In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, March 28, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం -28



సాయి ఒకే ప్రదేశానికి పరిమితం కాదు. సర్వప్రాణులలో ఉన్నారు. బ్రహ్మనుండి చీమ దోమాది, క్రిమి కీటకాలన్నింటిలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నారు. సాయి పూర్ణ శబ్ద బ్రహ్మ. పరబ్రహ్మను తెలుసుకొనే మార్గాన్ని తెలియచేస్తారు. అందుకే వారు సద్గురువులు. శిష్యులను ఆత్మ స్వరూపంలో స్థిరపరిచగలిగిన వారిని మాత్రమే సద్గురువు అని సంబోధించగలము.

ఈ అధ్యాయంలో బాబా తన భక్తులకు స్వప్న దర్శనంతో తన వద్దకు రప్పించుకోవడం గురించి చెప్పడం జరిగింది. 

లక్ష్మి చందు అనే అతను ఒక గుమస్తాగా మొట్టమొదట రైల్వే ఉద్యోగిగా చేసి తరువాత రాలీ కంపెనీలో పనిచేస్తాడు. ఇతనిని బాబా పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాగినట్లు తన దగ్గరకు రప్పించుకున్నారు. అనేక జన్మలలో గడించిన ప్రారబ్దకర్మ ఫలించినప్పుడే సత్పురుషుల సమాగమం ప్రాప్తించదు. లాలా లక్ష్మి చందు గారికి బాబా పిలుపు ఒక అలౌకిక లీల. ఆయనకు మొట్టమొదటగా ఒక ముసలి సాధువుగా స్వప్న దర్శనం ఇస్తారు. తరువాత ఆయన దాసగణు మహారాజ్ గారి కథా గానంకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బాబా చిత్రపటం చూసి తనకు కలలో కన్పించిన సాధువు సాయిగా గుర్తించి పరవశం పొందుతాడు. అప్పుడు షిర్డీ వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. దారి ఖర్చుకు డబ్బు సదుపాయం కావాలి. సాయిని ఎప్పుడు కలుస్తానా అని తపించిపోతాడు. ఒక రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు ఒక స్నేహితుడు తలుపు కొడతాడు. శంకరరావు అనే స్నేహితుడు షిర్డీకి వస్తావా అని అడుగుతాడు. సోదరుని వద్దనుంచి పదిహేను రూపాయలు అప్పుగా తీసుకొని ప్రయాణం కడతాడు. వారు రైలులో ప్రయాణం చేస్తూ అక్కడ ఉన్న నలుగురు ముస్లిం సోదరులను బాబా గురించి అడిగి తెలుసుకుంటాడు. అలానే బాబాకు జామ పండ్లు సమర్పించుకుందామని అనుకుంటాడు. కాని మర్చిపోతాడు. తనకి గోదావరి ఆవలి తీరం వెళ్లిన తరువాత జామ పళ్ళ గుర్తుకు వస్తాయి. అప్పుడే ఒక వృద్ధురాలు జామ పళ్ళ బుట్టతో వస్తుంది. కొన్నిపళ్ళను కొంటాడు, కాని ఆమె బుట్ట మొత్తం ఇచ్చి బాబాకు ఇవ్వమంటుంది. 

తరువాత షిర్డీ చేరుకొని బాబాను చూడగానే లక్మిచందు కంఠం గద్గదమవుతుంది. పరిశుద్ధ జలంతో బాబా చరణకమలాలను ప్రక్షాళనం చేస్తారు. అప్పుడు బాబా ఇలా అంటారు. "దారిలో భజన చేస్తావు. మరో మనిషిని అడుగుతావు. అంతా మన కళ్ళతో చూడాలి గాని రెండో వ్యక్తిని అడగటం ఎందుకు? కల అబద్దమా నిజమా నీవే ఆలోచించుకో! అప్పు తీసుకొని దర్శనానికి రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీ కోరిక తీరిందా? అని బాబా అంటారు. తాను చేసిన పనులన్నీ బాబా చెప్పేసరికి లక్మిచందుకు పరమాశ్చర్యం కలుగుతుంది.
 

లక్మిచందు తరువాత వాడాకు వెళ్తాడు. అక్కడ తనకు సాంజా అనే పదార్ధాన్ని బాబా ప్రసాదంగా పెడతారు. ఇది తనకు చాలా ఇష్టమైనది. తరువాత రోజు కూడా ఎవరన్నా ఈ సాంజా పెడితే బాగుండు అని అనుకుంటాడు. అప్పుడు జోగ్ వచ్చి ఈ రోజు ఏ ప్రసాదం చేయాలి బాబా అని అడిగితే సాంజా కావాలి అంటారు బాబా. అలానే బాబాకు బాగా దగ్గు వస్తే, లక్మిచందు బాబాకు దృష్టి తగిలింది అని అనుకుంటాడు. బాబా తన మనసులోమాటనే బయటకు చెప్తారు. ఇలా ఆయనలో నమ్మకాన్ని పెంచుతారు.
 

బర్హన్పూర్ స్త్రీ 
ఈమెకు బాబా స్వప్నంలో కనిపించి కిచిడి అడుగుతారు. ఆమె ఈ స్వప్నం గురించి అందరికి చెప్తుంది. తన భర్తతో కలిసి షిర్డీ వచ్చి రెండు నెలలు ఉంటుంది. షిర్డీకి వచ్చి పద్నాలుగు రోజులు అయినా బాబాకు కిచిడి ఇవ్వలేక పోతుంది. ఇక పదిహేనవ రోజు ద్వారకామాయికి వెళ్తుంది. అక్కడ తెర వేసిఉంది. కాని ఆ తెర తీసుకొని లోపలి వెళ్తుంది. అప్పుడే బాబా కిచిడి గురించి అడిగి మరి పెట్టించుకుంటారు. ఇలా ఆమెను అనుగ్రహిస్తారు. 

మేఘా 
మేఘ శ్యాముడు రావు బహద్దూర్ సాఠె గారి ద్వారా షిర్డీ రావడం జరుగుతుంది. మేఘా కూడా బాబా దారం కట్టి లాగిన ఒక పిచ్చుకే. మొట్టమొదట బాబా ముస్లిం అనుకొని మేఘ సేవ చేయడానికి జంకుతాడు. అప్పుడు బాబా అతనిని ద్వారకామాయిలోకి అడుగుపెట్టనివ్వరు. నీవు గొప్పకులానికి చెందిన బ్రాహ్మణుడవు. నేను ముస్లింని అని, నీవు అపవిత్రడవుతావని భావిస్తున్నావు. ఇక్కడనుంచి వెళ్ళిపో అని బాబా అతనిని అక్కడనుంచి తరిమివేస్తారు. అక్కడనుంచి వెళ్లిన తరువాత మేఘ ఆరోగ్యం పాడవుతుంది. కొన్నిరోజులికి బాబాపై నమ్మకం పెరిగి రాత్రి పగలు సాయి శంకర్ అనే నామాన్ని జపించేవాడు. అతడు షిర్డీ వచ్చి బాబాకు అనన్య భక్తుడై సాయిని ప్రత్యక్ష శంకరుని వలే భావించేవాడు. కొన్ని మైళ్ళు నడిచి బిల్వ పత్రాలను తెచ్చి బాబాకు పూజ చేసే వాడు. తరువాత బాబా పాద తీర్ధం సేవించేవాడు. 

