In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, November 14, 2018

ప్రేమ - అనుబంధం - మోహం



  


భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాదయోగంగా చెప్పారు. ఈ విషాదం ఎక్కడనుంచి వస్తుంది. మనము రోజు చేసే పనులు చాలావరకు వాటంతట అవే జరిగిపోతూవుంటాయి. క్షణాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. కాని అన్ని రోజులు మనవి కావు, ఎక్కడో మనకు ప్రతికూలంగా ఉండేవి జరుగుతాయి. అక్కడే మనకు బాధ, దుఃఖం కలుగుతాయి. ఒక్కోసారి మనవారు అనుకొనే వాళ్ళతోనే సమస్యలు వస్తాయి. ఇవి నిజంగా సమస్యలేనా? లేక ప్రతికూల పరిస్థితులా!

మొదటి అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటో ఇప్పడు చూద్దాము. 

జీవన సమరంలో ప్రేమ, అనుబంధం, మోహం అనే వాటికి అర్ధం తెలుసుకొని, అవి మనలను ఎలా భ్రమలో పడేస్తున్నాయో తెలుసుకోవాలి. 

ఈ అనుబంధం మోహము అవ్వడానికి కారణాలు ఏమిటి ?

ఈ అనుబంధము, మోహము ఎందుకు మనలను భయానికి, కోపానికి, మరియు దుఃఖానికి గురి చేస్తాయి?

మనం సమస్యల్లో ఉన్నప్పుడు, డీలా పడకుండా వాటిని సమయస్ఫూర్తితో ఎలా ఎదుర్కోవాలి?

ప్రేమ: ఇది స్వచ్ఛమైనది. దీనితో ఏ బాధ, దుఃఖం ఉండవు. ఎందుకంటే దీనిలో స్వార్ధం లేదు. ఎవరినుంచి ఏమి ఆశించదు. ఇది పంచేదే కాని, తీసుకొనేది కాదు. ప్రేమను ఇంకొకరినుంచి పొందవచ్చు కాని అది తరువాత ఉండదేమో అనే ఆలోచన ఉంటుంది. 

అనుబంధం: ఇది శరీర పరంగా కాని, మానసికంగా కాని ఏర్పడుతుంది. బిడ్డకు తల్లిగర్భంలో ఉండగానే అనుబంధం, తరువాత ఈ శరీరానికి సంబందించిన వారందరితో అనుబంధం. భార్య బిడ్డలతో అనుబంధం. మనకు ఇష్టమైన వాళ్ళతో అనుబంధం. ఇక్కడ కూడా చాలావరకు సమస్య ఉండదు. మన బాధ్యతలను ఎంత వరుకు నిర్వర్తించాలో అర్ధం చేసుకొంటే దుఃఖం అనేది మన జోలికి రాదు. వీటన్నిటిని మించి మనం మన శరీరంతో అనుబంధం ఏర్పరుచుకొంటాము. నేను అనే భావనను అన్ని అనుబంధాలకన్నా అతీతంగా ఉంచుతాము. నాకు కష్టం కలగనంతవరుకు ఎన్ని సమస్యలకైనా సమాధానం చెప్పగలము. నా వరకు వస్తే అప్పడు మొదలవుతుంది జీవన సమరం. 

మోహం: ఈ జీవన సమరంలో "నేను- నాది" అనే వాటి ఉనికికి ఎప్పుడైతే అడ్డు తగులుతుందో అప్పుడు నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. దీనిలోనుంచే కంగారు, కోపం, భయం, బాధ, ద్వేషం, పగ, నిస్సహాయత, న్యూనత ఇలా ఎన్నో భావాలు వ్యక్తం అవుతాయి. ఇవి ఏర్పడినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాము అన్నదాని మీద  మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే ఈ భావాలే వాసనలై మనలను జన్మ జన్మలకు వేధిస్తాయి. అందుకే అర్జునుడు భగవద్గీత అంతా చెప్పిన తర్వాత "నాకు మోహం తొలిగింది కృష్ణా, ఇక యుద్ధం చేస్తాను" అని చెప్పాడు. 


భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ఇలా ఉంటుంది. 

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సువః !
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ !!

ఇక్కడ ధృతరాష్ట్రుడు మామకాః అనే పదాన్ని వాడాడు. అంటే నా వాళ్ళు, నా కుమారుడి తరుపున యుద్ధం చేసే వాళ్లు. పాండవులు కూడా తన వాళ్ళే కాని వారు తన తమ్ముడు కొడుకులు. శరీర పరంగా అందరితో అనుబంధం ఉంది కాని తన కొడుకుల పట్ల మోహం. ఆయనకు ధర్మం ఏమిటో తెలుసు కాని పుత్ర ప్రేమ అనే మోహం అడ్డుపడింది. యుద్ధంలో తన వారందరూ చనిపోయిన తరువాత తన శరీరంపై తనకు మోహం. అందుకే రాజ్య భోగాలను ఒక పట్టాన వదలివెళ్లలేక పోయాడు. ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది కేవలం నా వారి మీద ప్రేమ కాదు మనలను మోహంలో పడేసేది, నేను - నాది అన్న భావనే మనలను దుఃఖసాగరంలో ముంచేది. 

అర్జునుడు కూడా చాలామందిని ఇదివరకు సంహరించాడు కాని తనవాళ్లను చంపాల్సివచ్చేటప్పడికి, తనకు దుఃఖం కలిగింది. శ్రీకృష్ణులవారు కూడా యుద్ధం చేయడం నీ ధర్మం అని చెప్పి అర్జునినికి నచ్చచెప్పివుండచ్చు. కాని అది మాత్రమే చెపితే అతని మోహం తొలగదు. ఈ మోహానికి మూలమైన శరీర-చిత్త భ్రమ ఏదైతే ఉందొ దాన్ని తొలిగించాలి. అందుకే భగవద్గీత అంతా చెప్పాల్సి వచ్చింది. 

