In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, April 27, 2016

సాయి నేర్పిన సత్యం




సాయినామమే పవిత్రం, సాయి భోదలే విచిత్రం. సాయినామాన్ని తలచినంత మాత్రమే మనస్సుకి శాంతి లభిస్తుంది. సాయి అంటే సాక్షాత్ ఈశ్వరుడని మనము చెప్పుకోవచ్చు, కాని బాబా తనే పరా శక్తి అని చెప్పారు. బాబా ఒకరోజు మథ్యాన్న ఆరతి అయిన తర్వాత ఇలా చెప్పారు.

మీరెక్కడ ఉన్నా, ఏంచేస్తున్నా మీ చర్యలన్ని ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తించుకొండి. నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాణ్ణి అంతటా చరించే వాణ్ణి. ఇలా నేను అందరికి స్వామిని.  లోపల బయట నేను, చరాచర సృష్టిలో అన్ని ప్రాణిలలో నిండి మిగిలి ఉన్నాను. ఇదంతా పరమేశ్వరునిచే నియమింప బడింది. దానిని నడిపించే సూత్రధారిని నేనే. నేను సకల ప్రాణులకు తల్లిని. ఆ గుణాల సౌమ్యావస్థను. సకల ఇంద్రియాలను నడిపించే వాణ్ణి నేనే. సృష్టి, స్థితి, లయ కారకుణ్ణి నేనే, నా యందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు. నన్ను మరిచి పోయినవారిని మాయ కొరడాతో కొడుతుంది. ఈ దృశ్య జగత్తు నా రూపం. అంటే చీమ, దోమ, క్రిమి కీటకం, రాజు, పేద, స్థావర జంగమాలు ఈ జగత్తంతా సాయి యొక్క స్వరూపం.

బాబా తనే సర్వప్రాణులకు తల్లిని, పరాశక్తిని అని చెప్పారు. పరాశక్తి అంటే త్రిగుణాతీతమై ఏ శక్తి అయితే ఉందో అదే ఆ శక్తి. అందుకే బాబా త్రిగుణాల సౌమ్యవ్యవస్థను నేనే అని చెప్పారు. ఈ సత్వ రజ  తమో గుణాలకు అతీతమైన స్థితే  ఆ శక్తి, ఈ త్రిగుణాలతో కలసినప్పుడు, దానికి ఒక రూపం ఏర్పడుతుంది. సాయి బోధలు ఈ జీవితానికి ఎంతో అవసరం. అవి మనలను సరియైన దారిలో నడిపిస్తాయి.

సాయి సకల దేవతామూర్తుల సమాహారం. భగవంతునిలో ఉన్న సర్వ గుణాలతో అవతరించిన సంపూర్ణ అవతారం. ఆయన తన సగుణ రూపాన్ని ధ్యానించమన్నారు కాని మన దృష్టి ఆయన నిర్గుణ రూపంపై ఉండాలి అని కూడా చెప్పారు. ఈ నిర్గుణ రూపం అర్ధం చేసుకోవాలంటే అసలు ఈ గుణాల గురించి తెలుసుకోవాలి. గుణము అంటే మనలో ఉన్న ప్రకృతి స్వభావమైన తత్వము. కాని మన అసలు తత్వమేమో సచ్చిదానంద స్థితి. కాని మనము సత్వరజో మరియు తమో గుణాలను మన తత్వంగా భావిస్తాము. ఈ మూడు గుణాలు మనలో ఇమిడి పోయి ఉన్నాయి. మన మానసిక స్థితి ఈ మూడు గుణాలు ఏ పాళ్ళలో ఉన్నాయో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి మన స్వభావం నిర్ణయించబడుతుంది. మన జీవితంలో కలిగే మార్పులు కూడా ఒక్కోసారి వీటిని భిన్నంగా చూపించడం జరుగుతుంది.

బాబా మనకు నేర్పినది ఏమిటి అంటే ఈ ప్రపంచాన్ని భగవంతుడు నిర్మించినట్లుగా చూడడం. అంతేకాని మనం ఇష్టం వచ్చినట్లుగా దాన్ని మార్చడానికి ప్రయత్నించకూడదు. ఈ సాధనలో కావాలసిన రెండు ఆయుధాలు శ్రద్ధ, సబూరి. మనకు నమ్మకం దృఢంగా ఉంటే దాని వెనకే సహనము అంటే సబూరి కూడా వస్తుంది. ఈ రెండు మన జీవితంలో ఉన్నంత వరకు మనము ఎట్లాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కోవచ్చు.

ఇప్పుడు మనము ఒక ఉదాహరణ చెప్పుకుందాము. పాలను తీసుకొని దానిలో కొన్ని చుక్కలు నీళ్ళు కలుపుదాము. పాలు స్వభావం ఏమి మారదు. ఆ నీళ్ళను మనం గుర్తించలేము. తరువాత మరి కొంచం నీళ్ళు కలుపుదాము. అప్పుడు కూడా పాలు పాలుగానే కనిపిస్తాయి. చాలా నీళ్ళు కలిపాము అనుకొండి. అప్పుడు ఆ పాలు పలుచగా ఉంటాయి, నీళ్ళు కలిపినట్లు తెలుస్తుంది. అలానే మన నిజ స్వభావం పాల వలే స్వచ్చమై ఉంటుంది. అదే సచ్చిదానంద స్థితి. దానికి కొన్ని చుక్కలు నీళ్ళు కలపడం అంటే సత్వ గుణాన్ని జోడించడం. మరికొన్ని నీళ్ళు కలుపుకుంటూపోతే అవి పల్చబడి రజోతమో గుణాలు స్పష్టంగా బయటపడ్తాయి. కాని దుస్థితి ఏమిటి అంటే? మనము బాగానే ఉన్నామన్న భ్రమలో ఉంటాము. కాని ఎదుటి వాళ్ళకు మన లోని లోపాలు తెలుస్తాయి. వాళ్ళకు తెలుసు మన పాలు పలుచగా నీళ్ళు కలుపబడి ఉన్నాయని. ఈ రజో తమో గుణాలు మన దారికి అడ్డుగా నిలబడి మన జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తాయి.

బాబా ఎప్పుడూ చిన్న చిన్న కథలతో, మామూలు మాటల్లో ఈ సత్యాన్ని మనకు బోధించడానికి ప్రయత్నించారు. ఆయన మన నిజ జీవితాన్నే ఒక ఉదాహరణగా చూపించారు. ఆయన కూడా మనిషి రూపంలో అన్ని రకాల బాధలను, సుఖాలను అనుభవించినట్లుగా మనకు కనిపించారు. చూసినవారు ఆయనను ఒక సామాన్యుడిగా లేదా పిచ్చి వాడుగా కూడా అర్ధం చేసుకున్నారు. కాని ఆయన ఎప్పుడు ఆయన నిజ, సత్యమైన సచ్చిదానంద స్థితిలోనే ఉన్నారు. ఆయన సర్వాంతర్యామి. భగవంతునిగా సకల కళా వల్లబుడిగా దర్శనమిచ్చారు. అలానే నిర్గుణ తత్వం కూడా చూపించారు. మన పూర్వ వాసనలను బట్టి మన ఆలోచనా విధానాన్ని బట్టి ఆయన వివిధ రూపాలలో దర్శనం ఇచ్చారు. రాముడుగా, విఠలుడుగా, గణపతిగా, హనుమగా, దత్తుడిగా ఇలా ఎన్నో రూపాలతో కనిపించారు. ఆయన ఎప్పుడు తన పేరు ఇదని చెప్పలేదు. మహాల్సాపతిచే సాయి అని పిలవబడి యావత్ ప్రపంచానికి సాయిబాబాగా ఉండిపోయారు. భగవంతుడ్ని ఏ పేరుతో పిలిస్తే మాత్రం ఏమి? అన్ని పేర్లు ఆయనవే. బాబా సర్వరూపాలలో తననే చూడమని బోధచేసారు. సాయి గురించి ఏమని చెప్తాము. ఆయన ఈ త్రిగుణాలకు అతీతమైన పరమేశ్వర స్వరూపము.