ఒక సారి బాబాను గోదావరి నది జలాలతో అభిషేకించాలి అనే సంకల్పంతో బాబాను ఒప్పిస్తాడు. కాని బాబా ఆ జలం తలమీద మాత్రమే పోయమంటారు. మేఘా మాత్రం పరవశంతో మొత్తం నీరంతా బాబాపై పోస్తాడు. కాని విచిత్రం బాబా శరీరం తడవకుండా తల మాత్రమే తడుస్తుంది. అందరు ఆశ్చర్యపడతారు. ఇంకో సారి మేఘాకు బాబా
కలలో కన్పించి త్రిశూలం గీయమంటారు. మేఘ బాబా వద్దకు వెళ్లి ఈ స్వప్నం అర్ధం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు బాబా నిన్ను త్రిశూలం గీయమన్నాను, అది స్వప్నం కాదు నేనే వచ్చి నీకు చెప్పాను. తలుపులన్నీ వేసి ఉన్నాయి అనే అనుమానం వ్యక్తం చేస్తాడు మేఘ. అప్పడు బాబా ఇలా అంటారు " ప్రవేశించుటకు నాకు ద్వారం అక్కరలేదు. నాకు రూపం లేదు. నేను అన్ని చోట్ల ఉంటాను. ఎవరైతే నమ్మి నా ధ్యానమందే మునిగి ఉంటారో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించెదను " అని అంటారు. మేఘ అప్పుడు బాబా పటం పక్కనే త్రిశూలం గీస్తాడు. బాబా దగ్గరకు ఒక రామదాసి భక్తుడు వచ్చి ఒక శివలింగాన్ని ఇస్తాడు. అదే శివ లింగం దీక్షిత్ గారికి కూడా ధ్యానంలో కనిపిస్తుంది. తరువాత ఆ శివలింగాన్ని బాబా మేఘా చేత ప్రతిష్ట చేపిస్తారు. మేఘ ఎప్పుడూ శంకర నామాన్ని తలుచుకుంటూ ఉండే వాడు కాబట్టి అతనికి ఇలాంటి అనుభవాలు ప్రసాదించి అనుగ్రహించారు. అనేక సంవత్సరాలు బాబాను సేవించి 1912 లో మేఘ శ్యాముడు కాలమునొందెను. బాబా అప్పుడు "ఇతడు నా నిజమైన భక్తుడు" అని కొనియాడారు.  అతనిలో భక్తిని స్థిరపరచి మోక్షం ప్రసాదించారు. 


ఓం శ్రీ సాయినాథార్పణమస్తు !




Sri Saisatcharita Chapter - 28



Sai is not confined to one place. Sai dwells in all creation from Brahma to small creatures like ants and flies. He pervades all and is everywhere. Sai was well-versed in the Vedas; and had all the attributes of the Absolute Brahman. As he was proficient in both, he was well-fitted to be the Sadguru. Some people can teach about Self-Realization but they should be able to make you experience this then only they can be called a Sadguru.

This chapter talks about how Baba gave visions to different devotees and appeared in their dreams. One such story is about Lala Laxmichand. He first worked in Railways and then in a press. Later he worked for the Ralli Brothers who were Greek merchants, and they bought things from all over India and had their business establishments in different cities out of which Bombay was one. At that time, Laxmichand worked under one of the officers there as a clerk. He was very honest and obedient. Once he had a dream in which he saw a bearded old sadhu surrounded by devotees. This mahatma was standing thus, to whom he paid his loving reverence. Later he realized that this bearded man is Sai when he was listening to Dasganu Maharaj. He then decided to visit Shirdi. Baba always says “My man can be in any place – even thousands of miles away. I will draw him to me with a string tied to his feet, like a sparrow fledgling”. Baba said these words often. People not only heard them frequently but also experienced that. When one of his friends wanted him to go to Shirdi, he borrowed rupees 15 from his cousin and they take train. He saw 4 Muslims in that train and enquires about Baba as they are from that area.

On the way he thought about offering guavas to Baba but forgets to buy them in Kopergoan. Then at the outskirts of Shirdi, an old lady was seen selling the guavas. He tries to buy some but that lady gives away the whole basket to be offered to Baba. They reach Shirdi and worship Baba with lots of devotion. Then Baba says “The rascal sang bhajans on the way and made inquiries of others. Why ask others? See everything with your eyes. Why ask anyone else? Is the dream true or not? Come to your own decision. What was the necessity of coming for darshan after borrowing money from a Marwadi? Is your heart’s desire fulfilled now?”

Laxmichand felt greatly surprised that Baba should have the knowledge of his inquiries that he had made on the way. Baba showed him that he knew everything that Laxmichand was thinking about. Once he was so hungry and someone brought wheat pudding (Sanza) and he loved it. Next day also he was hoping that someone will bring this. When someone asked Baba what kind of food he would like to have, Baba immediately wanted Sanza. Once Baba had severe cough and Laxmichand felt that Baba probably had some evil eye on him that’s why he was coughing. Then Baba tells Shyama that his cough is because of some evil eye. Then Laxmichand came to understand Baba’s power and became a staunch devotee.

There was lady from Burhanpur and her husband works for the postal department. She had never seen Baba in person; but still she had a dream that Baba has come and is standing at her door, asking for a meal of ‘khichadi’. She woke up immediately but found no one at that place. She told about her dream to everyone promptly. Then the couple decided to go to Shirdi to have darshan of Baba. They stayed there for 2 months. But for 14 days she could not offer her Kichidi to Baba. Then on the 15th day when she goes to Dwarakamai curtains are closed and she did not want to wait anymore. So opens the curtains and goes inside. Usually no one is allowed inside during that time. But Baba asks for Kichidi and eats all of it. Like this Baba blessed his devotees not only by appearing in their dreams but also dragging them to Shirdi to be blessed.

Next story is also such a miraculous journey and Baba blesses Megha with Moksha. He was a very orthodox Gujarathi Brahmin and came to Shirdi because of his boss Hari Vinayak Sathe. He was first reluctant to serve Baba as he thought he is Muslim. Then Baba do not let him into Dwarakamai and surprises him by saying “Beware, if you put your feet on the steps! This place is inhabited by a Muslim. You are a high caste Brahmin and I the lowest of the low, a Muslim! You will be defiled! Go back! ” Later he returned home where he fell sick and was confined to bed. There he began to contemplate upon Baba and came back to Shirdi. At that time when he came, he continued to stay there. He became devoted to Sai. There was no deity for him other than Sai. Sai was his Shankar. He used to chant “Sai-Shankar” day and night, and his inner self was merged in this form. His mind was pure and free of sin.

