In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Saturday, February 1, 2020

షిర్డి సాయినాథుని అనుగ్రహ వాక్యాలు




నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నా యందె భక్తిశ్రద్ధలతో మనస్సు నిలిపిన వారి యోగక్షేమములు నేను చూచెదను. కావున వీటికొరకు ప్రయాస పడవద్దు.

ప్రపంచములో కీర్తిప్రతిష్టలకోసం ప్రాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణా కటాక్షములు పొందుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందుకొను బ్రమను వీడుము.

లోకులు గౌరవించినంత మాత్రాన తనను తాను మర్చిపోవాలా? ఆరాధ్య మూర్తి యొక్క అంతఃకరణం కరుణతో కరిగిపోయి చెమటలు పట్టాలి. ఈ ధ్యేయం మీదే ప్రీతి కలగాలి.

సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలి. ఇంద్రియవికారాలు భక్తివైపు మొగ్గాలి. ఇతర విషయాలపై ప్రీతిలేకుండా ఎల్లప్పుడూ మనసులో భజన జరగాలి.

మనస్సు నందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్త ఇంద్రియములను భగవంతుని ఆరాధనకు నియమించుము. ఇతర విషయములపైకి మనసుని పోనివ్వకము.

మనసు అన్నిటిని మర్చిపోయేలా నామస్మరణ యందు లగ్నం చెయ్యాలి. అప్పుడు శరీరం, గృహం, ధనం అవేవి గుర్తు ఉండవు. సత్సంగం చేసిన ఫలితంగా చిత్తవృత్తి శాంతించాలి. చిత్తం పరమానందంతో ప్రశాంతతను పొందుతుంది.

ఇలా బాబా మనకు సాధనలో ఉపయోగపడే చాలా విషయాలు చెప్పారు. మనం ఆధ్యాత్మిక పధంలో ఎదగాలి అంటే ఇవి పాటించక తప్పదు. బాబా పై నాకు భక్తి ఉంది అంటే సరిపోదు. ఆయన చెప్పిన సూచనలను తప్పకుండా పాటించాలి. అప్పుడే మనము నిజమైన సాయి భక్తులుగా ఎదగగలుగుతాము. సాయికి నిజంగా దగ్గర అవ్వగలుగుతాము.

ఓం శ్రీ సాయిరాం!

Baba's Assurances



Those who wholeheartedly worship me and lovingly always serve me, I look after their well-being. This I know to be my motto. There will never be shortage of food and clothing. Therefore do not hanker after them. 

One should seek honor at the door of God; and should beg only from God. Ask only for his blessings. Worldly prestige should be left aside. 

Why are you satisfied by the honor given to you by the society? Why are you infatuated by this honor? Rather seek through intense devotion to move your chosen deity to compassion and to express your joy through copious streams of Satvik Bhava.  

May you find joy in such striving. Let all the faculties be seized with such a devotional urge so that the passions of the senses may be transformed completely and sprout devotional worship. What desire will then remain? 

May such devotion be your constant preoccupation leaving no relish fro anything else. 

May the mind be engaged in constant chanting of my name and let everything else be forgotten. Then there will be no thought of body, home, and wealth. The heart will be fixed in infinite happiness. The mind will be balanced and serene; and it will find fulfillment in it self. 

A contended mind is the surest sign of association with the holy.How can a wandering mind be considered as being surrendered to God?  

These are most provocative and reassuring words spoken by Baba and we need to remember them always. If we need to grow spiritually this teaching by Baba is very essential. We cannot just say that we believe in Baba without following his teachings. We have to follow these principles given by Baba so that we can reach ultimate goal of human life that is Self-realization. Then only we will be real Sai devotees. 


OM SRI SAIRAM!

