Play Audio |
ఒకసారి
దీక్షిత్‌కు బాబా ఈ విధంగా చెప్పారు. "నువ్వు వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడినా
లేక వాళ్ళ తప్పులు ఎంచినా నాకు అమితమైన బాధ కలుగుతుంది." అప్పట్లో దీక్షిత్‌కు
కూడా కోపం ఉండేది. తరువాత ఆ కోపాన్ని నియంత్రించాడు.
ఒకసారి
వాడాలో క్రైస్తవ మతము గురించి మాట్లాడుతూ, వారిని విమర్శించాడు దీక్షిత్. అదే రోజు
బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు దీక్షిత్‌తో బాబా మాట్లాడలేదు. దీక్షిత్ తన తప్పు తెలుసుకొని
బాబాను క్షమించమని మనసులోనే ప్రార్ధిస్తాడు. అప్పుడు బాబా "ఎవ్వరిని నిందించ వద్దు"
అని ప్రేమతో చెప్తారు.
ఒకసారి
దీక్షిత్ రోజూ పూజచేసుకునే విధంగా చేసి బాబాకు తాంబూలం ఇవ్వడం మరిచాడు. తరువాత బాబా
దగ్గరకు వెళ్తే బాబా వెంటనే "నాకు ఈ రోజు తాంబూలం ఇవ్వలేదు" అంటారు. అప్పుడు
దీక్షిత్‌కు అర్ధం అవుతుంది. సాయి యొక్క సర్వజ్ఞత. నేను మనస్పూర్తిగా బాబాకు పూజ చెయ్యాలి, ఆయనకు అన్ని విదితమే అని అప్పటి నుంచి ఎక్కడ పూజ చేసినా బాబానే స్వయంగా తన ఎదురుగా
ఉన్నారు అన్న భావనతో ప్రార్ధన చేసేవాడు. సాయి
బందువులారా చూసారా! దాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సినది చాలా ఉంది. "యధ్భావమ్ తద్ భవతి" అంటారు.
కాని సాయి ఎప్పుడూ మనల్ని ఒక కంట కనిపెట్టి ఉంటారు. మనలో నమ్మకం దృడంగా ఉండాలి. అలానే
దీక్షిత్ కూతురు చనిపోయినప్పుడు చావు, పుట్టుకల గురించి చెప్పి, తనలో వ్యామోహం పోగొట్టారు. ఇంకోసారి
దీక్షిత్ ఒక కేసు గెలిచి దాదాపు 1000 రూపాయలు ఒక ట్రంక్‌పెట్టెలో తెచ్చి, బాబా ఇదంతా
నీదే అని ముందుంచాడు. అప్పుడు బాబా క్షణాల్లో ఆ డబ్బుల్ని పంచేస్తారు. దీక్షిత్లో కొంచెం
కూడా ధన వ్యామోహం కనిపించదు.
ఇలా
బాబా ఒక్కో విషయంలో దీక్షిత్‌తో మానసిక పరివర్తన తెచ్చి మెల్లగా తనను ముక్తిపథం వైపు
నడిపించారు. తరువాత అతనికి బాబా కఫనీ కూడా ఇస్తారు. దీక్షిత్ దాన్ని షిరిడిలో ఉన్నప్పుడు
ధరించేవారు.
