In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, November 25, 2015

శ్రీ శాంతారామ్ బల్వంత్ నాచ్నే-1



Play Audio




మానవుడు తరించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎందరో మహానుభావులు ఈ మార్గాలను మనకు చూపించి మార్గదర్శకత్వం చేశారు. మహానుభావుడు, విష్ణు అంశ అయిన వేదవ్యాసుడు ఎన్నో ఆథ్యాత్మిక గ్రంథాలను లోకానికి ఇవ్వడం జరిగింది. వేదాలను విభజించి, బ్రహ్మ సూత్రాలు వ్రాసి ఉపనిషత్తులు చెప్పారు. అలానే మహాభారతం, భగవద్గీత, అష్టాదశ పురాణాలను ఆయన లోకానికి ఇచ్చారు. కాని ఆయనలో ఏదో అసంతృప్తి. అప్పుడే భాగవతం ఆవిర్బవించింది. భాగవతం అంటే భగవంతుని లీలలు. అలానే సాయి భక్తులు సాయిలీలలను  తెలుసుకొని పారాయణం చేస్తూ, సాయి పట్ల ఋణానుబంధం పెంచుకోవడమే సాధన. సాయి అపరదయామయులు ఆయన కృప అపారమైనది. ఆయన ఏ సాధనలు లేకుండానే మనకు అనుభవాలను కలుగచేస్తారు. 

ఆయన మనల్ని అడిగింది ఏమిటి? 

జీవితాన్ని సరిదిద్దుకొని మంచి బాటలో నడుస్తూ, ధర్మాన్ని పాటిస్తూ, దయ, కరుణలతో ఉండమన్నారు. నమ్మకం, ఓర్పు అనే రెండు మంత్రాలను మనకు ఇచ్చారు. అన్నింటికన్నా సులువైన సాధన భగవంతున్ని ప్రేమించడమే. ఆ ప్రేమతత్వాన్ని శ్రీ కృష్ణుడు సర్వమానవాళికి పంచాడు. అలానే సాయి అవతార మహిమ కూడా ఇదే తత్వాన్ని తెలియచేస్తుంది. ఈ విశ్వంలో ప్రేమకు లొంగని వస్తువు ఉండదు. ఎందుకంటే ఉన్నది ఒకే తత్వం, అదే తత్వం అనేక రూపాలుగా కనిపిస్తూ ఉంది. ఉన్నది ఒక్కటే అయినప్పుడు అది మనతత్వమే అయినప్పుడు మనకు అంతుచిక్కకుండా ఉండదు. అందుకే మనము సాయితత్వాన్ని, ఆయన లీలలను తెలుసుకొని తరిద్దాము.

                నాచ్నే పూర్తిపేరు శాంతరాం బల్వంత్ నాచ్నే. ఆయన ఒక మెజిస్త్రేట్ కోర్టులో హెడ్ గుమస్తాగా పనిచేసేవారు. ఆయన 1923 లో సాయిలీల మాసపత్రిక ద్వారా తన అనుభవాలను కొన్ని తెలియచేసారు. తరువాత శ్రీ నరసింహస్వామి గారికి సెప్టెంబర్ 1936 లో మరి కొన్ని అనుభవాలను చెప్పారు. ఆయన జీవితంలో బాబా ఎలా ప్రవేశించారు. ఆయన కుటుంబాన్ని ఎలా రక్షించారు అన్న విషయాలు మనము తెలుసుకుందాము.

బాబా సాధువుగా వచ్చుట
మానవ జీవితం కష్టాలతో నిండి ఉంటుంది. ఒక్కోసారి ఏదో ఒక అదృశ్య శక్తి మనలను కాపాడుతూ ఉంటుంది. మనక్కూడా అర్ధం అవుతుంది. ఈ అదృశ్యశక్తి లేకుండా ఈ కష్టం నుంచి నేను బయట పడడం అసాధ్యం అని.  అలాంటి సంఘటనే నాచ్నే విషయంలో కూడా జరిగింది. బాబా అంటే ఎవరో తెలియనప్పుడు కూడా బాబా దగ్గర ఉండి రక్షించారు.

                ఒకసారి 1909 లో నాచ్నే అన్నగారికి గొంతుదగ్గర ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆయనను బొంబాయిలోని జజేకర్ హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పుడు నాచ్నే దహను అనే ఊరిలో ఉండేవారు. నాచ్నే ఇంటికి ఒక సాధువు రావడం జరిగింది. ఆయన వచ్చి రెండు రొట్టె ముక్కలు ఉంటే పెట్టమని అడిగాడు. వారు అతనిని లోపలికి సాదరంగా ఆహ్వానించి నాచ్నే వదినగారు అన్ని వడ్డించారు. ఆమె ఇంట్లో ఉన్న బెండకాయ కూర తప్ప అన్ని సాధువుకు పెట్టడం జరిగింది. ఆ బెండకాయ కూర అంతకుముందు వండినది. ఆ సాధువు నాకు ఆ కూరే కావాలని అడిగి పెట్టించుకుంటారు.

                ఆ సాధువు భోజనంచేసి అందరిని ఆశీర్వదించి హాస్పిటల్‌లో ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోతారు. అందరూ ఆశ్చర్యపోతారు. ఈయనకు ఆపరేషన్ గురించి ఎలా తెలిసింది ఈయన ఎవరో మహానుభావుడని భావిస్తారు. అదే రోజు నాచ్నే స్నేహితుడైన హలిభావు మోరేశ్వర్ పాన్సే" సాయిబాబా కృప వలన అంతా చక్కగా జరుగుతుంది" అంటారు.  నాచ్నే అదే మొదటిసారి సాయి పేరు వినడం. ఇంతలో నాచ్నే నాన్నగారు బొంబాయి నుండి వచ్చి ఆపరేషన్ బాగా జరిగిందని ప్రమాదం ఏమీలేదని చెప్తారు. ఆపరేషన్ అయిన తర్వాత ఒక సాధువు వచ్చి ఆపరేషన్ జరిగిన భాగంపై తన చేతిని ఉంచి "అంతా మంచే జరుగుతుంది" అని ఆశీర్వదించి వెళ్ళారు. ఇలా నాచ్నే తండ్రి గారు చెప్పగానే వాళ్ళకి అర్ధం అయింది. ఒకే సాధువు దహనులో మరియు బొంబాయిలో కనిపించి మహత్తరమైన లీలను చూపి రక్షించారు. ఇదే విషయాన్ని తరువాత కాలంలో నాచ్నే షిర్డి వెళ్ళినప్పుడు బాబాయే ఆ సాధువు అని గ్రహించారు.  నాచ్నే షిర్డిలో ఉన్నపుడు ఒకరోజు ధీక్షిత్, జోగ్, దాబోల్కర్ లతో బాబా ఇలా అన్నారు. నేను  ఈ నాచ్నే ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఇతడు నాకు బెండకాయ కూర పెట్టలేదు. అప్పుడు నాచ్నేకు బాబాయే సాధువు రూపంగా వచ్చి వాళ్ళ అన్నయ్యను రక్షించారు అని తెలిసింది. బాబా చేసే లీలలకు అంతులేదు. 