మన సమస్యలకు పరిష్కారం కావాలి అంటే మనమే మారాలి. మన చుట్టూ వుండే ప్రపంచం మారదు. మనం జీవితాన్ని సరైన కోణంలో చూడాలి. పరిస్థితులకు అనుగుణంగా మనమే మారాలి. సత్యంనుంచి దూరంగా వెళ్ళకూడదు. మనకంటే ముందు ఎంతో మంది పుట్టారు కాలంలో కలిసిపోయారు. మనం లేక పోయినా ఈ ప్రపంచం ఆగదు. 

 మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటి?

జీవితంలో వచ్చే సమస్యలలో మన కర్తవ్యం ఏమిటో తెలుసుకొని, ధర్మానుసారంగా మన పని మనం చేయడమే. ఎక్కడ నేను - నాది అన్న మోహం మనలను సందిగ్ధంలో ఎలా పడవేస్తుందో అర్ధం చేసుకోవాలి. అప్పుడే మనకు శాశ్వత సుఖం ప్రాప్తిస్తుంది. 




శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై !

Moha- What can we learn from Arjuna Vishada Yogam?





The first chapter in Bhagavad-Gita is known as Arjuna Vishada Yoga (Arjuna’s despondency). Where is this despondency coming from? Lots of our daily activities go unnoticed. We do not pay attention to them so much and we just do them. Minutes, Days, years pass by without our knowledge. Not everything goes as we planned. Some of the incidents cause painful memories, long lasting impressions and cause sorrow. People around us, situations, and sometimes our loved ones may be the cause of our sorrows. Are they really problems or antagonistic situations?

What we can learn from the first chapter in Bhagavad-Gita?

To understand the meaning of love, Attachment and Delusion in the battlefield of life.

What are the reasons for the Attachment to be transformed to the level of Delusion?

How this so called Attachment and delusion leads to fear, anger and sorrow?

How can we face these difficult situations in life without losing our sanity?


Love: This is the purest of all. Just love itself does not cause sorrow or unhappiness because pure love does not expect anything in return.  Pure love only knows giving. People can feel the love from someone but they are afraid that they might lose this.

Attachment: This happens through our senses or through the mind. Unborn in the womb of a mother already has some kind of attachment before he comes out into this world. After we are born, we are attached to people by relation, friendship, region etc. This attachment also does not pose problem as long as we are bound by our limitations and follow the rules of society. We just need to fulfill our responsibilities. There is another kind of attachment that is more powerful than any of these attachments and is the root cause of all the other attachments. That is the attachment with the body. When we usually talk about ourselves we are talking about the Body. This feeling of “Me and Mine” is kept beyond all the relationships. We can offer all kinds of advice until the problem hits us. Then problem appears to be too big and there begins of battle of life.

Moha (delusion): The real persona comes out when the feeling “Me and mine” is expressed. From this evolves anxiety, anger, fear, jealousy, revenge, helplessness and complacency. Our life will depend on our responses during these special circumstances. These feelings will cause long lasting impressions and they cripple us in this life and future births.  That’s why Arjuna said “Krishna! My moha is removed after listening to your teachings”.  He was then able to participate in the war without any reservations.

The first verse in Bhagavad- Gita goes as follows.

Dharmakshetre Kurukshetre samavetaa yuyutsvah!
Maamakah Pandavaashaiva kimakirvata sanjaya!!

Here Dhrutharashtra used the word “Maamakah” which means his sons, his allies and whoever is representing him in the battlefield. The Pandvas also belong to him and they are his brother’s children. He is related everyone but he has delusional kind of attachment towards his own. He knows that his side is not following the dharma. But he felt Pandavas did not follow the dharma that’s why he said DharmaKshetre – Kurukshetre. He was asking the Sanjaya indirectly, what adharma was done by Pandavas in defeating Bhishma. He was attached to his body after his side lost the war. He could not leave the luxuries of palace life. Here we have to understand that his love towards his side is because of his own infatuation of himself. In a similar way, we all become delusional because of this “Me & Mine” feeling. This in turn creates deeper sorrow and despondency.

Arjuna fought so many wars prior to the battle of Mahabharata. He killed so many out siders in previous wars but when it came to kill his own kith and kin, he was worried about sins. He became despondent all of a sudden. Sri Krishna could have told him to just fight but he had to reveal all the inner secrets of our Upanishads.

If we want to solve our problems we have to learn to change ourselves to the core. The world around us is not going to change but our view of the world has to change. We have to see the world as it is created. Then only we will be closer to the truth.  We should never shy away from the truth. So many came and left in this world but the world never stops.

The fundamental principle that we have to learn in this process:

We have to understand our role in every aspect of our life, every relation, every job, and how much our involvement should be in each interaction. Each interaction needs to be righteous. The so called “Me and Mine” feelings should not trip us into a delusional state. Then only we will realize the ultimate truth that is absolute bliss. 


OM SRI SAMARDHA SAINATH MAHARAJKI JAI!

Wednesday, November 7, 2018

విషాద యోగం



భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయం విషాదంతో ప్రారంభం అవుతుంది. మనం మాములుగా అనుభవించేది విషాదము, కానీ దాన్ని యోగంగా ఎలా మార్చుకోవాలో తెలియచెప్పటమే ఈ అధ్యాయము యొక్క ముఖ్య ఉద్దేశము. చూడటానికి చాలా మామూలు కథ లాగా ఉంటుంది కానీ, లోతుగా పరిశీలిస్తే దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక తత్త్వం మనకు అర్ధం అవుతుంది. మన జీవితానికి మంచి పునాది వేసి మనలను మంచి బాటలో నడిపించడానికి ఉపయోగపడేట్లు చేసేదే ఈ అధ్యాయం. 