Wednesday, January 1, 2020

హృదయ పీఠం - సాయి మందిరం



ప్రతిఒక్క భక్తుని హృదయం షిర్డి అని మనం చెప్పుకోవచ్చు. గురువు మన హృదయమనే షిర్డీలో ఉంటేనే ఆ షిర్డీకి ప్రాముఖ్యత. ఆయనను మన హృదయపీఠంలో ప్రతిష్టించుకుంటే మనలో తప్పకుండా మార్పులు వస్తాయి. గురు స్పర్శతో ఆ మార్పులు ఎలా సంభవిస్తాయి, మనం మన జీవితంలో ఎటువంటి మార్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలో కూడా బాబా చెప్పారు. 

బాబాకు మనం రోజు పూజ చేసుకుంటాము. ఆయన భక్తిలో చాలామంది పరవశం పొందుతారు. అలాంటి పరవశమే ఇప్పుడు మన అందరమూ పొంద ప్రయత్నిద్దాము. బాబా ఆరతి అయిన తరువాత ద్వారకామాయి అరుగు మీద కూర్చొని ఒక్కొక్కరికి నుదిటిన ఊది పెట్టి ఆశీర్వదించి పంపుతారు. ఒక్కసారి మనం కూడా ఆ అనుభూతిని పొందుదాము. ఇప్పుడే ఆరతి అయిపొయింది. మనమందరము ఒక వరుసలో బాబా ఆశీర్వదంకోసం తపిస్తూ ముందుకు నడుస్తున్నాము. బాబా దివ్యమంగళ రూపం మనకు కనిపిస్తుంది. ఆయన పొడవాటి తెల్లని కఫ్ని  ధరించి ఉన్నారు. తలపై ఒక తెల్లటి గుడ్డను చుట్టి దాని అంచులు జడవలె మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవుమీదగా వెనుకకు వేలాడుతూ ఉంది. బాబా వెనక ద్వారకామాయిలో ఉన్న ధుని మంట కనపడుతుంది. ఆ ధుని వెలుతురు బాబా తల వెనక ఒక కాంతిపుంజంలాగా కనపడుతూ ఉంది. వెనుక గోడ దగ్గర ఉన్న గూడు, పూల మాలలతో ఉన్న నింబారు బాబా యొక్క నిర్గుణ స్వరూపాన్ని గుర్తుచేస్తుంది. ఇంతలోనే బాబా ఎదురుగా చేరుకున్నాము. ఆయన దగ్గరకు వెళ్ళగానే ఎదో తెలియని అనుభూతి. అలానే మనసులో నా తండ్రిని చూస్తున్నాను, ఆయన ఆశీర్వాదాన్ని పొందబోతున్నాను అనే ఉత్కంఠ. అంతలో బాబా కుడిచెయ్యి పైకి లేచింది. నా కళ్ళు మూతలు పడ్డాయి. ఊది నుదిటిపై పెట్టి బాబా తన చేతిని నా తలపై ఉంచారు. నా మనస్సు సంతోషంతో నిండిపోయి, కండ్లనిండా ప్రేమ పొంగిపోయింది. ఈ ఆనందానికి అవధులు లేవు. నా గురువు నా హృదయంలోనే ఉన్నారు అన్న భావన అధికం అయింది. నేను నీవు అన్న భావన ఈ స్పర్శతో నశించింది. సాయియే సర్వం అనిపించింది. అంతా సాయి మయం, ఎదో ఎప్పుడు లేని అనుభూతి. 

సాయే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరమ శివుడు. సాయే సర్వదేవతా స్వరూపము. సాయే నిర్గుణము. ఈ అనుభూతి ఎప్పుడూ ఇలాగే ఉండిపోతే బాగుంటుంది అని మనసులో ఆరాటం. హేమద్పంత్ గారు గురు కర స్పర్శ  ప్రభావం గురించి మనకు కళ్ళకు కట్టినట్లు చూపించి అందులో ఉన్న పరమార్ధాన్ని తెలిపారు. ఈ అనుభవం బ్రహ్మైక్య భావనతో సమానమైనదిగా చెప్పారు.