బాబాతో తొలి కలయిక
1909 లో బాబా ఒక సాధువు రూపంలో వాళ్ళింటికి వచ్చిన తరువాత నాచ్నే తండ్రి గారు దాసగణు గారి సంకీర్తనకు వెళ్తారు. ఆ కీర్తనలో బాబా సాక్షాత్తు దత్తాత్రేయులని దాసగణు చెప్తారు. అప్పుడు వారు సాయి ఫోటోను తెచ్చుకొని ప్రతిరోజు పూజచెయ్యడం ప్రారంభిస్తారు. 1912 లో మొట్టమొదటిసారిగా నాచ్నే షిర్డి వెళ్తారు. అప్పటికి ఆయన తన వృత్తిలో పై స్థానానికి ఎదగడానికి కొన్ని పరీక్షలు వ్రాశారు. అప్పటికి ఫలుతాలు రాలేదు. నాచ్నే తన మిత్రులైన శంకర్ బాలకృష్ణ్ వైద్య, అచ్యుత దాతే అనేవారితో కలిసి షిర్డి ప్రయాణమవుతాడు. వారు రైలులో ప్రయాణించి కోపర్‌గావ్ స్టేషన్‌లో దిగుతారు. వాళ్ళు సాయిని దర్శించుకోవటానికి వెళ్తున్నారని తెలిసి అక్కడ ఉన్న స్టేషన్ మాష్టర్ సాయి గురించి చులకనగా మాట్లాడుతాడు. సాయి తన గారడి విద్యలతో ప్రజలని మోసగిస్తున్నాడని ఆయన అంటాడు. అప్పుడు నాచ్నే మనసు కలవరపడుతుంది. ఆయనలో సంశయం మొలకెత్తుతుంది. కాని సాయిని దర్శించకుండా వెళ్ళకూడదు అని నిశ్చయించు కొని షిర్డికి వెళ్తాడు. బాబా అప్పుడే లెండి తోట నుండి వస్తూ ఉంటారు. బాబా నాచ్నేను చూడగానే ఏమిటి? మామలత్‌దారు అనుమతి తీసుకోకుండా వచ్చావా? అని అడిగారు. అలా ఎప్పుడూ చేయకు అని వారిస్తారు. బాబా అలా అని వెళ్ళిపోతారు. నాచ్నే తేరుకుని బాబాకు నాపేరు చెప్పలేదు. నేనెవరో చెప్పలేదు, కాని నేను  మామలత్‌దారుకు చెప్పకుండా వచ్చిన విషయాన్ని కూడా చెప్పారు. ఆ స్టేషన్ మాష్టర్ వ్యర్ధ ప్రేలాపనలు చేశాడు. సాయి మహానుభావుడు, మహాత్ముడు అని అనుకున్నాడు. వెంటనే సాయి మీద అమిత విశ్వాసం, భక్తి, శ్రద్ధలు ఏర్పడ్డాయి.   

               తరువాత మశీదుకు వెళ్ళినప్పుడు, బాబా నాచ్నేపై ప్రత్యేక అభిమానం చూపిస్తారు.  వారు స్వయంగా నాచ్నే చేతిలో ఊది పెట్టి, ఆ ఊది తీసి నుదిటిపై పెట్టారు. ఈ భాగ్యం అందరికి లభించేది కాదు.



ఏకాదశి ఉపవాసం
నాచ్నే మొట్టమొదటి సారి షిర్డి వెళ్ళినప్పుడు ఒక రోజు ఆరతి సమయానికి మశీదుకు వెళ్తాడు. బాబా నాచ్నేను చూసి వాడాకు వెళ్ళి బోజనం చేసి రమ్మంటారు. అప్పుడు నాచ్నే మామూలుగా ఏకాదశి రోజు ఉపవాసం ఉండడు. కాని తనతో వచ్చిన ఇద్దరు మిత్రులు ఉపవాసమున్నారు. వారు తినకుండా తను తినడం బాగుండదని నాచ్నే కూడా ఏమీ తినలేదు. అప్పుడు బాబా వైద్య, దాతేలను చూపిస్తూ "వీళ్ళు పిచ్చివాళ్ళు నువ్వు వాడాకు వెళ్ళి భోజనం చేసిరా" అంటారు. నాచ్నే వాడాకు వెళ్ళి భోజనం పెట్టమని అడుగుతాడు. అక్కడ వడ్డించే వ్యక్తి విసుక్కుని ఆరతి అయ్యేంత వరకు భోజనం పెట్టను అంటాడు. చేసేది ఏమిలేక మశీదుకు తిరిగి వచ్చిన నాచ్నేను బాబా అన్నం తిన్నావా అని అడుగుతారు. జరిగిన విషయం తెలుసుకొని బాబా ఆరతి ఆగుతుంది. నువ్వు తిని వచ్చిన తరువాతే ఆరతి మొదలవుతుంది వెళ్ళు అని మరలాపంపిస్తారు. ఇక గత్యంతరం లేక ఆ వడ్డించే వ్యక్తి నాచ్నేకు అన్నం పెడ్తాడు. భోజనం చేసి మరల మశీదుకు వెళ్తాడు నాచ్నే. ఒక భక్తురాలు బాబాకు తాంబూలం ఇస్తుంది. బాబా ఆ తాంబూలం నాచ్నేకు ఇస్తారు. అదివేసుకున్న తరువాత ఆరతి మొదలవుతుంది. ఆరతి అయిన తరువాత బాబా నాచ్నే దగ్గర 4 రూపాయలు, వైద్య వద్ద 16 రూపాయల దక్షిణ అడిగి తీసుకుంటారు. దాతే  బాబాకు దక్షిణ ఇవ్వాలని అనుకోలేదు అందుకే బాబా అతన్ని దక్షిణ అడగలేదు. అంతలో ఒక మార్వాడి బాలిక బాబా దగ్గరకు వచ్చి నారింజపండు కావాలని అడిగింది. దాతే తన అల్పాహారం కొరకు కొన్ని నారింజపండ్లు వాడాలో ఉంచి, మిగిలినవి బాబాకు సమర్పిస్తాడు. కాని బాబాకు అన్ని తెలుసు, వాడాకు వెళ్ళి మిగిలిన నారింజపండ్లు తెమ్మంటారు. కాని దాతే వాటిని ఇచ్చేందుకు నిరాకరిస్తాడు. బాబాకూడా ఒత్తిడి చేయలేదు.

                తరువాత నాచ్నే తను వ్రాసిన పరీక్షలలో ఎటువంటి ఫలితం వస్తుందని బాబాను అడుగుతాడు. బాబా "అల్లామాలిక్" అని తన చేతిని నాచ్నే తలపై ఉంచి ఆశీర్వదిస్తారు. నాచ్నే తరువాత పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడు. ఇలా నాచ్నే మొట్టమొదటి కలయిక ముగిసి వారు బాబా దగ్గరనుంచి అనుమతి తీసుకొని దహను బయలుదేరుతారు.


హరిభావ్ పాన్సే శిక్ష తప్పించుట

1913లో నాచ్నే షిర్డి వెళ్తునప్పుడు పాన్సే అనే అతను ఒక కేసులో ఆఫీసు డబ్బు దుర్వినియోగ పరచాడనే అభియోగంపై శిక్ష పడవచ్చని బాబాను రక్షించమని అడగమన్నాడు. తాను ఆ తప్పు చేయలేదు బాబాకు అంతా తెలుసు అని విన్నవించు కుంటాడు. నాచ్నే షిర్డి వెళ్ళి, చావడిలో కాకడ ఆరతి జరుగుతున్నపుడు బాబాను సందర్శించాడు. బాబా అప్పుడు చాలా కోపంగా ఉన్నారు. నాచ్నే చెప్పక ముందే పాన్సే కేసు గురించి ఇలా అన్నారు. అతను అప్పీలుపై విడుదల అవుతాడు చింతించనవసరం లేదు అని చెప్పు అన్నారు. తరువాత షిర్డి నుంచి వెళ్ళి పాన్సేను కలుస్తాడు. బాబా దయవలన అప్పటికే విడుదల అయినట్లు నాచ్నేకు చెప్తాడు.


ఓం శ్రీ సాయి రామ్ !     

Tuesday, November 24, 2015

NACHNE -1



As humans we have so many paths to reach God. God himself showed us the path in the form of saints, Gurus, and incarnations. The great veda Vyasa gave us Upanishads, Brahma Sutras, ithihasas such as Mahabharata. He was not happy even after giving this to this world. He was asked to write Bhagavata which is about God and his leelas. In a similar way it is important to read Sai Satcharita and the stories of Sai for his devotees. 

To know Sai and developing a relationship with Sai is the primary task for all of us. Sai is an ocean of mercy. His love to mankind is indescribable. Sai can give us so many spiritual experiences with out major practices. He just asked us to show faith and patience. 

Of all the paths described to reach God, the easiest is to love God. That’s why Lord Sri Krishna emphasized the concept of love. Sai also shared the same concept. There is nothing in this world that can not yield to love. Because there is only one thing that exists in this universe, that is God or universal energy. This energy appears in different forms to the person who is in the state of Ignorance. If this energy is only one and that to it is inside us, who says that we can not understand this. We need Guru’s blessings to experience this. So Sai devotees we need to really understand Sai’s teachings and the spiritual imports behind his stories.

Nachne’s full name is Sri Santaram Balvanth Nachne.  Nachne was working asHead Clerk in a taluk office. He had originally in 1923, related part of his experience in Sai Lila Masik and gave full account of his experiences with Baba in 1936 to Sri B.V Narasimha Swami.   

