In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, September 17, 2014

మంచిని పెంచు - నిజ జీవితానికి సాయి బోధలు


మనస్సు అంటే ఏమిటి ?

వాసనలతో కూడిన ఆలోచనల తరంగమే మనస్సు.

ఈ వాసనలు మన జీవితాన్ని సుడిగుండాలుగా మారుస్తాయి. మన మానసిక పరిస్థితి వీటిమీదే ఆధారపడి ఉంటుంది. 

మంచి ఆలోచనలు మనలో ప్రశాంతతను పెంచుతాయి. 

చెడు ఆలోచనలు మనలను కష్టాలపాలు చేస్తాయి. 

మనం రోజు నిద్రపోయే ముందు మన మనస్సు ఆలోచనల మయం అవుతుంది. వాటిలో కొన్ని మంచి ఆలోచనలు మన జీవితాన్ని మార్చేవి కూడా ఉంటాయి. వాటిని తప్పకుండా ఆచరణలో పెట్టాలి అని అనుకోని నిద్ర పోతాము. ప్రొద్దున్నే లేవగానే ఈ జీవనమనే అరణ్యంలో కొట్టుకుపోతాము. ఎవరెవరో మన జీవితాన్ని నిర్దేశిస్తారు. మన ప్రమేయం లేకుండా రోజంతా గడిచిపోతుంది. ఇంటిపనులు, పిల్లలు, వృత్తి మరియు కుటుంబ వ్యవహారాలతో అలసి పోతాము. ఈ బడలికతో నిద్రకు ఉపక్రమిస్తాము. కాని మళ్ళా అవే ఆలోచనలు. మన జీవితం మన అధీనంలో లేదన్న నిస్పృహ. ఇలా ఒక రకమైన బాధ, కోపం మరియు దైన్య స్థితి ఏర్పడుతుంది. 

బాబా అందుకే ఇలా చెప్పారు. "నీ మనస్సులో ఏదన్నా మంచి ఆలోచన వస్తే, దాన్ని పరిశీలించు, ప్రొద్దున్నే లేచి దాన్ని ఆచరణలో పెట్టు. ఇదే జ్ఞానానికి తోలి మెట్టు. ఇది నీ జీవితంలో శాంతిని ఇస్తుంది". 

ఇలా మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టమని బాబా తన భక్తులను ఎంతో ప్రోత్సహించే వారు. బద్దకం అనేది వదిలించుకొమని చెప్పేవారు. చాలాసార్లు మనం చేసే పనులకు మనమే అడ్డుగా నిలుస్తాము. మనలోని న్యూనతే దీనికి కారణము. దీన్ని అధిగమించవలసిన బాధ్యత మన మీదే ఉంది. 

అందుకే మంచి ఆలోచనను వెంటనే అమలు చెయ్యాలి. దాన్ని రేపటికి వాయిదా వెయ్యకూడదు. వీటిని మనము బాగా పరిశీలిస్తాము. వాటిమీద మంచి అవగాహన కూడా వస్తుంది. కాని దాన్ని అమలు చేయడానికి వెనుకాడతాము. దీనికి మన పక్కన ఉన్న వాళ్ళను అడ్డుగా భావిస్తాము. దాని వల్ల దుఃఖం మరింత ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి మన కుటుంబ సభ్యులు మరియు మన స్నేహితులు నిస్సహాయులు. కాని వారిని నిందిస్తాము. వారివలనే మనకు ఈ కష్టం కలిగినదని భావిస్తాము. 

మనకు మనమే చేసుకోలేనప్పుడు ఇతరులు ఎలా చేస్తారు. మన జీవితాన్ని మనమే సరిదిద్దుకోవాలి. 

మన మనస్సే మన ప్రపంచం. 

మనస్సుతో మనం ఎలా చూస్తామో, అలానే ఈ ప్రపంచం కనిపిస్తుంది. 

మాయ అనే పొర కప్పినప్పుడు మన ఆలోచనా విధానం సరిగ్గా ఉండదు. 

మనం ఎన్నో జన్మలగా ఈ మనస్సులోని వాసనలకు బానిసలం అయ్యాము. వాటినుంచి బయటపడలేము. 

మన మనస్సు, అందులో చెలరేగే ఆలోచనలు, వాటినుంచి ఉద్భవించే ప్రేమానురాగాలు, ద్వేషం మొదలైనవన్ని మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. 

ఆలోచనలు మాటల రూపంలో బయటకు వస్తే అదే మనం మాట్లాడే భాష  అవుతుంది.  ఈ భాష మనకు ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తుంది. ఇది ఒక అలవాటుగా మారి అదే మన జీవన విధానం అవుతుంది. ఈ విధానం మంచిది అయితే మనలో మంచి మార్పులు కలుగుతాయి. లేకపోతే అధోపాతాళానికి తొక్కేస్తాయి. 

ఒక మంచి ఆలోచన మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

చెడు ఆలోచనలు ఈ శక్తిని తగ్గిస్తాయి. 

మరి ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి. 

వ్యతిరేక భావనలతో మనము మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. 

అన్నింటిలో మంచిని చూస్తూ మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడమే మన జీవితం యొక్క పరమావధి. ఇది ఎప్పుడు అలవాటు చేసుకుంటామో అప్పుడు బాబా మనకు నేర్పాలనుకున్న సర్వవ్యాపకత్వం మనకు అర్ధం అవుతుంది.




ఓం సాయి రామ్! 

No comments:

Post a Comment