శ్రీ సాయి పరబ్రహ్మణే నమః !

Sai Hridayam


Every devotee's heart can be considered as Shirdi and we learned in the last chapter that how Baba arrived in Shirdi. If Baba is not there Shirdi has no significance. In a similar way if we do not have Baba in our hearts there is no use calling ourselves as devotees of Baba. Guru's touch and blessing changes our lives. Baba also gave us some important discourse on how to grow in spirituality. 

We worship Baba most of the time and the devotees experience some kind of bliss. We will try to experience similar kind of bliss right now. Let us close our eyes and let us immerse our selves in Sai's world. Let us imagine that we are at Dwarakamai and Sai arathi is just finished. After Arathi is done Baba is sitting on the steps of Dwarakamai and people are standing in line to get the blessings of Baba.  We can see glowing and mesmerizing form of Baba in front of us. Baba is wearing the long white Kaphni and there is a scarf on his head. This scarf is tied in such way that part of it hanging by the side of his left ear. There is a glow behind him and the fire from Dhuni is lighting behind Sai. The back wall in the Dwaramai is decorated with garlands. This reminds us the formless Nirguna aspect of Sai.  As we are thinking this way we approached Sai and our heart is filled with joy. We are seeing our Guru and the moment came so that we can get his blessings. As soon as the boon giving hand, which has the Udi from Dhuni touches my head, my heart goes into rapture with inner happiness and my eyes brim with love. Sai is filled in my heart and there is no such thing as mine anymore. Everything was Sai and I do not exist anymore.  

Sai is my Sriram, Srikrishna and Siva. He is the embodiment of all the Gods.  He is also the formless Nirguna. Let this feeling stay forever. Like this Hemadpanth showed us the ecstasy of Baba's touch and his presence. This experience he compared to the ultimate experience of Self realization.


Om Sri Saiparabrahmane namha!

Saturday, December 7, 2019

షిర్డీ క్షేత్రం - పరమ పవిత్రం




పరమ యోగీశ్వరులైన సాయి షిర్డీలో మనలను ఉద్ధరించడానికి, సరైన మార్గంలో నడిపించడానికే అవతరించారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరిస్తాను అని భగవానుడు గీతలో చెప్పారు. అలానే భగవానుడు యోగీశ్వరుల రూపంలో అవతరించి ధర్మాన్ని రక్షిస్తారు. వారు సమాజానికి సరైన దారి చూపిస్తారు. షిర్డీ క్షేత్రం సాయి నాధుని కృపతో పుణ్య క్షేత్రం అయ్యింది. షిర్డీ కోపర్గామ్ తాలూకా, అహమద్ నగరు జిల్లాలో ఉంది. కోపర్గామ్ వద్ద గోదావరి నది దాటి షిర్డీ చేరవలిసి ఉంది. షిర్డీ అంటేనే సాయి. సాయి అంటేనే షిర్డీ. 

సాయి నడిచిన ఆ నేల అతిపవిత్రం. సాయి మూర్తీభవించిన జ్ఞానభండారం. శాంతి వారి భూషణం. వారు పరమార్థ వితరణలో అపర గురు స్వరూపం. సారాలలో సారం సాయి. వారు ఎప్పుడు ఆత్మ స్వరూపంలో లీనమై ఉంటారు. అందరి పట్ల అన్ని ప్రాణుల పట్ల వారి దృష్టి సమానము. వారు మానావమానాలకు అతీతులు. సర్వ జీవులలోను నిండియున్న భగవత్స్వరూపులు. భగవంతుని నామం వారి ముద్ర. వారి అంతఃకరణం శాంత సముద్రం వంటిది. వారు షిర్డీనుంచి శారీరక పరంగా అక్కడే ఉన్నట్లు అనిపించినా  వారు అంతటా ఉంటారు. షిర్డీలోనే అన్ని పుణ్యక్షేత్రాలు నెలకొని ఉన్నాయి. సాయి సమర్ధుని దర్శనమే మనకు యోగసాధనం. వారితో సంభాషణే మనకు పాప ప్రక్షాళనము. వారి చరణసంవాహనే మనకు త్రివేణి సంగమ స్నానం. వారి విభూతి ప్రసాదాల సేవనం అన్ని విధాలా పుణ్యపావనం. సాయియే మనకు పరబ్రహ్మ. అందుకే మహాభక్తుడైన 95 సంవత్సరాల గౌలి బువా సాయియే పండరినాథుడు అని సెలవిచ్చారు.

