In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Sunday, May 8, 2016

సర్వమత సమ్మతాయ నమః


సాయిని దేవుడు కాదన్నారని , లేదా గురువు కాదన్నారు అని మనం మన సహనాన్ని కోల్పోకూడదు. మన గురువే మనకు దైవం. మన గురువు చూపించిన మార్గమే మన మార్గము. కాని కొందరు సాయి భక్తులు దిష్టిబొమ్మలు తగలపెట్టడం, బొమ్మలను చెప్పులతో కొట్టడం, ఉద్రిక్తతో మాట్లాడటం లాంటివి చేస్తున్నారు. 

సాయి ప్రచారకులుగా దీన్ని సమర్ధించవద్దు. దేవుళ్ళని కూడా అందరు విమర్శించారు. బాబాకు అన్ని తెలుసు. మన గురువుని ఎవరైన ఎమన్నా అంటే మనం ఖండించాలి, కాని ఇలా సహనాన్ని కోల్పోకూడదు.   


షిర్డీ సాయినాధులు సర్వ మతాలను గౌరవించారు. ఏ సంప్రదాయాన్ని అయన అగౌరవ పరచలేదు. అలా అని తను చెప్పిన మార్గమే గొప్పదని అయన చెప్పలెదు. ఎవరు ఏ దేవుడ్ని పూజించినా, ఏ సంప్రదాయంలో ఉన్నా, వారిని ఆ సంప్రదాయంలోనే ముందుకు తీసుకు వెళ్ళారు. కాని వారు గురు మార్గమే షిర్డీ మార్గంగా చెప్పడం జరిగింది. సాయి భక్తులు ఈ గురు మార్గాన్ని ఎంచుకోవడమే సమంజసం. సాయి సత్చరిత చదివిన వాళ్లకు అర్ధం అయ్యే విషయం  ఏమిటి అంటే ,  సాయి మన ఉపనిషత్తులను, ఆధ్యాత్మిక తత్వాలను, మానవ జీవిత లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పారు. సాయి భక్తులు మరియు ప్రచారకులుగా మనం ఈ విషయాన్ని మరిచి పోగూడదు. అందుకే మనం కూడా సర్వ మతాలను, సర్వ సంప్రదాయాలను గౌరవించడం నేర్చుకుందాము.  

మనము వీలైనంత వరకు మంచి ఆలోచనలు చేసే వారితో మెలగాలి. వారినుంచి మనకు మనశ్శాంతి లభిస్తుంది. మనస్సు మన ఆధీనంలో ఉంటుంది. అలా మంచి వారు దొరకడం కూడా అదృష్టమే. బాబా అందుకే ఇలా చెప్పారు. 

నిన్ను ఎవరైన బాధపెడితే ఒకటి రెండు మాటలు అను లేదా వెళ్ళిపో.  

ఇక్కడ బాబా ఎంతో మంచి సలహా ఇచ్చారు. మనము రోజు చవిచూసే సంఘటనలు బాబాకు తెలుసు. ఒక్కోసారి మనల్ని మనము అదుపులో ఉంచుకోలేము, కాని ఇది తప్పక అవలంభించవలసినదే. ఎందుకంటే మనలోని శక్తిని పోగొట్టుకోకూడదు. అందుకే నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోలేకపోతే ఒకటి రెండు మాటలతో సరిపెట్టమని బాబా అన్నారు.

మాట్లాడే విధానంలో వ్యతిరేక లేకుండా చూసుకోవాలి. బాబా మంచి ఆలోచనలు చేసేందుకు మనలను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన ఇలా అన్నారు. 

"నీకు నాకు మధ్య మరియు నాకు వేరే వాళ్ళ మధ్య ఉన్న గోడను పడగొట్టు" అని చెప్పారు.  దీనిలో చాలా అర్ధం దాగి ఉంది. 

మనల్ని మనము ప్రేమించుకుంటాము. 

మనది అనుకున్న దాని మీద మనకు మామూలుగా కోపంరాదు. 

ఒకవేళ మనవాళ్ళు తప్పుచేసినా దాన్ని సమర్దిస్తాము. 

అదే మనవాళ్ళు కాకపొతే, మనకి నచ్చినవాళ్ళు కాకపోతే ఇంక చెప్పనక్కరలేదు. మనస్సు ఎప్పుడూ తప్పుల కోసం చూస్తుంది. ఇక్కడే మనము మాట్లాడే మాటలను సరిగ్గా ఎంచుకోవాలి.

మనము వ్యతిరేక భావన లేకుండా కూడా మన ఆలోచన వ్యక్తం చేయవచ్చు. దీన్ని కొద్దిపాటి సాధన ద్వారా సాధించవచ్చు.

సాయిని దేవుడు కాదన్నారని, లేదా గురువు కాదన్నారు అని మనం మన సహనాన్ని కోల్పోకూడదు. మన గురువే మనకు దైవం. మన గురువు చూపించిన మార్గమే మన మార్గము. కాని కొందరు సాయి భక్తులు దిష్టిబొమ్మలు తగలపెట్టడం, బొమ్మలను చెప్పులతో కొట్టడం, ఉద్రిక్తతో మాట్లాడటం లాంటివి చేస్తున్నారు. 

సాయి తన మహసమాధి ముందు రామవిజయం అనే గ్రంధాన్ని చదివించుకున్నారు. సాయి అనేక దేవతల రూపాల్లొ దర్శనం ఇవ్వడం జరిగింది. కాని కొందరు సాయి భక్తులు రామాయణాన్నే చిన్న చూపుగా మాట్లాడుతున్నారు. వ్యాస భగవానుణ్ణి విమర్శిస్తున్నారు. 

ఇది  సాయి మార్గమెనా ? వీటిని ప్రోత్సహించ  వద్దు. 

సాయి ప్రచారకులుగా దీన్ని సమర్ధించవద్దు. దేవుళ్ళని కూడా అందరు విమర్శించారు. బాబాకు అన్ని తెలుసు. మన గురువుని ఎవరైన ఎమన్నా అంటే మనం ఖండించాలి కాని ఇలా సహనాన్ని కోల్పోకూడదు.   


సత్చరిత పరమాత్మని గురించే చెప్తుంది. పరమాత్మలో రమించే వారికి నా, పర బేధాలు ఉండవు. తప్పుగా మాట్లాడిన వారితో సహా అందరూ ఆ పరమాత్మ తత్వమే.  వారు వేరు కాదు.

 నా దేవుడే గొప్ప అనే సంప్రదాయం సాయి ఎన్నడూ సమర్ధించలేదు. గురు సంప్రదాయాన్ని సాయి భక్తులుగా మనం అందరం అవలంభించుదాము. సాయి జవహర్ అలీ లాంటి నకిలీ గురువునే గౌరవించి గురువు అనే సంప్రదాయాన్ని గౌరవించారు. సాయి భక్తులుగా మనం ఎవరినైనా  అగౌరవ పరిచేవిధంగా మాట్లాడితే సాయిని, సాయి నేర్పిన సంప్రదాయాన్ని అగౌరవ పరిచినట్టే.  



హింస వద్దు. సహనం ముద్దు. బాబా భక్తులుగా మనం సహనాన్ని నేర్చుకుందాం.




ఓం శ్రీ సాయి రామ్!


ఈ సందేశాన్ని మీకు తెలిసిన సాయి భక్తులతో మరియు సాయి భక్తులు కాని వాళ్ళతో కూడా  పంచుకోండి. 

No comments:

Post a Comment