In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Saturday, October 10, 2020

భగవద్గీత 5వ అధ్యాయం - కర్మ సన్యాస యోగము



భగవానుడు 4వ అధ్యాయం ముగిస్తూ అర్జునిని తన హృదయమునందు ఉన్న అజ్ఞానాన్ని వివేక జ్ఞానమను ఖడ్గముతో రూపుమాపి కర్మ యోగమునందు స్థితుడవు కమ్ము అని చెప్పి ముగించారు. ఇప్పుడు 5వ అధ్యాయంలో కర్మయోగము మరియు కర్మ సన్యాస యోగముల గురించి చెపుతూ అర్జునినికి కర్మయోగమే శ్రేయస్కరము అని బోధించారు. ఇక్కడ కర్మసన్యాస యోగము అంటే కర్మను త్యచించడం కాదు. కర్మసన్యాస యోగి అంటే సాంఖ్య యోగి అని అర్ధం. సాంఖ్యం అంటే ఇక్కడ అర్ధం జ్ఞాన మార్గము.

ఈ అధ్యాయంలో మొత్తం 29 శ్లోకాలు ఉన్నాయి. భగవానుడు ఏ మార్గం ఎవరికి అనువుగా ఉంటుంది, మనకి కర్మ యోగము మంచిదా లేక కర్మ సన్యాస యోగానికి మనకు అర్హత ఉందా అనే విషయాలను చక్కగా ఉదహరించి మరీ చెప్పారు. మన మనో స్థితిని బట్టి మనం ఏక్కడ ఉన్నాము అనే విషయం అర్ధం చేసుకుని మన మార్గాన్ని తెలుసుకోవచ్చు. మనకు ముందుగా ఈ మార్గాలు ఎందుకు అనుసరించాలి అనే విషయం అర్ధం కావాలి. 


ఈ మానవ జీవితం ఎంతో శ్రేష్టమైనది అని మన శాస్త్రాలు చెపుతాయి. మనం జన్మరాహిత్యం దిశగా ప్రయాణం చేయాలి అని కూడా చెప్తాయి. ఈ మార్గంలో మనం ప్రయాణిస్తూ కర్మల ఫలితాలు వాసనలు కాకుండా ఎలా ఆచరించాలో ఈ అధ్యాయం నేర్పిస్తుంది. అంతే కాకుండా నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? 

రజో గుణంతో మన మనస్సు నిండి ఉన్నప్పుడు మనం ఆచరించాల్సిన కర్మ యోగం గురించి భగవానుడు చక్కగా చెప్పారు. అలానే సాంఖ్య యోగం (కర్మ సన్యాస యోగి)   అనుసరించాలి అంటే కావాల్సిన అర్హతలు కూడా చక్కగా చెప్పారు. 

భగవంతుడు ఎవరి రాతలు వ్రాయడని వారి కర్మఫలాలను వారే సంచిత కర్మగా తీసుకొని జన్మ తీసుకు వస్తారని ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 

సకామ మరియు నిష్కామ కర్మల గురించి కూడా చక్కగా వివరించారు. అలానే జ్ఞాన యోగము యొక్క ఏకాంత సాధనా విధానాన్ని చెప్పారు. 

ఈ ప్రాపంచిక భోగాలు దుఃఖకారకములని, వివేకవంతులు వీటి పట్ల ఆకర్షణకు లోను కారని, యోగికి సుఖికి గల తేడాలను చక్కగా చెప్పారు. 

చివరగా సాంఖ్య యోగి అంతిమ స్థితి గూర్చి, నిర్వాణ బ్రహ్మ ప్రాప్తి కలిగిన జ్ఞానులైన వారి లక్షణాలు చెప్పి, తానే ఈ విశ్వమంతా ఉన్నట్లు చెపుతూ అధ్యాయం ముగించారు.

చివరగా ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాము.
మనకు కర్మ యోగము మంచిదా లేక కర్మ సన్యాసం మంచిదా అన్న విషయం అర్ధం చేసుకోవాలి. మనందరం  ఈ ప్రాపంచిక విషయాలలో సతమవుతూ ఉంటాము అందుకే కర్మ యోగమే అర్జునిని లాగా మనకు కూడా శ్రేయస్కరము.

ఇక్కడ కర్మ యోగము ద్వారా మనస్సు శుద్ధి పడితే అప్పుడు మనకు కర్మ సన్యాస యోగము చేసే అర్హత వస్తుంది అని అర్ధం చేసుకోవాలి. అందుకే భగవానుడు ఆ యోగి యొక్క లక్షణాలు మనకు చెప్పారు.

మనకు విషయభోగాలు ఎలా అడ్డుగా ఉంటాయో తెలుసుకోవాలి.

మనలో ఉన్న కామక్రోధాల వేగాన్ని ఎలా తట్టుకోవాలో అనే విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు.

కర్మ యోగము ద్వారా మన మనోస్థితిని ఉన్నతంగా తీర్చిదిద్దుకుని, భగవంతుడు అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి అర్హత ఎలా సంపాదించాలో నేర్పిస్తుంది ఈ అధ్యాయం.

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః!




No comments:

Post a Comment