సాయి
కృప అపారమైనది. అందుకే నానా చందోర్కరును షిర్డికి రప్పించుకొని మరీ రక్షించారు. ఆయనతో
ఉన్న జన్మజన్మల సంబంధాన్ని చెప్పి ఆయనను సరియైన దారిలో నడిపించారు. ఒకసారి నానా చందొర్కరు,
బేరే, నానా సాహెబ్ నిమోర్కరు, లక్ష్మణ్ మారుతి
మొదలైన వారు అందరు బాబా వద్ద కూర్చుని ఉన్నారు. అప్పుడాయన బాబాని ప్రార్ధించి
ఆయనను బోధచేయమని అర్ధించడం జరిగింది. అప్పుడు బాబా సాధన చతుష్టయం గురించి చెప్పడం జరిగింది.
ఈ
సాధన చతుష్టయంలో సంపన్నులమైనప్పుడు మాత్రమే బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. తన్నుతాను
ఉద్ధరించుకొనటానికి శుద్ధమైన వస్తువును సాధించటానికి ఎన్నుకునే ఉపాయాలు, ప్రయత్నాలే
సాధన.
ఈ
సాధన నాలుగు రకాలు:
1)
నిత్యానిత్యవస్తు వివేకము:
బ్రహ్మసత్యము
: జగన్మిద్య అనే భావం ధృడమవడమే నిత్యానిత్యవివేక జ్ఞానము. ఈ
నిత్యానిత్య వివేకాన్ని బయట పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి కొందరు తమ మూర్ఖత్వము
బయటపెట్టుకుంటారు. కొందరు
జట్లు జట్లుగా భిక్ష చేస్తూ పండరీపురం పోతారు. కాని ఒక్కడైన హరి చాలుననుకున్నవాడు లేడు.
హరి ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఎట్లా ఉంటాడు? ఈ విషయాలు ఎవరికి తెలుసు? ఇలా యాత్రలు చేసేవారు
నిజమైన హరిభక్తులు కారు.
కొందరు
ఎన్నో గ్రంధాలు ఎంతో చక్కగా చదువుతారు. ఇతరులకు ఉపదేశాలిస్తారు. కాని వారి అంతరంగము
పరిశుద్దం కానంత వరకు వాటి వల్ల ఏమి ప్రయోజనం? వారు జ్ఞాన సరోవరంలోని కప్పల వంటివారు.
వాదం రూపంలో నున్న బురదను సేవిస్తూ మకరందాన్ని వదిలేస్తారు.
2)
వైరాగ్యం :
ఎవరు
పరనింద చేస్తారో వాళ్ళు బురదలో పడి ఉంటారు. వాళ్ళకు వివేకం రాదు. వాదోపవాదాలు, పరనిందా
ప్రసంగాలు చేసేవారు బ్రహ్మజ్ఞానానికి పనికిరారు. ఇహ,
పరలోకాలకు సంభందించిన విషయాలలో ఆశ లేకుండా ఉన్నవాడే వైరాగ్యం మూర్తీభవించినవాడు. నానా
ఇది నిశ్చలంగా సత్యమని తెలుసుకో.
3)
శమదమాధిషట్కము:
నానా!
శమ, దమ, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ మరియు సమాదానాలనే ఆరింటిని శమదమాధిషట్కము అంటారు.
శమము:
ఇంద్రియ విషయముల యందు మనోనిగ్రహము కలిగి ఉండటమే శమము అంటారు.
దమము
: ఒకవేళ కొన్ని విషయాల యందు ఆసక్తి కలిగిన వెంటనే ఆ చాంచల్యాన్ని బలవంతంగా అణిచివేయటమే
దమము అంటారు.
తితీక్ష
: మనకు ప్రారబ్ధవశాన ప్రాప్తించిన వాటిని ఓర్పుగా సహించటమే తితీక్ష.
ఉపరతి
: మాయాజాలంలో చిత్తం చిక్కు పడక, కాంత, కనకములు, సంతానము, ఆప్తులు వీళ్ళంతా మిధ్య అని
గ్రహించడం ఉపరతి అంటారు.
శ్రద్ధ
: దృడ విశ్వాసముతో మెలగడం శ్రద్ధ అని అంటారు.
సమాధానం
: సుఖదుఃఖాలను సమభావముతో చూస్తూ అంతరంగంలో ఎలాంటి తడబాటు లేక నిశ్చలంగా ఉండటమే సమాధానము.
4) ముముక్షత్వము
: మనస్సులో బలంగా మోక్షేఛ్ఛ కలిగి ఇతరం తలచక అపరోక్ష జ్ఞానానికి కావలసిన బాటకోసం వెదికేవాడు
ముముక్షువు. ముముక్షువుకు ఏ లక్షణములుంటాయో దాని పేరు ముముక్షత్వము.
మోక్షమంటే
వైకుంఠం, కైలాసం కాదు. మోక్షం చాలా కష్టతరమైనది. దాన్ని చేరే మార్గము చాలా దుర్లభమైనది.
నానా గమనించు! జగత్తుకు మూలమైనట్టి శుద్ధచైతన్యంతో తాదాత్మ్యం చెందడమే పురుషార్ధము.
ఇది లేకపోతే మిగిలినదంతా నిరుపయోగము అని బాబా చెప్పారు.
|| ఓం సాయిరాం ||
No comments:
Post a Comment