In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Thursday, October 3, 2019

సాయి మహాసమాధి



బాబా శరీరాన్ని వదిలే ముందు కొన్ని సూచనలు ఇచ్చారు. బాబా విజయదశమి రోజున మహాసమాధి చెందారు. మహాసమాధికి కొన్ని రోజుల ముందు వజే అనే ఆయన చేత బాబా రామ విజయం అనే గ్రంధాన్ని చదివించుకున్నారు. మొట్టమొదట వజే ఏడు రోజుల్లో పారాయణం పూర్తి చేస్తారు. రెండో సారి రాత్రిపగలు చదివి రెండవ పారాయణం పూర్తి చేస్తారు. మరల బాబా మూడో సారి చదవమంటారు. తాను మూడు రోజులు చదివి అలసిపోతాడు. అప్పుడు బాబా అతనికి సెలవిచ్చి పంపుతారు. ఎవరైనా మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారి వారి మత గ్రంధాలు చదవడం ఆనవాయితి. అలానే శుక బ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు ఏడు రోజులలో భాగవతం చెప్పి ఆయనను అనుగ్రహించారు. బాబా పరమాత్మ అయినా సంప్రదాయాన్ని అనుసరించి రామవిజయ పారాయణ చేయించారు.
  
బాబా చివరిక్షణం వరకు భక్తులకు సలహాలు ఇస్తూ ధైర్యం చెప్పారు. రెండు మూడు రోజుల ముందు భిక్షకు వెళ్లడం మానేశారు. కాకాసాహెబు దీక్షిత్ మరియు శ్రీమాన్ బూటీ గారు ద్వారకామాయిలోనే భోజనం చేసేవారు. అక్టోబర్ 15 1918 రోజున వారిని బాబా వాడాకు వెళ్లి భోజనం చేయమని ఆజ్ఞాపిస్తారు. అక్కడ ఇంకా లక్ష్మి బాయి, భాగోజి షిండే, భయ్యాజీ, బాలా షిమ్పే మరియు నానాసాహెబ్ నిమోన్కర్ ఉంటారు. శ్యామా మెట్లమీద కూర్చొని ఉంటారు. లక్ష్మి బాయికి తొమ్మిది నాణాలు ఇచ్చిన తరువాత బాబా ఇలా అంటారు " మసీదులో తనకు బాగాలేదని, తనను రాతితో కట్టిన బూటీ మేడలోకి తీసుకుపోయిన బాగుండునని చెప్పారు. ఇలా అంటూ భయ్యాజీ మీదకు ఒరిగి ప్రాణములను విడుస్తారు. భాగోజి ఈ విషయం నిమోన్కర్కు చెప్పగా, ఆయన బాబా నోటిలో కొంచెం నీరు పోస్తే అది కాస్తా బయటకు కారిపోతుంది. అప్పుడు ఆయన దేవా! అనగా బాబా మెల్లగా "ఆ" అంటారు. ఇక తరువాత తమ భౌతిక శరీరం వదిలివేస్తారు. 

షిర్డీ అంతా బాబా మహాసమాధి చెందిన వార్త పాకి అందరు అక్కడకు వస్తారు. అందరిలో తరువాత కార్యక్రమం మీద, ఎలా సమాధి చేయాలి అనే అంశం మీద చర్చ జరిగింది. ముస్లిం భక్తులు బాబా శరీరాన్ని ఆరుబయట సమాధి చేసి గోరి కట్టాలి అని నిర్ణయించారు. కాని రామచంద్ర పాటిల్ మిగిలిన గ్రామస్థులందరితో కలిసి బాబా కోరిన విధంగా బూటీ వాడాలో ఉంచాలి అని తీర్మానించారు. ఈ రెండువాదనల ఎటు తేలక పొతే అందరిలో కలవరం మొదలయ్యింది. అప్పుడు రహాతానుండి సబ్ ఇన్స్పెక్టర్, కోపర్గావ్ నుండి మామల్తదార్ మరియు కొందరు అధికారులు వస్తారు. వారు ఎన్నిక జరగాలి అని నిశ్చయించితే ఎక్కువ ఓట్లు బాబా కోరిన దాన్నే బలపరుస్తాయి. అప్పుడు బూటీ వాడాలో ఎక్కడైతే మురళీధరుని ఉంచాలి అనుకున్నారో అదే స్థానంలో బాబా శరీరాన్ని ఉంచుతారు. ఇక్కడ నార్కే గారు ఒక్క  విషయం చెప్పారు. బాబా శరీరం 36 గంటల తరువాత కూడా ఏమి పాడవకుండా ఉంది. ఆయన కఫినీని చింపకుండా తీయగలిగారు. బాలాసాహెబ్ భాటే, ఉపాసినీ బాబా కలిసి జరగవలిసిన కార్యక్రమాలు దగ్గర ఉండి పూర్తి చేస్తారు. 

బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు బాబా ఎప్పుడు తన దగ్గరే ఉంచుకొని అపురూపంగా చూసుకునే ఇటకరాయి రెండు ముక్కలు అవుతుంది. మసీదును సుబ్రపరిచే ఒక కుర్రవాడు పొరపాటున ఆ ఇటకరాయిని శుభ్రం చేస్తూ క్రింద పడవేస్తాడు. అప్పుడు అది రెండు ముక్కలు అవుతుంది. బాబా వచ్చి ఈ విషయం తెలుసుకొని ఇలా అంటారు. ఇది ఇటుక కాదు. నా యదృష్టమే ముక్కలు అయిపోయినది. అది నా జీవితపు తోడూనీడ. దాని సహాయం వలననే నేను ఆత్మానుసంధానము చేసేవాడిని. ఈ రోజు అది నన్ను విడిచినది అని అంటారు. ఈ ఇటుకపై బాబాకు ఇంత ప్రేమా అని మనం అనుకోవచ్చు. కాని దీని విషయం బాబాకే తెలియాలి. వారు సుద్ద చైతన్యులు. వారికి ఈ అశాశ్వతమైన వాటి మీద మమకారం ఉండదు. ఈ ఇటుక గురు భక్తికి ప్రతీకగా కొందరు చెప్తారు.  జీవన్ముక్తులకు ఇలా ప్రాపంచిక పరంగా అందరిలాగా భౌతిక పరంగా ఆలంబన ఉండదు. కాని అందరిలాగా వారు ప్రవర్తించవచ్చు. 

ఓం శ్రీ సాయిరాం !

No comments:

Post a Comment