజుల ముందు ఒక ఎద్దుల బండి వచ్చి మసీదు ద్వారం వద్ద నిలబడింది. దానిలో ఒక భయంకరమైన పులి గొలుసులతో కట్టబడి ఎదో జబ్బుతో బాధపడుతున్నట్లుగా ఉంది. ఆ పులిని ఆడించేవారు ఊరూరూ తిరిగి దానిమీద జీవనం సాగిస్తున్నారు. కాని దానికి జబ్బు చేస్తే ఎన్నో చికిత్సలు చేయించి చివరకు బాబా దగ్గరకు తీసుకువస్తారు. అప్పుడు వారు ఆ పులిని కిందకు దించి సాయి ఎదురుగా ఉంచుతారు. మెట్లవద్దకు రాగానే బాబా యొక్క తేజస్సును చూసి ఆ పులి తన తలను కిందకు వంచుతుంది. పులి బాబాను ప్రేమతో చూస్తుంది. అంతే వెంటనే తోకను పైకి ఎత్తి ముమ్మారు భూమికి కొట్టి సాయి చరణాలయందు శరీరాన్ని వదిలింది. భయంకరంగా ఒక్క సారి అరిచి ప్రాణాలను వదిలి సద్గతిని పొందింది. సాధుసత్పురుషుల సమక్షంలో ప్రాణం పోవటం గొప్ప పుణ్యం. పులికి ముక్తి కలిగినందుకు అందరు సంతోషించారు. వారు సాయిని ఆ పులిని ఎక్కడ పాతిపెట్టాలి అని అడిగితే బాబా ఇలా అంటారు " మీరేం చింతించకండి. దాని మరణం ఇక్కడే ఉంది. గొప్ప పుణ్యం చేసుకోవడం వల్ల ఇక్కడ అత్యంత శాంతిని పొందింది. తకియా వెనుకనున్న శివాలయం వద్దకు తీసుకువెళ్లి నంది సమీపంలో పూడ్చిపెట్టండి. అలా చేస్తే మీ నుండి బంధ విముక్తి, రుణవిముక్తి కలిగి దానికి సద్గతి కలుగుతుంది. గతజన్మలో బాకీపడ్డ రుణాన్ని తీర్చుకోవడానికి ఈ రూపంలో జన్మించి, ఇంతవరకు మీ బంధనంలో ఉంది అని సాయి మహారాజ్ చెప్పారు. అప్పుడు వారు బాబా చెప్పినట్లు శివాలయం దగ్గర నందికి వెనుక గోతిలో పూడ్చిపెట్టారు. ఈ సంఘటన బాబా మహాసమాధికి సరిగ్గా ఏడు రోజులముందు జరగడంతో ఈ పులికి సద్గతిని ప్రసాధించడం చాలా మధురమైన ఘట్టంగా మిగిలిపోయింది. 

ఇలా బాబా తన భక్తులను షిర్డీకి రప్పించుకొని మరి సద్గతిని కలుగచేయడం వారు చేసుకున్న పూర్వజన్మ పుణ్యం, మరియు వారి సాధన మాత్రమే. 


ఓం శ్రీసాయినాథార్పణమస్తు ! 









Wednesday, April 11, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం -30



సాయినాథా! మొదట నిర్గుణంగా ఉన్న మీరు భక్తుల భావసూత్రంతో కట్టుబడి సగుణ సాకార రూపంలో వచ్చారు. సాయి గురువులకే గురువు. సాయి పరమగురువు. తమ భక్తులను ఉద్ధరించడం సత్పురుషులకు తప్పనిసరి. తమ భక్తుల మనోభీష్టాలు సాయినాథునకు పూర్తిగా తెలుసు. వానిని తీర్చే సమర్థులు కూడా వారే. కష్టాలలో ఉన్న భక్తుల మనసును శాంత పరిచి వారి చింతలను దూరం చేసే దయాసాగరులే సాయినాథులు. ఆలా ఒక భక్తుని శాంతపరిచిన కథనమే ఈ అధ్యాయంలో మొట్టమొదటగా చెప్పారు. 

