హేమద్పంత్
గారు ఈ అధ్యాయంలో గురువు ఎలా మంచి గ్రంధాలను చదివించి తన భక్తులను ముందుకు
నడిపిస్తారో చెప్పారు. అలానే విష్ణుసహస్ర నామముయొక్క గొప్పతనాన్ని కూడా చెప్పారు.
గ్రంథ
సేకరణ
బాబా
కొన్ని గ్రంథాలను శ్యామాకు ఇవ్వడం జరిగింది. చాలామంది భక్తులు బాబా ఆశీర్వాదం కోసం
కొన్ని గ్రంథాలను తెచ్చేవారు. బాబా చాలా వరకు వారి గ్రంథాలు వారికి ఇచ్చేవారు.
కొన్నిసార్లు ఒకరు తెచ్చిన గ్రంథాలు ఇంకొకరికి ఇచ్చేవారు. బాబా సర్వజ్ఞుడు. మనము
ఏది, ఎప్పుడు చదవాలో ఆయనకు బాగా తెలుసు. అట్లా తెచ్చిన వాటిలో కొన్నింటిని
శ్యామాకు ఇచ్చి, జాగ్రత్తగా భద్రపరచమని చెప్పేవారు. షిరిడి పవిత్ర క్షేత్రానికి
దేశదేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ కలసి జ్ఞానయజ్ఞం చేస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు
అవసరమవుతాయి. నేను నా ధామానికి వెళ్ళిపోయాక శ్యామా దీనిని తీసి చూపుతాడు. ఈ
గ్రంథాలు నా ప్రతిరూపాలు అవుతాయి. పరమపావనమైన ఈ గ్రంథాలు షిర్డిలో కాని, ఇతర
ప్రదేశాలలో కాని చదివితే బాబా గుర్తుకు వస్తారు. పుస్తకాల సంగ్రహణకు కారణం ఇదే అయి
ఉంటుందని హేమద్‌పంత్ సాయిసచ్చరితలో రాస్తారు.
విష్ణు
సహస్రనామం-రామదాసి సాధువు కథ
శ్యామాకు
బాబాపై అపరిమితమైన భక్తి ఉన్నట్లే, బాబాకు కూడా శ్యామాపై అత్యంత ప్రేమ ఉండేది.
ఒకసారి ఒక రామదాసి సాధువు మశీదులో ఉండి గ్రంథ పఠనం చేసేవాడు. ఆయన విష్ణు సహస్రనామం
చక్కగా చదివేవాడు. ఆ తరువాత ఆధ్యాత్మ రామాయణం కూడా పారాయణం చేసేవాడు.
బాబా తనకు కడుపులో నొప్పిగా ఉన్నదని, సోనాముఖి అనే మందు తెమ్మని
అతన్ని పంపించి, ఆ విష్ణు సహస్రనామ పుస్తకం శ్యామాకు ఇస్తారు. శ్యామా అప్పుడు
దేవా! ఆ రాందాసి ముక్కోపి నాకు ఈ పుస్తకం వద్దు. నాకు ఈ సంస్కృత పదాలు నోరుతిరగవు
నన్ను దీంట్లో ఇరికించవద్దు అని అంటాడు. కాని బాబా ఆ పుస్తకం తీసుకోమని చెప్పి
దాని విశిష్టత ఇలా చెప్తారు. "శ్యామా దీనిలో గొప్ప గుణాలు ఉన్నాయి. అందువల్లె దీనిని నీకు
ఇస్తున్నాను, చదివిచూడు. ఒకసారి నాకు చాలా బాధ కలిగింది. గుండె దడ దడ లాడింది. ప్రాణం
రెపరెప లాడింది. నేను బ్రతుకుతానన్న నమ్మకం పోయింది. ఆ సందర్భంలో ఈ పుస్తకం ఎంతగా
ఉపయోగపడిందో నీకెలా చెప్పను? శ్యామా ఈ పుస్తకం వలననే ఈ ప్రాణాలు
రక్షించబడ్డాయి. ఒక్క క్షణం గుండెకు హత్తుకోగానే వెంటనే ప్రాణం కుదుట పడింది.
దేవుడే నాలో ప్రవేశించి నా ప్రాణాలు కాపాడాడు అని అనిపించింది. దీనివలననే జీవుడు
బతికాడు. అందువల్ల శ్యామా! నీవు దీనిని తీసుకొని వెళ్ళి మెల్లమెల్లగా చదువు. రోజూ
ఒకటో అరో మాటలను నేర్చుకో. గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది" అని చెప్పారు.
తరువాత
రామదాసి సాధువు వచ్చి ఆణ్ణాచించినీకర్ ద్వారా జరిగిన సంగతి తెలుసుకొని శ్యామాపై విరుచుకుపడ్డాడు.