ఈ అధ్యాయంలో మొత్తం 47 శ్లోకాలు ఉన్నాయి. మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు యుద్ధ విశేషములను గురించి చెప్పమని సంజయుడిని అడగడంతో ప్రారంభం అవుతుంది. తరువాత దుర్యోధనుడు ద్రోణుని వద్దకు వెళ్లి సేనను గూర్చి మాట్లాడుతూ, యోధుల పేర్లను చెప్పును. అలానే అందరూ వారి వారి శంఖములను పూరించటంతో యుద్ధం ఆరంభము అయినదని గ్రహించిన అర్జునుఁడు తన రధాన్ని ఉభయసేనలమధ్యకు తీసుకు వెళ్ళమని శ్రీకృష్ణుని అర్ధిస్తాడు. అక్కడున్న తన వాళ్ళందరిని చూసి, వీళ్లందరినీ చంపుకొని అనుభవించే ఈ రాజ్యం ఎందుకు ? నన్ను పెంచిన నా పితామహులను, నాకు విద్య నేర్పించిన గురువుని చంపాలా ! అని తన వ్యాకులతను వ్యక్తపరుస్తాడు. యుద్ధం వల్ల జరిగే నష్టాలను చెప్తూ, నేను మరణించవలిసి వచ్చిననూ లేదా త్రిలోకాధిపత్యము వచ్చినను కాని, నేను నా స్వజనాన్ని, ఆచార్యులను చంపుటకు ఒప్పుకోను అని చెప్తాడు. ఇక చివరి శ్లోకాలలో అర్జునుడు ఆయుధాలన్నీ క్రింద పడేసి, రధం వెనుక చతికిలపడిపోయిన విషయం వివరించుచు సంజయుడు అధ్యాయమును ముగించెను.
  

అర్జునుడు గొప్ప వీరుడు. ఎన్నో యుద్ధాలు జయించి అజేయుడుగా నిలిచాడు. రాజసూయ యాగానికి ముందు రాజ్యాలన్నిటిని జయించి చాలా ధనాన్ని తన రాజ్యానికి చేర్చి ధనుంజయడు అనే నామాన్ని ఆర్జించాడు. దేవతలకు సహాయం అవసరం అయినప్పుడు చాలా మంది రాక్షసులను సంహరించాడు. స్వయానా పరమశివుడుతో తలపడ్డ గొప్ప పరాక్రమవంతుడు. ఇంత ధైర్యసాహసాలు కల అర్జునుడు ఇలా ఎందుకు డీలా పడిపోయాడు? తన వారందరితో యుద్ధం చేయాల్సి వచ్చేటప్పటికి తనలో ఈ వ్యాకులత మొదలయ్యింది. ఏ విషయమైనా మన దాకా వస్తే కానీ దాని యొక్క తీవ్రత మనకు అర్ధం కాదు. ఎవరో ఎక్కడో చనిపోతే, అయ్యో పాపం అని అనుకోని మన పనులలో మనం నిమగ్నమవుతాము. కాని అదే మన జీవితంలో మనమే ఈ అనుభవం ఎదుర్కోవాలి వస్తే తల్లక్రిందులైపోతాము. ఇక్కడ అర్జునిని పరిస్థితి కూడా ఇదే. ఇంతకు ముందు చాలా మందిని అర్జునుడు సంహరించాడు, తన వాళ్ళతో యుద్ధం చేస్తే, తనకు పాపమని, కుల నాశనం జరుగుతుంది అని బాధపడ్డాడు. 
  
అర్జునిని విషాదము యోగం ఎలా అయింది. ఎందుకు అంటే తన బాధను సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణుని వద్ద వ్యక్త పరిచాడు. మన బాధను ఒక పరిపూర్ణ జ్ఞానవంతుడైన గురువు దగ్గర చెప్పుకుంటే అదే విషాద యోగం అవుతుంది. శ్రీకృష్ణుని మించిన పరమ గురువు ఎవరు ఉంటారు. అందుకే ఈ విషాదంలోనుంచి ఒక జ్ఞానరాజం వెలువడింది. అలానే వాల్మీకిమహర్షికి కూడా విషాదంలోనుంచి ఒక అద్భుత కావ్యం వచ్చింది.  ఒక క్రౌంచ పక్షి బాణం తగిలి తన ఎదురుగా చనిపోయిన తరువాత, దానితో ఉన్న జంట పక్షి కూడా ప్రాణాలు వదిలివేస్తుంది. అప్పుడు అయన నోట్లోనుంచి అప్రయత్నంగా ఒక శ్లోకం వెలువడింది. 

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥

ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు. ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి. 
.తన భావనలో వెల్లుబికిన విషాదంలోనుంచి వచ్చిన  కావ్యమే శ్రీమద్రామాయణము. ఆ శ్లోకమే మొట్టమొదటి శ్లోకంగా చెప్పబడింది. అందుకే వాల్మీకి ఆదికవి అయ్యారు. 
శ్రీ సాయి సత్చరిత కూడా ఒక రకమైన సంఘర్షణతోనే మొదలు పెట్టారు. బాబా కలరా జాడ్యాన్ని తరమడానికి తిరగలిలో గోధుమ పిండిని తీస్తారు. తిరుగలిలో ఉన్న రెండు రాళ్ళే జీవన సమరం. ఈ సమరంలో మనం నలిగిపోతూ ఉంటాము. దీనిలోనుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించము.

ఈ అధ్యాయము నుంచి మనము మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో నేర్చుకోవచ్చు. ఈ శ్లోకాలలో ఉన్న మానసిక సంఘర్షణ ఏమిటో తెలుసుకోవాలి. ఈ సంఘర్షణను ఒక యోగంగా ఎలా మార్చుకోవాలో కూడా నేర్చుకోవచ్చు. 
 .



 శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ! 

Vishaada Yogam


Bhagavad-Gita starts with Arjuna's despair. The first chapter is called as Arjuna's Grief. we also go through lot of grief everyday in our life. But we have to learn to make this grief as "YOGA". This is the essence of this chapter. To read the chapter, it feels like a regular story just before the war. But if we keenly observe we can learn the deeper meanings of this amazing scripture. This will provide us the essential elements that are required for human existence.

