In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, July 25, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 46



ఈ అధ్యాయంలో హేమద్పంత్ గారు ఎలా బాబా శ్యామా కన్నా ముందు గయకు వెళ్తానని చెప్పారో అలానే బాబా రెండు మేకలను కొనడం వాటి పూర్వజన్మ గురించి చెప్పడం లాంటి విషయాలను పొందుపర్చారు. సాయి దర్శనం కర్మ బంధనాలనుండి విముక్తిని ప్రసాదిస్తుంది. భక్తిభావమున్న వారికి సమాధిలో జాగృతంగా ఉన్న సాయి జ్యోతి స్వరూపం వెంటనే అనుభవమవుతుంది. బాబా తన భక్తులను ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా సూక్ష్మమైన దారంతో పట్టి లాక్కుని వస్తారు. తన భక్తులను ఒక తల్లిలాగా ప్రేమతో లాలిస్తారు. ఎంత పండితులైనా అహంభావంవలన ప్రపంచమనే సుడిగుండంలో ఇరుక్కుపోతారు. లోపలనుండి అనేక లీలలు చేస్తూ పైకి ఏమి అంటనట్లు కనిపిస్తారు. అంతా చేస్తూ నేను కర్తను కాను అంటారు. అందువలన శరీరాన్ని, వాక్కును, మనసును బాబా పాదాలకు అర్పించి నోటితో బాబా స్మరణ చేస్తే పాప ప్రక్షాళన అవుతుంది. కోరికలు గల వారి కోరికలు తీర్చి, ఏ కోరికలు లేనివారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఇటువంటి సాయి నామం రజో తమో గుణాలను తొలిగించి సత్వ గుణం అభివృద్ధి చెందేలా చేసి మనలను ముందుకు నడిపిస్తుంది. అప్పుడు ధర్మవృత్తి జాగృతం కాగానే దాని వెంట వైరాగ్యం పరిగెత్తుకుని వస్తుంది. నిత్యా అనిత్య జ్ఞానం కలిగి ఆత్మ స్వరూపం వ్యక్తం అవుతుంది. ఇదే సంపూర్ణ గురు అర్పణ. మనసు సాయి పాదాలకు అంకితం అయింది అనటానికి ఒకటే గుర్తు. సాధకుని మనసు శాంతినే కాంక్షిస్తుంది. వారి భక్తి పూర్తిగా వికసిస్తుంది. ఇటువంటి భక్తి ఉన్నవారి చెంత బ్రహ్మీ స్థితి దాసి లాగా ఉంటుంది అని హేమద్పంత్ గారు ఈ అధ్యాయం మొదట్లో చెప్పారు. 

బాబాకు ఆహ్వానం - శ్యామా యాత్ర 
బాబు, కాకాసాహెబ్ పెద్ద కుమారుడు. నాగపూర్లో ఆయనకు ఉపనయనం చేయాలని నిర్ణయిస్తారు. అలానే నానా చాందోర్కర్ పెద్ద కుమారుడి పెళ్లి కూడా నిశ్చయం అవుతుంది. ఆ పెళ్లి గ్వాలియర్ నగరంలో అని నానా బాబాను పెళ్ళికి ఆహ్వానిస్తాడు. అలానే కాకా కూడా బాబాను రమ్మని కోరతాడు. సరే తన బదులు శ్యామాను పంపిస్తాను అని బాబా అంటారు. కాకా బాబా కూడా రావాలి అని పట్టు బడితే బాబా ఇలా అంటారు. "కాశీ ప్రయాగ యాత్రలు పూర్తి చేసి శ్యామాకంటే ముందుగా వస్తాను" అని చెప్తారు. ఇక శ్యామా ప్రయాణానికి కావాల్సిన వాటిని సిద్ధం చేసుకుంటాడు. శ్యామా నందరామ్ దగ్గర వంద రూపాయలు అప్పుగా తీసుకొని బాబా దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు.
"దేవా! పెళ్ళికి ఉపనయనానికి వెళ్లి అక్కడనుంచి కాశి ప్రయాగ కూడా వెళదామని అనుకుంటున్నాను మీ అనుమతి ఇవ్వండి" అని వేడుకుంటాడు. అప్పుడు బాబా " ఇందులో అడగవలిసినది ఏముంది? అలాగే వెళ్లి రా. అప్రయత్నంగా మనకు ప్రాప్తిస్తున్న వాటిని అనుభవించడంలో తప్పేమి లేదు. తప్పక వెళ్లి, పుణ్య క్షేత్ర దర్శనం చేసుకో అని తన అనుమతి ఇచ్చారు. శ్యామా కాశి యాత్ర గురించి విని అప్పా కోతే కూడా వస్తానంటాడు. 

శ్యామా, కోతే  మొట్టమొదట కాకా సాహెబ్ పెద్దకొడుకు బాబు ఉపనయనం చూసుకొని గ్వాలియర్ బయలుదేరతారు. కాకా వారికి రెండు వందలు ఇచ్చి పంపుతాడు. తరువాత పెళ్లికి వెళ్తారు. నానా వీరి యాత్రకు అని వంద రూపాయలు ఇస్తాడు. అలానే పెళ్లికూతురు తండ్రి అయిన జథారు గారు కూడా నూరు రూపాయలు ఇస్తారు. వారిద్దరూ తరువాత అయోధ్యకు బయలుదేరతారు. అక్కడ కొన్ని రోజులు ఉండి కాశికి వెళ్తారు. కాశీలో రెండు నెలలు ఉంటారు. వారు అక్కడినుండి గయకు బయలుదేరితే అక్కడ ప్లేగు వ్యాధి ఉందని చెపితే కొంచెం ఆందోళన పడతారు. తరువాత పిండ ప్రధానం చేయించే బ్రాహ్మణుడు వచ్చి అక్కడ అంతా బాగానే ఉంది అని దైర్యం చెప్పి వారిని గయలో ఉన్న తన ఇంటికి తీసుకు వెళ్తాడు.  ఆ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది కాని శ్యామా అక్కడ ఉన్న బాబా పటాన్ని చూసి ఆశ్యర్యం పొందుతాడు. బాబా చెప్పినట్లు తనకన్నా ముందే గయకు వచ్చారు అని అనుకుంటాడు. శ్యామా కళ్ళలో ఆనందాశ్రువులు చూసి ఆ యజమాని విషయం ఏమిటి అని అడిగితే, శ్యామా ఆ పటం గురించి అడుగుతాడు. పన్నెండేళ్ల క్రితం తను సాయి సమర్థుల గురించి విని షిర్డీ వెళ్ళాను. అక్కడ బాబా దర్శనము చేసుకొని మాధవరావు గారి ఆతిధ్యం స్వీకరించి ఆయన దగ్గర ఉన్న ఈ పటాన్ని తెచ్చుకున్నాను అని చెప్తాడు. ఇదంతా విన్న తరువాత శ్యామాకు ఈ విషయం గుర్తుకు వచ్చి తానే ఆ మాధవరావు అని చెప్తాడు. అప్పుడు వారు బాబా లీల ఎంత అపురూపమైనది అని భక్తిపారవశ్యంతో ఆనందం చెందుతారు. వారిని ఆ బ్రాహ్మణుడు మంచి రాచ మర్యాదలతో సత్కరించి అక్కడ జరగవలిసిన పిండప్రదానాలు చేయించి పంపుతాడు. ఇలా బాబా తన భక్తులను వెన్నంటి రక్షిస్తూ ప్రేమతో అనుగ్రహిస్తారు. 

