In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, May 25, 2016

గురువే ఆధారం



భగవంతుడి ధ్యానం మనలను వర్తమానంలో ఉంచుతుంది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు సృష్టి స్థితి లయలు జరుగుతూనే ఉంటాయి. మన మానసిక ప్రపంచంలో ఆలోచనల సృష్టి జరుగుతూ ఉంటుంది. ఈ ఆలోచనలు కార్యరూపం దాల్చి ఒక స్థితిని కల్పించుకుంటాయి. కాని ఎన్ని ఆలోచనలు లయం అవుతున్నాయి. బ్రహ్మ సృష్టి చేస్తే, విష్ణువు స్థితికారకుడైతే శివుడు లయకారుడయ్యాడు. ఈ తత్వం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, వారు బ్రహ్మాండ రచన చేస్తే మనము ఈ శరీరమనే అండానికి కారణమవుతున్నాము. 

మనము అంటే ఎవరు? 

మనమంటే ఈ శరీరం లోని మనసా, ప్రాణమా లేక బుద్ది అహంకారములా? ఇది అర్ధం చేసుకోవడమే నిజమైన ఆధ్యాత్మికత . కేవలము పుట్టడం చనిపోవడమే మానవ ధర్మము కాదు.


మన శాస్త్రాలు మాయ గురించి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఈ మాయ పరమాత్ముని ఆధీనంలో ఉంది అని కూడా చెప్పుకుంటాము. మనమందరము మాయ ఆధీనంలో ఉన్నాము. 

అసలు మాయ అంటే ఏమిటి? 

మనము దీని గురించి ఎందుకు ఆలోచించాలి? 

 ఈ మాయను అధిగమించడం చాలా కష్టతరం, కాని మన గురువులు మనకు మార్గాన్ని చూపించారు. ఈ మార్గాన్ని అనేక మతాలు సంప్రదాయాలు రకరకాలుగా చెప్పాయి. మన సద్గురువులు మాత్రం ఈ మాయా తీత స్థితిలో మనకు ఎప్పుడు దర్శనం ఇస్తూనే ఉంటారు. వారిని వారు చూపించిన మార్గము ద్వారా మాత్రమే మనము ఈ మాయ అనే భవసాగరాన్ని సులభంగా దాటగలము. అసలు సాగరము అంటేనే అంతులేనిది. మనము మామూలు పడవలో ఈ అంతులేని సాగరం దాటడం అనేది ఊహాతీతము. మన జీవితాలు ఏ ఆధారము లేని, మరియు తెడ్డు కూడా లేని స్థితిలో ఈ అంతులేని సాగరాన్ని ఏలా ఈదగలము. మనకు గురుకృప అనే సాధనం కావాలి. మనము పెద్ద షిప్‌లో కూడా ఈ సముద్రంలో ప్రయాణం చెయ్యచ్చు. ఈ షిప్ అంటే మనం అనుసరించే భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు. వీటి ద్వారా ఒకరోజు ఈ భవసాగరాన్ని దాటచ్చు. కాని విమానం ఎక్కితే సప్త సాగరాలన్ని చుట్టిరావచ్చు. ఈ విమానం సాయి కృప, సద్గురువు యొక్క కృప. ఈ విమానాన్ని ఎక్కడం మనం చెయ్యాల్సిన పని. ఆ గురుకృప లభించిందా, ఇట్లాంటి సాగరాలు మనల్ని ఏమి చేయలేవు. వాటిలో ఉండే అలలు, భయంకరమైన జంతువులు మన దరి దాపుల్లోకి కూడా రాలేవు. అందుకే మనందరం ఈ గురుకృప కోసం తపించాలి. బాబా అందుకే ఇలా చెప్పారు. నాకు షోడోపచారాలు, అష్థోపచారాలు అక్కరలేదు. కేవలం "సాయి సాయి" అని అంటే చాలు అని బాబా అన్నారు. కలియుగంలో కేవలం భగవంతుని నామమే మనలను గమ్యానికి చేరుస్తుంది అని మన శాస్త్రాలు కూడా గట్టిగా చెప్పాయి. ఇంతకంటే ఏమి కావాలి? ఏ సంప్రదాయమైన ఈ విషయాన్ని కాదనలేదు. 

గురువే మనకు ఆధారం. 

ఆ పరమాత్ముని స్మరించడమే ముక్తికి మార్గంగా మన శాస్త్రాలు చెప్తాయి.



ఓం శ్రీ సాయి రామ్ !