నాసిక్ జిల్లాలో వణి అనే గ్రామంలో సప్త శృంగి మాత దేవాలయం ఉంది. ఆ దేవాలయ పూజారి పేరు కాకాజీ వైద్య. ఆయన ప్రాపంచిక విషయాలలో చిక్కుకొని అనేక కష్టాలతో సతమవుతూ బాధపడుతూ ఉండే వాడు. ఆయనకు మానసిక శాంతి కరువైంది. కాల చక్ర భ్రమణంలో మనసు సుడిగుండంలా గిర గిరా తిరుగుతూ ఉంది. కాకాజీ మొట్టమొదటి భార్య చనిపోతే మరల పెళ్లి చేసుకుంటాడు. మొదటి భార్య ద్వారా ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆమెకు పెళ్లి అయినవెంటనే భర్త జబ్బు చేసి చనిపోతాడు. పిన తల్లి ఆమెను కష్ట పెడుతూ ఉంటుంది. కాకాజీ నిస్సహాయంగా ఉండి ఆమె యొక్క దీన పరిస్థితి చూసి దిగులుపడుతూ ఉంటాడు. తరువాత కూతురు కూడా దూరమవుతుంది. కాకాజీ దుఃఖితుడై తన బాధను తొలిగించుకోవడానికి మాత దగ్గరకు వెళ్లి కరుణించమని
వేడుకుంటాడు. అప్పుడు సప్త శృంగి మాత అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి " నీవు బాబావద్దకు వెళ్ళు, మనసు కుదుటపడుతుంది" అని చెప్తుంది. కాని ఆ బాబా ఎవరో అర్ధం కాక కాకాజీ సందిగ్ధంలో పడతాడు. మాత త్రయంబకేశ్వరంలో ఉన్న పరమశివుడు గురించి చెప్పి ఉండచ్చు అని అక్కడకు వెళ్లి పూజలు చేస్తాడు. అయినా ఆతని మనసు శాంతపడదు. మరల వణికి తిరిగి వచ్చి మాతను ప్రార్ధిస్తే మరల ఆమె స్వప్నంలో కనిపించి షిర్డీలో ఉన్న సాయిబాబా దగ్గరకు వెళ్ళు అని చెప్తుంది. సరే ఈ బాబా ఎవరో తెలియదు. ఈ షిర్డీ ఎక్కడో తెలియదు. కాని బాబాను ఎలాగైనా కలవాలి అన్న తపన బాగా ఎక్కువ అవుతుంది. 

సాయిని ఎలా కలవాలా అని కాకాజీ మదన పడుతూ ఉంటె, ఒక అనుకోని అతిధి షిర్డీ నుంచి రావడం జరుగుతుంది. మనలో సత్పురుషులను కలవాలి అనే తీవ్రమైన అభిలాష ఉంటె చాలు వారు మనలను అనుగ్రహిస్తారు. అలానే శ్యామాను వణి పంపించి బాబా కాకాజీని  అనుగ్రహించారు. చిన్నప్పుడు శ్యామాకు జబ్బు చేస్తే అతని తల్లి సప్త శృంగి మాతకు మొక్కుకుంటుంది. అప్పుడు శ్యామా జబ్బు నయం అవుతుంది. అలానే ఒక సారి ఆమెకు జబ్బు చేస్తే అమ్మవారికి వెండి స్థనముల తొడుగు చేపిస్తాను అని కూడా మొక్కుకుంటుంది. ఆమె చనిపోయేటప్పుడు శ్యామాకు ఈ రెండు మొక్కుల గురించి చెప్పి శ్యామాను తీర్చమని చనిపోతుంది. శ్యామా ఈ విషయాన్ని తరువాత మర్చిపోతాడు. ఒక సారి శ్యామా తమ్ముడు బాపాజీకి వారి కుటుంబంలో ఉన్న కస్టాలు ఈ మొక్కులు తీర్చక పోవడమే అని ఒక జ్యోతిష్యుడు ద్వారా తెలుసుకుంటాడు. బాపాజీ శ్యామాకు ఈ విషయం చెప్తే వెంటనే శ్యామా ఈ వెండి తొడుగులు చేపించి బాబా దగ్గరకు వచ్చి నీవే నా సప్త శృంగి. వీటిని స్వీకరించండి అని వేడుకుంటాడు. బాబా అప్పుడు శ్యామాను వణికి వెళ్లి మాత దర్శనం చేసుకొని ఆమెకు ఆ తొడుగులు సమర్పించమని పంపిస్తారు. ఇలా శ్యామా ఆ దేవాలయంకు వచ్చి పూజారిని వెతుక్కుంటూ కాకాజీ ఇంటికి వస్తాడు. ఇలా బాబా వాళ్ళిద్దరిని కలపడం జరుగుతుంది. వారు ఆ మొక్కులు తీర్చుకొని షిర్డీ ప్రయాణం కడతారు. 

