In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Sunday, November 22, 2020

భగవద్గీత 5. 2- కర్మ యోగము - కర్మ సన్యాస యోగము




అర్జునుడు 5వ అధ్యాయం మొదటలో కర్మ యోగము మరియు కర్మ సన్యాస యోగములలో తనకు ఏది శ్రేయస్కరమో చెప్పమని శ్రీ కృష్ణుని అర్ధించాడు. దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు కర్మ యోగమే అర్జునుడికి మంచిది అని బోధ చేశారు. ఈ రెండు దారులు కల్యాణదాయకములే అని చెపుతూ కర్మ యోగము అభ్యాస యోగ్యమైనదని అందుకే అది శ్రేయస్కరమని చెప్పడం జరిగింది.

శ్రీ భగవానువాచ ! 

సన్యాసః కర్మయోగశ్చ  నిశ్శ్రేయసకరావుభౌ !

తయోస్తు కర్మసన్న్యాసాత్  కర్మ యోగో విశిష్యతే !!

కర్మ సన్యాసము, కర్మ యోగము అను ఈ రెండును పరమ కల్యాణదాయకములే. కాని ఈ రెండింటిలోను కర్మ సన్యాసము కంటే కర్మ యోగము సాధన యందు సుగమ మగుట వలన శ్రేష్టమైనది.  


మనకు ఈ రెండు దారులలో ఏది ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి అంటే ఈ రెండిటి మధ్య బేధాలు తెలుసుకోవాలి. ఆ బేధాలను అర్ధం చేసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో అర్ధం అవుతుంది.

 

కర్మ యోగి సాధన సమయమున కర్మలు, కర్మఫలములు, పరమాత్మ, తానూ వేర్వేరని భావించి, కర్మ ఫలమందు ఆసక్తిని త్యజించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయును. 

 

కర్మ సన్యాస యోగి (సాంఖ్య యోగి- ఇక్కడ సాంఖ్యం అంటే జ్ఞానం అని అర్ధం) మాయ వల్ల ఉత్పన్నమైన గుణముల వల్ల మనస్సు ఇంద్రియాలు, శరీరం ద్వారా జరిగే క్రియలన్నిటియందు కర్తృత్వం వదిలి కేవలం సర్వవ్యాపి, సచ్చిదానంద పరమాత్మ యందె భావస్థితుడై ఉండును. ఇక్కడ కర్మ సన్యాస యోగి కర్మలు చేస్తున్నాడు అని కూడా అనలేము. 

 

కర్మ యోగి తన కర్మలకు తననే కర్తగా భావించును. 

సాంఖ్య యోగి తనను కర్తగా భావించడు. 

 

కర్మ యోగి తన కర్మలను భగవంతునకు అర్పణ చేయును. 

సాంఖ్య యోగి మనస్సు, ఇంద్రియముల ద్వారా జరిగే అహంకార రహిత క్రియలను కర్మలుగా భావించడు. 

కర్మ యోగి పరమాత్మను తనకంటే వేరుగా భావించును.

సాంఖ్య యోగి సర్వదా పరమాత్మ యెడ అబేధ భావముతో ఉండును. 

 

కర్మ యోగి ప్రకృతిని, ప్రకృతి యందలి పదార్థముల ఉనికిని అంగీకరించును. 

సాంఖ్య యోగి బ్రహ్మము తప్ప వేరే ఉనికిని చూడజాలడు. 

 

కాని రెండు దారులు చివరకు ఒకటే చోటకు చేరతాయి. అంటే కర్మ యోగి కూడా చివరకు కర్మ సన్యాస యోగి అవుతాడు. కాని రజో తమో గుణాలపై పట్టు సాధించాలి అంటే కర్మ యోగము తప్పదు. చివరకు సత్వ గుణం కూడా వదిలితే కాని కర్మ సన్యాస యోగం కుదరదు. ఇక్కడ సత్వ గుణం అంటే మంచి చేయాలి, అందరికి సహాయ పడాలి అనే కర్తృత్వ భావన. ఇది కూడా ఒక పెద్ద సంసారం అయ్యి కూర్చుంటుంది. అలా అని మంచి పనులు చేయకూడదని కాదు. మన ముందుకు సహాయం అర్ధించి వచ్చిన ఏ ప్రాణికైనా ఆ పరిస్థితులను బట్టి సహాయ పడటం ధర్మం. 

