కర్మ అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు?
మనము చేసే ప్రతి పనికి కర్మ ఫలితమనేది ఉంటుంది. అవి మూడురకాలు.
1) ఆగామి కర్మలు
2) సంచిత కర్మలు
3) ప్రారబ్ధ కర్మలు
1) ఆగామి కర్మలు: మనము చేస్తున్న ప్రతీ కర్మ ఆగామి కర్మల క్రిందకు వస్తుంది. వాటిలో కొన్ని వెంటనేఫలితాన్ని ఇస్తాయి. మరికొన్ని తరువాత కాలంలో, కొన్ని మరు జన్మలలో ఫలితాన్ని ఇస్తాయి.ఉదాహరణకు మనము భోజనము చేస్తాము, అది కర్మ. మనకి ఆకలితీరడం దాని ఫలితం. కాని కొన్నికర్మలు వెంటనే ఫలితం ఇవ్వవు. మనము కొందరిని తిడతాము. దాని ఫలితము తరువాత ఎప్పుడో వస్తుంది.అవి సంచితంలోకి చేరతాయి.
2) సంచిత కర్మలు: మనము పూర్వ జన్మలలో చేసిన ఆగామి కర్మలన్నీ పేర్చబడి సంచితమవుతాయి. అవి ఒక జన్మ నుండి మరొక జన్మకి, అక్కడి నుండి మరొక జన్మకు మనము తీసుకుని వెళ్తాము.
3) ప్రారబ్ధ కర్మలు: సంచితములో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఫలితాన్ని ఇస్తాయి. ఇట్లా మనము అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు. మనము చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడోఒకప్పుడు అనుభవించక తప్పదు. అయ్యో నాకే ఎందుకు అన్నీ ఇలా జరుగుతాయి అని మనము బాధపడ్తాము. దానికి కారణాలు వెదుకుతాము. మనకి బయట ఉన్న వస్తువులను కాని, మనుషులను కానికారణంగా చూస్తాము. నిజానికి మనము చేసుకున్న కర్మల ఫలితమే మనము అనుభవిస్తాము. ఇది అర్ధంచేసుకోకుండా వేరే వాళ్ళను నిందిస్తే - అది ఇంకా పాపము. మరల ఇది సంచితమై కూర్చుంటుంది. మనము ఇవ్వనిదేది మనకు రాదు.
నానా తర్వాత బాబాని ఈవిధముగా ప్రశ్నించడం జరిగింది.
నానా : బాబా ముందు చెప్పినవన్నీ ఈశ్వర నిర్మితములు. చివరిది అంటే ప్రారబ్ధం మాత్రము నాస్వయంకృతము. ఈ సంసారము పట్ల నా మనసు విరిగిపోయినది. దీని నుండి ఎలాగైనా నన్ను రక్షించు అనివేడుకున్నాడు.
బాబా : నానా అవన్నీ నీకు నువ్వు చేసుకున్నవే! ఇప్పుడు వెగటు పడి ఏమి ప్రయోజనము. ఇవన్నీపూర్వజన్మ అనుచితములు. దేహప్రారబ్ధ ఫలమే. ఈ దేహప్రారబ్ధ ఫలమే జన్మకు కారణం. ఈ దేహప్రారబ్ధమును అనుభవించకుండా ఎవరూ తప్పించుకోలేరు. అందుకే ప్రాణులు మరలమరల జన్మలుఎత్తుతాయి.
వీరిలో బీదవారు, మద్యతరగతివారు, ధనవంతులు, ఇతర జనులు ఉంటారు. అట్లానే జంతువులన్నిజీవించటానికి ప్రాణమే కారణం. అది అన్నింటిలో సమానంగా ఉంటుంది, కాని వాటిని బాహ్యంగా చూస్తే భిన్నంగా ఎందుకున్నాయి. ఇది ఎప్పుడైన ఆలొచించావా. వారి వారి సంచితకర్మ ఫలాన్ని బట్టి ప్రాణులు ఒకరికి ఒకరు భిన్నంగా తోస్తారు. ఆయా దేహాలకు అనుగుణంగా వారి వారి లక్షణాలు ఉంటాయి. వాటిని చూసి వెగటు పడి ఏమి ప్రయోజనం. పులి మాంసం తింటుంది, పంది అమేద్యం తింటుంది. తోడేలు పాతిపెట్టిన శవాల్ని తింటుంది, రాజహంస లేత తామరాకులను సేవిస్తుంది, గ్రద్ధలు కుళ్ళిపోయిన మాంసాన్ని భక్షిస్తాయి. వాటి దేహ స్వభావమే అంత. ఏ శరీరంలో ఉంటే దానికి ఆ లక్షణం వస్తుంది. ఇది సృష్టి ధర్మం. ఆ ధర్మాన్నిఅనుసరించి ప్రాణులు దేహ ప్రారబ్ధాన్ని ఇంచుమించుగా అనుభవిస్తాయి.
బాబా ఇంకా చెబుతూ...
కొన్ని సింహాలు అడవిలో స్వేచ్చగా తిరుగుతాయి. కొన్నింటిని బంధించి ఊరూరా తిప్పుతారు. ధనవంతుని ఇంట కుక్క పట్టుపరుపుల పై పడుకుంటుంది. కొన్ని కుక్కలకు ఆహారం దొరకదు.
ఈ హెచ్చుతగ్గులకు కారణం ఏమిటి?
దేహప్రారబ్ధమే!
దాన్ని అనుభవించకుండా ఎవరూ తప్పించుకోలేరు. ఏ న్యాయం జంతువులకు వర్తిస్తుందో అదే మానవులకు కూడా వర్తిస్తుంది.
వాసన : శరీరము, భార్య పుత్రులు, ధనము, గౌరవ ప్రతిష్టలు మొదలుగా గల ప్రియములైన వాటిని రక్షించుకొనుటకు అప్రియములైన వాటిని తొలగించుకొనుటకును ఏర్పడు (రాగ ద్వేష జనితమైన) సూక్ష్మమైన కోరికనే వాసన.
స్పృహ: మన కిష్టమైనది లేనపుడు దాని అవసరం గుర్తించినప్పుడు అది లేకపోతే పని జరుగదుఅనుకున్నప్పుడు, కలిగే భావమునే స్పృహ అంటారు. ఇది వాసన యొక్క వికసిత రూపము.
ఇచ్చ: మనకి కావల్సింది లేనప్పుడు దానిని కోరుకోవటమూ మరియు వానికి అప్రియమైన వస్తువును దూరం చేసుకునటమే ఇచ్చ. ఇది కోరిక యొక్క సంపూర్ణ వికసిత రూపము.
తృష్ణ: మనకి కావల్సినవి లభించినను, ఇంకా దానిని వృద్ధి చేయడమే తృష్ణ. ఇది కోరిక యొక్క సంపూర్ణస్థూల రూపము.
ఒకడు పేదవాడు, ఒకడు ధనవంతుడు, ఒకడు ధరిద్రుడు, ఒకడు అన్ని విలాసాలనుఅనుభవిస్తాడు, ఒకడికి ఇల్లు వాకిలి లేవు, ఒకడు అనాధగా బిచ్చమెత్తుకుంటాడు, కొందరికి సంతానంకల్గుతుంది, కొందరికి బిడ్డలు చనిపోతారు, కొందరికి సంతానమే ఉండదు ఇట్లా అన్ని తారతమ్యాలకు కారణం ఈ కర్మ సిద్దాంతమని చెప్పవచ్చు. మనము ఈ జనన మరణ జీవన చక్రంలో పడి నలిగిపోతూఉంటాము అని బాబా నానాకు చెప్పడం జరిగింది.
|| ఓం సాయిరాం ||
No comments:
Post a Comment