కాకాజీ షిర్డీ చేరి బాబా పాదాలను తన అశ్రువులతో అభిషేకం చేస్తాడు. సాయి దర్శనంతో సంతుష్టుడైన కాకా మనస్సు ప్రసన్నమైనది. దేవి యొక్క  దృష్టాంతం ఎవరికోసం సంభవించిందో ఆ సాయి సమర్ధుని కళ్లారా చూసి కాకాజీ యదార్ధమైన సుఖాన్ని పొందాడు. అతని మనోభీష్టం నెరవేరింది. సాయి దర్శన సేవతో అతని చిత్తం ప్రసన్నమైనది. బాబా చూపించిన కృపతో అతనిలో ఉన్న చింతలన్ని దూరం అవుతాయి. ఇక్కడ ప్రవచనాలు లేవు. ప్రశ్నలు సమాధానాలు లేవు. ఆశీర్వచనాలు లేవు. కేవలం దర్శనంతోనే సుఖం కలిగింది. దీనినే దర్శన మహిమ అంటారు. కాకాజీ అద్భుతమైన ఆత్మానందాన్ని పొంది పన్నెండు రోజులు షిర్డీలో ఉండి తరువాత వణికి తిరిగి వెళ్తాడు. 

ఒక సారి బాబా దీక్షిత్కు గుర్రం బండి తీసుకొని రహతాకు వెళ్లి కుషాల్ భావుని వెంటనే తీసుకురమ్మని పంపుతారు. దీక్షిత్ రహతాకు వెళ్లి ఆయనను కలిసి బాబా వెంటనే రమ్మన్నారని చెపుతాడు. కుషాల్ భావుకి కూడా బాబా దర్శనం ఇచ్చి వెంటనే షిర్డీ రా అని చెప్పారు అని చెపితే దీక్షితుకు ఆశ్చర్యం కలుగుతుంది. కుషాల్ భావు దగ్గర గుర్రాలు లేక పొతే తన కొడుకుని బాబా దగ్గరకు పంపిస్తాడు. వారు ఊరు దాటకముందే దీక్షిత్ గారు అక్కడకు వస్తారు. ఇలా తన భక్తులను తన వద్దకు రప్పించుకున్నారు బాబా. అలానే ఒక పంజాబీ బ్రాహ్మణుడైన రాంలాల్ అనే అతనికి కలలో కనిపించి తన దగ్గరకు రమ్మంటారు. కాని రాంలాలుకు కలలో కన్పించిన వారెవరో తెలియక నిరుత్సాహ పడతాడు. ఒక రోజు ఒక దుకాణంలో ఉన్న పటం చూసి ఈయన ఎవరు అని ఆ దుకాణం అతనిని అడిగి బాబా అని తెలుసుకుంటాడు. ఎలాగైనా షిర్డీ వెళ్లాలని నిశ్చయించుకుంటాడు. అలానే షిర్డీ చేరి బాబా మహాసమాధి అయ్యేంతవరకు అక్కడే ఉండి బాబాను సేవించుకుంటాడు. 

భక్తులను తన వద్దకు రప్పించుకొని వారి ప్రాపంచిక మరియు పారమార్ధిక కోరికలను తీర్చడమే బాబా సంకల్పం. బాబా నిష్కాములు, నిరహంకారులు, నిస్వార్థులు. ఏ మమకారాలు లేనివారు. భక్తులకోరికలు తీర్చేందుకే వారి అవతారము. ఎవరి వద్దకు క్రోధం దరిచేరదో, ఎవరి వద్ద స్వార్ధ దృష్టి లేదో, ఎవరివద్ద ద్వేషానికి తావు లేదో అతడే నిజమైన సాధువు. అందరి యందు సాయికి నిస్వార్ధ ప్రేమ. అదే పరమ పురుషార్థం. ధర్మమైన విషయాలయందు తప్ప ఇతర విషయాలను చెప్పడంలో ఒక్క క్షణమైనా వ్యర్థం చేయరు. సాయి కథలను మనస్ఫూర్తిగా విన్నా, పారాయణం చేసినా తప్పక మనశ్శాంతి కలుగుతుంది. 

ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!








  

Sri Saisatcharita Chapter - 30





Hemadpanth sees Baba as guru of all saints and saint’s mission is to give liberation to the devotees by taking away ignorance. That mission is inevitable for you Sai. Sai knows the desires of his devotees and he alone is capable of fulfilling them. This is the reason why his devotees have faith in him. Sai provides solace if a devotee is going through difficulties and cannot be peaceful in his or her mind. One such story is discussed in this chapter.


There was a devotee of Goddess Sapta Shringi by name Kakaji Vaidya in a village called Vani in Nasik District. He was the pujari of this Goddess. He was in a disturbed state of mind due to insurmountable difficulties and was harassed by the worldly life. In Sai Satcharita it was not mentioned about his difficulties but other sources describe that he was going through some family issues. He has a daughter from first marriage and when his first wife died he had to marry second time as this daughter was very young. Later the step mother used to give hard time to the daughter and he could not bear this. He felt helpless and wife won’t listen to him. He also struggled when her husband died and she had to go through various difficulties.

One day he prayed to Mother Sapta Shringi wholeheartedly and she blessed him by appearing in his dream. She said “you go to Baba. Your mind will be at peace”. He hoped that mother will clarify where exactly he needs to go but he opened his eyes and was eager to learn where he needs to go. He then decided to go to Tryambakeswar for ten days and but he could not get his peace. Then he returns home and asks mother again. Then mother appears in his dream
again. She tells him it is Shirdi Sai Samartha she was talking about. He did not know where Shirdi is and how to go there. But his desire was so intense to meet Sai therefore Sai will not leave him like that. The more anxious a devotee is for the darshan, the more devout and faithful he is, the greater is the experience of heavenly bliss attained by the best of devotees. While Kakaji worried about how he would go for Sai darshan, a guest arrived from Shirdi searching for his whereabouts. That guest is none other than Syama who is a staunch devotee of Baba.

When syama was young, he fell ill, his mother prayed to the Devi and said: “I leave this child to your mercy to save or kill. But should he recover, I will bring him for your darshan”. The child recovered after the Devi had been invoked. Several years passed and the vow was completely forgotten. The mother recalled it in her last moments and requested Syama to fulfill this. Syama promised her that he will go to Vani and also fulfill his mother’s another wish that he will offer silver breasts to Mother Sapta Shringi. But Syama procrastinated and forgot about these vows. One day an astrologer came and told Syama’s brother that his brother forgot the vows. Then Syama realized his mistake and takes these items and goes to Dwarakamai. He offers his prayers and offers these silver breasts to Baba saying “you are our Sapta Shringi, please accept our prayers”. Then Baba tells him to go to Vani and fulfill the vows there. So syama goes to Vani and starts looking for pujari of that temple. At the same time Kakaji Vaidya is wondering about going to Shirdi. This was the intention of Baba in sending Syama there so that both can meet. This is how Sai takes care of his devotees no matter where we are.

Then both come to Shirdi after fulfilling vows taken by Syama’s mother. This was the purpose of the vision of the Goddess. When he saw Baba Samartha with his own eyes, Kakaji was truly happy and his wish was fulfilled. So be it. Kakaji was filled with joy. After the darshan, his mind was at peace. He really became free of all worries, as the Cloud of Mercy had rained. The fickleness of his mind disappeared. He was himself surprised. He wondered how strange this was! Bab had not said a word. Nor had he asked any questions leading to this satisfaction. Nor had he given his blessings. The mere darshan had brought about contentment. He could not utter a word and his eys were focused on Sai’s feet only. Kakaji stayed there for 12 days and then returned to Vani.