నువ్వు ఒక పథకం ప్రకారం ఈ పుస్తకం కొట్టేశావు. నా పుస్తకం నాకు ఇవ్వకపోతే నీ ఎదుటే
తలబద్ధలు కొట్టుకుని రక్తం చిందిస్తాను. మాధవరావు ఎన్నో విధాల నచ్చచెప్పినా
రామదాసు శాంతించలేదు. అప్పుడు శ్యామా చాలా శాంతంగా "నేను కపటినని నాపై
నిందవేయకు. వృధాగా నాకు దోషాన్ని అంటకట్టకు. ఆ పుస్తకం విశేషమేమిటీ? అది ఎక్కడా
లభించదా? నీ పుస్తకాలకు రత్నాలు పొదిగారా, లేక బంగారం తొడిగారా? బాబాపైన కూడా నీకు
విశ్వాసం లేదు. ఇది సిగ్గు పడవలసిన విషయం" అని అన్నాడు.
అప్పుడు బాబా రామదాసి సాధువుని చూసి ఈ విధంగా అన్నారు. "రామదాసూ! ఇప్పుడు ఏం మునిగి పోయింది? అనవసరంగా ఎందుకు బాధ పడుతున్నావు. శ్యామా మన కుర్రవాడే కదా, నీవు ఊరికే ఎందుకు నరాలు తెంచుకుంటున్నావు? వృధాగా ఎందుకింత కష్టపడుతున్నావు? ప్రపంచానికి తమాషా చూపిస్తున్నావు. ఎందుకిలా కయ్యానికి కాలు దువ్వుతున్నావు. చక్కగా మంచిగా మాట్లాడు రామా? ఈ పుస్తకాలను నిరంతరం చదువుతావు, అయినా నీ అంతకరణం ఇంకా శుద్ధి కాలేదు. నీవు ఎటువంటి రామదాసువయ్యా? నీకు అన్నింటి యందు అనాసక్తి ఉండాలి. కాని నీకీ పుస్తకం పైనే వ్యామోహం పోలేదు. రామదాసుకు మమత ఉండరాదు. సమత ఉండాలి. ఆ పుస్తకాన్ని నేనే శ్యామాకు ఇచ్చాను. అదంతా నీకు కంఠస్థం కదా!"
రామదాసు బాబా చెప్పిన మాటలు విని కోపంగా బాగా ఎర్రబారిన ముఖంతో శ్యామాను ఉద్దేశించి ఇదిగో నీకిప్పుడే చెబుతున్నా దీనికి బదులుగా నువ్వు పంచరత్న గీతను ఇవ్వు అన్నాడు. తరువాత శ్యామాకు బాగా నిష్ఠ కుదిరి దీక్షిత్ మరియు నార్కెల సాయంతో మెల్లగా విష్ణుసహస్ర నామం నేర్చుకొని తరించాడు. ఇక్కడ బాబా విష్ణుసహస్రనామం యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా చెప్పారు.
విష్ణుసహస్రనామాలను స్వహస్తాలతో శ్యామా కంఠానికి కట్టి అతని భవ, భయ, బాధలనుండి ముక్తుణ్ణి చెయ్యాలని ఆ పుస్తకం శ్యామాకు ఇవ్వడం జరిగింది. బాబా ఇంకా ఇలా చెప్పారు. అతనికి నామంపై ప్రీతి కలిగిస్తాను. నామం పాపాలనే పర్వతాలను పగలగొట్టుతుంది. నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది. నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరికివేస్తుంది. నామం కాలుని మెడను విరిచేస్తుంది. నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది.
శ్యామాకు
ఇటువంటి సహస్రనామం మధురమవ్వాలి. ప్రయత్న పూర్వకంగా
నామాన్ని స్మరిస్తే మంచిది. అప్రయత్నంగా నామ జపం చేసినా చెడుకలగదు. తెలియకుండా నోటితో
ఉచ్చరించినా నామ ప్రభావం ప్రకటమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్ధాన్ని పోషిస్తుంది. నామ జపానికి స్నానం చేయాల్సిన పనిలేదు. అట్లే నామానికి విధి విధానాలేవి
లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు
ప్రక్షాలన మవుతాయి. మెల్లమెల్లగా లోలోపల నా
నామాన్ని జపించే వారు ఉత్తమ గుణ సంపన్నులకంటే ఉత్తములు.
విఠల
దర్శనం: ఒకసారి
దీక్షిత్ స్నానం చేసి ధ్యానానికీ కూర్చున్నాడు. అప్పుడు ధ్యానంలో విఠల దర్శనం కలిగింది. తరువాత ద్వారకామాయికి వెళ్ళాడు.