This chapter has 47 verses. The chapter starts when King Dhrutarashtra asks Sanjaya to provide the details of the war. Duryodhana goes to Great Guru Drona and describes the the greatness of army and the names of great warriors. Then all of them were blowing their conchs (sankh) and Arjuna realizes that the war is about to start, asks Srikrishna to take him to the middle of the two armies. He then sees the forces on  both sides and realizes that everyone there belong 

to his clan one way or the other. How can he kill own Great grandfather? How can he kill his own teacher who gave everything to him and loved him equal to or more than his own son? How can I kill my own brothers? Even if I win this war, what good is this win? How horrible are the consequences of war? So many people will die. So many ladies will be without husbands and so many children are going to be without fathers. He says "I do not care even if I die, but I do not want to kill all these people". he drops all his fighting gear and sits in the back of his chariot. Sanjaya concludes this chapter by telling all these details.  

Arjuna is a great warrior. He won so many battles and came out as unbeaten hero. When Dharmaraja wanted to do Raajasuya Yaaga, Arjuna alone defeated so many kingdoms, brought all the wealth to his brother, there by getting the name Dhanunjaya. He even helped the Devatas (Demi Gods) to defeat the Demons. He is so great that he even fought against Parama Siva himself. This great of a warrior when it came to his own people, he felt different. He was in dilemma. Usually if anyone has a difficulty, we feel pity for a little while and move on. When something happens to our own family, whole world falls apart. All the walls crumble. We feel like the ordeal will never end.  Same thing happened to Arjuna also. He killed so many people before but now he feels different and tells Lord Krishna that the war is detrimental, so many will die. 


How Arjuna's grief became Yoga? Because he is expressing his frustration in front of Lord himself who is a Great Guru. That is why this despair became Yoga. There is none other than Sri Krishna who can understand this dilemma of life better. From this grief came a beautiful and complete Bhagavad- Gita.  The great Valmiki before he started the epic Ramayana experienced a strong feeling when two birds died in front of him. He immediately says the following sloka.

mā niṣāda pratiṣṭhā tvamagamaḥ śāśvatīḥ samāḥ! 
yat krauñcamithunādekam avadhīḥ kāmamohitam!! 

You will find no rest for the long years of Eternity For you killed a bird in love and unsuspecting!!  This happened to be the first sloka and he is known as Adikavi (first poet) and later Ramayana emerged. 

Sri Sai Satcharita also was started with some kind of tragedy that is Cholera killing people in Shirdi. Baba used Hand Mill to grind wheat so that he can hold the cholera in the out skirts of Shirdi. There are two stones in the hand mill representing the battlefield of life and we are in the mist of this. We never try to come out of this so called Life's grind. So let us see what we can learn from Bhagavad-Gita and how we can change our lives. We have to us this knowledge to change every thing we do to Yoga.


OM SRI SAMARDHA SAINATH MAHARAJ KI JAI!

Wednesday, October 31, 2018

భగవద్గీత - సుగీత




ఓం పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం 
వ్యాసేన గ్రథితామ్ పురాణ మునినా మధ్యే మహాభారతం !
 అద్వైతామృత వర్షిణీమ్ భగవతీమష్టాదశాధ్యాయినీమ్ 
అమ్బ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం !!

 భగవంతుడే స్వయంగా చెప్పిన శాస్త్రమే భగవద్గీత. సర్వ మానవాళిని ఈ భవసాగరంనుంచి రక్షించడానికి శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునిని అడ్డుగా పెట్టుకొని భగవద్గీతను చెప్తే, దాన్ని వ్యాస భగవానుడు గ్రంధస్తం చేయడం జరిగింది. ఈ గీత పద్దెనిమిది అధ్యాయాలతో సర్వ ఉపనిషత్తుల సారాన్ని మనకు అందించిన ఏకైక శాస్త్రము. భగవంతుడు ఒక్కడే అని, ఉన్నదంతా ఆ విరాట్ స్వరూపమే అని, ఆ అధ్బుత చైతన్యమే మనమని తెలియచెప్పే శాస్త్రమే భగవద్గీత. 

సాయినాథుడు షిర్డీవాసుడై, జ్ఞానేశ్వరీ అని పిలవబడే ఈ భగవద్గీతను కేవలం చదవడమే కాకుండా, దాన్ని మన జీవితంలో ఎలా అవలంబించాలో చేసి చూపించిన పరమ గురువు. ఆ పరమ గురువు ఆశీస్సులతో మన మందరము ఈ భగవద్గీతను అనుసరించడానికి ప్రయత్నిద్దాము. 

"సర్వ శాస్త్రమయీ గీతా" అని మహాభారతంలో చెప్పడం జరిగింది. ఈ గీతనే సుగీతా అన్నారు. మనకు జీవన విధానాన్ని, జీవన లక్ష్యాన్ని, దాన్ని చేరుకొనే మార్గాన్ని చూపించిన అద్భుతమైన శాస్త్రము. ప్రతిఒక్కరు గీతను విని, అర్ధం చేసుకొంటె వేరే శాస్త్రాల అవసరమే లేదు. శ్రీ మహా విష్ణువే స్వయంగా వరాహ పురాణంలో ఇలా చెప్పారు. నేను గీతను ఆశ్రయించి ఉంటాను. గీతయే నా నివాసము. పాలనకర్తగా పాలించుటకు నాకు ఉపయోగపడే సాధనమే గీతా జ్ఞానము అని చెప్పారు. 

మహాభారతము పద్దెనిమిది పర్వాలతో పంచమవేదంగా పిలవబడుతుంది. అలానే భగవద్గీత కూడా పద్దెనిమిది అధ్యాయాలతో మనకు అందించటం జరిగింది. వేదాలకు చివరిభాగంలో ఉన్న ఉపనిషత్తుల సారమంతా రంగరించి శ్రీకృష్ణ భగవానుడు గీత రూపంలో ఇచ్చి మనలను కరుణించారు. మహానుభావులు ఎందరో ఈ గ్రంథరాజానికి భాష్యం వ్రాసి మనకు అర్ధం అయ్యేలా చేశారు. వారందరూ చూపిన మార్గంలో మనం కూడా ప్రయాణిద్దాము. ఈ ప్రయాణంలో వారందరి ఆశీస్సులు మనపై ఉండాలని ప్రార్థిద్దాము. 