 There were two other stories in this chapter which prove Baba’s will to make his devotees come to Shirdi when they were thinking about him. Once Kushaul Bhau had a dream and in this dream Baba tells him to come to Shirdi. But there were no horses and he did not know what to do. At the same time Baba tells Dixit to take a tanga and go to Rahata to bring Kushal Bhau. Both were surprised to hear both sides of the story. In a similar way, there was a Punjabi by name Ramlal who was living in Bombay. He had a dream where Baba asks him to come to Shirdi. But he did not know who this person was and where he lives. Then he was casually walking along the street one day and saw a picture which startled him. This was the person who appeared in his dream and he asks the shopkeeper about him. He tells him about Baba and Shirdi. Then Ramlal visits Shirdi and stayed near Baba till his Mahasamadhi. This was Baba’s wish to fulfill the desires of his devotees, by bringing them for darshan and letting then achieve their worldly or spiritual objectives. He himself was desire less, unselfish, without ego, and without any attachment. Baba’s selfless love is his mission and he did not even waste a word on matters other than righteousness.


Om Sri Sainatharpanamasthu!     

Wednesday, April 4, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 29



ఒక సారి రామదాసి పంథాలో ఉన్న నలుగురు మదరాసు భజన సమాజం పేరిట కాశీ యాత్ర చేస్తూ షిర్డీలో బాబా గురించి విని ఆయన దర్శనార్ధం వస్తారు. వారిలో ఒక పురుషుడు, అతని భార్య, కుమార్తె మరియు అతని వదిన ఉంటారు. వారందరు బాబా యొక్క ఉదార స్వభావం గురించి విని బాబా డబ్బు ఇస్తే తీసుకుందామని వస్తారు. బాబా ఒక్కోసారి పెద్దమొత్తంలో దానంగా ఇచ్చేవారు. ఒక్కోసారి ఏమి ఇచ్చేవారు కాదు. వారు బాబా దర్శనం చేసుకొని అక్కడ ఉండి రోజూ వారు మంచి భజనలు పాడేవారు. భార్యకు బాబాపై ఎంతో నమ్మకం ఉండేది. ఆమె ఒక రోజు పరవశంతో భజన పాడుతూఉంటే బాబా శ్రీరామునిగా దర్శనం ఇస్తారు. ఈ విషయం  ఆమె భర్తకు చెప్తే ఆయన నమ్మకుండా ఆమెను ఎగతాళి చేస్తాడు. కొన్ని సార్లు ఆలా కనిపించిన తరువాత ఆమెలో కూడా డబ్బు మీద ఆశ కలిగేటప్పటికి ఆ దర్శనం ఆగిపోతుంది. తరువాత తన తప్పు తెలుసుకొని దురాశను వదిలితే మరల దర్శనము కలుగుతుంది. 

భర్తకు ఒక సారి కలలో తనను పోలీసులు పట్టుకొని కాళ్ళు చేతులు కట్టివేసినట్లుగా కనిపిస్తుంది. కలలో బాబా ఎదురుగా కనిపిస్తే, బాబాను ఇలా అడుగుతాడు. నిన్నే నమ్మి ఇక్కడకు వస్తే ఈ ఆపద నాపై ఎలా పడింది". అప్పుడు బాబా "నీవు చేసిన కర్మ ఫలితం నీవే అనుభవించాలి. అది ఈ జన్మలో చేసినా ఇంతకు ముందు జన్మలలో చేసినా వాటిని అనుభవించాలి" అని బాబా అంటారు. అప్పుడు అతను తన పాపాలను దహించివేయమని అన్యధా శరణం లేదు అని వేడుకుంటాడు. అప్పుడు బాబా అతనిని కళ్ళు మూసుకోమని చెప్తారు. తరువాత కళ్లుతెరిస్తే ఆ పోలీస్ చచ్చిపోయి ఉంటాడు. అతనికి ఇంకా భయం వేసి మరల బాబాను రక్షించమని కోరుకుంటాడు. మల్లి కళ్ళు మూసుకుంటే ఆ పరిస్థితినుంచి పూర్తిగా బయటపడి బాబా ఎదురుగా ఉంటె నమస్కరిస్తాడు. అప్పుడు బాబా ఇదివరికి నమస్కారానికి ఇప్పటి నమస్కారానికి తేడా ఉందా అని అడుగుతారు. అప్పుడు అతను తేడా ఉంది బాబా ఇంతకూ ముందు డబ్బు ఆశతో నమస్కారం చేసేవాడిని, కాని ఇప్పుడు తమరిని దేవుడిగా భావించి చేసాను అని చెప్తాడు. తరువాత అతని కోరిక మీద అతని గురువైన రామదాసు స్వామి దర్శనం కూడా కలగ చేస్తారు. వారి పాదములపై పడగానే రామదాసు స్వామి అదృశ్యమవుతారు. అక్కడ బాబా ఒక వృద్ధుడి లాగ కనిపిస్తారు. మీ వయసు ఎంత? మీరు ఇంత ముసలివాని లాగా కనిపిస్తున్నారు అని అతను అంటాడు. నన్ను ముసలి వాడు అంటావా అయితే నాతో పరిగెత్తు అంటూ బాబా పరిగెత్తి అదృశ్యమవుతారు. స్వప్నం నుండి అతను మేలుకొని తన మనోవైఖరిని పూర్తిగా మార్చుకొని బాబా ఆశీస్సులను పొందుతారు. ఇలా తన భక్తులను మార్చుటకు అనేక లీలలు చూపిస్తారు. 