అప్పుడు "అయితే విఠల్ పాటిల్ నీ వద్దకు వచ్చాడన్న మాట. ఔనా! నువ్వతన్ని కలుసుకున్నావు
కదా! కాని జాగ్రత్త విఠలుడు చపలుడు. నీ కన్ను గప్పి క్షణాలలో మాయమయిపోతాడు. అతన్ని
గట్టిగా పట్టుకో, అతన్ని ఒక్కచోటనే పెట్టుకో, లేకపోతే అతను మెల్లగా జారుకుంటాడు.
నువ్వు ఏ మాత్రం ఒక్క క్షణం కూడా అజాగ్రత్తగా ఉన్నా, అతను మాయమవుతాడు” అని
దీక్షిత్‌కు చెప్పారు. ఇంతలో షిరిడికి ఒకతను కొన్ని విఠలుడి చిత్రాలను అమ్ముదామని
తెచ్చాడు. ఒక చిత్రంలో విఠలుడి స్వరూపం తన ధ్యానంలో కనిపించిన చిత్రంలాగా ఉంది.
వెంటనే బాబా మాటలు గుర్తుకు వచ్చి ఆ చిత్రం కొనేశాడు. దాన్ని పూజా మందిరంలో ఉంచి
పూజించాడు.
గీతా
రహస్యము : ఒక రోజు బాపు సాహెబ్ జోగుకు ఒక పార్సెల్ వస్తే అది తీసుకొని ద్వారకామాయి
వస్తారు. అది తిలక్ గారు వ్రాసిన గీతా రహస్యము. జోగ్ బాబాకు సాష్టాంగ నమస్కారం
చేస్తూ ఉంటె ఆ పుస్తకము క్రిందపడుతుంది. బాబా ఆ పుస్తకములో కొన్ని పేజీలు చూసి
పుస్తకముపై ఒక రూపాయి పెట్టి ఆశీర్వదించి ఇలా అంటారు. " దీనిని పూర్తిగా
చదువుము. నీకు మేలు కలుగును" అని చెప్పారు.
ఖాపర్డే
దంపతులు:
ఖపర్దెగారి
పూర్తిపేరు గణేశ్ శ్రీ కృష్ణ ఖపర్డె. ఆయన
అమరావతిలో ప్రసిద్దిగాంచిన ప్లీడర్. క్రిమినల్ లాలో మంచి ప్రాక్టీస్‌తో ప్రముఖ న్యాయవాదిగా పేరు సంపాదిస్తారు.
కపర్డె ఆదాయం ఆ రోజుల్లోనే దాదాపు సంవత్సరానికి లక్ష రూపాయలు ఉండేది. ఆయన గొప్ప
వక్త. బాలగంగాధర్ గారికి కుడి భుజంగా ఉండేవారు. ఖాపర్డే గారు బాబా
ముందు మౌనంగా ఉండే వారు. శ్రీమతి ఖపర్డె పూర్తి పేరు లక్ష్మీబాయి గణేశ ఖపర్డె. ఆమె చాలా అణుకువతో ఖపర్డె గారి పెద్ద సంసారాన్ని నడుపుతూ వచ్చారు. ఆమెకు బాబాకు కూడా చాలా ఋణానుబంధం ఉంది. ఆమె 7 నెలలు షిర్డిలో ఉన్నారు. ఆమె సాయికి చేసిన సేవ అపారమైనది. లక్ష్మీబాయి అత్యంత నిష్టావంతురాలు. ఆమెకు సాయి పాదాలయందు అత్యంత ప్రేమ. ఆమె నిత్యం మసీదుకు నైవేద్యాన్ని స్వయంగా తీసుకుని వచ్చేది. బాబా నైవేద్యాన్ని స్వీకరించే వరకు ఉపవాస వ్రతంలో ఉండేది. సాయి మహరాజు ఆరగించిన తరువాత మాత్రమే ఆమె భోజనం చేసేది. ఒకసారి ఆమె భక్తికి మెచ్చి ఆమెకు పరమార్ధ మార్గాన్ని చూపించారు.బాబా బోధనా పద్దతి ప్రత్యేకమైనది. వారు ఆడుతూ పాడుతూ, నవ్వుతూ హృదయంలో బాగానాటుకొనేలా అనుగ్రహాన్ని ప్రసాధించేవారు.
