In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, August 27, 2014

Isavaasyam - Teachings to Change the Lives


Dasganu Maharaj once wanted to write commentary on Isavasyopanishad and fulfills his desire by writing this complicated scripture. So many people appreciated his writing and praised for doing so. But Dasganu had lot of questions and he put his doubts in front of some great scholars. But they could not satisfy his mind. He was unhappy about this. He approaches Baba and requested him to bless him with this knowledge. Then Baba says that there is nothing difficult about this and when you go back, visit kaka’s house. His maid will clarify your doubts.

Every one felt that Baba is joking and how a maid can teach a scripture. But Dasganu knew that he has to go to Kaka Dixit’s house. What Baba said is the truth. 

Here the take home point is the belief in your Guru in Baba’s words Shradda (Faith). Guru’s word is God’s word. 

Then he goes to Kaka’s house and rests that night. He suddenly wakes up to a sweet voice who was singing about a saree. Then he woke up and wanted to check who that lady was? He started thinking is this the lady Baba was talking about? She was the sister of another worker by name Namya. Then he listens closely to the song she was singing about Saree (dress) which is in color orange. She was wearing a rag yet she was singing about a beautiful dress. She was very happy in singing this song.

Then he felt for her poverty and asked Moreswar Pradhan to give her a Saree. Then she wore that dress next day and started singing again. She came back to work next day with her original rag and still she was happy. She was singing and there was no difference in her attitude. After observing all this, Dasganu felt that he understood the Isavasyopanishad. He was able to satisfy his zeal in understanding the scripture.

What did Dasganu learn from observing this maid? 

Baba could have taught him this in Shirdi itself. Why send him to kaka’s house? 

What can we learn from the maid, the Saree, the work she was doing, the happiness that she showed by singing even when she was not wearing the new saree. What is the link and relation to Isavasyopanishad?


Isavasyopanishad has 18 verses. This is the smallest Upanishad of all of the Upanishads. Eesa means God and Vaasa means “who is omnipresent. 

Baba could have told him this in Shirdi itself. But he wanted to show Dasganu that he can teach through a maid to prove that he is everywhere.  

The initial verse teaches us that God is every where and is all pervading. The universe came from this completeness. 

The maid’s poverty, ragged Saree, person who donated the saree, and all this is part of God.

If we can get rid of ego, the sense of me, mine and enjoy with out expectation, then we will succeed in spiritual path.

In this story, maid was happy when she was in a rag or new Saree. This did not affect her happiness. This is what Baba wanted Dasganu to learn. This teaching is confirmed in the verses of Isavasyopanishad. It is really hard to reject the materialistic happiness. But we have to enjoy them by rejecting them. They both are contradicting each other. What it really means is to enjoy the worldly things with out getting attached to the object. All these objects were given to us by God. He gave air to breath, water to drink, and all the required elements to live. We did not bring any thing when we came in to this world and we do not take any thing with us when we die. We have to appreciate God for giving all this. The scripture says that we should not take any thing that does not belong to us. In this universe we were given enough and we have to understand our piece of the pie. If we try to snatch from others and accumulate, what will happen? Some people by their crooked ways gulp every thing around them. This is not fair and we can not even imagine what they have to go through after wards.  There will be balance in the nature.

The word “Tena Tyaktena Bhunjida” also denotes another meaning. When we eat banana, we eat the pulp and throw the skin. In a similar way, we have to reject the materialistic world by grasping the force behind this that is Paramatma (Supreme God). 

In our story we have lot of elements like the maid, saree, and rag, person who donated the saree etc. But the happiness that she was in irrespective of what she was wearing is the concept of ultimate happiness (Paramatma tatva). 

Baba not only provided this situation for Dasganu to learn but he also gave him an extraordinary out of body experience. This is what great Gurus do! They will make you experience the scripture rather than just telling you. With this ultimate experience Dasganu’s doubts were cleared once for all about Isavasyopanishad. 




OM SRI SAI RAM! 