సాయికి నామస్మరణ చాలా ప్రీతికరము అందుకే దాసగణుకు నామసప్తాహం చేయమని చెప్పారు. అప్పుడు దాసగణు మహారాజ్ తనకు విఠల దర్శనం అవుతుంది అంటే చేస్తాను అని అన్నారు. బాబా అప్పుడు భక్తిభావం ఉంటె విఠలుడు తప్పక ప్రకటమౌతాడు అని చెప్పారు. అదే విధంగా ఆయనకు ఆ దర్శనం అయింది అని చెప్తారు. అలానే దీక్షిత్ గారికి కూడా ఆ దర్శన భాగ్యం కలిగింది. ఏ సన్నివేశాన్ని చక్కగా సత్చరితలో మనము చదవచ్చు. అలానే బాబా చెప్పినట్టు చిత్రపటం రూపంలో కూడా విఠలుడు వస్తారు. భగవంతరావు క్షీర సాగర్ షిర్డీకి వస్తే తన తండ్రి ఎంత విఠల భక్తుడో తెలిపి తనను సరైన దారిలో పెట్టారు. మన పూర్వ జన్మ వాసనలను ఆధారంగా మనకు ఏ దారి మంచిదో ఆ దారిలో బాబా నడిపిస్తారు. 

దాసగణు మహారాజకు త్రివేణి సంగమాన్ని తన పాదాల దగ్గరే చూపించి పావనం చేశారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం బాబా తన గురువుని వదిలి ఎక్కడకు వెళ్ళలేదు. అలానే షిర్డీ వదిలి వెళ్ళలేదు. అందుకే మనం బాబాను గురువుగా స్వీకరిస్తే అన్ని తీర్ధాలు ఆయన లోనే
 ఉన్నాయి అన్న సత్యం తెలుసుకోవాలి. దాసగణు మహారాజ్ సాయి పాదాలలో త్రివేణి స్నానం చేసిన తరువాత పరవశంతో స్తోత్రం చేస్తారు. ఇది మనం పెద్ద సత్చరితలో చదవవచ్చు.మనం త్రివేణి సంగమంలో గంగ, యమునలను చూడవచ్చు కాని సరస్వతి అంతర్వేది అంటే మనకు బయటకు కన్పించదు. అలానే బాబా రెండు పాదాలలోనుంచి గంగ యమున బయటకు కన్పించాయి. బాబా అనుగ్రహం మాత్రం (సరస్వతి) బయటకు కన్పించేది కాదు. ఈ అనుగ్రహం అంతర్ శుద్ధిని కలుగ చేస్తుంది. సాయి భక్తులమైన మనము కూడా బాబా నుంచి ఈ అంతరశుద్ధిని కోరుకుందాము. 