Megha used to go long distances to get Bel leaves to worship Baba. One day he felt like getting water from Godavari River and give bath to Sai. He asks Sai’s permission for this and Baba reluctantly agrees to this bath. But Sai tells him to put little water only on his head but not the whole body. Once he gets water, he becomes overwhelmed with love and pour all over Sai’s body. But everyone’s surprise only Sai’s head was wet and the whole body was dry. This was a miracle and Megha and everyone around there were amazed. Another time Baba appears in Megha’s dream and asks him to draw a Trident. Later on he gives him Shivalinga and this same Shivalinga appears in Dixit’s vision also. Later, after the drawing of the trident was complete, Sai got Megha to establish the Shiva lingam near the picture. Since Megha liked to worship Shankar, by presenting him with the Shankar ‘lingam’, Sai strengthened his devotion. Such are the marvelous narrations about Sai!


OM SRISAINATHARPANAMASTHU!

Wednesday, March 21, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం -27



హేమద్పంత్ గారు ఈ అధ్యాయంలో గురువు ఎలా మంచి గ్రంధాలను చదివించి తన భక్తులను ముందుకు నడిపిస్తారో చెప్పారు. అలానే విష్ణుసహస్ర నామముయొక్క గొప్పతనాన్ని కూడా చెప్పారు. 

గ్రంథ సేకరణ
బాబా కొన్ని గ్రంథాలను శ్యామాకు ఇవ్వడం జరిగింది. చాలామంది భక్తులు బాబా ఆశీర్వాదం కోసం కొన్ని గ్రంథాలను తెచ్చేవారు. బాబా చాలా వరకు వారి గ్రంథాలు వారికి ఇచ్చేవారు. కొన్నిసార్లు ఒకరు తెచ్చిన గ్రంథాలు ఇంకొకరికి ఇచ్చేవారు. బాబా సర్వజ్ఞుడు. మనము ఏది, ఎప్పుడు చదవాలో ఆయనకు బాగా తెలుసు. అట్లా తెచ్చిన వాటిలో కొన్నింటిని శ్యామాకు ఇచ్చి, జాగ్రత్తగా భద్రపరచమని చెప్పేవారు. షిరిడి పవిత్ర క్షేత్రానికి దేశదేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ కలసి జ్ఞానయజ్ఞం చేస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు అవసరమవుతాయి. నేను నా ధామానికి వెళ్ళిపోయాక శ్యామా దీనిని తీసి చూపుతాడు. ఈ గ్రంథాలు నా ప్రతిరూపాలు అవుతాయి. పరమపావనమైన ఈ గ్రంథాలు షిర్డిలో కాని, ఇతర ప్రదేశాలలో కాని చదివితే బాబా గుర్తుకు వస్తారు. పుస్తకాల సంగ్రహణకు కారణం ఇదే అయి ఉంటుందని హేమద్‌పంత్ సాయిసచ్చరితలో రాస్తారు.

విష్ణు సహస్రనామం-రామదాసి సాధువు కథ
శ్యామాకు బాబాపై అపరిమితమైన భక్తి ఉన్నట్లే, బాబాకు కూడా శ్యామాపై అత్యంత ప్రేమ ఉండేది. ఒకసారి ఒక రామదాసి సాధువు మశీదులో ఉండి గ్రంథ పఠనం చేసేవాడు. ఆయన విష్ణు సహస్రనామం చక్కగా చదివేవాడు. ఆ తరువాత ఆధ్యాత్మ రామాయణం కూడా పారాయణం చేసేవాడు.

 బాబా తనకు కడుపులో నొప్పిగా ఉన్నదని, సోనాముఖి అనే మందు తెమ్మని అతన్ని పంపించి, ఆ విష్ణు సహస్రనామ పుస్తకం శ్యామాకు ఇస్తారు. శ్యామా అప్పుడు దేవా! ఆ రాందాసి ముక్కోపి నాకు ఈ పుస్తకం వద్దు. నాకు ఈ సంస్కృత పదాలు నోరుతిరగవు నన్ను దీంట్లో ఇరికించవద్దు అని అంటాడు. కాని బాబా ఆ పుస్తకం తీసుకోమని చెప్పి దాని విశిష్టత ఇలా చెప్తారు.  "శ్యామా దీనిలో గొప్ప గుణాలు ఉన్నాయి. అందువల్లె దీనిని నీకు ఇస్తున్నాను, చదివిచూడు. ఒకసారి నాకు చాలా బాధ కలిగింది. గుండె దడ దడ లాడింది. ప్రాణం రెపరెప లాడింది. నేను బ్రతుకుతానన్న నమ్మకం పోయింది. ఆ సందర్భంలో ఈ పుస్తకం ఎంతగా ఉపయోగపడిందో నీకెలా చెప్పను? శ్యామా ఈ పుస్తకం వలననే ఈ ప్రాణాలు రక్షించబడ్డాయి. ఒక్క క్షణం గుండెకు హత్తుకోగానే వెంటనే ప్రాణం కుదుట పడింది. దేవుడే నాలో ప్రవేశించి నా ప్రాణాలు కాపాడాడు అని అనిపించింది. దీనివలననే జీవుడు బతికాడు. అందువల్ల శ్యామా! నీవు దీనిని తీసుకొని వెళ్ళి మెల్లమెల్లగా చదువు. రోజూ ఒకటో అరో మాటలను నేర్చుకో. గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది" అని చెప్పారు.
తరువాత రామదాసి సాధువు వచ్చి ఆణ్ణాచించినీకర్ ద్వారా జరిగిన సంగతి తెలుసుకొని శ్యామాపై విరుచుకుపడ్డాడు. నువ్వు ఒక పథకం ప్రకారం ఈ పుస్తకం కొట్టేశావు. నా పుస్తకం నాకు ఇవ్వకపోతే నీ ఎదుటే తలబద్ధలు కొట్టుకుని రక్తం చిందిస్తాను. మాధవరావు ఎన్నో విధాల నచ్చచెప్పినా రామదాసు శాంతించలేదు. అప్పుడు శ్యామా చాలా శాంతంగా "నేను కపటినని నాపై నిందవేయకు. వృధాగా నాకు దోషాన్ని అంటకట్టకు. ఆ పుస్తకం విశేషమేమిటీ? అది ఎక్కడా లభించదా? నీ పుస్తకాలకు రత్నాలు పొదిగారా, లేక బంగారం తొడిగారా? బాబాపైన కూడా నీకు విశ్వాసం లేదు. ఇది సిగ్గు పడవలసిన విషయం" అని అన్నాడు. 

అప్పుడు బాబా రామదాసి సాధువుని చూసి ఈ విధంగా అన్నారు. "రామదాసూ! ఇప్పుడు ఏం మునిగి పోయింది? అనవసరంగా ఎందుకు బాధ పడుతున్నావు. శ్యామా మన కుర్రవాడే కదా, నీవు ఊరికే ఎందుకు నరాలు తెంచుకుంటున్నావు? వృధాగా ఎందుకింత కష్టపడుతున్నావు? ప్రపంచానికి తమాషా చూపిస్తున్నావు. ఎందుకిలా కయ్యానికి కాలు దువ్వుతున్నావు. చక్కగా మంచిగా మాట్లాడు రామా?
 ఈ పుస్తకాలను నిరంతరం చదువుతావు, అయినా నీ అంతకరణం ఇంకా శుద్ధి కాలేదు. నీవు ఎటువంటి రామదాసువయ్యా? నీకు అన్నింటి యందు అనాసక్తి ఉండాలి. కాని నీకీ పుస్తకం పైనే వ్యామోహం పోలేదు. రామదాసుకు మమత ఉండరాదు. సమత ఉండాలి. ఆ పుస్తకాన్ని నేనే శ్యామాకు ఇచ్చాను. అదంతా నీకు కంఠస్థం కదా!"
              