మనమే కల్పించుకొని మరల ఈ ఆధ్యాత్మిక దారినుండి ప్రక్కకు వెళ్ళకూడదు అని గురువులు చెప్తారు. మన కర్మానుసారంగా ఒక వృత్తిలో ఉన్నాము. రోజు చేసే పనులే స్వార్థరహితంగా చేయడమే సేవ అని పెద్దలు చెప్తారు.


ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః!  



Saturday, October 10, 2020

భగవద్గీత 5వ అధ్యాయం - కర్మ సన్యాస యోగము



భగవానుడు 4వ అధ్యాయం ముగిస్తూ అర్జునిని తన హృదయమునందు ఉన్న అజ్ఞానాన్ని వివేక జ్ఞానమను ఖడ్గముతో రూపుమాపి కర్మ యోగమునందు స్థితుడవు కమ్ము అని చెప్పి ముగించారు. ఇప్పుడు 5వ అధ్యాయంలో కర్మయోగము మరియు కర్మ సన్యాస యోగముల గురించి చెపుతూ అర్జునినికి కర్మయోగమే శ్రేయస్కరము అని బోధించారు. ఇక్కడ కర్మసన్యాస యోగము అంటే కర్మను త్యచించడం కాదు. కర్మసన్యాస యోగి అంటే సాంఖ్య యోగి అని అర్ధం. సాంఖ్యం అంటే ఇక్కడ అర్ధం జ్ఞాన మార్గము.

ఈ అధ్యాయంలో మొత్తం 29 శ్లోకాలు ఉన్నాయి. భగవానుడు ఏ మార్గం ఎవరికి అనువుగా ఉంటుంది, మనకి కర్మ యోగము మంచిదా లేక కర్మ సన్యాస యోగానికి మనకు అర్హత ఉందా అనే విషయాలను చక్కగా ఉదహరించి మరీ చెప్పారు. మన మనో స్థితిని బట్టి మనం ఏక్కడ ఉన్నాము అనే విషయం అర్ధం చేసుకుని మన మార్గాన్ని తెలుసుకోవచ్చు. మనకు ముందుగా ఈ మార్గాలు ఎందుకు అనుసరించాలి అనే విషయం అర్ధం కావాలి. 


ఈ మానవ జీవితం ఎంతో శ్రేష్టమైనది అని మన శాస్త్రాలు చెపుతాయి. మనం జన్మరాహిత్యం దిశగా ప్రయాణం చేయాలి అని కూడా చెప్తాయి. ఈ మార్గంలో మనం ప్రయాణిస్తూ కర్మల ఫలితాలు వాసనలు కాకుండా ఎలా ఆచరించాలో ఈ అధ్యాయం నేర్పిస్తుంది. అంతే కాకుండా నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? 

రజో గుణంతో మన మనస్సు నిండి ఉన్నప్పుడు మనం ఆచరించాల్సిన కర్మ యోగం గురించి భగవానుడు చక్కగా చెప్పారు. అలానే సాంఖ్య యోగం (కర్మ సన్యాస యోగి)   అనుసరించాలి అంటే కావాల్సిన అర్హతలు కూడా చక్కగా చెప్పారు. 

భగవంతుడు ఎవరి రాతలు వ్రాయడని వారి కర్మఫలాలను వారే సంచిత కర్మగా తీసుకొని జన్మ తీసుకు వస్తారని ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 

సకామ మరియు నిష్కామ కర్మల గురించి కూడా చక్కగా వివరించారు. అలానే జ్ఞాన యోగము యొక్క ఏకాంత సాధనా విధానాన్ని చెప్పారు. 

ఈ ప్రాపంచిక భోగాలు దుఃఖకారకములని, వివేకవంతులు వీటి పట్ల ఆకర్షణకు లోను కారని, యోగికి సుఖికి గల తేడాలను చక్కగా చెప్పారు. 

చివరగా సాంఖ్య యోగి అంతిమ స్థితి గూర్చి, నిర్వాణ బ్రహ్మ ప్రాప్తి కలిగిన జ్ఞానులైన వారి లక్షణాలు చెప్పి, తానే ఈ విశ్వమంతా ఉన్నట్లు చెపుతూ అధ్యాయం ముగించారు.

