In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained. A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
సత్ చిత్ ఆనందం అనే మూడు మిళితం అయి ఉన్న తత్వమే పరతత్వం. సద్వస్తువు ఉన్న చోట జ్ఞానానందాలు తప్పక ఉంటాయి. ధర్మ సంస్థాపనకొరకు , మరియు తాపత్రాయాలతో తపించి పోతున్న ఈ లోకాన్ని ఉద్దరించటానికి, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మానవ రూపంలో గురువుగా అవతరిస్తారు. అటువంటి నిరాకార పరబ్రహ్మమే, శ్రీ సాయినాథుని రూపంలో సాకార పరబ్రహ్మగా అవతారం దాల్చింది. అసలు ధర్మం ఎందుకు స్థాపించాలి? ధర్మార్ధ కామ మోక్షాలనే పురుషార్ధాలలో మోక్షానికి మూలం అయినది ధర్మము. ధర్మం ఆచరింప బడితే మోక్షం దానంతట అదే వస్తుంది. అందుకే ఎ మతమైన, ఎ శాస్త్రమైన ఈ ధర్మాన్నే బోధించటం జరిగింది. కాని మానవులుగా దాన్ని మనం అర్ధం చేసుకునే విధంగా అర్ధం చేసుకుంటున్నామా, లేక మనకి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నామా! ఇలా ధర్మానికి పెడర్ధాలు తీస్తే, మనం మోక్షానికి దూరం అవుతాము. సరే ఈ ధర్మం మనకు ఎవరు బోధిస్తారు? పరమగురువులు మనకు ఈ ధర్మాన్ని వారి వాక్కుల ద్వారా మనకు అందిస్తారు. వారి వాక్కులే మనకు మార్గనిర్దేశంగా నిలుస్తాయి. అలా సాయి నాధుని గళంలో నుంచి వెలువడిన అధ్భుత జ్ఞాన ప్రవాహమే శ్రీ సాయి సచ్చరిత. ఈ జ్ఞాన వాణి మన జీవితాల్లో ఒక కొత్త వెలుగుని నింపుతుంది. ఇక ముందు కూడా ఇది వెలుగుని నింపుతూనే ఉంటుంది. శ్రీ సాయి సచ్చరిత ఎంతోమందిని ఎన్నో విధాలుగా కాపాడింది. వారిని సాయి భక్తులుగా మార్చింది. శ్రీ సాయి దివ్య చరితమనే అమృతాన్ని ఎన్నో లక్షలమంది ఆస్వాదిస్తున్నారు. వారి జీవితాలలో మార్పులను వారే స్వయంగా గమనిస్తున్నారు. మనిషి జీవితంలో మార్పు తీసుకురాలేని ఏ బోధకాని, ఏ శాస్త్రం గాని, ఏ ప్రవచనం గాని సంపూర్ణం అవ్వదు. ఇది సంపూర్ణం అవ్వాలి అంటే దాని మీద నమ్మకం ఉండాలి. అలా నమ్మిన దాన్ని సభూరితో అనుసరించాలి. అప్పుడే దానికి సార్ధకత. అందుకే శ్రీ సాయి సచ్చరిత నమ్మకమనే పునాదితో మొదలపెట్టి మెల్లగా మన కర్మలకనుగుణంగా మనకు సభూరి నేర్పించి మనందరిని ఆధ్యాత్మిక పథంలో నడిపిస్తుంది. మన బాబా చేతల గురువు. అయన ఏది బోధించాలన్నా అనుభవ పూర్వకంగానే నేర్పిస్తారు. ఆయనను గట్టిగా పట్టుకుంటే మనకింక వేరే దారులు అవసరం లేదు. సచ్చిదానంద పరబ్రహ్మ శ్రీ సాయి రూపంలో అవతరిస్తే, శ్రీ సాయిపరమాత్మ తత్త్వం శ్రీ సాయి సచ్చరిత రూపంలో వెలిసింది. సద్గురువులు తమ సమాధి అనంతరం కూడా తమ దివ్య వాణి రూపంలో అమరులు అయి ఉంటారు. అందుకే బాబా ఏకాదశ సూత్రాలలో ఇలా చెప్పారు. ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను. నా సమాధి నుండియే నేను సర్వ కార్యములను నిర్వహింతును. నాయన్దెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము. ఇంత ఖచ్చితంగా భరోసా ఇచ్చి, మనలను కాపాడగల్గిన పరమ గురువు మన సాయి. అందుకే అయన మనకు ప్రసాదించిన శ్రీ సాయి సచ్చరిత అనే గ్రంధరాజాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. ఇదే మన ధర్మం కావాలి. ఈ ధర్మమే మన జీవితం కావాలి. ఈ జీవితమే సాయి నాధునికి అంకింతం చెయ్యాలి. ఈ అంకిత భావంలోనుంచి అపరంపారమైన భక్తి జనించాలి. ఈ భక్తి అనే అమృతంతో సాయికి పూజ అభిషేకాలు జరగాలి. అప్పుడు ప్రసాదంగా కేవలం సాయి కృపని మాత్రమే కోరుకోవాలి. కేవలం గురు కృప మాత్రమే మానవునిలో ఉన్న మూడు ఆవరణలలో చివరిది అయిన అజ్ఞానమనే ఆవరణను తొలిగిస్తుంది. ఈ అజ్ఞానం వీడితే సాయిపరబ్రహ్మ స్వస్వరూపంగా వ్యక్తమవుతారు.
When we are treading the spiritual path, we want to be free of ego. But to overcome the faculty of mind might be tough. We don’t have to be disenchanted. If we have Guru’s grace we can achieve any thing. Faith and patience are the essence of spiritual path. We have to have faith in our Guru and should be able to show patience. The scripture (Bhagavadgita) says
Having abandoned egoism, strength, arrogance, anger, desire, and covetousness, free from the notion of “mine” and peaceful,—he is fit for becoming Brahman.