మహాభారతం నుంచి చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉంటాయి. భారతంలో లేనిదంటూ ఏమీ లేదని మన పెద్దలు చెప్తారు. భారతంలో ధర్మానికి పెద్దపీట వేశారు. భీష్మ, ద్రోణ, కర్ణులు వారికి తెలిసిన ధర్మాన్ని వారు పాటించారు. వారిలో చాలా గొప్ప గుణాలు ఉన్నాయి. కానీ వారు అధర్మాన్ని ఆశ్రయించారు. అలానే మనం కూడా ధర్మంగానే బతుకుతున్నాము అని అనుకుంటాము. నేనెవరికి అన్యాయం చేయడం లేదు, ఒకరి సొమ్ము తినడం లేదు. కాబట్టి నేను న్యాయంగానే బతుకుతున్నాను అని మనం అనుకోవచ్చు. కాని మనమెందుకు సుఖ దుఃఖాలతో సతమతం అవుతున్నాము. జీవితంలో ఈ ఒడిదుడుకులను ఒక్కోసారి తట్టుకోలేక పోతున్నాము అంటే మనం ఇంకా తెలుసుకోవాల్సినదేదో ఉంది అని అర్ధం చేసుకోవాలి. మనం నిజాన్ని అర్ధం చేసుకొంటే కాని ఈ ద్వంద్వాలను మనం సంయమనంతో ఎదుర్కోగలుగుతాము. 

మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. పదోరోజు భీష్ముల వారు పడటం జరిగింది. అప్పడు సంజయుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి ఈ విషయం చెప్పగా, అప్పటి దాకా జరిగిన యుద్ధం అంతా విపులంగా చెప్పమని ధృతరాష్ట్రుడు కోరడం జరిగింది. అలా భగవద్గీత శ్లోకం మొదలవుతుంది. మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని మూడు షడ్గాలుగా విభజిస్తే, మొదటి ఆరు అధ్యాయాలు కర్మ యోగంగా, తరువాత ఆరు భక్తి యోగంగా, చివరి ఆరు అధ్యాయాలు జ్ఞాన యోగంగా చెప్తారు. వేదాలలో కర్మ కాండ, ఉపాసనా కాండ మరియు జ్ఞాన కాండ అనే మూడు భాగాలు ఉన్నాయి. జీవితంలో సర్వ కర్మలు ఆచరించినా, ఎంత ఉపాసన చేసినా, మానవుడు సరియైన జ్ఞానం లేకుండా తన గమ్యాన్ని చేరుకోలేడు. ఈ జ్ఞానమే యోగం అంటారు. 

యోగం అంటే కలయిక అనే అర్ధం ఉంది. మనం ఎక్కడనుంచి వచ్చామో, ఈ సంసారమనే భవ బంధంలో మనం ఎలా ఇరుక్కు పోయామో, మనకు మనంగా ఎలా మిగిలిపోతామో తెలుసుకొనే జ్ఞానమే ఈ భగవద్గీత. అందుకే కర్మను కర్మ యోగంగా, భక్తిని భక్తి యోగంగా మార్చుకోవాలి. ఈ జ్ఞానాన్ని తెలుసుకొని, అనుసరించి, అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు అది జ్ఞాన యోగం అవుతుంది. 

ఇవన్ని ఆచరించడానికి మనకు అడ్డుపడే పరిస్థితులనుంచి, గుణాలనుంచి ఎలా తప్పించుకొని ముందుకు సాగాలో తెలిపే జ్ఞానమే గీతా జ్ఞానము. మనందరిని ఒక గీతలో నడిపించేదే ఈ సుగీత. 



                                                         శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ! 

Importance of Bhagavadgita




Om Paarthaya pratibodhitaam Bhagavatha narayanena swayam
Vyasena gradhitaam puraana muninaa madhye Mahabharatam!
Advaitaamruta varshineem Bhagavathee ashtadasaa adyaayineem.
Amba twamanusandadhaami Bhagavadgeete bhavadwashineem !!

This verse is from Gita dyana. The Lord himself gave Bhagavad-Gita. Arjuna was just a pretext and through him the entire mankind benefited when Lord Krishna gave Bhagavadgita to rescue people from daily mundane life, conflicts of everyday life, and to motivate people to reach their destination that is self-realization. This was given in 18 chapters and Vyasa compiled this beautifully. Lord Krishna showed Arjuna the universal secret and how to reach that highest state by sadhana. The universal soul (Paramatma) is the only one that exists and we are all part of that and understanding this Paramaatma is the main goal of teachings of Bhagavad-Gita.  

Sri Shirdi Sai reiterated the concepts of Bhagavad-Gita by living not just by preaching.  He showed us how to maneuver this conflict ridden life. He also showed the means to have a balanced life even in the mist of conflict. So we surrender to our Samardha Sadguru Sri Sainath Maharaj, so that we can get his blessings to understand the real meaning of this great scripture and incorporate into our daily life.

The great epic Mahabharata praises Bhagavad-Gita as “Sarva Saasthramayi Geeta”. Truly this is a masterpiece and is the essence of all Upanishads.  This teaches the discipline that we all need in our life so that all our ducks are in a row. That’s why the saying goes as “Gita Sugita”. The Bhagavad-Gita teaches us the way of life, goal of life and how to reach that goal. If we adopt this great scripture as our guide we do not need anything else in our lives. In Varaaha Purana, Lord Maha Vishnu says “Gita is my abode, I depend on this, and this helps me with my job as preserver of all the worlds”. What other words do we need to praise the greatness of this incredible Scripture.