రామదాసు బాబా చెప్పిన మాటలు విని కోపంగా బాగా ఎర్రబారిన ముఖంతో శ్యామాను ఉద్దేశించి ఇదిగో నీకిప్పుడే చెబుతున్నా దీనికి బదులుగా నువ్వు పంచరత్న గీతను ఇవ్వు అన్నాడు. తరువాత శ్యామాకు బాగా నిష్ఠ కుదిరి దీక్షిత్ మరియు నార్కెల సాయంతో మెల్లగా విష్ణుసహస్ర నామం నేర్చుకొని తరించాడు. ఇక్కడ బాబా విష్ణుసహస్రనామం యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా చెప్పారు.
  
            విష్ణుసహస్రనామాలను స్వహస్తాలతో శ్యామా కంఠానికి కట్టి అతని భవ, భయ, బాధలనుండి ముక్తుణ్ణి చెయ్యాలని ఆ పుస్తకం శ్యామాకు ఇవ్వడం జరిగింది. బాబా ఇంకా ఇలా చెప్పారు. అతనికి నామంపై ప్రీతి కలిగిస్తాను. నామం పాపాలనే పర్వతాలను పగలగొట్టుతుంది. నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది. నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరికివేస్తుంది. నామం కాలుని మెడను విరిచేస్తుంది. నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది.

శ్యామాకు ఇటువంటి సహస్రనామం మధురమవ్వాలి. ప్రయత్న పూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది. అప్రయత్నంగా నామ జపం చేసినా చెడుకలగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించినా నామ ప్రభావం ప్రకటమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్ధాన్ని పోషిస్తుంది. నామ జపానికి స్నానం చేయాల్సిన పనిలేదు. అట్లే నామానికి విధి విధానాలేవి లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు ప్రక్షాలన మవుతాయి. మెల్లమెల్లగా లోలోపల నా నామాన్ని జపించే వారు ఉత్తమ గుణ సంపన్నులకంటే ఉత్తములు.

విఠల దర్శనం: ఒకసారి దీక్షిత్ స్నానం చేసి ధ్యానానికీ కూర్చున్నాడు. అప్పుడు ధ్యానంలో విఠల దర్శనం కలిగింది. తరువాత ద్వారకామాయికి వెళ్ళాడు. అప్పుడు "అయితే విఠల్ పాటిల్ నీ వద్దకు వచ్చాడన్న మాట. ఔనా! నువ్వతన్ని కలుసుకున్నావు కదా! కాని జాగ్రత్త విఠలుడు చపలుడు. నీ కన్ను గప్పి క్షణాలలో మాయమయిపోతాడు. అతన్ని గట్టిగా పట్టుకో, అతన్ని ఒక్కచోటనే పెట్టుకో, లేకపోతే అతను మెల్లగా జారుకుంటాడు. నువ్వు ఏ మాత్రం ఒక్క క్షణం కూడా అజాగ్రత్తగా ఉన్నా, అతను మాయమవుతాడు” అని దీక్షిత్‌కు చెప్పారు. ఇంతలో షిరిడికి ఒకతను కొన్ని విఠలుడి చిత్రాలను అమ్ముదామని తెచ్చాడు. ఒక చిత్రంలో విఠలుడి స్వరూపం తన ధ్యానంలో కనిపించిన చిత్రంలాగా ఉంది. వెంటనే బాబా మాటలు గుర్తుకు వచ్చి ఆ చిత్రం కొనేశాడు. దాన్ని పూజా మందిరంలో ఉంచి పూజించాడు. 

గీతా రహస్యము : ఒక రోజు బాపు సాహెబ్ జోగుకు ఒక పార్సెల్ వస్తే అది తీసుకొని ద్వారకామాయి వస్తారు. అది తిలక్ గారు వ్రాసిన గీతా రహస్యము. జోగ్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటె ఆ పుస్తకము క్రిందపడుతుంది. బాబా ఆ పుస్తకములో కొన్ని పేజీలు చూసి పుస్తకముపై ఒక రూపాయి పెట్టి ఆశీర్వదించి ఇలా అంటారు. " దీనిని పూర్తిగా చదువుము. నీకు మేలు కలుగును" అని చెప్పారు. 

ఖాపర్డే దంపతులు: 
ఖపర్దెగారి పూర్తిపేరు గణేశ్ శ్రీ కృష్ణ ఖపర్డె. ఆయన అమరావతిలో ప్రసిద్దిగాంచిన ప్లీడర్. క్రిమినల్ లాలో మంచి ప్రాక్టీస్‌తో ప్రముఖ న్యాయవాదిగా పేరు సంపాదిస్తారు. కపర్డె ఆదాయం ఆ రోజుల్లోనే దాదాపు సంవత్సరానికి లక్ష రూపాయలు ఉండేది. ఆయన గొప్ప వక్త. బాలగంగాధర్ గారికి కుడి భుజంగా ఉండేవారు. ఖాపర్డే గారు బాబా
ముందు మౌనంగా ఉండే వారు. శ్రీమతి ఖపర్డె పూర్తి పేరు లక్ష్మీబాయి గణేశ ఖపర్డె. ఆమె చాలా అణుకువతో ఖపర్డె గారి పెద్ద సంసారాన్ని నడుపుతూ వచ్చారు. ఆమెకు బాబాకు కూడా చాలా ఋణానుబంధం ఉంది. ఆమె 7 నెలలు షిర్డిలో ఉన్నారు. ఆమె సాయికి చేసిన సేవ అపారమైనది. లక్ష్మీబాయి అత్యంత నిష్టావంతురాలు. ఆమెకు సాయి పాదాలయందు అత్యంత ప్రేమ. ఆమె నిత్యం మసీదుకు నైవేద్యాన్ని స్వయంగా తీసుకుని వచ్చేది. బాబా నైవేద్యాన్ని స్వీకరించే వరకు ఉపవాస వ్రతంలో ఉండేది. సాయి మహరాజు ఆరగించిన తరువాత మాత్రమే ఆమె భోజనం చేసేది. ఒకసారి ఆమె భక్తికి మెచ్చి ఆమెకు పరమార్ధ మార్గాన్ని చూపించారు.బాబా బోధనా పద్దతి ప్రత్యేకమైనది. వారు ఆడుతూ పాడుతూ, నవ్వుతూ హృదయంలో బాగానాటుకొనేలా అనుగ్రహాన్ని ప్రసాధించేవారు.

