ఒక సారి రామదాసి పంథాలో ఉన్న నలుగురు మదరాసు భజన సమాజం పేరిట కాశీ యాత్ర చేస్తూ షిర్డీలో బాబా గురించి
విని ఆయన దర్శనార్ధం వస్తారు. వారిలో ఒక పురుషుడు, అతని భార్య, కుమార్తె మరియు
అతని వదిన ఉంటారు. వారందరు బాబా యొక్క ఉదార స్వభావం గురించి విని బాబా డబ్బు ఇస్తే
తీసుకుందామని వస్తారు. బాబా ఒక్కోసారి పెద్దమొత్తంలో దానంగా ఇచ్చేవారు. ఒక్కోసారి
ఏమి ఇచ్చేవారు కాదు. వారు బాబా దర్శనం చేసుకొని అక్కడ ఉండి రోజూ వారు మంచి భజనలు పాడేవారు. భార్యకు బాబాపై ఎంతో నమ్మకం ఉండేది. ఆమె
ఒక రోజు పరవశంతో భజన పాడుతూఉంటే బాబా శ్రీరామునిగా దర్శనం ఇస్తారు. ఈ విషయం ఆమె భర్తకు చెప్తే ఆయన నమ్మకుండా ఆమెను ఎగతాళి చేస్తాడు. కొన్ని
సార్లు ఆలా కనిపించిన తరువాత ఆమెలో కూడా డబ్బు మీద ఆశ కలిగేటప్పటికి ఆ దర్శనం ఆగిపోతుంది. తరువాత తన తప్పు తెలుసుకొని దురాశను వదిలితే
మరల దర్శనము కలుగుతుంది.
భర్తకు ఒక సారి కలలో తనను పోలీసులు పట్టుకొని
కాళ్ళు చేతులు కట్టివేసినట్లుగా కనిపిస్తుంది. కలలో బాబా ఎదురుగా కనిపిస్తే,
బాబాను ఇలా అడుగుతాడు. నిన్నే నమ్మి ఇక్కడకు వస్తే ఈ ఆపద నాపై ఎలా పడింది".
అప్పుడు బాబా "నీవు చేసిన కర్మ ఫలితం నీవే అనుభవించాలి. అది ఈ జన్మలో చేసినా
ఇంతకు ముందు జన్మలలో చేసినా వాటిని అనుభవించాలి" అని బాబా అంటారు. అప్పుడు
అతను తన పాపాలను దహించివేయమని అన్యధా శరణం లేదు అని వేడుకుంటాడు. అప్పుడు బాబా
అతనిని కళ్ళు మూసుకోమని చెప్తారు. తరువాత కళ్లుతెరిస్తే ఆ పోలీస్ చచ్చిపోయి
ఉంటాడు. అతనికి ఇంకా భయం వేసి మరల బాబాను రక్షించమని కోరుకుంటాడు. మల్లి కళ్ళు
మూసుకుంటే ఆ పరిస్థితినుంచి పూర్తిగా బయటపడి బాబా ఎదురుగా ఉంటె నమస్కరిస్తాడు.
అప్పుడు బాబా ఇదివరికి నమస్కారానికి ఇప్పటి నమస్కారానికి తేడా ఉందా అని అడుగుతారు.
అప్పుడు అతను తేడా ఉంది బాబా ఇంతకూ ముందు డబ్బు ఆశతో నమస్కారం చేసేవాడిని, కాని
ఇప్పుడు తమరిని దేవుడిగా భావించి చేసాను అని చెప్తాడు. తరువాత అతని కోరిక మీద అతని
గురువైన రామదాసు స్వామి దర్శనం కూడా కలగ చేస్తారు. వారి పాదములపై పడగానే రామదాసు
స్వామి అదృశ్యమవుతారు. అక్కడ బాబా ఒక వృద్ధుడి లాగ కనిపిస్తారు. మీ వయసు ఎంత? మీరు
ఇంత ముసలివాని లాగా కనిపిస్తున్నారు అని అతను అంటాడు. నన్ను ముసలి వాడు అంటావా
అయితే నాతో పరిగెత్తు అంటూ బాబా పరిగెత్తి అదృశ్యమవుతారు. స్వప్నం నుండి అతను
మేలుకొని తన మనోవైఖరిని పూర్తిగా మార్చుకొని బాబా ఆశీస్సులను పొందుతారు. ఇలా తన
భక్తులను మార్చుటకు అనేక లీలలు చూపిస్తారు.