మేకల పూర్వజన్మ కథ 
ఒక సారి బాబా లెండి నుంచి వస్తూ అక్కడ ఉన్న మేకల గుంపులో ఉన్న రెండు మేకలను 32 రూపాయలు ఇచ్చి కొంటారు. ఇదేమిటి బాబా ఇంత డబ్బులు పెట్టి కొన్నారు అని శ్యామా, తాత్యాలు అడుగుతారు. ఆ రెండు మేకలను చూసి వాటిపై ప్రేమతో, చక్కగా నిమిరి వాటికి ఆహరం తెప్పించి పెడతారు. ఒకప్పుడు మానవ శరీరాలు ధరించి పతనమై జంతు జన్మలు తీసుకున్నా వాటిని ఆదరించి బాబా అక్కున చేర్చుకున్నారు. శ్యామా, తాత్యాలు అడిగిన దానికి సమాధానంగా బాబా ఇలా అనుకుంటారు. వీరికి డబ్బు తప్ప మరొకటి కనిపించదు కదా! వారి అజ్ఞానికి మెల్లగా నవ్వుకొని వీటి పూర్వజన్మ వృత్తాంతం చెప్పారు. ఈ రెండు మేకలు పూర్వ జన్మలో అన్నదమ్ములు, వారు
నాతోనే ఉండే వారు అని, చిన్న వాడు కష్టపడి పనిచేస్తుంటే పెద్దవాడు సోమరిలాగా ఉండే వాడని చెప్తారు. మొట్టమొదట ఇద్దరు బాగానే ఉండే వారు. కాని ధనాశ పెద్దవాడిని మార్చివేసింది. చిన్న వాడి ధనాన్ని కాజేయాలని పెద్దవాడు ఈర్ష్యపడుతూ ఉంటాడు. ఒక రోజు చిన్నవాడిని చంపాలని ఒక కర్రతో వాడి తలపై కొడతాడు. అప్పుడు చిన్నవాడు గొడ్డలితో అన్నను కొడతాడు. ఇద్దరు చనిపోయి ఈ జన్మలో మేకలుగా పుట్టారు. వారిని చూసి జాలి పడి వారిని దగ్గరకు తీసుకున్నాను. బాబా శ్యామాతో ఇలా అంటారు. " ఔను, అంత ధర ఇచ్చాను. ఇప్పుడేమంటారు? ఇంతకీ డబ్బు పెట్టుకొని నేనేం చేసుకోవాలి? నాకు ఇల్లు వాకిలి సంసారం ఏమీలేవు. ఇక డబ్బును నేను ఎందుకు దాచిపెట్టుకోవాలి? సరే అయిందేదో అయిపొయింది. ఈ డబ్బు తీసుకొని దుకాణంకు వెళ్లి  వీటికి మంచి ఆహరం తెండి అంటారు. అలా వాటికి ఆహారం పెట్టి మరల వాటిని ఆ యజమానికే ఇచ్చేస్తారు బాబా. 

ప్రారబ్దం రీత్యా వచ్చే కష్టాలు ఎంత కఠినంగా ఉన్నా అనుభవించవలిసిందే. ఈ జన్మలో చేసుకున్న పాపాలను తప్పించలేము. వంచన-కపటం-క్రోధం- ఈర్ష్య లాంటి గుణాలు మనుషులను దిగజార్చి జంతు జన్మలలోకి పతనం అయ్యేలా చేస్తాయి.  అందుకే గురువు చెప్పిన మార్గంలో నడుస్తూ ఈ చెడు గుణాలను దరిచేరనివ్వకూడదు. గురువును పూర్తిగా నమ్మితే, అన్ని ఆయనకు సమర్పిస్తే ఇంక దారి తప్పడం అనేది ఉండదు. 


ఓం శ్రీసాయినాథార్పణమస్తు ! 




Sri Saisatcharita Chapter - 46



In this chapter Hemadpanth talks about how Baba tells Syama that he will be in Gaya before he reaches that place. He also talks about the story of 2 goats. Like in every chapter there will be some introduction in the beginning. Baba's blessings will remove obstacles from our life and how he pulls his devotees to Shirdi with an invisible thread. It was mentioned that Sai will bring them and keep them at his feet, and embrace them, hugging them close to his heart, like a mother holds her child. Baba nurtures them easily. 

Hemadpanth says "Inwardly and invisibly you play all the games, but show the flag of detachment. You do things and pose yourself as a non-doer. Nobody ever knows your ways". Therefore, let us surrender body, speech and mind at your feet and always chant your name for destroying our sins. You fulfill the desires of the desirous and to the detached, give the bliss of your abode. Chanting your sweet name is the easiest sadhana for your devotees. By that the sins will be destroyed. Passion and ignorance will undoubtedly be wiped out. Goodness will gradually arise; and after that, the store of merits will increase. Once righteousness is awakened, dispassion will follow quickly. The sense pleasures lose their hold and self knowledge manifests immediately. Knowledge is reached due to discrimination. Then we abide in our Self and become humble at the Guru’s feet. This is what is called complete surrender to the Guru. The one and only sure sign of the surrender at Sai’s feet is that the disciple becomes calm and peaceful and perfects his devotion with eagerness and joy. Loving devotion to the Guru is the sacred law; ‘ I am That’ is the essence of Knowledge; dislike for the sense pleasure is the supreme dispassion. Aversion for conditioned
existence comes at that stage.

Baba going to Gaya before Syama

Next in this chapter Baba was invited to attend the ceremonies of Dixit son's thread ceremony and at the same time Nana Chandorkar's eldest son is also getting married. Baba himself never went anywhere so he decided to send Syama on behalf of him. Thread ceremony was in Nagpur and marriage was in Gwalior. Baba tells everyone there that after doing Kashi and Prayag quickly I will wait there for Syama. How much time will I need to arrive there? after lunch Madhavrao began to think that once he had reached Gwalior, Kashi would not be far away from there. He borrowed one hundred rupees from Nandram (Marwadi) for his travelling expenses. Then he went to get Baba’s permission to leave and asked him with great reverence:  “ Since I am going to Gwalior for these
ceremonies, I feel that it would be proper to take the opportunity to incidentally go to Kashi and Gaya. Therefore, Lord, I touch your feet and ask if I can visit Kashi and Gaya. ” Baba happily gave permission to Madhavrao to go . Appa also joins Syama and they both head to Nagpur to attend the thread ceremony, where Kaka Saheb gave two hundred rupees to Madhavrao for expenses. From there, they went to Gwalior for the wedding. Nana Saheb gave one hundred rupees to Madhavrao, at that time. Shrimant Jathar, a relative (the father-in-law of his child), also gave one hundred rupees. Thus Nana showered his affection on his Guru bandhu. Then Shyama goes to Kashi and then Ayodhya. Jathar's manager received both Syama and Kote in in Ayodhya. They stayed there for 21 days. Then they left for Gaya but heard about plague in Gaya and hesitant to go there. But person who organized Gaya trip reassures them that there was no plague. Then they go to Prayag. This person gave Syama and Kote accommodation in his house. That house was big and what surprised Syama was big portrait of Baba in his house. Syama was overwhelmed with emotion and remembered Baba's words that he will be in Prayag before Syama. Then he asks hm how he got this Baba's portrait. Syama learns that he took care of him long time ago and gave him this portrait when he came to Shirdi.Then this Gayawala was very happy and both remembered this incident. This happened 12 years prior to the current meeting. Then this Gayawala gave royal welcome to both Syama and Kote. This is how Baba takes care of his devotees. 

Goats past lives story
In the end Hemadpanth closes this chapter by talking about how Baba bought 2 goats and showed love towards them. Once Baba saw a flock of goats and two goats attracted his attention and bought them for Rs. 32. Everyone felt that Baba paid too much and was duped in this bargain. But Baba later explained that these two goats were brothers in previous life. The younger one was hard working and the older one was lazy. Older one got jealous of the young and started fighting with him. One day the older one wanted to kill his brother and get all his money. He went after him with a stick and hit him in the head. Then younger one hit the older with an ax. Both died and took life as goats in this life. Baba showered his love towards them and fed them.  In the end Baba gave these goats back to owner.  Here Baba gave a glimpse of how the past life events will influence our current lives. No matter what Parama Gurus will not leave their devotees without showering their love.



Om Sri Sainatharpanamasthu!



Wednesday, July 18, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 45



మన చిత్త వృత్తి ప్రపంచం నుండి నివృత్తి కాకపోతే, భగవంతునిపై ప్రీతి కలగకపోతే ఇంతకంటే దుర్గతి ఏముంటుంది? భక్తితో మనసు, సర్వేంద్రియాలు సాయిపైన నిలపటమే నిజమైన  ఆరాధన. లేకపోతే కళ్ళతో సాయిని చూస్తున్నా, మాట్లాడాలని తలచినా నోరుపెగలదు. క్షణమైన సాయి నుండి విడిగా ఉండగలవాడు అసలు సాయిభక్తుడా? ప్రపంచమందు విరక్తి కలుగని వానికి భగవంతునిపై ఆసక్తి ఎలా కలుగుతుంది. తల్లిదండ్రులు మమతను పంచుతారు. పుత్రుడికి తన ఆస్తి పైన దృష్టి ఉంటుంది. భార్య తన పసుపు కుంకుమల కోసం తపిస్తుంది. పరమార్ధంలో సహాయం చేసేవారు ఎవ్వరూలేరు. పరమార్ధం సంపాదించుకోవడంలో సహాయపడే వారు ఎవరు అని ఆలోచిస్తే చివరకు మనమే మిగులుతాము. ఎవరి యందు ఏ ఆశా లేకుండా ఆత్మ యందు దృఢమైన విశ్వాసముంచి తమ ప్రయత్నాన్ని స్వయంగా చేసుకునేవారికి పరమార్ధం సిద్దిస్తుంది. గురువు యొక్క నామాన్ని జపించడం ద్వారా పరమానందం జనిస్తుంది. సర్వ ప్రాణులలో భగవంతుని దర్శనం కలుగుతుంది.

