బాబా శరీరాన్ని వదిలే
ముందు కొన్ని సూచనలు ఇచ్చారు. మనం ఇంతకూ ముందు అధ్యాయంలో విజయదశమి రోజున బాబా
మహాసమాధి చెందారు అని చెప్పుకున్నాము. మహాసమాధికి కొన్ని రోజుల ముందు వజే అనే ఆయన
చేత బాబా రామ విజయం అనే గ్రంధాన్ని చదివించుకున్నారు. మొట్టమొదట వజే ఏడు రోజుల్లో పారాయణం
పూర్తి చేస్తారు. రెండో సారి రాత్రిపగలు చదివి రెండవ పారాయణం పూర్తి చేస్తారు. మరల
బాబా మూడో సారి చదవమంటారు. తాను మూడు రోజులు చదివి అలసిపోతాడు. అప్పుడు బాబా
అతనికి సెలవిచ్చి పంపుతారు. ఎవరైనా మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారి వారి మత
గ్రంధాలు చదవడం ఆనవాయితి. అలానే శుక బ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు ఏడు రోజులలో
భాగవతం చెప్పి ఆయనను అనుగ్రహించారు. బాబా పరమాత్మ అయినా సంప్రదాయాన్ని అనుసరించి
రామవిజయ పారాయణ చేయించారు.
బాబా చివరిక్షణం వరకు
భక్తులకు సలహాలు ఇస్తూ ధైర్యం చెప్పారు. రెండు మూడు రోజుల ముందు భిక్షకు వెళ్లడం
మానేశారు. కాకాసాహెబు దీక్షిత్ మరియు శ్రీమాన్ బూటీ గారు ద్వారకామాయిలోనే భోజనం
చేసేవారు. అక్టోబర్ 15 1918 రోజున వారిని బాబా వాడాకు వెళ్లి భోజనం చేయమని
ఆజ్ఞాపిస్తారు. అక్కడ ఇంకా లక్ష్మి బాయి, భాగోజి షిండే, భయ్యాజీ, బాలా షిమ్పే
మరియు నానాసాహెబ్ నిమోన్కర్ ఉంటారు. శ్యామా మెట్లమీద కూర్చొని ఉంటారు. లక్ష్మి
బాయికి తొమ్మిది నాణాలు ఇచ్చిన తరువాత బాబా ఇలా అంటారు " మసీదులో తనకు
బాగాలేదని, తనను రాతితో కట్టిన బూటీ మేడలోకి తీసుకుపోయిన బాగుండునని చెప్పారు. ఇలా
అంటూ భయ్యాజీ మీదకు ఒరిగి ప్రాణములను విడుస్తారు. భాగోజి ఈ విషయం నిమోన్కర్కు
చెప్పగా, ఆయన బాబా నోటిలో కొంచెం నీరు పోస్తే అది కాస్తా బయటకు కారిపోతుంది.
అప్పుడు ఆయన దేవా! అనగా బాబా మెల్లగా "ఆ" అంటారు. ఇక తరువాత తమ భౌతిక
శరీరం వదిలివేస్తారు.
షిర్డీ అంతా బాబా
మహాసమాధి చెందిన వార్త పాకి అందరు అక్కడకు వస్తారు. అందరిలో తరువాత కార్యక్రమం
మీద, ఎలా సమాధి చేయాలి అనే అంశం మీద చర్చ జరిగింది. ముస్లిం భక్తులు బాబా
శరీరాన్ని ఆరుబయట సమాధి చేసి గోరి కట్టాలి అని నిర్ణయించారు. కాని రామచంద్ర పాటిల్
మిగిలిన గ్రామస్థులందరితో కలిసి బాబా కోరిన విధంగా బూటీ వాడాలో ఉంచాలి అని
తీర్మానించారు. ఈ రెండువాదనల ఎటు తేలక పొతే అందరిలో కలవరం మొదలయ్యింది. అప్పుడు
రహాతానుండి సబ్ ఇన్స్పెక్టర్, కోపర్గావ్ నుండి మామల్తదార్ మరియు కొందరు అధికారులు
వస్తారు. వారు ఎన్నిక జరగాలి అని నిశ్చయించితే ఎక్కువ ఓట్లు బాబా కోరిన దాన్నే
బలపరుస్తాయి. అప్పుడు బూటీ వాడాలో ఎక్కడైతే మురళీధరుని ఉంచాలి అనుకున్నారో అదే
స్థానంలో బాబా శరీరాన్ని ఉంచుతారు. ఇక్కడ నార్కే గారు ఒక్క విషయం చెప్పారు. బాబా శరీరం 36 గంటల తరువాత కూడా ఏమి పాడవకుండా
ఉంది. ఆయన కఫినీని చింపకుండా తీయగలిగారు. బాలాసాహెబ్ భాటే, ఉపాసినీ బాబా కలిసి
జరగవలిసిన కార్యక్రమాలు దగ్గర ఉండి పూర్తి చేస్తారు.