టెండూల్కర్ కుటుంబము:
రఘునాథ రావు టెండూల్కర్, అతని భార్య
సావిత్రిబాయి బాబాకు భక్తులు. ఇద్దరికి బాబా అంటే ఎనలేని ప్రేమ మరియు భక్తి. ఆమె
మరాఠీలో 800 అభంగాలతో, పద్యాలతో బాబా లీలలను సాయినాథ భజన మాల అనే పుస్తకం
వ్రాసారు. వారికి ఒక కొడుకు ఉన్నాడు. అతను చిన్నప్పుడు కొన్ని రోజులు బాబా
దగ్గరకూడా ఉన్నాడు. తరువాత ఆ కుర్రవాడు బాగా చదువుకొని గొప్ప వైద్యుడవుతాడు. ఒక
సారి అతను వైద్య పరీక్షకు కూర్చోవాలా లేదా అనే
సందిగ్ధంలో జ్యోతిష్కులను సంప్రదిస్తే అతని గ్రహాలు బాగుండ లేదని వచ్చే
సంవత్సరం పరీక్ష తీసుకోవడం మంచిది అని చెప్తారు. సావిత్రిబాయి షిర్డీ వెళ్లి
బాబాకు ఈ విషయం చెప్తే పరీక్షకు కూర్చోమంటారు. బాబాపై నమ్మకంతో వ్రాత పరీక్షలో
ఉత్తీర్ణుడై నోటి పరీక్షకూడా అయిపోతుంది. ఇలా బాబా అతనిని రక్షించి అతనిలో
నమ్మకాన్ని పెంచారు. తరువాత అతని ప్రాక్టీసులో బాబా చిత్రపటం పెట్టుకొని వృత్తి
కొనసాగించాడు. అలానే రఘునాథ రావు గారికి వయసు పెరిగి తనను కంపెనీ నుంచి పదవీవిరమణ
చూపిస్తారు. వారికి పింఛను ఎక్కువ రాదని దిగులుపడుతూ ఉంటే, సావిత్రిబాయి బాబా కలలో
కనిపించి నెలకు వంద రూపాయిలు చాలా అని అడుగుతారు. తరువాత అతనికి 110 రూపాయిలు
వస్తుంది. ఇలా వారి కుటుంబాన్ని దిగారు ఉండి కాపాడుతారు.
కెప్టెన్
హాటే గారు గ్వాలియర్ లో ఉండే వారు. ఒకరోజు ఆయనకు కలలో బాబా కనిపించి నన్ను
మరిచిపోయావా? అని అంటారు. బిడ్డలు తల్లిని మరిచిన ఇక వారికి తరుణోపాయమెక్కడిది అని
హాటే అంటాడు. ఇంతలో తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయంపాక వస్తువులను, దక్షిణను ఒక
చేటలో ఉంచి బాబాకు సమర్పించబోతూ ఉండగా అతనికి మెలుకవ వస్తుంది. తరువాత తన
స్నేహితుడుకి ఈ విషయం చెప్పి డబ్బులు పంపిస్తాడు. ఆ స్నేహితుడు అన్ని వస్తువులు సేకరించి
ఒక్క చిక్కుడుకాయలు దొరక్కపొతే, తరువాత దారిలో ఒక వృద్దులారు తనకు అవి అమ్ముతుంది.
బాబాకు ఇవి సమ్పర్పిస్తే చిక్కుడు కాయల కూరతోనే బాబా ఆ రోజు భోజనం చేస్తారు. ఈ
విషయం తెలుసుకొని హాటే సంతోషపడతాడు. ఇలానే ఇంకో సారి ఒక రూపాయి నాణం బాబా
ఆశీర్వాదం కోసమని పంపి బాబా అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఒక స్నేహితుడు ద్వారా
రూపాయి నాణెం పంపిస్తాడు. ఆ స్నేహితుడు బాబా దగ్గరకు వీలు నమస్కరించిన వెంటనే బాబా
దక్షిణ అడుగుతారు. అతను ఇచ్చిన డబ్బులు తన దగ్గరే ఉంచుకుంటారు. అప్పుడు అతను హాటే
ఇచ్చిన రూపాయి ఇస్తే బాబా దానితో కొంచెం సేపు ఆడి తిరిగి అతనికి
ఇచ్చి హాటేకు ఇమ్మని చెప్తారు. అలానే ఊది కూడా ఇచ్చి తన ఆశీర్వాదం పంపుతారు.
వామన్
నార్వేకర్ అనే అతను హాటే లాగ ఒక నాణెం బాబా ఆశీర్వాదంతో తీసుకోవాలని వస్తాడు. ఆ
నాణెంకు ఒక వైపు సీతా, రామ లక్ష్మణులు ఇంకో వైపు హనుమంతుడు ఉంటారు. ఈ నాణెం వెంటనే
బాబా శ్యామాకు ఇచ్చి పూజా మందిరంలో ఉంచమంటారు. శ్యామా వామన్ యొక్క కోరికగురించి
చెప్తే సరే 25 రూపాయలు ఇవ్వమంటారు. అవి ఇచ్చిన తరువాత కూడా ఆ నాణెం అతనికి ఇవ్వరు.
ఇలా బాబా ఎవరికి ఏది అవసరమో అది మాత్రమే చేసే వారు. సాయి యోగ్యమైన
దానిని, అయోగ్యమైన దానిని ఎరుగుదురు. వారు ఏది చేసినా మన మంచి కోసమనే మనం అర్ధం
చేసుకోవాలి.
ఓం శ్రీ
సాయినాథార్పణమస్తు !
No comments:
Post a Comment