Wednesday, May 18, 2016

జీవితంలో ఆధ్యాత్మికత






జీవితాన్ని అర్ధం చేసుకుంటే కాని మనకు శాంతి లభించదు. ఈ శాంతి అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఇది ఎవరో మనకు ఇచ్చేది కాదు. ఈ అద్బుత శక్తి మనలో నుంచే రావాలి. దీనికి సాధన అవసరం. ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.  ధ్యానం ద్వారా మెదడులో మంచి తరంగాలు పుడ్తాయి. ఈ తరంగాల వల్ల మనలో విచక్షణా  శక్తి పెరుగుతుంది. మంచి చెడులను గుర్తించ గలిగే జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే ఈ విచక్షణా జ్ఞానం పెరుగుతుందో, అప్పుడు మనలో మంచి తరంగాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి.  ఈ తరంగాలు మనకు, మన చుట్టూ ఉన్న వారికి శాంతిని కలగ చేస్తాయి. 

ఆధ్యాత్మికత అనే పదాన్ని మనం చాలా చోట్ల వాడుతూ ఉంటాము. ప్రతి కార్యక్రమానికి మనం ఈ పదాన్ని వాడతాము.  ఆధ్యాత్మికత అనే పదం కేవలం పరమాత్మకి మాత్రమే వాడాలి. బంధాలనుంచి బయట పడటమే నిజమైన మోక్షం.  ఈ మోక్షం వైపు నడిచే ప్రతి అడుగు, నేర్చుకునే ప్రతీ శాస్త్రం మనలను ఈ ఆధ్యాత్మికత తత్త్వంలో ఉంచుతుంది. 

ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించాలి. మన గ్రంథాలు మనకు ఒక వరం. అవి జీవన విధానాన్ని చక్కగా బోధిస్తాయి. ఎందరో మహానుభావులు వాటిని మనకి అందేటట్లు చేశారు. వాటిని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనల్ని మనం అర్ధం చేసుకొని ఆత్మ విశ్లేషణ చేసుకోకపోతే మనకి సంతోషం ఎట్లా లభిస్తుంది. తల్లితండ్రులే వాటిని దూరంగా ఉంచితే ఇక పిల్లల పరిస్థితి ఏంటి.

ధ్యానం అంటే రోజూ పది నిమిషాలో, కొద్ది సేపో కూర్చునే ప్రక్రియ మాత్రమే కాదు. ఈ భావన రోజంతా ఉండాలి. మనము చేసే ప్రతి పనిలో దాన్ని వ్యక్తపరచవచ్చు. ఇలా మంచి ఆలోచనలతో మనము మెలిగినప్పుడు, రోజంతా ధ్యానమయం అవుతుంది.  మనం రోజంతా చాలా భూమికలు నిర్వహిస్తాము. ఒక్కో చోట ఒక రకంగా మన కర్తవ్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. మన వ్యక్తిత్వాన్ని ఆ భూమికకే పరిమితం చేయాలి. మనం చేసే ప్రతి పనిని అర్ధం చేసుకోవాలి. ఎంత వరకు మనం మాట్లాడాలో అంత వరకే మాట్లాడాలి. చేసే పనిలో నిమగ్నం అవ్వాలి. అప్పుడు అది కూడా ధ్యానం అవుతుంది

జీవితం చాలా క్లిష్టమైనది. దాన్ని మనము ఇంకా కష్ట తరం చేసుకుంటాము. అందుకే మనము ఉపయోగపడే అన్ని పద్ధతులను వాడుకోవాలి. జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి.


ఓం శ్రీ సాయి  రామ్ !

Sunday, May 8, 2016

సర్వమత సమ్మతాయ నమః


సాయిని దేవుడు కాదన్నారని , లేదా గురువు కాదన్నారు అని మనం మన సహనాన్ని కోల్పోకూడదు. మన గురువే మనకు దైవం. మన గురువు చూపించిన మార్గమే మన మార్గము. కాని కొందరు సాయి భక్తులు దిష్టిబొమ్మలు తగలపెట్టడం, బొమ్మలను చెప్పులతో కొట్టడం, ఉద్రిక్తతో మాట్లాడటం లాంటివి చేస్తున్నారు. 

సాయి ప్రచారకులుగా దీన్ని సమర్ధించవద్దు. దేవుళ్ళని కూడా అందరు విమర్శించారు. బాబాకు అన్ని తెలుసు. మన గురువుని ఎవరైన ఎమన్నా అంటే మనం ఖండించాలి, కాని ఇలా సహనాన్ని కోల్పోకూడదు.   