బాబా
మహా సమాధి
అక్టోబర్
1918 లో బాబా మహాసమాధి అయిన రోజు అందరూ సాయి బౌతిక శరీరం దగ్గర చేరి ఎవరు సాయి సమాధికి
బాధ్యత వహించాలి అనే అంశంపై హిందువులకు, ముస్లింలకు అభిప్రాయ బేదాలు వచ్చాయి. బాబా మసీదులో నివసించారు అని వాళ్ళ ఆదిక్యతను ముస్లింలు ప్రకటించుకున్నారు. కాని బాబా "నన్ను
వాడాలోకి (బూటివాడ) తీసుకు వెళ్ళండి" అని చెప్పారు. బూటి కట్టించిన కృష్ణ మందిరం
బాబాకు నిలయమయింది. ఆయన నేను సమాధి నుంచే మాట్లాడతాను అని కూడా చెప్పారు. అంతలో కోపర్‌గావ్‌కు
చెందిన మామల్తాదార్ వచ్చారు. ఆయన మీరు కనుక ఒక అభిప్రాయానికి రానట్లయితే కేసు అహ్మద్‌నగర్
కోర్టుకు వెళ్తుంది. అక్కడ తేల్చుకోవచ్చు అని చెప్తారు. దీక్షిత్ కోర్టుకు వెళ్ళి వాదించడానికి
తయారు అవ్వడం చూసి ముస్లింలకు కంగారు పుట్టింది. ఆయన కోర్టుకు వెళ్తే కేసు తప్పక గెలుస్తారు. కాబట్టి ఒక అభిప్రాయానికి
వద్దామని ఒప్పుకుంటారు. అప్పుడు బాబాను సమాధి మందిరంలో ఉంచడం జరిగింది. ఈ విధంగా దీక్షిత్
యొక్క దక్షత బాబా యొక్క ఆజ్ఞను అందరూ పాటించేలా చేసింది.
బాబా
మహాసమాధి అనంతరం - దీక్షిత్ జీవితం
బాబా
మహాసమాధి అనంతరం, దీక్షిత్ చాలా చాకచక్యంతో సమాధి మందిరానికి సంబందించిన పనులన్ని చక్కబెట్టారు.
ఆయన తీసుకొన్న జాగ్రత్తలు తరువాత షిరిడిసాయి సంస్థాన్ ఏర్పాటు చేయడానికి ఉపయోగపడ్డాయి . ఆయన దానికి గౌరవ
సెక్రటరిగా పనిచేశారు. ఆయన కార్య దీక్షత అన్ని వర్గాల వారిని సంతోష పరిచింది. ఆయన బాబా
సిద్దాంతాన్ని చక్కగా జీర్ణించుకున్నారు. ఆయనకు హిందూ, ముస్లిం అనే తేడా లేదు. ఒకసారి
బడే బాబాను వాడాలో ఉండనీయద్దని అందరూ చెప్తే దీక్షిత్ దానికి ఒప్పుకోలేదు. ఆయనను వాడాలో
ఉండనిచ్చారు. అప్పుడు నానా చందోర్కర్ కూడా ఈ విషయంలో అడ్డు చెప్పారు. కాని దీక్షిత్
తన సమత్వ బుద్దిని పాటించారు. ఆయన మనుషుల పట్ల, జంతువుల పట్ల బాబా బోధించిన దయా గుణాన్ని
ఆయన పునికి పుచ్చుకున్నారు. తన వద్దకు ఎవరు వచ్చిన భోజనం పెట్టకుండా పంపించేవారు కాదు.
ఆయన ఇంట్లో చాలా పిల్లులు ఉండేవి. అలానే కుక్కలకు, చీమలకు ఆయన ఆహారం ఇచ్చేవారు.
ఒకసారి
బాబాను పాములు, మనుషులను చంపుతాయి కాబట్టి వాటిని చంపవచ్చా అని అడిగారు. అప్పుడు బాబా
దేవుడి ఆజ్ఞ లేకుండా పాములు కూడా మనలను కరవలేవు. కాబట్టి వాటిని చంపాల్సిన పనిలేదు
అని చెప్పారు. ఈ విషయాలు గుర్తుకు ఉంచుకుని ఒకసారి ఒక తేలు కనిపిస్తే ఆయన అక్కడ ఉన్న
వాళ్ళను దాన్ని చంపవద్దని చెప్పారు. ఒక చిన్న కర్రపుల్ల తెచ్చి దాన్ని బయట నిర్జల ప్రదేశంలో
వదిలేశారు. ఆయన నిద్రపోయేటప్పుడు గాఢంగా నిద్రపోయేవారు. అందరూ దోమల మందు వాడితే ఆయన
దానికి కూడా ఇష్టపడే వారు కారు. ఈ దోమల వల్ల నా నిద్రకేమి భంగం లేదు. అవి నాలోని రక్తం
కొంచెం తీసుకుంటే నాకేమి ఇబ్బంది లేదు. వాటిల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్తే
అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్య పోయారు. ఆయనకు సాయి ధ్యానం, భజనలు చేయడం ఎంతో ఇష్టం.
