సాయి అసలు నిరాకారమే అయినా భక్తుల కొరకు సాకార రూపాన్ని ధరించారు. బాబా ఆరతి అయిన తరువాత పిడికిళ్లు నిండా విభూతి తీసుకొని భక్తుల చేతులో పోసేవారు. తమ బొటన వేలితో భక్తుల నుదుట అద్దేవారు. అందరిని ప్రేమతో పలకరించేవారు.
ఒకసారి దాసగణు మహారాజు గారు ఈశావాశ్య ఉపనిషత్ మీద చక్కటి భాష్యం వ్రాయాలని సంకల్పించి, చందోబద్ధంగా ఓవిలతో వ్రాసారు. దానిని చాలామంది ఆమోదించి గౌరవించారు. అతని కోరిక నెరవెరినది. కాని అతనికి ఒక సందేహం తీరలేదు. దానిని అతడు పండితుల ముందు ఉంచాడు. చాలా చర్చలు జరిగినా అతని సందేహం తీరలేదు. ఆ తరువాత అతడు షిర్డి రావడం జరిగింది. బాబాను దీని అర్థం బోధించమని ప్రార్ధించాడు. అప్పుడు బాబా "దీనిలో కష్టం ఏముంది! నీవు ఎక్కడనుంచి వచ్చావో అక్కడికి మరల వెళ్ళినప్పుడు కాకా పని మనిషి నీ సందేహాన్ని తీరుస్తుంది" అని చెప్పారు. పని పిల్ల దీనికి అర్థం చెప్పడం ఏమిటి? సాయి పరిహాసం చేస్తున్నారు అని అక్కడ ఉన్న వారు అనుకొన్నారు. కాని దాసగణుకు బాబా చెప్పినది సత్యం అని తెలుసు.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే? మనలో భావన ఎలా ఉంటే ఫలితం అలా ఉంటుంది. గురువు చెప్పిన ప్రతి మాట బ్రహ్మ లిఖితమే. వారు ఉపయోగం లేకుండా ఏమీ చెప్పరు.
సరే ఆ తరువాత గణు కాకా ఇంటికి వెళ్తాడు. తను నిద్రలో ఉండగా ఒక మధురగానం వినిపించింది. ఆ గానం ఆ ఇంట్లో పని చేసే ఒక నౌకరు యొక్క చెల్లెలుది . ఆ అమ్మాయికి ఎనిమిది ఏళ్ళు ఉంటాయి. తను ఒక చినిగిన గుడ్డ ముక్కను నడుముకు కట్టుకొని నారింజ చీర అందాన్ని వర్ణిస్తూ పాటపాడుతూ ఉంది. తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరిపడా బట్ట లేదు, ఐనా ఆమె ఎంతో సంతోషంగా ఉంది.
ఆపిల్ల యొక్క స్థితిని చూసి, ప్రధాన్ గారి చేత ఒక కొత్త చీర ఇప్పించారు. మరునాడు ఆ అమ్మాయి ఆ చీర కట్టుకొని ఆనందంతో గంతులు వేసింది. తరువాతి రోజు కొత్త చీరను దాచుకొని మరల చినిగిన గుడ్డ కట్టుకొని పనిలోకి వచ్చింది. ఆ అమ్మాయిలో అదే ఆనందం. కొత్తచీర కట్టుకోలేదు అన్న బాధ ఎక్కడా కన్పించలేదు. ఇదంతా చూసిన దాసగణు మహారాజుకి ఈశావాశ్య ఉపనిషత్ యొక్క అర్థం బోధపడింది.
ఇక్కడ దాసగణు మహారాజుకు అర్థం అయిన విషయాలు ఏమిటి? ఈ విషయాలు బాబానే స్వయంగా షిర్డీలోనే చెప్పిఉండవచ్చుకదా! కానీ బాబా అలా చేయలేదు. బాబా ఎప్పుడూ అనుభవపూర్వకముగానె నేర్పిస్తారు.
ఈశావాశ్య ఉపనిషత్లో 18 మంత్రాలు ఉన్నాయి.
ఈశ అంటే ఈశ్వరుడు, వాశ అంటే అంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం.