చివరగా ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాము.
మనకు కర్మ యోగము మంచిదా లేక కర్మ సన్యాసం మంచిదా అన్న విషయం అర్ధం చేసుకోవాలి. మనందరం  ఈ ప్రాపంచిక విషయాలలో సతమవుతూ ఉంటాము అందుకే కర్మ యోగమే అర్జునిని లాగా మనకు కూడా శ్రేయస్కరము.

ఇక్కడ కర్మ యోగము ద్వారా మనస్సు శుద్ధి పడితే అప్పుడు మనకు కర్మ సన్యాస యోగము చేసే అర్హత వస్తుంది అని అర్ధం చేసుకోవాలి. అందుకే భగవానుడు ఆ యోగి యొక్క లక్షణాలు మనకు చెప్పారు.

మనకు విషయభోగాలు ఎలా అడ్డుగా ఉంటాయో తెలుసుకోవాలి.

మనలో ఉన్న కామక్రోధాల వేగాన్ని ఎలా తట్టుకోవాలో అనే విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు.

కర్మ యోగము ద్వారా మన మనోస్థితిని ఉన్నతంగా తీర్చిదిద్దుకుని, భగవంతుడు అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి అర్హత ఎలా సంపాదించాలో నేర్పిస్తుంది ఈ అధ్యాయం.

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః!




Bhagavad-Gita Chapter - 5 Karma Sanyasa yogam

 


The Lord emphasized and encouraged Arjuna to ward off the delusional thinking (Ajnaana) by using the sword of knowledge at the end of Bhagavadgita 4th chapter. In the fifth chapter Lord talks about Karma yoga and karma sanyasa yoga and karma yoga is better for Arjuna. Here Karma sanyasa means not about inaction but it is about sankya yoga (knowledge). It is about path of Jnana and understanding the reality of life. Karma sanyaasa means not inaction but not worrying about the outcome of the action.


The chapter 5 has 29 verses and Lord prescribes a spiritual path that is better for each individual and what are the characteristics of each person who follows these paths. He emphasizes the importance of our mental state and what qualifies us to choose a specific path. 

First of all we all need to understand why we need to follow these paths and why it is essential to have this knowledge. 

Understanding the importance of getting human life and its goal to attain salvation.  These paths provide smooth access to Moksha when we follow these principles with some guidance from a parama Guru.  

This chapter tells us about our actions and how to perform our actions without getting attached to the outcomes of these actions. If we get attached to the outcomes of these actions we get caught up in the whirlpool of impressions.  

We also learn about real knowledge and what path we should follow if our mind is filled with Rajo guna. 

If we want to follow Sankya yoga what are the qualifications that we need to have.  


Lord never wants to dictate the fate of individuals but their fate is based on their past actions. Everyone needs to be cautious about how they conduct themselves in this world. 

In this chapter Bhagavan also describes the differences between Sakama and Nishkama actions. This chapter also talks about the path of knowledge and how to practice this.  

These worldly attractions are the cause for our sorrows and intelligent people stay away from these attractions. He also differentiated the personalities of Yogi and Bhogi. 

In the end he gives the ultimate truth and how a Jnani or self realized person conducts himself in this body or the world.


Salient points to be focused in this chapter

Understanding the differences between Karma Yoga and Karma Sanyasa yoga and how to choose which path is better for us. As we are all immersed in life's hustle bustle, we are better off with Karma yoga as he prescribed this for Arjuna also.


By performing Karma yoga our mind will be purified and then we will be able to grasp the proper knowledge of salvation. Then we will be able to follow the path of Karma sanyasa yoga that is Saankya yoga.


Understanding how the worldly attractions will influence us.


This chapter will make us understand and learn to withstand the impacts of anger and desires.


How to qualify and acquire the qualities of Karma Yogi so that we become eligible to experience the God that is the ultimate truth.



Om Sri Krishna Parabrahmane Namah!