బాబా షిర్డీ ఆగమనం ఒక మదురమైన ఘట్టం. వారు పదహారు ప్రాయాన  షిర్డీలో అత్యంత సుందర రూపంతో వేపచెట్టు క్రింద స్థిరాసనంలో కన్పించారు. ఆయనకు పగలు రాత్రి అనే బేధం లేదు. అతడు మూర్తీభవించిన వైరాగ్య మూర్తివలె దర్శనమిచ్చేవారు. అందరు ఎక్కడనుంచో వచ్చి దర్శనం చేసుకునే వారు. ఇతడు ఎవరు అనే ఆశ్యర్యం అందరిలోను ఉండేది. ఇద్దరి ముగ్గురికి ఖండోబా ఆవేశమై ఊగుతూఉంటే జనం వారిని బాబా గూర్చి అడిగారు. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఖండోబా దేవుడు చెప్పిన విధంగా ఊరిచివరి వేపచెట్టు క్రింద తవ్వగా ఒక సొరంగం వెలుగుతున్న నాలుగు పెద్ద కుందులు కనిపించాయి. బాబా అది తన గురు స్థానం అని దాన్ని మూసివేయమని చెప్పారు. అక్కడ బాబా పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసినట్లు చెప్పబడింది. 


 మొట్టమొదట గురు స్థానం దగ్గర సాఠె వేపచెట్టు చుట్టూ అరుగు, దక్షిణోత్తరంగా భవనాన్ని నిర్మించారు. చాలా రోజులు షిర్డీకి వచ్చిన యాత్రికులకు ఇదే బసగా ఉండేది. తరువాత దీక్షిత్ వాడా కట్టించారు. షిర్డీలో సెజ్ ఆరతి మొదలైన రోజే ఈ దీక్షిత్ వాడాకు కూడా పునాది వెయ్యడం జరిగింది.   తరువాత 1911 శ్రీరామ నవమి రోజున గృహప్రవేశం జరిగింది. తరువాత శ్రీమంతుడైన బూటీ చేతులమీదుగా ఇప్పుడు సమాధిమందిరమున్న వాడా నిర్మాణం జరిగింది. ఈ ప్రదేశాన్నే సాయి తన మందిరంగా ఎంచుకున్నారు. సాయినాథుడే మురళీకృష్ణుడై అక్కడ వెలిశారు.  

మొట్టమొదటి వాడా హరివినాయక్ సాఠే గారు కట్టించారు. 
 ఆయన ఒక డెప్యూటీ కలెక్టర్ మరియు కలెక్షన్స్ ఆఫీసర్. బాగా డబ్బు సంపాయించి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలనే మనసుతో ఉండే వారు. ఆయనకు మగ బిడ్డలు లేకపోవడంతో బాబా భక్తుడైన దాదా కేల్కర్ కూతురిని రెండోవివాహం చేసుకుంటాడు. అదికూడా బాబా మగబిడ్డ పుడతాడు అని చెప్తే చేసుకుంటాడు. ఇలా ఆయన బాబాను ఆశ్రయించి సాఠే వాడాను కట్టిస్తారు. కాని తరువాత వచ్చిన దీక్షిత్ గారు మాత్రము ఆధ్యాత్మిక సాధన కోసం వాడాను కట్టారు. ఇక చివరిగా మనము ఈ సాధనలో పరిపక్వత చెందితే మోక్షము సమాధి మందిర రూపంలో సాయి పరమాత్మ దర్శనం కలుగుతుంది.
ఓం శ్రీ సాయిరాం!

Shirdi -Divine land



Sai is a great ascetic, by the great good fortune of Shirdi, for the sake of deliverance of the world, appeared on the banks of Godavari River. To protect the dharma, to annihilate the sinfulness and to protect the down-trodden, poor and weak, the saints incarnate. In Bhagavadgita, Lord Krishna says that he will incarnate whenever there is deterioration of dharma and increase of adharma. The Shirdi became holy place because of Sai. This is in Kopergaon taluk, Ahammadnagar district. There were so many saints who were born in the banks of Godavari River. As we cross over to the other side of banks of Godavari at Kopergaon, at a distance of about six miles, as the tanga enters Neemgoan, Shirdi is immediately within sight.  Shirdi became intertwined with Sai's name.