టెండూల్కర్ కుటుంబము:
రఘునాథ రావు టెండూల్కర్, అతని భార్య సావిత్రిబాయి బాబాకు భక్తులు. ఇద్దరికి బాబా అంటే ఎనలేని ప్రేమ మరియు భక్తి. ఆమె మరాఠీలో 800 అభంగాలతో, పద్యాలతో బాబా లీలలను సాయినాథ భజన మాల అనే పుస్తకం వ్రాసారు. వారికి ఒక కొడుకు ఉన్నాడు. అతను చిన్నప్పుడు కొన్ని రోజులు బాబా దగ్గరకూడా ఉన్నాడు. తరువాత ఆ కుర్రవాడు బాగా చదువుకొని గొప్ప వైద్యుడవుతాడు. ఒక సారి అతను వైద్య పరీక్షకు కూర్చోవాలా లేదా అనే సందిగ్ధంలో జ్యోతిష్కులను సంప్రదిస్తే అతని గ్రహాలు బాగుండ లేదని వచ్చే సంవత్సరం పరీక్ష తీసుకోవడం మంచిది అని చెప్తారు. సావిత్రిబాయి షిర్డీ వెళ్లి బాబాకు ఈ విషయం చెప్తే పరీక్షకు కూర్చోమంటారు. బాబాపై నమ్మకంతో వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడై నోటి పరీక్షకూడా అయిపోతుంది. ఇలా బాబా అతనిని రక్షించి అతనిలో నమ్మకాన్ని పెంచారు. తరువాత అతని ప్రాక్టీసులో బాబా చిత్రపటం పెట్టుకొని వృత్తి కొనసాగించాడు. అలానే రఘునాథ రావు గారికి వయసు పెరిగి తనను కంపెనీ నుంచి పదవీవిరమణ చూపిస్తారు. వారికి పింఛను ఎక్కువ రాదని దిగులుపడుతూ ఉంటే, సావిత్రిబాయి బాబా కలలో కనిపించి నెలకు వంద రూపాయిలు చాలా అని అడుగుతారు. తరువాత అతనికి 110 రూపాయిలు వస్తుంది. ఇలా వారి కుటుంబాన్ని దిగారు ఉండి కాపాడుతారు. 