Baba coming in the form of a saintly person to save his brother:
Nachne was blessed to have the protection of Baba due to his past life relationship. He had this benefit even before he met Baba.  His contact with Baba started in 1909. His older brother was then undergoing an operation inBajekar's Hospital at Bombay for some throat related problem. At Dahanu, Santaram Nachne and his family were full of anxiety about the result of the operation. A Sainlty person (sadhu) approached their house, and from outside asked, ‘Will you give me a crumb or two of roti?’ Then he was invited inside, and a regular course of dished was served. But in doing so, Santaram’s sister-in-law deliberately omitted to give him Bendi baji lady’s finger curry, thinking that it was too poor a stuff to serve a saintly guest. The sadhu himself said, ‘I want Bendi baji’, and then it was served to him. He then blessed them all, and said that the operation in the Bombayhospital was safely performed and that there was no danger. 

Later in the day, Santaram’s friend, Mr. Haribhav Moreswar Panse, told him, ‘I hope the operation is safe by Sai Baba’s grace’. That was the first time that Santaram Nachne heard of Baba’s name. In the evening after that, Santaram’s father returned from Bombay with the news that the operation was really success and that a sadhu, after the operation had been performed, appeared in the hospital, came near the patient, passed his hands over the operated part, and said, ‘All will go on well’. The operation was quite successful, and his brother had recovered completely.

Later in that year his father attended Das Ganu’s kirtan wherein Das Ganu gave a full account of Sai Baba, and described him as the Datta Avatara having wonderful powers and wonderful kindness. He also brought the picture of Sai Baba home, and with it Baba’s puja began in the house.

First meeting with Baba:
In 1912, Santaram first visited Shirdi. Then he had appeared for a departmental examination, a revenue test and went to Shirdi with two friends Sankar Balakrishna Vaidya and Achyuta Date . At the Kopergaon railway station, the station master heard of their proposed visit to Baba, and began to abuse Baba saying that undue honor was being given to a mere hypnotist, who was cheating people like so many wandering jugglers. This made the impressionable Santaram very unhappy. He was beginning to have his doubts about Baba. Anyhow he reached Shirdi. 

The first sight that he caught of Sai Baba was walking from Lendi to Mosque. On the way Santaram and his friends met Baba. Baba looked straight at Santaram, and said, ‘What? Have you come away without taking leave from the Mamlatdar?’ The reply was ‘yes’. Baba said, ‘Don’t do so hereafter’. At once, the object of these remarks was evident. Baba revealed his power. Santaram being a Mamlatdar’s clerk and that he had come without permission and showed a motherly kindness towards his devotee who was wavering. This was only the beginning of a series of similar experiences during his three days of stay at Shirdi. At the end of three days, Santaram was perfectly assured and confident that Baba was the Datta Avatara, and not a juggler. Baba took udhi from Santaram’s hand and applied it to his forehead. This was a mark of favor.

Ekadasi day and fasting:
One day Santaram had gone very early for the arati in the Masjid, without taking his meal as it was Ekadasi day. Baba was no respecter of mere forms.

Baba asked Santaram, ‘Have you had your meal?’

He said, ‘No, because it is Ekadasi to-day’.

Baba said, ‘Never mind, you go and eat.’

His two friends were very orthodox, and, therefore, Baba did not ask them to take their food. 

Baba said, ‘They are mad. You better go and eat.’ 

Then Santaram went to the dining place at his Wada. The man in the Wada began grumble that on an Ekadasi day, and that too before arati was over, Santaram should ask for food. So Santaram quietly returned to Baba.

Again Baba asked, ‘Meals over?’ Santaram said, ‘No, Baba. I will take the meal after the arati.’
Baba said, ‘Go, arati will wait, and it will begin only after your meal is over’.

Santaram went and told the man in the Wada what Baba had said. So, he had to be given the meal. This is very good proof of Baba’s affection towards Santaram. Then, meals over, Santaram went back to Mosque for the arati. A lady had brought rolled up betel and nut, and Baba took some and asks him to chew. On Ekadasi days, people do not chew betel. But as Baba asked him to chew, Santaram had to chew. When the arati was over, Baba asked dakshina and took four rupees from Santaram and sixteen from Vaidya. From his friend Date, Baba did not ask for any dakshina. Date had no thought of giving any dakshina to Baba. In fact Date had very little reverence for Baba and Baba distinctively read each man’s heart.
During these three days, when H.S. Dixit, Jog and Dabolkar were present, Baba spoke, pointing to Santaram, and said, ‘I went to this man’s house for a meal, but he would not give me Bendi baji’. At once Santaram remembered the sadhu who cam to him three years ago in 1909, and was wonderstruck, for the sadhu who was then in his house looked different from Sai Baba at the Mosque. But from Baba’s remarks, Santaram understood that it was really Baba who came in that form to help the family and reassure them of the safety of the operation in the Bombayhospital. Santaram asked Baba what result of his departmental examination would be. Baba said, Allah Malik Hai and placed his palm on Santaram’s head. Santaram passed the examination.

On the third day, Santaram and his friends begged him for leave to go away. He gave them leave with udhi. Baba at that time gave another blessing to Santaram. Santaram badly wanted a transfer from mofussal Dahanu to metropolis Bombay. Baba of his own accord said, 'Come to Bombay for service’. This was either prophecy or control, and took six years for its fulfillment. In 1918, Santaram was transferred to Bandra, a suburban district of Bombay.
Santaram who had left the station without the Mamlatdar’s permission was noticed by the Mamlatdar B. V. Dev. He merely gave him a warning and no punishment. After this, Santaram repeated his visits to Shirdi whenever he could.

Baba protecting Panse from imprisonment:

When he was leaving in 1913 to go to Shirdi, his friend H. M. Panse, met him and said that he had been convicted and sentenced to imprisonment, but was let out on bail and that he was going to appeal. He wanted Santaram to tell Baba, ‘Panse is in trouble and says he is innocent, and wants Baba’s help.’ When Santaram reached Shirdi, the early morning arati at the chavadi was going on. Baba was then in a very angry mood. Yet when he saw Santaram, and before any words had been spoken, he said, “Tell that fellow that he need not have any anxiety, and that he will be acquitted on appeal.” And Panse was acquitted on appeal.


OM SAI RAM!

Wednesday, November 18, 2015

పురందరే - 2


Play Audio


ప్రేమయే ఆరాధన
పురందరే బాబాను అమితంగా ప్రేమించారు. ఆయన ఏ పని చేసినా నాకు బాబాపై ప్రేమ సరిగ్గా ఉందా లేదా! అనుకుంటూ ఆదుర్దాపడేవాడు. పురందరే అంటే ప్రేమకు ప్రతీకగా నిలిచారు. ఈ ప్రేమే ఆయనను మాటిమాటికి షిర్డికి వచ్చేట్లు చేసేది. బాబా ఒక్కోసారి పురందరేకు నువ్వు మాటిమాటికి ఇక్కడకు రావలసిన పనిలేదు. నేను అంతటా ఉన్నాను అని చెప్పారు. అలానే పురందరేను దీక్షిత్‌తో ఉండమని అతని సహచర్యం వదల వద్దని చెప్పేవారు. దీక్షిత్‌తో కలిసి షిర్డి వస్తే బాబా దీక్షిత్‌ను ఎక్కువ రోజులు షిర్డిలో ఉంచేవారు. అలానే పురందరే కూడా షిర్డిలో ఉండిపోయేవాడు. ఒకసారి ఇలా షిర్డిలో ఉండి ఉద్యోగానికి వెళ్ళారు. అక్కడ పనిచేసే ఫోర్‌మెన్ పైఅధికారికి పిర్యాదు చేస్తాడు. ఎందుకు పనికి రాలేదు, ఎక్కడకు వెళ్ళావు అని అడిగితే ఇదిగో నా రాజీనామా తీసుకో అని ఇస్తాడు. ఆపై అధికారి విల్సన్ అనే ఆయనకు పురందరే సంగతి తెలుసు, బాబా దగ్గరకు వెళ్తాడని తెలిసి, ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. పురందరే దైర్యంగా నా బాబా దగ్గరకు వెళ్ళాను అని చెప్తాడు. అప్పుడు ఆధికారి రాజీనామ పత్రం చించివేసి చెత్త బుట్టలో వేస్తాడు. తరువాత ఆరు నెలలకు పురందరేకు ప్రమోషన్ వచ్చి ఆ ఫోర్‌మెన్ తనకు క్రింది ఉద్యోగి అయ్యాడు. పురందరే తన జీవితంలో బాబాను ప్రేమించటం తప్ప ఇంకేమి లెక్కచేయలేదు. ఇదియే ఉత్తమ భక్తుని లక్షణం. మనమందరం పూజలు చేయవచ్చు, మంచి ఉపాసకులు అవ్వచు. కాని ఈ ప్రేమతత్వం లేనిదే మనము మంచి భక్తులము అవ్వలేము. 