ముందు మౌనంగా ఉండే వారు. శ్రీమతి ఖపర్డె పూర్తి పేరు లక్ష్మీబాయి గణేశ ఖపర్డె. ఆమె చాలా అణుకువతో ఖపర్డె గారి పెద్ద సంసారాన్ని నడుపుతూ వచ్చారు. ఆమెకు బాబాకు కూడా చాలా ఋణానుబంధం ఉంది. ఆమె 7 నెలలు షిర్డిలో ఉన్నారు. ఆమె సాయికి చేసిన సేవ అపారమైనది. లక్ష్మీబాయి అత్యంత నిష్టావంతురాలు. ఆమెకు సాయి పాదాలయందు అత్యంత ప్రేమ. ఆమె నిత్యం మసీదుకు నైవేద్యాన్ని స్వయంగా తీసుకుని వచ్చేది. బాబా నైవేద్యాన్ని స్వీకరించే వరకు ఉపవాస వ్రతంలో ఉండేది. సాయి మహరాజు ఆరగించిన తరువాత మాత్రమే ఆమె భోజనం చేసేది. ఒకసారి ఆమె భక్తికి మెచ్చి ఆమెకు పరమార్ధ మార్గాన్ని చూపించారు.బాబా బోధనా పద్దతి ప్రత్యేకమైనది. వారు ఆడుతూ పాడుతూ, నవ్వుతూ హృదయంలో బాగానాటుకొనేలా అనుగ్రహాన్ని ప్రసాధించేవారు.
ఒకసారి ఖపర్డె భార్య
అన్నం, పప్పు, పూరి, హల్వ, పాయసం, అప్పడాలు, వడియాలు, వడపప్పు పళ్ళెంనిండా
పెట్టుకొని వచ్చింది. బాబా వెంటనే ఆత్రంగా తమ ఆసనంపై నుండి లేచారు. చేతిపైన
కఫినీని పైకి జరుపుకొని భోజనం చేసేందుకు సిద్దం అయ్యారు. అప్పుడు శ్యామా
బాబానుద్దేశించి "దేవా అందరూ రుచికరమైన పదార్దాలు తెస్తారు, కాని ఈమె తెచ్చిన
ఆహారం మీద మీకు ఎందుకు ఇంత ప్రేమ" అని అడిగితే అప్పుడు బాబా ఈ విధంగా
చెప్పారు. ఈ భోజనం యొక్క విశేషం ఏంటో చెప్పమంటావా! పూర్వం ఈమె బాగా పాలిచ్చే ఆవు.
ఆ తరువాత కనిపించకుండా పోయింది. తరువాత ఒక మాలికి జన్మించింది. ఆ తరువాత ఒక
క్షత్రియని ఇంట్లో పుట్టింది. మరుజన్మలో ఒక వైశ్యుని పత్ని అయింది. తరువాత
బ్రాహ్మణ గర్భంలో జన్మించింది. చాలా
కాలానికి కనిపించింది. ప్రేమతో తెచ్చిన అన్నం రెండు ముద్దలు సుఖంగా తిననివ్వు, అని
ఆహారం తృప్తిగా తిన్నారు.
బాబా అన్నం తినిన తరువాత ఆమె బాబా పాదాలను వత్తుతు సేవ
చేయసాగింది. బాబా చరణాలను పట్టుకున్న ఆమె చెయ్యి నెప్పట్టకుండా బాబా ఆమె చేతిని
వత్తసాగాడు. ఇది చూసి శ్యామా ఆహా ఏమి భాగ్యము!
భగవంతుని భక్తురాలి పరస్పర ప్రేమను, సేవను చూసి శ్యామా పరిహాసమాడాడు. ఆమె సేవకు బాబా ప్రసన్నులై ఆమెతో మెల్లగా రాజారాం, రాజారాం అను, అలా
ఎల్లప్పుడూ అంటూ ఉండు. అమ్మా నీ జీవితం సఫలమౌతుంది. నీ మనస్సు శాంతిస్తుంది. నీకు
అపరిమితమైన శుభం కలుగుతుంది. అని చెప్పారు. ఇలా బాబా మాటలు ఆమె హృదయంలోకి
చొచ్చుకుపోయి తక్షణం శక్తి పాతం చేస్తాయి. జ్ఞాని అయిన గురువుని ఆశ్రయించిన
శిష్యుని ధ్వైతం నశించిపోతుంది. గురువు ఒక ఊరిలో ఉండి శిష్యుడు మరో ఊరిలో
ఉన్నట్లు భావిస్తే అది బాహ్యమైన సంబందం మాత్రమే, అసలు వారు ఇద్దరు కానప్పుడు వారు
వేరు ఎలా అవుతారు. ఒకరు లేక ఒకరు
ఉండరు. గురువు మరియు శిష్యులయందు బేధంలేదు. ఇది నిత్య సత్యం.
శ్రీ
సాయినాథార్పణమస్తు!
No comments:
Post a Comment