Mahabharata is also called as Panchama Veda” that is 5th veda. Lord Krishna elegantly crafted the essence of all the Upanishads in the form of Bhagavad-Gita so that we do not have to scramble for the ultimate knowledge. Mahabharata has 18 Parvas (chapters) and Bhagavadgita is also compiled in 18 chapters.  This came directly from the Lord himself. So many great minds wrote the commentary on Bhagavad-Gita so that we can understand the meaning. They paved the way for us and we will continue to travel in the similar path which is time tested. We will pray to all those great souls to give us the strength, endurance and give us their blessings. 

Great Scholars say that there is nothing that you cannot find in Mahabharata. Everything is available in Mahabharata. Righteousness was given a major role in the epic. Bhishma, Drona and Karna followed the Dharma to the best of their ability. They tried to be righteous in their own way.  Unfortunately they were on the wrong side of the equation. They were assisting ADHARMA (Unrighteousness) and this got him in trouble. In a similar way lot of people think that they are living better and they are good people. We do not harm anyone, we do not expect from other people and we try to live as righteously as possible. So what’s wrong in this? But question is why do we suffer still? We are crippled sometimes with opposites of life. We face conflict in our life constantly. Is this good or bad for me? Is this the right thing to do or not? To choose between two good things also creates conflict. We are totally disabled at times with these issues. That means we are not perfect or not in balance with the nature. We are not in balance with our surroundings. We have to know more about this life and we cannot blindly follow other people who also do not have a clue about this life. We can face these difficulties or pairs of life with patience only with right knowledge. So this right knowledge is given to us through Bhagavad-Gita.

The Mahabharata war took place for 18 days and on the 10th day the great Bhisma fell to the ground. Then Sanjaya came back from Kurukshetra to King Dhrutharaashtra in Hastinapura to convey the bad news. That really depressed the King but he had some hope left. So he wanted to know the whole story of war from the beginning. This is how Bhagavad-Gita started and there are close to 700 verses in this great scripture. The whole scripture can be divided into three segments. First 6 chapters were described as Karma Yoga, next 6 as Bhakti Yoga and last 6 chapters as Jnana yoga. Vedas can be roughly told as Karma Kanda, Upaasana Kanda and Jnana Kanda. No matter how much we are good at performing the ritualistic karmas and pujas without Jnana (knowledge) we cannot attain the salvation. This knowledge is called as Yogam.

Yogam means the merge with the absolute. How did we take birth? Where did we come from? Why we got caught up in this birth death cycle? How do we get out of this? All these questions are answered with clarity in Bhagavad-Gita.


Bhagavad-Gita helps us to navigate the conflict ridden ocean of life. It teaches us to convert regular action to karma yoga, regular devotion to Bhakti Yoga. Then we develop proper intellect so that we become eligible to attain the knowledge that is Jnana. When we do sadhana with right Jnana then we will experience the truth. This sadhana is then called Jnana Yoga. But there are so many obstacles in the path. In the last chapters of Bhagavad-Gita we learn how to untangle ourselves from these so called Gunas (qualities), characters, and vasanas (impressions). Such is the greatness of this gospel of God.  



 OM SRI SAMARDHA SAINATH MAHARAJ KI JAI!

Wednesday, October 24, 2018

సాయి పుణ్యతిధి - మహాసమాధి





బాబా శరీరాన్ని వదిలే ముందు కొన్ని సూచనలు ఇచ్చారు. మనం ఇంతకూ ముందు అధ్యాయంలో విజయదశమి రోజున బాబా మహాసమాధి చెందారు అని చెప్పుకున్నాము. మహాసమాధికి కొన్ని రోజుల ముందు వజే అనే ఆయన చేత బాబా రామ విజయం అనే గ్రంధాన్ని చదివించుకున్నారు. మొట్టమొదట వజే ఏడు రోజుల్లో పారాయణం పూర్తి చేస్తారు. రెండో సారి రాత్రిపగలు చదివి రెండవ పారాయణం పూర్తి చేస్తారు. మరల బాబా మూడో సారి చదవమంటారు. తాను మూడు రోజులు చదివి అలసిపోతాడు. అప్పుడు బాబా అతనికి సెలవిచ్చి పంపుతారు. ఎవరైనా మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారి వారి మత గ్రంధాలు చదవడం ఆనవాయితి. అలానే శుక బ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు ఏడు రోజులలో భాగవతం చెప్పి ఆయనను అనుగ్రహించారు. బాబా పరమాత్మ అయినా సంప్రదాయాన్ని అనుసరించి రామవిజయ పారాయణ చేయించారు.
  
బాబా చివరిక్షణం వరకు భక్తులకు సలహాలు ఇస్తూ ధైర్యం చెప్పారు. రెండు మూడు రోజుల ముందు భిక్షకు వెళ్లడం మానేశారు. కాకాసాహెబు దీక్షిత్ మరియు శ్రీమాన్ బూటీ గారు ద్వారకామాయిలోనే భోజనం చేసేవారు. అక్టోబర్ 15 1918 రోజున వారిని బాబా వాడాకు వెళ్లి భోజనం చేయమని ఆజ్ఞాపిస్తారు. అక్కడ ఇంకా లక్ష్మి బాయి, భాగోజి షిండే, భయ్యాజీ, బాలా షిమ్పే మరియు నానాసాహెబ్ నిమోన్కర్ ఉంటారు. శ్యామా మెట్లమీద కూర్చొని ఉంటారు. లక్ష్మి బాయికి తొమ్మిది నాణాలు ఇచ్చిన తరువాత బాబా ఇలా అంటారు " మసీదులో తనకు బాగాలేదని, తనను రాతితో కట్టిన బూటీ మేడలోకి తీసుకుపోయిన బాగుండునని చెప్పారు. ఇలా అంటూ భయ్యాజీ మీదకు ఒరిగి ప్రాణములను విడుస్తారు. భాగోజి ఈ విషయం నిమోన్కర్కు చెప్పగా, ఆయన బాబా నోటిలో కొంచెం నీరు పోస్తే అది కాస్తా బయటకు కారిపోతుంది. అప్పుడు ఆయన దేవా! అనగా బాబా మెల్లగా "ఆ" అంటారు. ఇక తరువాత తమ భౌతిక శరీరం వదిలివేస్తారు. 