బాబా మహాసమాధికి కొన్ని
రోజుల ముందు బాబా ఎప్పుడు తన దగ్గరే ఉంచుకొని అపురూపంగా చూసుకునే ఇటకరాయి రెండు
ముక్కలు అవుతుంది. మసీదును సుబ్రపరిచే ఒక కుర్రవాడు పొరపాటున ఆ ఇటకరాయిని శుభ్రం
చేస్తూ క్రింద పడవేస్తాడు. అప్పుడు అది రెండు ముక్కలు అవుతుంది. బాబా వచ్చి ఈ
విషయం తెలుసుకొని ఇలా అంటారు. ఇది ఇటుక కాదు. నా యదృష్టమే ముక్కలు అయిపోయినది. అది
నా జీవితపు తోడూనీడ. దాని సహాయం వలననే నేను ఆత్మానుసంధానము చేసేవాడిని. ఈ రోజు అది
నన్ను విడిచినది అని అంటారు. ఈ ఇటుకపై బాబాకు ఇంత ప్రేమా అని మనం అనుకోవచ్చు. కాని
దీని విషయం బాబాకే తెలియాలి. వారు సుద్ద చైతన్యులు. వారికి ఈ అశాశ్వతమైన వాటి మీద
మమకారం ఉండదు. ఈ ఇటుక గురు భక్తికి ప్రతీకగా కొందరు చెప్తారు. జీవన్ముక్తులకు ఇలా ప్రాపంచిక పరంగా అందరిలాగా భౌతిక పరంగా ఆలంబన
ఉండదు. కాని అందరిలాగా వారు ప్రవర్తించవచ్చు.
బాబా మూడురోజుల సమాధి
సాయిబాబా
శరీరాన్ని వదలడానికి ముప్పై రెండు సంవత్సరాలకు పూర్వమే వారి సమాధి అయిపోయి ఉండేది. కాని మహల్సాపతి యొక్క బుద్ధి చాతుర్యం వలన ఆ దురదృష్ట
సంఘటన ఆగింది. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు బాబా ఆయాసంతో అస్వస్థులయ్యారు.
శరీరధర్మాన్ని సహించటానికి ప్రాణాలను బ్రహ్మాండంలో చేర్చారు. మసీదులోని సభా
మండపంలో ఒక మూలన ఉన్న స్థలాన్ని వ్రేలితో చూపించి అక్కడ నా సమాధి కోసం త్రవ్వి ఆ
స్థలంలో నన్ను ఉంచండి. మహల్సాపతితో మూడురోజుల వరకూ నన్ను వదలకుండా జాగ్రత్తగా చూడు
అని స్పష్టంగా చెప్పారు.
