In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, March 28, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం -28



సాయి ఒకే ప్రదేశానికి పరిమితం కాదు. సర్వప్రాణులలో ఉన్నారు. బ్రహ్మనుండి చీమ దోమాది, క్రిమి కీటకాలన్నింటిలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నారు. సాయి పూర్ణ శబ్ద బ్రహ్మ. పరబ్రహ్మను తెలుసుకొనే మార్గాన్ని తెలియచేస్తారు. అందుకే వారు సద్గురువులు. శిష్యులను ఆత్మ స్వరూపంలో స్థిరపరిచగలిగిన వారిని మాత్రమే సద్గురువు అని సంబోధించగలము.

ఈ అధ్యాయంలో బాబా తన భక్తులకు స్వప్న దర్శనంతో తన వద్దకు రప్పించుకోవడం గురించి చెప్పడం జరిగింది. 

లక్ష్మి చందు అనే అతను ఒక గుమస్తాగా మొట్టమొదట రైల్వే ఉద్యోగిగా చేసి తరువాత రాలీ కంపెనీలో పనిచేస్తాడు. ఇతనిని బాబా పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాగినట్లు తన దగ్గరకు రప్పించుకున్నారు. అనేక జన్మలలో గడించిన ప్రారబ్దకర్మ ఫలించినప్పుడే సత్పురుషుల సమాగమం ప్రాప్తించదు. లాలా లక్ష్మి చందు గారికి బాబా పిలుపు ఒక అలౌకిక లీల. ఆయనకు మొట్టమొదటగా ఒక ముసలి సాధువుగా స్వప్న దర్శనం ఇస్తారు. తరువాత ఆయన దాసగణు మహారాజ్ గారి కథా గానంకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బాబా చిత్రపటం చూసి తనకు కలలో కన్పించిన సాధువు సాయిగా గుర్తించి పరవశం పొందుతాడు. అప్పుడు షిర్డీ వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. దారి ఖర్చుకు డబ్బు సదుపాయం కావాలి. సాయిని ఎప్పుడు కలుస్తానా అని తపించిపోతాడు. ఒక రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు ఒక స్నేహితుడు తలుపు కొడతాడు. శంకరరావు అనే స్నేహితుడు షిర్డీకి వస్తావా అని అడుగుతాడు. సోదరుని వద్దనుంచి పదిహేను రూపాయలు అప్పుగా తీసుకొని ప్రయాణం కడతాడు. వారు రైలులో ప్రయాణం చేస్తూ అక్కడ ఉన్న నలుగురు ముస్లిం సోదరులను బాబా గురించి అడిగి తెలుసుకుంటాడు. అలానే బాబాకు జామ పండ్లు సమర్పించుకుందామని అనుకుంటాడు. కాని మర్చిపోతాడు. తనకి గోదావరి ఆవలి తీరం వెళ్లిన తరువాత జామ పళ్ళ గుర్తుకు వస్తాయి. అప్పుడే ఒక వృద్ధురాలు జామ పళ్ళ బుట్టతో వస్తుంది. కొన్నిపళ్ళను కొంటాడు, కాని ఆమె బుట్ట మొత్తం ఇచ్చి బాబాకు ఇవ్వమంటుంది. 

తరువాత షిర్డీ చేరుకొని బాబాను చూడగానే లక్మిచందు కంఠం గద్గదమవుతుంది. పరిశుద్ధ జలంతో బాబా చరణకమలాలను ప్రక్షాళనం చేస్తారు. అప్పుడు బాబా ఇలా అంటారు. "దారిలో భజన చేస్తావు. మరో మనిషిని అడుగుతావు. అంతా మన కళ్ళతో చూడాలి గాని రెండో వ్యక్తిని అడగటం ఎందుకు? కల అబద్దమా నిజమా నీవే ఆలోచించుకో! అప్పు తీసుకొని దర్శనానికి రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీ కోరిక తీరిందా? అని బాబా అంటారు. తాను చేసిన పనులన్నీ బాబా చెప్పేసరికి లక్మిచందుకు పరమాశ్చర్యం కలుగుతుంది.
 

లక్మిచందు తరువాత వాడాకు వెళ్తాడు. అక్కడ తనకు సాంజా అనే పదార్ధాన్ని బాబా ప్రసాదంగా పెడతారు. ఇది తనకు చాలా ఇష్టమైనది. తరువాత రోజు కూడా ఎవరన్నా ఈ సాంజా పెడితే బాగుండు అని అనుకుంటాడు. అప్పుడు జోగ్ వచ్చి ఈ రోజు ఏ ప్రసాదం చేయాలి బాబా అని అడిగితే సాంజా కావాలి అంటారు బాబా. అలానే బాబాకు బాగా దగ్గు వస్తే, లక్మిచందు బాబాకు దృష్టి తగిలింది అని అనుకుంటాడు. బాబా తన మనసులోమాటనే బయటకు చెప్తారు. ఇలా ఆయనలో నమ్మకాన్ని పెంచుతారు.
 

