In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, May 16, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం - 35


ఈ అధ్యాయంలో కూడా ఊది గురించి చెపుతూ ఒకరిద్దరు భక్తులు బాబాను ఎలా పరీక్షించారు అన్న విషయాలు చెప్పారు. ముందుగా మనం ఆధ్యాత్మిక విషయంలో ముందుకు నడవాలి అంటే, దీనిలో ఉన్న శాఖలు మనకు ఎలా అడ్డుపడతాయి అన్న సత్యాన్ని చెప్పారు. కొందరు ఒక దారి సరి అయినది అంటే మరొకరికి ఇంకో దారి నిజమనిపిస్తుంది. ఇలా ఏ దారి మంచిది అనే చర్చలోనే మనం ఆగిపోతాము. యోగీశ్వరులు మామూలు మనుషులే కదా వారికి ఎందుకు నమస్కరించాలి అని కొందరి వాదన. ఇలా ఎన్నో వాదనల మధ్య మనం నలిగిపోతాము. బాబా అందుకే శ్రద్ధ సభూరి అనే రెండు సాధనలు చెప్పారు. ఏ మార్గంలో నువ్వు నడిచినా ఈ రెండు చాలా అవసరం. 

కాకా మహాజని స్నేహితుడు. 
కాకా మహాజని స్నేహితుడు నిరాకార సేవను నమ్మి విగ్రహారాధన ఇష్టపడే వాడు కాదు. కాని కాకాతో కలిసి వెళ్ళడానికి, ఊరికినే బాబాను కలిసేందుకు వస్తానని, ఆయనకు నమస్కరించను అనే షరతులతో వస్తాడు. ఇద్దరు బొంబాయి నుంచి బయలుదేరి షిర్డీకి వచ్చి ద్వారకామాయి మెట్లు ఎక్కబోతూ ఉంటే ఒక విచిత్ర కంఠ ధ్వనితో బాబా ఆహ్వానం పలుకుతారు. ఈ కంఠము తన తండ్రి మాటలాగా ఉందని ఆ స్నేహితుడు ఆశ్చర్యపోతాడు. వెంటనే అన్ని మరిచి లోపలికి వెళ్లి బాబా పాదాలకు నమస్కరిస్తాడు. కొంత సమయం తరువాత బాబా కాకాను దక్షిణ అడిగి తీసుకుంటారు. ఇలా రెండు సార్లు అడిగిన తరువాత ఈ స్నేహితుడు బాబా నన్ను దక్షిణ ఎందుకు అడగటం లేదు అని కాకాను అడుగుతాడు. అప్పుడు బాబా నీకు ఇవ్వడం ఇష్టం లేదు కదా అందుకే అడగలేదు. కాని ఇప్పుడు
ఇవ్వవచ్చు అని బాబా అంటారు. వెంటనే అతను కాకా వలె మొత్తం 17 రూపాయల దక్షిణ బాబాకు సమర్పిస్తాడు. అప్పుడు బాబా ఇలా అంటారు. " నీవు దానిని తీసివేయుము; మనకు మధ్య ఉన్న అడ్డును తీసివేయుము. అప్పుడు మనం ఒకరినిఒకరు ముఖాముఖి చూచుకొనగలము! అని చెపుతూ వారిని వెంటనే వెళ్ళమని ఆదేశిస్తారు. అప్పుడు బాగా వర్షము పడునేమో అన్న సందేహంతో వారు బయలుదేరి సురక్షితంగా ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వెళ్లి తలుపు తీసేసరికి రెండు పిచ్చికలు చనిపోయి ఉంటాయి. ఇంకొక పిచ్చుక ఎగిరి బయటకు వెళ్లి పోతుంది. వీటిని రక్షించేందుకే బాబా తొందరగా వెళ్లామన్నారు అని ఆ స్నేహితుడు అర్ధం చేసుకుంటాడు. ఇలా ఆయనలో ఈ మార్పు తీసుకురావడం అత్యంత అవసరం. ఒక దారిలో మనం నడుస్తూ ఆ మార్గాన్ని నమ్మటం చాలా అవసరం. కాని మనం నమ్మిన సత్యాన్ని మిగిలిన వాటిలో చూడకపోతే మనం మన మార్గంలో ముందుకు వెళ్లలేము. 

ఇలానే ఒక సారి కాకా మహాజని యజమానికూడా బాబాను పరీక్షించడం జరిగింది. ఠక్కర్ అనే ఆయనకు ఒక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజరుగా పనిచేస్తూ ఉంటాడు. కాకా ఎప్పుడు బాబా దగ్గరకు వెళ్లి కొన్ని రోజులు ఉండి వస్తాడు అన్న సంగతి ఆయనకు తెలుసు. ఒక సారి బాబాను పరీక్షించాలి అన్న ఆసక్తితో తనతో ఇంకో వ్యక్తిని తీసుకొని కాకాతో సహా షిర్డీకి వస్తారు. దారిలో కాకా బాబాకు అర్పించేందుకు ద్రాక్ష పండ్లు కొంటాడు. వాటికి గింజలు  ఉంటాయి. అక్కడ తర్కడ్ ఉంటె ఏమైనా మహిమలు చూసావా అని ఠక్కర్ అడుగుతాడు. లేదు బాబా దర్శనం కోసం వచ్చాను అని అతను చెప్తాడు. బాబా భక్తులు ఏది అనుకుంటే అది జరుగుతుంది అని తర్కడ్ చెప్తాడు. ఇంతలో బాబా ఆ ద్రాక్ష పండ్లు అందరికి పంచమంటారు. ఠక్కర్కు ద్రాక్ష కడగకుండా తినవద్దని తన డాక్టర్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఏమి చేయాలో తెలియక అలానే దాన్ని తిని గింజలను తన దగ్గరే ఉంచుకుంటాడు. అప్పుడు బాబా గొప్ప యోగి అయినచో నాకు గింజలు ఇష్టంలేదు అని తెలియదా! అని అనుకుంటాడు. అంతలో బాబా మరల ద్రాక్ష ఠక్కర్ కు ఇవ్వమంటె అతనికి మరల ఇస్తారు. ఈ సారి మొహమాట పడుతుంటే బాబా తినమని చెప్తారు. ఆశ్చర్యం ఈ సారి వాటిలో గింజలు ఉండవు. ఇలా బాబా తన మనసులో ఉన్న ఆలోచనను తెలుసుకొని తనకు కావాల్సిన విధంగా చేశారు. 

తరువాత శ్యామా ఠక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేస్తారు. బాబాకు నమస్కరించి వాడాకు వెళ్తారు.  మరల వచ్చినప్పుడు బాబా ఇలా అంటారు " ఒక చంచల మనిషి ఉండెను. అతనికి అన్ని ఉండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటం మీద వేసుకొని తిరుగుతూ మనసులో శాంతిని పోగొట్టుకుంటున్నాడు. ఒక్కోసారి అన్నింటిని వదిలివేస్తాడు. ఇలా ఉండేబదులు ఒక దానిమీద నిశ్చలంగా ఉండు" అని అంటారు. ఇది తన స్వభావమే అని ఠక్కర్ అర్ధం చేసుకుంటాడు. తరువాత కాకా కూడా నాతొ వస్తే బాగుండు అనుకుంటాడు. బాబా కాకాను కూడా తనతో వెళ్ళమని ఆదేశిస్తారు. కాకా దగ్గర బాబా 15 రూపాయల దక్షిణ తీసుకొని ఇలా చెప్తారు. " నేను ఒక రూపాయి దక్షిణ ఎవరివద్దనైనా పుచ్చుకుంటే దానికి పది రెట్లు తిరిగి ఇవ్వవలెను. నేను ఊరికే ఎవరిని అడగను. ఫకీరు ఎవరిని చూపునో వారినే అడిగెదను. పూర్వజన్మల బట్టి లేదా ఈ జన్మలో ఉన్నదాని బట్టి అడుగుతాను. దానము చేయువాడు ఇచ్చునది విత్తనాలు నాటడం వంటిది. ముందు ముందు గొప్ప పంటను ఇస్తుంది. గత జన్మలో నీవు ఇచ్చివుంటే కాని ఇప్పుడు నీవు అనుభవించలేవు. ఇచ్చినచో వైరాగ్యం పెరుగును. దీని వలన భక్తిజ్ఞానములు కలుగును అని బాబా సెలవిచ్చిరి. ఇది విని వెంటనే ఠక్కర్ కూడా 15 రూపాయల దక్షిణ బాబాకు సమర్పిస్తాడు. ఇలా బాబా అతనిలో నమ్మకాన్ని కలుగచేసి తనను సరి ఐన దారిలో నడిపించారు. 

ఒక సారి బాంద్రా నివాసి అయిన ఒక వ్యక్తి నిద్ర పట్టక మిక్కిలి బాధ పడుతూ ఉండే వాడు. నిద్రపోతే చనిపోయిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రముగా తిడుతూ ఉండే వాడు. చాలా రోజులు నిద్రలేక అతని ఆరోగ్యం పాడవుతుంది. ఒక స్నేహితుడు బాబా ఊది నీటిలోకలుపుకొని  తాగి పడుకో అని సలహా ఇస్తే తాను అలా చేసి కొంచెం ఊది తన తలగడ కింద ఉంచి నిద్రపోతాడు. ఇక ఆ రోజు తన తండ్రి కలలో కనిపించడు. సుఖంగా నిద్ర పోతాడు. తరువాత బాబా పటం ఒకటి ఉంచి రోజూ పూజిస్తూ ఉండేవాడు. 

బాలాజీ పాటిల్ నెవాస్కర్ బాబాకు మంచి భక్తుడు. బాబా నడిచే దారులన్నీ శుబ్రపరిచేవాడు. అతని తరువాత రాధాకృష్ణమాయి ఈ పని చేసేవారు అని మనం విన్నాము. ఆయన ప్రతి ఏడాది పండిన పంటను బాబాకు ఇచ్చి, బాబా తనకు ఎంత ఇస్తే అంత తీసుకొని జీవించేవాడు.ఒక సారి బాలాజీ సాంవత్సరీకం నాడు ఆయన కుటుంబం కొంతమంది బంధువులను భోజనాలకు పిలిచారు. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వస్తారు. అప్పుడు బాలాజీ భార్యకు ఏమి చేయాలో తెలియక ఆదుర్దా పడుతూ ఉంటె ఆమె అత్తగారు కొంచెం బాబా ఊది తీసుకొని వాటిలో వేసి వడ్డించమంటుంది. ఆ తరువాత అందరికి తృప్తిగా భోజనం సరిపోతుంది. 
ఇంకో సారి రఘు పాటిలన్న వ్యక్తి బాలాజీ నెవాస్కర్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఒక పాము వస్తే అందరు భయపడుతూ ఉంటె, బాలాజీ ఆ పామును బాబాగా తలిచి గిన్నెడు పాలు తీసుకొని దాని ముందు ఉంచుతాడు. తరువాత ఆ పాము అక్కడ కనిపించకుండా మాయం అవుతుంది. ఇలా బాబా బాలాజీ నెవాస్కరును అతని కుటుంబాన్ని దగ్గర ఉండి నడిపించారు. 

ఈ అధ్యాయంలో మనం బాబాను  నమ్మితే, ఆ నమ్మకాన్ని ఆయన ఎలా నిలబెడతారో, అలానే దగ్గర ఉండి మనలను సరి అయిన దారిలో ఎలా నడిపిస్తారో తెలుసుకున్నాము. అలానే వివిధమతాలు, వివిధ ఆచారాలు, మార్గాల గురించి వాగ్వివాదాలకు దిగకుండా మనం నమ్మిన మార్గంలో భగవంతుడ్ని చేరుకోవాలి. అన్నింటికి నమ్మకం ఓర్పు కావాలి. అదే బాబా మార్గం.  


ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!

Sri Saisatcharita Chapter - 35



 Sectarianism is the greatest obstacle on the path of spirituality. Those, who believe the God is without form, are heard saying that to believe the God is with the form is an illusion and that the Saints are only human beings. Why should we bow to them? we should not offer dakshina to them. This would be a mockery of devotion. some people who came to shirdi just wanted to see Baba but they did not want to bow to him. Whoever came to Shirdi to see Baba stayed on with him and never again turned his back, getting attached at Sai's feet. Where pride on account of sectarianism is discarded, there will be immense happiness. This is the essence of this chapter. 


Kaka Mahajani had pure devotion towards the saints. But his friend was a worshiper of God without form and was averse to idolatry. Out of curiosity he agreed to go to Shirdi with Kaka Mahajani on two conditions, viz., (1) that he would neither bow to Baba, (2) nor pay Him any Dakshina. Kaka agreed to these conditions and they both left Bombay on a Saturday night and reached Shirdi the next morning. As soon as they came to see Baba, he immediately
addresses Kaka's friend from a little distance in sweet words as follows, "Oh, you have come welcome". The tone that uttered these words exactly resembled the tone of the friend's father. It reminded him of his departed father and sent a thrill of joy through his body. What an enchanting power the tone had! Being surprised the friend said, "There is no doubt this is my father's voice". Then he at once up and, forgetting his resolution, placed his head upon Baba's Feet. Later Baba asked Dakshina from Kaka and he gave. Baba asks rupees 17 as dakshina from Kaka when they came back later. Then the friend asks Kaka why Baba was not asking him dakshina. Then Baba tells Kaka that your friend did not want to give dakshina but he can give now. Then the friend happily gave rupees 17 to Baba. Then told him to remove the difference between you and me. Baba also said "Pull down the oil-monger's wall between us, totally, so that the road is widened to enable us to meet each other". Then they were given permission to leave Shirdi. It was cloudy and everyone thought a storm will come. But Baba told them not to worry, so they encountered no problems in the travel. But when he goes home one sparrow which was caught inside flew out but other two were dead. He felt bad for them. 

Another experience of his is also worth listening to. He used to suffer from pain in the heel of one his feet. He had this for many months. After he returned from the Shirdi trip his pain was gone.


Once Kaka Mahajani was working as a manager at a firm owned by Mr. Thakkar a solicitor of Bombay. Thakkar knew that Kaka Mahajani frequently goes to Shirdi to visit Baba and out of curiosity he also wanted to go to Shirdi to test Baba. He took another person with him as Kaka may not be able to return with him if Baba does not give him permission. Kaka bought raisins to offer them to Baba. Thakkar met Tharkad in Shirdi and asked him why he came there and Tharkad replies that he came for Baba's darshan. Kaka prostrated himself before Baba and offered raisins. Then Baba wanted them to be distributed. Thakkar did not want to eat them without being washed. He had to eat them as they were given to him. He put them in his mouth and put the seeds in his pocket. He felt if Baba knows everything he should also understand that he does not like these raisins with seeds. Baba knows everything and offers the raisins again to Thakkar. Hesitantly he takes them and to his surprise this time he did not get any seeds in his raisins. He wanted to see miracles form Baba and he saw one there. Then Thakkar thought in his mind that Baba this time should offer the raisins to Kaka and Baba fulfills this wish also.     


Shama later introduced Mr. Thakkar as the master of Kaka, upon which Baba said, "How could he be his master? He has got a different Master altogether". Kaka appreciated this reply. Forgetting his resolve, Thakkar saluted Baba and returned to the Wada. After the noon-Arati was over, they all went to the Masjid for taking Baba's leave for their departure. Shama spoke for them. Baba then spoke as follows. "There was a fickle-minded gentleman. He had health and wealth and was free from both physical and mental afflictions, but he took on him needless anxieties and burdens and wandered hither and thither, thus losing his peace of mind. Sometimes he dropped the burdens and at other times carried them again. His mind knew no steadiness. Seeing his state, I took pity on him and said, "Now please keep your faith on any one place (point) you like, why roam like this? Stick quietly to one place. Thakkar at once came to know that, that was an exact description of himself. He wished that Kaka should also return with him but no one expected that Kaka would be allowed to leave Shirdi so soon. Baba read this thought also and permitted Kaka to return with his master. Thakkar got one more proof of Baba's capacity to read another's mind. Then Baba asked Kaka for Rs. 15/- as Dakshina and received it. Baba told Kaka that he has to return tenfold for what he takes as dakshina.  He does not take money from anyone unless it is necessary. The giving of Dakshina advances Vairagya (Non-attachment) and thereby Bhakti and Jnana. On hearing these words Mr. Thakkar himself gave Rs.15/- in Baba's hand, forgetting his resolve not to do so. He thought he did well in coming to Shirdi as all his doubts were solved and he learnt so much. Baba's skill in handling such cases was unique. Though He did all those things, he was totally non-attached to them. He felt no pleasure because He was worshipped and no pain because He was disregarded. He transcended the pairs of opposites, viz. pleasure and pain, etc. 

Insomnia CaseNext Heamdpanth talks about a strange case of Insomnia where a gentleman whne he tried to sleep, his departed father appeared to him in his dream, and abused and scolded him severely. This broke his sleep and made him restless the whole night. Every night this went on and the man did not know what to do. One day he consulted a devotee of Baba in this respect. He recommended the Udi as the only infallible remedy he knew. He gave him some Udi and asked him to apply a little of it to his forehead before going to bed and keep the Udi-packet under the pillow. He tried this remedy and found, to his great surprise and joy, that he got sound sleep and that there was no disturbance of any kind. He continued the remedy and always remembered Sai. Then he got a picture of Sai Baba which he hung on the wall near his pillow and started worshiping it daily and on Thursdays, offering garland, naivedya etc. Then he got on well and forgot altogether his past trouble.


Balaji Patil NewaskarThis man was a great devotee of Baba. He rendered most excellent and disinterested service. Every day he swept and kept clean all the passages and streets in Shirdi through which Baba passed in His daily routine. This work was, after him, equally well-done by another female devotee named Rahda-Krishna-Mai, and after her by Abdoola. When Balaji reaped his corn every year, he brought the whole quantity and presented it to Baba. He returned with what Baba gave him and maintained himself and his family with it. This course was followed by him for many years and after him by his son.


Power and Efficacy of Udi

Once it happened that at Balaji's death anniversary day, a certain number of guests were invited and the dinner was prepared for them. But at the dinner-time it was found that thrice the number of people invited had turned up. Mrs. Newaskar was in a fix. She thought that the food would not suffice for the people assembled and that if it fell short, the honor of the family would be at stake. Her mother-in-law comforted her by saying, "Don't be afraid, it is not ours, but Sai's food; cover every vessel with cloth, putting some Udi in it, and serve from the same without opening it : Sai will save us from ignominy." She did as she was advised and it was found to their surprise and joy that not only did the food suffice for all, but plenty of it remained after serving. "As one feels intently, so he realizes accordingly" was proved in this case.

Sai Appearing as Serpent
Once Raghu Patil of Shirdi went to Balaji Patil at Newase. That evening he found that a serpent entered the cowshed hissing. All the cattle were afraid and began to move. The immates of the house were frightened, but Balaji thought that it was Sai Who appreared in his house as a serpent. Without being afraid in the least he brought a cup of milk and placing it before the serpent said, "Baba, why do you miss and make noise? Do you want to frighten us? Take this cup of milk and drink it with a calm mind". Saying this, he sat close by unperturbed. The other members were frightened and did not know what to do. In a short time the serpent disappeared. Nobody knew where it went. It was not found though a search was made in the cowshed.

Balaji had two wives and some children. They sometimes went to Shirdi from Newase for taking Baba's darshana. Then Baba bought saris and other clothes which were given to them with His blessings.





Om SriSainatharpanamasthu!
  




Wednesday, May 9, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం -34



ఈ అధ్యాయంలో  కూడా ఊదీ మహిమ గురించిన సంఘటనలు చెప్పటం జరిగింది. నాసిక్ జిల్లాలో మాలెగావ్ అనే గ్రామంలో ఒక మంచిపేరున్న డాక్టర్ గారు ఉండే వారు. ఆయన మేనల్లుడు ఎముకలకు సంబంధించిన కురుపుతో బాధపడుతూ ఉంటాడు. డాక్టరుగారు తనకు తెలిసిన వైద్యం చేసి అలానే ఇతర వైద్యుల చేత కూడా ప్రయత్నం చేయించినా ఉపయోగం ఉండదు. ఆపరేషన్ చేసినా ఆ పుండు తగ్గదు. రోజు రోజుకి అతనికి నెప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ కుర్రవాడి తల్లితండ్రులు చివరికి దైవం వైపు తిరిగి రక్షించమని అడుగుతారు. దేవీ దేవతలు గాని, కులదేవత కాని ఎవరు కూడా సహాయపడలేదు. ఎవరో షిర్డీకి వెళ్లి సాయిని శరణు వేడమని చెపితే చివరికి షిర్డీకి చేరతారు. సాయిని శరణువేడి ఆ అబ్బాయిని రక్షించమని అడుగుతారు. అప్పుడు బాబా ఈ ద్వారకామాయికి వచ్చినవారిని ఈ తల్లి తప్పకుండా కాపాడుతుంది. మీకు చింత వద్దు. ఈ ఊది తీసుకువెళ్లి ఆ పుండుమీద వ్రాయండి. నాలుగునుంచి ఎనిమిది రోజులలో ఉపశమనం కలుగుతుంది. భగవంతుడి మీద నమ్మకం ఉంచండి. అలా అని బాబా ప్రేమతో తన చేతిని ఆ బాబు కాలిపై నిమిరి అతనిపై కృపాదృష్టిని ప్రసరింప చేశారు. అది కేవలం శరీర బాధ. మానసిక వ్యధ ఐనా లేక దైవయోగం వల్ల వచ్చిన బాధైనా సరే బాబా దర్శనంతో నిర్మూలనమై పోతుంది. సాయి బాబా వదనాన్ని చూస్తే చాలు, దుఃఖమంతా తక్షణం నశించిపోతుంది. వారి వచనామృతాన్ని సేవిస్తే రోగికి పరమ సుఖం కలుగుతుంది. వారు తరువాత నాలుగు రోజులు షిర్డిలో ఉండి, పిల్లవాడికి వ్యాధి తగ్గుముఖం పట్టగానే వారి ఊరు వెళ్లి డాక్టర్ గారికి పుండు తగ్గిపోయిన సంగతి చెప్తారు.    

డాక్టర్ గారు షిర్డీ వెళదామని అనుకోని ముంబైకు బయలుదేరగా ఎవరో బాబా గురించి అతని మనసులో అనుమానం రేపుతారు.అతను వెనక్కు వచ్చేస్తాడు. తరువాత మూడు రాత్రులు కలలో బాబా "ఇంకా నాపై అవిశ్వాసమా! అన్న మాటలు వినిపించసాగాయి. అప్పుడు షిర్డీకి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కాని ఒక రోగికి టైఫాయిడ్ వ్యాధి వచ్చి అతని పరిస్థితి గంభీరంగా ఉంటుంది. అతనికి జ్వరం తగ్గిపోతే బాబా దగ్గరకు వెళదామని అనుకుంటాడు. అప్పుడు ఆ కుర్రవాడికి జ్వరం తగ్గిపోతుంది. అప్పుడు షిర్డీకి వెళ్లి బాబాకు నమస్కరించుకుంటాడు. బాబా అతని మనసులోని అనుభవాలను దృఢపరిచి తమ సేవయందు అతనిని ధ్యానమగ్నుని చేశారు. అతనికి బాబా చరణాలయందు గురి కుదురుతుంది. 

డాక్టర్ పిళ్ళై
 
పిళ్ళై గారికి నారు కురుపు బాధతో వ్యాకుల పడ్డాడు. ఆయనకు ఏడు కురుపులు లేవగా చాలా దుఃఖం కలిగింది. బాబాపై అతనికి చాలా ప్రేమ. బాబా కూడా పిళ్ళైని ప్రేమతో భావు అని పిలిచే వారు. ఉదయం సాయంత్రం మసీద్ కటకటాల వద్ద భావు కూర్చొనే వాడు. బాబా అతనితో చాలా సమయం గడిపేవారు. నారుకురుపు బాధ భరించలేక మంచం పట్టాడు. ఇంత బాధలో కూడా సాయి నామస్మరణ చేస్తూఉంటాడు. ఈ బాధ సహించడానికి ఇంక నాకు శక్తి లేదు. నేనెన్నడూ దుష్కర్మలు చేయలేదే! నా తలపై ఈ పాపమెందుకు? బాబా! ఈ నారు కురుపు బాధ మరణప్రాయంగా ఉంది. ఇంకా చనిపోయి పదిజన్మలు ఎత్తైనా అనుభవిస్తా. ఈ జన్మలో జీవించింది చాలు, ఈ జీవితం నుండి నన్ను విముక్తిన్ని చేయండి. ఇదే మిమ్ములను వేడుకుంటున్నా అని కబురు పంపించాడు. ఆ కబురు తెచ్చిన దీక్షిత్తో బాబా ఇలా అంటారు. నువ్వు నిర్భయంగా ఉండు అని అతనితో చెప్పు. పదిజన్మలవరకు ఎందుకు? పది రోజులు అనుభవిస్తే చాలు. పరస్పరం కలిసి పంచుకొని అనుభవిద్దాము అని చెప్పు. స్వార్ధంగాని పరమార్ధం గాని ఇవ్వడానికి నేను ఉండగా అనర్ధమైన మరణాన్ని కోరుకుంటున్నావు, ఇదేనా నీ పురుషార్థం? అతనిని లేపి ఇక్కడకు తీసుకురండి అని బాబా చెప్పారు. అలానే పిళ్ళై గారిని మసీదుకు తీసుకువస్తారు. బాబా అతనిని చూసి తన వెనుకనున్న తలగడను ఇచ్చి కాళ్ళు బాగా చాపుకొని కూర్చోమని చెప్తారు. చేసుకున్న కర్మ అనుభవించకుండా ముగిసిపోదు. నానా కురుపుపైన పట్టీ వేసాడు అయినా నెప్పి ఏమి తగ్గలేదు అని పిళ్ళై అంటాడు. బాబా పట్టీ తీసేయ్ ఇప్పుడు కాకి వచ్చి పొడుస్తుంది. దానితో నీ కురుపు తగ్గిపోతుంది అని బాబా అంటారు. అప్పుడు అబ్దుల్ ప్రమిదలలో నూనె పోయడానికి పైకి వచ్చాడు. అక్కడ చాలామంది ఉండడం వల్ల అబ్దుల్ చూసుకోకుండా పిళ్ళై కాలిమీద తన కాలు వేస్తాడు. పిళ్ళై బాధను తట్టుకోలేక పెద్దగా అరుస్తాడు. నారు కురుపులు పగిలి చీము కారసాగింది. ఒక వైపు ఏడుస్తూ పాడసాగాడు. "ఓ దయామయా! నీ పేరు కరుణా మూర్తి. నా స్థితిని గని నన్ను కరుణించు. రెండు ప్రపంచాలకు మహారాజువు నువ్వే. నీ మహిమ ప్రపంచంలో వ్యాపించి ఉంది. ప్రపంచ వ్యవహారాలన్నీ ముగిసిపోయినా నీ మహిమ శాశ్వతంగా ఉంటుంది. నీవు ఎల్లప్పుడూ భక్తులకు సహాయకారివి అని పాడాడు. అప్పుడు పిళ్ళై కాకి ఎప్పుడు వచ్చి పొడుస్తుంది అని బాబాను అడుగుతాడు. ఇప్పుడే అది అబ్దుల్ రూపంలో వచ్చి కాలు తొక్కింది. వాడాకు వెళ్లి హాయిగా పడుకో అని పంపిస్తారు. పదవ రోజు ఉదయం సన్నని తీగలాంటి పురుగులు పండులోనుంచి బయటకు వస్తాయి. అప్పుడు బాధ పూర్తిగా తగ్గిపోయింది. ఇలా పిళ్ళై కష్టాన్ని తొలిగించి ఆయనను బాబా అనుగ్రహించారు. 

బాపాజీ భార్య ప్లేగ్ వ్యాధి
 
ఒక సారి శ్యామా తమ్ముడి భార్యను కూడా ఈ ఊది రక్షించింది. బాపాజీ శ్యామాకు తమ్ముడు. ఆయన సావుల్ విహార్ డాగారా ఉన్నప్పుడు, అతని భార్యకు తీవ్రమైన జ్వరం వస్తుంది. అలానే ఆమె తొడపై గడ్డలు వస్తాయి. అవి ప్లేగ్ వ్యాధి కారణంగా వచ్చినవని తెలిసి ఆందోళనతో షిర్డీ వచ్చి తన అన్న గారికి విన్నవించుకుంటాడు. ఇద్దరు కలిసి సాయి దగ్గరికి వెళ్తారు. అప్పుడు శ్యామా ఇలా బాబాను వేడుకుంటాడు. "జయ జయ సాయినాధా! అనాధలమైన మమ్ము అనుగ్రహించండి. ఇప్పుడు ఈ కష్టం ఎందుకు? లేని చింతపుట్టుకొచ్చింది. మిమ్ము కాక వెళ్లి ఎవరిని యాచించను? బాబా ఆ స్త్రీని ఆశీర్వదించి ఆమె బాధను నివారించండి. దుర్భరమైన ఈ జ్వరాన్ని నయం చేసి మీ మాటను నిలబెట్టుకోండి. అప్పుడు బాబా శ్యామాతో ఇలా అంటారు. " నీవు ఈ విభూది ఇచ్చి పంపు.అల్లా మాలిక్ మన తండ్రి. ఏ జ్వరమైనా ఎటువంటి గడ్డ అయినా దానంతట అదే తగ్గిపోతుంది. రేపు తెల్లవారగానే నువ్వు సావుల్ విహార్ వెళ్ళిరా. ఇప్పుడు వెళ్లాలని ఆరాటపడకు. ఇక్కడే నిశ్చింతగా ఉండు. విభూతిని రాసుకొని భక్తితో సేవిస్తే సరిపోతుంది అని చెప్తారు. బాపాజీ బాబా మాటలు విని భయపడతాడు. అతనికి నిరాశ కలుగుతుంది. మాధవరావుకు ఆకులు మూలికల వైద్యం తెలుసు. కాని శ్యామాకు బాబాపై గట్టి నమ్మకం. తమ్ముడికి దైర్యం చెప్పి పంపిస్తాడు. ఆ రాత్రి బాపాజీ విభూతిని కలిపి భార్యకు తాగించి ఆమె గడ్డలపై కొంచెం రాస్తాడు. ఆమె చక్కగా నిద్రపోయి పొద్దుటే లేచి తనపనులు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు శ్యామా వచ్చి చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె ఇచ్చిన టీ తాగి మరల వెంటనే బాబా దగ్గరకు వచ్చి బాబాకు నమస్కరిస్తాడు. బాబా తనను వెంటనే ఎందుకు రమ్మన్నారో ఇప్పుడు అర్ధం అయింది. అంతా బాబా కరుణే అని అందరు అర్ధం చేసుకుంటారు. శ్యామా బాబాతో ఇలా అంటారు. " దేవా! ఏమిటి నీ లీల. మనసులో ఆందోళన కలగచేస్తావు. కూర్చున్న చోట సుడిగుండాలు లేపుతావు. మరల శాంతింప చేసేది కూడా నీవే అని అన్నాడు. అందుకు బాబా ఇలా అంటారు. " కర్మ తంత్రం యొక్క గతి అతిగహనమైనది. దానిని గమనించు. నిజంగా నేను ఏమి చేయను, చేయించను. అనవసరంగా కర్త్రుత్వాన్ని నా తలపై వేస్తారు. విధివశాత్తు జరిగే కర్మలకు నేను సాక్షీ భూతుణ్ణి మాత్రమే. చేసే వాడు, చేయించేవాడు ఆ పరమాత్ముడు మాత్రమే.  నేను ఆ పరమాత్ముని స్మరించే వాడిని. ఆ దేవునికి దాసుణ్ణి అని బాబా సెలవిచ్చారు. 

బాబా విభూతి తాగిస్తే ఒక ఇరానీ అమ్మాయికి తీవ్రంగా వస్తున్న మూర్ఛ రోగం నయం అవుతుంది. అలానే హార్ధ్యా గ్రామంలో ఒక వృద్దుడికి మూత్రపిండాలలో రాళ్లు మూలానా తీవ్రమైన నెప్పి వచ్చేది. శస్త్ర చికిత్స చేస్తే కాని నెప్పి తగ్గదు అని చెప్పారు. చివరికి బాబా విభూతి తాగితే ఆ రాళ్లు కరిగి మూత్రంలో బయట పడితే నెప్పి తగ్గిపోతుంది. చివరిగా ఈ అధ్యాయంలో ముంబై పట్టణానికి చెందిన ఒక స్త్రీకి ప్రసవం కష్టం అయ్యి ఆమెను షిర్డీకి తీసుకువస్తారు. ఆమెకు బాబా విభూతి తాగిస్తే ప్రసవం సులభం అవుతుంది. కాని బిడ్డ లోపలే చనిపోవడం మూలాన వారు నిరాశ చెందుతారు. కాని ఆ స్త్రీ బతికినందుకు అందరు సంతోషిస్తారు. ఇలా ఈ విభూతి మహిమలు చెప్పలేని విధంగా ఎంతోమంది బాధలను నివారించడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనలో బాబా పట్ల శ్రద్ద ఉండాలి. ఆయన మీద నమ్మకం ఉండాలి. మనకు ఏది మంచిదో, మనం ఎంత అనుభవించాలో బాబాకు తెలుసు. ఆ కర్మను మన చేత అనుభవించేటట్లు చేసి మనలను గట్టు ఎక్కిస్తారు. మనలో ఉన్న నమ్మకమే మనలను రక్షిస్తుంది. బాబా ఎప్పుడు తన భక్తులను వెనువెంట ఉండి కాపాడుతూ ఉంటారు.
 

ఓం శ్రీ సాయినాథార్పణమస్తు ! 





Sri Saisatcharita Chapter 34






This chapter also talks about greatness of Udi like chapter 33. There was a doctor whose nephew was suffering from tubercular bone abscess. No medications were working. He tried everything possible and consulted all his doctor friends but of no use. The boy was experiencing excruciating pain and the parents turned towards God and finally they heard about Sai. The parents along with the boy decided to go to Shirdi and they had darshan of Baba. They prostrated in front of Sai and begged that he help this boy. Then Baba says ““Those who come and resort to this Masjid shall never suffer anything in this life. Now, be carefree. Take udi and apply it on the abscess. Within four to eight days, he will get relief. Have faith in God. This is not a Masjid but Dwaravati1. He who steps here will get health and happiness, within no time. You also will get this experience. It is impossible that whoever comes here is not relieved. He who climbs the steps of this Masjid will accomplish his objective. Know that”. Then Baba moved his hand on the leg and cast merciful glances at him. This was merely physical suffering. But even suffering which is destined or created by the mind is destroyed from its roots by the ‘darshan’. Just seeing Sree Sai’s face, all troubles cease then and there; and drinking the nectar of his words gives the greatest happiness to a sick person. Tehn family stayed there for 4 days and like Baba said he felt better. They left Shirdi and told the doctor what happened.




This this doctor thought about going to Shirdi but someone created doubts in his mind and he drops the idea of going to Shirdi. Then one night he hears a voice saying “you still have disbelief in me?” On hearing this voice repeatedly, the doctor was bewildered and decided to go to Shirdi. But he had a patient with a severe case of toxic fever and nothing was helping this patient. He ultimately decided that if the patient gets better he would leave next day. After he made that resolution, patient got better and fever came down. Then he goes to Shirdi and bowed to Baba with full faith. Baba also convinced him of his secret experience and made him firm devotee.




Dr. Pillai


Once Dr. Pillai was in excruciating pain because of guinea-worms and they had increased from one to seven. He was fed up of life. Baba used to call him affectionately Bhau. His place was special and he used to sit near railing in Dwarakamai. He was confined to bed due to pain and felt that he could not take it anymore. Then he sends a message to Baba through Dixit. “Baba! I can longer bear this pain on account of the guinea worms, which is similar to death. Instead let me die now. I shall undergo the suffering in my next life. I will happily take ten more births, in which I shall undergo the fruits of my karma’. But grant me the boon of ending this present life. I do not wish to undergo this pain. That is all that I ask for now”. Then Baba asks people to bring him to Shirdi and he does not have to take ten births for this, ten days is enough. So he was brought in there and Baba makes him sit in Masjid and tells him that a crow will come and peck at these worms. He was sitting there with lot of pain. The Masjid is crowded and Abdulla while cleaning the lamps and accidentally steps on Dr. Pillai’s leg and he starts crying out loudly with excruciating pain. The wound burst and worms began to ooze out. Pillai was restless. He was crying out loudly and at the same time praying to Baba with a song.




“O Karim! Have mercy on my pitiable state!


Thou art called Merciful and Kind!


Thou art Emperor of both the worlds!


The world is thy splendor.


This world is going to be destroyed.


But Your Grandeur will be eternal.


You are always the Savior of the Devotees”.




After 10 days the pain was gone and he realized that the crow was Abdul. Experiencing this miracle, Pillai was overwhelmed and tears of affection flowed from his eyes by this fine deed of Baba.




Bapaji’ wife


Bapaji is brother of Shyama. Once Bapaji’s wife developed severe bubos in her groin and at that time Bubonic plague was lethal. He was worried and comes to his brother in Shirdi. Then Syama goes to Baba “Hail, hail Sainath! Have mercy on us, the helpless ones. Now, what is this problem that has arisen, causing unnecessary anxiety! Who else can we implore besides you? Take away this girl’s agony and give your blessings. Then Baba tells him to not worry and asks him to send udi with Bapaji. He does not let him go with his brother that night. Next day when shyama goes to his brother’s place his sister-in-law is making tea. He was surprised to see her like that. Then Bapaji tells him that as soon as he gave udi mixed in water, she profusely sweats and went to sleep. Then when she woke up in the morning she is all better. Hearing this Shyama went straight to Baba and bowed to him. “O Deva, what is this sport? Sitting here, you raise turmoil in our minds. A storm is raised and later you alone calm it down”. Baba replied to him: “Observe that the ways of fate are difficult to understand. I do nothing nor make others do anything. Yet I am held responsible for all that happens. I am just a witness to the deeds that happen on account of fate. The Eternal Lord is the doer and the mover. He alone is the Compassionate One. I am neither God nor the Almighty. I am neither the Lord nor the Supreme Spirit. I only remember the Lord and remind people of the existence of the Supreme Lord. I am just a poor servant of Allah.


Next in this chapter it was mentioned how Baba’s udi cured Irani girl’s convulsions and how a gentleman from Harda got relief from a kidney stone. Baba also saved the life a pregnant lady with a difficult labor. Everyone was worried but the lady was saved. Baby died in the womb itself. That was the fate of the child. She would conceive again, later. She felt relieved of her fears and was in a happy state.   


Baba always says “He who abandons all pride, is ever grateful to Him, and places his entire burden on Him, will achieve his objective”.


OM Sri Sainatharpanamasthu!

Wednesday, May 2, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 33



బాబా దక్షిణగా తీసుకున్న దానిని ఎక్కువగా అందరికి పంచేవారు. కొంత పైకాన్ని ధునిలోకి కావాల్సిన కట్టెలను కొనేవారు. అందులోనుంచి వచ్చే బూడిదే ఆయన అనుగ్రహంతో అందరికి ఊదిగా పంచేవారు. మనకు ఊది గురించిన లీలలు తెలుసు. బాబా ఎందుకు ఊది ఇచ్చారు. ఈ విభూతి ప్రకృతి యొక్క నశ్వరతత్వాన్ని బోధిస్తుంది. ఈ సకల విశ్వం దానిలోని వస్తువులు బూడిదవంటి వని నిశ్చయంగా తెలుసుకోవాలి. ఈ శరీరం కూడా పంచభూతాల కాష్టం. శరీరంలో నుంచి జీవుడు వెళ్ళగానే కుప్పకూలుతుంది. ఇది బూడిద అని నిరూపిస్తుంది. మీది, నాది కూడా ఇదే పరిస్థితి. ఇది మీరెప్పుడూ తెలుసుకోవాలని ఊది ఇస్తాను అని బాబా చెప్తారు. ఇక్కడ విభూది యొక్క తత్వార్ధం వివేకంతో కూడిన పూర్ణ వైరాగ్యం. బాబా దక్షిణ తీసుకోవడానికి కూడా కారణం ఈ వైరాగ్యాన్ని మనకు నేర్పించేందుకే. బాబా చాలా ఉల్లాసంగా ఒక పాట పాడేవారు. "రమతే రామ ఆయోజి, ఆయోజి ఉదియాంకి గోనియా లాయోజి!" రాముడు తిరుగుతూ తిరుగుతూ వచ్చాడు, ఊది సంచులను పట్టుకుని వచ్చాడు. బాబాకు ఈ పాట అంటే ఎంతో ఇష్టం అయ్యుండాలి లేకపోతే అంత ఉల్లాసంగా ఎందుకు పాడేవారు. ఆ రామనామం ఇచ్చేటువంటి పరమానందం కంటే మోక్షం ఇంకెక్కడ దొరుకుతుంది. దక్షిణ ఇచ్చి ఊది తీసుకుంటే గాని అది అర్ధం కాదు. 

ఈ అధ్యాయంలో ఊదీమహిమ గురించి చెప్పడం జరిగింది. ఒక సారి నారాయణ మోతిరాం జాని అనే బాబా భక్తుడు తన స్నేహితుడికి తేలు కుడితే బాబా ఊదికోసం చూస్తాడు. కాని ఊది దొరకక అక్కడ బాబా పటం దగ్గర ఉన్న అగరువత్తుల బూడిద తీసుకొని బాబాను స్మరించుకొని ఆ ఊదీని తేలు కుట్టిన ప్రదేశంలో రాస్తాడు. అతనికి నెప్పితగ్గి ఉపశమనం కలుగుతుంది. అలానే ఇంకొక బాబా భక్తుడు తన కుమార్తె ప్లేగు వ్యాధిసోకి బాధపడుతూ ఉంటె నానా చాందోర్కర్ గారిని ఊది పంపమని కోరతాడు, కాని నానా ఆ సమయంలో ప్రయాణంలో ఉంటాడు. తన దగ్గర ఊదిలేక రోడ్డు మీద కొంచెం మట్టి చేతిలోకి తీసుకొని సాయి నామ జపం చేసి తన భార్య నుదిటిపై రాస్తాడు. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూసేను. అతడు ఇంటికి పోవుసరికి ఆతండ్రి తన కుమార్తెకు జబ్బు తగ్గేనని చెప్పెను. 


జామ్నెర్ చమత్కారం
నానా చందోర్కర్‌ని ఎలాగైతే బాబా దగ్గర ఉండి కాపాడారో అదే విధంగా తన కుటుంబాన్ని కూడా రక్షించారు. నానా ఒకసారి జాంనేరులో మామల్తాధారుగా పనిచేస్తున్నపుడు తన కూతురు మైనతాయి ప్రసవ వేదనతొ బాధపడుతూ ఉంది. ప్రసవం అవ్వటం కష్టమై ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. కాని నానా దగ్గర బాబా ఊది లేదు. నానాకు ఏమి చేయాలో అర్ధంకాక బాబాను తలచుకుంటాడు. అదే సమయంలో బాబా నానాకు ఊది పంపించాలని రామ్‌గీరు బువా అనే గోసావితో ఈ చమత్కారానికి శ్రీకారం చేస్తారు. అదే సమయంలో ఈ గోసావికి తన ఊరు అయినా ఖాండేశ్‌కు వెళ్ళాలన్న కోరిక కల్గుతుంది. ఆయన బాబా దగ్గర అనుమతి తీసుకునేందుకు ద్వారకామాయికి వస్తారు. అప్పుడు బాబా కొంత ఊది గోసావికి ఇచ్చి జాంనేరులో ఉన్న నానాకు అది అందజేసి తన ఊరికి వెళ్ళవలసినదిగా ఆదేశిస్తారు. ఆ ఊదితో పాటుగా అడ్కర్ గారు వ్రాసిన ఆరతి సాయిబాబా అన్న ఆరతిని శ్యామాతో ఒక కాగితం పై వ్రాయించి ఇస్తారు. అప్పుడు గోసావి బాబాతో బాబా నా దగ్గర రెండు రూపాయలు మాత్రమే ఉన్నాయి, నేను జాంనేరు ఎలా చేరుకోగలను? అని అడుగుతాడు. నువ్వు నిశ్చితంగా వెళ్ళు నీకు అన్ని సౌకర్యాలు  ఏర్పడతాయి అని బాబా చెప్తారు. ఆ గోసావి ఆ ఊది మరియు ఆరతి కాగితం తీసుకుని బయలుదేరుతాడు. జాంనేరు వెళ్ళాలి అంటే జలగాంలో దిగాలి. అక్కడ నుంచి జాంనేరుకు సరిగా ప్రయాణ సౌకర్యం లేదు. సరే జలగాంకు ఒక రూపాయి 14 అణాలతో టిక్కెట్టు కొన్నాడు. ఇక మిగిలింది 2 అణాలు మాత్రమే వీటితో జాంనేరు ఎలా వెళ్ళగలను? అని ఆలోచిస్తూ స్టేషన్‌లో టికెట్టు ఇచ్చి బయటపడగా దూరాన ఒక సిపాయిని చూశాడు. 

               అప్పటికే అతడు షిర్డి నుంచి వచ్చిన బాపూగిర్ ఎవరు? అని అడుగుతూ ఉన్నాడు. ఇలా ఇద్దరు కలుసుకున్నారు. ఆ సిపాయి నన్ను నానా పంపించారు అని చెప్పి బాపూగిర్‌ని ఆ టాంగాలో ఎక్కించుకుని జాంనేరు వైపు కదిలారు. ఆ సిపాయి చాలా చురుకైన వాడిలా కనిపించాడు. గడ్డం, మీసాలు, గిరజాలు ఉన్నాయి. టాంగా చాలా అందంగా ఉంది, గుర్రాలుకూడా దానికి తగినట్టుగా ఉన్నాయి. వారు సుమారు రాత్రి 11 గంటలకు బయలుదేరారు. తెల్లవారు జామున దారిలో ఒక కాలువ దగ్గర ఆగింది. గుర్రాలను నీరు తాగించేందుకు వదిలి
తినడానికి కావలసిన ఫలహారాన్ని తయారుచేశాడు ఆ సిపాయి. అతను చూడడానికి ముస్లింలా ఉన్నాడు అని గోసావి సంకోచిస్తుంటే అతను నేను రాజ్‌పూత్ వంశం వాడ్ని ఈ ఫలహారం కూడా నానా పంపించారు అని చెప్తాడు. ఇద్దరూ ఫలహారం తిని మరల ప్రయాణం సాగిస్తారు. బండి నానా కార్యాలయం దగ్గరకు రాగానే ఆగిపోయింది. రామ్‌గీర్‌కు చాలా సంతోషం వేసింది. ఏ కష్టం లేకుండా అక్కడకు చేరుకున్నాడు. గోసావి మూత్రవిసర్జనకు వెళ్ళి వచ్చే లోపల అక్కడ టాంగా లేదు, సిపాయిలేడు. సరే ఆరోజు నానా కార్యాలయంకు రాలేదని తెలుసుకుని ఇంటికి వెళ్ళి ఆ ఊది, ఆరతి నానాకు ఇస్తాడు. మైనతాయికి సుఖప్రసవం అవుతుంది. నానా కూడా బాబా దయకు ఆశ్చర్యపడ్తాడు. గోసావి నానాను ఆ టాంగా పంపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ సిపాయి మరల ఎక్కడకు వెళ్ళాడు అని అడుగుతాడు. నానా ఆశ్చర్యపడి నేను టాంగా పంపించలేదు మీరు వస్తున్నట్లు కూడా నాకు తెలియదు, అప్పుడు వారికి అర్ధం అవుతుంది ఇదంతా బాబాలీల అని.

నవయుగ తుకారాం అని పిలవబడే బాలబువ సుతార్ అనే ఆయన మొట్టమొదట సారిగా షిర్డీకి వెళ్తే బాబా ఇతను నాకు నాలుగు ఏళ్లగా తెలుసు అని చెప్తారు. బాలబువకు మొట్టమొదట అర్ధం కాదు కాని తరువాత ఆలోచిస్తే తను నాలుగేళ్ల క్రితం ఒక సారి బాబా పటానికి నమస్కరిస్తాడు. ఇలా బాబా తన పఠం తాను వేరు కాదు అనే సత్యాన్ని ఎన్నో సార్లు నిరూపిస్తారు. 

అప్పా సాహెబ్ కులకర్ణి రోజు బాబా పటానికి పూజ చేస్తూ ఉండేవాడు. బాబాను దర్శించాలి అనే తపనతో ఉండేవాడు. ఒకసారి తాను వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఫకీరు వాళ్ళింటికి వచ్చి దక్షిణ అడుగుతారు. అతని భార్య ఒక రూపాయి ఇస్తుంది. వచ్చిన వారు బాబా అనుకోని మీరు షిర్డీ సాయిబాబా గారా అని అడుగుతుంది. ఆయన నేను భగవంతుని సేవకుడను అని చెప్తారు. తరువాత ఊది ఇచ్చి దానిని పూజలో పఠం దగ్గర ఉంచమని చెప్తారు. తరువాత అప్పా వచ్చి బాబా వచ్చిన విషయం తెలుసుకొని ఒక్క రూపాయే ఇచ్చారా, 10 రూపాయలు ఇచ్చివుంటే బాగుండేది అనుకుంటాడు. బాబాను వెతకాలి అని ఏమితినకుండా బయటకు వెళ్లి వెతికితే బాబా ఎక్కడ కనిపించరు. ఇంటికి వచ్చి భోజనం చేసి తన స్నేహితుడితో కలిసి వ్యాహ్యాళికి వెళ్తాడు. అప్పుడు వారికి ఆ ఫకీర్ ఎదురుపడి దక్షిణ అడుగుతారు. అప్పా ఒక రూపాయి అతని చేతిలో ఉంచుతాడు. ఇంకా ఇవ్వమని అడిగితె రెండు రూపాయలు ఇస్తాడు. ఇంకా చేయి చాచితే తన స్నేహితుడు దగ్గర మూడు రూపాయలు తీసుకొని ఇస్తాడు. ఇంకా ఇవ్వమంటే తనతో ఇంటికి రమ్మని ప్రార్ధిస్తాడు. మరొక మూడు రూపాయలు ఇస్తే చాలదని అంటే తన దగ్గర పది నోటు ఉందని ఇస్తాడు. ఫకీర్ ఆ పది నోటు తీసుకొని తొమ్మిది రూపాయలు వెనకకు ఇచ్చి వెళ్ళిపోతారు. ఇలా అప్పా ఇవ్వాలి అనుకున్న పదిరూపాయలు బాబా తీసుకున్నారు అని అందరు తరువాత గ్రహిస్తారు. 

 హరిభావ్ కర్ణిక్ అనే అతను 1917 లో గురుపూర్ణిమ నాడు షిర్డీ వచ్చి బాబాను దర్శించి తగిన లాంఛనాలతో పూజిస్తాడు. బాబా ఆశీర్వాదం, ఊదితో సహా సెలవ తీసుకొని ద్వారకామాయి మెట్లు దిగుతాడు. బాబాకు రూపాయి దక్షిణ ఇస్తే బాగుండేది అనుకుంటూ మరల వెనుకకు తిరగకూడదు అని అందరు చెప్తే నిరుత్సాహంతో అక్కడనుంచి వెళ్తాడు. తరువాత నాసిక్లో కాలారాం మందిరంలో దేవుని దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే నరసింగ మహారాజ్ అనే ఆయన హరిభావ్ను రూపాయి దక్షిణ అడుగుతారు. అతను సంతోషంగా దక్షిణ ఇచ్చి బాబాకు నమస్కరిస్తాడు. యోగీశ్వరులందరు ఒక్కటే అని, సంతు సాధువులందరు తన రూపమే అని భగవానుడు చెప్పిన సత్యాన్ని బాబా ఇక్కడ మనకు చూపించారు. 

ఈ అధ్యాయంలో ఎన్నో విషయాలను బాబా మనకు నేర్పించారు.  బాబా మైనతాయిని కేవలం తన సంకల్పంచేత మాత్రమే కాపాడవచ్చు కాని ఈ ఊది, గోసావి, టాంగా సిపాయి మొదలగు అంశాల నుంచి మనకు ఏం నేర్పించాలని అనుకున్నారు? ఇక్కడ బాబా "ఆరతి సాయిబాబా" అన్న ఆరతిని కూడా పంపించారు. బాబా మనకు ఏమి చెప్పాలనుకున్నారో బాబానే మనకు అర్ధం అయ్యేట్లు చెప్పాలి. రామ్‌గిరి బువా దగ్గర రెండు రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇవే శ్రద్ద, సబూరి. అలానే ఆయన జలగాంకు టిక్కెట్టు తీసుకున్న తర్వాత ఆయన దగ్గర మిగిలినది రెండు అణాలు. ఈ శ్రద్ధ, సబూరినే ఆయనకు జలగాం స్టేషన్‌లో దారి చూపించింది. మనము బాబాను పూర్తిగా నమ్మినప్పుడు ఆయన మనలను తప్పక రక్షిస్తారు.

               బాబా ఇచ్చిన ఆరతి, సాయం ఆరతిగా మనం పాడుకున్నాము. ఇదే సంధ్యా ఆరతి. అలానే గోసావి జలగాం చేరిన సమయం 11 గంటలు (రాత్రి).  సంధ్య అంటే రెండింటి మధ్యలో ఉండేది. మనం జీవించడానికి, మరణానికి ఉన్న సంధ్య కూడా అలాంటిదే. ఆ సంధ్య సమీపించే లోపలే మనం మేలుకొని భగవంతుడ్ని చేరుకునేందుకు ప్రయత్నించాలి. ఆంగ్లంలో 11th hour అంటే ఇక ఏమి దిక్కు తోచని మరియు చివరి సమయం. ఆ 11 గంటల సమయంలోనే బాబా రామ్‌గిరి బువాకు దారి చూపించారు.

               నానా నమ్మకాన్ని దృడపరచి మైనతాయిని రక్షించారు. ఆమెకు సుఖ ప్రసవం జరిగేలా చూశారు. ఇక్కడ నానాకు ఆరతి సాయిబాబా అనే ఆరతిని ఇచ్చారు. నానాకు కూడా వైరాగ్యం  నేర్పించాల్సిన సమయం వచ్చింది. మైనతాయికి పుట్టిన బిడ్డ కొన్ని నెలల తర్వాత చనిపోవడం జరుగుతుంది. అలానే మైనతాయి భర్త కూడా ప్రసవం ముందు చనిపోతారు. ఇలా నానాకు చాలా ఎదురుదెబ్బలు తగులుతాయి. ఇవన్ని సర్వజ్ఞుడైన బాబాకు తెలుసు. నానాకు ఈ వైరాగ్యం బోధించడానికే ఆరతి సాయిబాబా అనే ఆరతిని పంపించారు. ఇలా బాబా ఒక్క లీలలో ఎన్నో అంశాలను మనకు చూపించారు.


ఓం శ్రీ సాయినాథార్పణమస్తు !





Sri Saisatcharita Chapter - 33



We all heard about the miracles of Udi (Sacred ash). This Udi denotes the transient nature of this world. We need to understand that this whole universe is not permanent and one day all these elements will be integrated into the space. In a similar way, this body vanishes too. When the soul leaves the body, this body will collapse and proves that this is nothing but ash. You and I will undergo the same stages. So that you should remember this and I should also be aware of it, day and night, I give the vibhuti. The entire universe is full of Maya. Brahman is the only reality, while the universe is illusory. Bear this in mind that this is what the udi teaches. No person belongs to anyone in this world – be they wife, son, uncles or nephews. Naked you come and naked you will return. The udi is a reminder of it”. If this udi is applied to the body, then physical and mental sufferings are cured. But the true significance of the udi is deep and it is meant for discriminatory detachment.  Baba reiterates this fact and that’s why he gives Udi to every one and is trying to teach us the renunciation. Baba used to sing a song related to Udi. “Ramate Rama ayogee; Ayogee; udiyon ka Goniya Layogee”   “O playful Ram has come! And brought sacks of Udi” were the two lines he sang. Whenever he was in a happy and joyous mood, he sang this refrain repeatedly, in a melodious voice. Of course that is the sweetness of Lord Rama’s name. This could be understood only when we give offerings (Dakshina) to Sai and take Udi from him.  The greatness of this udi is beyond limits. Now let us hear the stories where this Udi helped Baba's devotees. 


Narayan Motiram Jani 
Narayan was a devotee of Baba and used to live in Nasik. Once he comes to Shirdi with his mother. Baba tells his mother that he no longer has to serve anyone for his job and he can start his own business. He then started a boarding home by name Ananda ashram. It thrived really well. One of his friends was stung by a scorpion and was in extreme pain. They were looking for Baba's udi but they could not find none. Then Narayan goes to his pooja mandir and gets ashes from joss-stick. He invokes Baba and thinking that this ash is Baba's udi puts it on the seat of pain. Then pain disappears. They felt delighted and moved by Baba's miracle. 

Another time one devotee of Bandra came to know that his daughter was down with bubonic plague. He had no Udi so he requests Nana Chandorkar to send himsome Udi. At that time Nana was traveling and did not have any Udi with him. He then gets some dust from the place and prays to Baba and gives it to the person who came. This made his daughter get better. 

Jamner Miracle
Sai took care of Nana’s family like he took care of Nana himself. Nana’s daughter, who was in labor, was in intense pain; and from Jamner Sai Samartha was being invoked constantly. No one at Shirdi was aware of the state of affairs at Jamner. Baba, however, knows everything and is all pervading. There is nothing in the universe that he is unaware of. Baba was one with his devotees. Realizing the circumstances at Nana’s home Sai Samartha’s heart overflowed with compassion. See what he did immediately! He thought of sending udi. At the same time Gosavi Ramgir Buva had an urge to go to his village. His village was in Khandesh. He made all preparations to leave and came to the Masjid to take darshan and be at Baba’s feet. For no one left Shirdi for any work without touching Baba’s feet and obtaining his permission, as long as he was in body. Ramgir came in accordance with it, touched Baba’s feet and asked permission to leave.

He said: “Baba, I am going to my village in Khandesh. Give me udi and blessings and your permission to this servant to leave”. Baba affectionately called him by the name ‘Bapugir’. He replied: “Go happily to your village. But rest a while on the way. Go first to Jamner and stay at Nana’s home. After inquiring about his well-being, then proceed further”. Then he said to Madhavrao Desphande: “Shama, make a copy on a piece of paper of that Arati of Adkar and send it to Nana with the Gosavi”. Then he gave udi to the gosavi and made a small packet of it and placing it in his hand asked him to give it to Nana. “Take both the udi and Arati and give them to Nana. Inquire after his well-being, and then proceed to go to your village,” he said. This ‘Arati Saibaba’, is like ‘Dñyaneshwar’s Arati’ composed by Rama Janardan. They both have the same tune. Rama Janardan was a devotee of Swami Janardan, while Madhav Adkar was devoted to Sai’s feet. This was an inspired composition and without it, Sai’s worship is incomplete. As Baba liked this Arati very much, listeners should hear this arati from beginning to end, which Baba sent with the udi. Later, you will realize the fruits of it.

The Gosavi said to Baba: “I have altogether two rupees with me. Baba, how will I reach Jamner with only this amount?

Baba said: “Go without any care. Everything will be arranged for you. ” Having full faith in Sai’s Words, the Gosavi set out.

Taking these instructions from Baba, and obeying his orders, Bapugir left for the assigned work immediately, after taking the udi as prasad. During those days, there was no rail route to Jamner, as it is now; and it was not easy to make the journey. So the Gosavi was worried. Setting out in the train, the passengers had to alight at Jalgaon, from where they had to go on foot the rest of the distance.

After paying the train fare of Rupee one and 14 annas, there remained only 2 annas. How was he to go further? These were the thoughts causing the Gosavi worry at Jalgaon station. When he came out, after handing over the ticket, he saw a peon at some distance. The peon seemed to be in search of some one. He approached the passengers and asked: “Tell me who Bapugir from Shirdi is?” Knowing that, that peon’s inquiry was only meant for him, the Gosavi came forward and said: “Yes, I am that person. Tell me what you want”. He said: “Chandorkar has sent me for you. Come quickly and get into the tonga. He is waiting for you”. The Buva was greatly pleased and he felt that a message must have reached Nana from Shirdi to enable him to send a tonga on time, which had saved him a lot of trouble.

The peon looked very smart, with a beard, twirled moustache, and side – burns, wearing a livery. The tonga also looked well maintained. The horses matched the tonga. They were certainly not hired out animals. Leaving other tongas behind they moved ahead due to their eagerness. The tonga had started for the journey around 2.48 a.m. and was halted at dawn near a stream on the way.

Then the tongawallah unharnessed the horses to water them and said: “I’ll come back soon after which we will have refreshments at leisure. I will fetch a little water and then we will eat mangoes, then after re-harnessing, the horses we will leave”. From his beard and dress he looked a Muslim. Hearing his words, Ramgir had doubts about accepting the refreshments from him. Therefore, he asked him about his caste. He said: “Have you doubts about me? I am a Hindu from Garhwal and a Kshatriya. I am a Rajput by caste. These refreshments have also been sent by Nana for you with me. Certainly, have not the slightest of doubts. Eat them free of worry”. When his doubts were thus removed, they both had the refreshments. The tongawallah harnessed the horses and the journey came to an end at sunrise. As they entered the village, Nana’s office became visible. The horses also stopped for a moment. Ramgir felt happy.

The Buva looked for a secluded place in which to relieve himself. When he returned, he was surprised by the sight. No tonga, no horses, no tongawallah could be seen! No one was to be seen at that moment. The place was deserted. Ramgir wondered: ‘What is this marvel? After bringing me so far, where has he gone in such a short time?’ As he was eager to meet Nana, the Buva went inside the office. When he learned that Nana was at his residence, he decided to go there. Buva inquired the way, along the road, and easily found Nana’s home. He reached and sat on the verandah and Nana called him in. They met one another. He took out the udi and arati and placed them before Nana and told him the whole story.

It was a marvel that, when this udi came, Nana’s daughter was suffering intensely, due to some obstruction in the delivery. To ward off this difficulty, the Nava–Chandi Havan and Saptashati recitation was in progress. The Gosavi was surprised.

Nana then felt as a hungry person feels when a platter of delicacies is placed before him or as a thirsty chakor feels when he gets nectar in his mouth. Nana called his wife and gave her the udi to administer to his daughter with water and he himself began singing the arati. Within moments, a message was received from the inner quarters, that the girl was better as soon as the cup of udi was put to the lips. She was freed from pain immediately and had a safe delivery.

The crisis passed away happily. Everybody’s worries were over. Then Ramgir asked Nana: “Where did the tongawallah go? I do not find him here also. Where is the tonga that you sent? ” Nana replied: “I did not send. I do not know of what tonga you are speaking. Who knew that you were coming? Why should I send the tonga? Then Buva told the story of the tonga, from the beginning to the end to all. Nana was surprised; thinking about Baba’s loving concern for his devotees as his own children. What tonga! Which peon!

This Sai Mauli (Mother) is the Lord of the Universe performing various wonderful feats! At the time of difficulty, he comes running to the devotees because of the intensity of devotion.

Balabua Sutar:
Next in this chapter Hemadpanth talks about Balabua Sutar who was also called as "Modern Tukaram". When he goes to Shirdi, Baba says that he knows him for the last 4 years and he became surprised as this was his first to Shirdi. He could not understand why Baba said thta he knows him for 4 years? Then he remembers prostrating at Baba's portrait 4 years ago. He said to himself "how Omniscient and all pervading are the saints and how kind are they to their devotees! I merely bowed to his photo, but this was noticed by Baba and in due time he made me realize that seeing his photo is equivalent to seeing him in person". 

Appa saheb Kulkarni 
Appa used to worship Baba's photo everyday. He wanted to have a darshan of Baba. Once he had to go out of town and one fakir visits his family asking for dakshina. His family thought it could be Baba and asks him "Are you Shirdi Sai Baba?" Then that fakir replies "I am God's servant". Then he gives them some Udi to keep in puja mandir. Then he left. Once Appa came home he realized that Baba came to their house and felt that they gave only 1 rupee dakshina and he could have given 10 rupees. He wanted to find this fakir but could not find him. He comes home and eats his meal then goes to find him. The fakir appears before him and asks for dakshina. Appa became very happy and gives him a rupee. He still aks him for money, then Appa gives him 2 rupees. Then fakir still wanted money, he had to borrow from his friend Mr. Chitre, another 3 rupees. Fakir still wanted more, then Appa takes fakir to his place and offers him another 3 rupees. He was still unsatisfied. Then Appa shows rupees 10 and teh fakir takes 10 and returns the 9 rupees back to Appa. Baba took rupees 10 as Appa originally wanted to give rupees 10. Then Appa and his family realized that Appa wanted to give 10 rupees. Here we have to realize how Baba blessed Appa by giving him the rupees 9 back and it signifies the navavidha bakthi like he gave 9 rupees to Laxmi Bai just before his Mahasamadhi.

Haribhau Karnik
In this chapter at the end, Hemadpanth writes about Haribhau Karnik who happened to come to Shirdi in 1917 during Gurupurnima time. He worshiped Baba and took blessings from him, when he was leaving Dwarakamai, he realizes that he forgot to give 1 rupee to Baba but he cannot go back once he took leave from Baba. Then he goes to Nasik and gets a darshan of Kala Ram> while coming out of the temple a saint by name Narsing Maharaj stops by him and asks him a rupee dakshina. He was so happy that he asked him a rupee which he wanted to give earlier. This way Baba fulfilled his wish through another saint. This story illustrates that all saints are one and how they work in unison.  

Baba's teachings from Jamner Miracle: 
Baba could have saved Minatai without all this, but he used udi, Gosavi, Tonga and Peon. What was he trying to teach us? He also introduced Adkar’s “Arathi Sai Baba” through this incident. Only Baba can make us understand the real meaning behind this. Ramgiri Buva had only 2 rupees when he started at Shirdi. This is nothing but Shradda and Sabhuri (Faith and Patience). After he bought the ticket up to Jalgaon, he was left with 2 Annas (Change). This faith and patience showed him the way at Jalgoan station. When ever we keep trust in Baba, he will definitely take care of us. The Aarthi we talked about earlier is usually sung as Sandhya aarthi. Here Sandhya means the state between two situations or times. This attributes to the time between life and death. We all need to be aware of this time period and we have to remind ourselves about God. We call 11th hour when we are at the last minutes of any task. In a similar way Ramgir Buva reaches Jalgaon at 11 PM. Baba showed him the way in this 11th hour only where he had no other options.

Sai strengthened Nana’s faith by saving Minatai. By giving Udi and Aarthi song Sai wanted to show Nana the transient nature of life and hidden meaning behind the Aarthi. He wanted to teach Nana the Vairagya (Detachment). After few months of this happy situation, Minatai’s baby dies. Her husband already died prior to her delivery. Nana experienced most difficult time of his life. Baba knew about future and the sadness that is forthcoming. In this way Baba showed so many aspects to his Jamner miracle.


OM Sri Sainatharpanamasthu!


Wednesday, April 25, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం -32




వేదవేదాంగ అధ్యయనాలు, శృతి శాస్త్ర పారాయణాలు చేసినా గురుకృప లేకుండా జ్ఞానప్రాప్తి లేదు. ఇతర సాధనాలన్నీ వృధా శ్రమ మాత్రమే. ఈ ప్రపంచాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చారు. దీని వేళ్ళు పైకి ఉంటాయి. దాని శాఖలు విస్తారంగా వ్యాపించి ఉంటాయి. ఇది దూరమునుండి రమణీయంగా కనిపిస్తుంది. అరటి చెట్టు స్థంభం వలె ఇది సత్తువ లేనిది. నిస్సారమైనది. ఇది అజ్ఞానంవలన కలిగిన కోరికల కారణంగా చేసే కర్మలనుండి ఉద్బవించింది. అవ్యక్త బీజములోనుండి పుట్టినది. ఆశతృష్ణ మొదలైన వాటితో నీరులాగా చుట్టబడి ఉంటుంది. ధనధాన్యాలు, భార్యాబిడ్డలు, పరివారం వగైరా శరీర బుద్ధి కారణంగానే. ఇది మాయోపాధి బ్రహ్మలో ఆవిర్భవించింది. ఇది వైరాగ్యమనే శస్త్రంతో నశిస్తుంది. సద్భావం దీనికి మూలాధారం. బ్రహ్మ సత్యం మరియు జగత్తు మిధ్య. ఇలా హేమద్పంత్ గారు ఈ ఉపోద్ఘాతంతో మొదలుపెట్టి తరువాత బాబా చెప్పిన కథను మనకు చెప్పారు.

ఇది బాబా స్వయంగా చెప్పిన ఒక మధురమైన కథ. ఒక సారి మేము నలుగురం పురాణాది గ్రంధాలను చదివి జ్ఞానసంపన్నులం అయిపోయామని తలిచి బ్రహ్మ నిరూపణ చేయసాగాము. ఉద్ధరేతాత్మా నాత్మానాం అనే గీతా వచనం ప్రకారం పరావలంబనం ఎప్పుడూ పనికిరాదు అని ఒకరు చెప్పారు. మనసు అధీనంలో ఉంచుకునే వాడే ధన్యుడు. సంకల్పవికల్పాలు లేకుండా ఉండాలి అని రెండవవాడు చెప్పాడు. వికారాలతో మార్పులు చెందేది అనిత్యం. ఒక్కటి మాత్రమే నిత్యం. అందువలన నిరంతరం ఈ నిత్యానిత్యాల గురించి చింతన చేయాలి అని మూడో వారు చెప్పారు. నాలుగవ వానికి పుస్తక జ్ఞానంపై నమ్మకం లేదు. అతని ఉద్దేశం శాస్త్రాలు చెప్పినవి ఆచరించాలి కాని పంచప్రాణాలు గురువు యొక్క చరణాలకు సమర్పించాలి. గురువే పరమాత్మ. నిర్మలమైన భక్తి ఉండాలి అని చెప్పారు. ఇలా మాట్లాడుకుంటూ మేము నలుగురం అడివిలో సంచరిస్తూ వుంటే ఒక వనజరి మాకు తారస పడి మీ ప్రయాణం ఎంత వరకు? దేని నిమిత్తం? అని అడిగాడు. అతనికి వారు నిజం చెప్పడం ఇష్టం లేక అక్కడినుండి వెళ్ళబోతూ ఉంటే అతను ఇలా అన్నాడు. ఈ అడవి చాలా దట్టమైనది. ఒక మార్గదర్శి ఉంటె దారితప్పకుండా ఉంటారు. రహస్యమైన విషయం అయితే చెప్పకండి కాని ఈ ఆహారం స్వీకరించి వెళ్ళండి అంటాడు. కాని వారు అతనికి బదులు ఇవ్వకుండా మల్లి అన్వేషణకై బయలుదేరతారు. చాలాసేపు తిరిగి మరల ఆ వనజరి ఉన్న ప్రదేశానికి వస్తారు. మరల అతను వారిని ఆహరం తీసుకోమని, మార్గదర్శి ఉంటే మంచిది అని చెప్తాడు. ఈ సారి నాకు చాలా ఆకలిగా ఉంది అతని మాటవిని ఉండాలి అని నేను ఉండిపోయాను. మిగతా ముగ్గురూ వెళ్లిపోయారు. ఇలా నిస్వార్ధ ప్రేమ చూపిస్తూ ఏ లాభాన్ని ఆశించని వాడే నిజమైన జ్ఞాని. నేను రొట్టె ముక్క తిని నీరు త్రాగిత్రాగిన తరువాత అకస్మాత్తుగా నా ముందు గురు మహారాజ్ ప్రత్యక్షమయ్యారు.

ఆయన మా గురించి తెలుసుకొని నన్ను తీసుకువెళ్లి ఒక బావిలో తాడుతో తలక్రిందులుగా వేలాడతీసి ఉంచి వెళ్లిపోయారు. అప్పుడు నాచేతులు నీటికి అందకుండా ఉండే విధంగా నన్ను ఉంచారు. కొంత సమయం తరువాత మరల వచ్చారు. నన్ను పైకి లాగి ఎలా ఉంది అని అడిగారు. చాలా ఆనందంగా ఉన్నాను. ప్రవాసం పొందాను అని చెప్పాను. అయన మెచ్చి నన్ను ఆయన తన పాఠశాలకు తీసుకువెళ్లారు. ఆ పాఠశాల చాలా రమ్యంగా ఉంది. అక్కడ మాయా మోహాలు తొలిగిపోయాయి. ముక్తి సునాయాసంగా లభించింది. గురువు ప్రతిబింబం లేని కళ్ళు వృధా అనిపించింది. క్షణంకూడా ఆయనను వదిలిఉండాలి అనిపించలేదు. నా ఇల్లు వాకిలి , తల్లి తండ్రి దైవం సర్వం ఆయనే అయ్యారు. గురుధ్యానమే ఏకైక లక్ష్యంగా మిగిలిపోయింది. మా గురువు నన్ను బాగా సేవలో నియమించి నాకు జ్ఞాననిధిని చూపించారు. దానిని వెతుక్కునే అవసరం కలుగలేదు. అన్ని వాటంతట అవే అర్ధం అవడం మొదలైంది. గురు కృప కారణంగా  శోధన అక్కడికక్కడే ఆగిపోయింది. గురువు తల్లక్రిందులుగా వెళ్లాడకట్టి ప్రపంచం నిత్యమూ సత్యము కాదని, నిత్యమైనది సత్యమైన దాన్ని తెలుసుకొనేలాగా చేశారు. ఇక్కడ శ్రద్ధ విశ్వాసాలు తప్ప ఏవి సాగవు.

పైన చెప్పిన కథలో సాయి తనను ఒక భాగంగా చెప్పి మనకు సరిఅయిన దారి చూపించారు. ఆయన గొప్ప వైరాగ్య మూర్తి, జ్ఞాని, పరమగురువు. తాను స్వయంగా అవతార పురుషులై ఉండి ఆ వనజరి ఇచ్చిన ఆహారం స్వీకరించి అన్నం పరబ్రహ్మ స్వరూపమని, దానిని తిరస్కరించకూడదని, అలానే గురువు యొక్క గొప్పతనం ఏమిటో తెలియ చెప్పి, శ్రద్ధ సభూరిల అవసరం ఏమిటో చేసి చూపించారు. అందుకే సాయి భక్తులమైన మనం సాయి చూపించిన మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి.

సాయి ఎప్పుడూ ఉపవాస దీక్షలను ప్రోత్సహించే వారు కాదు. పైన చెప్పిన కథలో ఆ వనజరి పెట్టిన భోజనం తిన్న తరువాతే తనకు గురువు సాంగత్యం కలిగింది అని చెప్పారు. బాబా ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చేవారు కాదు. ఉపవాసం చేస్తే మనసు స్థిమితంగా ఉండదని అట్టి వారికి పరమార్ధం ఎలా లభిస్తుంది అని చెప్పేవారు. ఉత్తకడుపుతో దేవుని చూడలేము అని చెప్పారు. అలా అని అమితంగా తినరాదు. మనకు ఎంత అవసరమో అంతే స్వీకరించాలి. ఒక సారి గోఖలేగారి భార్య బాబా పాదముల వద్ద ఉండి మూడు రోజులు ఉపవాసదీక్ష చేయాలి అనుకొని వస్తుంది. బాబా అంతకుముందు రోజు కేల్కరుతో హోలీ పండుగరోజు ఎవరినీ ఉపవాసం చేయనివ్వనని చెప్పారు. ఆమె అక్కడకు వచ్చినప్పుడు బాబా ఇలా అంటారు " ఉపవాసము చేయవలిసిన అవసరం ఏమి? కేల్కర్ ఇంటికి వెళ్లి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవును తినుము" అని అంటారు. ఆమె బాబా చెప్పిన విధంగా చేసి బాబా దగ్గరే ఉండి ఆనందాన్ని పొందుతుంది.

తరువాత బాబా చెప్పిన ఇంకో కథను హేమద్పంత్ గారు ఈ అధ్యాయంలో చెప్పారు. బాబా ఇలా చెప్పారు. " నా చిన్న తనంలో జీవనం కోసం బీడు గావ్ వెళ్ళాను. నేను బట్టలపై అల్లిక చేయు పని దొరికినది. శ్రమ అనుకోకుండా కస్టపడి పనిచేసాను. యజమాని సంతోషించి మిగిలినవారి కంటే నాకు ఎక్కువ మొత్తం ఇచ్చెను. నా తెలివితేటలు చూసి యజమాని నన్ను పేమించి మెచ్చుకొని నాకు బట్టలిచ్చి గౌరవించెను. ఇక్కడ బాబా మన సాధన ఎలా ఉండాలో చెప్తున్నారు. అందరూ ఈ ప్రాపంచిక విషయానందంలో మునిగి వారు చేయగలిగినంత సాధన చేయరు. ఇక్కడ యజమాని అంటే గురువు. అందుకే బాబా ఇలా అంటున్నారు. మానవుడు ఇచ్చినది త్వరలో సమసిపోవును. దైవమిచ్చునది శాశ్వతము. నా ప్రభువు "తీసుకో తీసుకో" అనును కాని, ప్రతివాడు నా వద్దకు వచ్చి "తే తే " యనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడు లేడు. నా సర్కారు యొక్క ఖజానా (ఆధ్యాత్మిక ధనం) నిండుగా నున్నది. అది అంచువరకు నిండి పొంగిపొరలుచున్నది. కాని దీని కోసం ఆరాటపడువారు కరువైయ్యారు. ఇట్టిఅవకాశం తిరిగిరాదు. ఎవరైనా వారి వారి సాధనను బట్టి అంత ఫలితం పొందెదరు. నా ఈ పలుకులను ఎవరైతే జ్ఞప్తియందుంచుకొనెదరో వారు అమూల్యమైన ఆనందం పొందెదరు అని బాబా చెప్పారు.


ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!