              ఒకసారి పురందరేకు షిర్డికి వెళ్ళాలని అనిపించింది. పొద్దునే నిద్ర లేచి వెళ్తామని నిద్రలోకి జారుకున్నాడు. బాబా కలలో కనిపించి "నువ్వు షిర్డికి రావద్దు వచ్చావంటే నిన్ను నేను కొడతాను, రావద్దు. ఎందుకు ఇన్నిసార్లు షిర్డికి రావాలి? నేను నీ నుంచి దూరంగా లేను. నేను నీతోనే ఉన్నాను. పిచ్చి పనులు చెయ్యవద్దు" అని చెప్తారు. తరువాత పురందరే నిరుత్సాహ పడి బాబా ఎందుకు రావద్దని చెప్పారు అనుకుంటూ ఆరోజు పనికి వెళ్తాడు. అక్కడ ఉద్యోగులందరూ ధర్నా చేస్తూ ఉంటారు. తను కనుక షిర్డి వెళ్ళినట్లయితే అధికారులు ఈ ధర్నా వెనుక పురందరే హస్తం ఉంది అని అనుకునేవారు. ఆయన వెళ్ళడం మూలానా పురందరేను చూసి దానికి పురందరేకు ఏమి సంబంధం లేదని అనుకుంటారు. ఇలా పురందరేను కాపాడి బాబా తన ప్రేమను చూపించారు.


ఈ ప్రేమతత్వాన్ని ఇంకో ఘటన ద్వారా చూద్దాము.
ఒకసారి బాబా బాగా అస్వస్థులయ్యారు. అవి 1915వ సంవత్సరం. ఎవరి ఆసరా లేకుండా బాబా కదిలే పరిస్థితిలో లేరు. ఆయన శరీరం బాగా అలసిపోయినట్లు ఉంది. బాబా అనుభవించే బాధ చెప్పటానికి  వీలు అయ్యేది కాదు. ఇదే సమయంలో పురందరే తన భార్య, తల్లితో షిర్డికి రావాలని రైల్వే స్టేషన్‌కు వస్తాడు. కాని తన మనసు మార్చుకుని తల్లిని, భార్యను ఇంటికి పంపి తనొక్కడే షిర్డి బయలు దేరుతాడు. భార్య, తల్లి వద్దని చెప్పినా వినకుండా బయలుదేరతాడు. తీరావచ్చి చూస్తే బాబా అనారోగ్యంతో ఉంటారు. పురందరే మనసు కలవరపడుతుంది. పురందరేలో ఉన్న  ప్రేమే తనను బాబా దగ్గరకు లాక్కుని వచ్చింది. 

              ఒకసారి 1916 లో బాబా, రాధాకృష్ణమాయి ఒకేసారి అనారోగ్యానికి గురి అవుతారు. అదే సమయంలో పురందరే షిర్డికి వస్తాడు. తను కోపర్‌గావ్‌కి రాగానే హసన్ అనే టాంగా నడిపే అతను ఈ విషయం పురందరేకు చెప్తారు. ఇక క్షణం కూడా ఉండలేక సరాసరి మసీద్‌కి వెళ్తాడు. అప్పుడు దాదాపు ఉదయం 8:45 - 9:00 గంటలవుతుంది. బాబా శ్వాస భారంగా ఆడుతూ ఉంటుంది. ఇది చూసి పురందర్ చిన్న పిల్లవాని వలే ఏడ్వడం ప్రారంభిస్తాడు. బాబా అప్పుడు "భావ్ వచ్చావా! నేను చాలా అలసిపోయాను. నన్ను వదలి నువ్వు వెళ్ళవద్దు. మూడు, నాలుగు రోజులనుంచి నీ కోసం ఎదురుచూస్తున్నాను. కాకాకు కూడా చెప్పాను. నువ్వు వెళ్ళి రాధాకృష్ణమాయి  దగ్గర ఉండు! షిర్డి వదలి వెళ్ళవద్దు" అని చెప్తారు.

              పురందరే అంటే బాబాకు ఎంతటి ఇష్టమో ఇక వేరే చెప్పనక్కరలేదు. తరువాత రాధాకృష్ణమాయి దగ్గరకు వెళ్తే ఆమె కూడా అనారోగ్యంతో ఉంటుంది. పురందరే ఆమెను తన తల్లి లాగా భావించి ఆమె దగ్గర నుండి కూడా మాతృ ప్రేమను పొందాడు. బాబా ఇంత అనారోగ్యం ఉన్నా తను భిక్షకు బయలుదేరారు. కాని ఇద్దరు ముగ్గురు పట్టుకుంటే కాని నడవలేని పరిస్థితి. బాబా లెండి దగ్గరకు రాగానే పురందరే బాబాను చూసి ఏడ్వడం ప్రారంభిస్తాడు. ఆయన మనసు విలవిలలాడి పోతుంది. అప్పుడు బాబా "భావ్ ఏడవకు నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది, అల్లా మియ్యా నాకు ఈ బాధ అనుభవించాల్సిందిగా ఆదేశించాడు. దీన్ని ఈ శరీరం తట్టుకోవాల్సిందే ఏడవకు. మనము ఇక్కడ ఉన్న రెండు రోజులు  మంచి, చెడు రెండు అనుభవించాలి, భయ పడకూడదు. ధైర్యంగా ఉండాలి" అని చక్కటి వేదాంతాన్ని చెప్పారు. 


పురందరే పూల మొక్కల కథ
బాబా రోజూ లెండి వనము వైపు, తరువాత రోజు మార్చి రోజు చావడికి వెళ్తూ ఉండేవారు. రాధాకృష్ణమాయి బాబా కన్నా ముందే లేచి ఆయన నడిచే దారిలో రాళ్ళు లేకుండా ఊడ్చేది. అలానే పురందరే బాబా నడిచే దారికి ఇరువైపుల మంచి ఆహ్లాదకరమైన పూల మొక్కలు నాటాలని కష్టపడి మంచి మొక్కలను సేకరించి బాబాను అనుమతి అడుగుతాడు. కాని బాబా వైరాగ్యంతో ఉన్న పరబ్రహ్మ స్వరూపము. బాబా అనుమతి ఇవ్వరు. పురందరే దిగులుగా ఏమి దిక్కు తోచక ఉంటాడు. మూడురోజులు గడుస్తుంది. ఇంకా పురందరే మనసు ఆ మొక్కలపైనే ఉంటుంది. ఆ మొక్కలన్ని పూర్తిగా వాడిపోయి ఎండిపోతాయి. పురందరే ఇంకా దిగులు పడ్తాడు. బాబా సర్వాంతర్యామి తన వైరాగ్యాన్ని ప్రక్కన పెట్టి పురందరే ప్రేమనే గెలిపిస్తారు. అప్పుడు అనుమతి ఇస్తే పురందరే బాబాను ఈ మొక్కలన్ని వాడిపోయినవి బాబా ఇవి బ్రతుకుతాయా! అని అడుగుతారు. బాబా వాటిని ముట్టుకోగానే అవి మరల జీవాన్ని పోసుకుంటాయి. పురందరే ఉత్సాహంగా వాటిని వీధికి రెండు వైపులా నాటుతాడు.