"నా సమాధి పై రెండు జండాలు ఉంచండి" అని చెప్పుతూ బాబా
తమ ప్రాణాలను సహస్రారంలో నిలిపారు. ఆకస్మాత్తుగా తల తిరిగి పడినట్లు నిశ్చేష్టగా పడిపోతే వారు క్రింద పడకుండా మహల్సాపతి తన ఒడిలో
పడుకోబెట్టుకున్నాడు. రాత్రి పది గంటల సమయంలో ఆ విధంగా జరిగితే, అందరికి నోట మాట
రాలేదు. బాబా
యొక్క శ్వాసకాని, నాడికాని ఆడటంలేదు. బాబా ప్రాణాలు వదిలివేసినట్లే అనిపించింది. జనులకు ఆ పరిస్థితి భయంకరంగా ఉంది. కాని సాయి మాత్రం సుఖంగా ఉన్నారు. మహల్సాపతి అతిజాగరుతతో అహర్నిశలూ సావధానంగా సాయిని జపిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నారు. సమాధిని త్రవ్వడానికి సాయి స్వయంగా ఆజ్ఞాపించినా అలా చేయటానికి ఎవరికి ధ్యైర్యం చాలలేదు. బాబా సమాధి స్థితిలో ఉండటం చూసి, గ్రామ ప్రజలందరూ అక్కడ చేరి ఆశ్చర్యంగా చూడసాగారు.
యొక్క శ్వాసకాని, నాడికాని ఆడటంలేదు. బాబా ప్రాణాలు వదిలివేసినట్లే అనిపించింది. జనులకు ఆ పరిస్థితి భయంకరంగా ఉంది. కాని సాయి మాత్రం సుఖంగా ఉన్నారు. మహల్సాపతి అతిజాగరుతతో అహర్నిశలూ సావధానంగా సాయిని జపిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నారు. సమాధిని త్రవ్వడానికి సాయి స్వయంగా ఆజ్ఞాపించినా అలా చేయటానికి ఎవరికి ధ్యైర్యం చాలలేదు. బాబా సమాధి స్థితిలో ఉండటం చూసి, గ్రామ ప్రజలందరూ అక్కడ చేరి ఆశ్చర్యంగా చూడసాగారు.
మహల్సాపతి మాత్రం బాబా తలను ఒడి నుంచి క్రిందకు దించలేదు.
ప్రాణాలు పోయాయని తెలుసు కాని, ఒక్కసారిగా భక్తుల గుండెలు అవిసిపోతాయని "మూడు
రోజులు ఉంచండి" అని బాబా లోకులను మభ్యపెట్టారు అని భక్తులు అనుకున్నారు. బాబా
శ్వాస ఉచ్వాసలు ఆగిపోయాయి. వారి
ఇంద్రియాలన్ని చలన రహితమయ్యాయి. ఏదీ కదిలే సూచన లేదు. శరీరంలోని వేడి కూడా
మందగించింది. బాహ్య వ్యవహారాల స్పృహ అసలులేదు. వాక్కు ధృడ మౌనం వహించినట్లుంది.
మరల ఎలా స్పృహకు వస్తారు అని అందరికి చింత పట్టుకుంది. రెండు రోజులు గడిచిపోయినా బాబాకు స్పృహరాలేదు, మౌల్విముల్లా
ఫకీరులు వచ్చి ఇక మీదట ఏం చేయాలని ఆలోచించసాగారు. అప్పాకులకర్ణి, కాశీరాం వచ్చి
బాగా ఆలోచించి, బాబా తన ధామానికి చేరుకున్నారు. కనుక వారి శరీరానికి విశ్రాంతి
ఇవ్వాలి అని నిశ్చయించారు. అయితే ఇంత తొందర
పనికిరాదు. కొంతసేపు ఆగటం మంచిది. బాబా ఇతరుల వలె కాదు. వారిమాట తిరుగులేనిది అని
కొందరు అన్నారు. వెంటనే మిగతా వారు శరీరం చల్లబడిపోయింది, ఇక ఎక్కడి నుండి చైతన్యం
వస్తుంది? అంతా ఎంత తెలివిలేనివారు అని అన్నారు. వారిని సరియైన వేళలో సమాధి
చేయడానికి వారు చూపించిన స్థలంలో త్రవ్వండి. భక్తులందరిని పిలవండి, అన్నీ
సిద్ధపరచండి అని అలా చర్చించు కుంటూనే మూడు రోజులు గడిచిపోయాయి.
తరువాత మూడు గంటల ప్రాంతంలో బాబాలో చైతన్యం కలిగింది.