ఒకసారి దీక్షిత్ బాగవత పారాయణ చేస్తూ, నవనాధుల భక్తి తత్వం గురించి చెప్పుకొని అక్కడ ఉన్న వారితో ఈ విధంగా అంటారు. ఈ నవనాధుల చర్యలు, వారి మనోవృత్తి అంతుపట్టనివి. అక్కడ ఉన్న శ్యామాతో, "ఈ భక్తి ఎంత కఠినమైనది. మనవంటి మూడులకు అంతటి శక్తి ఎక్కడ ఉన్నది? జన్మజన్మలకు ఇది సాధ్యం కాదు. గొప్ప దిట్టమైన ఆ నవనాధులు ఎక్కడ, మొదటి నుండి పాపులమైన మనమెక్కడ" అని వాపోతాడు. ఈ నవనాథుల గురించి భాగవతం 11వ స్కంధంలో చెప్పారు. స్వాయంభువ మనువునకు కుమారుడు ప్రియవ్రతుడు. ఆయనకు అగ్నీధ్రుడు, అతనికి నాభి, వానికి ఋషభుడు అనువారు పుత్రులై జన్మించారు. ఋషభునకు వందమంది పుత్రులు ఉన్నారు. వారిలో భరతుడు శ్రేష్ఠుడు. అతని ద్వారా భారతదేశమనే పేరు వచ్చినది. భరతుని సోదరులలో తొమ్మిది మంది పుణ్యశీలులు,
ఆత్మవిద్యా తత్పరులై సన్యాసులైనారు. వీరు దిగంబరులై విశ్వమంతటిని తమ స్వరూపంగానే భావింతురు. వీరు నిమి మహారాజుకు కలుగచేసిన సత్సంగమే ఈ నవనాథుల ఘట్టం. వీరిలో మొదటివాడైన కవి యనే ఋషి అర్పణ భావాన్ని గురించి చెప్పారు. భగవంతుడి పట్ల మనం ఎలా ఉండాలి అన్న విషయాన్ని బోధించారు. హవి అనే ఋషి భక్తుని లక్షణాల గూర్చి, అంతరీక్షుడు మాయా స్వరూపం గురించి, ప్రబుద్ధుడు ఆ మాయను దాటటం గురించి, పిప్పలాయనుడు నారాయణ పరబ్రహ్మ  స్వరూపం గురించి, అవిర్హోత్రుడు కర్మ గురించి, ద్రుమిళుడు భగవంతుని అవతార లీలల గురించి, చమనుడు భక్తిహీనుల అధోగతి గురించి, కరభాజనుడు వేరు వేరు యుగములలో భగవంతుని ఉపాసించు విధముల గూర్చి చెప్పారు. వీరు సంపూర్ణ ఉపనిషద్ జ్ఞానాన్ని, కర్మ మరియు అపార భక్తి తత్వాన్ని బోధించడం జరిగింది. అందుకే దీక్షిత్ గారు అంత వ్యాకులత పొందారు. ఆయన ఈ అధ్యాయాలను అనేక సార్లు పారాయణ చేశారు. వాటిలో ఉన్న పరమార్ధం ఎంత ఉన్నతమైనదో ఆయనకు తెలుసు. 

మరి  శ్యామాకు కాకా యొక్క దైన్యం నచ్చలేదు. సాయిబాబా వంటి ఆభరణాన్ని పొందిన భాగ్యం ఉండీ ఇంత దైన్యం ఎందుకు? సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం ఉంటే మనసులో ఇంతటి తపన ఎందుకు? మీకు ఏకనాధ భాగవతంలోని ఏకాదశ స్కందము మరియు భావార్ధ రామాయణం చదవమని బాబా ఆజ్ఞ కాదా! దానిని బట్టి హరి నామస్మరణ, గురుస్మరణే సాధన అనే బాబా ఆజ్ఞ ప్రమాణం కాదా? దీనితో మనం భవాన్ని తరించగలం. మీకు ఎందుకు చింత అని చక్కగా చెప్పారు. భక్తి, జ్ఞాన మార్గంలో సత్సంగము చాలా అవసరం. ఒకరినొకరు ధైర్యం చెప్పుకుని ముందుకు సాగాలి. అట్లానే దీక్షిత్ కూడా వేరు వేరు సమయాల్లో వేరేవాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. ఆయనకు సాయి పట్ల ఎంతో నమ్మకం ఉన్నా ఇంకా బాబాపై ప్రేమ పెరగాలి అన్న తపనే కాని ఆయనకు బాబా పైన నమ్మకం లేక కాదు.

ఆనందరావు పాఖాడే అనే అతను శ్యామాను కలవాలి అని పురాణకాలక్షేపం జరిగే స్థలానికి వస్తారు. కాకాసాహెబ్ భాగవతం చదువుతూ ఉంటారు. పాఖాడే శ్యామా చెవిలో తనకు బాబా చూపించిన స్వప్నం గురించి చెప్తూ ఉంటారు. కాకాసాహెబ్ భాగవతం చదవడం ఆపి విషయమేమిటి అని అడుగుతాడు. అప్పుడు శ్యామా "నిన్న నీ సంశయానికి సమాధానంగా బాబా పాఖాడేకు స్వప్నంలో ఏమి చెప్పారో వినుము" అని అంటాడు. బాబా స్వప్నంలో పాఖాడేకు ఇలా చెప్పారు " రక్షకమైన భక్తి గాక వేరేదియు దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును" అని బాబా చెప్పారు. ఇక ఆ స్వప్నదృశ్యం గురించి పాఖాడే ఇలా చెప్పారు. లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అక్కడ బంగారు సింహాసనంపై కూర్చుని ఉన్న బాబాను చూసాను. అప్పుడు శ్యామా "ఆనందరావు! బాబా పాదాలపై బడుము" అని సలహా ఇచ్చెను. కాని బాబా పాదాలు నీటికింద ఉండడం వల్ల నమస్కరించడం కష్టం అవుతుంది. శ్యామా బాబాను "ఓ దేవా! మీ పాదాలను బయటకు తీస్తే అతను నమస్కరించుకుంటాడు. ఆలా ఆయన నమస్కారం చేయగా బాబా ఇలా ఆశీర్వదించారు " ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయము కాని ఆందోళన గాని అవసరం లేదు. శ్యామాకు పట్టుపంచె ఒకటి దానము చేయుము. దాని వల్ల మేలు పొందెదవు". ఆలా పాఖాడే పట్టుపంచె తీసుకొని శ్యామాకు ఇవ్వడానికి వస్తే శ్యామా వద్దు అంటాడు. అప్పుడు కాకా చీట్లు వేసి శ్యామా పంచె తీసుకోవాలి అని వస్తే శ్యామా తీసుకుంటాడు. ఇలా కాకా సంశయం కూడా తీరింది. మనం బాబాపై అపార నమ్మకాన్ని ఉంచితే ఆయనే మనలను ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలకు చేరుస్తారు.
 

ఇక చివరగా ఈ అధ్యాయంలో బాబా పడుకున్న జానెడు బల్ల గురించి చెప్పారు. మొట్టమొదట అధ్యాయాల్లో బాబా ఈ బల్లపై పడుకున్న లీలను మనం చెప్పుకున్నాము. ఒక నాడు బాబా ఈ బల్ల గురించి చెపుతూ ఉంటె, కాకాసాహెబు మరొక బల్లను మీకు తెప్పిస్తాము అని అంటే, బాబా ఇలా అంటారు " మహాల్సాపతిని దిగువవిడిచి నేను పైన ఎలా పడుకుంటాను" అని అంటారు. మహాల్సాకు కూడా ఒక బల్ల తెప్పిద్దాము అంటే బాబా ఇలా అంటారు. మహల్సాపతి అక్కడ పడుకోలేడు, అంత ఎత్తున పడుకోవడం అంత సులభమైన పని కాదు. ఎవరైతే కండ్లు తెరిచి నిద్రించగలరో వారే అక్కడ పడుకోగలరు. నేను నిద్రపోవునప్పుడు నా గుండెలపై చేయి ఉంచి అక్కడినుంచి వచ్చు భగవన్నామ స్మరణ వినమంటే కునుకులు తీస్తూ ఉంటాడు. నా హృదయంపై వాని చేతి బరువుని గమనించి "భగత్" అని పిలిస్తే వెంటనే కళ్ళు తెరిచేవాడు. ఇలా మహాల్సాపతిని ఆట పట్టిస్తూ, బాబా మనకు ఆధ్యాత్మిక రహస్యాన్ని బోధించారు. కళ్ళు తెరిచి నిద్రించడం అంటే ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా ఆత్మ తత్వంలో ఉండడమే. ఈ అధ్యాయం ముగిస్తూ హేమద్పంత్ గారు బాబా మిక్కిలి ప్రేమతో చెప్పిన ఒక సత్యాన్ని చెప్పారు. "మంచి గాని చెడ్డ గాని, ఏది మనదో యది మన దగ్గర ఉన్నది. ఏది ఇతరులదో యది ఇతరుల దగ్గర ఉన్నది". బాబా ఇక్కడ మొత్తం కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా ఒక వాక్యంలో చెప్పారు. మనం చేసుకున్న కర్మలు యొక్క ఫలితం మనమే అనుభవించాలి. దానికి ఇంకొకరు కారణం అని మనం ఎప్పుడు భావిస్తామో అప్పుడు మనలో మనస్తాపం కలుగుతుంది. ఎవరి కర్మలు వారివే. ఇలా ఈ అధ్యాయం మనకు కర్మను, భక్తిని మరియు జ్ఞాన మార్గాలను నేర్పిస్తుంది. 