One who identifies one self with body and mind, is said to have egotism. This is the reason why that person belives that he is the doer fo all actions. If we can get rid of this feeling where we feel that we are body and mind, we can be free of ego. To teach this kind of practice Baba used real life circumstances so that he can advance us in the spiritual path. We can now talk about Haji Falke Siddique story and meaning behind that. The story in Satcharita goes as follows.
Once a Muslim, resident of Kalyan, by the name of Siddique Falke, after a pilgrimage to Mecca – Medina, arrived at Shirdi. That old Haji stayed in the Chavadi facing the north. For the first nine months Baba was displeased with him and was not ready to meet him. The auspicious hour did not come for him. His wearisome trips were futile (i.e. between the north Chavadi and the Masjid). He tried different ways and means but could never exchange glances (with Baba). TheMasjid was always open to everyone. No one was debarred or prohibited. But that Falke had no permission to mount the steps of the Masjid.
Falke became internally dejected. ‘What kinds of karmas have been instrumental that my steps cannot enter the Masjid. What sins have I committed? By what turn of events, will Baba be propitious towards me and come forward towards me’ – that was the sole thought, day and night, in Falke’s mind, like the throbbing of his own heart. In the meanwhile, somebody advised him not to be dejected like this ‘Take Madhavrao’s help and your heart’s desire will be fulfilled’. Before taking Nandi’s darshan, can Shankar become propitious? He approved of following this method and liked the idea of using this means. On the face of it, the listeners will think this to be an exaggeration. But, this was the experience, in Shirdi, at the time of darshan. Whoever desired to be with Baba, without any disturbance, to have a dialogue, he was required to go with Madhavrao, at the outset. Who has come, from where, and wherefore? – For the purpose of telling all this in a sweet and suitable manner and to introduce (Madhavrao was required). Then Samartha became willing to talk. The Haji heard all this and persuaded Madhavrao. He said: “Once, at least, dispel my turmoil. Help me to attain the unattainable”.
With this pressure on Madhavrao to find a suitable opportunity, he made a firm decision. Whether the task was difficult or not, he would make an effort. He plucked up courage and went to the Masjid. He broached the subject very delicately. “Baba, that old man is greatly distressed. Please oblige him. That Haji has come to Shirdi for your darshan after doing the Mecca – Medina pilgrimage. How can you not be merciful to him? And not allow him to come into the Masjid? Innumerable persons come, freely enter the Masjid, take darhsan and leave quickly. Why is only this one lingering in vain? Be merciful towards him, just once. Meet him in the Masjid. Then, he will also leave quickly, after asking the question in his heart”. “Shama, the infant’s spume has not yet even dried on your lips. If Allah’s grace is not with him, what can I do for him? If he does not have an indebtedness of Allahmiya, can anyone climb (the steps of) the Masjid! The Fakir’s actions are beyond understanding. And I have no control over them. So be it.