ఒకసారి ఆయన కొన్ని భజనలు వ్రాస్తారు. తరువాత కావాలని రాయడం ఆపేస్తారు. ఎవరో దీక్షిత్
గారు మీరు వ్రాయండి అని అడిగితే లేదండి అవిరాస్తే నేను వ్రాసాను అన్న అహంకారం నాలో
ప్రవేశిస్తుంది. నాకు ఆ కీర్తి కూడా అక్కరలేదు. సాయి సేవయే నాకు చాలు అని సమాధానం చెప్పారు.
బాబా
మహాసమాధి తర్వాత, దీక్షిత్ వైరాగ్యం ఎక్కువై తన సంపాధన తగ్గిపోయి ఒకసారి 30000 రూపాయలు
ఒక మార్వాడికీ బాకీ పడ్తాడు. తను తీసుకున్న గడువు ముగిసి సొమ్ము కట్టవలసిన సమయం వచ్చింది.
ఒక రోజు నిద్రలో ఆ మార్వాడి కలలో కనిపించి డబ్బులు అడుగుతూ ఉంటే నాకు చున్నిలాల్, చిమన్
లాల్ అనేవాళ్ళు తెలుసు, వాళ్ళు నాకు డబ్బు ఇస్తారు అని అంటారు. ఇంతలో మెలుకువ వచ్చి
తనకు వచ్చిన కల గురించి బాధపడ్తాడు. నేను సాయిని నమ్మకుండా ఎవరెవరి పేర్లో చెప్తున్నాను
అని దిగులుపడ్తాడు. ఇంతలో డబ్బు కట్టే రోజు వచ్చింది. తన ఆఫీస్ రూంలో కూర్చుని ఉండగా
ఒక ధనవంతుడైన స్నేహితుడి కొడుకు 30,000 రూపాయలతో ఆయన కార్యాలయంకు వస్తాడు. తన తండ్రి
చనిపోయారని ఈ డబ్బుని దీక్షిత్ సహాయంతో ఏదైన వ్యాపారంలో గాని ఇంకా ఎక్కడైన జాగ్రత్త
చేయాలని చెప్తాడు. అప్పుడు దీక్షిత్ తనకే అవసరమని తనున్న పరిస్థితిని పూర్తిగా వివరిస్తారు.
అప్పుడు ఆ కుర్రవాడు, అయ్యో మీకివ్వడం కన్న నాకు గొప్ప విషయం లేదు. మనస్పూర్తిగా మీరు ఈ డబ్బులు తీసుకోండి అని ఆ గండం నుంచి గట్టెంకించడం జరిగింది. ఆయన బాబాని నమ్ముకోవడం, ఈ విధంగా బాబా దారి చూపించడంలో ఆశ్చర్యం లేదు.