బర్హన్పూర్ స్త్రీ 
ఈమెకు బాబా స్వప్నంలో కనిపించి కిచిడి అడుగుతారు. ఆమె ఈ స్వప్నం గురించి అందరికి చెప్తుంది. తన భర్తతో కలిసి షిర్డీ వచ్చి రెండు నెలలు ఉంటుంది. షిర్డీకి వచ్చి పద్నాలుగు రోజులు అయినా బాబాకు కిచిడి ఇవ్వలేక పోతుంది. ఇక పదిహేనవ రోజు ద్వారకామాయికి వెళ్తుంది. అక్కడ తెర వేసిఉంది. కాని ఆ తెర తీసుకొని లోపలి వెళ్తుంది. అప్పుడే బాబా కిచిడి గురించి అడిగి మరి పెట్టించుకుంటారు. ఇలా ఆమెను అనుగ్రహిస్తారు. 

మేఘా 
మేఘ శ్యాముడు రావు బహద్దూర్ సాఠె గారి ద్వారా షిర్డీ రావడం జరుగుతుంది. మేఘా కూడా బాబా దారం కట్టి లాగిన ఒక పిచ్చుకే. మొట్టమొదట బాబా ముస్లిం అనుకొని మేఘ సేవ చేయడానికి జంకుతాడు. అప్పుడు బాబా అతనిని ద్వారకామాయిలోకి అడుగుపెట్టనివ్వరు. నీవు గొప్పకులానికి చెందిన బ్రాహ్మణుడవు. నేను ముస్లింని అని, నీవు అపవిత్రడవుతావని భావిస్తున్నావు. ఇక్కడనుంచి వెళ్ళిపో అని బాబా అతనిని అక్కడనుంచి తరిమివేస్తారు. అక్కడనుంచి వెళ్లిన తరువాత మేఘ ఆరోగ్యం పాడవుతుంది. కొన్నిరోజులికి బాబాపై నమ్మకం పెరిగి రాత్రి పగలు సాయి శంకర్ అనే నామాన్ని జపించేవాడు. అతడు షిర్డీ వచ్చి బాబాకు అనన్య భక్తుడై సాయిని ప్రత్యక్ష శంకరుని వలే భావించేవాడు. కొన్ని మైళ్ళు నడిచి బిల్వ పత్రాలను తెచ్చి బాబాకు పూజ చేసే వాడు. తరువాత బాబా పాద తీర్ధం సేవించేవాడు. 

ఒక సారి బాబాను గోదావరి నది జలాలతో అభిషేకించాలి అనే సంకల్పంతో బాబాను ఒప్పిస్తాడు. కాని బాబా ఆ జలం తలమీద మాత్రమే పోయమంటారు. మేఘా మాత్రం పరవశంతో మొత్తం నీరంతా బాబాపై పోస్తాడు. కాని విచిత్రం బాబా శరీరం తడవకుండా తల మాత్రమే తడుస్తుంది. అందరు ఆశ్చర్యపడతారు. ఇంకో సారి మేఘాకు బాబా
కలలో కన్పించి త్రిశూలం గీయమంటారు. మేఘ బాబా వద్దకు వెళ్లి ఈ స్వప్నం అర్ధం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు బాబా నిన్ను త్రిశూలం గీయమన్నాను, అది స్వప్నం కాదు నేనే వచ్చి నీకు చెప్పాను. తలుపులన్నీ వేసి ఉన్నాయి అనే అనుమానం వ్యక్తం చేస్తాడు మేఘ. అప్పడు బాబా ఇలా అంటారు " ప్రవేశించుటకు నాకు ద్వారం అక్కరలేదు. నాకు రూపం లేదు. నేను అన్ని చోట్ల ఉంటాను. ఎవరైతే నమ్మి నా ధ్యానమందే మునిగి ఉంటారో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించెదను " అని అంటారు. మేఘ అప్పుడు బాబా పటం పక్కనే త్రిశూలం గీస్తాడు. బాబా దగ్గరకు ఒక రామదాసి భక్తుడు వచ్చి ఒక శివలింగాన్ని ఇస్తాడు. అదే శివ లింగం దీక్షిత్ గారికి కూడా ధ్యానంలో కనిపిస్తుంది. తరువాత ఆ శివలింగాన్ని బాబా మేఘా చేత ప్రతిష్ట చేపిస్తారు. మేఘ ఎప్పుడూ శంకర నామాన్ని తలుచుకుంటూ ఉండే వాడు కాబట్టి అతనికి ఇలాంటి అనుభవాలు ప్రసాదించి అనుగ్రహించారు. అనేక సంవత్సరాలు బాబాను సేవించి 1912 లో మేఘ శ్యాముడు కాలమునొందెను. బాబా అప్పుడు "ఇతడు నా నిజమైన భక్తుడు" అని కొనియాడారు.  అతనిలో భక్తిని స్థిరపరచి మోక్షం ప్రసాదించారు. 


ఓం శ్రీ సాయినాథార్పణమస్తు !




No comments:

Post a Comment