 

Sunday, August 23, 2020

ఆధ్యాత్మిక జీవనం - అవసరం





మన జీవితం సగం నిద్రతోనే సరిపోతుంది. ప్రతిరోజూ ఉదయాస్తమానాలు అవుతాయి. ఆలా అనేక సంవత్సరాలు వృధాగా గడిచిపోతాయి. మిగిలిన జీవితాన్నైనా సరిగ్గా అనుభవించరు. బాల్యంలో క్రీడలు, వయసులో సుఖభోగాలకై పరుగులు మరియు వృద్ధాప్యంలో వ్యాధిగ్రస్తులై పీడింపబడతారు. శరీర పోషణ మరియు మైథునం ఇవే మానవ శరీరానికి సాధనాలైతే, ఈ జన్మకు పర్యవసానం ఇదే అయితే ఈ నర జన్మ వ్యర్థం అని మన శాస్త్రాలు చెప్తాయి. 

మనం ఎవరము, ఎక్కడినుండి వచ్చాము ? ఈ మానవ జన్మకు కారణం ఏమిటి ? అన్న రహస్యం అర్ధం చేసుకున్నవారు వివేకవంతులు. బాల్యం, యవ్వనం, వార్ధక్య అవస్థలు జనులందరికి ఉంటాయి.  కాని అవి ఎలా వచ్చి వెళ్ళిపోతాయో ఎవరు తెలుసుకోలేరు. కళ్ళకు కన్పించేది ఏదైనా నశించేదే. ఈ క్షణంలో ఉన్న శరీరం తరువాత ఉండదు. శరీరం మలమూత్రాలు, శ్లేష్మం చీము రక్తాలతో నిండి ఉంటుంది. దీనిని ప్రతీ క్షణం మృత్యువు వెంటాడుతు ఉంటుంది. ఇలాంటి ఈ శరీరమే మనకు పరమేశ్వర ప్రాప్తిని కూడా కలుగచేస్తుంది. క్షణభంగురమైన ఈ శరీరం పుణ్యం సంపాయించే భగవద్ ఆరాధన, శ్లోకాలు, భగవంతుని కథలు వినే సమయమే సార్ధకం అవుతుంది. 

పరమేశ్వరుని దయతో మనకు కావలసినవన్నీ వచ్చినా ఇంకా మనలో అశాంతే ఉంటుంది. శాశ్వతమైన పరమపదం పొందిన దాకా నిజమైన శాంతి దొరకదు. జీవించడానికి సరిపడా అన్న వస్త్రాలు, తగుమాత్రం ఆలన పాలన చేసి, జనన మరణాలను తప్పించుకోవడమే మానవ కర్తవ్యం.  అందుకే మనం ఈ శరీరాన్ని ఒక అద్దె ఇల్లులాగా చూసుకోవాలి అని గురువులు చెప్పారు. ఇక్కడ ఉన్నంత వరకు దీనిని శుభ్రంగా ఉంచుకొని పరమార్ధం చేరుకోవడానికి తగినంతగా వాడుకొవాలి. 

మనం ఎన్నో జీవరాశులుగా జన్మలు తీసుకొన్న తరువాత కాని మనకు మానవ జన్మ రాలేదు అని శాస్త్రాలు చెప్తాయి. భగవంతుని పొందే అవకాశాన్ని ఈ జన్మలోనే దక్కించుకునే ప్రయత్నం చేయాలి. మరు జన్మకై ఎదురుచూడకూడదు. ఎందుకంటే మళ్ళా మానవ జన్మ ఎప్పుడు వస్తుందో? అందుకే శంకరాచార్యులవారు "జంతూనాం నరజన్మ దుర్లభం" అని చెప్పారు. 

మన కర్తవ్యం ఏమిటో చక్కగా అర్ధం చేసుకోవాలి. మనం జీవితం అనే అరణ్యంలో ఎంత పరుగులు తీసినా దైవాన్ని మరువకూడదు. 

పరమార్ధాన్ని బోధించే శాస్త్రాలను పారాయణ చేయాలి. 

సత్సంగం చేయాలి. 

గురువులను ఆశ్రయించాలి. గురువుల పట్ల శ్రద్ధను పెంచుకోవాలి. 

శరీరం పట్ల అంతులేని వ్యామోహం వదలాలి. ఈ జీవితం క్షణభంగురం. ఎప్పుడు రాలిపోతుందో తెలియదు.  కాలుడు తనపని తాను చేసుకుంటూ పోతాడు. అప్పుడు నాకు ఒక్కరోజు ఎక్కువ ఉంటే బాగుండు అనే బేరసారాలు ఉండవు. ప్రతిక్షణం ఈ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ శరీరంలో ఉన్నంత కాలం ఈ సాధన జరుగుతూ ఉండాలి.

అబేధ జ్ఞానమే తత్త్వం. 

ఉపనిషత్తులలో ఉన్న బ్రహ్మజ్ఞానం ఇదే. 

పరమాత్మ ఉపాసన అన్నా ఇదే. భక్తులు భగవంతుడు అన్నా ఇదే. 

గురువు బ్రహ్మము వేరు కాదన్న అభేదజ్ఞానం కలగడమే భక్తి. ఈ భక్తితో మాయను దాటటం సులభం. 

యోగ్యులు శ్రద్ధ కలిగిన వివేకవంతులు జ్ఞాన వైరాగ్యాలను సంపాయించుకుంటారు. ఈ ఆత్మ తత్వంలో లీనమైన భక్తులు భాగ్యవంతులు. 

ముల్లుని ముల్లుతోనే తీసివేసినట్లు, అజ్ఞానమనే ముల్లును జ్ఞానమనే ముల్లుతోనే తీయాలి. నేను నాది అనేది పోయినదాకా జ్ఞానజ్యోతి తన ప్రకాశం వ్యక్తం చేయదు. గురువులు చూపించిన దారిలో నడిస్తే ఈ జ్యోతి తొందరగా వెలుగుతుంది. 

ఓం శ్రీ సాయిరాం!

Saturday, July 25, 2020

గురువే పరబ్రహ్మము.



భగవంతుడిని సగుణం మరియు నిర్గుణం అనే రెండువిధాలుగా చెప్తారు. సగుణ స్వరూపమునకు ఆకారము ఉంటుంది కాని నిర్గుణము అంటే ఆకారము లేదు. ఇక్కడ ఆకారము ఉండదు అంటే అంతా ఆ పరబ్రహ్మమే అయినప్పుడు, ఇంకా ఆకారంతో పని లేదు.  రెండును పరబ్రహ్మ స్వరూపములే. 

మొదట్లో సగుణ స్వరూపమే మనకు అనువుగా ఉంటుంది. భక్తి వృద్ధి చెంది, జ్ఞానం కలిగితే అప్పుడు నిర్గుణ ఆరాధన కుదురుతుంది. బాబా అందుకే తనను నిర్గుణంగా ఆరాధించమని చెప్పి అలా కుదరకపోతే అప్పుడు నన్ను సగుణంగా పూజించండి అని చెప్పారు. 

భక్తిపై గట్టి నమ్మకం ఉండాలి అని సాయి చెప్పారు. ఆయన రకరకాల దేవతలా రూపంలో దర్శనం ఇచ్చారు. అలానే వేరే గురువుల రూపంలో కూడా దర్శనం ఇచ్చారు. అలాంటి ఒక సన్నివేశమే డాక్టర్ పండిట్ గారి కథ.  

ఒక సారి తాత్యా సాహెబ్ నూల్కర్ స్నేహితుడైన డాక్టర్ పండిట్ అనే ఆయన షిర్డీ వచ్చారు. బాబా అతనిని దాదా భట్ వద్దకు పంపిస్తారు. వారు ఇరువురు బాబా దగ్గరకు వచ్చినప్పుడు, ఈ డాక్టర్ పండిట్ బాబాకు నుదిటిపై త్రిపుండ్రం పెడతాడు. అందరికి ఆశ్చర్యం ఎందుకంటే బాబా ఎవరిని అలా బొట్టు పెట్టనివ్వరు. దాదా తరువాత ఆలా ఎందుకు చేయనిచ్చారు అని అడిగితె బాబా ఇలా చెప్పారు. ఈ డాక్టర్ నాలో తన గురువైన రఘునాథ్ (కాకా పురానిక్) గారిని చూసుకున్నాడు. అందుకే అతను ఆలా చేయగలిగాడు అని సమాధానం ఇచ్చారు.  ఇక్కడ ఆయన చూపించిన నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడివేసింది అని కూడా బాబా చెప్పారు. దాదా భట్ తరువాత డాక్టర్ పండిట్ ఈ విషయం గురించి అడగగా తన గురువుని బాబాలో చూసినట్లు చెప్తారు. సాయి ఈ విధంగా మన గురువుని మనం ఎలా ఆరాధించాలో నేర్పించారు. 