మనము ఎప్పుడైతే ఈ సాయి తత్వాన్ని అర్ధం చేసుకుంటామో అప్పుడు ఈ జీవితంలో మార్పులు రావడం అనివార్యం. ఆయన చేసిన బోధలు వింటానికి చాలా సాదారణంగా ఉన్నా వాటి వెనుక జీవిత సత్యాలు, ఆధ్యాత్మిక సత్యాలు ఉంటాయి. మన మనో స్థితిని బట్టి మనం వాటిని అర్ధం చేసుకో గల్గుతాము. కాబట్టి సాయి బందువులారా, మనందరం సాయి బాటలో నడుద్దాము, మన జీవితాలను మార్చుకుందాము. సాయిని మనము ఎన్నో కోరికలు కోరుతాము. ఆయన మన కోరికలు తీరుస్తారు. కాని ఆయన మన నుంచి అడిగినది ఇది ఒక్కటే, ఈ సత్యం తెలుసుకోమని.  సాయి తత్వమే సచ్చిదానంద స్వరూపము.



ఓం శ్రీ సాయి రాం !

The truth behind Sai's teachings


Sai’s name is so pure, just by chanting the name, will bring peace to mind. Sai means “Saakshat Eeswara” (The divine God). Baba said that he is Parasakthi (universal energy). 

What is Parasakthi? What ever is beyond the three gunas (satva, Raja and Tamo Gunas) that is characters of the universe, is called as Parasakthi. When this supreme energy along with these three characters, takes a form then we give a name to it. Why Sai’s teachings are essential to life? Why they make us walk in a correct path?   

Once, after the noon Arati, when people started returning home, Baba spoke sweet words. It goes like this.  
“Wherever you are, and whatever you may be doing, always bear it in mind that I shall continue to be informed of the minutest details of your deeds. In this manner, as I am described, I dwell in the minds of all. I am in the hearts of all, all pervading. I am the Lord of all. I fill the entire creation, within and without, to the point of overflowing. This universe is directed by God and I am the one who holds the reins. I am the Mother of all beings. I am the equilibrium of the three gunas15. I promote the activities of the senses. I am the Creator, the Preserver and the Destroyer. One who concentrates on ME, for him nothing is difficult. But the moment he forgets ME, Maya will attack him. Whatever is perceived is my image only, whether it be a worm, an ant, a poor wretch or a king”. This immeasurable universe, consisting of mobile and immobile things – these are Baba’s own image.

Sai is an embodiment of all the Godly characters. He himself is perfection. Sai wanted us to see his Saguna rupa (human form) but he also said that our focus should be on his Nirguna rupa (Form less energy). What does he really mean? For this we need to understand what Guna means. Original meaning in Sanskrit is “inherent nature”. We learned to see these gunas in different ways. These Satva, Rajo and Tamo gunas are mixed in various proportions with different permutations and combinations. Depending on the ratio, our behavior manifests. The circumstances also bring about some changes in us. Baba wanted us to see the world as it is. What this means? To understand this, only two things are essential. Faith that is belief and once we believe we need patience to materialize that. This applies perfectly in our daily life.

Now let us see an example. We take milk, we add little bit of water –few drops. This is not going to change much the way the milk looks. We can not detect the few drops of milk that we put in. Then we add more water in to it. Still milk is milk; we cannot detect water. If we mix more water then one might say the milk is diluted.

In our lives we originally have milk in the form of God, Soul, and Truth- Satchidananda.

What are we doing? Basically we are adding too much of these three Gunas.

If we add Satva Guna it is like few drops of water. If we keep adding more water – that means adding Rajo Guna and Tamo guna. Then every one can say that we are diluted milk. Even then we feel that we are OK. This is a pity.

So we have to realize that we are diluted with these obstructive qualities which will hinder our happiness and block us from reaching our destiny.

Sai taught us love, honesty, faith, patience, humbleness, truthful behavior and service. If we take Sai Satcharita and devotees experiences, we can see different angles where Baba tried to bring changes in their lives. He wanted change the way they behave and change their patterns and habits.

Why he has to do this? This is very essential he wanted us to experience our own nature that is pure bliss. If we deviate from our own nature, we suffer. This is nothing but Maya (illusion). We are always presented with some choices in our lives. We have to assess them and if we deviate we need to get back to our original nature. We can not get tempted by Rajo guna or tamo guna. If we experience pain in our lives, we have to visualize what qualities are disturbing us. Just by understanding this, suffering eases.

Milk is always milk, no matter how much water is added. Our Saints are called Parama  Hamsas. Hamsa means Swan. They say that Swan has quality where it can separate milk and water. It can drink only milk leaving water behind. The saints can separate the three gunas and the Truth.

Baba taught us this great truth, by simple words, stories and making us experience the truth in various circumstances of life. Baba lived like us and experienced all the emotions. People saw him with all the characters a human being can experience.  People could have misunderstood him being mad and emotional. But he always stayed in this truth – Satchidananda. He was omnipresent and omniscient. He showed all the qualities of God and he was also in Nirguna (formless) state.

Depending on our Gunas (characters), past impressions, past deeds and spiritual inclination, he appeared in that form. That’s why people saw him as Lord Rama, Hanuman, Datta, Krishna, Vittal and many other forms. He did not even present with a name. Mhalsapati called him with a name “Sai”. All forms and names are in him. He was able to love everyone and there were no enemies. He wanted us to see him in animals, living and nonliving things also. He even gave darshan as Nirguna (form less) like a light to one of the devotees.

So what can we say about Sai? Sai is everywhere and he is that universal energy beyond all the characters.


OM SAI RAM!

Wednesday, April 20, 2016

హాజీ ఫాల్కే కథ




ఆథ్యాత్మిక మార్గంలో ఉన్నవారు. అహంకార రహితంగా ఉండాలని కోరుకుంటారు. కాని ఈ మనో బుద్దులను దాటటం చాలా కష్టతరం. ఈ దారి కష్టమైనా, దుర్లభమైనా నిరుత్సాహ పడవలసిన పనిలేదు. సద్గురువుల కృప ఉంటే ఏదైనా సాధించవచ్చు. కాని మనకు భగద్గీతలో ఇలా చెప్పబడింది.

అహంకారం బలం దర్పం కామక్రోధం పరిగ్రహమ్|
విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మ భూమాయ కల్పతే||

అహంకారమును, కామక్రోధములను పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యాన యోగ పారాయణుడై యుండువాడు మమతా రహితుడు, శాంతి మంతుడు అయిన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మము నందు భిన్నభావంతో స్థితుడగుటకు పాత్రుడగును.

శరీరేంద్రియ అంతః కరణముల యందు ఆత్మ బుద్ది కలిగి యుండుటను అహంకారం అని అందురు. ఈ కారణము వల్ల మనస్సు బుద్ది, శరీరముల ద్వారా చేయబడు కర్మలకు మనుష్యుడు తనను కర్తగా భావించును. కనుక ఈ దేహాభిమానములను త్యజించుటయే అహంకార రహితంగా ఉండటం అని అంటారు. ఈ విషయములను నేర్పేందుకే బాబా హాజీ  ఫాల్కే ను కొన్ని రోజులు దూరంగా ఉంచి, తరువాత దగ్గరకు తీయడం జరిగింది. ఈ కథను దానిలోని గూడార్ధాలను ఇప్పుడు మనము చెప్పుకుందాము.