పల్లకీకి షెడ్ నిర్మాణం-పురందరే పట్టుదల
ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ వాత్సల్యం, చొరవ ఉంటాయి. మనము తాత్యా, శ్యామా అలా చొరవ తీసుకోవడం చూశాము. పురందరే కూడా అదే కోవకు చెందుతాడు. బాబా దగ్గర తను చిన్న పిల్లవాడై పోతాడు. ఒకసారి పురందరే ఇంకా మిగిలిన వారు ఎంతో ఉత్సాహంగా బాబా పటం పెట్టేందుకు ఒక పల్లకిని తెచ్చి దానికి చక్కగా వెండి వస్తువులతో అలంకరణ చేస్తారు. ఆ పల్లకిని ద్వారాకామాయికి తీసుకువస్తే బాబా మండిపడి వాళ్ళను లోపలికి కూడా రానీయరు. పల్లకి వద్దు ఏమి వద్దు అని కసురుకుంటారు. ఆ పల్లకి రాత్రంతా బయటే ఉంచాల్సి వస్తుంది. రాత్రి దొంగలు వచ్చి ఆ పల్లకిలో ఉన్న వెండి వస్తువులను దొంగలిస్తారు. ప్రోద్దునే బాబా పల్లకీ కూడా తీసుకుపోయుంటే బాగుండేది అంటారు. అప్పుడు రాధాకృష్ణ మాయి,  పురందరే ఎట్లా అయిన ఒక షెడ్ నిర్మిస్తే ఆ పల్లకి సురక్షితంగా ఉంటుంది అని అనుకుంటారు. మసీదుకి ఒక ప్రక్కన కొన్ని గుంజలు పాతితే అవతల వైపు గోడకు దీన్ని కలపచ్చు అనుకుంటారు. కాని బాబాకి చెప్తే ఒప్పుకోరు. బాబా లేనప్పుడు ఆ గుంజలు పాతి మసీదు గోడతో కలుపుతారు. తరువాత బాబా వచ్చి పురందరేను చూసి నా మసీదు గోడను పగలకొట్టడానికి నిశ్చయించుకున్నావా! అప్పుడు పురందరే ధైర్యంగా మసీదు గోడలు ఏమీ కాకుండా చూడండి అని చెప్తాడు. బాబా అట్లానే తిట్ల వర్షం కురిపిస్తారు. కాని పురందరే పట్టు వదలడు. అక్కడ నుంచి కదలకుండా కూర్చుంటాడు. తిండి తిప్పలు లేకుండా అక్కడే ఉన్న పురందరేను చూసి బాబా వీడు భార్యను, తల్లిని పస్తులు ఉంచుతున్నాడు. వీడూ  పస్తులు ఉంటున్నాడు. వెళ్ళి తినిరా! అని అంటారు. పురందరే అప్పుడు బాబా నేను వెళ్ళిన తర్వాత మీరు ఇవన్ని పీకేస్తారు నేను వెళ్ళను అని కూర్చుంటాడు. ఇక గత్యంతరం లేక బాబా దానికి అనుమతి ఇచ్చి పల్లకిని లోపల పెట్టనిస్తారు. అప్పుడు అక్కడ ఉన్న వారితో ఇలా అంటారు. "మన పిల్లవాడు మన కాలు మీద మలవిసర్జన చేశాడని, కాలు తీసుకుంటామా లేక పిల్లవాడికి హానిచేస్తామా" దాన్ని భరించాల్సిందే కదా! అని అంటారు. దీన్ని బట్టి బాబా తన భక్తులపై ఎంత ప్రేమతో వ్యవహరిస్తారు అన్న విషయం అర్ధం అవుతుంది.

బాబా రథం 


పురందరే భార్యకు సద్గతి
1920లో పురందరే భార్యకు తీవ్రమైన అనారోగ్యం కలుగుతుంది. అది ఇన్‌ప్లూయంజా అని నిర్ధారిస్తారు. ఆమె ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఆమె రాబోయే ఉరుసు శ్రీరామనవమి ఉత్సవాలకు షిర్డికి వెళ్ళలేకపోతున్నందుకు బాధపడసాగింది. ఆ రాత్రి బాబా ఆమెకు కలలో కనిపించి "బాధ పడకు నిన్ను తప్పక ఉత్సవానికి తీసుకువెళ్తాను" అని చెప్తారు. మరుసటి రోజు ఉదయం ఆమె కొద్దిగా కోలుకుని ఈ కల విషయం పురందరేకు చెపుతుంది. కాని ఆమె అనారోగ్యంతోనే శ్రీరామ నవమి నాడు "బాబా బాబా" అని అంటూ తన తుది శ్వాస విడిచింది. ఈమెకు బాబా సద్గతిని ప్రసాదించారు.

పురందరేకు ప్రాణరక్షణ
1932వ సంవత్సరంలో పురందరేకు కీళ్ళ జబ్బు బాగా ముదిరి, తీవ్రమైన అనారోగ్యానికి గురి అయ్యాడు. మృత్యువుకి చాలా దగ్గర అయ్యాడు. యమదూతలు అతని ప్రాణాన్ని తీసుకుపోవడానికి సమీపిస్తున్నారు. అప్పుడు బాబా వచ్చి పురందరే మంచం మీద కూర్చుని తనచేతిని బాబా మోకాలిపై ఉంచారు. దగ్గరకు వచ్చిన యమదూతలను తరిమికొట్టి ఆయనను రక్షించినట్టు పురందరే గారు స్వయంగా చెప్పారు. ఇలా బాబా వెన్నంటి తన భక్తులను రక్షిస్తూ ఉంటారు. 

బాబా పురందరేకు చెప్పిన భోదలు
సత్యాన్నే అంటిపెట్టుకుని ఉండు అని బాబా పురందరేకు చెప్పేవారు. బాబా మహా సమాధి తరువాత ఒకరోజు పురందరేకు కలలో కనిపించి షిర్డి వెళ్ళి సంస్థాన్ విధులు నిర్వహించమని చెప్పారు. అలానే పురందరే సంస్థాన్ ఉమ్మడి కోశాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. బాబా దగ్గర ఉండి పురందరే చేత పనులు చేయించినట్లు పురందరేకు అనుభూతి కలుగుతూ ఉండేది.

              పురందరేకు ప్రేమతో పాటు కోపం కూడా ఉండేది. బాబా ఇలా అనేవారు. "ఎవరైనా దూషించినా, దండించినా వారితో గొడవకు దిగవద్దు. నీవు సహించలేకుంటే ఒకటి రెండు మాటలతో సమాదానం ఇవ్వు, లేదా
 ఆ చోటు వీడి వెళ్ళిపో అంతేగాని వారితో పోట్లాడవద్దు. మీరు ఎవరితోనైనా తగాదా పెట్టుకుంటే నాకు అసహ్యము, బాధ కలుగుతుంది." అని హితబోధ చేసేవారు.

              ఇలా పురందరేలో మార్పులు తీసుకువస్తూ జీవితంలో అవసరమైన సహాయంచేస్తూ బాబా కలకాలం రక్షించారు. బాబా చెప్పినట్లు ఈ లోకంలో మంచి, చెడులు రెండు ఉన్నట్లు, పుట్టుక - చావు కూడా ఉంటాయి. కాని బాబా ప్రతిజన్మలో మనకు తోడు ఉండి నడిపిస్తారు.



ఓం శ్రీ సాయి రామ్!

Wednesday, November 11, 2015

పురందరే - 1



Play Audio


ఒక గురువుని పూజించగలవారు చాలా మంది ఉండవచ్చు. కాని అదే గురువుని అమితంగా ప్రేమించగలవారు చాలా తక్కువ మంది ఉంటారు. మనకు ఎంతో నిష్ట, శ్రద్ధ ఉంటేకాని ఈ ప్రేమ అనేది పుట్టదు. మనము దేవుడిని ఎన్నో అలంకరణలతో దర్శిస్తాము. మనకు ఇష్టమైన విధంగా ఆ దేవుడికి సేవలు చేస్తాము. కాని ఒక గురువు దగ్గరకు వచ్చేటప్పటికి మనము ఆ బాహ్యశరీరం దాటలేము. దీని వల్ల మనలో చాలా సంఘర్షణలు చెలరేగుతాయి. ఆయన ఇలా ఎందుకు ఉన్నారు. అలా ఎందుకు వేషధారణ ఉంది అనే ఆలోచనలు మనలను కట్టిపడేస్తాయి. ఈ ప్రేమ అనేది వీటన్నింటికి అతీతము. మనము ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే వారియొక్క అంతర్ సౌందర్యం అవగతము అవ్వాలి. బాహ్యతత్వం మీద కలిగే అభిమానం ప్రేమ కాజాలదు. అట్లే మనము బాబాను ప్రేమించాలి అంటే బాబా గురించి తెలుసుకోవాలి. ఆయన్ని నిరంతరం స్మరించాలి. వారిని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలి. అప్పుడే మనకు బాబా మీద అమితమైన ప్రేమ కలుగుతుంది.

