సాయియే ఆత్మా రాముడు. సాయియే పూర్ణానందధాముడు. వారు స్వయంగా ఏ కోరికలు లేని వారు. భక్తులను నిష్కాములుగా చేస్తారు. సర్వ ధర్మాలను రక్షించేవారు. అన్న దానం చాలా గొప్పది అని మనం ఎప్పుడూ వింటాము. మనం ఏ ఇతర దానం ఇచ్చినా కాని అది అపాత్ర దానమొ కాదో మనకు తెలియకపోవచ్చు. ఆకలిగొన్న వారికి అన్నం పెడితే ఎప్పుడూ వృధా కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన శాస్త్రాలు చెపుతాయి. అన్నమునుండే ప్రాణులు ఉత్పన్నమౌతాయి. అందుకే బాబా కూడా లౌకిక రీతిని అనుసరించి అన్న సంతర్పణ చేసే వారు. రోగులకు, శక్తి హీనులకు, గుడ్డి, చెవిటి వారికి మరియు దీనులకు మొట్టమొదట అన్నం పెట్టాలి. వారి తరువాతనే ఆప్తులకు బంధుమిత్రులకు పెట్టాలని ఈ అధ్యాయంలో మనకు చెప్పారు.
బాబా
మసీదు ప్రాంగణంలో ఒక పెద్ద పొయ్యిని పెట్టేవారు. బాబా రెండు పాత్రలలో చేసే వారు.
ఒకటి 50 మందికి, ఇంకొకటి 100 మంది సరిపోయే విధంగా ఉండేవి. ఒకప్పుడు తీయటి పరమాన్నం
మరొకప్పుడు మాంసంతో పలావు వండేవారు. ఒకప్పుడు గోధుమపిండితో ఉండలు చేసి
ఉడుకుతున్నప్పుడు పప్పు పులుసులో మెల్లగా వేసే వారు. మసాలాను రాతి బండమీద బాగా
నూరే వారు. అన్నింటిని సరైన పాళ్ళల బాబానే స్వయంగా వేసే వారు.
బాబా స్వయంగా వర్తకుల దగ్గరకు వెళ్లి సరకులు కొని తెచ్చేవారు. మసీదులో కూర్చొని స్వయంగా గోధుమలు. పప్పు, జొన్నలను విసిరేవారు. పొయ్యిలో కట్టెలు కూడా తానే స్వయంగా కిందకు పైకి జరుపుతూ ఉండేవారు. ఇంగువ, జీలకర్ర కొత్తిమీర వేసి వంటలు గుమగుమ లాడించేవారు. అలానే పిండి కలిపి రొట్టెలు తానే చేసే వారు. జొన్న పిండిలో సరిపడా నీరు పోసి పాత్రలో కాచి మజ్జిగను కలిపి అంబలిని కూడా చేసే వారు. వంట పూర్తి అయ్యాక పాత్రను పొయ్యి మీదనుంచి దించి తీసుకువెళ్లి మసీదులో ఉంచే వారు. మౌల్వితో విధిపూర్వకంగా ఫాతిహా చేయించేవారు. మాంసాహారమైతే అది తినే వాళ్ళకే పిలిచిపెట్టేవారు. మామూలు భోజనమైతే చక్కగా నైవేద్యంగా అందరికి బాబానే స్వయంగా వడ్డించేవారు. ఆ భోజనం కోసం వచ్చినవారు తృప్తిగా తినేవారు.
బాబా స్వయంగా వర్తకుల దగ్గరకు వెళ్లి సరకులు కొని తెచ్చేవారు. మసీదులో కూర్చొని స్వయంగా గోధుమలు. పప్పు, జొన్నలను విసిరేవారు. పొయ్యిలో కట్టెలు కూడా తానే స్వయంగా కిందకు పైకి జరుపుతూ ఉండేవారు. ఇంగువ, జీలకర్ర కొత్తిమీర వేసి వంటలు గుమగుమ లాడించేవారు. అలానే పిండి కలిపి రొట్టెలు తానే చేసే వారు. జొన్న పిండిలో సరిపడా నీరు పోసి పాత్రలో కాచి మజ్జిగను కలిపి అంబలిని కూడా చేసే వారు. వంట పూర్తి అయ్యాక పాత్రను పొయ్యి మీదనుంచి దించి తీసుకువెళ్లి మసీదులో ఉంచే వారు. మౌల్వితో విధిపూర్వకంగా ఫాతిహా చేయించేవారు. మాంసాహారమైతే అది తినే వాళ్ళకే పిలిచిపెట్టేవారు. మామూలు భోజనమైతే చక్కగా నైవేద్యంగా అందరికి బాబానే స్వయంగా వడ్డించేవారు. ఆ భోజనం కోసం వచ్చినవారు తృప్తిగా తినేవారు.