ఒకసారి కళ్యాణి నివాసియైన సిద్దిక్ ఫాల్కే అనే ముస్లిం, మక్కమదీనా యాత్రలు చేసి షిర్డికి రావడం జరిగింది. ఆ వృద్దుడైన హాజీ ఉత్తరాభిముఖంగా ఉన్న చావడిలో దిగాడు. బాబా దర్శనం చేసుకోవాలని అని అనుకుంటాడు. కాని తొమ్మిది నెలలు అయినా బాబా అతనిని ద్వారకామాయిలో అడుగు పెట్టనివ్వలేదు. ఫాల్కే దుఃఖానికి అంతేలేదు. ఇదేమిటి ద్వారకామాయి తలుపులు అందరికి తెరిచే ఉంటాయి కాని ఏమిటి నా కర్మ నేనేం పాపం చేశాను అని అనుకుంటాడు. ఎవరో శ్యామాను పట్టుకుంటే పని జరుగుతుందని చెప్తే ఆశతో ఆయనను సంప్రదించాడు.ఫాల్కే శ్యామాతో ఇలా అన్నాడు. ఒకసారి నా తపనను తొలగించు, దుర్లభమైన బాబా దర్శనాన్ని కలిగించు అని బ్రతిమాలాడు. అప్పుడు శ్యామా బాబా దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. దేవా! ఆ వృద్దుడు చాలా భాద
పడుతున్నాడు అతనిని కరుణించండి, హాజీ మక్కామదీనా యాత్రలు చేసి షిర్డికి తమ దర్శనార్ధమై వచ్చాడు. అతనిపై దయ చూపడం లేదు ఎందుకు? అతనిని మసీదులోకి రానివ్వండి. జనులు అసంఖ్యాకంగా వచ్చి మసీదులో మీ దర్శనం చేసుకొని వెళ్తున్నారు కదా! మరి ఇతని విషయంలో విషమ భావం ఎందుకు? ఒక్కసారి మీ కృపా దృష్టిని ప్రసరించండి. అతనిని మసీదులో మిమ్మల్ని కలుసుకోనివ్వండి. తన మనసులోని మాటను చెప్పుకొని వెళ్ళిపోతాడు.
అప్పుడు బాబా శ్యామా! నువ్వు ఇంకా ముక్కుపచ్చలారని పసివాడవు అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే అతనిని నేనేం చేయగలను. అల్లామియాకు ఋణపడి ఉండకపోతే ఎవరైన మసీదు ఎక్కగలరా? ఇక్కడి ఫకీరు లీల అపూర్వం. నేను అతనికి యజమానిని కాను, ఇంకా ఈ సంభాషణ ఇలా సాగుతుంది.  

బాబా అడిగిన ప్రశ్నలకు హాజీ  సమాధానాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ సంభాషణ శ్యామా మద్యవర్తిగా జరుగుతుంది.

బాబా : సరే అక్కడ బారవి బావి సమీపంలో వెనుక వైపున ఇరుక బాట ఉండి. అతడు ఆ మార్గంలో వస్తాడా అని వెళ్ళి స్పష్టంగా అడుగు అని అన్నాడు.
హాజీ  : ఎంతటి కష్టమైన మార్గమైన వస్తాను, నేను వారిని ప్రత్యక్షంగా కలుసుకోవాలి నన్ను వారి చరణాల వద్ద కూర్చోనివ్వాలి.
బాబా : నాలుగు వాయిదాలతో నాకు నలభై వేల రూపాయలను ఇస్తాడా!
హాజీ  : ఈ మాట అడగాలా, వేలు ఏమిటి, అడగాలేకాని నలభై లక్షలైనా ఇస్తాను.
బాబా : ఈ రోజు మా మసీదులో మేకను కోయాలని ఉంది. మరి నీకు మాంసం కావాలా! ఎముక మాంసం కావాలా లేక వృషణాలపై కోరికా? ఆ ముసలి వాణ్ణి నిశ్చయంగా ఏది కావాలో వెళ్ళి అడుగు.
హాజీ  : ఇవేమి నాకు వద్దు. వారికి ఇవ్వాలని ఉంటే నా కోరిక ఒక్కటే    కొళంబో లోని  ఒక ముక్క లభిస్తే చాలు కృతజ్ఞుణ్ణి అని చెప్పాడు.

ఇది విని బాబా ఉగ్రులయ్యారు మట్టి పాత్రను, నీళ్ల కుండను స్వయంగా పైకి ఎత్తి ద్వారం వైపు విసిరివేసారు. తమ చేతిని కరకరా కొరుకుతూ హాజీ  దగ్గరకు వచ్చారు.

బాబా తమ కఫినీని రెండు చేతులా పట్టుకుని నీ మనసులో ఏమనుకుంటున్నావు?  నా ముందా,  నీ ప్రతాపం. ముసని వానిలా బడాయి చూపిస్తున్నావు. ఇలాగేనా ఖురాను పఠించడం? మక్కా యాత్ర చేసానని గర్విస్తున్నావు గాని నన్ను ఎరుగలేకున్నావు. ఇలా ఆయనను మందలించి బాబా అక్కడ నుంచి వెళ్తారు. 

హాజీ  గాబరా పడ్తాడు. మసీదు ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ తోటమాలి మామిడి పళ్ళను అమ్మడం చూసారు. మొత్తం బుట్టను కొని హాజీకి  పంపించారు. వెంటనే వెనుదిరిగి మరల ఆ హాజీ  వద్దకు వెళ్ళారు. తమ జేబులో నుండి డబ్బు తీసి 55 రూపాయలను లెక్క పెట్టి అతని చేతిలో పెట్టారు. అప్పటి నుండి అతనిపై ప్రేమ కలిగి అతనిని భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరూ అంతా మరచి పోయారు. హాజీ ఆత్మానందంలో లీనమైపోయాడు.

ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలను పరిశీలిద్దాము.

బాబా హాజీ  మధ్య జరిగిన సంభాషణలలో ఉన్న అర్ధం ఏమిటి? సద్గురువులకు మాత్రమే ఇది అర్ధం అవ్వాలి.
బాబా బారవి బావి దగ్గర ఉన్న ఇరుకు మార్గం దగ్గరకు రమ్మన్నారు. బారవి బావి అనేది షిర్డిలో ఉన్నట్లుగా చెప్పలేదు. బారవి అంటే 12, ఇది ఆధ్యాత్మిక మార్గంలో కావాలసిన 12 సాధనాలు. ఇరుకు మార్గం అంటే శమధమాది సాధనాలతో, వివేక వైరాగ్యములతో, శ్రద్ద సబూరిలతో, మనస్సును నిర్మలం చేసి గురు కృప పొందడమే ముక్తికి సోపానము. ఈ పన్నెండు  ఆధ్యాత్మిక మార్గంలో ఉపయోగపడ్తాయి.

బాబా 40 వేలు నాలుగు దపాలుగా ఇవ్వమన్నారు. ఇవి మనస్సు, బుద్ది , అహంకారం, చిత్తము. వీటిని అంతఃకరణ చతుష్టయము అంటారు. వీటిని సమర్పిస్తే కాని మనకు గురు కృప కలగదు. ఈ నాలుగు అంతరించినప్పుడే మన నిజ స్వరూపం మనకు అవగతమవుతుంది.
  
తరువాత ఎముక మాంసం కావాలా లేక వృషణాలపై కోరికా అని అడుగుతారు, కాని పాల్కే బాబా దగ్గర ఉన్న కాళంబలోని ఒక్క మెతుకు లభిస్తే చాలు అని అంటారు.