There is a narrow foot path beyond the Barvi well. Go and ask him clearly if he will walk and come there correctly”.
The Haji said: “However difficult it may be, I will walk correctly. But grant me a personal meeting, and let me sit near his feet”.
Listening to the answer from Shama, Baba said,
“Ask him further: Four times forty thousand rupees, will you give to me?”
When Madhavrao gave him this message, the Haji said: “What are you asking? If he asks, I will give forty lakhs! Where lays the question of thousands! ”
Listening to this answer, Baba said:
“Ask him. To-day we have a desire to slaughter a goat in our Masjid. What part of the meat, do you wish? Would he like bones with flesh, haunch or testicles? Go and ask that old man, what he definitely wants”.
Madhavrao related in detail to the Haji whatever Baba had said.
Haji emphatically said: “I need nothing of all that. Give me whatever he wishes. But I have only one desire. If I only get a morsel from the kolamba, I will have attained my object and my well-being”.
Madhavrao returned with this response from the Haji. While he was presenting this statement, Baba became wild with anger immediately. Picking up the kolamba and the water pot in his own hands he threw them out of the door. Biting his hand noisily, he came near the Haji. Holding his kafni with both hands and lifting it up, he stood in front of the Haji and said:
“What do you think yourself to be? Are you boasting in front of me? You are giving yourself airs because of your age! Is that the way you recite the Koran! You are vain because you have done the pilgrimage to Mecca! But you do not realize who I am! ”
In this manner he was reproached! Using unspeakable words! The Haji was dumbfounded. Baba then turned back. While entering the courtyard of the Masjid, he saw the gardener’s wife selling mangoes. He purchased all the baskets and sent them immediately to the Haji. In the same way, he turned back immediately, and went again towards that Haji. He took out Rs. 55/- from the pocket and counted them on his (Haji’s) hands. Thereafter, there developed affection. The Haji was invited to eat and both of them forgot all the past. The Haji was delightfully blissful. Then he left and frequently came again. He took full pleasure in Baba’s affection. Then Baba gave him gifts of monies, from time to time.
Meaning behind this story:
We can learn so much from this story.
Baba said “There is a narrow foot path beyond the Barvi well. Go and ask him clearly if he will walk and come there correctly”.
There is no such thing as Barvi well physically but it could be the means of Sadhana (practice) and narrow path means treading the path of austerity.
They can include Samadamadhi Shat sampatti. They are the six virtues: (a)Sama: Quietude in holding the mind steadily on the object of attention. (b)Dama: Control—mastering of the powers of perception and of action, holding them from running away. (c) Uparati: Cessation from leaning on outer things and external objects. (d) Titiksha: Endurance of afflictions without rebelling against them and without lamentation or grumbling. (e)Shraddha: Faith or firm conviction of the truth about the soul, the science of the soul and the Teachers of that science. (f)Samadhana: Self-settled ness in the Pure Eternal in an increasing measure till permanency therein is attained.
Vivekais discrimination—discernment between the Eternal and the non-eternal. These two are not distant, somewhere far away, but here, near at hand. Both the Eternal and the non-eternal envelop everything, and we have to discriminate between them in eating and drinking, in waking and sleeping, in all the affairs of life.
Vairagyais dispassion or desirelessness, and freedom from self-indulgence. When we indulge the self of sense we follow the non-eternal; when we free ourselves from the senses it is because the Eternal has been glimpsed, however dimly.
Mumukshatavam - Desire to be free from birth death cycle.
In this process we need to control the mind and make it still, have patience for Guru’s grace and move towards the ultimate goal.
Next question was: “Ask him further: Four times forty thousand rupees, will you give to me?”
Baba is asking here purity of faculty of mind (Mind, Buddhi, Chitta and Ahankara). If we can annihilate these four then we can experience self realization.