బాబా
మాంసాహారం తినని వాళ్ళని ఆ ఆహారం తాకనిచ్చేవారు కాదు. ఒక సారి ఏకాదశి రోజున దాదా
కేల్కరుతో తమాషాగా వెళ్లి మాంసం కొనుక్కురమ్మంటారు. కేల్కర్ బ్రాహ్మణుడు. చక్కటి
ఆచారాన్ని పాటించేవాడు. సరే బాబా చెప్పారు అని వెళ్ళబోతూ ఉంటే అతనిని ఆపి తన
సేవకుడిని పంపించిమంటారు. తరువాత అది కూడా వద్దని ఆపుతారు. ఇక్కడ కేల్కర్ బాబాను
శ్రద్ధతో నమ్మేవాడు అందుకే ఆలోచించకుండా ఆ పని చేయడానికి ఉపక్రమించాడు. గురువు
మనకు కొన్ని నేర్పించడానికి, మనలో ఉన్న నేను అన్న భావం పోగొట్టడానికి ఇలా
చేస్తారు. కేవలం ధనధాన్యాలు, వస్త్రాలు వగైరా గురువుకి సమర్పించడమే గురు దక్షిణ
కాదు. గురువుగారి ఆజ్ఞ పాటించి వారిని ప్రసన్నంగా ఉంచడమే నిజమైన దక్షిణ. కాయా వాచా
మనసా అన్నింటిని గురువుకి అర్పించి గురుకృపను పొందినవారిదే నిజమైన శ్రద్ద. తమ
పొట్ట నింపుకోవడానికి కేవలం భిక్ష ద్వారానే ఇంటింటికి తిరిగి అన్నం తినే వారు.
ఇక్కడ బాబా నేర్పించింది ఏమిటి అంటే, అన్నదానం చేయాలి అంటే మనము కూడా స్వయంగా
కష్టపడి పని చేయాలి. బాబా స్వయంగానే అన్ని చేసే వారు. అప్పుడే నిజమైన తృప్తి,
ఫలితం. ఇదే కాకుండా ధుని కోసం కట్టెలు ఉంచే గాడి యొక్క ముందు
భాగం మూడు వంతుల గోడ కూడా బాబానే స్వయంగా తన చేతులతో కట్టారు. వారు చేయని పని
ఏముంది? మసీదును స్వయంగా అలికే వారు. చేత్తో తన బట్టలు తానే కుట్టుకొనే వారు.
పొయ్యిమీద బాగా ఉడుకుతున్న వంటలను తన చేతితో కలియపెట్టేవారు. వారి చేతికి
కొంచెంకూడా కాలిన గుర్తులు ఉండేవి కావు. భక్తుల శిరస్సుపై పడగానే త్రితాపాలను
తొలిగించే వారి హస్తాన్ని అగ్ని ఎలా బాధపెట్టగలదు? అగ్నికి వారి మహిమ తెలియదా!
తినకూడని
వాటిని తినాలని మనసు పడే వారి వాసనలు అణిచివేసి, మనసుని నిగ్రహించుకునే వారిని
బాబా ఉత్సాహపరిచేవారు. ఇంకోసారి దాదా కేల్కరును పలావు చేసాను ఎలా ఉందొ చూస్తావా?
అని బాబా అడిగారు. అప్పుడు దాదా లాంఛనంగా చాలా బాగుంది అన్నాడు. అప్పుడు బాబా నీవు
తినకుండా, కనీసం వాసం చూడలేదు ఎలా చెప్తున్నావు? ఇక
చేయి తీసి గరిటతో పళ్లెంలోకి తీయి. మడికట్టుకున్నానని బడాయి పోకు అని అంటారు. సత్పురుషులు శిష్యులకు అనుచితమైనవి చెప్తారు అని
అనుకోవడం పొరపాటు. వారు అపారమైన దయతో ఉంటారు. అలానే కేల్కరులో ఉన్న పాత వాసనలను
కూడా దూరం చేశారు. గురు ఆజ్ఞా పాలనా మీమాంస ఒక్కోసారి ఎంతటి కఠిన పరీక్షకు దారి తీసిందంటే జీవితంలో ఎన్నడూ మాంసాన్ని తాకని భక్తుని నిశ్చయం
ఊగిసలాడింది. వాస్తవానికి బాబా ఎప్పుడూ ఏ భక్తుని అయినా తప్పుదారిలో ప్రవేశపెట్టే
వారు కాదు. 1910 తరువాత భక్తుల సంఖ్య పెరిగి
బాబా బాబా స్వయంగా వంట చేయలేదు. వచ్చే నైవేద్యాలన్ని బాబా అందరికి పంచి
పెట్టేవారు. అందరు తిన్నా ఇంకా నైవేద్యాలు మిగిలిపోయేవి.