ఓం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు !

Sri Saisatcharita chapter -45


If our mind can not withdraw from worldly distractions and we do not have love towards God; what could be worse?  We can say that we have real devotion when all organs of action, senses and other human aspects of life converging as one and be able to love god. What is the use if this devotion does not exist and still we do sit in front of Sai? A real devotee should not tolerate the separation from Sai even for a minute. If we can not get rid of intense passion towards worldly objects, how can we increase our love towards God? Parents might love their children, progeny will expect your material belongings, and wife wants the stability in life and in her family. But no one helps you in the quest for salvation. Then who can help us? If we can not help ourselves no body will. We have to cut down the expectations from other people, and start showing self confidence. We need to examine ourselves and this is the only path to freedom. We are in bondage and we have to realize the intensity of this maze. Guru is the ultimate answer and by reciting Guru’s name we will achieve this goal. We will be able to see God in all creatures.

Navanatha’s devotion and Dixit's dejection
Once Dixit was reading about Navanatha’s devotion in Bhagavat Puran and expressed to the people there that their mindset and will power is hard to fathom. He also says, “How difficult is this Bhakti (Devotion path) marga and for ignorant people like us it is even more difficult. This could not be achieved even in multiple lives. We are all sinners and these Navanathas are special souls. He understood the depth of the knowledge that they were talking about. This is in 11th skanda of Bagavat. The great Manu had a son by name Priyavrata and he had Agneedrudu as son. Agneedra's son was Nabhi and he inturn had a son named Rushabha. Rushabha had 100 sons. Bharatha was the oldest son and
Bharata desa was named after him. His brothers were mostly into routine life except nine brothers who were filled with wisdom. They were self-realized. They saw everything in them and they were approached by King Nimi one day. He asked them to impart the knowledge so that his life can be changed. Then they started teaching him. Kavi was the first one who talked about surrender. Havi about qualities of devotee, Anthareeksha about maya, Prabudda about how to cross this maya, Pippalayana talked about parmaathma tatva, Avirhotra about karma, drumila about God's incarnations, Chamana about people who does not have devotion and what happens to them, Karabhaajana talked about how to worship God in various yugas. Like this all of them preached the entire Karma, bakthi, Jnana and teh entire upanishad wisdom. That's why Dixit was worried and he understood what he had to do. 

Syama came to his rescue and did not like melancholy expressed by Dixit. He reminds him that we have Baba in our lives and we do not need to be that despondent. He also reminds him that Baba asked Dixit to read Bhagavat and Bhavartha Ramayana and is this not enough? He is guiding you and reciting Guru’s name or God’s name is the way to go. So we do not have to worry. Dixit knows this truth but he is looking for perfection in his love towards Sai. He continued to be anxious and restless, the whole day, thinking and brooding over how to get the powerful Bhakti of the Nathas. Next morning, the following miracle took place. 

Anandrao Pakhade's vision
One gentleman, named Anandrao Pakhade came there in search of Madhavarao. The reading of the Bhagawat was then going on. Mr.Pakhade sat near Madhavarao and was whispering something to him. He was mentioning in low tone his dream-vision. As there was some interruption in the reading by this whispering, Kakasaheb stopped the reading, and asked Madhavarao what the matter was. The latter said - "Yesterday you expressed your doubt, now here is the explanation of it; hear Mr.Pakhade's vision which Baba gave him, explaining the characteristic of 'saving' devotion and showing that the devotion in the form of bow to, or worship of, Guru's feet is sufficient." All were anxious to hear the vision specially Kakasaheb. At their suggestion Mr.Pakhade began to relate the vision as follows.

I was standing in a deep sea in waist-deep water. There I saw Sai Baba all of a sudden. He was sitting on a beautiful throne studded with diamonds, with His Feet in water. I was most pleased and satisfied with the Form of Baba. The vision was so realistic that I never thought that it was a dream. Curiously enough Madhavarao was also standing there. He said to me feelingly - 'Anandrao, fall at Baba's Feet.' I rejoined - "I also wish to do so, but His Feet are in water, how can I place my head on them? I am helpless." Hearing this he said to Baba - "Oh Deva, take out Your Feet which are under water." Then Baba immediately took out His feet. I caught them without delay and bowed to them. On seeing this Baba blessed me saying - Go now, you will attain your welfare, there is no cause for fear and anxiety. He also added - "Give a silk-bordered dhotar to my Shama, you will profit, thereby."

In compliance with Baba's order, Mr.Pakhade brought the dhotar and requested Kakasaheb to hand it over to Madhavarao; but the latter refused to accept it, saying that unless Baba gave a hint or suggestion for acceptance, he would not accept it. Syama accepted this after Kakasaheb cast lots and Baba's wish came true. In this way both Anandrao and Madhavarao were satisfied and Kakasaheb's difficulty was solved.


This story exhorts us to give respect to the words of other saints, but at the same time asks us to have full faith in our Guru, and abide by His instructions: for he knows our welfare better than any other person. Carve out on your heart, the following words of Baba - "There are innumerable saints in this world, but 'Our father' (Guru) is the Father (Real Guru). Others might say many good things, but we should never forget our Guru's words. In short, love your Guru and surrender to Him completely. You have to prostrate before Him reverentially and then you will see that there is no sea of the mundane existence before you to cross, there is no darkness before the sun."


Wooden plank - Baba's Bed-Stead, and not Bhagat's
We learned about Baba's miracle bed in earlier chapters. He was sleeping on a plank which was tied to the ceiling and later Baba broke this plank into pieces and threw it away. Once Baba was describing the greatness or importance of this plank to Kakasaheb. Hearing this the latter said to Baba - "If You still love the wooden plank, I will again suspend or hang up one in the Masjid again for You to sleep at ease." Baba said that he won't sleep up there leaving Mhalsapathi on the ground. Then Kakasaheb wanted to provide another plank for Mhalsapathi also. Then Baba says it is not easy to sleep up there. Whoever has many good qualities, they can only sleep up there. He who can sleep 'with his eyes wide open' can effect that. When I go to sleep I ask often Mhalasapati to sit by My side, place his hand on My heart and watch the 'chanting of the Lord's name' there, and if he finds Me sleepy, wake Me up. He can't do even this. He himself gets drowsy and begins to nod his head. When I feel his hand heavy as a stone on My heart and cry out - 'Oh Bhagat', he moves and opens his eyes. How can he, who can't sit and sleep well on the ground and whose asana (posture) is not steady and who is a slave to sleep, sleep high up on a plank? Like this Baba was teasing Mhalsapathi but at the same time he was teaching us the ultimate truth of human goal. Sleeping eyes wide open means living in this world without getting attached to the objects of this world. 


This chapter was concluded with these words of Baba. "What (whether good or bad) is ours, is with us, and what is another's is with him." Here Baba made the whole karma theory in to a simple sentence. We all have to remember that we are responsible for our own actions and we blame other people for our miseries, we suffer more. Understanding this concept is the first step in the path of spirituality.



Om SriSainatharpanamasthu!



Wednesday, July 11, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయాలు - 43 & 44



బాబా శరీరాన్ని వదిలే ముందు కొన్ని సూచనలు ఇచ్చారు. మనం ఇంతకూ ముందు అధ్యాయంలో విజయదశమి రోజున బాబా మహాసమాధి చెందారు అని చెప్పుకున్నాము. మహాసమాధికి కొన్ని రోజుల ముందు వజే అనే ఆయన చేత బాబా రామ విజయం అనే గ్రంధాన్ని చదివించుకున్నారు. మొట్టమొదట వజే ఏడు రోజుల్లో పారాయణం పూర్తి చేస్తారు. రెండో సారి రాత్రిపగలు చదివి రెండవ పారాయణం పూర్తి చేస్తారు. మరల బాబా మూడో సారి చదవమంటారు. తాను మూడు రోజులు చదివి అలసిపోతాడు. అప్పుడు బాబా అతనికి సెలవిచ్చి పంపుతారు. ఎవరైనా మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారి వారి మత గ్రంధాలు చదవడం ఆనవాయితి. అలానే శుక బ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు ఏడు రోజులలో భాగవతం చెప్పి ఆయనను అనుగ్రహించారు. బాబా పరమాత్మ అయినా సంప్రదాయాన్ని అనుసరించి రామవిజయ పారాయణ చేయించారు.
  