ఇక్కడ బాబా అడిగింది ఏమిటి? ఈ ప్రాపంచిక వ్యవహారాల మీద ఇంకా ఆశ ఉందా, లేదా. 
ఎముకల్లో ఉన్న మజ్జ ద్వారా మన శరీరంలో కణాలన్ని సృష్టించబడతాయి. వృషణాలు అంటే కోరికలకు ప్రతీక. మనలో ఉన్న కోరికలు నశిస్తే కాని హాజీ  కోరుకునే ఆ మోక్షం లభించదు. మక్కామదీన యాత్రలు చేయడం అంటే సామన్యం కాదు. దానికి పరిపూర్ణ హృదయం ఉండాలి. మనం కాశీ లాంటి యాత్రలు చేస్తాము కాని మన మనస్సు పవిత్రం కాకపోతే ఏమి ప్రయోజనం లేదు.
ఇవన్ని విన్న తర్వాత బాబా వెళ్ళి హాజీ ను పోట్లాడతారు. ఖురాను చదువుతావు కాని నన్ను తెలుసుకోలేక పోతున్నావు. మక్కా యాత్ర చేసానని గర్విస్తున్నావు, అని మదలించారు. గురువు మందలిస్తే మన మనస్సులోని దుర్గుణాలు నశిస్తాయి. మనంతట మనము మార్చుకోలేని బుద్ది అహంకారములు నశిస్తాయి. గురువు ఆగ్రహం వీటి మీద మాత్రమే. మనం వాటిని అపార్ధం చేసుకోరాదు. గురువు తిట్టినా కొట్టినా గురువు పాదాలను మాత్రము వదలరాదు. గురువుకు మన కర్మ శేషములన్ని ఎరుకయె. వీటిని దగ్ధం చేస్తే కాని మనకు జ్ఞానం లభించదు. అందుకే మనము అహంకార రహితులమై నమ్రతతో జీవించాలి. బాబా 55 రూపాయలు ఇవ్వడంలో కూడా ప్రత్యేకత ఉంది. ఇది బ్రహ్మజ్ఞానికి కావాల్సిన అర్హతలు . ఇలా ఈ సంభాషణల్లొ ఎన్నో అర్ధాలు దాగి ఉన్నాయి. 
  
తరువాత హాజీ  12 సంవత్సరములు బాబాను సేవిస్తూ షిర్డికి వస్తూ ఉండేవాడు అని చెప్తారు.

మనలో కూడా ఈ హాజీ  లాంటి మనస్తత్వమే ఉంది. దానిలో అహంకారం మెండుగా ఉండచ్చు. కాని దాన్ని మనకి మనముగా తెలుసుకోలేము. మనం మంచి అలవాట్లతో ఉండచ్చు. ఎవ్వరికి తెలిసి అన్యాయం చేయకపోవచ్చు. దయా గుణాలు ఉండవచ్చు. భక్తి, జ్ఞానం ఉండచ్చు. వీటన్నింటికి  వెనుక దాగి ఉన్న ఆ అహంభావనను అర్ధంచేసుకోవాలి. అది చాలా లోతుల్లోకి వెళ్ళి ఆత్మ విశ్లేషణ చేస్తేకాని అర్ధం కాదు. ఈ మాయను చేధించాలి అంటే బాబా కృప తప్పక ఉండాలి. బాబా లాంటి సద్గురువులు అరుదు. అటువంటి వారిని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు మన మార్గం సుగమనం అవుతుంది.  


ఓం శ్రీ సాయి రామ్ !

The Story of Haji Falke

When we are treading the spiritual path, we want to be free of ego. But to overcome the faculty of mind might be tough. We don’t have to be disenchanted. If we have Guru’s grace we can achieve any thing. Faith and patience are the essence of spiritual path. We have to have faith in our Guru and should be able to show patience. The scripture (Bhagavadgita) says

Ahankaram Balam Darpam Kamam Krodham Parigraham!
Vimuchya Nirmamaha Shanto Brahma Bhuyaaya kalpate !!

Having abandoned egoism, strength, arrogance, anger, desire, and covetousness, free from the notion of “mine” and peaceful,—he is fit for becoming Brahman.

One who identifies one self with body and mind,  is said to have egotism. This is the reason why that person belives that he is the doer fo all actions. If we can get rid of this feeling where we feel that we are body and mind, we can be free of ego. To teach this kind of practice Baba used real life circumstances so that he can advance us in the spiritual path. We can now talk about Haji Falke Siddique story and meaning behind that. The story in Satcharita goes as follows.

Once a Muslim, resident of Kalyan, by the name of Siddique Falke, after a pilgrimage to Mecca – Medina, arrived at Shirdi.  That old Haji stayed in the Chavadi facing the north. For the first nine months Baba was displeased with him and was not ready to meet him. The auspicious hour did not come for him. His wearisome trips were futile (i.e. between the north Chavadi and the Masjid). He tried different ways and means but could never exchange glances (with Baba). TheMasjid was always open to everyone. No one was debarred or prohibited. But that Falke had no permission to mount the steps of the Masjid.

Falke became internally dejected. ‘What kinds of karmas have been instrumental that my steps cannot enter the Masjid. What sins have I committed?  By what turn of events, will Baba be propitious towards me and come forward towards me’ – that was the sole thought, day and night, in Falke’s mind, like the throbbing of his own heart. In the meanwhile, somebody advised him not to be dejected like this ‘Take Madhavrao’s help and your heart’s desire will be fulfilled’. Before taking Nandi’s darshan, can Shankar become propitious? He approved of following this method and liked the idea of using this means. On the face of it, the listeners will think this to be an exaggeration. But, this was the experience, in Shirdi, at the time of darshan. Whoever desired to be with Baba, without any disturbance, to have a dialogue, he was required to go with Madhavrao, at the outset. Who has come, from where, and wherefore? – For the purpose of telling all this in a sweet and suitable manner and to introduce (Madhavrao was required). Then Samartha became willing to talk. The Haji heard all this and persuaded Madhavrao. He said: “Once, at least, dispel my turmoil. Help me to attain the unattainable”.
With this pressure on Madhavrao to find a suitable opportunity, he made a firm decision. Whether the task was difficult or not, he would make an effort. He plucked up courage and went to the Masjid. He broached the subject very delicately. “Baba, that old man is greatly distressed. Please oblige him. That Haji has come to Shirdi for your darshan after doing the Mecca – Medina pilgrimage. How can you not be merciful to him? And not allow him to come into the Masjid? Innumerable persons come, freely enter the Masjid, take darhsan and leave quickly. Why is only this one lingering in vain?  Be merciful towards him, just once. Meet him in the Masjid. Then, he will also leave quickly, after asking the question in his heart”. “Shama, the infant’s spume has not yet even dried on your lips. If Allah’s grace is not with him, what can I do for him? If he does not have an indebtedness of Allahmiya, can anyone climb (the steps of) the Masjid! The Fakir’s actions are beyond understanding. And I have no control over them.  So be it.

There is a narrow foot path beyond the Barvi well. Go and ask him clearly if he will walk and come there correctly”.
The Haji said: “However difficult it may be, I will walk correctly. But grant me a personal meeting, and let me sit near his feet”.
Listening to the answer from Shama, Baba said,

“Ask him further: Four times forty thousand rupees, will you give to me?”
When Madhavrao gave him this message, the Haji said: “What are you asking? If he asks, I will give forty lakhs! Where lays the question of thousands! ”
Listening to this answer, Baba said:

“Ask him. To-day we have a desire to slaughter a goat in our Masjid. What part of the meat, do you wish? Would he like bones with flesh, haunch or testicles? Go and ask that old man, what he definitely wants”.
Madhavrao related in detail to the Haji whatever Baba had said.
Haji emphatically said: “I need nothing of all that. Give me whatever he wishes. But I have only one desire. If I only get a morsel from the kolamba, I will have attained my object and my well-being”.