దీక్షిత్
అంతిమ యాత్ర
జూలై నెల 1926 వ సంవత్సరం, దీక్షిత్, హేమద్‌పంత్, తెండుల్కర్ కూడా ఉన్నారు. జూలై 4వ తేది 1926న దీక్షిత్ గజేంద్ర మోక్షము అనే భాగవత ఘట్టాన్ని పారాయణం చేశారు. ఆరోజు రాత్రి బాబా కలలో కనిపించారు. ఆ కలలో హేమద్‌పంత్ బాబాను కౌగిలించుకున్నట్లుగా కనిపించింది. ఆ తరువాత రోజు ఈ కల గురించి అందరికి చెప్పారు. జూలై 5వ తేది 1926న దీక్షిత్ విల్లేపార్లే నుండి బొంబాయిలో నున్న డా|| దేశ్‌ముఖ్ వైద్యశాలకు బయలు దేరాడు. అక్కడ తన కుమారుడైన రామకృష్ణ అస్వస్థతతో ఉన్నారు. ఆయనను చూసేందుకు బయలు దేరాడు. ఆరోజు రైలు ఆలస్యంగా వచ్చింది. ఇంతలో హేమద్‌పంత్, తెండూల్కర్ కూడా అక్కడకు వచ్చి అందరూ రైల్లో ఎక్కారు. అప్పుడు దీక్షిత్ ఈ విధంగా అన్నారు. అన్నాసాహెబ్ చూడు సాయి ఎంత దయామయుడో ఈ రైలు ఆలస్యంగా వచ్చేట్లు చేశారు. ఇది ఆలస్యంగా రాబట్టి మనందరం కలుసుకోగలగాము. అలా వారు సాయి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కొంతసేపట్లో దీక్షిత్ ధ్యానంలోకి వెళ్ళినట్లుగా అనిపించింది. ఏమిటా అని పలకరిస్తే పలకలేదు. అప్పుడు అర్ధమైంది. ఆయనను బాబా విమానంలో తీసుకువెళ్ళారని. ఈ విధంగా ఏకాదశి రోజున జులై 5, 1926 న దీక్షిత్ తన శరీరం వదిలి వేశారు. బాబా ఆయనకు సద్గతి ప్రసాధించారు.
జూలై నెల 1926 వ సంవత్సరం, దీక్షిత్, హేమద్‌పంత్, తెండుల్కర్ కూడా ఉన్నారు. జూలై 4వ తేది 1926న దీక్షిత్ గజేంద్ర మోక్షము అనే భాగవత ఘట్టాన్ని పారాయణం చేశారు. ఆరోజు రాత్రి బాబా కలలో కనిపించారు. ఆ కలలో హేమద్‌పంత్ బాబాను కౌగిలించుకున్నట్లుగా కనిపించింది. ఆ తరువాత రోజు ఈ కల గురించి అందరికి చెప్పారు. జూలై 5వ తేది 1926న దీక్షిత్ విల్లేపార్లే నుండి బొంబాయిలో నున్న డా|| దేశ్‌ముఖ్ వైద్యశాలకు బయలు దేరాడు. అక్కడ తన కుమారుడైన రామకృష్ణ అస్వస్థతతో ఉన్నారు. ఆయనను చూసేందుకు బయలు దేరాడు. ఆరోజు రైలు ఆలస్యంగా వచ్చింది. ఇంతలో హేమద్‌పంత్, తెండూల్కర్ కూడా అక్కడకు వచ్చి అందరూ రైల్లో ఎక్కారు. అప్పుడు దీక్షిత్ ఈ విధంగా అన్నారు. అన్నాసాహెబ్ చూడు సాయి ఎంత దయామయుడో ఈ రైలు ఆలస్యంగా వచ్చేట్లు చేశారు. ఇది ఆలస్యంగా రాబట్టి మనందరం కలుసుకోగలగాము. అలా వారు సాయి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కొంతసేపట్లో దీక్షిత్ ధ్యానంలోకి వెళ్ళినట్లుగా అనిపించింది. ఏమిటా అని పలకరిస్తే పలకలేదు. అప్పుడు అర్ధమైంది. ఆయనను బాబా విమానంలో తీసుకువెళ్ళారని. ఈ విధంగా ఏకాదశి రోజున జులై 5, 1926 న దీక్షిత్ తన శరీరం వదిలి వేశారు. బాబా ఆయనకు సద్గతి ప్రసాధించారు.
దీక్షిత్
యొక్క జీవితం మనందరికి ఆదర్శం కావాలి ఆయన సంసార జీవితంలో ఉండి కూడా పరమార్ధాన్ని సాధించగలిగారు.
ఇది కేవలము సాయి సమర్దుల దయవలన మాత్రమే సాధ్యం.
ఓం సాయిరామ్
No comments:
Post a Comment