 కెప్టెన్ హాటే గారు గ్వాలియర్ లో ఉండే వారు. ఒకరోజు ఆయనకు కలలో బాబా కనిపించి నన్ను మరిచిపోయావా? అని అంటారు. బిడ్డలు తల్లిని మరిచిన ఇక వారికి తరుణోపాయమెక్కడిది అని హాటే అంటాడు. ఇంతలో తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయంపాక వస్తువులను, దక్షిణను ఒక చేటలో ఉంచి బాబాకు సమర్పించబోతూ ఉండగా అతనికి మెలుకవ వస్తుంది. తరువాత తన స్నేహితుడుకి ఈ విషయం చెప్పి డబ్బులు పంపిస్తాడు. ఆ స్నేహితుడు అన్ని వస్తువులు సేకరించి ఒక్క చిక్కుడుకాయలు దొరక్కపొతే, తరువాత దారిలో ఒక వృద్దులారు తనకు అవి అమ్ముతుంది. బాబాకు ఇవి సమ్పర్పిస్తే చిక్కుడు కాయల కూరతోనే బాబా ఆ రోజు భోజనం చేస్తారు. ఈ విషయం తెలుసుకొని హాటే సంతోషపడతాడు. ఇలానే ఇంకో సారి ఒక రూపాయి నాణం బాబా ఆశీర్వాదం కోసమని పంపి బాబా అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఒక స్నేహితుడు ద్వారా రూపాయి నాణెం పంపిస్తాడు. ఆ స్నేహితుడు బాబా దగ్గరకు వీలు నమస్కరించిన వెంటనే బాబా దక్షిణ అడుగుతారు. అతను ఇచ్చిన డబ్బులు తన దగ్గరే ఉంచుకుంటారు. అప్పుడు అతను హాటే ఇచ్చిన రూపాయి ఇస్తే బాబా దానితో కొంచెం సేపు ఆడి  తిరిగి అతనికి ఇచ్చి హాటేకు ఇమ్మని చెప్తారు. అలానే ఊది కూడా ఇచ్చి తన ఆశీర్వాదం పంపుతారు. 

వామన్ నార్వేకర్ అనే అతను హాటే లాగ ఒక నాణెం బాబా ఆశీర్వాదంతో తీసుకోవాలని వస్తాడు. ఆ నాణెంకు ఒక వైపు సీతా, రామ లక్ష్మణులు ఇంకో వైపు హనుమంతుడు ఉంటారు. ఈ నాణెం వెంటనే బాబా శ్యామాకు ఇచ్చి పూజా మందిరంలో ఉంచమంటారు. శ్యామా వామన్ యొక్క కోరికగురించి చెప్తే సరే 25 రూపాయలు ఇవ్వమంటారు. అవి ఇచ్చిన తరువాత కూడా ఆ నాణెం అతనికి ఇవ్వరు. ఇలా బాబా ఎవరికి ఏది అవసరమో అది మాత్రమే చేసే వారు.  సాయి యోగ్యమైన దానిని, అయోగ్యమైన దానిని ఎరుగుదురు. వారు ఏది చేసినా మన మంచి కోసమనే మనం అర్ధం చేసుకోవాలి.  

ఓం శ్రీ సాయినాథార్పణమస్తు !




Sri Saisatcharita chapter -29





There was a Bhajan group from Madras and they were traveling to Kashi in 1916 and wanted to stop at Shirdi to see Sai. They heard that Baba was a great saint, patient, generous and one who had controlled his passions. He was kind to pilgrims and distributed large sums of money. There were four people in that group (The man himself, his sister-in-law, wife and a daughter). They were desirous of the saint’s darshan.

After taking Sai’s darshan, the group was pleased. They sang loving bhajans, before Sai, every day, regularly. Baba used to give money sometimes and other times nothing. It was hard to predict what he does. He did not give charity to all. There was a little girl who used to come to Baba every day and her mother will sit nearby and sign her to ask for money. Baba used to simulate anger but he gave her money every day.

 This Ramadasi bhajan group wanted to get as much money as possible from Baba. All of them were greedy except wife who had devotion towards Baba. One day during the noon arathi, Baba gave darshan as Lord Rama to wife as she was worshipping him with utmost devotion. Then she shares this experience with her husband and he ridicules her but she knows that it was not her imagination. She continued to have darshan of Rama for a while and then stopped as she became little greedy with money.