Blessed are the stones and blades of grass of Shirdi which, without any effort, were able to kiss the feet of Sai and were able to bear the dust of his feet on their heads. The very association with Sai in Shirdi is like the study of scriptures. He is the easy way to Supreme God. Sai's darshan is itself a means for our union with the divine. By conversing with him our sins will be washed away. His command is like Vedic sermon for us. His udi (sacred ash) and prasad are purifying and sacred. He used to recite the God's name all the time. He is omnipresent. He was unaffected by the worldly abundance or the absence there of, unmoved by the joys and sorrows of the other world. His heart was pure as a mirror and his speech showered nectar. Pressing his feet is like bathing in the confluence of three rivers (Ganga, Yamuna and Saraswathi) and partaking of the water from washing his feet will uproot all desires. Goulibhuva, a great vaarkari to Pandharpur, said Baba is Vittal. He was 95 year old and he visited Baba every year. 

Sai loved recitation of God's name. He advised Dasaganu to do continuous recitation of God's name for 7 days. Dasganu was promised to have the vision of Vittal. It was reported that he ultimately had the darshan of Vittal. Kaka Deekshit also had vision of Vittal in his meditation. Later Baba tells him to hold on to Vittal otherwise he will disappear. Then Deekshit bought a picture of Vittal from a hawker. This happened to be the same image that he saw in his meditation. Bhagavanta rao Ksheerasagar came to Shirdi and his father was a great devotee of Vittal. Baba reminded him to put him on the correct path as he took backseat in worshiping Vittal. Baba always keeps us on the track even we are immersed in worldly affairs. All we have to do is have faith in him. 

Baba showed a miracle to Dasganu by showing Triveni oozing out from his feet when he wanted to visit the confluence of three rivers on a holy day. Dasganu put his head at Baba's feet. Having witnessed this miracle, Dasganu was overcome with emotion. His speech was inspired and love brimmed up in his 
heart. He praises Baba after this experience and this stotra can be seen in Original Satcharita. Here triveni sangamam was shown from Baba's both feet. At triveni sangamam we can see both Ganga & Yamuna and Saraswathi is flowing underneath. This is not visible. The Saraswathi is called as antervedi. In a similar way Baba showed Ganga & Yamuna from both feet but other river is his grace which is not visible outside but you can only experience it when you surrender.


Sainath appeared in Shirdi as a 16 year old handsome boy and he was seen sitting under the neem tree most of the time. He was immersed in internal bliss and there was no difference between day and night. He appeared as a pure ascetic. People used to come from all around to see this young boy. Sai Samardh appeared in Shirdi for the sake of his devotees. Even in the dreams he had no passions. No one knew where he is from and who his parents were. He kept no company during the day and he was not scared in the night. 

One day Lord Khandoba possessed the bodies of few people and villagers asked them about this young boy. They were told to dig under the neem tree and they found an underground cavern in which there were four burning brass lamps. This young boy told them to close that cavern and this is the place of his Guru. The holy place is his inheritance and he requested them to maintain as it is.  It was told that this boy did penance in that cavern for 12 years. 

 Three buildings were built in Shirdi during Baba's time. Harivinayak Sathe was the first one who bought the land around the Neem tree and built a platform around the neem tree. Then Sathe wada came and initially this was the only place where pilgrims used to stay when they came to see Baba. Then came Kaka Dixit's wada. He
built two floors and Baba made him do his penance on the upper floor. Other people used to use the lower floor. The foundation stone was laid on the day Sej arathi started in Chavadi. Around the same time Baba gave permission for Kapardhe to leave Shirdi after a long stay. Then on Sri Rama Navami day the house warming was done in 1911. Later, the rich Butti's building was also built on which lot of money was spent. But this was all worth it as it became Baba's samadhi mandir. Butti wanted to build Lord Krishna temple in that place. But this became the temple of Sai Krishna. 