షిర్డీ అంతా బాబా మహాసమాధి చెందిన వార్త పాకి అందరు అక్కడకు వస్తారు. అందరిలో తరువాత కార్యక్రమం మీద, ఎలా సమాధి చేయాలి అనే అంశం మీద చర్చ జరిగింది. ముస్లిం భక్తులు బాబా శరీరాన్ని ఆరుబయట సమాధి చేసి గోరి కట్టాలి అని నిర్ణయించారు. కాని రామచంద్ర పాటిల్ మిగిలిన గ్రామస్థులందరితో కలిసి బాబా కోరిన విధంగా బూటీ వాడాలో ఉంచాలి అని తీర్మానించారు. ఈ రెండువాదనల ఎటు తేలక పొతే అందరిలో కలవరం మొదలయ్యింది. అప్పుడు రహాతానుండి సబ్ ఇన్స్పెక్టర్, కోపర్గావ్ నుండి మామల్తదార్ మరియు కొందరు అధికారులు వస్తారు. వారు ఎన్నిక జరగాలి అని నిశ్చయించితే ఎక్కువ ఓట్లు బాబా కోరిన దాన్నే బలపరుస్తాయి. అప్పుడు బూటీ వాడాలో ఎక్కడైతే మురళీధరుని ఉంచాలి అనుకున్నారో అదే స్థానంలో బాబా శరీరాన్ని ఉంచుతారు. ఇక్కడ నార్కే గారు ఒక్క  విషయం చెప్పారు. బాబా శరీరం 36 గంటల తరువాత కూడా ఏమి పాడవకుండా ఉంది. ఆయన కఫినీని చింపకుండా తీయగలిగారు. బాలాసాహెబ్ భాటే, ఉపాసినీ బాబా కలిసి జరగవలిసిన కార్యక్రమాలు దగ్గర ఉండి పూర్తి చేస్తారు. 

బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు బాబా ఎప్పుడు తన దగ్గరే ఉంచుకొని అపురూపంగా చూసుకునే ఇటకరాయి రెండు ముక్కలు అవుతుంది. మసీదును సుబ్రపరిచే ఒక కుర్రవాడు పొరపాటున ఆ ఇటకరాయిని శుభ్రం చేస్తూ క్రింద పడవేస్తాడు. అప్పుడు అది రెండు ముక్కలు అవుతుంది. బాబా వచ్చి ఈ విషయం తెలుసుకొని ఇలా అంటారు. ఇది ఇటుక కాదు. నా యదృష్టమే ముక్కలు అయిపోయినది. అది నా జీవితపు తోడూనీడ. దాని సహాయం వలననే నేను ఆత్మానుసంధానము చేసేవాడిని. ఈ రోజు అది నన్ను విడిచినది అని అంటారు. ఈ ఇటుకపై బాబాకు ఇంత ప్రేమా అని మనం అనుకోవచ్చు. కాని దీని విషయం బాబాకే తెలియాలి. వారు సుద్ద చైతన్యులు. వారికి ఈ అశాశ్వతమైన వాటి మీద మమకారం ఉండదు. ఈ ఇటుక గురు భక్తికి ప్రతీకగా కొందరు చెప్తారు.  జీవన్ముక్తులకు ఇలా ప్రాపంచిక పరంగా అందరిలాగా భౌతిక పరంగా ఆలంబన ఉండదు. కాని అందరిలాగా వారు ప్రవర్తించవచ్చు. 


బాబా మూడురోజుల సమాధి
సాయిబాబా శరీరాన్ని వదలడానికి ముప్పై రెండు సంవత్సరాలకు పూర్వమే వారి సమాధి అయిపోయి ఉండేది. కాని మహల్సాపతి యొక్క బుద్ధి చాతుర్యం వలన ఆ దురదృష్ట సంఘటన ఆగింది. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు బాబా ఆయాసంతో అస్వస్థులయ్యారు. శరీరధర్మాన్ని సహించటానికి ప్రాణాలను బ్రహ్మాండంలో చేర్చారు. మసీదులోని సభా మండపంలో ఒక మూలన ఉన్న స్థలాన్ని వ్రేలితో చూపించి అక్కడ నా సమాధి కోసం త్రవ్వి ఆ స్థలంలో నన్ను ఉంచండి. మహల్సాపతితో మూడురోజుల వరకూ నన్ను వదలకుండా జాగ్రత్తగా చూడు అని స్పష్టంగా చెప్పారు.

            "నా సమాధి పై రెండు జండాలు ఉంచండి" అని చెప్పుతూ బాబా తమ ప్రాణాలను సహస్రారంలో నిలిపారు. ఆకస్మాత్తుగా తల తిరిగి పడినట్లు  నిశ్చేష్టగా పడిపోతే వారు క్రింద పడకుండా మహల్సాపతి తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. రాత్రి పది గంటల సమయంలో ఆ విధంగా జరిగితే, అందరికి నోట మాట రాలేదు. బాబా
యొక్క శ్వాసకాని, నాడికాని ఆడటంలేదు. బాబా ప్రాణాలు వదిలివేసినట్లే అనిపించింది. జనులకు ఆ పరిస్థితి భయంకరంగా ఉంది. కాని సాయి మాత్రం సుఖంగా ఉన్నారు. మహల్సాపతి అతిజాగరుతతో అహర్నిశలూ సావధానంగా సాయిని జపిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నారు. సమాధిని  త్రవ్వడానికి సాయి స్వయంగా ఆజ్ఞాపించినా అలా చేయటానికి ఎవరికి ధ్యైర్యం చాలలేదు. బాబా సమాధి స్థితిలో ఉండటం చూసి, గ్రామ ప్రజలందరూ అక్కడ చేరి ఆశ్చర్యంగా చూడసాగారు.