షిర్డీ సాయినాధులు సర్వ మతాలను గౌరవించారు. ఏ సంప్రదాయాన్ని అయన అగౌరవ పరచలేదు. అలా అని తను చెప్పిన మార్గమే గొప్పదని అయన చెప్పలెదు. ఎవరు ఏ దేవుడ్ని పూజించినా, ఏ సంప్రదాయంలో ఉన్నా, వారిని ఆ సంప్రదాయంలోనే ముందుకు తీసుకు వెళ్ళారు. కాని వారు గురు మార్గమే షిర్డీ మార్గంగా చెప్పడం జరిగింది. సాయి భక్తులు ఈ గురు మార్గాన్ని ఎంచుకోవడమే సమంజసం. సాయి సత్చరిత చదివిన వాళ్లకు అర్ధం అయ్యే విషయం  ఏమిటి అంటే ,  సాయి మన ఉపనిషత్తులను, ఆధ్యాత్మిక తత్వాలను, మానవ జీవిత లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పారు. సాయి భక్తులు మరియు ప్రచారకులుగా మనం ఈ విషయాన్ని మరిచి పోగూడదు. అందుకే మనం కూడా సర్వ మతాలను, సర్వ సంప్రదాయాలను గౌరవించడం నేర్చుకుందాము.  

మనము వీలైనంత వరకు మంచి ఆలోచనలు చేసే వారితో మెలగాలి. వారినుంచి మనకు మనశ్శాంతి లభిస్తుంది. మనస్సు మన ఆధీనంలో ఉంటుంది. అలా మంచి వారు దొరకడం కూడా అదృష్టమే. బాబా అందుకే ఇలా చెప్పారు. 

నిన్ను ఎవరైన బాధపెడితే ఒకటి రెండు మాటలు అను లేదా వెళ్ళిపో.  

ఇక్కడ బాబా ఎంతో మంచి సలహా ఇచ్చారు. మనము రోజు చవిచూసే సంఘటనలు బాబాకు తెలుసు. ఒక్కోసారి మనల్ని మనము అదుపులో ఉంచుకోలేము, కాని ఇది తప్పక అవలంభించవలసినదే. ఎందుకంటే మనలోని శక్తిని పోగొట్టుకోకూడదు. అందుకే నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోలేకపోతే ఒకటి రెండు మాటలతో సరిపెట్టమని బాబా అన్నారు.

మాట్లాడే విధానంలో వ్యతిరేక లేకుండా చూసుకోవాలి. బాబా మంచి ఆలోచనలు చేసేందుకు మనలను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన ఇలా అన్నారు. 

"నీకు నాకు మధ్య మరియు నాకు వేరే వాళ్ళ మధ్య ఉన్న గోడను పడగొట్టు" అని చెప్పారు.  దీనిలో చాలా అర్ధం దాగి ఉంది. 

మనల్ని మనము ప్రేమించుకుంటాము. 

మనది అనుకున్న దాని మీద మనకు మామూలుగా కోపంరాదు. 

ఒకవేళ మనవాళ్ళు తప్పుచేసినా దాన్ని సమర్దిస్తాము. 

అదే మనవాళ్ళు కాకపొతే, మనకి నచ్చినవాళ్ళు కాకపోతే ఇంక చెప్పనక్కరలేదు. మనస్సు ఎప్పుడూ తప్పుల కోసం చూస్తుంది. ఇక్కడే మనము మాట్లాడే మాటలను సరిగ్గా ఎంచుకోవాలి.

మనము వ్యతిరేక భావన లేకుండా కూడా మన ఆలోచన వ్యక్తం చేయవచ్చు. దీన్ని కొద్దిపాటి సాధన ద్వారా సాధించవచ్చు.

సాయిని దేవుడు కాదన్నారని, లేదా గురువు కాదన్నారు అని మనం మన సహనాన్ని కోల్పోకూడదు. మన గురువే మనకు దైవం. మన గురువు చూపించిన మార్గమే మన మార్గము. కాని కొందరు సాయి భక్తులు దిష్టిబొమ్మలు తగలపెట్టడం, బొమ్మలను చెప్పులతో కొట్టడం, ఉద్రిక్తతో మాట్లాడటం లాంటివి చేస్తున్నారు. 

సాయి తన మహసమాధి ముందు రామవిజయం అనే గ్రంధాన్ని చదివించుకున్నారు. సాయి అనేక దేవతల రూపాల్లొ దర్శనం ఇవ్వడం జరిగింది. కాని కొందరు సాయి భక్తులు రామాయణాన్నే చిన్న చూపుగా మాట్లాడుతున్నారు. వ్యాస భగవానుణ్ణి విమర్శిస్తున్నారు. 