If we look at three buildings, the first one was built by Hari vinayak Sathe who was mainly preoccupied with worldly issues and worshiped Baba. Then comes Dixit who did not want anything except Moksha and Baba helped him to do sadhana and to attain jnana. In the end, the samadhi mandir represents the final stage of salvation that is moksha. Baba wants to advance from one stage to the other. He himself said people might come to him for materialistic gains but later he shows them the real path. 

OM SRI SAI RAM!

Sunday, November 10, 2019

సత్చరిత ఉద్దేశ్యం



హేమద్పంత్ సాయి ఆశీస్సులతో సాయి సత్చరిత గ్రంధానికి శ్రీకారం చుట్టారు. ఆయనకు బాబా ఇలా బోధ చేశారు "నీవు నీ పనిని చేయి. మనసులో ఏ మాత్రం బయపడకు. నా మాటలందు పూర్తీ విశ్వాసముంచు. నా లీలలను రచిస్తే అజ్ఞాన దోషం తొలిగిపోతుంది. భక్తి భావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది. శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతమనే అలలు లేస్తాయి. వానిలో మరల మరల మునకలు వేస్తె జ్ఞాన రత్నాలు లభిస్తాయి" అని చక్కగా చెప్పారు బాబా. 

ఎలాగైతే హేమద్పంత్ గారికి సత్చరిత వ్రాసే కార్యం అప్పచెప్పారో, అలానే ఒక్కో భక్తుడికి ఒక్కో పని అప్పచెప్తారు. మనలో ఉన్న వాసనలను బట్టి మనకు పనులు ఇస్తారు. ఒకరికి మందిర నిర్మాణం, ఒకరికి హరికథా కీర్తనాదులలో నిమగ్నులను చేశారు. మనందరం అర్ధం చేసుకోవాల్సిన విషయం బాబా శిష్యుడుగా ఏమి చేశారు అన్న సత్యం. మనందరం సత్చరితలో చదువుకున్నాము బాబా లాంటి శిష్యుడు వేరెవరు ఉండరు అని. ఎందుకంటే ఆయనకు గురువు తప్పితే వేరే ఆలోచనే లేదు. బాబాకు బయట హాంగులుతో పని లేదు. ఆయనకు కావాల్సినదల్లా ఆయన చూపించిన మార్గంలో నడవడమే.  

ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వారు ప్రక్క దారులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సముద్రంలో ఓడలు సుడిగుండాలలో చిక్కుకుపోకుండా, పెద్ద రాతి బండలు కొట్టుకోకుండా, నిరాటంకంగా సాగిపోవడానికి, అపాయాలను సూచించే ఎర్రటి దీపస్తంభాలను (లైట్ హౌసెస్) నిర్మిస్తారు. ఈ దీపపు స్తంభాలు ఆ నావలు ఓడ్డుకు చేరటానికి ఉపయోగపడ్తాయి. చీకటిలో వాటికి దారి చూపిస్తాయి. 

సాయినాథుని మధురమైన కథలు అమృతం సహితం సిగ్గుపడేలా, దుస్తరం అయిన భవసాగర మార్గాన్ని అతి సులువుగా దాటింపచేస్తాయి. సాయి కథలు ధన్యం. వారి కథలు శ్రవణం ద్వారా హృదయంలోకి ప్రవేశించి శరీరాభిమానాన్ని బయటకు నేట్టివేస్తాయి. సుఖదుఖాలనే ద్వంద్వాలు ఉండవు. సాయి కథలను హృదయంలో భద్రపరుచుకుంటే మనసులోని వికల్పాలు నలు దిక్కులా పారిపోతాయి. బాబా యొక్క నిర్మలమైన యశస్సును వర్ణిస్తే, ప్రేమతో శ్రవణం చేస్తే భక్తుల కల్మషాలు దహించుకు పోతాయి. 