Madhavrao returned with this response from the Haji. While he was presenting this statement, Baba became wild with anger immediately. Picking up the kolamba and the water pot in his own hands he threw them out of the door. Biting his hand noisily, he came near the Haji. Holding his kafni with both hands and lifting it up, he stood in front of the Haji and said:

“What do you think yourself to be? Are you boasting in front of me?  You are giving yourself airs because of your age! Is that the way you recite the Koran! You are vain because you have done the pilgrimage to Mecca! But you do not realize who I am! ”

In this manner he was reproached! Using unspeakable words! The Haji was dumbfounded. Baba then turned back. While entering the courtyard of the Masjid, he saw the gardener’s wife selling mangoes. He purchased all the baskets and sent them immediately to the Haji. In the same way, he turned back immediately, and went again towards that Haji. He took out Rs. 55/- from the pocket and counted them on his (Haji’s) hands. Thereafter, there developed affection. The Haji was invited to eat and both of them forgot all the past. The Haji was delightfully blissful. Then he left and frequently came again. He took full pleasure in Baba’s affection. Then Baba gave him gifts of monies, from time to time.

Meaning behind this story:

We can learn so much from this story.
Baba said “There is a narrow foot path beyond the Barvi well. Go and ask him clearly if he will walk and come there correctly”.                                                     

There is no such thing as Barvi well physically but it could be the means of Sadhana (practice) and narrow path means treading the path of austerity.          



They can include Samadamadhi Shat sampatti. They are the six virtues:  (a)Sama: Quietude in holding the mind steadily on the object of attention. (b)Dama: Control—mastering of the powers of perception and of action, holding them from running away. (c) Uparati: Cessation from leaning on outer things and external objects. (d) Titiksha: Endurance of afflictions without rebelling against them and without lamentation or grumbling. (e)Shraddha: Faith or firm conviction of the truth about the soul, the science of the soul and the Teachers of that science. (f)Samadhana: Self-settled ness in the Pure Eternal in an increasing measure till permanency therein is attained.

Viveka is discrimination—discernment between the Eternal and the non-eternal. These two are not distant, somewhere far away, but here, near at hand. Both the Eternal and the non-eternal envelop everything, and we have to discriminate between them in eating and drinking, in waking and sleeping, in all the affairs of life.

Vairagya is dispassion or desirelessness, and freedom from self-indulgence. When we indulge the self of sense we follow the non-eternal; when we free ourselves from the senses it is because the Eternal has been glimpsed, however dimly.

Mumukshatavam - Desire to be free from birth death cycle.

In this process we need to control the mind and make it still, have patience for Guru’s grace and move towards the ultimate goal.

Next question was:  “Ask him further: Four times forty thousand rupees, will you give to me?”
Baba is asking here purity of faculty of mind (Mind, Buddhi, Chitta and Ahankara). If we can annihilate these four then we can experience self realization.

The third question was:  “Ask him. To-day we have a desire to slaughter a goat in our Masjid. What part of the meat, do you wish? Would he like bones with flesh, haunch or testicles? Go and ask that old man, what he definitely wants”.

He wanted to test him to see whether he is really interested in worldly activities with a passion. Bones with marrow indicates the creation. Bone marrow is responsible for the birth of so many cells in the body. When we become dispassionate about these worldly objects, we become eligible to walk this path. We can have so many pilgrimages under our belt, it does not matter. We need to purify our mind.    

Guru keeps us straight with his harsh words, so that he can get rid of some bad tendencies from our psyche. In the end Baba gave Falke mangoes which indicate auspiciousness and Rs. 55. This denotes the 5 qualities that he needs to acquire Knowledge of Self. We should never misunderstand this as Guru getting angry at us. In reality this is a blessing. We should never leave the feet of Guru. We have to learn to live with out this egotism and we have to humble.


OM SAI RAM!

Wednesday, April 13, 2016

దాము రసానే




సాయినాధులు మనలను ఆధ్యాత్మిక మార్గంలో నడవమని చెప్పారు. కాని మనలో నున్న కోరికలను మనకు అవసరమైన నిత్య జీవిత అవసరాలను కూడా తీర్చారు, తీరుస్తూ ఉంటారు. ఆయన తన భక్తులకు ఇలా హామి కూడా ఇచ్చారు. నా భక్తులు మొదట ప్రాపంచిక కోరికల కొరకు నా దగ్గరకు వస్తారు. వారు కోరిన కోరికలు తీర్చిన తరువాత వారిని భక్తి మార్గంలో నడిపించి ముక్తి పధానికి చేరుస్తాను, అని బాబా చెప్పారు. మనము ప్రాపంచిక కోరికలు తీర్చుకోవచ్చు కాని మన జన్మలను ఈ కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించ రాదు. దాము రసానే ద్వారా మనకు ఒక చక్కటి సందేశాన్ని అందించారు. దాము అన్న ఈ ప్రశ్న బాబాను అడిగి ధన్యుడయ్యాడు. మామిడి పండ్లు, పూత అనే ఉదాహరణ ద్వారా మనకు ఆయన మనం ఏ దారి అవలంబించాలో చెప్పారు. ఈ అధ్యాత్మిక సత్యాన్ని బాబా ఎంతో ఆర్తిగా, ప్రేమగా మనలాంటి సాయి భక్తులకు ఒక ఆదేశం లాగా చెప్పడం జరిగింది.

దాము రసానేను బాబా రామియా అని, దాము అన్నా అని పిలిచేవారు. దాము అన్న గురించిన వివరాలు శ్రీసాయి సచ్చరితలో 25వ అధ్యాయంలో చెప్పటం జరిగింది. సాయి పరమదయా మూర్తి, వారి యందు అనన్య భక్తి ఉంటే చాలు. భక్తి శ్రద్ధలున్న, భక్తులు కోరుకున్న దానికి కొదవలేదు. శ్రీకృష్ణుడు ఉద్దవునితో సద్గురువు నా రూపమే అని చెప్పారు. ఇటువంటి సద్గురువులను భక్తితో, ప్రేమతో పూజించాలి. దీనినే అనన్య భక్తి అంటారు. 

సాయి కథను ఏ సందేహాలు లేకుండా ఏకాగ్ర మనసుతో విన్నా, చదివినా కలిమలం దూరం అయిపోతుంది. ఒకసారి సాయి యందు అనన్య నిష్ట కుదిరితే ఆ భక్తుల కష్టాలు అరిష్టాలు అన్ని తొలగి వారి అభీష్టాలు తీరుతాయి. ఇటువంటి గురిగల భక్తుడే దాము అన్నా. ఈ కథలో ఎంతో జ్ఞానం ఉంది. దీన్ని జాగ్రత్తగా వింటే కష్టాలు అన్నీ దూరం అవుతాయి అని హేమద్‌పంత్ ఘంటాపధంగా చెప్పారు.

అహ్మద్ నగరంలో సుఖంగా ఉన్న శ్రీమంతుడైన భక్తుడు దాము అణ్ణా కాసార్ సాయి పాదాల యందు మిక్కిలి ప్రేమ కలిగి ఉండేవాడు. ఆయన తన జీవితాన్ని ఒక చిన్న గాజుల వ్యాపారిగా ప్రారంభించి చాలా అభివృద్దిని సాధించి ధనవంతుడై వెలుగొందాడు. అయినా చాలా నమ్రతతో మెలిగేవాడు. ఆయనకు అన్ని ఉన్నాయి కాని పిల్లలు మాత్రం లేరు. మొదటి భార్యకు పిల్లలు లేకపోతే, రెండో పెళ్ళి కూడా చేసుకుంటాడు. అయినా పిల్లలు పుట్టలేదు. సరే జాతకం చూపించుదామని చూపిస్తే కేతువు తన అదృష్టాన్ని ఆపుతున్నట్లు, గురు బలం అసలు లేదని పిల్లలు ఖచ్చితంగా పుట్టరని తేల్చి చెప్తారు.