బాబా
ఎవరిని తమ మతం కాని, ఆచారం కాని మార్చుకోనిచ్చేవారు కాదు. అలానే ఏ ఆరాధ్యదైవాన్ని
అనాదరం చేస్తే సహించేవారు కాదు. బాబా చైతన్యమూర్తులు. ఆత్మస్థితిలో ఉండే వారిని
హిందువని ముస్లిం అని లేక ఇంకే మతస్థుడు అని అనగలము. బాబాను సర్వమత సమ్మతునిగా మనం
కొలుస్తాము. వారు హిందూముస్లింల సమైక్యతను సమర్ధించారు. అలానే ఏ సంప్రదాయాన్ని
విమర్శ చేయనిచ్చేవారు కాదు. ఒక సారి నానా చాందోర్కర్ తన చుట్టం అయిన భిన్నేవాలాతో
షిర్డీ వస్తాడు. ద్వారకామాయికి రాగానే బాబా అతనిని కోపగించుకుంటారు. బాబా ఎందుకు
కోపగించుకున్నారో మొదట అర్ధం కాక సతమతం అయ్యి, తన తప్పు ఏమిటో చెప్పమని అడుగుతాడు.
అప్పుడు బాబా ఇలా అంటారు " నీవు ఇది ఎలా మరిచిపోయావు? నా సాంగత్యంలో ఎన్నో
రోజులు ఉండి నీవు నేర్చుకున్నది ఇదేనా? నీ మతి ఎందుకు ఇలా భ్రమించింది? నాకంతా
చెప్పు అని అన్నారు. నానాకు వెంటనే ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తుకు రాలేదు. బాబా కాళ్లు పట్టుకుని అనేక రకాలుగా మొర
పెట్టుకున్నాడు. తరువాత బాబా తను కోపర్గావ్లో దత్తమందిరంలో దత్తుడిని దర్శించకుండా
వచ్చావు అని గుర్తు చేస్తారు. నానా చాందోర్కర్ ఎప్పుడు షిర్డీ వచ్చినా అక్కడ ఆగి
వస్తాడు. కాని ఈ సారి భిన్నేవాలా అడిగినా కాని తొందరగా షిర్డీ చేరుకోవాలి అని
వచ్చేస్తాడు. అక్కడ గోదావరిలో స్నానం చేస్తూ ఉంటె కాలులో ఒక ముల్లు
గుచ్చుకుంటుంది. బాబా అప్పడు " ఇలా త్వరపడటం మంచిది కాదు. దర్శనం చేసుకోకుండా
దత్త దేవుని అనాదరం చేసినా, నయమే నీవు కేవలం ఒట్టి ముల్లు గుచ్చుకొని బయట పడ్డావు.
దత్త భగవానుని దర్శించుకోలేని వాడు నా వద్ద ఏమి పొందగలడు? అని బాబా బోధించారు.
హారతి
అయిన తరువాత భక్తులందరికి ఊది ఇచ్చి ఆశీర్వదించేవారు. అప్పుడు భక్తులు బాబా అన్ని
పదార్ధాలను కలిపిన నైవేద్యాలను ప్రసాదంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉండేవారు.
భక్తులు రెండు వరుసలలో కూర్చుని ఉంటె శ్యామా, నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించేవారు.
వచ్చిన వారి సౌకర్యములను వీరు చూసేవారు.
ఒక సారి
హేమద్పంత్ మసీదులో అందరితోపాటు కడుపునిండా తింటాడు. అప్పుడు బాబా ఒక గిన్నెడు
మజ్జిగ ఇచ్చి తనను తాగమంటారు. అది తెల్లగా చూడడానికి ఇంపుగా ఉంటుంది. కాని అతని
కడుపులో ఖాళీ లేదు. కొంచెం పీల్చగా మిక్కిలి రుచిగా ఉండెను. అతని కష్టం కనిపెట్టి
బాబా ఇట్లా అంటారు. " దానినంతయు తాగుము. నీకిక మీదట ఇట్టి అవకాశం
దొరకదు" అతను వెంటనే దానినంతయు తాగెను. బాబా చెప్పినట్లు కొన్నాళ్ళకు బాబా
మహాసమాధి అయ్యారు. అందుకే బాబా మళ్ళా అవకాశం రాదు తాగు అని చెప్పారు.
హేమద్పంత్
గారి ద్వారా బాబా మనకు సాయిసత్చరిత అనే అమృతం అందచేశారు. ఈ అమృతాన్ని మనసారా
శ్రద్ద సభూరిలతో మనం పానం చేస్తూనే ఉండాలి.
ఓం శ్రీ
సాయినాథార్పణమస్తు !
No comments:
Post a Comment