బాబా చివరిక్షణం వరకు భక్తులకు సలహాలు ఇస్తూ ధైర్యం చెప్పారు. రెండు మూడు రోజుల ముందు భిక్షకు వెళ్లడం మానేశారు. కాకాసాహెబు దీక్షిత్ మరియు శ్రీమాన్ బూటీ గారు ద్వారకామాయిలోనే భోజనం చేసేవారు. అక్టోబర్ 15 1918 రోజున వారిని బాబా వాడాకు వెళ్లి భోజనం చేయమని ఆజ్ఞాపిస్తారు. అక్కడ ఇంకా లక్ష్మి బాయి, భాగోజి షిండే, భయ్యాజీ, బాలా షిమ్పే మరియు నానాసాహెబ్ నిమోన్కర్ ఉంటారు. శ్యామా మెట్లమీద కూర్చొని ఉంటారు. లక్ష్మి బాయికి తొమ్మిది నాణాలు ఇచ్చిన తరువాత బాబా ఇలా అంటారు " మసీదులో తనకు బాగాలేదని, తనను రాతితో కట్టిన బూటీ మేడలోకి తీసుకుపోయిన బాగుండునని చెప్పారు. ఇలా అంటూ భయ్యాజీ మీదకు ఒరిగి ప్రాణములను విడుస్తారు. భాగోజి ఈ విషయం నిమోన్కర్కు చెప్పగా, ఆయన బాబా నోటిలో కొంచెం నీరు పోస్తే అది కాస్తా బయటకు కారిపోతుంది. అప్పుడు ఆయన దేవా! అనగా బాబా మెల్లగా "ఆ" అంటారు. ఇక తరువాత తమ భౌతిక శరీరం వదిలివేస్తారు. 

షిర్డీ అంతా బాబా మహాసమాధి చెందిన వార్త పాకి అందరు అక్కడకు వస్తారు. అందరిలో తరువాత కార్యక్రమం మీద, ఎలా సమాధి చేయాలి అనే అంశం మీద చర్చ జరిగింది. ముస్లిం భక్తులు బాబా శరీరాన్ని ఆరుబయట సమాధి చేసి గోరి కట్టాలి అని నిర్ణయించారు. కాని రామచంద్ర పాటిల్ మిగిలిన గ్రామస్థులందరితో కలిసి బాబా కోరిన విధంగా బూటీ వాడాలో ఉంచాలి అని తీర్మానించారు. ఈ రెండువాదనల ఎటు తేలక పొతే అందరిలో కలవరం మొదలయ్యింది. అప్పుడు రహాతానుండి సబ్ ఇన్స్పెక్టర్, కోపర్గావ్ నుండి మామల్తదార్ మరియు కొందరు అధికారులు వస్తారు. వారు ఎన్నిక జరగాలి అని నిశ్చయించితే ఎక్కువ ఓట్లు బాబా కోరిన దాన్నే బలపరుస్తాయి. అప్పుడు బూటీ వాడాలో ఎక్కడైతే మురళీధరుని ఉంచాలి అనుకున్నారో అదే స్థానంలో బాబా శరీరాన్ని ఉంచుతారు. ఇక్కడ నార్కే గారు ఒక్క  విషయం చెప్పారు. బాబా శరీరం 36 గంటల తరువాత కూడా ఏమి పాడవకుండా ఉంది. ఆయన కఫినీని చింపకుండా తీయగలిగారు. బాలాసాహెబ్ భాటే, ఉపాసినీ బాబా కలిసి జరగవలిసిన కార్యక్రమాలు దగ్గర ఉండి పూర్తి చేస్తారు. 

బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు బాబా ఎప్పుడు తన దగ్గరే ఉంచుకొని అపురూపంగా చూసుకునే ఇటకరాయి రెండు ముక్కలు అవుతుంది. మసీదును సుబ్రపరిచే ఒక కుర్రవాడు పొరపాటున ఆ ఇటకరాయిని శుభ్రం చేస్తూ క్రింద పడవేస్తాడు. అప్పుడు అది రెండు ముక్కలు అవుతుంది. బాబా వచ్చి ఈ విషయం తెలుసుకొని ఇలా అంటారు. ఇది ఇటుక కాదు. నా యదృష్టమే ముక్కలు అయిపోయినది. అది నా జీవితపు తోడూనీడ. దాని సహాయం వలననే నేను ఆత్మానుసంధానము చేసేవాడిని. ఈ రోజు అది నన్ను విడిచినది అని అంటారు. ఈ ఇటుకపై బాబాకు ఇంత ప్రేమా అని మనం అనుకోవచ్చు. కాని దీని విషయం బాబాకే తెలియాలి. వారు సుద్ద చైతన్యులు. వారికి ఈ అశాశ్వతమైన వాటి మీద మమకారం ఉండదు. ఈ ఇటుక గురు భక్తికి ప్రతీకగా కొందరు చెప్తారు.  జీవన్ముక్తులకు ఇలా ప్రాపంచిక పరంగా అందరిలాగా భౌతిక పరంగా ఆలంబన ఉండదు. కాని అందరిలాగా వారు ప్రవర్తించవచ్చు. 


బాబా మూడురోజుల సమాధి
సాయిబాబా శరీరాన్ని వదలడానికి ముప్పై రెండు సంవత్సరాలకు పూర్వమే వారి సమాధి అయిపోయి ఉండేది. కాని మహల్సాపతి యొక్క బుద్ధి చాతుర్యం వలన ఆ దురదృష్ట సంఘటన ఆగింది. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు బాబా ఆయాసంతో అస్వస్థులయ్యారు. శరీరధర్మాన్ని సహించటానికి ప్రాణాలను బ్రహ్మాండంలో చేర్చారు. మసీదులోని సభా మండపంలో ఒక మూలన ఉన్న స్థలాన్ని వ్రేలితో చూపించి అక్కడ నా సమాధి కోసం త్రవ్వి ఆ స్థలంలో నన్ను ఉంచండి. మహల్సాపతితో మూడురోజుల వరకూ నన్ను వదలకుండా జాగ్రత్తగా చూడు అని స్పష్టంగా చెప్పారు.

            "నా సమాధి పై రెండు జండాలు ఉంచండి" అని చెప్పుతూ బాబా తమ ప్రాణాలను సహస్రారంలో నిలిపారు. ఆకస్మాత్తుగా తల తిరిగి పడినట్లు  నిశ్చేష్టగా పడిపోతే వారు క్రింద పడకుండా మహల్సాపతి తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. రాత్రి పది గంటల సమయంలో ఆ విధంగా జరిగితే, అందరికి నోట మాట రాలేదు. బాబా
యొక్క శ్వాసకాని, నాడికాని ఆడటంలేదు. బాబా ప్రాణాలు వదిలివేసినట్లే అనిపించింది. జనులకు ఆ పరిస్థితి భయంకరంగా ఉంది. కాని సాయి మాత్రం సుఖంగా ఉన్నారు. మహల్సాపతి అతిజాగరుతతో అహర్నిశలూ సావధానంగా సాయిని జపిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నారు. సమాధిని  త్రవ్వడానికి సాయి స్వయంగా ఆజ్ఞాపించినా అలా చేయటానికి ఎవరికి ధ్యైర్యం చాలలేదు. బాబా సమాధి స్థితిలో ఉండటం చూసి, గ్రామ ప్రజలందరూ అక్కడ చేరి ఆశ్చర్యంగా చూడసాగారు.

            మహల్సాపతి మాత్రం బాబా తలను ఒడి నుంచి క్రిందకు దించలేదు. ప్రాణాలు పోయాయని తెలుసు కాని, ఒక్కసారిగా భక్తుల గుండెలు అవిసిపోతాయని "మూడు రోజులు ఉంచండి" అని బాబా లోకులను మభ్యపెట్టారు అని భక్తులు అనుకున్నారు. బాబా శ్వాస ఉచ్వాసలు ఆగిపోయాయి. వారి ఇంద్రియాలన్ని చలన రహితమయ్యాయి. ఏదీ కదిలే సూచన లేదు. శరీరంలోని వేడి కూడా మందగించింది. బాహ్య వ్యవహారాల స్పృహ అసలులేదు. వాక్కు ధృడ మౌనం వహించినట్లుంది. మరల ఎలా స్పృహకు వస్తారు అని అందరికి చింత పట్టుకుంది. రెండు రోజులు గడిచిపోయినా బాబాకు స్పృహరాలేదు, మౌల్విముల్లా ఫకీరులు వచ్చి ఇక మీదట ఏం చేయాలని ఆలోచించసాగారు. అప్పాకులకర్ణి, కాశీరాం వచ్చి బాగా ఆలోచించి, బాబా తన ధామానికి చేరుకున్నారు. కనుక వారి శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి అని నిశ్చయించారు. అయితే ఇంత తొందర పనికిరాదు. కొంతసేపు ఆగటం మంచిది. బాబా ఇతరుల వలె కాదు. వారిమాట తిరుగులేనిది అని కొందరు అన్నారు. వెంటనే మిగతా వారు శరీరం చల్లబడిపోయింది, ఇక ఎక్కడి నుండి చైతన్యం వస్తుంది? అంతా ఎంత తెలివిలేనివారు అని అన్నారు. వారిని సరియైన వేళలో సమాధి చేయడానికి వారు చూపించిన స్థలంలో త్రవ్వండి. భక్తులందరిని పిలవండి, అన్నీ సిద్ధపరచండి అని అలా చర్చించు కుంటూనే మూడు రోజులు గడిచిపోయాయి.