The third question was: “Ask him. To-day we have a desire to slaughter a goat in our Masjid. What part of the meat, do you wish? Would he like bones with flesh, haunch or testicles? Go and ask that old man, what he definitely wants”.
He wanted to test him to see whether he is really interested in worldly activities with a passion. Bones with marrow indicates the creation. Bone marrow is responsible for the birth of so many cells in the body. When we become dispassionate about these worldly objects, we become eligible to walk this path. We can have so many pilgrimages under our belt, it does not matter. We need to purify our mind.
Guru keeps us straight with his harsh words, so that he can get rid of some bad tendencies from our psyche. In the end Baba gave Falke mangoes which indicate auspiciousness and Rs. 55. This denotes the 5 qualities that he needs to acquire Knowledge of Self. We should never misunderstand this as Guru getting angry at us. In reality this is a blessing. We should never leave the feet of Guru. We have to learn to live with out this egotism and we have to humble.
మానవులుగా మనకు జీవితములో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుఅవుతూ ఉంటాయి. ఒక్కోసారి మనకు వచ్చిన కష్టాలలోనుంచి బయటపడతామా లేదా అన్న నిరాశ మనలను ఎంతగానో బయపెడుతుంది. సరే ఇది మనకు చాలతేలికగా అర్ధం అయ్యే విషయం.
కాని ఇంకో కష్టం ఉంది. ఈ కష్టం మనకు తెలియకుండా మింగేస్తుంది. మనకు బాధ కలిగినట్లు కూడా తెలియదు. కాని చాలా నష్టం జరిగి పోతుంది. అది ఏమిటి అంటే, మాయ. ఈ మాయ ఏ రూపంలో అయినా రావచ్చు. దీనికి కారణం అహంభావన. ఈ అహంలోనుంచే చాలా కష్టాలను కోరి తెచ్చుకుంటాము. ఇది మొట్టమొదట మంచిదే అనిపిస్తుంది కాని మనకు తెలియకుండా ఊభిలోకి కూరుకు పోయేట్లు చేస్తుంది. మనం చాలా మంచి పనే చేస్తున్నాము అని అనుకుంటాము. మనకు దైవ అనుగ్రహం కూడా ఉండచ్చు. అయినా ఇక్కడ కూడా ఈ మాయ మనలను వదలదు. కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనలో మనస్తాపం కలుగుతుంది అంటే మనం మాయలో పడ్డట్టే. మన గమ్యం మనకు తెలిసినప్పుడు,
మనము బాబానే మనకు సర్వం అని భావించినప్పుడు,
ఆయనమీద పూర్తిగా భారమంతా వేసినప్పుడు, ఆయనే మన దైవమని నమ్మినప్పుడు, ఆ పరమగురువే మన సద్గురువుగా సాక్షాత్కారించినప్పుడు, అయన అనుగ్రహమే మనకు లభించినప్పుడు, ఇక చింత ఎందుకు? ఇంక భయం దేనికి ? మరి దిగులు అవసరమా! బాబా ఈ మాయ గురుంచి ఈ విధంగా చేప్పారు. "నేను ఇల్లు వాకిలి లేని ఫకీరుని, ఏ బాధలు లేకుండా ఒక చోట స్థిరంగా కూర్చున్నాను. అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్ను కూడా వేధిస్తుంది. నేను మరిచిపోయినా అది నన్ను మరవకుండా నిరంతరం పెనవేసుకొని ఉంది. అది హరి యొక్క ఆది మాయ. బ్రహ్మాదులను కూడా ఎగరకొట్టేస్తుంది. మరి నేనెంత? హరి ప్రసన్నుడు అయితే అది విచ్ఛిన్నం అవుతుంది. అఖండ హరి భజన లేకుండా మాయ నిరసనం కాదు". ఇట్లా చెప్పి సాయి మరి కొన్ని విషయాలను కూడా చెప్పారు. ఎల్లప్పుడూ "సాయి! సాయి !" అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా రక్షిస్తాను. ఈ నా మాటలయందు విశ్వాసం ఉంచితే తప్పక మేలు కలుగుతుంది. నాకు పూజా సామగ్రి కాని, అష్టోపచార, షోడశోపచార పూజలు కాని అవసరం లేదు. అపరిమితమైన భక్తి యున్న చోటే నా నివాసం". ఈ మాటలు ఎంతటి వారికైనా ఊరట కలిగిస్తాయి. ఇక్కడ మనకు బాబా నేర్పించాలనుకున్నది ఏంటి? మనం సృష్టి, స్థితి, లయల గురించి విన్నాము. బ్రహ్మ అనే మనసు సృష్టి చేస్తే, విష్ణువనే స్థితి దాన్ని వర్తమానంలో ఉంచితే, శంకరుడు లయ కారుడు అయి దాన్ని అంతం చేయాలి. మనం ఒక ఆలోచనుకు ప్రాణం పోస్తాము, దానికి ఒక కార్య రూపం ఇస్తాము. కాని దాని పర్యవసానం మనం అనుకున్నట్లుగా లేక పొతే మనకు బాధ కలుగుతుంది. మన పురాణాలు పరిశీలిస్తే మనకు చాలా స్పష్టంగా అర్ధం అయ్యే విషయం ఏమిటి అంటే దేవుళ్ళు కూడా చాలా వ్యతిరేక పరిస్తితులను ఎదురు కోవాల్సి వచ్చింది. వాటిని వాళ్ళు కూడా మానవరూపంలోనే అనుభవించి మనకు ఆదర్శప్రాయులు అయ్యారు. బాబా కూడా ఒక శరీరంలో ఉండి ఈ మాయను ఎలా అధిగమించాలొ మనకు నేర్పారు. అయన నన్ను కూడా మాయ పట్టుకుంది అని చెప్పారు. అయన పరబ్రహ్మ స్వరూపము. ఆయన మాయకు అతీతుడు. ఆయన మన స్థాయికి వచ్చి మాట్లాడితే తప్ప మనకు అర్ధం కాదు. ఒక్కో సారి సాయి నేను ఇది చేసాను, అట్లా ఉన్నాను అని చెప్తారు. అయన నిరాకారుడు, నిర్గుణుడు, మరియు సచ్చిదానంద స్వరూపుడు. ఆయన చెప్పినవన్నీ మన కోసం. ఇక్కడ బాబా హరిని తలుచుకోమని చెప్పడంలో అర్ధం ఏమిటి? హరి అంటే స్థితి కారుడు - స్థితి అంటే వర్తమాన కాలం. మనం కష్టాలలో ఉన్నప్పుడు మనం దేవుడ్ని తలుచుకుంటాము. ఇది మనకు కొంత ఊరట కలిగిస్తుంది. కాని మనం వర్తమానంలో ఉండము. దీని వల్ల మన ఆశాసౌధాలు కూలిపోయాయని బాధపడ్తాము. అంటే జరిగిపోయిన కాలం లోకి జారుకుంటాము. ఇంతే కాక భవిష్యత్తులో మనం అనుకున్నవిధంగా జరగకపోవచ్చని దిగులు చెందుతాము. కాని హరి అనే వర్తమానంలో ఉండము. వర్తమానం మనలను కార్యోన్ముఖులను చేస్తుంది. వర్తమానంలో ఉండి ఆలోచిస్తే మనకు దారి దొరుకుతుంది. ఒక్కో సారి ఈ కష్టం మనలను మింగేస్తుందా అని అనిపించవచ్చు. కాని ఈ సృష్టిలో ప్రతి దానికి లయం ఉంటుంది. ఏది శాశ్వతం కాదు. అలాగే కష్టాలు కూడా. ఈ చిన్న ప్రవచనంలో బాబా ఎంతో చక్కటి నిగూడ అర్ధాన్ని వివరించారు. అందుకే ఆయన చేతల గురువు. మాటల గురువు కాదు. సద్గురువులు ఎప్పుడూ తమ శిష్యుల ఉన్నతిని మాత్రమె కోరుకుంటారు. వారిని ప్రతి జన్మలో రక్షిస్తూనే ఉంటారు.