              బాబా భక్తులలో ఈ ప్రేమతత్వాన్ని బహిర్గతం చేసినవారిలో పురందరే ముఖ్యులు. బాబానే స్వయంగా పురందరే ప్రేమను కొనియాడారు. ఆయన పూర్తి పేరు రఘువీర్ భాస్కర్ పురందరే. ఈయన ఒక సాదాసీదా వ్యక్తి. కోపంవచ్చినా, ప్రేమ పుట్టినా పురందరే యొక్క అసలు తత్వం బయట పడ్తుంది. ఆయనకు మంచి జ్ఞానులను, సాధువులను కలవాలనే కోరిక బలంగా ఉండేది. ఆయన ఒక చిన్న గుమస్తాగా జీవితం గడిపేవాడు. ఆయనకు వచ్చే 35 రూపాయల జీతం అంతంత మాత్రమే. ఈ డబ్బుతోనే 5 గురి పోషణ జరగాల్సి ఉంది.

              పురందరే గురించిన విషయాలు ఎక్కువగా బి.వి. నరసింహ స్వామి గారి ద్వారా మనకు తెలుస్తాయి. ఆయన మే 4వ తేది 1936వ సంవత్సరంలో పూణాలో బి.వి.నరసింహ స్వామి గారికి ఇంటర్యూ ఇచ్చారు. అప్పుడు ఆయన వయస్సు 60 సంవత్సరాలు. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు భాస్కర పురందరే. ఆయన బాంద్రాలో ఉండేవారు. ఆయన నివాసము పేరు సాయినాధ్ ఆశ్రమం. ఆయన గురించిన మరికొన్ని విషయాలు సాయిలీల మాసపత్రిక ద్వారా తెలుస్తాయి.


సాయితో మొదటి కలయిక
పురందరేకు సాధుసత్పురుషులను కలవాలని కోరిక బాగా ఉండేది. 1909వ సంవత్సరములో మొట్టమొదట సాయిబాబా పేరు వినడం జరిగింది. అందరూ వారు దేహముతో ఉన్న పరమగురువులని చెప్పారు. ఇంక పురందరే ఆలస్యం చేయడం ఇష్టంలేక వెంటనే షిర్డి వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు. బాబా కూడా కలలో కనిపించి షిర్డికి రమ్మని పిలుస్తారు.  షిర్డికి వెళ్ళాలంటే ఈ గుమస్తా దగ్గర అంత ధనములేదు. తను బొంబాయి నుంచి షిర్డి వెళ్ళాలంటే సెలవు తీసుకోవాలి. వాళ్ళ పాపకు అప్పుడు 6 నెలల వయస్సు. ఆ పిల్ల అనారోగ్యంతో ఉంటుంది. వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేని పిల్లతో ప్రయాణం వద్దని చెప్తారు. కాని పురందరే పట్టుబట్టి షిర్డికి ప్రయాణమవుతారు. వెళ్ళిన మూడు రోజులకు పాపకు జబ్బు పూర్తిగా నయం అవుతుంది. ఇలా పాపకు పూర్తిగా నయమవడంతో పురందరేకు బాబాపై అమితమైన ప్రేమ కలుగుతుంది. బాబాకు తెలుసు ఇది ఒక్క జన్మ సంబందం కాదని, ఋణానుబంధం ఉన్నదని. బాబా కూడా వారికి ఇంటికి  వెళ్ళేందుకు అనుమతిని ఇవ్వలేదు. వారు దాదాపు 13 రోజుల పాటు షిర్డిలో ఉంటారు. పురందరే బాబాను ఒక్క కోరిక కూడా కోరలేదు. బాబా పురందరే తల్లితో మాట్లాడుతూ మా అనుబంధం ఏడు శతాబ్దాల నాటిది. నేనతడిని మర్చిపోను అతను వేలమైళ్ళ దూరంలో ఉన్నా, నేనెప్పుడూ గుర్తుంచుకొంటాను.  అతను లేకుండా నేనొక ముద్ద అయినా ముట్టను " అని చెప్తారు. తరువాత బాబా అనుమతితో నాశిక్ మీదుగా దాదర్‌కు వెళ్తారు.

              ఇక్కడ బాబా కూడా ఆ ప్రేమతత్వాన్ని వెల్లడించారు. పురందరే బాబాను కలిసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఆయనకు ఎన్నో సమస్యలు, పాప ఆరోగ్యం బాగుండలేదు, ఆయనేమో చిన్న గుమస్తా, వాళ్ళ అమ్మ వద్దని వారించింది. ఇన్ని అడ్డంకులు ఉన్నా బాబాతో ఉన్న ప్రేమానుబంధం ఆయనను షిర్డికి లాక్కుని వెళ్ళింది. సాయి భక్తులమైన మనము ఈ ప్రేమను అర్ధం చేసుకోవాలి. ఈ అంశం గురించి భగవద్గీతలో ఈ విధంగా చెప్పబడింది.
   
పూర్వాభ్యాసేన తేనైవ  హ్రియతే  హ్యవశః ఆపి సః |
జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే ||

              అర్జునుడు యోగ బ్రష్టుల గురించి అడిగిన ప్రశ్నకు శ్రీ కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. ఎవరైతే పూర్వజన్మలలో ఎంతో సాధన చేసి చనిపోతారో వారు మరల వచ్చే జన్మలో నిస్సందేహంగా భగవంతుని వైపు ఆకర్షితులవుతారు. జిజ్ఞాసువులై సకల కర్మలకు అతీతంగా ఉంటారు. ఇక్కడ పురందరే అదే చేశారు. బాబాపై తెలియని ప్రేమ, ఋణానుబంధం, అలానే ప్రాపంచిక కోరికలను కోరలేదు. తన జీవితము చాలా కష్టతరమైనా కాని బాబాను ఏమీ అర్ధించలేదు.  

మొదటి దర్శనంలో బాబాచేసిన బోధ
పురందరే విష్ణుమూర్తిని ఆరాధించేవాడు. బాబా పురందరేతో మాట్లాడుతూ అదే ఉపాసన కొనసాగించవలసినదిగా చెప్పాడు. పురందరేను "రామ్ బావ్" అని పిలిచేవారు. బాబా ఆయనను కేవలం రెండు రూపాయలు మాత్రమే దక్షిణగా అడిగేవారు. ఒకసారి పురందరే బాబాను కేవలం రెండు రూపాయలు మాత్రమే అడుగుతున్నారు అని వాపోయాడు.

బాబా: "నేను అడిగింది నువ్వు అనుకుంటున్న రూపాయలు కాదు. ఒకటి నిష్ట (అనన్యమైన నమ్మకము), రెండవది సబూరి (సంతోషంతో కూడిన ఒరిమి)" అని అన్నారు.

పురందరే : "అవి నేనెప్పుడో మీకు సమర్పించాను".

బాబా : అలాగే! నీ నిష్ట చెదరకుండా కాపాడుకో, అంతేకాక నీవు చేసిన వాగ్దానాలన్ని నెరవేర్చు. నీవు ఎప్పుడూ సత్యాన్ని అంటిపెట్టుకో, అప్పుడు నీవు ఎక్కడ ఉన్నా అన్ని సమయాలలో నేను నీతోనే ఉంటాను అని హామీ ఇచ్చారు.

పురందరే : "బాబా మీరు చెప్పినట్లే నడుచుకొంటాను. కాని నా మనస్సు నా ఆధీనంలో ఉండేటట్లు మీరు అనుగ్రహించాలి". 

బాబా : "అలాగే" అని అభయం ఇచ్చారు.

ఇలా పురందరే మొదటి కలయిక ఎంతో అపురూపంగా ప్రేమానురాగాల భరితమై, పురందరే యొక్క భావిజీవితానికి పునాది వేసింది.



స్వంతఇల్లు - బాబా ప్రోత్సాహం
బాబా మామూలుగా వైరాగ్యంతో ఉండమని చెప్తారు. కాని పురందరే విషయంలో బాబా చాలా పట్టుబట్టి మరీ అతనిని ఒక ఇంటి యజమానిగా చేశారు. ఒకసారి పురందరే షిర్డి వచ్చినప్పుడు బాబా ఈ విధంగా చెప్పారు. "బావ్ నువ్వు ఒక స్థలం కొని, దానిలో తొందరగా ఒక బంగళాకట్టు" అని అన్నారు.