                  ఒకసారి ఖపర్డె భార్య అన్నం, పప్పు, పూరి, హల్వ, పాయసం, అప్పడాలు, వడియాలు, వడపప్పు పళ్ళెంనిండా పెట్టుకొని వచ్చింది. బాబా వెంటనే ఆత్రంగా తమ ఆసనంపై నుండి లేచారు. చేతిపైన కఫినీని పైకి జరుపుకొని భోజనం చేసేందుకు సిద్దం అయ్యారు. అప్పుడు శ్యామా బాబానుద్దేశించి "దేవా అందరూ రుచికరమైన పదార్దాలు తెస్తారు, కాని ఈమె తెచ్చిన ఆహారం మీద మీకు ఎందుకు ఇంత ప్రేమ" అని అడిగితే అప్పుడు బాబా ఈ విధంగా చెప్పారు. ఈ భోజనం యొక్క విశేషం ఏంటో చెప్పమంటావా! పూర్వం ఈమె బాగా పాలిచ్చే ఆవు. ఆ తరువాత కనిపించకుండా పోయింది. తరువాత ఒక మాలికి జన్మించింది. ఆ తరువాత ఒక క్షత్రియని ఇంట్లో పుట్టింది. మరుజన్మలో ఒక వైశ్యుని పత్ని అయింది. తరువాత బ్రాహ్మణ గర్భంలో జన్మించింది. చాలా కాలానికి కనిపించింది. ప్రేమతో తెచ్చిన అన్నం రెండు ముద్దలు సుఖంగా తిననివ్వు, అని ఆహారం తృప్తిగా తిన్నారు.

                 బాబా అన్నం తినిన తరువాత ఆమె బాబా పాదాలను వత్తుతు సేవ చేయసాగింది. బాబా చరణాలను పట్టుకున్న ఆమె చెయ్యి నెప్పట్టకుండా బాబా ఆమె చేతిని వత్తసాగాడు. ఇది చూసి శ్యామా ఆహా ఏమి భాగ్యము! భగవంతుని భక్తురాలి పరస్పర ప్రేమను, సేవను చూసి శ్యామా పరిహాసమాడాడు. ఆమె  సేవకు బాబా ప్రసన్నులై ఆమెతో మెల్లగా రాజారాం, రాజారాం అను, అలా ఎల్లప్పుడూ అంటూ ఉండు. అమ్మా నీ జీవితం సఫలమౌతుంది. నీ మనస్సు శాంతిస్తుంది. నీకు అపరిమితమైన శుభం కలుగుతుంది. అని చెప్పారు. ఇలా బాబా మాటలు ఆమె హృదయంలోకి చొచ్చుకుపోయి తక్షణం శక్తి పాతం చేస్తాయి. జ్ఞాని అయిన గురువుని ఆశ్రయించిన శిష్యుని ధ్వైతం నశించిపోతుంది. గురువు ఒక ఊరిలో ఉండి శిష్యుడు మరో ఊరిలో ఉన్నట్లు భావిస్తే అది బాహ్యమైన సంబందం మాత్రమే, అసలు వారు ఇద్దరు కానప్పుడు వారు వేరు ఎలా అవుతారు. ఒకరు లేక ఒకరు ఉండరు. గురువు మరియు శిష్యులయందు బేధంలేదు. ఇది నిత్య సత్యం.

శ్రీ సాయినాథార్పణమస్తు! 

Sri Saisatcharita Chapter- 27


In this chapter Hemadpanth Talks about how Baba blessed his devotees by giving them good books. Baba also tells us the significance of Vishnu Sahasranama and some other stories. 

Collection of Sacred books:
Baba gave some books to Shyama to save them for the future. Some of the devotees wanted to bring their books so that Baba can bless them. Sometimes Baba did not give the same book that they wanted. He gave some other book to their surprise. He knows what we need and when we should read a particular book. This way he gave few books to Shyama. He predicted that lots of people will come to Shirdi and they will do Jnaana Yagna (Recitation of sacred books). Then all these books will become handy. If we study these scriptures with devotion our minds will automatically think about Baba.


Vishnu Sahasranama – Ramadasi Sadhu Story:
Just as Shyama was an ardent devotee, so was Baba’s love for him. A desire, therefore, arose in Baba to put him to some regular practice for his spiritual progress.

The story from Satcharita goes as follows;

One day, in the masjid, there was a Ramdasi Bua. It was his regular practice to read the Ramayana. Early morning, after doing his ablutions, taking his bath and doing the Sandhya after applying the sacred ashes and wearing ochre robes, he sat at a fixed place to read. He read the Vishnusahasranama and Adhyatma Ramayan, thereafter. He read these books often and often. Madhavrao’s services had borne fruit. It was time now to put him into some regular practice and give him some prasad of the path of devotion, so that he would get relief in the worldly life. When Baba thought like this, he called the Ramdasi near him and said: “I have a shooting pain in my stomach. It is as if the intestines are tearing apart. Go, this pain in the stomach is not abating. Quickly bring some senna pods. Unless I take some small quantity, this vexing ache will not stop.”

After he left the Masjid, Baba took Vishnusahasranama book and gave it to Madhavrao (Shyama). Baba then said: “Shyama, you know this pothi. See it is very beneficial. Therefore, I am giving it to you. You should read it. Once I suffered intensely. My heart began to palpitate. I was restless and I had no hope for myself. Shyama what can I tell you of that experience? How that book proved useful! This life was saved by it. I hugged it to my heart for a while and immediately felt relief. It seemed as if Allah himself had come down and this life was saved by it. Therefore Shyama take it with you. Read it gradually. Every day, take one or two words. It will give you great joy.” Shama said: “I do not want it. The Ramdasi will be furious with me and he will say that I have behind his back, done this wrong. As it is, he is half-crazy, irascible, ill-tempered and ever complaining. Why, unnecessarily, pick up this quarrel with him? I do not want this annoyance. Besides, the pothi is in Sanskrit. My speech is crude and rustic. My tongue cannot twist round these joined words. I cannot pronounce them clearly”. Seeing all Baba’s actions, Shyama thought that Baba wanted to set him up against the Ramdasi but he had no idea of Baba’s heart-felt concern for him.

That Ramadasi returned soon bringing the senna-pods medicine. And found out what happened. The Ramdasi was, as it is, ill-tempered. Moreover, he had suspicions about Madhavrao. He said: “He made Baba the intermediary to snatch away my book”. He launched a vicious verbal attack on Madhavrao. His violent anger was uncontrollable and he showered a lot of abusive language on him. “The stomach ache was just a pretext. It was you who instigated Baba. You had an eye on my book. I will not tolerate it. I am a fearless Ramdasi, as my name itself suggests. If you do not return the book without creating any problems, I will dash my head in front of you and scatter my blood profusely. You coveted my book, planned out this insidious drama, and putting the whole blame on Baba, kept yourself aloof”. Madhavrao tried his best to make him understand but the Ramdasi would not be pacified.

Then listen to what Madhavrao said very calmly. “Do not falsely accuse me of being deceitful. Why are you fussing so much about that book of yours? It is not a rarity. Is your book decorated with gold and studded with gems? If you don’t have faith in Baba, despicable is your existence”.

Seeing the Ramdasi’s insistence, Baba very sweetly said to him: “Oh, Ramdasi, what is the problem? Why are you unnecessarily distressed?

Is not Shyama our lad? Why do you quarrel loudly and vehemently, for no reason creating a scene? Why are you always ready to fight? Can you not speak soft and sweet words? Though you read these books regularly, your mind is still impure.