మన జీవితంలో మార్పు రావాలని మరియు మన నడవడిక మారాలని బోధించే వారు బాబా. ఒక సారి దీక్షిత్కు బాబా ఈ విధంగా చెప్పారు. "నువ్వు వేరే వాళ్ళ గురుంచి చెడుగా మాట్లాడినా లేక వాళ్ళ తప్పులు ఎంచినా, నాకు అమితమైన బాధ కలగుతుంది" అని బాబా అనే వారు. అప్పట్లో దీక్షిత్ కు కూడా కోపం ఉండేది. తరువాత కోపాన్ని నియంత్రించాడు. ఒక సారి వాడాలో క్రిస్టియన్ మతం గురుంచి మాట్లాడుతూ వారిని విమర్శించాడు దీక్షిత్. అదే రోజు బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు, దీక్షిత్ తో బాబా మాట్లాడ లేదు. దీక్షిత్ తన తప్పు తెలుసుకొని, బాబా ను క్షమించమని మనసులోనే ప్రార్ధిస్తాడు. అప్పుడు బాబా "ఎవరిని నిందించ వద్దు" అని ప్రేమతో చెప్తారు. ఒకసారి దీక్షిత్ రోజు తను చేసుకునే పూజ చేసుకొని బాబాకు తాంబూలం ఇవ్వడం మరిచాడు. తరువాత బాబా దగ్గరకు వెళ్ళితే, బాబా వెంటనే "నాకు ఈ రోజు తాంబూలం ఇవ్వ లేదు " అని అంటారు. అప్పుడు దీక్షిత్ కు సాయి యొక్క సర్వజ్ఞత అర్ధం అవుతుంది. ఇక నుంచి నేను మనస్పూర్తిగా బాబాకు పూజ చెయ్యాలి అని అనుకొంటాడు. ఎక్కడ పూజ చేసినా బాబానే స్వయంగా ఎదురుగా ఉన్నారు అన్న భావనతో ప్రార్ధన చేసేవాడు. సాయి బంధువులారా! చూసారా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. యద్భావం తద్భవతి అని అంటారు. సాయి ఎప్పుడూ మనలను ఒక కంట కనిపెట్టి ఉంటారు. మనలో నమ్మకం దృడంగా ఉండాలి. అలానే దీక్షిత్ కూతురు చనిపోయినప్పుడు, బాబా చావు పుట్టుకల గురించి చెప్పి, తనలో వ్యామోహం పోగొట్టారు. ఇంకోసారి దీక్షిత్ ఒక కేసు గెలిచి దాదాపు 1000 రూపాయలు ఒక ట్రంకు పెట్టెలో తెచ్చి, బాబాకు ఇదంతా నీదే బాబా అని చెప్పాడు. అప్పుడు బాబా ఆ డబ్బంతా క్షణాల్లో పంచి పెట్టారు. కాని దీక్షిత్ లో ఎటువంటి వ్యామోహం కనిపించదు. ఇలా బాబా ఒక్కో విషయంలో దీక్షిత్ లో మానసిక పరివర్తన తెచ్చి, మెల్లగా తనను ముక్తి పధం వైపు నడిపించారు. తరువాత అతనికి బాబా ఒక కఫిని కూడా ఇచ్చారు. దీక్షిత్ ఆ కఫినీని షిర్డిలో ఉన్నప్పుడు ధరించేవాడు. మనం బాబాను పూర్తిగా నమ్మితే మనలో కూడా ఈ మానసిక పరివర్తన వస్తుంది.
Sai once told Dixit that he should never talk bad about people and it hurts Baba when some one does that. Dixit also had some temper issues at that time. Baba helped him to regulate that in course of time. Once they were having discussion in wada about Christianity and Dixit criticizes the religion. Afterwards when he went to see Baba, Sai was quiet and didn’t speak to Dixit. He immediately realizes that Baba knows every thing and asks Baba’s to forgive him in his mind. Then Baba talks to him. Baba then says not to criticize any thing.
Once Dixit performed his daily worship to Baba but forgot to give betel leaves to Sai. When he goes to Dwarakamai, Baba says “Kaka you did not give me betel leaves today”. Dixit was very happy that Baba is watching over him and receiving all his Puja (worship). Since that time, he always did his worship thinking that Baba is in front of him.
So Sai devotees, what can we learn from this. Sai is always watching us and we have to worship him with lot of love.