మెల్లమెల్లగా బాబాకు స్పృహ వచ్చింది. శరీరం కదిలింది. శ్వాస ఉచ్వాసలు మొదలయ్యాయి. పొట్టకూడా కదల సాగింది. బాబా వదనం ప్రసన్నంగా
కనిపించింది. వారి కళ్ళు తెరుచుకున్నాయి. మహల్సాపతి బాబా ముఖాన్ని సంతోషంగా
చూచాడు. సాయిబాబా కూడా తలను ఆడించారు. మౌల్వీలు ఫకీరుల ముఖాలు పాలిపోయాయి. భయంకరమైన సంఘటన తొలగిపోయింది.
మౌల్వీ యొక్క బలవంతానికి మహల్సాపతి బాబా ఆజ్ఞను పాలించకుండా, తన నిర్ణయాన్ని ఏ
కాస్త సడలించి ఉన్న కఠిన పరిస్థితి ఏర్పడేది. 1886 నుంచి 1918 వరకు బాబా
నిరవధికంగా ఎంతో మంది భక్తులను సంరక్షించడం జరిగింది.
తరువాత జోగ్ గారిని బాబా
ఎలా అనుగ్రహించారో హేమద్పంత్ గారు చెప్పారు. మేఘా మరణం తరువాత బాపుసాహెబ్ జోగ్ మసీదులోను మరియు చావడిలోనూ బాబా మహాసమాధి చెందేవరకు
ఆరతులు ఇచ్చేవారు. ఆయన 1909 లో ఉద్యోగవిరమణ చేసి భార్యతో సహా వచ్చి బాబాకు సేవ
చేసుకున్నారు. ఆయనకు పిల్లలు లేరు. ఆయనకు జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతం చదివి వచ్చిన
వారందరికీ బోధించేవారు. ఇలా ఈనో సంవత్సరాలు బాబా సేవలో ఉన్నా తనకు ఇంకా తనకు
శాశ్వత శాంతి కలగడం లేదు అని బాబా దగ్గర బాధ పడతాడు. అప్పుడు బాబా ఆయనను ఓదార్చి
నీ పాపపుణ్యములు త్వరలోనే భస్మం అవుతాయి అని, త్వరలోనే సన్యాసం పుచ్చుకొని గమ్యం
చేరుకుంటావని చెప్తారు. అలానే కొన్ని రోజులకి తన భార్యకూడా కాలం చేస్తుంది.
అప్పుడు జోగ్ ధ్యానపరుడై, సాధన పరిణితి చెంది జీవితపరమావధిని అనుభవపూర్వకంగా
తెలుసుకుంటాడు.
ఈ అధ్యాయంలో బాబా యొక్క
మధుర వాక్కులను పొందుపరచడం జరిగింది.
ఎవరైతే నన్ను ఎక్కువగా
ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తు అంతయూ వానికి
శూన్యము. నా కథలు తప్ప మరెమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేస్తూ ఉంటాడు.
ఎవరైతే నాకు
సమర్పించకుండా ఏమియు తినరో అట్టివారిపై నేను ఆధారపడి ఉంటాను.
ఎవరైతే సర్వస్య శరణాగతి
చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణగ్రస్తుడను. వారికి మోక్షమునిచ్చి వారి ఋణం
తీర్చుకుందును.
అలానే బాబా
"నేను" అనగా ఎవ్వరో కూడా వివరించి చెప్పారు. నన్ను వెదకుటకు ఎక్కడకు
పోనక్కరలేదు. నీ నామము ఆకారము విడిచినచో నీ లోనే కాక సర్వ జీవులలో నన్నే చూచెదవు.
దీనిని అభ్యసించినచో సర్వవ్యాపకత్వము అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. అంతరాత్మ నీవేనని గ్రహించెదవు.
ఇలా బాబా యొక్క అనుగ్రహ
వాక్యాలతో హేమద్పంత్ గారు బాబా మహాసమాధికి సంబంధించిన అధ్యాయాలు పూర్తి చేశారు.
ఓం శ్రీ సద్గురు
సాయినాథార్పణమస్తు!
No comments:
Post a Comment