              పురందరే మనసులో ఈ విధంగా అనుకున్నారు. నేను నెలకు 35 రూపాయలు జీతంతో బతికేవాడిని, స్థలం కొని ఇల్లు కట్టడం అంటే మాటలా. బాబా పురందరేను బాగా విసుక్కునేవారు. బావ్ నేను చెప్పిన మాట వినటం లేదు అని అందరికి చెప్పేవారు. ఒకసారి బడే బాబాను పంపించి నేను మనిషిని అనుకుంటున్నాడా, రాక్షసుడు అనుకుంటున్నాడా!  వాడికి చెప్పు ఇల్లు కట్టమని.  బడే బాబా వచ్చి పురందరేతో మాట్లాడి ఆయన ఆర్ధిక పరిస్థితి అర్ధం చేసుకుని బాబా ఇట్లా ఎందుకు చెప్తున్నారు అని వెళ్ళిపోతాడు. బాబా ఒకసారి రాళ్ళు కూడా విసురుతారు. ఒకసారి నానా చందోర్కర్, కాకా దీక్షిత్ కలసి బాబా మేము ఇళ్ళు కొనిపెడతాము అని అంటే బాబా ఒప్పుకోలేదు. "ఎవ్వరినీ ఒక్క పైసా కూడా అడగవద్దు, నేను నీకు సహాయం చేస్తాను." అని బాబా అన్నారు.

              తరువాత పురందరే ఆఫీసులో ఒకతను దగ్గర 500 రూపాయలు అప్పు తీసుకుని స్వంత ఇల్లు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ స్నేహితుడు ఏ పత్రం లేకుండా అప్పు ఇచ్చాడు. ఈ స్థలం ఊరి చివర, అక్కడ మరేమి ఇళ్ళు లేవు. తరువాత కట్టే గోడల్లో నెర్రులు వచ్చి పురందరే బాధ పడ్తాడు. కాని అన్ని సర్దుకుని చివరకు ఏ అవాంతరాలు లేకుండా ఇళ్ళు పూర్తి చేస్తాడు. ఆ ఇళ్ళు పూర్తి చేయడానికి దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు గృహప్రవేశం చేసి, ఉండటం ప్రారంభిస్తారు. కాని అది జన సంచారం లేని ప్రదేశం. పురందరేకు భార్యను ఒక్కదానినే ఇంట్లో ఉంచేందుకు భయపడేవాడు. బాబా ఒక్కరోజు బావ్ ఎందుకు భయపడ్తావు నేను మీ ఇంట్లోనే ఉన్నాను అని ధైర్యం చెప్తారు.
 
              ఈ సంఘటన ద్వారా బాబా పురందరేను ఇళ్ళు కొనేదాకా పరుషమైన మాటలతో తొందర పెట్టారు. బాబా మామూలుగా ఇలా ఎవరిని తొందర పెట్టిన సంఘటన చూడలేదు. ఇక్కడ ఏదో మర్మం ఉంది. లేకపోతే బాబా ఇలా చెయ్యరు. ఆయన పురందరేను ఎప్పుడూ రక్షిస్తూ వచ్చారు. పురందరే కూడా తనకు స్వంత ఇళ్ళు కొనుక్కునే స్థోమత లేకపోయినా కేవలం బాబా ఆజ్ఞను పాటించి ముందుకు సాగాడు. పురందరేకు తెలుసు బాబానే తన భక్తులను రక్షిస్తారు అని.

బాబా పురందరే భార్యను కలరా నుంచి రక్షించుట
పురందరే బొంబాయిలో ఇళ్ళు కట్టుకున్న తరువాత ఒకరోజు షిర్డి నుంచి తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి తన భార్య కలరా వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆమెకు చాలా విరోచనాలు అయ్యాయి. బాగా నీరసించి పోయింది. ఒక డాక్టర్ వచ్చి పరీక్ష చేసి ఆమె నాడి బాగా లోతుగా కొట్టుకుంటుందని ఆమె శ్వాస దాదాపు కష్టమై పోయిందని చెప్పి, ఆమె బతకటం కష్టమని దేవుడ్ని నమ్ముకోమని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. సాయినాధుడే పురందరేకు దైవం. ఇంతలో బయటికి వెళ్ళి చూస్తే తన ఇంటి దగ్గర ఉన్న మారుతి ఆలయం దగ్గర బాబా నుంచుని ఉన్నారు. బాబా ఇలా చెప్పారు "ఆమెకు ఊది తీర్ధం ఇవ్వు" అని మాయమయ్యారు. పురందరే ఇంట్లోకి వచ్చి తన దగ్గర ఉన్న ఊదిని నీళ్ళలో కలిపి భార్యతో తాగించాడు. ఆమె ఒక గంటలో మామూలు మనిషి అయ్యింది. ఆమె శ్వాస బాగా ఆడటం మొదలుపెట్టింది, జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయింది. తరువాత డాక్టర్ వచ్చి ఆమెను చూసి ఆమెకు ఏమి మందు ఇచ్చారు? అని అడిగారు పురందరే వెంటనే బాబా ఊది తీర్ధం ఇచ్చాము అని చెప్పాడు.

              అట్లానే బాబా ఇంకోసారి కూడా పురందరే భార్యను రక్షించడం జరిగింది. ఒకసారి ఆమె ప్రసవానికి ముందు అనారోగ్యంతో బాధపడింది. బాబా వచ్చారు ధుని నుండి వెచ్చని ఊది తీసి పెడుతున్నారు. నా శరీరం అంతా కాలిపోతుంది అంటూ కలవరించ సాగింది. తరువాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది. ఇలా ఆమెకు బాబా చాలా సార్లు కనిపించేవారు.

బాబా పురందరే తల్లికి విఠలునిగా దర్శనం

పురందరే తల్లిపై చాలా ప్రేమను చూపించేవాడు. 1913 లో ఆమెకు పండరిపురం వెళ్ళాలని అనిపించి చాలా ఒత్తిడి చేసింది. పురందరే ఈ విషయం బాబాకు చెప్పలేదు. తరువాత ఆమె మసీదుకు వచ్చినప్పుడు అమ్మా! పండరి ఎప్పుడు బయలుదేరుతున్నావు? అని పురందరే తల్లిని బాబా అడిగారు. ఆ రోజు మసీదులో పురందరే భార్యకు, తల్లికి బాబా రుక్మిణి సమేత విఠలునిగా దర్శనమిచ్చారు. వాళ్ళు ఆనందంతో పులకరించి పోయారు. ఆపై పండరి ప్రయాణం మానుకున్నారు. బాబా ఆమెను తరచూ అమ్మా పండరీపురం ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగేవారు. దానికి ఆమె నా దేవుడిక్కడే ఉన్నాడు, షిర్డియే మా పండరీ అని ఆమె చెప్పేది.

Wednesday, November 4, 2015

మహాల్సాపతి - 4 (జిజూరి యాత్ర మరియు దేహత్యాగము)



Play Audio




జిజూరి యాత్రలో సహాయం
ఒకసారి మహల్సాపతి మరియు ఆయన బృందం జిజూరి యాత్రకు గుర్రాలపై బయలుదేరారు. పోలీసులు వాళ్ళను మధ్యలో ఆపి అనుమతి పత్రం లేదని వారిలో ఒకరిని ఆపటం జరిగింది. అందుకని వారు ముందుకు వెళ్ళలేక పోయారు. ఆ అనుమతి పత్రంలేని వ్యక్తి ఆ ఊరు కరణం దగ్గరకు వెళ్ళి అనుమతి పత్రం కోరడం జరిగింది. ఆ కరణం వాళ్ళకి కట్టెలు కొట్టే పని అప్పచెప్పాడు.

            ఆయన ఎవరికి సహాయం చేసే వ్యక్తి కాదు. స్వార్ధంతో ఆ మనిషి చేత కట్టెలు కొట్టించాలని ఒక గొడ్డలని ఇచ్చాడు. కాని దాని కర్ర విరిగి పోయింది. అట్లా రెండు మూడు సార్లు విరిగింది. అప్పుడు ఆ కరణం "భగవంతుడు నిన్ను పని చేయనివ్వటం లేదు" అని అనుమతి పత్రం ఇచ్చి పంపించారు.