సాయి అనుగ్రహం, సంతాన ప్రాప్తి
దాము అణ్ణా బాబా గురించి తెలుసు కొని షిర్డి వెళ్తాడు. దామియా షిర్డి వెళ్ళిన సమయానికి గోవా నుంచి ఎవరో మామిడి పళ్ళ పార్శిల్ పంపిస్తారు. వారు సవినయంగా బాబాకు సమర్పించు కుంటారు. దానిలో దాదాపు మూడు వందలకి పైగా మామిడి పళ్ళు ఉన్నాయి. బాబా వాటన్నింటిని అందరకు పంచి ఒక 8 పళ్ళను దాచి పెడ్తారు. అవి పిల్లలు అడిగితే ఇవి దాముకు మీకు కాదు అని చెప్తారు. వాళ్ళు దామ్య ఇక్కడ లేడు కదా! మాకివ్వు అంటారు. బాబా ససేమిరా ఒప్పుకోరు. కాని ఆ పిల్లలు నాలుగు పళ్ళను దొంగతనంగా తీసుకుంటారు. ఇంతలో పూజా సామాగ్రి పట్టుకుని దామియా ద్వారకామాయికి వస్తాడు. బాబా అతనికి మామిడి పళ్ళను ఇద్దామని చూస్తే నాలుగు మాత్రం ఉంటాయి. ఆ నాలుగు దామూకు ఇచ్చి ఇవి ఎవరివో వారే తీసుకోవాలి, ఎవరివో మనమెందుకు తినాలి? అవి ఎవరివో వారే తినాలి, తిని చావాలి అని అన్నారు. అది బాబా ప్రసాదంగా దామియా స్వీకరించాడు. బాబా మాటల వివరీత అర్ధానికి ఏం భయపడనవసరం లేదని అణ్ణాకు బాగా తెలుసు పూజను ముగించుకొని దాము ఈ పళ్ళను ఏ భార్యకు ఇవ్వాలి అని బాబాను అడిగాడు.

చిన్న భార్యకు ఇవ్వమని బాబా చెప్తారు. ఆమెకు ఎనిమిది మంది పిల్లలు పుడతారు అని బాబా ధైర్యం చెప్తారు. ఆయన అంతకు ముందు ఎంతో మంది సాధుసత్పురుషులను ఆశ్రయించి సంతానం కోసం ప్రయత్నించాడు. గ్రహాల అనుగ్రహం కోసం జ్యోతిష్యం విద్య నేర్చుకొని స్వయంగా జ్యోతుష్యుడు అయ్యాడు. జ్యోతిష్యం ప్రకారం తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని నిరుత్సాహపడ్డాడు. కాని బాబా లీలలే వేరు. తరువాత కొంతకాలానికి మొట్ట మొదటి బిడ్డ పుడ్తాడు. బాబా ఆ మామిడి పళ్ళు ఇచ్చినప్పుడు ఇలా చెప్పారు. ఆమెకు 8 మంది పుడ్తారు. మొదటి ఇద్దరు అబ్బాయిలు. మొదటి అబ్బాయికి దౌలత్ షా , రెండో అబ్బాయికి లానాషా అని పేర్లు పెట్టు అని చెప్తారు. అప్పుడు దామియా తన దగ్గర ఉన్న చిన్న పుస్తకంలో ఈ వివరాలు వ్రాసు కుంటారు. ఎనిమిది మామిడి పళ్ళు ఎనిమిది పిల్లలు, కాని నాలుగు పళ్ళు మాత్రమే ఇవ్వడం జరిగింది. అందుకని నలుగురు చనిపోయి, నలుగురు మాత్రం ఆరోగ్యంగా ఉండి బతుకుతారు. పెద్ద కొడుకుకు 15 నెలలు వచ్చిన తర్వాత బాబా దగ్గరకు తీసుకు వెళ్ళాడు దామియా. అక్కడకు వెళ్ళి బాబాను ఏమని పేరు పెట్టమంటారు అని అడిగాడు. దామియా నేను చెప్పినది అప్పుడే మరచిపోయావా? నువ్వు ఆ పుస్తకంలో మూడో పేజీలో ఆ పేర్లు వ్రాసుకున్నావు కదా! దౌలత్ షా అనే పేరు చెప్పాను కదా. ఆ కుమారుడికి నానా సాహెబ్ రసానే, దత్తాత్రేయ రసానే అనే పేర్లు కూడా ఉన్నాయి. దౌలత్ షా తరువాత కాలంలో బాబా గురించి చాలా ప్రచారం చేయడం జరిగింది. బాబా గురించి ఉపన్యాసాలు చెప్పేవాడు. బాబానే ఈ దౌలత్ షాతో అక్షరాభ్యాసం చేయించారు. బాబా పలక మీద "హరి" అనే అక్షరాలు రాయించారు. అతనిని అధ్యాత్మిక పధంలో చక్కగా నడిపించారు. అతనికి పెళ్ళి సంబందాలు వచ్చినప్పుడు అమ్మాయిని కూడా బాబానే చూసి పెట్టారు. బాబా చెప్పిన పేద ఇంటి అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాడు. ఈ దౌలత్ షా పెళ్ళి పండరీపురంలో జరిగింది. పెళ్ళికి రమ్మని దామియా పట్టుపడితే శ్యామాను తన ప్రతినిధిగా బాబా పంపించారు.

దాము - రామ నవమి ఉత్సవాలు
శ్రీరామ నవమి ఉత్సవంలో రెండు పెద్ద పతకాలను షిర్డి గ్రామంలో ఊరేగించడం అక్కడి ఆనవాయితి. ఒక పతకం నిమోనకర్‌ది, రెండవది దాము అణ్ణాది. తనకు పిల్లలు పుట్టినందుకు గాను బాబా పట్ల ప్రేమతో ఈ పతకం ఇవ్వడం జరిగింది. వడ్రంగి కోండ్యా ఇంటి వద్ద పతా కం ఊరేగింపుకు సిద్ధమై అక్కడి నుండి వాద్యాల మ్రోగింపుతో పతకాలను ఊరేగించేవారు. పొడవైన ఆ పతాకాలను మసీదు పైన రెండు వైపుల కట్టేవారు. ప్రతి సంవత్సరం ఈ పండగ జరిగేది. వచ్చిన వారందరికి చక్కగా భోజనం పెట్టేవారు. ఇలా దాము అణ్ణా ఈ రామనవమి ఉత్సవానికి ఒక భాగంగా నిలిచిపోయాడు. ఇలా తను కూడా  ఒక అంకిత భక్తుడిగా స్థానాన్ని పొందాడు. బాబాను అడగకుండా ఏ పనులు చేసేవాడు కాదు. బాబా మహా సమాధి తరువాత కూడా చీట్ల మీద వ్రాసి బాబా పేరుతో వాటిని తీసి ఏది వస్తే అదే చేసేవాడు. ఇలా ప్రతీసారి బాబా అనుగ్రహమే తనను రక్షించిందని చెప్పేవాడు దాము అణ్ణా.

