In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Saturday, October 19, 2019

మన సాయి -మన గురువు




సాయి ఎవరు? ఆయన దేవుడా! గురువా! ముస్లిం మతస్తులు భావించే ఒక పీరా!

 అసలు వారెవరో, వారు అందరిలాగా పుట్టి పెరిగారా! అనే విషయాలు ఎప్పుడు మాట్లాడలేదు. మనకు ఎందరో మహానుభావులు ఉన్నారు. వారి జీవిత చరిత్రలు మనం చదువుతాము. సాయి విషయంలో మాత్రం పుట్టు పూర్వోత్తరాలు ఉండవు. ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎన్నో భావనలు మనం చూస్తాము. ఒక్కొక మతం వారి వారి ఆలోచన పరిధిలో భగవంతుడు ఇలా ఉంటాడు, మనం ఇలా ఆరాధిస్తే ఆ భగవంతుడిని చేరుకుంటాము అనే విషయాలను చెప్పారు. ఏ మతం సరిఅయినది? ఏ దారి మనలను భగవంతుడి దగ్గరకు తీసుకుపోతుంది? అనే ప్రశ్నలు మనలను వేధిస్తూ ఉంటాయి. ఒక్కొక్క గురువు ఒక్కో మార్గం చెప్పారు. అప్పడు మనం ఏమి  చేయాలి? ఏ మార్గం ఎంచుకోవాలి? ఆ మార్గం ఎదో మనకు ఎలా తెలుస్తుంది? 

భగవంతుడు మాత్రం ఒక మార్గానికె పరిమితం కాదు, అన్ని దారులు మనలను భగవంతుడివైపే నడిపిస్తాయి అన్న సత్యాన్ని, అన్ని మతాల సారం ఒక్కటే అన్న నిజాన్ని జీవితంలో ఆచరించి చూపించారు బాబా.   మనం ఆ భగవత్ తత్వానికి ఎలా దగ్గర అవుతాము? అది ఎలా ఒక లీలా మాత్రంగా జరుగుతుంది అనే సంఘటనలను శ్రీ సాయి సత్చరితలో చూపించారు బాబా. ఒక్కొక్క భక్తుడు బాబాకు ఎలా దగ్గర అవ్వటం జరుగుతుందో ఊహించుకుంటేనే పరవశం కలుగుతుంది. 

శ్రీ సాయి గురువరేణ్యులను పరబ్రహ్మగా, సర్వ దేవతా స్వరూపంగా ప్రణామాలు చేయుచు వారి చూపించిన మార్గంలో నడిచే శక్తిని మనందరికి ప్రసాదించమని వేడుకుందాము. వారు చూపించిన మార్గంలో నడవాలి అంటే మొట్ట మొదట వారు చూపించిన దారి ఏమిటి అనే విషయం అర్ధం చేసుకోవాలి. వారినుంచి మనం పొందవలిసిన అసలైన, శాశ్వతమైన సత్యం ఏమిటో తెలుసుకోవాలి. సాయి చరితకు సత్చరిత అనే పేరే ఎందుకు? వేరే పేరు పెట్టి ఉండచ్చు కదా. పేరులోనే ఈ సత్యం ఉంది. సాయి ఈ గ్రంధం ద్వారా సత్యాన్ని మాత్రమే బోధించారు. సత్యాన్ని చెప్పే గ్రంధం కాబట్టి ఇది శ్రీ సాయి సత్చరితగా బాబా మనకు ఇచ్చారు. మనం మన కోరికల కోసం పారాయణ చేసినా చివరికి సత్యాన్ని బోధించే గ్రంధం ఈ గ్రంధరాజం. బాబా అప్పట్లో గురు చరిత్ర చదవమని కొంతమందిని ప్రోత్సహించేవారు. ఎందుకంటే పరమగురువుల గురించి తెలుసుకుంటే మనకు సత్యం ఏమిటో బోధపడుతుంది. 