మనం మన గురువుతో మమేకం అవ్వాలి. 

ఆయన దారే మన దారి కావాలి. 

సాయి ఆరాధన అన్నిదేవతల ఆరాధన కన్నా గొప్పది అని తెలుసుకోవాలి. 

ఒక్క సారి మనకు గురువు లభిస్తే ఆ గురువు తప్ప మనకు వేరే ఆరాధనలతో అవసరం ఉండదు. ఎందుకంటే గురువే పరబ్రహ్మము. 

ఓం శ్రీ సాయిరాం!

Guru is Brahman -Paramatma



There are two aspects of God or Brahman : (1) the Unmanifested (Nirgun) and (2) the Manifested (Sagun). The Nirgun is formless, while the Sagun is with form, though both denote the same Brahman. Some prefer to worship the former, some the latter. 

Our love and devotion do not develop unless we worship Sagun Brahman for a certain period of time, and as we advance; it leads us to the worship (meditation) of Nirgun Brahman.

Shirdi Sai always emphasized the importance of faith in our devotion. He reassured us that he will bless us no matter what.  He appeared as Rama, Datta, Hanuman, Shiva, and all other forms when his devotees prayed to him in those forms. Hemadpanth talks about Dr. Pandit’s story in Sri Sai Satcharita where Baba appeared as Sri Guru Raghunath from Dhopeswar (Kaka Puranik). 

Dr. Pandit came to to Shirdi only once to see Baba. When he went to Dwarakamai, Baba told him to go to Dada Bhat.  Later he came along with  Dada for Baba's worhip. Dada is a staunch devotee of Baba and till then no one had dared to apply fragrant paste (gandh) “ tilak ” (circular, auspicious mark on the forehead) to Baba. Baba would not allow anyone to apply the fragrant paste to his forehead. Only Mhalsapati smeared it on his throat; others applied it to his feet. But this Pandit was full of devotion. He took away Dada's puja dish,  and holding Sree Sai’s head, he smeared him  with  the three  fingered  parallel  lines; (tripundra). Watching this Dada’s heart began to beat fast. He thought that Baba would be enraged. Thus the impossible had happened! Baba did not utter a word. On the contrary he seemed quite pleased and did not get angry with him at all. So be it.  He let that moment pass.  When Dada asked Baba why he let Dr. Pandit paste tilak and why not others.  Baba said, " He saw his Guru in me and I had no choice except to let him do the worship". Then when Dada spoke to Dr. Pandit he confirms that he saw his Guru Raghunath from Dhopeswar (kaka Puranik) in Baba. 

Sai is even greater than all the seven forms that we all worship – Image of God, Sacrificial altar, fire, supreme light, sun, water, Brahmin (those wearing the sacred thread). Through this story, Baba taught us how to merge with Guru with worship. Sai wanted us to learn how to love our Guru and to have single mindedness in worshiping your Guru.

Om SriSairam!

Saturday, June 20, 2020

భగవద్గీత 4. 1 జ్ఞాన యోగం - సర్వం విష్ణుమయం



ఎన్నో జీవ రాసులుగా జన్మలు తీసుకున్న తరువాత మానవ జన్మ వస్తుందని మన శాస్త్రాలు చెప్తాయి. అలానే ఇలాంటి మానవ జన్మలు కూడా ఎన్నో మనం ఇంతకూ ముందు తీసుకొని ఉండవచ్చు. మనం ఈ శరీరాన్ని వదిలివేయడాన్ని చనిపోవడం అని పిలుస్తాము. శరీరం వదిలివేస్తే మనతో ఏమి తీసుకు పోతాము అనే విషయాన్ని మన శాస్త్రాలు చెప్పాయి. మనతో సూక్ష్మ, కారణ శరీరాలు వస్తాయి. వీటిలో మన పూర్వ జన్మ కర్మలు, సంస్కారాలు మరియు వాసనలు ఉంటాయి. వీటి ఆధారంగానే మనం ఎక్కడ, ఎలా, ఎవరికి పుట్టాలో నిర్ణయించబడుతుంది. కాని పరమాత్మ జన్మ తీసుకుంటే దాన్ని అవతారం అని పిలుస్తాము. ఇక్కడ వాసనలు కర్మలతో సంబంధం ఉండదు. పరమాత్మ తత్త్వం అంతటా ఉంటుంది, అందుకే ఆ తత్వాన్ని విష్ణువు అని పిలుస్తాము. ఈ విష్ణు తత్త్వం అంతటా ఉంటుంది కాబట్టి, ఎక్కడ అవసరం అయితే అక్కడ అవతార పురుషుల రూపంలో వ్యక్తం అవుతుంది. అందుకే మనం దేవుడు దిగివచ్చాడు అంటాము. అంటే ఈ త్రిగుణాత్మకమైన మానవ స్థాయికి ఈ విష్ణు తత్త్వం రావాలి. అప్పుడే మనం ఆ తత్వాన్ని చూడగలం.

మనకు ఇంతకూ ముందు ఎన్నో జన్మలు వచ్చి పోయాయి. అవన్ని గుర్తు ఉంటె మానవులుగా తట్టుకునే శక్తి మనకు లేదు. ఈ జన్మలోని బంధాలతోనే మనం కష్ట పడుతూ ఉంటె, ఇక అన్ని జన్మలలో ఉన్న సంబంధాలు ఎదురుగా కనపడుతూ ఉంటె అసలు తట్టుకోలేము. అందుకే మనకు పూర్వ జన్మల అనుభవం లేకుండా దేవుడు మంచి ఉపకారం చేసాడు. అలా అని మనకు ఏమి గుర్తు ఉండదు అని కాదు. మనం స్కూలులో ఒక్కో తరగతి తరువాత ఒక్కటి దాటి 
పైచదువులకు వెళ్తాము. కింది తరగతులలో చదివిన అన్ని పాఠాలు మనకు పూర్తిగా గుర్తు ఉండవు. వాటినుంచి నేర్చుకున్న జ్ఞానం ఏదైతో ఉందొ అది మాత్రం మనతో తీసుకు వెళ్తాము. అక్కడ నేర్చుకున్న వాటి వల్ల మనలో ఒక రకమైన ఎదుగుదల వస్తుంది. అది మనకు జీవితాంతం ఉపయోగపడుతుంది. అలానే మనం పూర్వ జన్మలలో చేసిన కర్మలు, పొందిన అనుభవాలు మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్ధం అవుతుంది. అందుకే భగవానుడు ధర్మాన్ని అనుసరించమని, జీవితాన్ని కర్మ సిద్ధాంత పరంగా అర్ధం చేసుకోమని చెప్పడం జరిగింది. ఇలా చేస్తే మనం ఒక రోజు ఆ విష్ణు తత్వంలో ఐక్యం అవుతాము అని రాబోయే శ్లోకంలో చెప్తున్నారు.

జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః !
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సః అర్జున !!

ఓ అర్జున ! నా అవతారములు, కర్మములు దివ్యములు. అనగా నిర్మలములు మరియు అలౌకికములు. ఈ తత్వ రహస్యం తెలుసుకున్న వారు తనువును చాలించిన పిమ్మట మరల జన్మించరు సరిగదా! వారు నన్నే చేరుకుందురు.

ఇక్కడ భగవంతుని కర్మలు దివ్యములు అని చెప్పారు. అంటే ఈ కర్మలు వాసనలకు సంబంధించినవి కావు. వీటిలో స్వార్ధం అనేదే ఉండదు. ఇక్కడ కర్త్రుత్వ భావన ఉండదు. మహానుభావులు కూడా దివ్య రూపులే. వారి కర్మలు ఫలాసక్తి రహితంగా ఉంటాయి. 

మనం ఈ రహస్యాన్ని అర్ధం చేసుకొని కర్మ యోగాన్ని అనుసరిస్తూ సాధన కొనసాగిస్తే మనం ఆ భగవంతుడిని తప్పక చేరుకుంటాము. అంటే మరల జన్మ కర్మబంధాలలో ఇరుక్కోము.


ఓం శ్రీ సాయిరాం!