            తరువాత మూడు గంటల ప్రాంతంలో బాబాలో చైతన్యం కలిగింది. మెల్లమెల్లగా బాబాకు స్పృహ వచ్చింది. శరీరం కదిలింది. శ్వాస ఉచ్వాసలు మొదలయ్యాయి. పొట్టకూడా కదల సాగింది. బాబా వదనం ప్రసన్నంగా కనిపించింది. వారి కళ్ళు తెరుచుకున్నాయి. మహల్సాపతి బాబా ముఖాన్ని సంతోషంగా చూచాడు. సాయిబాబా కూడా తలను ఆడించారు. మౌల్వీలు ఫకీరుల ముఖాలు పాలిపోయాయి. భయంకరమైన సంఘటన తొలగిపోయింది. మౌల్వీ యొక్క బలవంతానికి మహల్సాపతి బాబా ఆజ్ఞను పాలించకుండా, తన నిర్ణయాన్ని ఏ కాస్త సడలించి ఉన్న కఠిన పరిస్థితి ఏర్పడేది. 1886 నుంచి 1918 వరకు బాబా నిరవధికంగా ఎంతో మంది భక్తులను సంరక్షించడం జరిగింది. 

తరువాత జోగ్ గారిని బాబా ఎలా అనుగ్రహించారో హేమద్పంత్ గారు చెప్పారు. మేఘా మరణం తరువాత  బాపుసాహెబ్ జోగ్ మసీదులోను మరియు చావడిలోనూ బాబా మహాసమాధి చెందేవరకు ఆరతులు ఇచ్చేవారు. ఆయన 1909 లో ఉద్యోగవిరమణ చేసి భార్యతో సహా వచ్చి బాబాకు సేవ చేసుకున్నారు. ఆయనకు పిల్లలు లేరు. ఆయనకు జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతం చదివి వచ్చిన వారందరికీ బోధించేవారు. ఇలా ఈనో సంవత్సరాలు బాబా సేవలో ఉన్నా తనకు ఇంకా తనకు శాశ్వత శాంతి కలగడం లేదు అని బాబా దగ్గర బాధ పడతాడు. అప్పుడు బాబా ఆయనను ఓదార్చి నీ పాపపుణ్యములు త్వరలోనే భస్మం అవుతాయి అని, త్వరలోనే సన్యాసం పుచ్చుకొని గమ్యం చేరుకుంటావని చెప్తారు. అలానే కొన్ని రోజులకి తన భార్యకూడా కాలం చేస్తుంది. అప్పుడు జోగ్ ధ్యానపరుడై, సాధన పరిణితి చెంది జీవితపరమావధిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. 

ఈ అధ్యాయంలో బాబా యొక్క మధుర వాక్కులను పొందుపరచడం జరిగింది. 
ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తు అంతయూ వానికి శూన్యము. నా కథలు తప్ప మరెమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేస్తూ ఉంటాడు. 

ఎవరైతే నాకు సమర్పించకుండా ఏమియు తినరో అట్టివారిపై నేను ఆధారపడి ఉంటాను. 

ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణగ్రస్తుడను. వారికి మోక్షమునిచ్చి వారి ఋణం తీర్చుకుందును. 

అలానే బాబా "నేను" అనగా ఎవ్వరో కూడా వివరించి చెప్పారు. నన్ను వెదకుటకు ఎక్కడకు పోనక్కరలేదు. నీ నామము ఆకారము విడిచినచో నీ లోనే కాక సర్వ జీవులలో నన్నే చూచెదవు. దీనిని అభ్యసించినచో సర్వవ్యాపకత్వము అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. అంతరాత్మ నీవేనని గ్రహించెదవు. 

ఇలా బాబా యొక్క అనుగ్రహ వాక్యాలతో హేమద్పంత్ గారు బాబా మహాసమాధికి సంబంధించిన అధ్యాయాలు పూర్తి చేశారు. 

ఓం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు!










Sri Saisatcharita Chapters - 43 & 44




Previous Preparation
Baba knew when he is going to leave his body so he asked Mr. Vaze to read Rama Vijaya to him. He read this for one week, then Baba asked him to read this again day and night. In the next three days he finished the parayana. Then third time Baba asked him to continue but Mr. Vaze was exhausted. Still he read for three more days. Baba let him go and kept to himself for the ultimate moments. Here Baba followed the general practice amongst the Hindus that when a man is about to die, some good religious scripture is read out to him with the object that his mind should be withdrawn from worldly things and fixed in matters spiritual, so that his future progress should be natural and easy. We all heard about Great Shuka brahma expounding Bhagavat purana to king Parikshit who was cursed by the son of a Brahmin Rishi and was about to die after a week.  Baba being an incarnation of God needed no such help, but just to set an example to the people, He followed this practice.


Baba let nobody know the exact time of His departure. Baba stopped going for bhiksha two or three days before his Mahasamadhi. He was conscious to the last and was advising the devotees not to lose heart. Kakasaheb Dixit and Booty were dining daily with Him in the Masjid. That day (15th October) after arati, Baba asked them to go to their residence for dining. Still a few, viz., Laxmibai Shinde, Bhagoji Shinde, Bayaji, Laxman Bala Shimpi and Nanasaheb Nimonkar remained there. Shama was sitting down on the steps. After giving Rs. 9/- to Laxmibai Shinde, Baba said that He did not feel well in the Masjid and that He should be taken to the Dagadi (stone) Wada of Booty, where He would be alright. Saying these last words, He leaned on Bayaji, he left his mortal coil. Bhagoji noticed that His breathing had stopped and he immediately told this to Nanasaheb Nimonkar who was sitting below. Nanasaheb brought some water and poured it in Baba's mouth. It came out. Then he cried out loudly 'Oh Deva.' Baba seemed just to open His eyes and say 'Ah' in a low tone. But it soon become evident that Baba had left His body for good.


Everyone in Shirdi came running to Dwarakamai as they heard the news. Then the big question arose on how to dispose Baba’s physical body? Muslims wanted this to happen in an open space with a tomb. Other people did not agree with this opinion as Baba asked to be taken to Booty wada. After 36 hours of conflict some officers came and everyone voted for this. More people voted to support Baba’s word that he should be in Booty wada. While all the arguments were going on, Baba appeared to Laxman Joshi and told him to continue with arathi. Then Bapusaheb Jog did the afternoon arathi. On Wednesday evening Baba's body was taken in procession and brought to the Wada and was interred there with due formalities in the garbha, i.e., the central portion reserved for Murlidhar. In fact Baba became the Murlidhar and the Wada became a temple and a holy shrine, where so many devotees went and are going now to find rest and peace. All the obsequies of Baba were duly performed by Balasaheb Bhate and Upasani, a great devotee of Baba.


Breaking of the Brick
Baba gave another indication also which occurred few days before Baba’s Mahsamadhi. Baba used to rest on a brick and used this as a pillow. One day, during Baba's absence, a boy who was sweeping the floor, took it up in his hand, and unfortunately it slipped from thence fell down broken into two pieces. When Baba came to know about this, He bemoaned its loss, crying - "It is not the brick but My fate that has been broken into pieces. It was My life-long companion, with it I always meditated on the Self, it was as dear to Me as My life, it has left Me to-day." Some may raise here a question - "Why should Baba express this sorrow for such an inanimate thing as a brick?" To this Hemadpant replies that saints incarnate in this world with the express mission of saving the poor helpless people, and when they embody themselves and mix and act with the people, they act like them, i.e., outwardly laugh, play and cry like all other people, but inwardly they are wide awake to their duties and mission.


Baba’s 72 hour Samadhi:
Sai Baba could have taken Mahasamadhi 32 years prior to real Mahasamadhi day in 1918. It was because of great bhakta Mhalsapati that situation was averted. On Margashirsh Purnima day (thirty-two years before the Mahasamadhi) Baba had an attack of asthma and he became very uneasy. In order to bear this bodily pain, Baba raised his ‘prana’ high up and went into samadhi. Baba told Mhalsapati as follows;


“For three days from now I will rise my ‘prana’ high up and go into samadhi. Do not wake me up”. Baba told them. “See that corner of the courtyard,” Baba said pointing his finger. “Dig there for my samadhi and place me there”. Then looking at Mhalsapati, he point blank said to him: “Do not neglect me for three days. Place two flags at that site as an indication”. Saying this, he raised his ‘prana’ high up. Suddenly he whirled around and became unconscious. Mhalsapati
placed him on his lap. Others lost hope. It was about 10 o’clock at night when this happened. Oh, everyone became still, thinking about the sudden turn of events. Mhalsapati remained alert day and night and took care of Sai. As there was no movement in the body, people started worrying and two days passed by. Then Moulvis and fakirs came and gave their opinion. Then everyone thought Baba had achieved his abode of peace and the body should be given eternal rest. Some said: “Wait a little longer. Such haste is not good. Baba was not like ordinary people. Baba’s words come true”. Others promptly replied: “How will the life spirit return to a body which is ice cold? How foolish all these are! Dig a grave at the place shown (by him). Call all the people. Perform the last rites on time. Make all the preparations.”


