షిర్డీ క్షేత్రం ధన్యం. షిర్డీ జనులు ధన్యులు. మొదట షిర్డీ గ్రామము చాలా చిన్నది. కాని సాయి బాబా అక్కడ నివసించడంవల్ల గొప్పది అయ్యింది. వారి వలనే షిర్డీ పుణ్య క్షేత్రం అయింది. షిర్డీ స్త్రీలు రోజువారీ పనులు చేసుకుంటూ బాబా మహిమను గానం చేస్తూ ఉండే వారు. వారి ప్రేమ ధన్యం. బాబా చాలా చోట్ల కర్మల
గురించి, భక్తి గురించి చెప్పడం జరిగింది. నానా సాహెబ్ చందోర్కరు ద్వారా, బాబా
మనకు చాలా విషయాలు నేర్పడం జరిగింది. మానవులకు సుఖదుఃఖాలు మరియు ఇతర కష్టాలు ఈ
జీవితంలో అనుభవించక తప్పదు. కాని బాబా చూపించిన దారిలో మనము పయనిస్తే మనము ఆ
ముక్తి మార్గాన్ని చేరుకోగలము.
ఒకసారి నానా చందోర్కరు
మసీదులో కూర్చొని, బాబా పాదములను ఒత్తుతూ నోటిలో గీతను వల్లించుకుంటున్నాడు. ఆయన
భగవద్గీతలోని 4వ అధ్యాయంలో శ్లోకాలను మనసులోనే అనుకుంటున్నాడు.
బాబాకి నానా మీద దయకలిగి, 34వ శ్లోకం వద్ద ఆయన పఠనం ఆపాడు. నానాని ఏమిటి నానా నీలోనే గొణుక్కుంటున్నావు, అని అడిగాడు. నానా వినమ్రతతో ఆ శ్లోకం వినిపించాడు . ఇక్కడ నానాకి చాలా అనుమానాలు కలిగియుండవచ్చు. బాబాకి సంస్కృతం తెలుసా? నానాకి గీత గురించి బాగా తెలుసు. చాలా అధ్యయనం చేశాడు. ఆ శ్లోకం ఈ విధంగా ఉంటుంది.

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా|
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః||
దీనికి చాలా మంది
భాష్యకారులు భాష్యం ఇవ్వటం జరిగింది. వారందరిది ఒక్కటే అభిప్రాయం. బాబా నానాని
అర్ధం చెప్పమని అడిగాడు. అప్పుడు నానా ఇలా చెప్పారు. గురుచరణాలకు సాష్టాంగ
ప్రణామము చేసి, గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి గురువును ఆదరంగా ప్రశ్నించే
వారికి జ్ఞానులు జ్ఞానార్ధాన్ని ఉపదేశిస్తారు.
సాయి మొదటి సగం
శ్లోకానికి ఉన్న అర్ధాన్ని అంగీకరించారు. కాని మిగతా సగం శ్లోకానికి సరైన అర్ధం
చెప్పమని నానాని అడగడం జరిగింది. జ్ఞానులు మరియు
తత్వదర్శులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. జ్ఞానమనే శబ్ధానికి నీవు చెప్పిన అర్ధం విన్నాను, కాని దానికి జ్ఞానమని
కాకుండా అజ్ఞానమనే పదం వేస్తే పోయేదేముంది. అజ్ఞానం వాక్కుకు సంబంధించిన విషయం, జ్ఞానం వాక్కుకు అతీతమైన విషయం.
గర్భానికి చుట్టుకున్న
మావి వలె, అద్దం మీది ధూళివలే, అగ్నికి కప్పిన బూడిద వలె జ్ఞానాన్ని అజ్ఞానం కప్పివేస్తుంది. అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉంది అని గీతలో భగవానుడు చెప్పాడు. అందువలన అజ్ఞానాన్ని
తొలగిస్తే స్వభావసుద్దంగా ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది. నాచుతో కప్పబడ్డ శుద్దమైన నీరువలె
జ్ఞానం స్వతఃసిద్దంగా ఉంటుంది. నాచును తొలగించిన బుద్ధిమంతునికి శుభ్రమైన నీరు
లభిస్తుంది. వస్తువులను కళ్ళతో చూచి తెలుసుకునే శక్తి జ్ఞానం. కాని కళ్ళకు
పొరలువస్తే అది అజ్ఞానం. దానిని తొలగించటం అవసరం. ఒక్క గురుకృప ద్వారా మాత్రమే ఈ
అజ్ఞానం నశించి జ్ఞానం వెలుగులోకి వస్తుంది.