The man who came with the group had a dream one day that he was in a city being a prisoner in a lock up. He saw Sai standing there quietly standing and then he prays to Baba saying “Baba, having heard your fame I came to your feet, why has this happened to me when you are present here?” Then Baba says “One must suffer their past deeds”. He immediately says “I have not done anything wrong”. Then Baba says “may be in past life”. Then the man says that all the sins should have burned by Baba’s darshan. Baba asks him if he had that much faith in him. When he closed his eyes he was free but the police man was dead. He gets scared that he is in more trouble now. Baba then says “you are well caught now”. Then this man prays to Baba again to protect him and Baba aks him to close his eyes again. He is outside the lock up in front of Baba. He prostrates with so much faith and Baba asks him about the difference between his prostration prior to all this and now. Then the man says “My earlier prostrations were for monetary gains and now this is to acknowledge you as God”. Baba also clears his doubts where he felt Baba is a Muslim. The man then asks Baba of his age as he appeared as an old man; Baba asks him to race with him and takes with cloud of dust. Then the man wakes up from the dream. When he went to Baba next day he gave 2 rupees each to him and to his family. They stayed there for a while with Baba’s blessings.

Tendulkar story:

Raghunath Rao Tendulkar was a staunch devotee of Baba and he is from Thane district. He was always cheerful and loving and attached to lotus feet of Sai all the time. Mrs. Savitribai Tendulkar used to worship Baba everyday at her home with Bakul flowers and she wrote Shri Sainath Bajan mala which consists of 800 abhangas and padas. She described Baba's leelas in this bajan mala. Her son was hyperactive as a child and she left him in Shirdi for sometime with Baba. He grew up and went to medical school. Once he was supposed to appear for medical examination but all the astrologers told him not to take the exam that year and to take year after. Then Savitribai came to Shirdi and told Baba about this issue. Then Baba reassures her and asked the son to take the exam that year it self. Of course  he passed the written exam and was asked to appear for the oral exam. Then he went on to become a very successful doctor and had a practice in Bombay. He used to have Baba picture in his clinic. 

Raghunath Tendulkar became old and had to retire and he was concerned about getting low pension. His salary was only Rs150 and he will get half of that salary that is Rs 75. But this is not enough to survive. Fifteen prior to settlement Baba appeared in Mrs. Tendulkar's dream and asked her if Rs 100 was OK for her. Then they got Rs. 110 as pension. Like this Baba took care of Tendulkar family all the time. 

Captain Hate:
Hate lived in Gwalior and once he saw Baba in his dream. Baba said: “Have you forgotten me?” Hate immediately held Baba’s feet and said: “If the child forgets the mother, how will it be saved?” In the dream, he got up quickly and went to the garden, picked fresh ‘valpapdi’, ‘shidha’ and with dakshina made an offering to prove his devotion. When all these items were ready to prove his devotion, Hate moved forward to make the offering. Suddenly his eyes opened and he realized that it was a dream. Immediately, Hate felt that he must collect all the items seen in his dream and offer them to Baba personally, by going to Shirdi. But, as he was in Gwalior, he wrote a letter to his friend, giving him all the details of the circumstances, and persuaded him to go to Shirdi himself. Once the money was sent the friend bought all the items except Valpapdi as it was difficult to find. On the way a lady comes to sell Valpapdi. In this way Captain hate's wish was complete. Once the friend reaches Shirdi, Baba asks specifically for the food Hate sent. Captain Hate became tearful once he heard about this. 

Another time Captain Hate wanted a rupee coin to be blessed by Baba so that he can put that in his Puja mandir. He sends this coin with one of his friends. Once this friend sees Baba, he asks him for dakshina. He gives some money and Baba takes that money. Then this friend gives Baba the rupee coin given by Hate. Baba plays with that coin for a while and gives it back to this friend along with some Udi. Baba says “Return this to whom it belongs. Take this udi prasad along with it. Tell him that I do not want anything from him. Stay well”. After reaching Gwalior and giving the rupee to the doctor, he related in detail all that had taken place. Hate was choked with emotion. He said: “The purpose that I had in mind and as I had wished, Baba fulfilled my wish, knowing my desire”.

Another time Baba did the reverse when Vaman Narvekar brough a coin with one side engraved Sita, Rama and Laxman and on the other side Hanuman. He wanted Baba to bless this coin and give it back to him. But Baba gives this to Shyama and wanted to keep this in Shirdi itself to be worshiped in the shrine. So Baba knows what we need and how to bless us. All we have to do is have unwavering faith in Baba. Baba knows what is suitable for us and what will advance us in the spiritual path. 


Om Sri Sainatharpanamasthu!