            ఇంకొకసారి మహల్సాపతి బృందం 150 మైళ్ళు నడిచి జిజూరి చేరారు. కాని అప్పుడే ప్లేగువ్యాధి ప్రభలిపోయి ఉంది. అలా వారు ఊరిలోకి వెళ్ళలేక దిగాలుగ పల్లకికి ఆనుకొని కూర్చున్నారు. ఇంతలో బాబా దర్శనం అవుతుంది. అప్పుడు ఆయనకు ధైర్యం కలిగి ఆ ఊరిలోకి ప్రవేశిస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరల షిర్డికి తిరిగి వస్తారు. వచ్చిన తరువాత బాబాని కలిస్తే బాబా ఇట్లా అన్నారు. నువ్వు పల్లకిని ఆనుకొని కూర్చున్నావు. అప్పుడు నీకు ధైర్యం చెప్పాను.

            మహల్సాపతి ప్రతి సంవత్సరం జిజూరిలో ఉన్న ఖండోబా ఆలయానికి పల్లకి తీసుకుని 150 మైళ్ళు ఊరేగింపుగా వెళ్ళడం ఆనవాయితి . అట్లానే ఒక సంవత్సరం తన తోటి భక్తులతో కలిసి జిజూరి వెళ్ళడం జరిగింది. వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు మరొక బృందము కూడా వాళ్ళ వెనుక రావడం జరిగింది. ఆ బృందంలో మిలామి భగత్ పిల్కి అను భక్తుడు ఉన్నాడు. వాళ్ళకు మార్గం మధ్యలో కొందరు బందిపోటు దొంగలు ఎదురు పడటం జరిగింది. వాళ్ళ దగ్గర గండ్రగొడ్డళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఈ బృందాలను దోచుకోవడానికి వచ్చారు. అప్పుడు మహల్సాపతి వాళ్ళపై తన దగ్గర ఉన్న రంగోలిని ప్రసాదంగా వాళ్ళపై జల్లడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏమి చేయకుండా చెట్లలోకి వెళ్ళడం చూసి ఈ బృందాలు మెల్లగా జారుకున్నాయి. కొంచం దూరం వెళ్ళిన తరువాత చూస్తే ఆ పల్లకిలో విగ్రహంలేదు. మనము దేవుడు లేని పల్లకి మోస్తున్నాము అనుకొన్నారు. ఆ రోజు ఆదివారం, వాళ్ళ ఆచారం ప్రకారం అయితే పల్లకిని ఆ రోజు మోయకూడదు. అప్పుడు ఖండోబా మహల్సా ఒంటి పైకి వచ్చి "ఈ రోజు పల్లకి మోయవద్దు. నేను ఈ రోజు కొండ మీద వేటకు వెళ్తున్నాను" అని ఖండోబా చెప్పారు. వేట అవ్వగానే నేను షిర్డికి వస్తాను, మీరు వెళ్ళండి అని ఖండోబా మహల్సాపతి ఒంటి మీద నుంచి వెళ్ళడం జరిగింది. వారు పల్లకితో  సహా షిర్డి వచ్చారు. శాఖారాం కండూకర్ మొదలైన వారు పల్లకి చూడడానికి వచ్చి పల్లకిలో అన్ని విగ్రహాలు ఉండడం చూసి, మహల్సాపతిని ఇలా అడిగారు. విగ్రహాలు పోయాయని చెప్పారు. మరి విగ్రహాలు ఉన్నాయి కదా! షిర్డికి రాగానే విగ్రహాలు వాటంతట అవే ప్రత్యక్షం అవడం బాబా లీల కాక ఇంకేమయి ఉంటుంది. అని అందరు అనుకున్నారు.

            ఇలా బాబా ఎన్నోసార్లు మహల్సాపతి వెన్నంటే ఉండి ఒక రక్షణ కవచంలాగా రక్షించడం జరిగింది. మనము ఎప్పుడైతే బాబాకు శరణాగతి చేస్తామో, అప్పుడు బాబాతో మనకి రుణానుబంధం ఏర్పడుతుంది. బాబా తన భక్తులను రక్షించడంలో తన శరీరాన్ని కూడా లెక్క చేయని ఘటనలు కూడా మనము చూశాము.
  
            బాబా త్రికాల జ్ఞాని. మహల్సాపతి తన రెండో కొడుకు పుట్టిన తరువాత (1899) బాబా దగ్గరకు వెళ్ళి, పిల్లవానికి నామకరణము చేయమని అర్ధించాడు. అప్పుడు బాబా భగత్, నీవు ఈ పిల్లాడిని 25 సంవత్సరాలు పోషించు అది చాలు ఈ విషయం మహల్సాపతికి అప్పట్లో  అర్ధంకాలేదు. ఆ తరువాత మహల్సా రెండవ కొడుకు  25 సంవత్సరాలు మాత్రమే బ్రతికి ఉన్నారు.

            ఒకసారి మహల్సాపతి బాబా దగ్గర ఉన్నప్పుడు బాబా ఇట్లా చెప్పారు. "అరె భగత్ ఇంకా కొద్ది రోజులలో నేను ఒక చోటికి వెళ్తున్నాను. ఆ తరువాత నీవు రెండు నుంచి నాలుగు సంవత్సరాలు ఇక్కడ నిద్రకు వస్తావు." బాబా మాటలు సరిగ్గా అర్ధం కాలేదు మహల్సాపతికి. అట్లానే మహల్సాపతి 1918 బాబా మహాసమాధి తరువాత, 1922 దాకా రాత్రిపూజ నిర్వహించడం జరిగింది. బాబా మహాసమాధి అయినప్పుడు మహల్సాపతి కనీసం 13 రోజుల వరకు ఏమీ తినకుండా ఉండటం జరిగింది. మరి మహల్సాపతి 40 సంవత్సరాలు బాబాతో నిద్రించి ప్రతి పనిలో బాబాకి సహకరించిన తీరు మనకు తెలిసినదే. మహల్సాకు ఇది ఎంతటి కష్టమైన విషయమో మనము వేరే చెప్పవలసిన పనిలేదు.

            అటువంటి మహానుభావుడుకి మరణించిన తరువాత సద్గతి కలుగకుండా ఎందుకు ఉంటుంది. మన సాయినాధుని అపారకృపకు పాత్రుడు కాకుండా ఎందుకు ఉంటాడు. అందుకే ఆయన దేహత్యాగము భాద్రపద శుద్ధఏకాదశి సోమవారం దేహాన్ని వదలడం, అది కూడా పూర్తి స్పృహతో, రామనామ జపం వింటూ ప్రాణం వదలడం అనే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది. అది సెప్టెంబర్ 11, 1922 వ సంవత్సరం ఆ రోజున తన తండ్రికి శ్రాద్ధకర్మలు నిర్వర్తించి వచ్చిన వారికి భోజనాలు పెట్టి తన బంధుమిత్రులతో కూర్చుని ఉన్నారు. తాంబూలం వేసుకుని బాబా ఇచ్చిన కఫిని ధరించి కూర్చున్నారు. అక్కడ ఉన్న తన స్నేహితులైన బాలా గురవ్ మరియు రామచంద్రకోతె లాంటివారిని రామనామ జపం చేయమని అడిగారు. అప్పుడు తన కొడుకును పిలిచి తన దగ్గర ఉన్న చిన్న కర్రను ఇచ్చి ఈ విధంగా చెప్పారు. "ఎప్పుడూ ధర్మ మార్గంలో జీవించు. భక్తియే ఉత్తమ మార్గము, నేను చెప్పింది అంతా జరుగుతుంది."


            అందరూ రామ భజన చేస్తూ ఉంటే అది వింటూ, తనూ రామ! అనే శబ్ధాన్ని పలుకుతూ తన చివరి శ్వాస వదిలి ప్రాణాన్ని వదిలేశారు. ఆయన బాబా కృపతో ఎంతో సునాయాసమైన మరణాన్ని పొందటం జరిగింది. అదియును కాక ఆయన ముందుగానే నేను స్వర్గానికి వెళ్తున్నాను అని అదేరోజు అక్కడ ఉన్నవారికి కూడా చెప్పారు. ఆయన చేసిన సేవ, నడిచిన ధర్మమార్గము, అత్యంత భక్తి ఆయన్ని పరమపథానికి చేర్చాయి.


ఓం శ్రీ సాయి రామ్ !