Every day you read the Adhyatma Ramayan and recite the Sahasranama. Yet you have not discarded your passions which are uncontrolled. And you call yourself a Ramdasi! What kind of a Ramdasi are you? You should be absolutely detached; but you are not able to overcome your intense desire to possess the book. What name can be given for this behavior? A true Ramdasi should have no attachment but look at the young and old with equality. You are harboring enmity for this boy and coming to blows for this book! Go and sit in your place. Books can be had in plenty for money but not men, till the end of time. Remember this well. Shyama has no knowledge about the worth of your book. I picked it up, on my own and gave it to him myself. You know the book by heart. I thought of giving it to Shyama who will read it, repeatedly recite it and obtain the utmost benefit”.

Ramdasi realized the situation. Yet he said to Madhavrao with anger: “Instead of this book, I will take Panch-ratni Gita from you. I am telling you clearly now”. Madhavrao was pleased that the Ramdasi was pacified. “Why one, I will give you ten copies of the Gita,        instead.” Be it so. The dispute was thus resolved. The Gita was accepted as security.

But why did a man unacquainted with the deity in the Gita demand it?
One who constantly read the Adhyatma Ramayan in front of Sai, why should that Ramdasi be rude to Baba and quarrel right in front of him?

Later on, Shyama’s faith was developed. Dixit and Narke taught him to pronounce the words correctly, by repeating and conning them over and over again and to know their meanings. He learnt the book by heart.


Here Baba gave us an important lesson and told us about the greatness of Vishnu Sahasranama.  

Baba said that he will tie the necklace of this Vishnusahasranama around Shyama’s neck to free him from the miseries of the worldly existence by giving him a fondness for reciting it.

God’s Name can break down mountains of sin.

The Lord’s Name breaks the shackles of the body.

God’s Name pulls out millions of ill desires from their roots.

God’s Name humbles the pride of death and ends the cycle of birth and death.

The Lord’s Name chanted with full intent is very effective but even an unintentional pronouncement can be beneficial. Its power is manifested even when it is uttered unawares.

For the purification of the Inner Self there is not another simpler means than chanting the Lord’s Name.

The Lord’s Name is the adornment of the tongue.

The Lord’s Name sustains spirituality.

It is not necessary to have a bath to say the Lord’s Name.

Taking the Lord’s Name is not regulated by the rules of the Shastras (Scriptures).

The Lord’s Name destroys all sins.

The Lord’s Name is always pure.

The continuous chanting of My Name itself will ferry you across the ocean of existence. No other means are necessary to achieve salvation.

Whoever frequently repeats My Name, his sins will be burnt. I consider him more virtuous than the virtuous, whoever constantly hums my name’.

Vittal Darshan (vision):
Once Dixit took a shower and sat for meditation. He then sees Lord Vittal in his meditation. After that he went to see Baba. Baba immediately says, “Vittal Patil came to you. Did you meet him? But be careful, don’t let him go. He is very fluid
and slips away easily”. Then Dixit goes to his wada. There comes a person selling Lord Vittal’s photo frames. One of the pictures resembled exactly the same as he saw in his vision. He remembers Baba’s words, immediately buys that picture. He keeps that in his pooja mandir (Altar).

Gita Rahasya: Once Bapusaheb jog gets a book written by Balagangadhar Tilak in mail. He takes this book with him and goes to Dwarakamai. The book falls down when he was trying to prostrate to Baba. Sai turned some pages and handed the book to Jog by putting a rupee coin on the book. He tells him to read this book completely so that he can benefit from this book. 

Mr and Mrs Kapardhe: 
Mr. Dadasaheb Kapardhe's full name is Sri Ganesh Sri krishna Kapardhe. He was a famous lawyer in Amaravati. He was very rich and he used to earn so much money at that time. He was very good speaker also but he used to be very quiet when he is with Baba. Dada Saheb stayed in Shirdi for 4 months and his wife stayed there for 7 months. We only know her details as wife of Khaparde. She was highly cultured. She had read and also heard from Keertankars the stories from Ramayana, Mahabharat, Pandav-Pratap, Shiva Lilamrit etc. She had a special relationship with Sai. Sai himself told people about her greatness. She stayed in Shirdi for almost 7 months and served Sai personally. She adored Sai’s feet. She used to eat only after she gave food to Baba. Once he felt so pleased with her service, he blessed her with some great words. Baba style of teaching is such you never will realize that you are learning but you will see changes in your personality. Now let’s look at one of Mrs. Khaparde’s stories; 

Once Mrs. Khaparde brought a platter filled with ‘sanza, sheerapuri, bhat, varan, kheer, sandge, papad, koshimbiri’. As soon as this platter came, Baba most eagerly got up from his seat, rolling up the sleeves of his kafni. He went and sat down at his usual place for eating, pulled the platter in front of him, took off the outer cover and got ready to eat. Many other naivedyas came, far superior to this one. Often they remained untouched. What was the greatly impelling reason to eat this only? Why should such a worldly attitude affect a Saint? Madhavraoji asked Sai Samartha: “Why should there be such a distinction? You keep aside all the other platters. Even if some are made of silver, you hurl them far away. But, only when this lady’s platter came, you got up immediately and started eating. This is surprising! Why is her food so delicious? Deva, this is a great mystery to us. There is some stratagem of yours, here! Why should you have such likes and dislikes? ”

Baba said: “What can I say about the surpassing quality of this food? In her earlier birth, this lady was a very fat cow belonging to a merchant, yielding much milk. Then, she disappeared and took birth in a gardener’s family. Later she was reborn in a Kshatriya family and got married to a merchant. Then, she was born in a Brahmin family. I saw her after a very long time. Let me take a few morsels of food, she has offered with love, with contentment”.

After saying this, he did full justice to the meal, washed his hands and mouth, belched to show his satisfaction and resumed his seat. The lady did an obeisance and started gently pressing Sai’s feet. Baba took the opportunity to give her some beneficial advice. While the lady pressed Baba’s feet, he in turn, pressed those hands which served him. Seeing this reciprocity of service between Deva and devotee, Shama joked about it. “It is going on well, Deva! It is a pleasurable sight to see this reciprocal devotion. It is marvelous to behold”.

Considering her service, Baba was pleased with her and softly told her to keep on repeating “Rajaram, Rajaram”. “Keep chanting this always. Oh, mother, your life’s objective will be achieved, your mind will be at peace, and you will be immensely benefited”. How potent were those words! They penetrated her heart and became embedded there. Through these words, Baba had instantly imparted ‘Shakti – pata’ (transfer of yogic energy). Such was Sree Samartha the compassionate! Sainath, the protector of all who have surrendered! He always fulfils the devotees’ cherished desires and works for their welfare.

The Guru and the devotee are not separate, though they appear different or distinct. He who attempts to separate them forcefully is bound to be humiliated. Both are one and one cannot live without the other. When guru blesses the disciple then there is no duality. The Guru lives in one place and his disciple at another! He who likes it thus, then their relationship is only for appearances sake. If essentially they are not two, how can they be separate? One cannot exist without the other; both are so inseparable! There is no difference between the Guru and the devotee; thus they are continuously together. The devotee placing his head on the Guru’s feet is a gesture of worship or outward vision.



Sri Sainatharpanamasthu!