ఇది  సాయి మార్గమెనా ? వీటిని ప్రోత్సహించ  వద్దు. 

సాయి ప్రచారకులుగా దీన్ని సమర్ధించవద్దు. దేవుళ్ళని కూడా అందరు విమర్శించారు. బాబాకు అన్ని తెలుసు. మన గురువుని ఎవరైన ఎమన్నా అంటే మనం ఖండించాలి కాని ఇలా సహనాన్ని కోల్పోకూడదు.   


సత్చరిత పరమాత్మని గురించే చెప్తుంది. పరమాత్మలో రమించే వారికి నా, పర బేధాలు ఉండవు. తప్పుగా మాట్లాడిన వారితో సహా అందరూ ఆ పరమాత్మ తత్వమే.  వారు వేరు కాదు.

 నా దేవుడే గొప్ప అనే సంప్రదాయం సాయి ఎన్నడూ సమర్ధించలేదు. గురు సంప్రదాయాన్ని సాయి భక్తులుగా మనం అందరం అవలంభించుదాము. సాయి జవహర్ అలీ లాంటి నకిలీ గురువునే గౌరవించి గురువు అనే సంప్రదాయాన్ని గౌరవించారు. సాయి భక్తులుగా మనం ఎవరినైనా  అగౌరవ పరిచేవిధంగా మాట్లాడితే సాయిని, సాయి నేర్పిన సంప్రదాయాన్ని అగౌరవ పరిచినట్టే.  



హింస వద్దు. సహనం ముద్దు. బాబా భక్తులుగా మనం సహనాన్ని నేర్చుకుందాం.




ఓం శ్రీ సాయి రామ్!


ఈ సందేశాన్ని మీకు తెలిసిన సాయి భక్తులతో మరియు సాయి భక్తులు కాని వాళ్ళతో కూడా  పంచుకోండి. 

Wednesday, May 4, 2016

మంచి ఆలోచన



మనస్సు అంటే ఏమిటి ?

వాసనలతో కూడిన ఆలోచనల తరంగమే మనస్సు.

ఈ వాసనలు మన జీవితాన్ని సుడిగుండాలుగా మారుస్తాయి. మన మానసిక పరిస్థితి వీటిమీదే ఆధారపడి ఉంటుంది. 

మంచి ఆలోచనలు మనలో ప్రశాంతతను పెంచుతాయి. 

చెడు ఆలోచనలు మనలను కష్టాలపాలు చేస్తాయి. 

మనం రోజు నిద్రపోయే ముందు మన మనస్సు ఆలోచనల మయం అవుతుంది. వాటిలో కొన్ని మంచి ఆలోచనలు మన జీవితాన్ని మార్చేవి కూడా ఉంటాయి. వాటిని తప్పకుండా ఆచరణలో పెట్టాలి అని అనుకోని నిద్ర పోతాము. ప్రొద్దున్నే లేవగానే ఈ జీవనమనే అరణ్యంలో కొట్టుకుపోతాము. ఎవరెవరో మన జీవితాన్ని నిర్దేశిస్తారు. మన ప్రమేయం లేకుండా రోజంతా గడిచిపోతుంది. ఇంటిపనులు, పిల్లలు, వృత్తి మరియు కుటుంబ వ్యవహారాలతో అలసి పోతాము. ఈ బడలికతో నిద్రకు ఉపక్రమిస్తాము. కాని మళ్ళా అవే ఆలోచనలు. మన జీవితం మన అధీనంలో లేదన్న నిస్పృహ. ఇలా ఒక రకమైన బాధ, కోపం మరియు దైన్య స్థితి ఏర్పడుతుంది. 

బాబా అందుకే ఇలా చెప్పారు. "నీ మనస్సులో ఏదన్నా మంచి ఆలోచన వస్తే, దాన్ని పరిశీలించు, ప్రొద్దున్నే లేచి దాన్ని ఆచరణలో పెట్టు. ఇదే జ్ఞానానికి తోలి మెట్టు. ఇది నీ జీవితంలో శాంతిని ఇస్తుంది". 

ఇలా మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టమని బాబా తన భక్తులను ఎంతో ప్రోత్సహించే వారు. బద్దకం అనేది వదిలించుకొమని చెప్పేవారు. చాలాసార్లు మనం చేసే పనులకు మనమే అడ్డుగా నిలుస్తాము. మనలోని న్యూనతే దీనికి కారణము. దీన్ని అధిగమించవలసిన బాధ్యత మన మీదే ఉంది. 