Wednesday, August 20, 2014

ఈశావాశ్యం - నిజ జీవితానికి సాయి బోధలు


ఒకసారి దాసగణు మహారాజు గారు ఈశావాశ్య ఉపనిషత్ మీద చక్కటి భాష్యం వ్రాయాలని సంకల్పించి, చందోబద్ధంగా ఓవిలతో వ్రాసారు. దానిని చాలామంది ఆమోదించి గౌరవించారు. అతని కోరిక నెరవెరినది. కాని అతనికి ఒక సందేహం తీరలేదు. దానిని అతడు పండితుల ముందు ఉంచాడు. చాలా చర్చలు జరిగినా అతని సందేహం తీరలేదు. ఆ తరువాత అతడు షిర్డి రావడం జరిగింది. బాబాను దీని అర్థం బోధించమని ప్రార్ధించాడు. 

అప్పుడు బాబా "దీనిలో కష్టం ఏముంది! నీవు ఎక్కడనుంచి వచ్చావో అక్కడికి మరల వెళ్ళినప్పుడు కాకా పని మనిషి నీ సందేహాన్ని తీరుస్తుంది" అని చెప్పారు. పని పిల్ల దీనికి అర్థం చెప్పడం ఏమిటి? సాయి పరిహాసం చేస్తున్నారు అని అక్కడ ఉన్న వారు అనుకొన్నారు. కాని దాసగణుకు బాబా చెప్పినది సత్యం అని తెలుసు. 

ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే? మనలో భావన ఎలా ఉంటే ఫలితం అలా ఉంటుంది. గురువు చెప్పిన ప్రతి మాట బ్రహ్మ లిఖితమే. వారు ఉపయోగం లేకుండా ఏమీ చెప్పరు. 

సరే ఆ తరువాత గణు కాకా ఇంటికి వెళ్తాడు. తను నిద్రలో ఉండగా ఒక మధురగానం వినిపించింది. ఆ గానం ఆ ఇంట్లో పని చేసే ఒక నౌకరు యొక్క చెల్లెలుది . ఆ అమ్మాయికి ఎనిమిది ఏళ్ళు ఉంటాయి. తను ఒక చినిగిన గుడ్డ ముక్కను నడుముకు కట్టుకొని నారింజ చీర అందాన్ని వర్ణిస్తూ పాటపాడుతూ ఉంది. తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరిపడా బట్ట లేదు, ఐనా ఆమె ఎంతో సంతోషంగా ఉంది. 

ఆపిల్ల యొక్క స్థితిని చూసి, ప్రధాన్ గారి చేత ఒక కొత్త చీర ఇప్పించారు. మరునాడు ఆ అమ్మాయి ఆ చీర కట్టుకొని ఆనందంతో గంతులు వేసింది. తరువాతి రోజు కొత్త చీరను దాచుకొని మరల చినిగిన గుడ్డ కట్టుకొని పనిలోకి వచ్చింది. ఆ అమ్మాయిలో అదే ఆనందం. కొత్తచీర కట్టుకోలేదు అన్న బాధ ఎక్కడా కన్పించలేదు. ఇదంతా చూసిన దాసగణు మహారాజుకి  ఈశావాశ్య ఉపనిషత్ యొక్క అర్థం బోధపడింది. 

ఇక్కడ దాసగణు మహారాజుకు అర్థం అయిన విషయాలు ఏమిటి? ఈ విషయాలు బాబానే స్వయంగా షిర్డీలోనే చెప్పిఉండవచ్చుకదా! కానీ బాబా అలా చేయలేదు. బాబా ఎప్పుడూ అనుభవపూర్వకముగానె నేర్పిస్తారు. 

ఈశావాశ్య ఉపనిషత్లో 18 మంత్రాలు ఉన్నాయి. 

ఈశ అంటే ఈశ్వరుడు, వాశ అంటే అంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. 

బాబా షిర్డీలోనే ఈ విషయాన్ని నేర్పించవచ్చు. అంతటా నేనే ఉన్నా, పని పిల్లలో కూడా నేనే ఉన్నా, అని ఆమె ద్వారా నేర్పించడం అనేది ముఖ్యమైన విషయం. 

భగవంతుడు సర్వవ్యాపి, పూర్ణుడు అని మొట్ట మొదటి మంత్రంలో చెప్పబడింది. ఈ ప్రపంచమంతా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నప్పుడు ఆయన లేని స్థలం ఉంటుందా. 

పరమాత్మనుంచే పూర్ణ జగత్తు వచ్చింది. 

పనిపిల్ల యొక్క పేదరికం ఈశ్వరుని అంశం. 

చినిగిన చీర కూడా ఈశ్వరుని అంశమే.

దాత, దానం, దేయం; ఇవన్నీ కూడా ఈశ్వరునిలో భాగాలే.

నేను నాది అన్న భావనను పారద్రోలి ఎప్పుడూ నిరభిమానంగా ఉంటూ సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. 

ఇక్కడ పని పిల్ల మంచి చీర కట్టుకున్నప్పుడు, అది లేనప్పుడూ ఆనందంగానే ఉంది. ఇదే బాబా మనకు నేర్పించాలనుకున్న సత్యం. ఈ భావం "తేన త్యక్తేన భుంజీధా" అనే మంత్రంలో చెప్పబడింది. దీన్నే బాబా మనకు సులభంగా నేర్పించారు. ఈ ప్రాపంచిక సుఖాలను త్యజించడం చాలా కష్టం. మనకి అంతర్ దృష్టి కలగడం కూడా కష్టమే. అందుకే "త్యక్తేన భుంజీధా" అని అన్నారు. సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. 

ఈ వస్తువులన్నీ పరమాత్మకు చెందినవి. ఆయనే మనకు వాటిని ప్రసాదించాడు. ఈ లోకంలో వేటిని మనం వెంట తెచ్చుకోలేదు, చనిపోయినప్పుడు దేన్నీ వెంట తీసుకువెళ్ళలేము. మనం ఇక్కడకు వచ్చేటప్పడికి అన్ని తయారుగా ఉన్నాయి. నీరు, గాలి, భూమి, అగ్ని, ఆకాశం, వెలుగు, చెట్లు మరియు నదులు ఇట్లా అన్ని తయారుచేసి మనకు ఇచ్చారు. వాటిని మనం పరమాత్మ ప్రసాదంగా అనుభవించాలి. ఇదే మన మనస్సుకు హత్తుకోవాల్సిన విషయం. 

ఈ సృష్టిలో మనందరి అవసరాల కోసం భగవంతుడు అవసరం అయినంత వరకు ఇచ్చాడు. అందులో మన వాటా మనం అనుభవించాలి. అప్పుడు ఇతరులు తమ వాటా తాము అనుభవించగలుగుతారు. కాని కొందరు స్వార్ధంతో అధికభాగాన్ని అన్యాయంగా లాక్కుని మరి కూడబెడ్తారు. ఇట్లా చేసిన వారి గతి ఏమిటి? వారు ఏ లోకాలకు వెళ్తారు అనే విషయాన్ని కూడా ఈ ఉపనిషత్ చెప్తుంది. 

ఇక్కడ త్యజించి అనుభవించడం అంటే మనం అరటి పండు తొక్క తీసేసి లోపల ఉన్న దాన్ని తింటాము. అలానే ఈ నామరూపాత్మకం అయిన జగత్తులో ఉన్న తొడుగు తీసేస్తే అప్పుడు మనకు పరమాత్మ కన్పిస్తారు. 

మన కథలో పని పిల్ల, చిరిగిన చీర, కొత్త చీర, దానం ఇట్లా చాల విషయాలు ఉన్నాయి.

పరిస్తితులు ఎట్లా ఉన్నా మన పని చేస్తూ ఆనందంగా ఉండటమే పరమాత్మ తత్త్వం. 

బాబా ఈ విషయాలను నోటితో చెప్పవచ్చు, కాని దాసగణు మహారాజుకి ఈ దివ్యానుభవం ద్వారా ఆయన అనుమానాలన్నీ తీర్చారు. అంతేకాకుండా ఆయనకు పరమ ఆనందానుభూతిని కలుగచెసారు. 





ఓం శ్రీ సాయి రామ్!









Wednesday, August 13, 2014

Beacon (Guiding light) -Teachings to Change Lives



In our lives we see the sun rising and the sun setting every day. Thus the years roll on. Half of life is spent in sleep and the remaining is not enjoyed peacefully. In the childhood a person is engrossed in play; in youth in wooing desires; in the later days old age enfeebles the body and one is always suffering from ailments.

To be born and to grow strong in body; to breathe and to have a prolonged life; is this the only purpose of living?

Childhood, youth and old age are the stages through which everybody goes; but how naturally they come and go is not understood by anybody.

The goal of human life is only to reach God; otherwise what is the difference between humans and animals?

Although so sinful, perishable and short-lived is the human body, it is only through this that the abode of purity of God can be reached. The cycle of birth and death is continuous. Even the very idea of death is extremely horrifying. This life will pass away without any inkling. Who has kept a count, day and night, of those who are born and who die?

In case of such short-lived human life, the time which is spent in reading the scriptures and listening to the stories of God is fruitful, while the time spent otherwise is a waste. This should be the firm conviction in our minds. But nobody believes in it till one can experience this oneself. But to experience this, one has to make a deep study. Then the soul which seeks permanent happiness will enjoy that wealth.

Our scriptures say just reciting God’s name will take us to the salvation in the age of Kaliyuga. In a similar way the name of “Sai” will take us to the destination. 

Hemadpant reiterated this truth in Sri Sai Satcharita as follows:

Light houses are constructed at various places in the sea, to enable the boatmen to avoid rocks and dangers, and make them sail safely. Sai Baba’s stories serve a similar purpose in the ocean of worldly existence.

Baba’s stories surpass nectar in sweetness, and make our worldly path smooth and easy to traverse.

When Sai’ stories enter our hearts through the ears, the body - consciousness or egoism and the sense of duality vanish; and when they are stored in the heart, doubts fly out to all sides, pride of the body will fall, and wisdom will be stored in abundance.


Repetition of the name “Sai” will burn away all the sins of Kali-Yuga. Once having prostrated, past sins born of speech and hearing will be destroyed.

The minds of the listeners will be absorbed in God.

The mind will be a store of divine energy and full of faith.

Sai’s teachings will eliminate the ego and bestow knowledge.

The description of Baba’s pure fame, and the hearing of the same, with love, will destroy the sins of the devotee and, therefore, this is the simple Sadhana for attaining salvation.

So Sai Bandhus, let us make Sai’s teachings as Beacon – Guiding light for our journey in the ocean of life. 

The listening and singing of the Sai’s stories will remove the attachment to the senses and their objects, and will make the devotees dispassionate, and will ultimately lead them to self-realization.



OM SRI SAI RAM!

Wednesday, August 6, 2014

దీపస్తంభములు - నిజజీవితానికి సాయి బోధలు





మన జీవితంలో ప్రతిరోజూ ఉదయాస్తమానాలు అవుతాయి. అలాగే అనేక సంవత్సరాలు వృధాగా గడిచిపోతాయి. సగం జన్మ నిద్రావస్థలో గడిచిపోతుంది. మిగిలిన జీవితాన్ని ఐనా సరిగ్గా అనుభవించము. బాల్యం అంతా క్రీడలతో సరిపోతుంది. యుక్త వయసులో విషయ వాసనలు అలరింపచేస్తాయి. వృద్ధాభ్యంలో జరాగ్రస్తులు అయి ఎప్పుడూ వ్యాధులతో పీడింపబడుతూ ఉంటాము. 

పుట్టడం, బాగా పుష్టిగా పెరగటం, గాలిని పీలుస్తూ వదులుతూ చాలా కాలం బ్రతకటం, వీనితో జన్మ సార్ధకం ఐనట్లా? మానవ జన్మ కర్తవ్యం పరమార్ధ ప్రాప్తి. ఇదే సత్యం. 

పంచభూతాత్మకము అయిన ఈ నశ్వర శరీరం ద్వారా మాత్రమే మనము ఆ భగవంతుడిని తెలుసుకొగలము. జననమరణాలు ఎప్పుడూ వెంటే ఉంటాయి. వీటినితలుచుకుంటేనే దారుణ భయం కలుగుతుంది. అకస్మాత్తుగా ప్రాణం వెళ్లిపోతుంది. పగలురాత్రులు ఎంతమంది వస్తున్నారో మరిఎంతమంది వెళ్ళిపోతున్నారో ఎవరు గమనిస్తున్నారు?

క్షణభంగురం అయిన ఈ శరీరంలో, పుణ్యం సంపాదించి పెట్టే భగవంతుని గూర్చి తెలుసుకొనే సమయమే సార్ధకం అవుతుంది. మిగతాకాలం అంతా వ్యర్ధం. దీనిని బాగా నిశ్చయంగా తెలుసుకోవటమే ఈ జన్మకు సార్ధకం. కాని ఎవరికైన అనుభవం లేకుండా విశ్వాసం కుదరదు. ఈ అనుభవానికి బాగా అభ్యాసం చేయాలి. అప్పుడే శాశ్వతం అయిన ఆనందాన్ని ఆశించే జీవుడు ఈ వైభవాన్ని సాధించగలడు. 

కలియుగంలో నామస్మరణే మనలను పరమార్దానికి దగ్గర చేస్తుందని మన శాస్త్రాలు చెప్తాయి. అలానే సాయి నామము మనలను ఆ లక్ష్యానికి చేరువ చేస్తుంది. అందుకే హేమాద్పంత్ శ్రీ సాయిసత్చరితలో ఈ విధంగా తెలపడం జరిగింది. 

సముద్రంలో ఓడలు సుడిగుండాలలో చిక్కుకుపోకుండా, పెద్ద రాతి బండలు కొట్టుకోకుండా, నిరాటంకంగా సాగిపోవడానికి, అపాయాలను సూచించే ఎర్రటి దీపస్తంభాలను (లైట్ హౌసెస్) నిర్మిస్తారు. ఈ దీపపు స్తంభాలు ఆ నావలు ఓడ్డుకు చేరటానికి ఉపయోగపడ్తాయి. చీకటిలో వాటికి దారి చూపిస్తాయి. 

సాయినాథుని మధురమైన కథలు అమృతం సహితం సిగ్గుపడేలా, దుస్తరం అయిన భవసాగర మార్గాన్ని అతి సులువుగా దాటింపచేస్తాయి.

సాయి కథలు ధన్యం. 

వారి కథలు శ్రవణం ద్వారా హృదయంలోకి ప్రవేశించి శరీరాభిమానాన్ని బయటకు నేట్టివేస్తాయి. 

సుఖదుఖాలనే ద్వంద్వాలు ఉండవు. 

సాయి కథలను హృదయంలో భద్రపరుచుకుంటే మనసులోని వికల్పాలు నలు దిక్కులా పారిపోతాయి. 

బాబా యొక్క నిర్మలమైన యశస్సును వర్ణిస్తే, ప్రేమతో శ్రవణం చేస్తే భక్తుల కల్మషాలు దహించుకు పోతాయి. 

సాయి చరిత్ర మనకు జ్ఞానాన్ని ప్రసాదించి, అహంభావాన్ని నశించేటట్లు చేస్తుంది. అహం నశిస్తే ఆత్మసాక్షాత్కారం కల్గుతుంది 



సాయి బంధువులారా! 

మనం జీవనమనే సముద్రంలో సుడిగుండాలలో పడకుండా ఉండాలంటే సాయి మంత్రం అనే నావ కావాలి.

మనము సాయి అనే దీపస్తంభాన్ని ఆధారంగా చేసుకొని, పూర్తి శ్రద్ధా సబూరిలతో తీరాన్ని చేరుకుందాము.

సాయినాధులు చూపించిన గురు మార్గాన్నే ఎంచుకుందాము.

మరే దిక్కుకు వెళ్ళే ఆలోచనకూడా చేయద్దు.
  
ఆయనే మనలను రక్షిస్తూ గమ్యానికి చేరుస్తారు.

సాయిఫై పూర్తి నమ్మకం ఉంచుదాము. 



ఓం శ్రీ సాయిరాం!