Wednesday, March 14, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం - 26



ఆత్మ స్వరూపంలో ఉన్న ఈ విశ్వం చరాచరాలలతో బహుచక్కగా కనిపిస్తుంది. అద్దంలో కనిపించేవన్ని వాస్తవానికి అద్దంలో ఉండవు. నిద్రలో కనిపించినవి మెలుకువ రాగానే నశించిపోతాయి. జాగ్రదావస్థలోకి రాగానే స్వప్నంలో లభించిన ప్రపంచం పోతుంది. విశ్వం యొక్క స్పురణ, సత్తా మరియు ఆధిష్టానమైన, గుర్వాత్మ అగు ఈశ్వరుడు ప్రసన్నుడైనప్పుడే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ స్వరూపము సత్య స్వరూపము మరియు స్వప్రకాశకమైనది. గురువు వచనాలను బోధించే సమయం ప్రాప్తించినప్పుడు మాయమైన ఈ దృశ్యజగత్తు తత్వ జ్ఞానంతో  లయమై పోతుంది. 

హేమద్‌పంత్ ఈ అధ్యాయంలో సాయి మానసపూజను చక్కగా వ్యక్తపరిచారు.

సాయిదేవా! మాకు ప్రేరణ కలిగించేది మీరే. మావాక్కును నడిపించేది మీరే. మీ గుణాలను గానం చేయడానికి నేనెవరిని? చేసేవారు చేయించేవారు మీరొక్కరే. మీతో సత్య సమాగం మాకు ఆగమనిగమాలు. నిత్యం మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణం. అనుక్షణం మీ నామవర్తనే మాకు కథా కీర్తన. అదే మా నిత్యానుష్టానం, అదే మాకు తృప్తి. మీ భజన నుండి దూరం చేసే సుఖాల మాకు వద్దు. పరమార్ధంలో ఇంతకంటే అధికంగా అధఃపతనాన్ని కలిగించే ఆటంకాలు ఏవి ఉంటాయి?

ఆనందాశ్రువుల వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను. నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పూస్తాను. మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాను. బాహ్యోపచారపూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మిమ్ము ప్రసన్నులను చేసి సుఖ సంతుష్టుణ్ణి అవుతాను. సాత్విక అష్టభావాలనే నిర్మలమైన అష్టదళాల కమలాన్ని అచంచలమైన ఏకాగ్ర మనస్సుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను. శ్రద్ధ, భక్తి అనే బుక్కాను మీ నొసట అద్ది దృఢమైన విశ్వాసమనే మొలత్రాటిని మీ నడుముకు బంధించి, మీ పాదాంగుష్టాల  యందు నా కంఠాన్ని అర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాను. ప్రేమరత్నాలతో మిమ్ములను అలకరించి నా సర్వస్వాన్ని మీకు దిగదిడుపు దిష్టి తీస్తాను. నా పంచప్రాణాలను వింజూమరలుగా వీస్తాను. మీ తాపనివారణ కొరకు తన్మయత్వమనే గొడుగు పట్టుతాను. ఈ విధంగా గంధం, అర్ఘ్యం మొదలైన అష్టోపచారాలతో సాయి మహారాజా! మా మంచికోసం మీకు స్వానందపూజ చేస్తాను. నా మనోభీష్టాలు తీరడానికి ఎల్లప్పుడూ సాయి సమర్ధ అని స్మరిస్తాను. ఈ మంత్రం ద్వారానే పరమార్ధం సాధిస్తాను. నిష్ఠతో కృతార్థుడను అవుతాను. 

భక్త పంత్
ఇలా చెప్పిన తరువాత భక్త పంత్ గారి అనుభవాలను ఈ అధ్యాయంలో చెప్పారు. పంత్ గారు ఒక సారి బంధువులతో మరియు స్నేహితులతో కలిసి రైలు ప్రయాణంలో వెళ్తూ ఉంటె వారు ఆయనను షిర్డీకి రమ్మని పిలుస్తారు. కాని ఆయనకు అప్పటికే ఒక సద్గురువు ఉన్నారు. ఇష్టం లేక పోయినా వారి మాట కాదనలేక షిర్డీకి వెళ్తారు. ద్వారకామాయికి వెళ్ళగానే పంత్ గారికి మూర్ఛ వచ్చి పడిపోతారు. అందరు కంగారుపడతారు. తరువాత బాబా కటాక్షముతో ఆయన దాని నుండి తేరుకొని కూర్చుంటారు. అప్పుడు బాబా ఇలా అంటారు. ఏమైనను కానిండు. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. నీ గురువునందే యాశ్రయము నిలుపుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగి యుండుము అని చెప్పిరి. పంత్ గారు ఈ మాటల ప్రాముఖ్యాన్ని  గ్రహించెను.  ఇలా బాబా  మతాలను కూడా మారవద్దని, మనము ఏ గురువుని నమ్మితే ఆ మార్గంలోనే నడవమని ప్రోత్సహించే వారు. దేవుడొక్కడే అని, ఆయనే సర్వాధికారి అని ఎల్లప్పుడూ అంటూ ఉండేవారు. 

హరిశ్చంద్ర పితలే
హరిశ్చంద్ర పితలే గారి విషయంలో కూడా బాబా వారి పూర్వీకుల గురువుల అనుబంధాన్ని గుర్తు చేస్తారు. పితలే గారికి మూర్ఛ రోగంతో బాధపడుతున్న ఒక కుమారుడు ఉండే వాడు. వానికి ఎన్నో వైద్యాలు చేపించినా ఆ జబ్బు తగ్గక చివరికి దాసగణు గారి కీర్తనల ద్వారా తెలుసుకొని బాబాను చేరుకుంటారు. ఆ బాబుని భార్యాభర్తలు సాయి పాదాల దగ్గర ఉంచుతారు. ఆ పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రన తిప్పి పడిపోతాడు. అతని నోటివెంట చొంగ కూడా కారి స్పృహ కోల్పోతాడు. అప్పుడు వాని తల్లి గాబరపడి కంటినీరు పెట్టుకుంటే బాబా ఆమెకు దైర్యం చెప్పి వాడాకు వెళ్ళమంటారు. ఒక అరగంట తరువాత వానికి తెలివి వస్తుంది. తరువాత వానికి ఈ జబ్బు నయం అవుతుంది. ఆ దంపతులు మరల ద్వారకామాయికి వెళ్ళినప్పుడు బాబా ఇలా అంటారు  " నీ యాలోచనలు, సంశయములు, భయోత్పాతములు, ఇప్పుడు చల్లబడినవా ? ఎవరికైతే నమ్మకము ఓపిక గలదో, వారిని తప్పక భగవంతుడు రక్షించును" అని చెప్పారు. 