            మహల్సాపతి మాత్రం బాబా తలను ఒడి నుంచి క్రిందకు దించలేదు. ప్రాణాలు పోయాయని తెలుసు కాని, ఒక్కసారిగా భక్తుల గుండెలు అవిసిపోతాయని "మూడు రోజులు ఉంచండి" అని బాబా లోకులను మభ్యపెట్టారు అని భక్తులు అనుకున్నారు. బాబా శ్వాస ఉచ్వాసలు ఆగిపోయాయి. వారి ఇంద్రియాలన్ని చలన రహితమయ్యాయి. ఏదీ కదిలే సూచన లేదు. శరీరంలోని వేడి కూడా మందగించింది. బాహ్య వ్యవహారాల స్పృహ అసలులేదు. వాక్కు ధృడ మౌనం వహించినట్లుంది. మరల ఎలా స్పృహకు వస్తారు అని అందరికి చింత పట్టుకుంది. రెండు రోజులు గడిచిపోయినా బాబాకు స్పృహరాలేదు, మౌల్విముల్లా ఫకీరులు వచ్చి ఇక మీదట ఏం చేయాలని ఆలోచించసాగారు. అప్పాకులకర్ణి, కాశీరాం వచ్చి బాగా ఆలోచించి, బాబా తన ధామానికి చేరుకున్నారు. కనుక వారి శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి అని నిశ్చయించారు. అయితే ఇంత తొందర పనికిరాదు. కొంతసేపు ఆగటం మంచిది. బాబా ఇతరుల వలె కాదు. వారిమాట తిరుగులేనిది అని కొందరు అన్నారు. వెంటనే మిగతా వారు శరీరం చల్లబడిపోయింది, ఇక ఎక్కడి నుండి చైతన్యం వస్తుంది? అంతా ఎంత తెలివిలేనివారు అని అన్నారు. వారిని సరియైన వేళలో సమాధి చేయడానికి వారు చూపించిన స్థలంలో త్రవ్వండి. భక్తులందరిని పిలవండి, అన్నీ సిద్ధపరచండి అని అలా చర్చించు కుంటూనే మూడు రోజులు గడిచిపోయాయి.

            తరువాత మూడు గంటల ప్రాంతంలో బాబాలో చైతన్యం కలిగింది. మెల్లమెల్లగా బాబాకు స్పృహ వచ్చింది. శరీరం కదిలింది. శ్వాస ఉచ్వాసలు మొదలయ్యాయి. పొట్టకూడా కదల సాగింది. బాబా వదనం ప్రసన్నంగా కనిపించింది. వారి కళ్ళు తెరుచుకున్నాయి. మహల్సాపతి బాబా ముఖాన్ని సంతోషంగా చూచాడు. సాయిబాబా కూడా తలను ఆడించారు. మౌల్వీలు ఫకీరుల ముఖాలు పాలిపోయాయి. భయంకరమైన సంఘటన తొలగిపోయింది. మౌల్వీ యొక్క బలవంతానికి మహల్సాపతి బాబా ఆజ్ఞను పాలించకుండా, తన నిర్ణయాన్ని ఏ కాస్త సడలించి ఉన్న కఠిన పరిస్థితి ఏర్పడేది. 1886 నుంచి 1918 వరకు బాబా నిరవధికంగా ఎంతో మంది భక్తులను సంరక్షించడం జరిగింది. 

తరువాత జోగ్ గారిని బాబా ఎలా అనుగ్రహించారో హేమద్పంత్ గారు చెప్పారు. మేఘా మరణం తరువాత  బాపుసాహెబ్ జోగ్ మసీదులోను మరియు చావడిలోనూ బాబా మహాసమాధి చెందేవరకు ఆరతులు ఇచ్చేవారు. ఆయన 1909 లో ఉద్యోగవిరమణ చేసి భార్యతో సహా వచ్చి బాబాకు సేవ చేసుకున్నారు. ఆయనకు పిల్లలు లేరు. ఆయనకు జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతం చదివి వచ్చిన వారందరికీ బోధించేవారు. ఇలా ఈనో సంవత్సరాలు బాబా సేవలో ఉన్నా తనకు ఇంకా తనకు శాశ్వత శాంతి కలగడం లేదు అని బాబా దగ్గర బాధ పడతాడు. అప్పుడు బాబా ఆయనను ఓదార్చి నీ పాపపుణ్యములు త్వరలోనే భస్మం అవుతాయి అని, త్వరలోనే సన్యాసం పుచ్చుకొని గమ్యం చేరుకుంటావని చెప్తారు. అలానే కొన్ని రోజులకి తన భార్యకూడా కాలం చేస్తుంది. అప్పుడు జోగ్ ధ్యానపరుడై, సాధన పరిణితి చెంది జీవితపరమావధిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. 

ఈ అధ్యాయంలో బాబా యొక్క మధుర వాక్కులను పొందుపరచడం జరిగింది. 
ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తు అంతయూ వానికి శూన్యము. నా కథలు తప్ప మరెమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేస్తూ ఉంటాడు. 

ఎవరైతే నాకు సమర్పించకుండా ఏమియు తినరో అట్టివారిపై నేను ఆధారపడి ఉంటాను. 

ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణగ్రస్తుడను. వారికి మోక్షమునిచ్చి వారి ఋణం తీర్చుకుందును. 

అలానే బాబా "నేను" అనగా ఎవ్వరో కూడా వివరించి చెప్పారు. నన్ను వెదకుటకు ఎక్కడకు పోనక్కరలేదు. నీ నామము ఆకారము విడిచినచో నీ లోనే కాక సర్వ జీవులలో నన్నే చూచెదవు. దీనిని అభ్యసించినచో సర్వవ్యాపకత్వము అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. అంతరాత్మ నీవేనని గ్రహించెదవు. 

ఇలా బాబా యొక్క అనుగ్రహ వాక్యాలతో హేమద్పంత్ గారు బాబా మహాసమాధికి సంబంధించిన అధ్యాయాలు పూర్తి చేశారు. 

ఓం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు!