In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Friday, March 27, 2015

సుఖదు:ఖాలు




బాబా కర్మ సిద్దాంతం గురించి చెప్పిన తరువాత నానా చేతులు మోడ్చి ఈ విధంగా అడిగాడు.

నానా : బాబా! అయితే సుఖదు:ఖాలు ఎందుకు కల్గుతాయి? సుఖము వలన ఆనందము. దు:ఖము వలన గుండెలు బ్రద్దలవడం అనే రెండింటి మధ్య సంసారి క్షణం క్షణం నలిగిపోతుంటాడు. సుఖదు:ఖాలకు నిలయము ఈ ప్రపంచము. దాన్ని వదిలి పెట్టితే తప్ప దు:ఖం నాశనము కాదు కదా!

అప్పుడు బాబా ఇలా చెప్పారు.
సుఖదు:ఖాలనేవి భ్రాంతి మాత్రమే - కేవలం అవి మబ్బు తెరలవంటివి.

ప్రపంచంలో ఏవైతే సుఖాలు అని అనుకుంటామో, అవన్నీ నిజానికి సుఖాలుకావు. జాగ్రత్తగా గమనించి చూడు. చాలా మంది ఇక్కడే పొరబాటు పడుతుంటారు.

దేహ ప్రారబ్ధం వల్ల ఒకడికి మంచి ఆహారం దొరుకుతుంది. ఒకడికి ఎండిపోయిన రొట్టెముక్కలు కూడా దొరకవు. పంచామృతములు దొరికినవాడు ఏమీ లోటూ లేదని అనుకుంటాడు. ఏది తిన్నా ఆకలి తీర్చుకోవడం కోసమే కదా!

ఒకడికి పట్టువస్త్రాలు ఉంటాయి. మరి ఒకరికి కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండవు. ఏది కప్పుకున్నా శరీరం కాపాడుకునేందుకే కదా. అంతకుమించి వాటి ప్రయోజనం ఉండదు.

సుఖదు:ఖాలకు ప్రాముఖ్యం ఇవ్వడం అజ్ఞానము.

ఇక్కడ మనము భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చూద్దాము.
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ ! శీతోష్ణ సుఖదుఃఖాధః
ఆగమాపాయి నిత్యా! తాం న్తితిక్షస్వ భారత!

ఓ అర్జునా! ఇంద్రియముల యొక్క స్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతమును, ఒకప్పుడు ఉష్ణమును, ఒకప్పుడు సుఖమును మరియొకప్పుడు దుఃఖమును గలుగజేయును. మరియు అవి రాకపోకలు కలవియై అస్థిరములై యున్నవి. కాబట్టి వానిని ఓర్చుకొనుము.

దుఃఖానికి కారణములు: బంధం
బంధం అంటే ఒక ప్రాణితో కాని లేదా ఒక వస్తువుతో సంబంధం. ఒక వస్తువు కొన్న మొదట్లో టైమ్ స్పెండ్ చేస్తే దాని మీద ఇష్టం పెరుగుతుంది. మనం టీవిలో ఒక ప్రోగ్రాం చూస్తాము. కొంచెం బాగుంది అనిపిస్తుంది. మరల మరల చూస్తాము.పది రోజులు చూసిన తర్వాత అది చూడకపోతే ఏదో మిస్ అయినట్లు ఉంటుంది. మనము ఏ పని చేస్తున్నా, ఫ్యామిలీతో ఉన్నా, లేకపోతే ఆ టైమ్‌లో ఎవరైనా ఫోన్ చేసినా చికాకుగా ఉంటుంది. ఇక్కడ ఆ ప్రోగ్రాంతో సంబంధం ఏర్పడింది. అట్లానే ఈ సంబంధం అటాచ్‌మెంట్ అవుతుంది. వీటి నుంచి అరిషడ్‌వర్గాలకు ఆహారం దొరుకుతుంది.