We should have utmost faith in Baba.
He was teaching Dixit different means to improve his personality so that he can
prepare him for the ultimate goal of life that is Salvation.
When his daughter died, Baba taught him about death and dying, so that Dixit can understand what human life is about. Another time, Dixit won a case and brings 1000 rupees in a box to Baba. He says to Baba “Baba all this is yours”. Then Baba gives away all the money in seconds to everyone around him. Dixit does not even flinch. People were watching his feelings but Dixit eyes were focused on Baba’s feet. This way he proved that he is not attached to money either.
Along these lines, Dixit personality slowly changed and Baba made him walk towards self- realization. Baba also gave him kaphni (Robe) and Dixit used to wear this when he was in Shirdi.
The importance of satsangh was described as follows in Sri Sai Satcharita:
By listening and reflecting over the stories of the Saints, we will be purified.
When we learn about our Great Parama Guru Sri Shirdi Sai through studious application, and intense contemplation,our minds will be purified.
If we surrender to Sai, he will bless us there by our intent to understand his teachings will ripen. By listening to Guru's teachings and his teachings through satsangh will free us from the difficulties of this material world. This is the best way to reach our goals.
We have to love our Sai with out any second thoughts. Our heart should become the abode of Sai.
To fill our hearts with love for Sai: We have to recite Sai's name all the time. We have to understand the gist of Sai's teachings. When we memorize Sai's teachings and practice them in real life, Sai will bring knowledge of light in to our lives. This love will make us understand Sai even more. If one needs to stay in this happy state. we need to resort to satsangh. Let us offer a prayer to our beloved Sai to give us the blessing to be in the company of a Satsangh. We will also ask Sai to give us the strength to sustain in Satsangh until we reach our goal.
The ardent desire does not arise without the Lord’s Grace. Only when the Lord chooses to bless (grace) the desire to listen (to his praises) is awakened.
This light will show us the path and will increase the love towards Sai.
Bad company is absolutely harmful. It is the abode of severe miseries. Unknowingly, it would take you to the by-lanes, bypassing the highway of happiness.
Without the one and only Sainath or without a Sadguru, who else can purify the ill-effects of bad company?
Words spoken by the Guru, out of compassion, oh devotees retain them in your heart! Your bad deeds will be washed away.
‘Satsangh’ completely destroys bodily pride or ego. Therefore, there is no other
means than ‘Satsangh’.
Hold on to the good company of the Guru and the virtuous. Disentangle from the worldly ties. Definitely herein is your fulfillment. Have no doubts.
Abandoning all the million clever and cunning ways, recall always “Sai, Sai” . You will be able to cross the worldly ocean. Have no doubts.
In order to attain final emancipation, the only remedy is to have detachment of the senses. Unless one has a keen desire for ‘Satsangh’, one cannot realize one’s true identity.
Happiness is followed by unhappiness; and unhappiness follows happiness. One welcomes happiness, while one turns away from unhappiness.
Whether you face happily or turn your back on your destiny, what will be, will be,. But to liberate oneself from both kinds of destined experiences, the company of the Saint is the only way.
Because of ‘Satsangh’ bodily attachment is destroyed. It is ‘Satsangh’ that breaks the cycle of birth and death.
It is ‘Satsangh’ that gains the treasure of supreme energy and separates one from the worldly ties immediately.