కొద్ది రోజుల తరువాత వారు ఇంటికి వెళ్లదలిచి బాబా దగ్గరకు వెళ్తారు. అప్పుడు బాబా పితలేకు ఊది ఇచ్చి ఇలా అంటారు "బాపూ ! అంతకుముందు రెండు రూపాయలు ఇచ్చివుంటిని, ఇప్పడు మూడు రూపాయలు ఇస్తున్నాను. ఇవి మీ పూజామందిరంలో పెట్టుకొని పూజించుము. నీవు మేలు పొందెదవు" అని వారిని పంపించెను. కాని ఇంతకు ముందెన్నడూ బాబాను వారు కలవలేదు మరి ఆయన రెండు రూపాయలు ఎప్పుడు ఇచ్చారు అనుకుంటూ వాళ్ళ అమ్మకు ఈ విషయం చెప్తారు. అప్పుడు ఆమెకు తన భర్తకు అక్కల్కోట మహారాజ్ గారు ఇచ్చిన రెండు రూపాయలు గుర్తుకి వచ్చి ఆ విషయం చెప్తారు. సాయి సర్వజ్ఞతను వారందరు అర్ధం చేసుకొని పరవశం పొందుతారు. 

గోపాల నారాయణ అంబాడేకర్ అనే ఆయన బాబాకు మంచి భక్తుడు. ఆయన ఒక 10 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత ఇంకో ఉద్యోగం వెతుక్కోవలిసి వస్తుంది. ఎన్ని రోజులు ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు. నిరాశపడి చివరకు షిర్డీలో ప్రాణ త్యాగం చెయ్యాలని వస్తాడు. అక్కడవున్న నూతిలో దూకి చనిపోవాలని ఒక రాత్రి అక్కడ తిరుగుతూ ఉంటె సగుణమేరు నాయక్ ఆయనను పిలిచి అక్కల్కోట మహారాజుగారి చరిత్రను చదవమని ఒక పుస్తకం ఇస్తాడు. అప్పుడు అంబాడేకర్ పుస్తకాన్ని తెరిస్తే ఇలా వ్రాసి ఉంటుంది " గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తికాకున్నచో ప్రాణ త్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలం ఈ కర్మ అనుభవించరాదు? గత జన్మల పాపములను 
ఏల తుడిచివేయరాదు ? దీనిని శాశ్వతముగా పోవునట్లు చేయుము." ఇలా సమయానికి ఆ కథ ద్వారా సత్యాన్ని తెలుసుకొని తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుంటాడు అంబాడేకర్. ఈయన తండ్రికూడా అక్కల్కోట మహారాజ్ గారి భక్తుడు. తరువాత అంబాడేకర్ బాబాపై నమ్మకం దృఢం చేసుకొని జీవితంలో స్థిరపడతాడు. 

శ్రీ సాయినాథార్పణమస్తు !










Sri Saisatcharita Chapter- 26




All objects of enjoyment related to the elements – in fact, the entire universe is contained within the soul as a reflection of a city in a mirror. The confusion is on account of Maya which is manifested. In reality, it (Maya) has not manifested. It is forever present in the Absolute. But it is also in the world bringing all the movable and immovable objects into being. Whatever is seen in the mirror does not exist in it. Like visions seen in a dream appear very real but on waking all that is gone. When one is awakened the dream world disappears. The joy of the light of Unity appears because of the Sadguru’s significant words.

Hemadpant gave us Sai manasa (mental prayer) puja in beautiful words.

You are the one to kindle me. You alone are the one to provoke my speech, so who am I to sing your praises? You are the doer who gets things done. To be always in your company is itself our study of the Scripture. Listening to your life story daily is itself our reading of religious texts. Chanting your name without wasting a moment is itself equivalent to doing ‘katha and kirtan’. This itself is our regular meditation and that is itself our satisfaction.

We do not wish to have such happiness which causes us to turn our backs on worship, Could there be any bigger obstacle in attaining the ultimate goal? Let my tears of joy be the warm water to wash your feet; Let me besmear your body with the sandal paste of pure love; Let me cover your body with the cloth of true faith. May this puja from my heart propitiate you better than the outward ritualistic one and endow you with pleasure and happiness. Let us offer the eight lotuses in the form of our eight very pure, satvik emotions and the fruit in the form of our concentrated mind. Let us apply ‘buka’ of devotion to the forehead. Let us tie the girdle of deep devoutness and place our neck on your toes. Then let us enjoy the tender and wonderful celebration.

Adorning him with the jewels of our love, let us wholeheartedly ward off the evil eye. Make a ‘chamar’ with our five ‘pranas’ and wave it before you to ward off the heat. After concluding such blissful worship, let us do the eight fold obeisance, offer fragrance and oblations of water. In this manner, we shall worship you, Sairaja, for our own welfare.


Mr. Panth
After serving Baba with manasa puja, now Hemadpanth talks about the story of Mr. Panth who was a disciple of another sadguru. Once he was traveling in a train where he meets his friends who are going to Shirdi to visit Baba. They pressure him to go with them and he accepts this offer reluctantly. once they go there, Panth gets a seizure and falls down. Everyone was frightened and tried to revive him. With Baba's blessing he becomes alert after a while. Then Baba tells him to be firm with his Guru be steady in his faith. Then Panth understood what Baba was saying and knew the significance of Baba's words. Baba never allowed anyone to even change anybody's religion and always encouraged to stay the course where ever you are. 

Harischandra Pitale
The next story is about Harischandra Pitale whose son was suffering from severe form of epilepsy. Pitale tried all kinds of treatments for his son but he continued to have seizures. He lost his hope and once day heard about Baba through keertans of Dasganu Maharaj. Then decided to go to Shirdi with his family and seek the help of Baba. They go to Baba and prostrate in front of Baba. Immediately his son gets a violent seizure and loses consciousness. They feel terrible that he never had that kind of seizure. Then Mrs. Pitale starts crying. Baba reassures her and asks them to go to their lodging. After a while the boy regains his consciousness and everyone was haapy. Later on the family goes back to visit Baba. Baba then says to Mrs.Pitale as follows. "Have not all your thoughts, doubts and apprehensions calmed down now? Hari will protect him, who has got faith and patience." Mr. Pitale later wanted to take a leave from Baba after staying there for few days. Then Baba gives him blessings and says "Here is rupees 3 and I have given you 2 rupees before. Take these rupees and keep them in your shrine and worship them." Pitale could not understand what Baba was saying because this was the first time he met him. So he goes home and tells his mother about this mystery. Then his mother tells him that his father once took him to Akkalkota Maharaj when he was a child and he gave his father rupees 2 at that time to worship. Then everyone was amazed about Baba's greatness. This kindled devotion in Pitale.

Ambadekar
Lastly Hemadpanth writes about the story of Ambadekar who was a devotee of Baba. He served for 10 years in Abkari department and had to retire. He tries for another job and could not find one. The life became very difficult and 7 years gone by. He decided to kill him self in Shirdi. He goes there and wanted to take his life by drowning in a well. He sits near Dixit wada and waiting to jump into a well. Then another Baba devotee Sagun Meru Naik sees him and gives him a book of Akkalkota Maharaj to read. He opens the book and finds these words. What ever is destined has to be fully borne. All physical tribulations, diseases, even leprosy and all other problems, which we have because of our actions in the previous birth, unless they are fully borne, we can not be free from them, even by committing suicide. If this suffering remains unfinished, you have to be borne again. Therefore try to bear up with this trouble a little longer. Do not kill your self". Hearing these words put Ambadekar at ease decided to live. This strengthened his faith towards Baba. Baba inspired Sagun Naik to give this book to Ambadekar at the right time. Then he studied astrology and makes a living with more faith in his Guru. 

Sri Sainatharpanamasthu!