దామియాకు బాబా రక్షణ 
దాము అణ్ణా ప్రతి పనిలో బాబా యొక్క సంరక్షణ కోసం తపించేవాడు. బాబా ద్వారానే ఊరట పొందేవాడు. అన్ని కష్టాలకు సమాధానం కేవలం బాబా మాత్రమే అని అనుకునేవాడు. ఒకసారి తన భార్య ముక్కు పుడక దొంగలించబడింది. ఈ ముక్కు పుడక మాంగల్యముతో సమానమైనది. అందువల్ల దామియా కుటుంబం చాలా కలత చెందింది. పోలీసులు వచ్చి వాళ్ళింట్లో 30 ఏళ్ళుగా పనిచేసిన అతను దొంగిలించినట్లుగా కనుక్కొని అతన్ని తీసుకువెళ్తారు. దామియాకు మనస్సు బాగా వికలమవుతుంది. అతన్ని 30 ఏళ్ళుగా నమ్మినాడు. అతను ఇలా చేయడం తనకు చాలా భాద కలిగింది. వెంటనే బాబా దగ్గరకు వెళ్తాడు. బాబా అతనిని ఓదార్చి దామియాకు మంచి విందు భోజనం ఇవ్వమని శ్యామాకు చెప్తాడు. అతనిలో మరల ఆత్మవిశ్వాసం నింపి పంపిస్తారు. 

దామియా హరిజనుడుతో భోజనం
ఎప్పుడు దామియాకు అవసరం అయినా బాబాను తలిచేవాడు. బాబా పై అమితమైన విశ్వాసం, శ్రద్ధ చూపించేవాడు. దామియాకు ఆచార వ్యవహారాల పట్ల మిక్కిలి శ్రద్ద. ఒకసారి ప్రత్యేక సందర్భంలో  బాబాను భోజనానికి రావలసినదిగా కోరతాడు. బాబా కుదరదని చెప్తే దామియా కనీసం బాలాపటేల్‌ను పంపించమని అడుగుతాడు. బాలా పటేల్ నిరంతరం బాబా సేవ చేసే భక్తుడు. ఈ బాలా పటేల్ ఒక హరిజనుడు. బాబా అప్పుడు "దామియా బాలా పటేల్‌ను పంపిస్తాను కాని అతను వెనుకబడిన జాతివాడని అతన్ని దూరంగా ఉంచద్దు". అని అంటారు. అప్పుడు దామియా అతన్ని తప్పక పంపించండి అంటాడు. అలాగే అతని ప్రక్కనే కూర్చుని భోజనం చేస్తాడు దామియా. ఆ రోజుల్లో ఇలా ఒక వెనుక బడిన జాతి వాడితో కలసి కూర్చుండటం ఒక సాహసం. కాని దామియా ఆచార వ్యవహారాలన్ని ప్రక్కనపెట్టి బాబా ఆజ్ఞను పాతించాడు. దామియా ఎప్పుడూ బాబా చింతనే చేసేవాడు. బాబా ఎన్నోసార్లు తిట్టడం కూడా జరిగింది. అయినా దామియా విశ్వాసం కొంచెం కూడా సన్నగిల్ల లేదు. ఇంకా ఆ తిట్లను ఆశీర్వదంగా స్వీకరించేవాడు. ప్రాపంచిక విషయాలను బాబాకు చెప్పకుండా చేసేవాడు కాదు. 

ప్రత్తి కొనుగోలు కథ
ఒకసారి దూదివ్యాపారం చేద్దామని బొంబాయి నుంచి ఒక స్నేహితుడు ప్రతిపాదించాడు. ఇది రెండు లక్షలు లాభం వచ్చే వ్యాపారం అని స్నేహితుడు చెప్పాడు. ఇది విని అణ్ణా మనస్సు ఆరాటపడింది. వ్యాపారం చేయాలా వద్దా అనే సంశయంతో బాబాకు ఒక లేఖ వ్రాసి కొనాలా లేదా అని అడుగుతాడు. శ్యామా ఆ ఉత్తరాన్ని బాబాకు వినిపించాడు. అప్పుడు బాబా,  ఇతనికి దేవుడు ఇచ్చినది చాల్లేదా! ఆకాశాన్ని అందుకోవాలా! అని ఆ ఉత్తరం వినకముందే చెప్తారు. అప్పుడు శ్యామా మీరు చెప్పినట్లు ఖచ్చితంగా అదే ఉంది అన్నాడు. బాబా భాదతో సేటుకు మతిపోయింది. నీ ఇంట్లో ఏం లోటు ఉంది? ఉన్న సగం రొట్ట చాలు లక్షల వెంటపడకు అని జవాబు రాయమంటారు.కాని దాము ఈ లేఖ చూసి నిరాశ చెందుతాడు. ఇప్పుడు ఒక లక్ష సంపాదించి అరలక్ష వడ్డీకి తిప్పవచ్చు అని అనుకుంటాడు. తరువాత బాబాకు తనే స్వయంగా వెళ్ళి చెబితే సరే అంటారు అని షిర్డి వెళ్తాడు. సాయికి సాష్టాంగ ప్రణామం చేసి వారి సమీపంలో కూర్చున్నాడు దాము అణ్ణా. సంకల్ప, వికల్పాలు మనస్సు యొక్క లక్షణం.  మానవుడు చాలా కోరికలు కోరుకుంటాడు. తనకు ఏవి మంచివో తెలుసుకోలేడు. కాని గురువు సర్వజ్ఞుడు. దామియా, బాబాతో వ్యాపారంలో లాభం వస్తుంది. దాంట్లో సగం మీకు సమర్పించుకుంటాను అని అనుకుంటాడు. ధన కనకాలను మట్టితో భావించేవారికి వ్యాపారంలో భాగ మెంతటిది? ఈ ఆలోచన దామియా మనసులో ఉండగానే బాబా ఇట్లా చెప్పారు. మేము ఎందులోను లేము బాబు, అని ప్రేమగా వ్యాపారం సరియైనది కాదని హెచ్చరించారు. దామియా లోలోపల సిగ్గు పడ్డాడు. దూది కొనే ఆలోచన మానుకున్నాడు.

గోధుమల వ్యాపారం
దాము అణ్ణాకు ఇంకోసారి గోధుమల వంటి ధాన్యాలతో మరో వ్యాపారం చేస్తే బాగుంటుందని బాబాను అడుగుతాడు. అందరూ లాభాలు పొందవచ్చని చెప్తారు. కాని బాబా ఇలా సమాధానం ఇచ్చారు. అయిదు సేర్లు చొప్పున కొని ఏడు సేర్లు చొప్పున అమ్ముతావు అని చెప్పారు. సరే దాము ఈ వ్యాపారం కూడా చెయ్యలేక పోతాడు. ఒక నెల, రెండు నెలలు గోధుమల రేట్లు బాగా పెరుగుతాయి. కాని తరువాత బాగా వానలు పడి పంటలు బాగా పండి ధాన్యం ధర బాగా తగ్గి పోతుంది. బాబా చెప్పిన మాట ప్రకారం తన స్నేహితులందరూ బాగా నష్టపోతారు. దామియా బాబాకు నమస్కరించు కొని తనను మరల రక్షించినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.

  
బాబా దామియా ద్వారా ఇచ్చిన సందేశం
ఒకసారి దాము అణ్ణా షిర్డిలో ఉండగా వస్తున్న జన సందోహాన్ని చూసి బాబాని ఒక ప్రశ్న అడగాలని మనసులోనే అనుకుంటాడు. ఇంత మంది బాబా దగ్గరకు వస్తున్నారు. వీళ్ళందరు బాబా అనుగ్రహం పొందగలుగుతారా అని లోలోపల అనుకుంటాడు.
బాబా అప్పుడు,  అరే! మామిడి చెట్టును చూడు దాంట్లో ఉన్న పూలన్ని కాయలు అవుతాయా, కొన్ని పూతగా రాలిపోతాయి,  కొన్ని పిందెలుగా రాలిపోతాయి. కొన్ని కాయలుగా పోతాయి, పండ్లు అయ్యేవి చాలా తక్కువ అని చెప్తారు.


