ఒకసారి వ్యాసుడు చాలా దిగాలుగా ఏదో తెలియని స్పూర్తితో ఉండగా, అటుగా నారదమహర్షి వచ్చి ఆయనను పరామర్శించడం జరిగింది. అప్పుడు వ్యాసుడు "నారద మహర్షి నేనెందుకు ఇలా ఉంటున్నానో నాకర్ధం కావటం లేదు మీరైనా చెప్పండి" అని అడిగాడు.
అప్పుడు నారద మహర్షి "ఓ పరాత్పర పుత్రా!
వేదాలను విభజించావు బ్రహ్మసూత్రాలు వ్రాశావు, పంచమ వేదమైన భగవద్గీత (భారతం) అందించావు,
ఇదంతా చేసిన నీవు ఆ ఈశ్వరుని యొక్క సుగుణాలను వర్ణించలేదు.
ఆధ్యాత్మిక మార్గంలో మనుష్యులకు భక్తి లేకుండా
వాళ్ళ అహంకారం తొలగదు. ఆ భగవంతుడైన సర్వేశ్వరుని అవతారములను అందరికి అందించితే అప్పుడు
నీకు పరమశాంతి కలుగుతుంది." అని చెప్పడం జరిగింది. అప్పుడు భాగవతం ఆవిర్భవించింది.
ఈ భాగవతమే భక్తికి అసలైన మార్గము. అందుకే బాబా కొంతమందికి భాగవతము చదవమని చెప్పడం
జరిగింది.
భాగవతము అంటే భగవంతుని గూర్చి తెలుసుకొని,
భక్తిని అలవరచుకుని, మానవుడు తనను తాను ఎప్పుడైతే మర్చిపోతాడో అప్పుడే ఆ ముక్తిలో చరమాంఖానికి
చేరుకోగల్గుతాడు. మనకి మన ఇష్టదైవం మీద ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. కాని మనము ఆ దేవుడి
గురించి పూర్తిగా తెలుసుకొనే ప్రయత్నం చేయము. ఇక్కడే మనము మాయలో పడ్తాము. మనల్ని ఈ
ప్రపంచంలో వస్తువులు లాగుతూ ఉంటాయి. వాటి పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అవి లేకపోతే
బతకలేము అని గట్టి నమ్మకం మనకు ఉంటుంది. ఇదే మన పతనానికి నాంది అవుతుంది.
మహల్సాపతి ఎన్నికష్టాలు ఎదురైన, తన మనస్సును
దారి తప్పకుండా అధీనంలో ఉంచుకున్నారు. ఆయనకి తింటానికితిండి కూడా ఉండేది కాదు. చాలా రోజులు
పస్తులు ఉండేవాడు. బాబా ఏదైనా ఇచ్చినా తీసుకునే వాడు కాదు. ఆయనకు ఉన్న కొంచెము పొలం
పంటకు పనికి రాదు. ఆయన వృత్తి ఆభరణాలు చేయడం. ఆ నిరుపేద గ్రామంలో నగలు చేయించుకునే
వారే తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన తొణకలేదు. బాబా పట్ల అనన్య భక్తిని మాత్రమే
కోరుకున్నాడు. అందుకే ఆయనకు బాబాతో సదా నిదురించే అవకాశం దొరికింది. బాబా చేస్తున్న
లోక కళ్యాణంలో ఒక భాగంగా భక్త మహల్సాపతి చిరస్థాయిగా నిల్చిపోయాడు.
|| ఓం సాయిరాం ||
No comments:
Post a Comment