ఇంకా బాబా ఇలా చెప్తున్నారు;
మనస్సనే సముద్రంలో సుఖదుఃఖహలు అనే తరంగాలు ఎప్పుడూ పైకి లేస్తూపడుతుంటాయి. నీవనుకొనే సుఖదుఃఖాలు నిజానికి సుఖదుఃఖాలు కావు. అవి వ్యామోహము వలన కలిగిన భ్రాంతి మాత్రమే. అయితే నీకు అనుమానం రావచ్చు. నీళ్ళుంటేనే కదా అలలుంటాయి. దీపముంటేనే కదా ప్రకాశముంటుంది. దీనికి కారణము ఉండాలి గదా? అదేమిటి అని!

అరిషడ్వర్గములే సుఖదుఃఖానికి మూలకారణము. ఆ తరంగాల స్వరూపమే మోహం. అది అసత్యాన్ని సత్యమని, సత్యాన్ని అసత్యం అని అనుపింప చేస్తుంది.

ధనికుని దగ్గర బంగారం చూసి దరిద్రుడు అసూయపడ్తాడు. అప్పుడతని మనసులో అసూయ అనే తరంగం బయలుదేరుతుంది. ఆ బంగారం నా దగ్గర ఉండాలి అన్న భావం మనస్సులోకి రాగానే "లోభం" అనే మరో తరంగం వస్తుంది. 

నానా ! ఎన్నని చెప్పేది. 

ముందు అరిషడ్వర్గములను జయించాలి. అప్పుడవి మనల్ని ఏమీ చేయలేవు. వాటిని జయించితే అప్పుడు మన మనసులో తరంగాలు రావు. అరిషడ్వర్గములను మనము నాశనము చేయలేము. కాని వాటిని మనం బానిసలుగా చేసుకొనవచ్చును.

అరిషడ్వర్గాలు మీద జ్ఞానాన్ని అధికారిగా నియమించాలి. ఆ అధికారి మీద సద్విచారశక్తిని పర్యవేక్షణాధికారిగా నియమించాలి. ఇలా చేస్తే వాటి బాధ ఉండదు.

భగవద్గీతలో సుఖాల గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది
1) సాత్విక సుఖము: క్రమశిక్షణతో, పట్టుదలతో, భక్తి ధ్యాన సేవాదులతో, దుఃఖాన్ని అతిక్రమించి పొందే సుఖము సాత్విక సుఖము. మనము పిల్లలకు చదువుకోమని, చదువుకొంటే సుఖపడ్తారని చెప్తాము. కాని వారి దృష్టి అంతా ఆటల మీద ఉంటుంది. వారికి ఎప్పుడో వచ్చే సుఖము గురించి తెలియదు. అందుకే వారు చదువు మీద శ్రద్ధ చూపరు. కాని వారు పెద్దలు చెప్పిన విధముగా వింటే బాగుపడ్తారు. అట్లానే ఈ సాత్విక సుఖము మనము అర్ధం చేసుకోము. ఎప్పుడో ముసలివాళ్ళు అయిన తరువాత భగవత్ చింతన చేస్తాము అంటారు. కాని అట్లా కుదరదు. మానవ జన్మ ఉన్నప్పుడు మాత్రమే మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి.

2) రాజస సుఖము : విషయేంద్రియ ఆసక్తి మొదట్లో అమృతం అనిపించినా, తరువాత విషమై కూర్చుంటుంది. దాని వలన వాసనలు ఏర్పడి ఆ పాప కర్మలను అనుభవించుటకు క్రిమికీటాకాదులుగా నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది. 

 మనమనుకున్న  సుఖాలు దొరకనప్పుడు దుఃఖం కలుగుతుంది.

3) తామస సుఖము : నిద్ర, సోమరితనం, మోహం వలన వచ్చేసుఖమే తామస సుఖము.  దీని నుంచి వివేకశక్తి నశించి, అబద్ధము, కపటము, హింసాదికర్మలు చేయడం జరుగుతుంది.

ముక్తియే అసలైన సుఖము.
జనన మరణాలే అసలైన డుఃఖము. 





|| ఓం శ్రీ సాయిరాం ||

No comments:

Post a Comment