సాయి ప్రేమను ఆవుతో పోల్చారు హేమద్పంత్. ఆవు పొదుగునిండా పాలు ఉన్నా దూడ లేకుండా పాలు ఇవ్వదు. బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది అంటారు. అలానే బాబా మనలను వెన్నంటి కాపాడుతూ ఉంటారు. ఒక రోజు గురు పూర్ణిమ రోజున అణ్ణా చించణీకర్ హేమద్పంత్ ఉద్యోగం లేక బాధల్లో ఉంటే సహాయం చేయమని అర్థిస్తాడు. అప్పుడు బాబా "ఇతనికి ఏదొక ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు మాత్రం నా సేవ చేయనీ. ఇతని పళ్ళాలు ఎప్పుడు నిండి ఉంటాయి. యావజ్జీవం అవి ఖాళీ కావు. భక్తితో నా వాడై ఉంటే ఇతని ఆపదలన్నీ హరింప చేస్తాను" ఇలా అతనికి భరోసా ఇచ్చారు. 

సాయి చరిత్ర మనకు జ్ఞానాన్ని ప్రసాదించి, అహంభావాన్ని నశించేటట్లు చేస్తుంది. అహం నశిస్తే ఆత్మసాక్షాత్కారం కల్గుతుంది. 

 రోహిల్లా కథ ద్వారా .చిత్త సుద్ధి ఎలా సాధించాలో చెప్పారు.  రోహిల్లా అర్ధరాత్రి కూడా "అల్లాహ్ అక్బర్" అని కల్మా చదువుతూ ఉంటే గ్రామస్తులకు ఇబ్బందిగా ఉండేది. వారు ఈ విషయం గురించి బాబాకు చెప్పుకున్నారు. అప్పుడు బాబా ఆతని కేకలు నాకు చాలా సుఖాన్ని ఇస్తాయి. అతడు ఆలా అరవడం చాలామంచిది. లేక పొతే దుష్టురాలైన అతని భార్య నాకు చాలా కష్టాన్ని కలుగచేస్తుంది. అతడు అలసి పోయినప్పుడు అతడే శాంతిస్తాడు అని గ్రామస్తులను ఓదార్చారు. ఇక్కడ నిజంగా ఆ రోహిల్లాకు భార్య లేదు. భగవన్నామ స్మరణ వల్ల మన చిత్తం సుద్ధి అవుతుంది. అలానే సాయి అనే స్మరణ సాయి భక్తులందఱకు మంచిది. 

ఒక రోజు బాబా మధ్యాన్న ఆరతి అయిన తరువాత ఇలా చెప్పారు. మీరెక్కడ ఉన్నా మీ చర్యలన్నీ నేను గమనిస్తూ ఉంటాను. ఇలా తెలిసిన నేను సర్వాంతర్యామినై అందరి హృదయాల్లో ఉండేవాణ్ణి. అంతటా చరించేవాణ్ణి. చరాచర సృష్టిలో ఉన్న అన్ని జీవ రాశులలో నేను ఉన్నాను. సకల ప్రాణులకు తల్లిని. ఇవన్నీ నడిపించే సూత్రధారిని నేనే. నా యందు శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవు. నన్ను మరిచిపోయిన వారిని మాయ కొరడాతో కొడుతుంది. ఈ దృశ్య జగత్తు నా రూపం. అంటే చీమ, క్రిమికీటకం, రాజు పేద స్థావర జంగమాలు అన్ని నా రూపమే అని తన నిజ స్వరూపం గురించి చెప్పారు. 

సమర్ధ సాయి అన్న మంత్రంతో వారి పవిత్ర పాదాలను ధ్యానం చేసే భక్తులకు ముక్తిని ప్రసాదించే ఆ సూత్రధారి చరిత్ర పావనమైనది. సాయి చరిత్ర విన్నా చదివినా వారి చిత్తం సుద్దమవుతుంది అని అధ్యాయం చివరలో చెప్పారు. 

ఓం శ్రీ సాయిరాం!