ఓం శ్రీ సాయి రామ్ !

Tuesday, April 12, 2016

Damu Anna



Sai wanted us to focus on spiritual path but he never abandoned us with materialistic aspects of life. He even said that his devotees come to him for worldly things first and after helping them with this issue he will direct them to spiritual path. Here we need to be careful so that we do not waste our lives devoting ourselves to these worldly objects. Baba gave great message to mankind through Damia. Because Baba’s main goal is to take us to the ultimate goal of human life that is salvation.
     
Damodar Sawalram Rasane was one of those devotees who asked Baba for help in his business dealings family issues and other day to day life issues. Baba was always there for him. He was a Kasar and one of the earliest of Ahmednagar citizens to learn about Sai Baba. He was a very humble man and began as a poor bangle seller but all his transactions yielded good profit and he soon grew rich. He had everything to make life happy, but had no children. Seeing that his first wife could not bear a child, he married a second time. But even the second wife could not bear him a child. Astrological curiosity made him explore into his horoscope and he found that he could never have a child. In astrological terms, Kethu was obstructing this, and there was no Guru influence to overcome that force. Therefore, the local astrologers, who were consulted, declared that issue for him was impossible in this life.

Sai blessing him with children:
He had heard of Sai Baba and went up to meet him. Sai Baba had kept apart 8 mangoes to be given to him from a basket of mangoes that were sent to Baba. The children were the recipients of the rest of the mangoes and some children wanted more. When Baba said, “There is nothing,” the children pointed to the eight mangoes. Baba said, “They are for Damia.” But the children said, “Damia is not here.” “I know that. He is on the way. He is coming,” said Baba. Then, when Baba went out, some of these petted children of Baba stole away four mangoes, and when Rasane came, there were only four mangoes remaining. As soon as he came, Baba gave him those four mangoes. “Eat and die. People are clamoring for mangoes.” Eat and die – Damodar was perturbed by hearing the inauspicious word die, and Mahlsapathy noting his perplexity told him that it was a blessing to die at the feet of Baba. Baba was enjoying the humor all the time, as the word die, which he had used, did not refer to the physical death but only to the spiritual death, which is the same as Bhramh or Pramada coming upon one who gets deeper and deeper in samsaric (Worldly life) life with the birth of a child after child and the death of several of them.

Baba came to the rescue and said, “Damia do not eat these fruits yourself. Give them to your wife”. Damia wanted to know, which wife were the fruits to be given. Baba said, “The second wife.” Baba also said, “She will have eight children. The first and second would be boys. Name the first Daulat Shah and the second Thana Shah.” Taking up his note book immediately, Damia wrote down the names. Then the fruits were taken and given to his second wife, and, she did eat the four fruits. She begot, as stated by Baba, exactly eight children, one after another, their sexes being in the order given by Baba. It took fifteen years for all the children to be born. It may be noted that the eight mangoes representing eight children that Baba set apart for Damia, four were stolen away. Corresponding to that loss, of the eight children that were born to Damia, four were filched away by death and the remaining four survived.

One year after that, he had his first son.  When his son was 15 months old Damia took him to Sai Baba at Shirdi for darsan and he then asked Baba "How shall I name this child?"   Baba replied "Have you forgotten what I told you?  You have written it on page 3 of your note book.  Did I not say that he should be named Daulat Shah?" He is also known as Nana Saheb Rasane.  Daulat means prosperity and fame. With the wealth already acquired by Damia, the children started or carried on a successful business, and they kept up the name of Damia for wealth and generosity.

In addition to the above, Nana Saheb Rasane, the eldest son was helped by Baba in his spiritual development. He later helped spreading the Sai faith by lectures. When Daulat Shah was five years old, and when he first began writing the letters Hari on the slate, Baba held his hand and helped him to write. After that he was, taken to a school at Shirdi. At his marriage also, Baba helped him. When there were several girls offered for this rich man’s son, Baba was requested by Damia to select the one, which he considered proper out of four horoscopes. Two girls were offering a dowry of 2500 to 3000 rupees at that time. Then Baba selected a poor girl’s horoscope; and that was the girl that Rasane married, and that was a happy marriage. It took place at Pandharpur and Damia went to Baba to invite him to Pandharpur. Baba replied “I am with you. Do not fear. Wherever you think of me, there I am with you.” Still Damia pressed him to attend. Then Baba said, “Without God’s permission, nothing can be done by me. I will send Shama to attend the marriage as my deputy.” And Shama attended the marriage.

Damia’s contribution to Ramanavami festival:
Damia wishing to show his gratitude undertook to pay the expenses of a grand ceremony of ‘The standards procession’ on every Ramanavami Day. Two very tall standards were nicely decorated and carried from the Mosque through the streets of Shirdi on that day every year and finally brought back to be planted at Baba’s Masjid to remain there as a mark of the residence of the weird saint. Damia, not content with this service, was always ready to undertake further trouble and expense for Baba in other matters. At the time of the reconstruction of the Masjid, he made his contribution as also on other similar occasions. But the best contribution that Damia made was his becoming an Ankita or child of Baba, whom Baba looked after wherever he was and wherever he thought of Baba. Baba told him, “I am with you wherever you are and
whenever you think of me.” This was said when Damia was afraid that Baba would leave his body and would no longer be helping him personally with his presence. Baba’s assurance, Damia says in his statement in 1936 has been, perfectly true. Baba is with him and frequently appears before him. When he is not personally present, Damia casts chits before Baba, and the chits always give the answers of Baba. He says in the innumerable cases that he consulted Baba on chits, not even on one occasion was Baba’s direction found to be wrong. But we may first mention the sort of assurance that Baba gave him before Mahasamadhi.

Damia finding comfort with Baba:
Baba was relied upon by Damia as his great asset, the one shield against all sorrow and trouble, the one supreme protector who would guard him against every evil. So, whenever he was in trouble, he thought of Baba. On one occasion, his wife’s nath, nose ornament, usually considered to represent the Mangalya, was stolen by an old-time servant. The matter was reported to the police. They came and seized the thief and after making a search, arrested him. Damia felt hurt in every way, firstly by the loss of the Mangalya ornament and next the fact that the thief was a man whom he had trusted for thirty years. That such a servant should turn a traitor was a shock to him. So, he at once went to Shirdi and Baba, noting how upset he was, told Shama to give him a good fine feast. Then he was given a coating of sandal paste and Baba assured him he was with him, and restored his courage, self-possession and equanimity.

Damia eating with a low caste person:
On other occasions also, he always appealed to Baba and Baba came to his aid. Damia had implicit reverence for and faith in Baba and obeyed his directions. Although he was very orthodox in his ways, he invited Baba for a meal on an important occasion at Shirdi. Baba declined to go and then Damia asked him, “Send at least Bala Patel”, who was Baba’s constant attendant, though a Harijan. Baba said, “I will send him. But do not cry DhutDhut at him and keep him far away from your own place of eating.” Damia agreed and, in spite of his orthodoxy spread a plate for Bala next to himself. This was a great achievement in those days at the beginning of 20th century.


Damia has said that his mind was always dwelling on Baba, and he saw him at his own house at Ahmednagar few times. Baba abused him and even beat him fiercely. But he adds, he knew that, as with Akkalkote Maharaj, blows and abuses have an auspicious ending. So, he always found that blows and abuse were not matters for regret.

OM SAI RAM!