సత్సంగ మహిమ గురించి శ్రీ సాయి సచ్చరితలో (మూలంలో) ఈ విధంగా చెప్పబడింది. సత్పురుషుల చరిత్రలు మనలను సన్మార్గంలో ఉంచుతాయి. మన గురువైన శ్రీ సాయినాథుల చరిత్రను శ్రవణం, మననం, అధ్యయనం, నిధి ధ్యాసనం చేస్తే మనలో పవిత్రత పెరుగుతుంది. సాయిని శరణు వేడితే, ఆ సాయి మన మీద అనుగ్రహ వర్షం కురిపించినప్పుడు మనలో ఈ శ్రవణ లాలస పెరుగుతుంది. గురు కథా శ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించి మనం ఈ ప్రాపంచిక బాధలనుంచి దూరం కావచ్చు. ఇదే మన జీవితానికి సార్ధకతను చేకూర్చే సాధనం. మనస్సులో ఏ సందేహాలను ఉంచుకోకుండా సాయిని ప్రేమించాలి. మన మనస్సే సాయి నిలయం అయిపోవాలి. మన మనస్సు సాయి ప్రేమతో నిండాలి అంటే! ఎల్లప్పుడూ సాయి స్మరణ చేస్తూ ఉండాలి. సాయి తత్వాన్ని అర్ధం చేసుకోవాలి. సాయి చెప్పిన బోధలను మననం చేసుకుంటూ, వాటిని ఆచరిస్తూ మన జీవితంలో వెలుగును నింపుకోవాలి. ఆ సాయి అనే వెలుగు మనకు దారి చూపిస్తూ మనలో ప్రేమను నింపుతుంది. ఈ ప్రేమే మనకు బాబా చెప్పిన తత్వాన్ని మరింత బోధపడేట్లు చేస్తుంది. ఈ స్థితి ఎల్లప్పుడూ ఉండాలి అంటే మనకు సత్సంగం చాలా అవసరం. చెడు సావాసం అంత మంచిది కాదు. ఇక్కడ చేడుసావాసం అంటే చెడ్డ వాళ్ళతో తిరగడం అనే అర్ధం మాత్రమె కాదు. మన లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళతో, అలానే బాబా కోసం పరితపించే వాళ్ళతో మెలగడం అలవాటు చేసుకోవాలి. అప్పడు మనలో మానసిక పరివర్తన వస్తుంది. సృష్టిలోని రూపాలు కళ్ళలో నిండినప్పుడు బాహ్య సౌందర్యాన్ని ఆపేక్షించే మనస్సు దానితో రమిస్తుంది. ఆ దృష్టి అంతర్ముఖం అయితే అది సత్సంగంలో రంజిల్లుతుంది. సత్సంగం యొక్క మహిమ అటువంటిది. అది శారిరాభిమానాన్ని సమూలంగా అణిచివేస్తుంది. అందువల్ల సత్సంగం కంటే మరో సాధన లేదు. అందుకే బాబా నిత్యం సత్సంగం చేయండి అనే చెప్పేవారు. మంచి వారితో ఉండండి అనే వారు. ఇతర సాంగత్యాలు దోషపూరితం అయినవి. శరీరం అంతటినీ నిర్మలం చేసేది, ఏ దోషాలు లేనిది సత్సంగం ఒక్కటే. సత్సంగం శరీరం పైన ప్రీతిని, అభిమానాన్ని తొలగిస్తుంది. ఒక్క సారి దాని పట్ల శ్రద్ద కలిగితే, దాని బలవత్తర శక్తి వల్ల తప్పక సంసారం నుండి విముక్తి కలుగుతుంది. బాగ్యవశాత్తు సత్సంగం లభించిందా ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు. చెడు వాసనలన్నీ పోయి మనసు నిర్మలమైన స్థితిలో రమిస్తుంది. పరమార్ధంలో ప్రవేశించడానికి విషయసుఖాల యందు విరక్తి ఒక్కటే ఉపాయం. సత్సంగాన్ని ఆశ్రయించకుండా ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోలేము. సుఖాల వెంట దుఖాలు, దుఖాల వెంట సుఖాలు వస్తుంటాయి. జీవుడు ఎప్పుడూ సుఖాలనే ఆశిస్తూ దుఖాలకు విముఖంగా ఉంటాడు. సుఖ దుఖాలనే ఈ రెండు అనుభవాలనుంచి విముక్తిని కలిగించేది, సత్పురుషుల సాంగత్యం ఒక్కటే. సత్సంగం వలన జనన మరణాలు ఆగిపోతాయి. అప్పుడే మనం ఆ పరమాత్మను అనుభవ పూర్వకంగా తెలుసుకోగల్గుతాము. మనం అందరం సాయిని ఆ సత్సంగ భాగ్యం కలిగించమని వేడుకుందాము. ఆ సత్సంగం లభించిన తరువాత దాన్ని వదులుకోకుండా ఉండే శక్తి మనకిమ్మని ఆ సాయిని మనసా వాచా కర్మణా ప్రార్దించుదాము.