Thus, while the discussions to do or nor to do went on, the time period of three days was over. Then, early in the morning, at 3 o’clock, the life spirit was observed as returning. Very slowly his eyes opened, the body stirred and the limbs stretched, the breath re-commenced and the abdomen was seen to move. His face showed a cheerful expression, the eyes began to blink, the unconsciousness went and a state of awakening arose. It seemed as if he had been reminded of a body he had forgotten. The lost treasure had been found again and was freely available.


Mhalsapati supported Baba's body on his own knee, and when officers, including the village headman karnam, etc., held an inquest over the body, declared it dead, and wanted it to be buried. Mhalsapati with the help of others stoutly opposed their proposal and saved Baba from losing his body. Thus, he rendered a valuable service in 1886, after which Baba lived for 32 years to create this huge Sai movement that has covered this land. We cannot even imagine that situation but we know that Baba intended this kind of miracle.


Bapusaheb Jog's Sannyas
Hemadpant closes this chapter by talking about how Baba blessed Bapusaheb Jog. After his retirement from Govt. Service (He was a Supervisor in the P.W. Department) in 1909 A.D., he came and lived in Shirdi with his wife. He had no children. Both husband and wife loved Baba and spent all their time in worshipping and serving Baba. After Megha's death, Bapusaheb daily did the arati ceremony in the Masjid and Chavadi till Baba's maha-samadhi. He was also entrusted with the work of reading and explaining Jnaneshwari and Ekanathi Bhagawat in Sathe's Wada to the audience. After serving for many years, Jog asked Baba - "I have served you so long, my mind is not yet calm and composed, how is it that my contact with Saints has not improved me? When will You bless me?" - Hearing the Bhakta's prayer Baba replied - "In due time your bad actions (their fruit or result) will be destroyed, your merits and demerits will be reduced to ashes, and I shall consider you blessed, when you will renounce all attachments, conquer lust and palate, and getting rid of all impediments, serve God whole-heartedly and resort to the begging bowl (accept sannyas)." After some time, Baba's words came true. His wife predeceased him and as he had no other attachment, he became free and accepted sanyas before his death and realized the goal of his life.


Baba's Nectar-like words
At the end of this chapter Hemadpanth writes about Baba’s nectar like words. Baba said –


"He who loves me most, always sees Me. The whole world is desolate to him without me, he tells no stories but mine. He ceaselessly meditates upon me and always chants my name.


I feel indebted to him who surrenders himself completely to me and ever remembers me. I shall repay his debt by giving him salvation (self-realization).


I am dependent on him who thinks and hungers after me and who does not eat anything without first offering it to me.


He who thus comes to me, becomes one with me, just as a river gets to the sea and becomes merged (one) with it. So leaving out pride and egoism and with no trace of them, you should surrender yourself to me who am seated in your heart."


Who is this me?
Sai Baba expounded many a time Who this ME (or I) is. He said "You need not go far or anywhere in search of Me. Barring your name and form, there exists in you, as well as in all beings, a sense of Being or Consciousness of Existence. That is Myself. Knowing this, you see Me inside yourself, as well as in all beings. If you practise this, you will realize all-pervasiveness, and thus attain oneness with Me."


Such nectar, pure auspicious ambrosia always flowed from Baba's lips. He therefore, concludes - Those who lovingly sing Baba's fame and those who hear the same with devotion, both become one with Sai.


Om Sri Sadguru Sainatharpanamasthu!

Wednesday, July 4, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం -42



గురు కృపా యోగం కలిగితే భవభయ దుఃఖాలు తొలిగిపోతాయి. ముక్తి మార్గ ద్వారాలు తెరుచుకొని కష్టాలు సుఖాలుగా మారిపోతాయి. నిత్యం సద్గురు చరణాలను స్మరిస్తే విఘ్నాలను కలిగించే విఘ్నం తొలిగిపోతుంది. మరణానికి కూడా మరణం వచ్చి ప్రాపంచిక దుఃఖాలను మరిచిపోగలరు. అందరు తమ శ్రేయస్సు కొరకు సాయి సమర్ధుని చరిత్రను శ్రవణం చేస్తే శీఘ్రముగా అత్యంత పావనులవుతారు. ఈ అధ్యాయంలో హేమద్పంత్ గారు బాబా మహాసమాధి గురించి ప్రస్తావిస్తూ, రెండు సంవత్సరాల ముందు బాబా దీనికి సంబంధించిన ఆధారం ఎలా చెప్పారో అన్న విషయం చెప్పడం జరిగింది. అలానే లక్ష్మి బాయి గురించి చెప్పారు. 

బాబా యొక్క సహవాస సుఖాన్ని అర్థ శతాబ్దం కంటే ఎక్కువ కాలం అనుభవించి ఆనందించిన షిర్డీ ప్రజలు ధన్యులు. 1918 అక్టోబర్ 15, దక్షిణాయన ప్రధమ మాసంలో శుక్ల పక్షంలోని విజయదశమి రోజున బాబా శరీరాన్ని వదిలారు. ముసల్మానుల మొహరం నెలలోని తొమ్మిదవ తారీఖున కత్తల్ రాత్రి రోజున సుమారు మధ్యాన్నం రెండు గంటలప్పుడు బాబా నిర్వాణానికి సిద్ధమయ్యారు. బుద్ధుని బుద్ధ జయంతి రోజున సాయి యొక్క పుణ్య తిథి. పన్నెండున్నర గంటలు గడిచి, దశమి కాలం పూర్తిగా దాటిపోయి ఏకాదశి వచ్చింది. కనుక సాయి యొక్క నిర్వాణ కాలం ఏకాదశి. సూర్యోదయం నుండి తిథిని పాటిస్తే, ఆ రోజు తిధి దశమి. అందువల్ల సాయి నిర్వాణం విజయదశమిగా భావించి ఆ రోజు ఉత్సవం చేశారు. ఇదే విషయం గురించి బాబా 1916 విజయదశమి రోజున సూచించారు. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు ఉరుముతుండగా మెరుపులు మెరిసినట్లు బాబా జమదగ్ని స్వరూపాన్ని ప్రత్యక్షంగా ప్రకటం చేశారు. ఉన్నట్లుండి తల రుమాలును, కఫినీని లంగోటిని కూడా విప్పేసి ధునిలో వేశారు. అసలే ధునిలో అగ్ని ప్రజ్వలంగా ఉంది. తోడుగా అందులో ఆహుతిని వేసేసరికి, జ్వాలలు మరింతగా పైకి లేచి భక్తులను భక్తులను కలవర పెట్టాయి. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. బాబా మనసులో ఏముందో ఏం అర్ధ కాలేదు. సీమోల్లంఘన సమయాన వారి క్రోధ వృత్తి చాలా భీతిని కలిగించేలా ఉన్నది. అగ్ని తన తేజాన్ని వెదజల్లింది. బాబా అంతకంటే తేజోవంతంగా కనిపించారు. భక్తులు కళ్ళు మూసుకొని పోగా ముఖాలను తిప్పేసుకున్నారు. దిగంబరులైన బాబా పరుశురాముని వలె ఉగ్రంగా అయ్యారు. బాబా కళ్ళు కోపంతో ఎర్రగా మెరుస్తూ ఉన్నాయి. "నేను హిందువునా ముస్లింనా ఇప్పుడు నిర్ణయించుకోండిరా. ఇది బాగా నిర్థారించుకోండి. మీ సందేహాలను తొలిగించుకోండి" అని గట్టిగా కేకలు వేశారు. ఈ దృశ్యాన్ని చూసి అందరు వణికి పోయారు. అప్పుడు భాగోజి షిండే ధైర్యాన్ని పుంజుకొని బాబా సమీపానికి వెళ్లి వారికి లంగోటిని చుట్టాడు. బాబా ఇవాళ దసరా పండుగ, సీమోల్లంఘన రోజున ఇదంతా ఏమిటి? అంటాడు. అప్పుడు బాబా "ఇదే నా సీమోల్లంఘన" అని చెప్పి సట్కాతో టపా టపా మని కొట్టారు. ఆ రోజున చావడి ఉత్సవం ఎలా జరుగుతుందా అని అందరికి చింత. ఊరేగింపు తొమ్మిది గంటలకు జరగాలి పది అయినా బాబా శాంతించలేదు. 11 గంటలకు బాబా శాంతించి కొత్త లంగోటిని మరియు కఫినీని ధరించారు. అప్పుడు చావడి ఉత్సవం మొదలయ్యింది. ఆ విధంగా బాబా సీమోల్లంఘన మిషతో భవసాగర సీమోల్లంఘనానికి దసరాయె మంచి ముహూర్తమని అందరికి సూచించారు. తమ శరీరమనే సుద్ధవస్త్రాన్ని ఇదే దసరా రోజున యోగాగ్నికి సమర్పించారు.
  

బాబా రామచంద్ర పాటిల్ ద్వారా ఇంకొక సూచన కూడా ఇచ్చారు. పాటిల్ ఒక సారి బాగా జబ్బు పడి రకరకాల చికిత్సలు చేయించినా జబ్బు తగ్గదు. తాను మృత్యువాత పడక తప్పదు అనుకున్న పరిస్థితిలో ఒక అర్ధరాత్రి బాబా అతని తలవైపు ప్రకటం అయ్యారు. అప్పుడు పాటిల్ బాబా పాదాలు పట్టుకొని నిరాశతో "నాకు మరణం ఎప్పుడు వస్తుంది? నాకు నిశ్చయంగా చెప్పండి. నాకు జీవితం మీద అసహ్యం కలిగింది. మృత్యువు కష్టం అని అనిపించడం లేదు. చావు నన్ను ఎప్పుడు కలుసుకుంటుందా అని ఎదురు చూస్తున్నాను". అని అన్నాడు. బాబా అప్పుడు నీకు మరణగండం లేదు కాని రామచంద్ర తాత్యా గురించే నా ఆలోచన. తాత్యా రాబోయే విజయదశమి రోజున ముక్తిని

పొందుతాడు. ఈ విషయం అతనితో చెప్పవద్దు. ఇదే మనసులో పెట్టుకుంటాడు. చింతలో క్షీణించి పోతాడు. కేవలం రెండు సంవత్సరాలే మిగిలాయి, తాత్యాకు సమయం సమీపించింది. తట్టుకోలేక బాలా షింఫేకు ఈ విషయం చెప్పాడు. ఇద్దరు తాత్యా గురించి బాధపడసాగారు. ఈ లోపల అతని జబ్బు తగ్గి రోజులు గడిచి వారు అనుకున్న సమయం వచ్చేసింది. తాత్యాకు జబ్బు చేసింది. అక్కడ తాత్యా జ్వరంతో మంచం పడితే ఇక్కడ బాబా చలితో వణికి పోయారు. తాత్యాకు బాబాపై నమ్మకం. బాబా దర్శనానికి వెళ్లే ఓపికకూడా లేక మంచంమీదనే ఉండిపోయాడు. ఇక్కడ బాబా జబ్బు కూడా ఎక్కువ అవుతూఉంది. బాబా సూచించిన రోజు వచ్చింది. రామచంద్రకు బాలాకు భయం పట్టుకుంది. తాత్యా నాడి మెల్లగా తగ్గసాగింది. ఇక అందరు ఆశలు వదులుకున్నారు. కాని తాత్యాకు గండం తప్పింది. అదే విజయదశమి రోజు బాబా తన శరీరాన్ని వదిలివేశారు. తాత్యాకు ప్రాణదానం చేసి బాబా వెళ్లిపోయారు అని అందరు అనుకున్నారు. 

బాబా శరీరాన్ని వదిలిన తరువాత దాసగణుకు స్వప్నంలో కనిపించి ఇలా చెప్పారు " మసీదు కూలిపోయింది. షిర్డీలోని నూనె వ్యాపారులు నన్ను బాగా కష్టపెట్టారు. నేను ఇప్పుడు అక్కడినుండి వెళ్ళిపోతున్నాను. వెంటనే షిర్డీ వచ్చి నన్ను పూలతో కప్పు అని చెప్పారు. ఇంతలో షిరిడీనుంచి కూడా బాబా సమాధి చెందినట్లు వార్త వచ్చింది. ఆయన తన భక్త బృందంతో వచ్చి బాబాకు పూలు సమర్పించి, అఖండ నామఘోష చేశారు. తరువాత అన్న సంతర్పణ కూడా చేశారు. ధర్మాధర్మ బంధనాలు లేనివారికి, సకల బంధనాలు విడిపోయిన వారికి ప్రాణం పోవడం అనేది లేనివారికి నిర్యాణమెక్కడిది. బ్రహ్మైవ సన్ బ్రహ్మప్యేతి అన్నట్లు బ్రహ్మ వంటి బాబాకు రావటం పోవటం లేని సాయి మహారాజుకు మరణమెలా సంభవం?
 

బాబా శరీరం వదిలిన రోజు ఉదయం తొమ్మిది పది గంటల ప్రాంతంలో తమంతట తామే లేచి నిశ్చలంగా కూర్చున్నారు. ఇది చూసి అందరిలో ఆశ కలిగింది. బాబా అప్పుడు తన కఫినీ జేబులోనుంచి లక్ష్మి బాయికి తొమ్మిది రూపాయలు ఇచ్చారు. లక్ష్మి బాయి చాలా సుగుణవంతురాలు. బాబా ఎవరిని రాత్రివేళల ద్వారకామాయిలోకి రానిచ్చేవారు కాదు. భక్త మహల్సాపతి, దాదా కేల్కర్, తాత్యాలతో పాటుగా లక్ష్మి బాయి ఒక్క దానికి మాత్రమే ప్రవేశం ఉండేది. ఒక సారి బాబా ఆకలిగా ఉన్నదని ఆహరం తెమ్మని అడుగుతారు. ఆమె మిక్కిలి సంతోషంతో రొట్టెలు తెచ్చి బాబాకు సమర్పిస్తే, ఆ ఆహరం అక్కడ ఉన్న కుక్కకు పెడతారు. అది చూసి లక్ష్మి బాయి నొచ్చుకుంటే,
బాబా ఇలా చెప్తారు. ఎందుకు వృధాగా బాధపడతావు. కుక్క కడుపు నిండితే నా పొట్ట నిండినట్లే. ప్రాణులన్నింటి ఆకలి ఒక్కటే. ఈ కుక్క అడగలేదు అందుకే దానికోసం నేను అడిగాను. ఆకలితో ప్రాణం విలవిల లాడేవారికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే. అప్పటినుంచి లక్ష్మి ఈ సత్యాన్ని గ్రహించి వ్యవహరించేది. ప్రతిరోజూ బాబాకు రొట్టె ముక్కలు పాలలో వేసి తెచ్చేది. బాబా ఇది గ్రహించి మెలంగిలిన శేషం రాధాకృష్ణమాయికి పంపించేవారు. ఇలా ఆమె బాబాకు ఎన్నో సంవత్సరాలు సేవ చేసింది. బాబా ఆమెకు మొట్టమొదట 5 రూపాయలు తరువాత నాలుగు రూపాయలు ఇచ్చారు. బాబా చేసిన చివరి దానం ఇదే. ఇది నవవిధ భక్తికి గుర్తుగానా? లేక దుర్గానవరాత్రి అయిన తరువాత సీమోల్లంఘన రోజున ఇచ్చే దక్షిణా? లేక శ్రీమద్భాగవతంలో శ్రీ కృష్ణుడు ఉద్ధవునితో చెప్పిన శిష్యుల నవ లక్షణాలా? ఇలా బాబా ఇచ్చిన దక్షిణ గురించి ఎన్ని రకాలుగానైనా చెప్పుకోవచ్చు. శిష్యుడు గౌరవమర్యాదలను ఆశించనివాడు, ఏ మమకారము లేని గురుసేవాపరుడు, నిశ్చలమైన మనసు కలవాడు, పరమార్ధ జిజ్ఞాస పరుడుగా ఉండాలి. ఇదే సాయినాథుని ఉద్దేశ్యం. 

బాబా చివరి సమయంలో కాకాసాహెబు దీక్షిత్ను మరియు బూటీని వాడాకు భోజనం చేసిరమ్మని పంపించారు. వారికి ఇష్టం లేక పోయినా వాడాకు వెళ్లిన తరువాత వారికి బాబా శరీరం వదిలివేసిన కబురు చేరింది. ఆయుర్దాయ తైలం ముగిసిపోగానే ప్రాణ జ్యోతి మందగించి, బాబా శరీరం భయ్యాజీ అప్ప కోతే ఒడిలోకి ఒరిగింది. సాయి సమర్ధుని మనోగతం ఎవరికీ తెలియదు. 

మాయా శరీరం ధరించి సత్పురుషులు సృష్టిలోకి వస్తారు. వారి కార్యం పూర్తి కాగానే శరీరం విడిచి అవ్యక్తంలో కలిసిపోతారు. వారు తమ ఇచ్ఛానుసారం ఒక రూపం ధరించిన వారు జనన మరణాలకు అతీతంగా ఉంటారు. పరబ్రహ్మ వైభవం ఉన్నవారికి మరణమెలా సంభవం? సాయి పనులలో నిమగ్నం అయినట్లు కనిపించినా వారు ఎప్పుడు ఏ కర్మకు కర్త కాదు. 
  


ఓం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు!