In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, February 3, 2016

దీక్షిత్- 2



Play Audio


దీక్షిత్ కష్టాలు - సాయి చేయూత
సాయిని కలిసిన దగ్గర నుంచి దీక్షిత్‌లో చాలా మార్పులు వచ్చాయి. 1910 నుండి అతనికి సాయి సేవలోనే ఉండాలన్న తపన ఉండేది. న్యాయవాద వృత్తి మీద విరక్తి కలిగింది. ఎక్కువగా షిర్డికి వెళ్తూ ఉండేవారు. దీనితో తన సంపాదన బాగా తగ్గిపోయింది. ఆయనతో భాగస్వాములుగా ఉన్న రావ్ బహుదూర్ నారాయణ దాస్, ధంజీషా మొదలైనవారు దీక్షిత్‌తో ఉండడం ఇష్టంలేక విడిపోతారు. దీక్షిత్ తనంతట తానే ఒక సంస్థను ప్రారంభిస్తారు. పురుషోత్తం రామ్ మార్కడ్ అనే ఆయనను భాగస్వామిగా తీసుకుంటాడు. అది కూడా ఎక్కువ కాలం నిలువదు. 1911 నుంచి దీక్షిత్ ప్రాక్టీస్ బాగా తగ్గిపోయి సంపాదన పూర్తిగా పడిపోతుంది. ఒకసారి బాబా దగ్గరకు వెళ్ళి "బాబా ఈ వృత్తిలో అబద్దాలు ఆడాలి ఇది సరియైన వృత్తి కాదు" అని వాపోతాడు. అప్పుడు బాబా "కాకా ఈ వృత్తికి  కూడా న్యాయం చేయవచ్చు, బొంబాయి వెళ్ళి ప్రాక్టీస్ చేయి" అని చెప్తారు. బాబా మాటతో బొంబాయి వెళ్ళి మళ్ళా ప్రాక్టీస్ మొదలు పెడ్తారు. కాని 1912లో పూర్తిగా మానివేస్తారు. అప్పుడు అందరూ దీక్షిత్‌ని ఒక ఫకీర్ ఆకట్టుకున్నాడు ఇతడు ఒక పిచ్చివాడిలాగా అయ్యాడు అనుకొన్నారు. కాని దీక్షిత్ ఇవన్ని లెక్కచేయకుండా బాబానే నమ్ముకున్నాడు.

             మామాలుగా అందరూ ఇటువంటి పరిస్థితి వస్తే దిగాలు పడ్తారు. కాని దీక్షిత్ తన అవసరాలను చాలా తగ్గించుకొని అనవసరమైన ఖర్చులు చేయకుండా తనకున్న సంపదను జాగ్రత్తగా వాడుకున్నారు. ఎక్కువ సమయం షిర్డిలో ఉండటానికి ప్రయత్నించారు. ఇది ఒక మాదిరిగా వానప్రస్థ ఆశ్రమంగా అనిపించింది. అప్పటికి తనకు పెళ్ళి అయి ప్రాక్టీస్ మొదలు పెట్టి సుమారు 25 సంవత్సరాలు అయింది.

బాబా రక్షణ
ఒకసారి కాకాసాహెబ్ షిర్డిలో ఉండగా బాగా జ్వరంతో బాదపడ్తారు. అప్పుడు బాబా దీక్షిత్‌ను బొంబాయి పంపిస్తారు. జ్వరం నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. నీవు ఆ బంగళాకు వెళ్ళి విశ్రాంతి తీసుకో కాని మంచంలో ఉండద్దు. చక్కగా శీరా తీపి మాత్రం తిను. దీక్షిత్ విల్లెపార్లెలో తన బంగళాకు వెళ్తారు. అక్కడ ఆయనకు జ్వరం ఇంకా పెరుగుతుంది. డా|| డిమాంటి అనే వైధ్యుడిని పిలుస్తారు. ఆయన అది నవజ్వరం అని మంచం మీద నుంచి కదలవద్దని, మందులు జాగ్రత్తగా వాడమని చెప్తారు. కాని దీక్షిత్ బాబా ఆజ్ఞను శిరసావహిస్తాడు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. కాని దీక్షిత్ మాత్రం బాబా మాటలను తూచ తప్పకుండా పాటిస్తాడు. 9వ రోజున జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఇక్కడే దీక్షిత్ సాయి మీద నమ్మకాన్ని నిరూపించాడు. బాబా చెప్పిన శ్రద్ధ, సబూరిలలో  శ్రద్ధను చూపిస్తాడు.

             
బాబా, దీక్షిత్ కుటుంబ సభ్యులను కూడా రక్షించారు. ఒకసారి దీక్షిత్ తమ్ముడు జబ్బుపడ్డట్టు ఉత్తరం వచ్చింది. ఆ తమ్ముడు నాగపూర్‌లో ఉంటాడు. బాబా దగ్గరకు వెళ్ళి "బాబా నేను నా తమ్ముడికి సహాయం చేయలేకపోతున్నాను అంటే, బాబా నేనున్నాను" అంటారు. అదే సమయంలో ఒక సాధువు వాళ్ళ తమ్ముడి దగ్గరకు వచ్చి నేనున్నాను అని ఆయన జబ్బుని నయం చేస్తారు. తరువాత ఈ విషయం తెలుసుకొని బాబా యొక్క శక్తిని అర్ధం చేసుకుంటాడు.

             అలానే ఒకసారి దీక్షిత్ కూతురు ఆడుకుంటూ ఒక అల్మరా ఎక్కితే అది క్రిందపడి ఒక దెబ్బ కూడా లేకుండా బయటపడుతుంది. బాబా అప్పుడే కాకా కూతుర్ని కాపాడా అని చెప్తారు. ఇలా బాబా కాకా కూతురు వత్సలిని రక్షిస్తారు. 

             1913లో దీక్షిత్ షిర్డిలో ఉండగా తన కుమారుడు జబ్బున పడ్తాడు, తనను తొందరగా ఇంటికి రమ్మని ఉత్తరం వస్తుంది. అప్పుడు సాయి నీ కుమారుడినే ఇక్కడకు పిలిపించు అని చెప్తారు. కాని పిల్లాడికి పరీక్షలు ఉన్నాయి ఎట్లా అని కుటుంబం సందిగ్దంలో పడ్తుంది. దీక్షిత్ వారిని మందలించి బాబా చెప్పినట్లు కొడుకుని షిర్డి రప్పిస్తాడు. షిర్డికి రాగానే ఆరోగ్యం కుదుట పడ్తుంది. నవంబర్ 2, 1913న పరీక్షలు మొదలవుతాయి అని బాబా అనుమతి కోరగా బాబా అనుమతి ఇవ్వరు. రెండవ సారి కూడా పరీక్షలు మార్చబడతాయి. బాబా అనుమతితో తరువాత దీక్షిత్ కుమారుడు వెళ్ళడం జరుగుతుంది. అతను చక్కగా పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణుడవుతాడు. ఇక్కడ దీక్షిత్ బాబా చెప్పిన సబూరి చూపిస్తారు. బాబాపై అపార నమ్మకం, గురి చూపిస్తారు. ఈ విధంగా బాబా దీక్షిత్‌ను అతని కుటుంబాన్ని కంటికి రెప్పవలే కాపాడారు.

బాబా మాట వేదవాక్కు
ఒకసారి దీక్షిత్ బాగా ధ్యానం చేయాలని, రాత్రి పూట ఆహారం మానేయాలి అని అనుకుంటాడు. సాయి ఆశీర్వాదం కోసం వెళ్ళి, బాబాకు నమస్కరిస్తాడు. అప్పుడు బాబా, కాకా ఈరోజు రాత్రి భోజనానికి ఏమి చేస్తున్నావు? అని అడిగి కూర, రొట్టె చేయించి నాకు నైవేద్యం పెట్టి నీవు కూడా తిను అని చెప్తారు. దీక్షిత్‌కి బాబా మాటల్లోని అర్ధం తెలిసి ఉపవాసం చేయాలనే ఆలోచన మానేస్తాడు.

ఇలా బాబా చెప్పిన ప్రతి మాటను వేదంలాగా పాటిస్తూ సాయి ప్రేమను చూరగొన్నాడు. బాబా హేమద్‌పంత్‌కు, పురందరేకు, దీక్షిత్ మంచి యోగ్యుడని అతని మాటకు ఎప్పుడూ అడ్డు చెప్పకు, నీకు మంచి జరుగుతుందని చెప్తారు. అట్లానే దీక్షిత్ ఉత్తమ సాధకుడు అనికూడా పొగిడారు.

మేకను చంపేకథ
జీవుడు వాస్తవానికి త్రిగుణాతీతుడు కాని మాయా మోహితుడై తన సచ్చిదానంద స్వరూపాన్ని మరచిపోయి శరీరమే తాను అని అనుకుంటాడు. ఆ శరీరాభిమానంతో నేను కర్తను, నేను భోక్తను అని తలచి అనర్ధమైన జనన మరణ పరంపరలో పడి బాధపడతాడు. వాటి నుంచి బయటపడే మార్గమే ఎరుగడు. గురువు పాదాలయందు ప్రేమపూర్వకమైన భక్తి యోగమే అనర్ధాలను ఉపశమింపచేసే మార్గం. ఆ గురువు పట్ల శ్రద్ధను తెలియచేసేదే ఈ కథ.

             ఒకసారి మరణానికి సిద్ధంగా ఉన్న మేకను ఎవరో తీసుకొని వచ్చారు. దానిని చూడటానికి జనం వచ్చారు. ఏ దిక్కులేని వారిని రక్షించే దైవమే సాయిమాత. అప్పుడు బాబా ప్రక్కనే ఉన్న బడేబాబాను "ఒక దెబ్బతో దీన్ని చంపేసి బలి ఇవ్వు" అని అన్నారు. అప్పుడు బడేబాబా "దీన్ని ఊరికే ఎందుకు వధించాలి" అని అన్నాడు. అక్కడే ఉన్న శ్యామాతో బాబా "శ్యామా నీవైన వెళ్ళి కత్తి పట్టుకురా ఈ మేకను కోద్దాం, వెళ్ళు" అని ఆజ్ఞాపించారు. శ్యామా, రాధాకృష్ణబాయి దగ్గరకు వెళ్ళి కత్తి తెచ్చి బాబా ముందుంచాడు. ఇంతలో ఈ విషయం రాధాకృష్ణ బాయికి తెలిసి, ఆమె కత్తిని తెప్పించుకున్నది. శ్యామా మరో కత్తి తేవడానికి వెళ్ళి వాడాలో కూర్చుంటాడు. తరువాత కాకా దీక్షిత్ మనసు పరిక్షించాలని బాబా "నీవు వెళ్ళి కత్తిని పట్టుకురా, ఈ మేకను భాద నుండి విముక్తి చేద్దాం" అని ఆజ్ఞాపించారు. గురువు ఆజ్ఞ మేరకు సాఠె వాడాకు వెళ్ళి కత్తిని తెచ్చాడు. దీక్షిత్ కత్తిని దృడంగా పట్టుకున్నాడు. దీక్షిత్ పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించి, పుట్టినది మొదలు అహింసా వ్రతాన్ని ఆచరించినవాడు. గురువు ఆజ్ఞా పాలనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. కాని గుండె దడదడ లాడింది. శరీరం చెమటలు పట్టింది. దీక్షిత్ ఒకచేతిలో పంచెను నడుముకు బిగించి, రెండవ చేతిలో కత్తిని పుచ్చుకొని చొక్కాను పైకి జరుపుకుంటూ మేక దగ్గరకు వచ్చాడు. మరలా బాబాను అడిగాడు "బాబా దీన్ని నరకమంటారా" దీక్షిత్ మేకను చంపాలని త్వరపడినా అతని హృదయంలో కరుణ వలన చేయి వెనుకకే కాని ముందుకు సాగటం లేదు. "ఇంకా చూస్తూన్నావేమి? చంపేసేయి" అని బాబా అన్నారు. అప్పుడు కాకా చేయి ఎత్తి కత్తిని కిందకు దించపోతున్నాడు. ఇంతలో బాబా "వద్దులేరా ఊరుకో! బ్రాహ్మణుడవై ఇంత కఠోరంగా హింస చేయడానికి సిద్దమయ్యావు నీ మనసుకు ఆలోచనే లేదా" అని అడిగారు.
             అప్పుడు దీక్షిత్ కత్తిని కిందపడేశారు. కాకా అప్పుడు "బాబా! మీ అమృత వచనాలు మాకు ధర్మశాసనం మేము రెండో ధర్మాన్ని ఎరుగం, మాకు సిగ్గు, లజ్జ లేవు, గురువచనా పాలనే మా కర్తవ్యం. ఇదే మాకు వేదం. అహింస మేమెరుగం. మమ్ము తరింప చేసేవి సద్గురుచరణాలు. ప్రాణాలు ఉండనీ, పోనీ మాకు గురువు ఆజ్ఞయే ప్రమాణం" అని ఎంతో చక్కగా వివరించాడు. తరువాత బాబా కాకాతో ఈ నీళ్ళ డబ్బా పట్టుకో నేను ఇప్పుడు హలాల్ చేసి సద్గతిని కలిగిస్తానని అన్నారు. అంతలో ఫకీర్ బాబా ఈ మేకను తకియాలో వధించటానికి అనుమతి తీసుకున్నాడు. దాన్ని బయటకు తీసుకు వెళ్ళగానే చనిపోయింది. మేక చావటం తధ్యం అని అందరకు తెలుసు కాని బాబా ఈ లీల చూపించటానికే ఇదంతా చేశారు.

             ఈ విషయంలో దీక్షిత్ పరిక్షలో నెగ్గారు. అందుకే బాబా దీక్షిత్‌ను ఎప్పుడూ పొగిడేవారు. ఆయనకు నిన్ను విమానంలో తీసుకుపోతా అని వాగ్దానం చేశారు. ఇటువంటి శిష్యుడే బ్రహ్మజ్ఞానానికి అర్హుడు. గురుసేవా తత్పరులు, గురువు ఆజ్ఞ యందు గౌరవం ఉన్నవారు తమ ఇష్టాయిష్టాలను, ఆలోచనలను గురువు శిరసుపై ఉంచుతారు. గురువు ఆజ్ఞను పాటించేవారు మంచి చెడులను, సారాసారాలను చూడరు. వారి చిత్తం సాయి నామస్మరణలో, దృష్టి సాయి సమర్దుని చరణాలలో ఉంటాయి. మనోవృత్తి సాయిధ్యాన ధారణల యందు ఉంటుంది. వారి శరీరం సాయి కొరకే. గురువు ఆజ్ఞను, ఆజ్ఞా పాలనను రెండింటిలో ఒక్క క్షణమైన ఆలస్యం సహింపరానిది. ఇది విలక్షణమైన విధానం.

             ఈ విధంగా దీక్షిత్ బాబా మాటే వేదవాక్కు లాగా పాటించటానికి వెనకాడలేదు. ఈ మహాభక్తుని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. గురువు మీద అపార నమ్మకం ఉండటం అంటే ఇదేనేమో. ఎవరైనా గురువు చెప్పిన మంచి పనులు చేస్తారు. కాని గురువుని పూర్తిగా నమ్మి తన జీవితాన్నే పణంగా పట్టగలిగిన శిష్యులు ఎంత మంది ఉంటారు.


ఓం శ్రీ సాయి రాం !

Tuesday, February 2, 2016

Dixit -2


Sai protecting Dixit during difficult times:

Dixit experienced some inner changes since he met Sai Maharaj. He felt like staying in Shirdi it self and serve Sai. He started having a feeling of detachment from his work as an attorney. He started going to Shirdi frequently and his income dropped significantly. All his partners separated from him. Then Dixit starts a firm by himself and takes Purushottam Markad as his new partner. This also did not last long. After 1911, his job related income completely went down. Once he goes to Baba and says “Baba I can not practice this profession any more and I have to tell lies most of the time. I would not continue”. Then Baba told him that he can have practice truthfully and he does not have to lie. He asks him to go to Bombay and practice. After some time, in 1912 he completely closes his practice. Then people started saying that he was hypnotized by a fakir and he became infatuated with Sai. Dixit did not mind these kinds of criticisms and started having complete faith in Baba. During these circumstances any body will be depressed but Dixit reduced his needs to a minimum. He was able to curtail unnecessary expenditures and use his money wisely. With all these adjustments he was able to stay more time in Shirdi with out having to work. This is like a Vanaprastha Ashrama (Monastic life). It was reported that he had the practice and married life for almost 25 years.


Dixit mastering Shradda (faith):

Once Dixit fell ill and had fever, while he was in Shirdi. Baba tells him to go to Bombay and take rest in his house. He also says that the fever will go away in few days. Don’t stay in bed and eat sira (Sweet). Dixit goes to Villeparle and tried to relax in his building. His fever gets worse and his family was very much concerned. They call a doctor by name Dr. Demante. He concludes that it is 9 day fever; he has to take rest in bed and has to use medicines. But Dixit follows Baba’s instructions. Then on the ninth day fever subsides and he gets better with out any treatment. This way he proved that he had complete faith in Baba’s words.

Baba protecting Dixit’s family:

Baba not only protects his devotees but also their family members. We have seen this with other devotees also. Once Dixit’s gets a letter that his brother was ill. He then goes to Baba and expresses his inability to help him. Then Baba says “I am here”. At the same time, a saintly person came to his brother and cures him of his illness. Then Dixit gets the information that his brother was healthy and every one was amazed with Baba’s omnipresence.

Baba protects Dixit’s daughter Vatsali in a similar way. She was playing in her house and climbs up a closet. Then that cabinet falls on her but she escapes with out any injury. Baba tells people around him that he just saved Kaka’s daughter.

In 1913 Dixit was in Shirdi and his son became sick at his house. Then he gets a letter from his family to come home quickly. He goes and asks Sai permission and Sai says “Let him come here to Shirdi”. He tells the family to send him to Shirdi but family was worried about his examinations. They were trying to think and his trip to Shirdi was delayed. Then Dixit convinces them to send him as per Baba’s word. When his son
came to Shirdi, he became healthy. Then Dixit asks Baba for permission to send him back in time for the examinations. Then Baba did not give permission. The examinations were supposed to start on November 2,1913 but they were postponed. Baba did not give permission second time also. The examinations were postponed again. Then Baba lets him go. He goes home and passed in the examinations. Here Dixit showed Sabhuri (Patience) and taught us how to be faithful regarding Baba. Baba saved Dixit’s family time and time again.

Baba’s word is Veda (scripture):

One time Dixit felt that he was unable to sit in meditation, so he decided to fast in the evenings. He goes to Dwarakamai to see Sai and prostrates with devotion. Then Baba says “Kaka what are you coking for dinner tonight? Make Roti and curry, and give me an offering then eat”. Dixit understands Baba’s words and realizes that Baba does not want him to fast. He took every word of Baba as God’s word and that’s why Baba also adored him so much. Baba used to tell Hemadpant and Purandhare to be in company of Dixit as much as possible. He used to say that he is the best seeker in spiritual world.

Story of Goat slaying:             
   
 In essence, man is beyond the three ‘gunas’, but deluded by ‘maya’ he forgets his truth – pure consciousness – bliss state, and considers himself to be the body. Then because of the pride of the body, he believes in doer ship and enjoyer ship. He gets entangled in miseries, one after the other, and finds no way to escape. A loving and devoted attachment to the Guru’s feet is the only way to ward off the endless miseries. Sai, Sree Rang, is a great actor and dyes the devotees in his own hues. This story illustrates the extreme devotion and faith by Dixit towards Baba.

Once there was cholera epidemic in Shirdi area and some one brought a sick goat to Baba.  Somebody brought a goat, which looked feeble and on the point of death. People came to see it. Then at that time, Bade Baba was near by. Baba said: “Offer it as a sacrifice. Kill it with one stroke”. When that Bade Baba was the first one to be asked to kill the goat, the excuse that came from his mouth was: “Why should it be unnecessarily killed?”

Then Baba ordered Shyama, “Shyama, you at least bring a knife. We will cut the goat. Go now”. Madhavrao was a faithful devotee. He went to Radhakrishna Bai and brought a big knife and placed it before Baba. Though Shyama was troubled about bringing the big knife, Baba would not have been satisfied in seeing him without the knife. In the meanwhile, Radhakrishna Bai learnt about this matter and recalled the big knife because she felt pity. Then Shyama left to get another knife. He remained in the Wada, delaying his return, so that the killing would not have to be done at his hand.

Then to test Kaka’s mind, Baba ordered him: “Go, you bring a big knife to cut. Let the goat be freed from its misery”. Then he went to Sathe’s Wada and brought the instrument (to kill) as per the order. He got himself ready to kill the goat without the least hesitation. Inspiration for heroism (bravery) is derived from obedience of the Guru’s order. Hardening his heart he took hold of the weapon. He was born in a pious Brahmin family, for whom Ahimsa was one of life’s vows since birth. He was placed in this kind of a situation. How would his hand proceed? He determined to undauntedly obey the Guru’s order. But his heart was palpitating and his body was soaked in perspiration. Then tucking in his dhoti with one hand and holding up the knife in the other, he folded up the sleeve of the hand that held the knife. He came forward where the goat was. Then, he tightened his grip on the big knife, raised his hand and said: “Baba, shall I kill it? Just tell me once.” Truly speaking, a weapon is held only to protect the weak; and yet it was now raised above an innocent
goat! But he had dedicated his life to serve the Guru. Therefore, he had no hesitation. He wanted to kill it quickly. But pity arose in his heart and the big knife wavered. The hand would not descend. “Come on, kill now, what are you waiting for? Hearing this final order, he made a semi-circular turn for an effective strike. He lifted his hand with the big knife. Now he would certainly strike! Seeing this, Mother Sai, knowing that it would be a calamity said: “Oh let it be. Oh, Kaka, stop this. How cruel you are! Though you are a Brahmin, you are ready to kill! Have you no thought about this? ” Hearing this, he threw aside the big knife. The young and the old were surprised. The goat’s life was spared. Devotion to the Guru had scaled the peak!

Then, Kaka, after throwing away the large knife said what? Pay attention: “Baba, your nectar-like words are the only ‘dharma’ and laws in our life. We have no other dharma. We have no shame. Obeying the Guru’s order is our only creed. It is our Veda(Scripture) and Shastra. To completely obey the Guru’s order, that is the meaning of discipleship for a disciple. That is our jewel. Disobedience is the greatest sin. We never consider the consequences of these actions whether they give pleasure or pain. Whatever is our fate will happen. God alone takes care. We know only one thing. We should remember your name always, see nothing but your form with our eyes, and follow your every command, day and night. Virtues or sin of killing or non-killing are meaningless to us. Our salvation is at theSadguru’s feet. Why should we think of the reason behind the order? It is our duty to obey.

Later, Baba said to Kaka: “Take this tin container of water in your hand. Now I will slaughterit myself, and give it Sadgati”.

The goat was half dead as it is. Fakir Baba had a timely thought that the ‘takiya’ was near by. He asked Baba for his opinion if the goat should be killed at the ‘takiya’. Under this pretext, when the goat was being taken there, it died on the way. 

Everyone knew that the goat’s death was imminent, but at the opportune time Baba enacted this drama.


Spiritual meaning behind the story:
This was a difficult test and Kaka was pure gold. Though Baba knew this fully, unless he had tested him in public, it would not be believed. Baba promised him that he will take him in “Vimana” that is providing him sadgati (Salvation). This is the kind of devotee who is eligible for Brahma-Jnana (Self-Realization).

If one had doubts about the words of a saint, his efforts for achievement are unsuccessful. His words become meaningless, futile, fruitless chatter. Not even a bit of spiritual growth is gained. One who respects the words of the Guru will achieve his welfare and the supreme goal of his life. But he who finds fault with them and thinks them vile, he is ruined. One who is always ready to serve the Guru, respects and obeys the Guru’s orders; he makes the Guru responsible for what is correct or incorrect in all respects. He is the servant of the Guru’s orders. He does not think independently. Always, obeying the orders of the Guru, he does not distinguish what is good or bad. Mind should be engrossed in remembering Sai’s name; the eyes should be fixed at the feet of Sai; the attitude should be of meditation on Sai – the whole being should be dedicated to Sai. Even if a moment is lost between receiving the orders and executing them, that time also cannot be tolerated. This is a strange level of awareness!

Dixit was a man of pure heart. He was truthful, courageous, and unshakable as a rock in his determination. It did not even occur to him to question the righteousness of killing the goat. The innocent goat would die; its soul would be in turmoil; his own reputation would be besmirched; and he would have committed a great sin. These thoughts had no place in his mind. Disobedience of the order was a sin there. There was no greater merit than the fostering and protection of the order. Complete obedience to the Guru is the greatest ornament amongst all adornments – a true sign of the good disciple. The mind should be always at the Guru’s feet, whether I live or die. We obey the order of the Guru. He alone knows the consequence or the end result.

Once you surrender to Guru and place full faith at his feet, then he worries about the disciple and the disciple has to make no effort. There is no place for fear for him, once he has totally surrendered. That self-confidence alone would ferry him across life.

Wednesday, January 27, 2016

దీక్షిత్- 1



Play Audio


సాయి భక్తులందరిలో దీక్షిత్‌కు ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. ఈయన జీవితం మనలాంటి సామాన్య సాయి భక్తులకు ఎంతో ఆదర్శప్రాయము. దీక్షిత్ గారు 45 ఏళ్ళ వరకు చక్కని ప్రాపంచిక జీవితంలో ఉండి ఎంతో ప్రగతిని సాధించిన వ్యక్తి.  తరువాత ఆయన జీవితం మార్పులు చెంది బాబా కృపతో అధ్యాత్మిక పథంలో నడిచింది. సాయి ప్రతిక్షణం దీక్షిత్‌ని రక్షిస్తూ, ఎటువంటి ఒత్తిడులకు లొంగనీయకుండా, వృత్తి, కుటుంబ వ్యవహారాలలో చేయూత నిస్తూ అనుక్షణం కాపాడారు. మనందరి లాగా ఆయన కూడా చాలా కష్టనష్టాలకు లోనై మానసిక ఒత్తిళ్ళకు గురి అవ్వటం జరిగింది. దీక్షిత్ గారి గురించి మనకు చాలా విషయాలు సాయిసఛ్ఛరిత ద్వారా తెలుస్తాయి. సాయిలీల మాసపత్రికలో ఆయన గురించిన చాలా విషయాలు విధితమవుతాయి. శ్రీ నరసింహస్వామి గారి ద్వారా మరికొన్ని విషయాలు, ధీక్షిత్ గారి డైరి ద్వారా కొన్ని సంఘటనలు మనకు తెలిశాయి. వీటన్నింటిని మనం అర్ధం చేసుకొని వారి జీవితం ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒక్కోసారి ఆయన జీవితం మన సామాన్య జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. కాని దీక్షిత్ గారి గొప్పతనం, సాయి అనుగ్రహం ఎక్కడ బయట పడుతుంది అంటే ఆయన బాబాని కలిసిన తరువాత తనకు ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్నా, పెద్ద పదవులు వచ్చే సమయంలో దీక్షిత్ గారు వీటన్నింటిని తృణప్రాయంగా బావించి, బాబానే ముఖ్యమని నమ్మిన ఆ మహానుభావుడు మనందరికి ఆదర్శం.

జననం, కుటుంబ వృత్తి వివరాలు
దీక్షిత్ గారి పూర్తిపేరు హరి సీతారాం దీక్షిత్. ఆయనను బాబా ముద్దుగా కాకా అని పిలిచేవారు. ఆయన 1864వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్టంలో భాండ్వా అనే తాలూకాలో జన్మించారు. ఆయన నాగరి బ్రహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య ఖాండ్వాలో మరియు హింగన్ షూట్‌లలో జరిగింది. తరువాత ఆయన ఆల్పిస్టన్ కాలేజీ (బొంబాయి)లో చేరి, యల్.యల్.బి. డిగ్రీని సంపాదించి ఒక లాయర్‌గా బయట పడ్తారు. అప్పటికి ఆయన వయస్సు 19 సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాత అవసరమైన పరిక్షలన్నింటిలో ఉత్తీర్ణుడై, 21వ సంవత్సరంలో లిటిల్ & కో అనే సంస్థలో పనిచేస్తారు. ఆ తరువాత తనంతట తనే ఒక సంస్థను పెట్టి చాలా మంచిపేరు తెచ్చుకొని బాగా డబ్బు సంపాదిస్తారు. మంచి బంగళాలు కూడా కట్టిస్తారు. ఇన్ని పనులలో తలమునకలైనా  రోజూ ఆధ్యాత్మిక గ్రంధాలను చదివేవారు.
 
             ఆయన చాలా మంది కేసులను తీసికొని బాగా పేరు తెచ్చుకున్నారు. వీటిలో ముఖ్యమైనవి బాల గంగాధర్ తిలక్ గారి కేసు, టైమ్స్ ఆఫ్ ఇండియా పూణా వైభవ్ వంటి ప్రాముఖ్యమైన వాటిల్లో విజయం సాధించారు. ఆయనకు అటు బ్రిటిష్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ అధినేతలతో మంచిపేరు వస్తుంది. ఆయన బొంబాయి కౌన్సిల్లోకి ఎన్నిక అయ్యారు. ఇది 1901వ సంవత్సరంలో జరిగింది. 1904వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి సెక్రటరి అయ్యారు. ఆయనకు బొంబాయి విశ్వవిద్యాలయంలో కూడా ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. ఇలా ఎన్నో అత్యున్నత పదవులు ఆయనను అలంకరించినవి. ఇలా జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ఆయన జీవితం మలుపు తిరగాల్సిన సమయం ఆసన్నమైంది.

             1906వ సంవత్సరంలో దీక్షిత్‌గారు లండన్ వెళ్ళడం జరిగింది. ఆయన అప్పుడే బయలుదేరిన రైలులో ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు ఆయన క్రింద పడి కాలుకు దెబ్బ తగులుతుంది. ఈ దెబ్బ ఆయన జీవితాన్ని మార్చివేసింది. చాలా వైద్యాలు చేపించినా ఆయన సరిగ్గా నడవలేక పోయారు. ఈ అవిటితనం ఆయనను చివరి దాకా వెన్నంటే ఉంది. ఇది ఆయనను ఒక రకమైన మానసిక రుగ్మతకు గురిచేసింది. కొంచం దూరం నడిస్తే కాలులో నెప్పి వచ్చేది. బయటకు ఈ దెబ్బ ఆయన ప్రాపంచిక జీవితంలో ఒక లోపంగా కనిపించినా అధ్యాత్మిక జీవితానికి మాత్రం ఇది తొలిమెట్టు. ఆయనలో ఒక రకమైన మానసిక విశ్లేషణ ప్రారంభమయింది. దీంట్లో నుంచి వైరాగ్యం ఆవిర్భవించింది. ఇలా 1909వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆయనకు 45 ఏళ్ళు వచ్చాయి. అదే సమయంలో ఆయన దత్తమహారాజ్ లాంటి ఆధ్యాత్మిక గురువులను కలిశారు. ప్రాపంచిక విషయాలలో ఏమి సారం లేదని ఈ జీవితం యొక్క అర్ధం ఏమిటి అనే ఆలోచన కలిగింది.   

సాయితో తొలికలయిక
 1909వ సంవత్సరంలో సెలవలకై తన బంగళాకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో నానా సాహెబ్ చందోర్కర్‌ను కలుస్తారు. వీరిద్దరు కలసి చదువుకున్నారు. నానా ప్రభుత్వ ఉద్యోగం తీసుకొని స్థిరపడతాడు. దీక్షిత్ మాత్రం లాయర్‌గా స్థిరపడ్డాడు. ఆ తరువాత వాళ్ళు కలవడం ఇదే మొదటిసారి. వారు అనేక విషయాలు మాట్లాడుకుంటూ చివరికి దీక్షిత్ కాలు దెబ్బ గురించి చెప్పుకుంటారు. అప్పుడు నానా సాయి గురించి చెప్తారు. సాయి నీ కాలుని సరి చేస్తారు అని నానా అంటే అప్పుడు దీక్షిత్ ఈ కాలు బాగుకావడం ముఖ్యం కాదు నా మనసు కుంటితనం పోవాలి. నాకు మోక్షం కావాలి. నాకు గురు దర్శనం కావాలి. అల్ప సుఖభోగాల కోసం కాదు, బ్రహ్మ జ్ఞానమే పరమ సుఖం. అంతకు మించిన సుఖం మరేమిలేదు.  నేను ఎన్నెన్నో పూజలు చేశాను, భజనలు చేశాను, అలసి పోయాను. ఈ మనసు మాత్రం నిశ్చలం కావడం లేదు. మనసును ఎంతగానో నిగ్రహిస్తున్నాను. అయినా అది చలిస్తూనే ఉంటుంది. నా మనసు కుంటితనం నయం అవ్వాలి, అని దీనంగా చెప్తాడు.

             1909వ సంవత్సరంలోనే విధాన సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ప్రచార సందర్భంలో అతను అహ్మద్‌నగర్ వెళ్తారు. అక్కడ సర్ధార్ మీర్‌కర్ అనే స్నేహితుడు దగ్గర బస చేస్తారు. వారు గుర్రాల ప్రదర్శనకు వెళ్తారు. అక్కడ దీక్షిత్ తను బాబాను కలవాలి అని అంటారు. మీర్‌కర్ కుమారుడు బాలా సాహెబ్ మీర్‌కర్ కూడా కోపర్‌గావ్ నుంచి అక్కడకు వస్తారు. అదే సమయంలో తన అత్తగారికి బాగుండలేదని శ్యామా అహ్మద్‌నగర్ వస్తారు. ఈ విషయం తెలిసి మీర్‌కర్ శ్యామాకు కబురుపెడ్తారు.  శ్యామాను చూడగానే దీక్షిత్‌కు ఎక్కడా లేని ఉత్సాహం వచ్చి బాబాను చూసినంత అనుభూతి పొందుతారు. ఇంక ఆయనలో ఆతృత పెరుగుతుంది. అక్కడ క్షణం కూడా ఉండాలని అనిపించలేదు. ఎప్పుడు బాబాను కలుస్తాను అన్న భావనతో మనసు నిండిపోయింది.

             అంతలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. బాలా సాహెబ్ మీర్‌కర్ వారింట్లో ఉన్న బాబా చిత్రంపై నున్న తెరను తొలగించాడు. అది మేఘా పూజించే సాయిపటం. దాని అద్దం పగిలితే బాగుచేయించేందుకు అహ్మద్‌నగర్ తీసుకువస్తారు. బాబా దర్శనం కాగానే దీక్షిత్ ఆ పటం ముందు మోకరించాడు. మనస్సులో ఏదో తెలియని అనుభూతి, ఈ పటాన్ని వీరిద్దరికి ఇచ్చి శిరిడి పంపాలని నిశ్చయించారు. శ్యామా మరియు దీక్షిత్ ఆ రాత్రి 10 గంటలకు రైలులో శిరిడికి బయలు దేరారు. రెండవ తరగతి కిక్కిరిసి ఉండటంతో ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.    అంతలో దీక్షిత్ రైలు గార్డుని కలిసి మొదటి తరగతిలో ప్రయాణం చేస్తారు. వారు కోపర్‌గావ్‌లో దిగగానే నానాసాహెబ్ చందోర్కర్ కలుస్తారు. ముగ్గురు టాంగా మాట్లాడుకొని శిరిడికి వస్తారు.

             దీక్షిత్ ద్వారకామాయిలో అడుగుపెట్టగానే  "రా లంగడా కాకా"  అని ఆహ్వానం పలుకుతారు. దీక్షిత్ కళ్ళు చెమరుస్తాయి. ఆ తొలిదర్శనం దీక్షిత్ మనసులో చెరగని ముద్ర వేస్తుంది. ఆయన కళ్ళు ఆర్పకుండా బాబాను అట్లానే చూస్తుండి పోతాడు. వెంటనే బాబా పాదాలపై తన తలను ఉంచుతాడు. అప్పుడు బాబా ప్రేమతో "నీ కోసం ఎదురు చూస్తున్నాను అందుకే శ్యామాను నీదగ్గరకు పంపించాను" అని చెప్పగా దీక్షిత్ హృదయం పులకరించిపోయింది. సాయి స్పర్శతో అపారమైన ఆనందాన్ని పొంది సాయి ప్రేమకు ఆశ్చర్యపడ్డాడు.

             హేమద్‌పంత్ సాయిసచ్చరితలో ఈ ఘట్టం గురించి ఇలా వ్రాసారు. భక్తి శ్రద్ధలు మూర్తీభవించినట్లుగా దీక్షిత్ మొదటి నుండి పుణ్యకార్యలలో కీర్తి గడించినాడు. ఇంగ్లాండుకు ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ పారమార్ధిక  బీజం నాటుకున్నది. కాశీ ప్రయాగ, బదలీ, కేధార్‌నాధ్, మధుర, బృందావనం, ద్వారకా మొదలైన యాత్రలు చేసిన పుణ్యం దీక్షిత్‌కు ముందే ఉంది. అంతేకాక తల్లితండ్రుల పుణ్యం వలన అమితమైన భాగ్యం కొద్దీ పూర్వార్జిత పుణ్యఫలం కారణంగా సాయి దర్శనం కలిగింది. తన కుంటి తనం పైకి అశుభం లాగా అనిపించినా నిజానికి పరిణామం శుభప్రధమైంది. అలా గురువు యొక్క సన్నిధికి చేరుకునే యోగం లభించింది. ఆ రోజు నవంబర్ 2, 1909వ సంవత్సరం దీక్షిత్‌కు మొదటిసారిగా పుణ్యపావనమైన సాయినాధుని దర్శనం లభించింది, అని ఎంతో చక్కగా హేమద్‌పంత్ వర్ణించారు.

దీక్షిత్ వాడా నిర్మాణం

నవంబర్ 1909 తరువాత, దీక్షిత్ గారు డిశంబర్ నెలలో మరల షిర్డికి వస్తారు. ఆయనకు సాధెవాడాలో సరిగా ఏకాంతం లభించక ఇబ్బంది పడ్తారు. ఆయనకు షిర్డిలోనే బాబాతో ఉండిపోవాలి అని అనిపిస్తుంది. తనే ఒక రేకుల షెడ్ నిర్మించాలి అనుకొని ఒక భవనం కట్టాలి అని నిర్ణయిస్తారు. బాబా అనుమతితో 1910 డిశంబర్ 9న పునాది వేస్తారు. అదే రోజున రెండు విశేష సంఘటనలు జరుగుతాయి. ఖపర్డెకు షిర్డి నుంచి వెళ్ళడానికి బాబా అనుమతి ఇస్తారు. అదే రోజు శేజారతి చావడిలో మొదలవుతుంది. ఈ వాడా నిర్మాణం నాలుగు నెలలో పూర్తి అయి శ్రీరామ నవమి రోజున గృహప్రవేశం జరుగుతుంది. ఈ వాడాను కాకావాడా మరియు దీక్షిత్ వాడా అని పిలుస్తారు. దీక్షిత్ క్రింది భాగం యాత్రికులకు ఇచ్చి, పై భాగం తనకు వాడుకుంటారు.

ఓం శ్రీసాయి రాం!

Dixit Part -1

H.S Dixit attained an eminent position among Sai devotees. He is a role model and there is so much to learn from his life and the worship that he did for Sai Baba. Even though he was in worldly life until the age of 45, Sai made him advance in his spiritual life. Sai Maharaj protected him every second of his life so that he will not be a victim to the pressures of this mundane life. He helped him in daily family issues and his work related problems. He was not immune to the worldly problems that we all face every day. Sri Satcharita gives us some details about Dixit (Kaka Saheb) and later on some details were published in Sai Leela Masik (Journal). Sri Narasimha Swami gave some of the details about his personal life and other stories. Kaka Saheb also wrote a dairy.  His life fully revolved around Baba after his first meeting and we can relate to him as a common man. The greatness and what separated him from regular devotees, is his dedication. Even though he can earn fame, money and every thing in life, he ignored all of that to serve Baba. This is what we can learn from this great personality.

Birth, Family and job details:
His full name is Hari Sitaram Dixit. Baba used to call him Kaka. He was born in 1864 in Khandva, Madhya Pradesh. He belongs to Nagari Brahman sect. His primary education took place in Khandva and Hingan Ghat. He later went to Alfiston college in Bombay and received his LLB degree at the age of 19. Then he passed all the required exams and joined Littile & Co.  Then he started his own solicitors business.  He earned lot of fame and money.  He built a bungalow of his own in Lonawala.

He took some prominent cases in his life which includes the case of Freedom fighter Sri Bala Gangadhar Tilak, case of Times of India and Poona Vaibhav etc. He became prominent both in the eyes of British and in Indian national congress.  He was elected for Bombay counsel in 1901. In 1904, he was elected the 
Secretary of Indian National Congress. He became honorary position in Bombay University. He had so many high cadre positions that people can not imagine even getting there. His life took a turn when all of this has been going smoothly.

  In 1906 Dixit was visiting England. Dixit told him about his accident in London, when his foot slipped while boarding a train and was injured. The trouble that he suffered from could not be relieved inspite of hundreds of remedies. He was walking with a limp. If he walks for a while he used to get pain in his leg. This changes his life in travel and his psyche was also affected. Even though this was a handicap from the out side but this became a blessing for Dixit. He started thinking about his life and how transient things around us. He also started analyzing his priorities in his life. He was around 45 years of age at that time. He met Gurus like Datta Maharaj at that time. He started realizing that there is no happiness in worldly objects and wanted to understand the meaning of life.

First Meeting with Baba:
Once he goes on vacation to rest in his Bungalow in 1909. Nana Saheb Chandorkar happened to meet him for the first time after they got separated as classmates. Nana took government job and Dixit remained in his private practice as an attorney. They caught up with lots of issues about their past friendship. Then Dixit spoke to him about his accident in England, how it changed his life. Then Nana suggested him to go to Baba and told him that he will cure this lameness. Then Dixit said, “Nana this physical lameness is not bothering me but I want help with lameness in my mind. I need to meet my Guru, and I am longing for salvation. I did so much worship, sang bhajans (devotional singing) but my mind is still not at ease. I am trying to redirect my mind with out much success. Some one needs to cure lameness in my mind”.

The election of the then Legislative Council was the topic of conversation everywhere. The people were engaged in this work, in many places. Kakasaheb came suddenly to Nagar (Ahmednagar) to canvass for votes for him, and was meeting friends for that purpose. There was a chieftain there by the name of Kakasaheb Mirikar. Dixit had close family relations with him. He, therefore, stayed there with him. According to the custom of those times, an exhibition of horses was arranged at Nagar. Therefore, people from all walks of life were engaged in work connected with it. Balasaheb Mirikar, the Mamlatdar of Kopergaon, was present at Ahmednagar town for the exhibition. After Dixit’s work was completed, he came there. ‘How would it be possible to go to Shirdi? Who will take me there?’ Once the work had come to an end, his attention was on the way to Shirdi. Dixit’s intense desire was only for the opportunity to have Baba’s ‘darshan’. ‘Who will come with me? Who will take me before Baba and place me at his feet?’ These were Dixit’s dilemmas. Once the work for the elections was over, Dixit was only worried about how he would go to Shirdi. He respectfully requested Mirikar.

Balasaheb Mirikar was the son of Kakasaheb Mirikar. They discussed among themselves as to who should go with Dixit. If any one of them would accompany him, then there would be no need for another. Then who should definitely go with him, was being debated. Man thinks of ordinary solutions; but God plans something else. For Dixit’s journey to Shirdi, something unexpected happened. On this side, there was this turmoil. On the other side, observe the agitation. Knowing the strong desire of the devotee, see how Samartha yearned with compassion! While Dixit was driven by these thoughts and was seated, worrying about this, Madhavrao himself came to Nagar. Everyone was surprised.

The father-in-law of Madhavrao had telegraphed him from Nagar that his mother-in-law was gravely ill and he should come immediately with his wife. As soon as he received the telegram, he prepared to leave after obtaining Baba’s permission. Both of them went to Chithali station. They caught the 3 o’clock train and both went to Nagar. They took a tonga and got down at the door. At the same time, Nanasaheb Panshe and Appasaheb Gadre were also there, in connection with the exhibition and were passing by that road. As Madhavrao was alighting from the tonga, they saw him unexpectedly. They were quite surprised. They could not contain their joy. “Look at this! By good fortune Madhavrao, who is the sevakari of Vithoba temple, is here, from Shirdi! Who can be better than him to take Dixit to Shirdi? ” Then calling out to him, said: “Dixit Kaka has come to Mirikar’s. Go and see him. Marvel at Baba’s leelas! Dixit is our remarkable friend. You will get acquainted with him. He is very eager to go to Shirdi and your arrival will delight him.” Giving this message to Madhavrao, they gave the information to Dixit; whose anxiety was relieved on hearing it. He was extremely pleased. When Madhavrao visited his in-laws, he found that his mother-in-law was better. So he rested a little. Then Mirikar sent for him. Respecting the invitation, a little after sunset Madhavrao left to meet Dixit. When Balasaheb introduced him, it was his first m meeting. Both of them decided to take the 10 o’clock train, the same night. After this plan was decided, see what an unusual thing happened next. 
Balasaheb removed the curtain over Baba’s portrait This was a photograph of Baba which was worshipped by Megha, a true and great devotee of Baba, with the conviction that Baba was the holy, three-eyed Shankar, incarnate. Because the glass was broken, it was sent to Nagar with Balasaheb for repairs. That was how it initially left Shirdi. This picture, having been repaired, was in Mirikar’s drawing room, covered with cloth, as if it was waiting for Dixit. Balasaheb was to return it after the conclusion of the horse-show. But there was yet some more time for that. Therefore, he entrusted it to Madhavrao. Removing the cloth, he uncovered it. He gave it in Madhavrao’s keeping; and said: “Go up to Shirdi happily, in Baba’s company.”

When he first cast a glance at that portrait, which was pleasing in all aspects, Kakasaheb was filled with joy. After prostrating before it with reverence, he began to look at it. Experiencing this unusual incident, and seeing Sai Samartha’s photograph unexpectedly, which was so pleasing and pure, Dixit’s eyes were riveted to it. He was greatly delighted that he, for whose ‘darshan’ he was longing, his portrait embodying his form, could be seen by him, on the way itself. It was a strange coincidence that it was at Kakasaheb Mirikar’s
house, at the same time when Dixit was there, having come earlier from Shirdi. It seemed that SaiSamartha had come at Mirikar’s residence, under a pretext, to fulfil Dixit’s heartfelt longing. At Lonavala itself, the attraction for the Guru had taken place when he had met Nana and talked at length with him. It was the seed sown for the meeting. Otherwise why should this portrait from Shirdi have come here at this time and remained covered for so long at this place? So be it. After it was so decided, Madhavrao and Dixit, taking the picture with them, set out happily. They both left for the station after dinner, that same night. They paid the second-class fare and bought the tickets. Right at the stroke of ten, the sound of the train could be heard. They also saw that the second-class compartments were crammed with passengers. The situation was such that both of them were greatly worried. The time was also short. What arrangement could be made and how? Be it so. Now, because, of the overcrowding, both of them decided to return to their place and go the next day to Shirdi.

At that moment, Dixit saw the guard of the train with whom he had an acquaintance. He easily made arrangements for them to travel by the first class. Then, sitting in the train, they started talking about Baba, to their heart’s content. Madhavrao narrated the nectar-like stories. Dixit overflowed with joy. Thus that journey was completed very joyfully. Time passed very quickly. The train reached Kopergaon. They alighted in a very happy mood.

 At the same time, they unexpectedly saw Nanasaheb Chandorkar at the station. Dixit was full of happiness that they had met each other. Nana too had come for Baba’s ‘darshan’ and was proceeding to Shirdi. All the three of them were amazed at this coincidence. Then, the three of them hired a tonga and left on the way, animatedly talking. They had a bath in the Godavari, on the way, and reached holy Shirdi.

Later, after having Sai’s ‘darshan’ Dixit’s heart melted and his eyes filled with tears. The water of Self Bliss spilt and over flowed.

 “I too was waiting for you. Then I sent Shama to meet you, all the way to Nagar,” spoke Sai clearly to him.

Hearing these words, every pore in Dixit’s body was filled with joy; his throat was choked with emotion; his mind was full of happiness; and he was sweating profusely.

His body trembled; his mind was engrossed in Self Bliss; his eyes were half closed and he was immersed in a cloud of joy.

 “To-day my eyes have served their purpose”. Saying this he embraced Baba’s feet.

He felt truly blessed and the world could not contain his joy.

Later, years passed. His faith was firmly rooted at Sai’s feet. He attained Sai’s grace fully; and wearied his body in Sai’s service. To serve Sai well, he built a house or ashram in Shirdi and stayed there for many years. He spread Sai’s fame. In conclusion, whosoever longs for Sai is fulfilled by him. Sai is the abode of refuge for his devotees and the giver of ultimate joy to them.

Building Dixit wada:
After his first meeting with Baba in 1909 November, Dixit again came back to Shirdi in December for another darshan and thought of staying on. He had to stay in Sathe wada and could not find solitude. He first thought of disposing off some twenty-five shares of his to build a tin shed which would be useful also to the pilgrims. Later on he decided to build a wada and find the auspicious day for the laying of the foundation stone, in the following year. On the 9th December, he took Baba’s permission and considered that very day to be an auspicious one, for laying the foundation stone. Dixit’s brother, who otherwise would not have come even after an invitation, had arrived on that very day for the auspicious muhurat(Time). Dadasaheb Khaparde had already come there alone.


He felt awkward to ask Baba for permission to return home. But on the tenth of December, Khaparde was allowed to leave Shirdi and Dixit to lay the foundation – both these permissions were given on that day. Another important event took place on this day. The bed-time arati (Shej) at the Chavadiwas started on this day, with great love and faith. Later on, in 1911, the auspicious day ofRamnavami, the house-entering ceremony was accomplished according to the usual rites. They called this wada as Kaka wada or Dixit wada. He allowed the lower portion of the building to be used by the visitors and he kept a room for himself on the upper level.

OM SAI RAM!

Wednesday, January 20, 2016

నానా సాహెబ్ -3


Play Audio



సాయి తన దగ్గరకు వచ్చిన భక్తుల చిత్తంలో ఏముందో తెలుసుకొని, వారివారి పూర్వకర్మలను బట్టి, వారికి ఏ విధమైన బోధ చెయ్యాలో అది మాత్రమే చేసేవారు. అందుకే సాయిని ఒక సిద్దాంతానికి, ఒక మతానికి, ఒక ఆచారానికి చెందినట్లు చెప్పలేము. ఈ సకలసృష్టిలో భిన్నత్వం ఉంది. ఆ భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఈ ఏకత్వాన్ని అర్ధం చేసుకోవడమే మానవజన్మ యొక్క లక్ష్యం.

               నానాకు బాబా ఎన్నో బోధలు చేశారు. నానా ద్వారా సర్వమానవాళి ఉపయోగపడే మంచి ఉపదేశాలను బాబా మనకు ఇచ్చారు. నానా సామాన్యుడు కాదు, మంచి తత్వవేత్త, బాగా చదువుకొన్నవాడు ఆచారవ్యవహారాలను మిక్కిలి శ్రద్ధగా పాటించే వ్యక్తి. కాని మనలో మనకు తెలియకుండా కొన్ని నిక్షేపాలు దాగి ఉంటాయి. అవి గురువు మాత్రమే బయటికి తీయగలరు. బయటకు తీసి వాటిని సమూలంగా నాశనం చెయ్యగల శక్తి ఒక్క గురువుకే ఉంది. మనమందరం కామ, క్రోద మధ మాత్సర్యములకు బానిసలమే. ఈ అరిషట్‌వర్గములు అందరిని లొంగ తీసుకుంటాయి. ఇవె మన అధ్యాత్మిక ప్రగతికి అడ్డుపడతాయి. అందుకే బాబా వీటికి సంబందించిన లీలలు చేసి నానాకు నేర్పించకుండా నేర్పించారు. బాబా భగవద్గీత శ్లోకానికి చక్కటి అర్ధం చెప్పి నానాలో ఉన్న అహంకారాన్ని పారద్రోలాడు. ఆ తరువాత బాబా యొక్క పరిజ్ఞానం అర్ధం చేసుకుని నానా ఈ విధంగా బాబాను కోరాడు. బాబా ఇన్నాళ్ళు నాకు భగవద్గీత తెలుసు అనుకున్నాను కాని నాకు ఆ గీత అర్ధం కాలేదని తెలిసింది. నాపై దయయుంచి నాకు భగవద్గీత అంతా రోజు కొంచెం చెప్పండి. అని అడుగుతాడు.

               అప్పుడు బాబా. నానా నేను బోధించేది ఏమీలేదు. రోజు నా దగ్గరకురా నీవే అర్ధం చేసుకుంటావు అని అంటారు. ఆ తరువాత నానా రోజు బాబా దగ్గర కూర్చుని బాబా ఏమి బోధించకుండా భగవద్గీతలోని గూడార్ధములను నేర్చుకున్నాడు. ఇదే బాబా ప్రత్యేకత. బాబా మౌన వాక్య చేస్తారు. అంటే మౌనంగానే మనకు అది అర్ధం అయ్యేలా చేసి, మన జీవితంలో మార్పు తీసుకువస్తారు. దీన్నే దక్షిణామూర్తి విధానమంటారు. ఆ ఆదిగురువు సనక సనందాదులకు మౌనంగానే బ్రహ్మజ్ఞాన బోధచేసారు. అందుకే బాబాను దక్షిణామూర్తిగా మనం ధ్యానించాలి. బాబా మానసిక పరివర్తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. మనం ఎన్ని గ్రంధాలు చదివినా ఆ సద్గురువుల కృపలేనిదే మనం కొంచెం కూడా ముందుకు వెళ్ళలేము. సాయి కోరిన శ్రద్ధ, సబూరి ఉంటే చాలు పెద్ద పర్వతాలనైన కదిలించవచ్చు.
 
               ఒకసారి నానా ద్వారకామాయిలో కూర్చుని ఉండగా, మహల్సాపతి మరియు బాబా ఏదో సంబాషణలో ఉన్నారు. ఇంతలో ఒక గృహస్తుడు వైజాపురం నుంచి బాబా దర్శనార్ధం వచ్చాడు. అతనితో స్త్రీలు ఘోషా (అంటే ముసుగు) దరించి ఉన్నారు. వారిని చూచి నానా అక్కడ నుంచి లేచి వెళ్ళబోతుంటే బాబా నానాను వారించి కూర్చోమంటారు. వారిలో ఒక స్త్రీ బాబాకు వందనం చేస్తున్నప్పుడు ఆమె ముఖముపై ముసుగు తొలగింది.
ఆమె సౌందర్యానికి నానా మనసు చలించింది. మరల ఆమె ముఖం చూడాలి అని అనిపించింది. అలానే దొంగచూపులతో చూస్తాడు. కాని బాబా దగ్గర తన మనసు దారి తప్పటంతో నానా చాలా సిగ్గుపడ్తాడు. బాబా ఆయనను తొడమీద కొట్టి నేను ఎందుకు కొట్టాను? అని అడుగుతారు. అప్పుడు నానా, బాబా మీకు తెలియంది
ఏముంది. నా మనసు మీ సమక్షంలో కూడా ఎందుకు చలించింది. అని అడుగుతాడు. అప్పుడు బాబా! నానా నీ మనసు ఎందుకు కలవరపడుతోంది? ఇంద్రియాలు వాటి ధర్మం ప్రకారం నడుచుకొంటాయి, వాటిని ఎందుకు అడ్డగించాలి? వాటి వల్ల మనకు ఎటువంటి హానిలేదు. బ్రహ్మదేవుడు సృష్టికర్త. అతని రచనను మనం ఆస్వాదించాలి. లేకపోతే ఈ సృష్టి వైశిష్ట్యం వ్యర్ధమై పోదా? ఈ సృష్టి, సృష్టిగానే ఉంటుంది. మనసు క్రమంగా శాంతిస్తుంది. మనకు ఎన్నో అందమైన దేవాలయాలు చక్కటి రంగులతో ఉన్నాయి. మనము దేవాలయాల బాహ్య సౌందర్యం కోసం వెళ్తామా లేక లోపల ఉన్న భగవంతుడి కోసం వెళ్తామా. బాహ్యసౌందర్యాన్ని ఆస్వాదిస్తూ లోపలనున్న దేవుడ్ని గుర్తు చేసుకోవాలి. అలానే భగవంతుడు ఒక్క దేవాలయంలోనే లేడు, అన్ని ప్రాణులలో ఉన్నాడు. కాబట్టి నీవు ఒక అందమైన ముఖము చూసినప్పుడు దానిలోని సౌందర్యంతో పాటు ఆ అందాన్ని ఇచ్చిన భగవంతుడ్ని ఆ అందంలో చూడు. ఇంత అందాన్ని సృష్టించిన ఆ భగవంతుడు ఎంత శక్తి వంతుడో అర్ధం చేసుకో. ఇలా బాబా ఎంతో చక్కటి బోధచేసి నానాలోని ఆలోచనలకు అర్ధం చెప్పారు.  
 
               ఆ తరువాత నానా ఈ బోధన ఆచరణలో పెట్టి తన మనసుపై విజయం సాధిస్తాడు. ఇప్పుడు ఆ కథను మనము చెప్పుకుందాము.

బన్నూ మాయి కథ 
               బన్నుమాయి అనే 20 ఏళ్ళ ముస్లిం యువతి బోడేగావ్ అనే ఊరిలో ఉండేది. ఆ ఊరు అహ్మద్‌నగర్‌కు 50 మైళ్ళ దూరంలో ఉండేది. ఆమె నగ్నంగా అక్కడ ముళ్ళ పొదల్లో అడవి ప్రాంతంలో తిరుగుతూ ఉండేది. ఆమె పిచ్చిదని అందరూ అనుకునేవారు. ఆమె తల్లి బన్నుమాయి పిచ్చి కుదరటం కష్టమని ఆశలు వదులుకొంది. కాని కొంతమంది మాత్రము ఆమె ఒక దివ్యాత్మ అయి ఉంటుంది అని అనుకునే వారు. ఆమెకు శరీర స్పృహ ఉండేది కాదు. ముళ్ళు గుచ్చుకుని నెత్తురు వస్తున్నా ఆమె పట్టించుకోకుండా తిరుగుతూ ఉండేది. నానాకు ఈ విషయం తెలిసి ఆమె దర్శనం చేసుకోవాలి అనుకొన్నాడు. బాబాను అనుమతి అడిగాడు. మొట్టమొదట బాబా వద్దన్నాతరువాత కలవమని చెప్తారు. నానా ఇంకొకరితో కలసి చీర పసుపు, కుంకుమ, గాజులు మరియు ఆహారం తీసుకొని వెళ్తాడు. వారు ఒక గుడారం వేసి ఆమె దర్శనం కోసం వేచి ఉంటారు. కాని ఆమె జాడ తెలియలేదు. అక్కడ వాళ్ళను ఆమె గురించి అడిగితే వారు నానాను అనుమానించి, విసుక్కుంటారు. తరువాత నానా బాబాను తలుచుకుంటాడు. కళ్ళు తెరవగానే బన్నుమాయి తన ఎదురుగ నిలబడి ఉంది. ఆమెకు నమస్కరించి, చాలా భక్తితో ఆమె కాళ్ళలో ఉన్న ముళ్ళు తీస్తాడు. ఆమె వెంటనే మాయమవుతుంది. నానా తను తెచ్చిన వస్తువులను ఆమె స్వీకరించి ధరించాలి అని కోరుకుంటాడు. మళ్ళీ బాబాను ప్రార్ధిస్తాడు. ఆమె మరల ప్రత్యక్షం అయి తను తెచ్చిన బట్టలు కట్టుకుని, అక్కడ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతుంది.

               నానా అక్కడ దేవాలయంలో తలుపులు వేసుకుని, తెల్లవారిన తరువాత వెళ్ళవచ్చు అనుకొంటాడు. తను ఆ పార్వతి మాతను దర్శించినంత ఆనందంతో మరల ఒక్కసారి ఆమె దర్శనం కలిగితే బాగుండు అనుకొంటాడు. మరో నిముషంలో ఆమె నానా ముందు ప్రత్యక్షం అవుతుంది. గుడి తలుపులు వేసినవి వేసినట్లే ఉన్నాయి, కాని ఆమె లోపల ప్రత్యక్షం అయింది. ఆమెకు భక్తి పూర్వకంగా నమస్కరించి ఆమె పాదాలపై మోకరిల్లుతాడు. నానాలో ఏదో తెలియని ప్రశాంతత, నిర్మలత్వం చోటు చేసుకున్నాయి. ఆమె మరల అదృశ్యమైంది. ఈ విధంగా నానా తన మనసులో ఎటువంటి భావోద్రేకం లేకుండా భక్తి భావనతో బాబా భోదించిన తీరులో తనలోని మనో చాంచల్యాన్ని అధిగమించాడు. సద్గురుసాయి ఎంతటి దయామయుడో ఎంతటి కరుణ చూపిస్తారో మనం ఈ సందర్భాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయాలను మనకు అందించిన శ్రీ నరసింహస్వామి  గారికి మనం ఎంతో ఋణపడి ఉన్నాము. ఆయన ఎంతో మంది సాయి భక్తులను కలసి సేకరించిన విషయాలు మనలాంటి సాయి భక్తులకు ఆయన ప్రసాదించిన వరం.

అట్లానే శ్రీ నరసింహ స్వామి గారు చెప్పిన మరో సన్నివేశం ఇప్పుడు మనం చూద్దాము.
               నానా బాబాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. నానా మంచి విద్యావంతుడు. బ్రాహ్మణ కుటుంబంలో నున్నవాడు. బాబాతో ఉన్న ఈ సఖ్యతను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోతాడు. బాబా ఆరతి సమయంలో వందల మంది నిలబడి ఆరతి పాడేవారు. ఉపాసని బాబా, బాపు సాహెబ్‌జోగ్ మొదలైనవారు కూడా నిలబడి ఆరతిలో పాల్గొనేవారు. నానా మాత్రం బాబా పక్కనే కూర్చుని ఆరతిలో పాల్గొనేవారు. అట్లానే బాబా తీర్ధం కూడా అందరూ తీసుకునే వారు. నానా మరియు దాసగణు మాత్రం తీర్ధం తీసుకునేవారు కాదు. బాబాకు ఆరతి దగ్గర నిలబడటం తీర్ధం తీసుకోవడం ముఖ్యం కాదు. కాని గురువులో దైవాన్ని గుర్తించడం ముఖ్యం. ఇదే నానాకు నేర్పించాలి అని అనుకున్నారు.

               నానాకు 8 పూరే పోలిలు తయారుచేసి నైవేద్యంగా తెమ్మంటాడు. నానా చాలా భక్తితో చేసుకుని వచ్చి బాబా ముందు ఉంచుతాడు. బాబాను తినమని ప్రార్ధిస్తాడు. కాని బాబా ఏమి తినకుండా కూర్చుంటారు. మళ్ళీ నానా, బాబాను తినమని అర్ధిస్తాడు. బాబా అప్పుడు నేను తినను, నీవు దీన్ని ప్రసాదంగా తీసుకు వెళ్ళు అని అంటారు. నానా వాటి మీద ఉన్న ఈగలను చూస్తూ అసహనంతో వాటిని తీసుకొని వెళ్తాడు. బాబా మరల నానాను పిలిపిస్తారు. నానా వచ్చి మీరు నేను పెట్టిన నైవేద్యం ఎందుకు స్వీకరించలేదు అని ప్రశ్నిస్తాడు.

               అప్పుడు బాబా, నానా నాతో 18 ఏళ్ళు ఉన్నావు. నన్ను అర్ధం చేసుకున్నది ఇంతేనా, బాబా అంటే ఈ శరీరం మాత్రమే అనుకున్నావా? నేను దాని మీద ఈగలో లేనా? అక్కడ ఉన్న చీమలో లేనా? అని అంటారు. అప్పుడు నానా ఆ విషయం నాకు తెలుసు, కాని నాకు ఇది అనుభవంలోకి లేకుండా ఎట్లా దృడపడుతుంది. దేవుడు, గురువు సర్వంతర్యామి అని తెలుసు కాని నాకు ఆ అనుభూతి కలుగలేదు. అప్పుడు బాబా తనచేతిని గాలిలో తిప్పుతారు. అంతలో నానాకు ఒక అనుభూతి కలుగుతుంది. కాని నానా ఆ రహస్యాన్ని ఎవరికి చెప్పలేదు. కాని అనుభూతి పొందానని మాత్రం వెళ్ళడించారు.

               ఈ విధంగా బాబా మరొక్కసారి తను మౌనభొద చేసే వారే కాని, మాటల్తో చెప్పేవారు కాదు అని నిరూపించారు. ఇలా నానాకు ఎన్నో అనుభవాల్ని ఇచ్చి, తను అధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళేందుకు చేయూతనిచ్చారు. నానా 1921లో పూణాలో దేహత్యాగం చేశారు.


               మనకు మన ఆచార వ్యవహారాలు, మనం మంచి అలవాట్లు అనుకునే సంప్రదాయాలు, విద్యావాసన (అంటే శాస్త్రాల పరిజ్ఞానం) ఒక్కోసారి అడ్డుగోడలు అవుతాయి. నానా విషయంలో కూడా ఇవే ఆటంకాలు అవుతాయి. కాని బాబా సర్వజ్ఞులు వారికి సర్వం తెలుసు. ఒక సాధకుడ్ని ఏ మార్గంలో నడిపించాలి, ఏమి అడ్డుపడుతున్నాయి, ఏమి అవసరమో అది మాత్రమే నేర్పించేవారు బాబా . అన్ని జబ్బులకు ఒకే మందు ఇచ్చే గురువులు ఎంతోమంది ఉండవచ్చు. కాని బాబా తత్వమే వేరు. అసలు ఒక తత్వము అని చెప్తే అది తప్పే అవుతుంది. సద్గురువులు సాధకుడికి తగ్గ మందుని ఇచ్చి, ఈ ఆది వ్యాదులనుంచి రక్షిస్తారు. ఈ భవసాగరాన్ని దాటించే అద్భుతశక్తి సద్గురువు.

ఓం శ్రీ సాయి రాం!