బాబా షిర్డీలోనే ఈ విషయాన్ని నేర్పించవచ్చు. అంతటా నేనే ఉన్నా, పని పిల్లలో కూడా నేనే ఉన్నా, అని ఆమె ద్వారా నేర్పించడం అనేది ముఖ్యమైన విషయం.
భగవంతుడు సర్వవ్యాపి, పూర్ణుడు అని మొట్ట మొదటి మంత్రంలో చెప్పబడింది. ఈ ప్రపంచమంతా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నప్పుడు ఆయన లేని స్థలం ఉంటుందా.
పరమాత్మనుంచే పూర్ణ జగత్తు వచ్చింది.
పనిపిల్ల యొక్క పేదరికం ఈశ్వరుని అంశం.
చినిగిన చీర కూడా ఈశ్వరుని అంశమే.
దాత, దానం, దానం తీసుకునేవారు; ఇవన్నీ కూడా ఈశ్వరునిలో భాగాలే.
నేను నాది అన్న భావనను పారద్రోలి ఎప్పుడూ నిరభిమానంగా ఉంటూ సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి.
ఇక్కడ పని పిల్ల మంచి చీర కట్టుకున్నప్పుడు, అది లేనప్పుడూ ఆనందంగానే ఉంది. ఇదే బాబా మనకు నేర్పించాలనుకున్న సత్యం. ఈ భావం "తేన త్యక్తేన భుంజీధా" అనే మంత్రంలో చెప్పబడింది. దీన్నే బాబా మనకు సులభంగా నేర్పించారు. ఈ ప్రాపంచిక సుఖాలను త్యజించడం చాలా కష్టం. మనకి అంతర్ దృష్టి కలగడం కూడా కష్టమే. అందుకే "త్యక్తేన భుంజీధా" అని అన్నారు. సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి.
ఈ వస్తువులన్నీ పరమాత్మకు చెందినవి. ఆయనే మనకు వాటిని ప్రసాదించాడు. ఈ లోకంలో వేటిని మనం వెంట తెచ్చుకోలేదు, చనిపోయినప్పుడు దేన్నీ వెంట తీసుకువెళ్ళలేము. మనం ఇక్కడకు వచ్చేటప్పడికి అన్ని తయారుగా ఉన్నాయి. నీరు, గాలి, భూమి, అగ్ని, ఆకాశం, వెలుగు, చెట్లు మరియు నదులు ఇట్లా అన్ని తయారుచేసి మనకు ఇచ్చారు. వాటిని మనం పరమాత్మ ప్రసాదంగా అనుభవించాలి. ఇదే మన మనస్సుకు హత్తుకోవాల్సిన విషయం.
ఈ సృష్టిలో మనందరి అవసరాల కోసం భగవంతుడు అవసరం అయినంత వరకు ఇచ్చాడు. అందులో మన వాటా మనం అనుభవించాలి. అప్పుడు ఇతరులు తమ వాటా తాము అనుభవించగలుగుతారు. కాని కొందరు స్వార్ధంతో అధికభాగాన్ని అన్యాయంగా లాక్కుని మరి కూడబెడ్తారు. ఇట్లా చేసిన వారి గతి ఏమిటి? వారు ఏ లోకాలకు వెళ్తారు అనే విషయాన్ని కూడా ఈ ఉపనిషత్ చెప్తుంది.
ఇక్కడ త్యజించి అనుభవించడం అంటే మనం అరటి పండు తొక్క తీసేసి లోపల ఉన్న దాన్ని తింటాము. అలానే ఈ నామరూపాత్మకం అయిన జగత్తులో ఉన్న తొడుగు తీసేస్తే అప్పుడు మనకు పరమాత్మ కన్పిస్తారు.
మన కథలో పని పిల్ల, చిరిగిన చీర, కొత్త చీర, దానం ఇట్లా చాల విషయాలు ఉన్నాయి.
పరిస్తితులు ఎట్లా ఉన్నా మన పని చేస్తూ ఆనందంగా ఉండటమే పరమాత్మ తత్త్వం.
బాబా ఈ విషయాలను నోటితో చెప్పవచ్చు, కాని దాసగణు మహారాజుకి ఈ దివ్యానుభవం ద్వారా ఆయన అనుమానాలన్నీ తీర్చారు. అంతేకాకుండా ఆయనకు పరమ ఆనందానుభూతిని కలుగచెసారు.

శ్రీ సాయినాథార్పణమస్తు !