అందుకే మంచి ఆలోచనను వెంటనే అమలు చెయ్యాలి. దాన్ని రేపటికి వాయిదా వెయ్యకూడదు. వీటిని మనము బాగా పరిశీలిస్తాము. వాటిమీద మంచి అవగాహన కూడా వస్తుంది. కాని దాన్ని అమలు చేయడానికి వెనుకాడతాము. దీనికి మన పక్కన ఉన్న వాళ్ళను అడ్డుగా భావిస్తాము. దాని వల్ల దుఃఖం మరింత ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి మన కుటుంబ సభ్యులు మరియు మన స్నేహితులు నిస్సహాయులు. కాని వారిని నిందిస్తాము. వారివలనే మనకు ఈ కష్టం కలిగినదని భావిస్తాము. 

మనకు మనమే చేసుకోలేనప్పుడు ఇతరులు ఎలా చేస్తారు. మన జీవితాన్ని మనమే సరిదిద్దుకోవాలి. 

మన మనస్సే మన ప్రపంచం. 

మనస్సుతో మనం ఎలా చూస్తామో, అలానే ఈ ప్రపంచం కనిపిస్తుంది. 

మాయ అనే పొర కప్పినప్పుడు మన ఆలోచనా విధానం సరిగ్గా ఉండదు. 

మనం ఎన్నో జన్మలగా ఈ మనస్సులోని వాసనలకు బానిసలం అయ్యాము. వాటినుంచి బయటపడలేము. 

మన మనస్సు, అందులో చెలరేగే ఆలోచనలు, వాటినుంచి ఉద్భవించే ప్రేమానురాగాలు, ద్వేషం మొదలైనవన్ని మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. 

ఆలోచనలు మాటల రూపంలో బయటకు వస్తే అదే మనం మాట్లాడే భాష  అవుతుంది.  ఈ భాష మనకు ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తుంది. ఇది ఒక అలవాటుగా మారి అదే మన జీవన విధానం అవుతుంది. ఈ విధానం మంచిది అయితే మనలో మంచి మార్పులు కలుగుతాయి. లేకపోతే అధోపాతాళానికి తొక్కేస్తాయి. 

ఒక మంచి ఆలోచన మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

చెడు ఆలోచనలు ఈ శక్తిని తగ్గిస్తాయి. 

మరి ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి. 

వ్యతిరేక భావనలతో మనము మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. 

అన్నింటిలో మంచిని చూస్తూ మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడమే మన జీవితం యొక్క పరమావధి. ఇది ఎప్పుడు అలవాటు చేసుకుంటామో అప్పుడు బాబా మనకు నేర్పాలనుకున్న సర్వవ్యాపకత్వం మనకు అర్ధం అవుతుంది.



ఓం సాయి రామ్! 

Mind- Good thoughts





Our mind is nothing but flow of thoughts in the back ground of impressions. These impressions will influence our life. Our thoughts will dictate our wellbeing. Positive thoughts will create positive environment and negative thoughts will lead us into chaos. We think about so many things before we go to bed and we want to implement them next day at any cost. When we get up in the morning, we get lost in the jungle of life. Everybody else control our life. You feel like you do not have a choice and you are dragged in different directions. Work, kids, family will cause exhaustion by the end of the day. We go to bed tired and emotional. Same thoughts, frustration and anger overwhelm you, because you could not control your life.

Baba said “If you get a good thought in the night, ponder over it, when you get up in the morning put that thought in to works. This is the first step in the direction of the truth that is Jnana (knowledge). This is what gives us mental peace”. Baba always encouraged his devotees to implement good thoughts immediately. He never liked laziness and thought of postponing for later period. Lot of times our lazy attitude is the reason why, we can not do what we want to do. So we are obstructing our own life. So we have to put good thoughts in to practice quickly, and leave the result to God’s grace. God always protects us and takes us forward with positive thoughts and good intentions. Baba always provided his blessings and will continue to give us enough patience to carry out those fruitful good thoughts.

Our mind creates our own reality. The Maya (ignorance) covering our thinking makes our reality blurred. Our thinking distorts because of this Maya.

Our thinking dictates our words.

Words will determine our language.

Language in turn makes us behave certain way.

Our behaviors will become our habits.

The habits will create our values.

Values will lead us to our destiny.

So making our thoughts positive will change every thing we experience in our lives. Our mind, thoughts, emotions, expectations and behaviors actually create our reality.

If we have negative thoughts, we will invite more of a negative energy. If we think positive we will imbibe positive energy.

Medical studies point out that a positive thought will increase our immunity by 5 hours and similarly a negative thought will reduce our immunity by 5 hours. We will have to make a choice here! Please let us not destroy our lives by negative thoughts. Let’s be positive.



OM SRI SAI RAM!