శ్రీ సాయి సత్చరితను మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని, బాబా చూపించిన దారిలో నడుద్దాము.  ప్రతి ఒక్కరి జీవితంలో గురువుయొక్క ఆగమనం విశేషంగా ఉంటుంది. అది ఎలా జరుగుతుందో ఊహించుకుంటేనే సంభ్రమ ఆశ్యర్యాలు కలుగుతాయి. అందుకే సాయి భక్తులారా అంతఃకరణాన్ని సాయికి సమర్పించండి, శ్రద్ద సభూరి అనే మంత్రాలను నిత్యం జపం చేయండి. అప్పుడు మనలోనే ఉన్న సత్యం సత్చరిత రూపంలో వ్యక్తం అవుతుంది. ఇదే సాయి మన నుంచి కోరుకునే నిజమైన సమర్పణ. బాబా నా వారే, నా కోసమే బాబా ఇవన్నీ చేస్తారు అన్న నమ్మకం సాయి భక్తులను ముందుకు నడిపిస్తుంది.

ఓం శ్రీ సాయిరాం !


My Sai- My Guru





Who really Sai is? Is he God or Teacher? Is he a peer who Muslims worship? 

 Sai never talked about his birth or his greatness. We might have read the biographies of great saints but we do not talk about his biography. His main focus was to make us walk towards the ultimate truth. There could be so many religions in this world and they have their expression of God.  They might have showed us different paths but which is the right way.  How do we decide which is the right path? 

God is not limited to just one path and all the paths lead us towards God. The essence of truth is same no matter which religion and what ever the teaching might be. Baba showed this truth by living. Sai Satcharita shows this truth through routine incidents of life in the first chapter itself. This is all seen as miracles of Sai but through his devotees. We can not even imagine how these incidents take place and how we meet our Guru. 

Let us prostrate to our parama Guru who is the supreme soul and who is the embodiment of all the great qualities of divinity. We will make every effort to walk the path that Sai showed and ask Sai to give us the strength to do so. First we need to understand the Sai's path and then only we can follow that path. What is really the truth that needs to be experienced and Why the name Satcharita? Satcharita means the story of truth.  That's why Sai gave us this great scripture. Even we tend to read this for materialistic gains but in the end it will make us realize the truth. Baba used to encourage his devotees to read Guru Charitra at that time so that they can realize the truth. Sai Satcharita is our Guru Charitra.

let us make the Sai Satcharita a part of our life and walk the walk. It is so amazing to watch how this miracle happens in every one's life and to make this happen we have to offer our heart to Sai. We have to internalize Sraddha and Sabhuri. Then the truth will reveal itself from inside us. This is what Sai wants us do and surrender with heart full of love. Every devotee feels special and thinks that Sai belongs to them.  

OM SRI SAIRAM!

Thursday, October 3, 2019

సాయి మహాసమాధి



బాబా శరీరాన్ని వదిలే ముందు కొన్ని సూచనలు ఇచ్చారు. బాబా విజయదశమి రోజున మహాసమాధి చెందారు. మహాసమాధికి కొన్ని రోజుల ముందు వజే అనే ఆయన చేత బాబా రామ విజయం అనే గ్రంధాన్ని చదివించుకున్నారు. మొట్టమొదట వజే ఏడు రోజుల్లో పారాయణం పూర్తి చేస్తారు. రెండో సారి రాత్రిపగలు చదివి రెండవ పారాయణం పూర్తి చేస్తారు. మరల బాబా మూడో సారి చదవమంటారు. తాను మూడు రోజులు చదివి అలసిపోతాడు. అప్పుడు బాబా అతనికి సెలవిచ్చి పంపుతారు. ఎవరైనా మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారి వారి మత గ్రంధాలు చదవడం ఆనవాయితి. అలానే శుక బ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు ఏడు రోజులలో భాగవతం చెప్పి ఆయనను అనుగ్రహించారు. బాబా పరమాత్మ అయినా సంప్రదాయాన్ని అనుసరించి రామవిజయ పారాయణ చేయించారు.
  
బాబా చివరిక్షణం వరకు భక్తులకు సలహాలు ఇస్తూ ధైర్యం చెప్పారు. రెండు మూడు రోజుల ముందు భిక్షకు వెళ్లడం మానేశారు. కాకాసాహెబు దీక్షిత్ మరియు శ్రీమాన్ బూటీ గారు ద్వారకామాయిలోనే భోజనం చేసేవారు. అక్టోబర్ 15 1918 రోజున వారిని బాబా వాడాకు వెళ్లి భోజనం చేయమని ఆజ్ఞాపిస్తారు. అక్కడ ఇంకా లక్ష్మి బాయి, భాగోజి షిండే, భయ్యాజీ, బాలా షిమ్పే మరియు నానాసాహెబ్ నిమోన్కర్ ఉంటారు. శ్యామా మెట్లమీద కూర్చొని ఉంటారు. లక్ష్మి బాయికి తొమ్మిది నాణాలు ఇచ్చిన తరువాత బాబా ఇలా అంటారు " మసీదులో తనకు బాగాలేదని, తనను రాతితో కట్టిన బూటీ మేడలోకి తీసుకుపోయిన బాగుండునని చెప్పారు. ఇలా అంటూ భయ్యాజీ మీదకు ఒరిగి ప్రాణములను విడుస్తారు. భాగోజి ఈ విషయం నిమోన్కర్కు చెప్పగా, ఆయన బాబా నోటిలో కొంచెం నీరు పోస్తే అది కాస్తా బయటకు కారిపోతుంది. అప్పుడు ఆయన దేవా! అనగా బాబా మెల్లగా "ఆ" అంటారు. ఇక తరువాత తమ భౌతిక శరీరం వదిలివేస్తారు. 

షిర్డీ అంతా బాబా మహాసమాధి చెందిన వార్త పాకి అందరు అక్కడకు వస్తారు. అందరిలో తరువాత కార్యక్రమం మీద, ఎలా సమాధి చేయాలి అనే అంశం మీద చర్చ జరిగింది. ముస్లిం భక్తులు బాబా శరీరాన్ని ఆరుబయట సమాధి చేసి గోరి కట్టాలి అని నిర్ణయించారు. కాని రామచంద్ర పాటిల్ మిగిలిన గ్రామస్థులందరితో కలిసి బాబా కోరిన విధంగా బూటీ వాడాలో ఉంచాలి అని తీర్మానించారు. ఈ రెండువాదనల ఎటు తేలక పొతే అందరిలో కలవరం మొదలయ్యింది. అప్పుడు రహాతానుండి సబ్ ఇన్స్పెక్టర్, కోపర్గావ్ నుండి మామల్తదార్ మరియు కొందరు అధికారులు వస్తారు. వారు ఎన్నిక జరగాలి అని నిశ్చయించితే ఎక్కువ ఓట్లు బాబా కోరిన దాన్నే బలపరుస్తాయి. అప్పుడు బూటీ వాడాలో ఎక్కడైతే మురళీధరుని ఉంచాలి అనుకున్నారో అదే స్థానంలో బాబా శరీరాన్ని ఉంచుతారు. ఇక్కడ నార్కే గారు ఒక్క  విషయం చెప్పారు. బాబా శరీరం 36 గంటల తరువాత కూడా ఏమి పాడవకుండా ఉంది. ఆయన కఫినీని చింపకుండా తీయగలిగారు. బాలాసాహెబ్ భాటే, ఉపాసినీ బాబా కలిసి జరగవలిసిన కార్యక్రమాలు దగ్గర ఉండి పూర్తి చేస్తారు. 

బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు బాబా ఎప్పుడు తన దగ్గరే ఉంచుకొని అపురూపంగా చూసుకునే ఇటకరాయి రెండు ముక్కలు అవుతుంది. మసీదును సుబ్రపరిచే ఒక కుర్రవాడు పొరపాటున ఆ ఇటకరాయిని శుభ్రం చేస్తూ క్రింద పడవేస్తాడు. అప్పుడు అది రెండు ముక్కలు అవుతుంది. బాబా వచ్చి ఈ విషయం తెలుసుకొని ఇలా అంటారు. ఇది ఇటుక కాదు. నా యదృష్టమే ముక్కలు అయిపోయినది. అది నా జీవితపు తోడూనీడ. దాని సహాయం వలననే నేను ఆత్మానుసంధానము చేసేవాడిని. ఈ రోజు అది నన్ను విడిచినది అని అంటారు. ఈ ఇటుకపై బాబాకు ఇంత ప్రేమా అని మనం అనుకోవచ్చు. కాని దీని విషయం బాబాకే తెలియాలి. వారు సుద్ద చైతన్యులు. వారికి ఈ అశాశ్వతమైన వాటి మీద మమకారం ఉండదు. ఈ ఇటుక గురు భక్తికి ప్రతీకగా కొందరు చెప్తారు.  జీవన్ముక్తులకు ఇలా ప్రాపంచిక పరంగా అందరిలాగా భౌతిక పరంగా ఆలంబన ఉండదు. కాని అందరిలాగా వారు ప్రవర్తించవచ్చు. 

ఓం శ్రీ సాయిరాం !

Sai Mahasamadhi



Baba knew when he is going to leave his body so he asked Mr. Vaze to read Rama Vijaya to him. He read this for one week, then Baba asked him to read this again day and night. In the next three days he finished the parayana. Then third time Baba asked him to continue but Mr. Vaze was exhausted. Still he read for three more days. Baba let him go and kept to himself for the ultimate moments. Here Baba followed the general practice amongst the Hindus that when a man is about to die, some good religious scripture is read out to him with the object that his mind should be withdrawn from worldly things and fixed in matters spiritual, so that his future progress should be natural and easy. We all heard about Great Shuka brahma expounding Bhagavat purana to king Parikshit who was cursed by the son of a Brahmin Rishi and was about to die after a week.  Baba being an incarnation of God needed no such help, but just to set an example to the people, He followed this practice.


Baba let nobody know the exact time of His departure. Baba stopped going for bhiksha two or three days before his Mahasamadhi. He was conscious to the last and was advising the devotees not to lose heart. Kakasaheb Dixit and Booty were dining daily with Him in the Masjid. That day (15th October) after arati, Baba asked them to go to their residence for dining. Still a few, viz., Laxmibai Shinde, Bhagoji Shinde, Bayaji, Laxman Bala Shimpi and Nanasaheb Nimonkar remained there. Shama was sitting down on the steps. After giving Rs. 9/- to Laxmibai Shinde, Baba said that He did not feel well in the Masjid and that He should be taken to the Dagadi (stone) Wada of Booty, where He would be alright. Saying these last words, He leaned on Bayaji, he left his mortal coil. Bhagoji noticed that His breathing had stopped and he immediately told this to Nanasaheb Nimonkar who was sitting below. Nanasaheb brought some water and poured it in Baba's mouth. It came out. Then he cried out loudly 'Oh Deva.' Baba seemed just to open His eyes and say 'Ah' in a low tone. But it soon become evident that Baba had left His body for good.


Everyone in Shirdi came running to Dwarakamai as they heard the news. Then the big question arose on how to dispose Baba’s physical body? Muslims wanted this to happen in an open space with a tomb. Other people did not agree with this opinion as Baba asked to be taken to Booty wada. After 36 hours of conflict some officers came and everyone voted for this. More people voted to support Baba’s word that he should be in Booty wada. While all the arguments were going on, Baba appeared to Laxman Joshi and told him to continue with arathi. Then Bapusaheb Jog did the afternoon arathi. On Wednesday evening Baba's body was taken in procession and brought to the Wada and was interred there with due formalities in the garbha, i.e., the central portion reserved for Murlidhar. In fact Baba became the Murlidhar and the Wada became a temple and a holy shrine, where so many devotees went and are going now to find rest and peace. All the obsequies of Baba were duly performed by Balasaheb Bhate and Upasani, a great devotee of Baba.


Breaking of the Brick
Baba gave another indication also which occurred few days before Baba’s Mahsamadhi. Baba used to rest on a brick and used this as a pillow. One day, during Baba's absence, a boy who was sweeping the floor, took it up in his hand, and unfortunately it slipped from thence fell down broken into two pieces. When Baba came to know about this, He bemoaned its loss, crying - "It is not the brick but My fate that has been broken into pieces. It was My life-long companion, with it I always meditated on the Self, it was as dear to Me as My life, it has left Me to-day." Some may raise here a question - "Why should Baba express this sorrow for such an inanimate thing as a brick?" To this Hemadpant replies that saints incarnate in this world with the express mission of saving the poor helpless people, and when they embody themselves and mix and act with the people, they act like them, i.e., outwardly laugh, play and cry like all other people, but inwardly they are wide awake to their duties and mission.


OM SRI SAIRAM!