మనము ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు,
ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ అనే అంశాలు చాలా అవసరం. వాటిలో గురువు పట్ల పూర్తి
శ్రద్ధ, శరణాగతి, ఓర్పు ఉండాలి. ఇవి లేనినాడు, నీవు ఆయన కాళ్ళు వత్తినా, మనస్సులో
భావం లేకపోతే లేదా గురువు మీద పూర్తి నమ్మకం లేకపోతే, ఆ గురుకృప మనకు ఎట్లా
లభిస్తుంది. ఇక్కడ నానా పరిస్థితి కూడా అదే. నానాకి బాబా మీద నమ్మకం ఉంది. కాని
ఎక్కడో మూలలో దాగిఉన్న అజ్ఞానపు పొరలను పరమ గురువైన బాబా పసికట్టారు. వాటిని
తొలగించే ప్రయత్నమే ఈ భగవద్గీత పారాయణ లీల.
అసలు జ్ఞానం అంటే
ఏమిటి?
కనిపించే దృశ్య ప్రపంచం
అంతా నిజం కాదు లేదా మిధ్యా అని తెలుసుకొని, బ్రహ్మము ఒక్కటె సత్యం అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే జ్ఞానము.
అసలు ఇలాంటి అనుభవం
ఒకటి ఉంటుంది అని శ్రవణం ద్వారా తెలుసుకొని, మన జీవితాలు మార్చుకొనే ప్రయత్నం
చేస్తేనే మనకి దాంట్లో ఉన్న ఆనందం అర్ధం అవుతుంది. ఇంక దాన్ని అనుభవ పూర్వకంగా
తెలుసుకుంటే వచ్చేది నిశ్చలానందము. ఉన్న వస్తువులు, కనిపించే వస్తువులు నిజం కాదు.
మిథ్య అంటే ఎట్లా? మనకు ఈ ప్రపంచం కనిపిస్తుంది. మిథ్య అంటే ఇప్పుడు లేదు అని
కాదు. ఒక కాలంలో ఉన్నా మరియొక కాలంలో నశిస్తుంది. మనము ఒక్కసారి ఈ విశ్వాన్ని
పరిశీలిస్తే, చాలా గోళాలు వాటి మధ్య ఖాళీస్థలం. ఒక గోళం ఈ శూన్యంలో కలిసిపోవచ్చు.
చివరకు ఏమీ మిగలదు. అట్లానే మన యొక్క శరీరం ఒక కణం నుంచి వచ్చి పెద్ద శరీరం
అవుతుంది. చనిపోయిన తర్వాత అంటే ఈ చైతన్యం వీడితే, శరీరం కుప్ప కూలుతుంది. అది
తగలపెడ్తే బూడిదే మిగులుతుంది.
సరే ఈ జ్ఞానం అనేది
ఎందుకు తెలుసుకోవాలి? మనం రోజూచేసే పనుల్లో ఈ జ్ఞాన దృష్థిని మనము
అన్వయించుకోవచ్చు. మనము విశాలదృక్పధంతో ఆలోచించకపోతే మనసుకు కష్టం కలుగుతుంది.
దుఃఖం కలుగుతుంది. ఒక వస్తువుని సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం మూలాన, అది భిన్నంగా
కనిపిస్తుంది. ఒక వ్యక్తిని మనము సరిగ్గా అర్ధం చేసుకుంటే మనము వాళ్ళతో
ఉండగల్గుతాము. ప్రతి విషయంలో ప్రాక్టికల్‌గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ
మన అహంకారాన్ని ప్రక్కకు పెట్టడం నేర్చుకోవాలి. అందుకే బాబా జ్ఞానంతో పాటు భక్తిని
నేర్పించడం జరిగింది. అప్పుడు ఈ మాయ అనే అజ్ఞానం మనల్ని వెంటాడదు. జ్ఞానులకు, వారు
జ్ఞానులమన్న భావన ఉండొచ్చు. కాని జ్ఞానంతో కూడుకున్న భక్తితో మనం మన కర్మలను
ఆచరించినప్పుడు మనకు తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది.
అందుకే ఈ భగవద్గీత
శ్లోకం అంత ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. బాబా మనకు బోధించిన వాటిలో, అందులో
ప్రత్యేకంగా భగవద్గీతలో నుంచి ఈ శ్లోకాన్ని బాబా ఎందుకు ఎంచుకున్నారో మనం అర్ధం
చేసుకోవాలి. జ్ఞానానికి కావల్సిన అర్హతలను బాబా ఇక్కడ బోధించడం జరిగింది. ఇదంతా విన్న నానా ఇంకా వినమ్రుడై బాబా పాదాలకు సాష్థాంగ ప్రణామం చేసి రెండు చేతులతో వందనం చేశాడు. తరువాత
భక్తి శ్రద్దలతో "బాబా నాకు చక్కగా
శిక్షణ నిచ్చి నా అజ్ఞానాన్ని పారద్రోలండి. నా దురభిప్రాయాన్ని శిక్షించండి అని ప్రార్ధించాడు".
సాత్విక గుణాలు పైపైకి
కనిపిస్తున్నా మనసులో అనేక వికల్ఫాలుండి ఒక క్షణమైన అవమానాన్ని సహించలేము. అజ్ఞానం
అంటే వేరే ఏమీ లేదు. మనసులో కీర్తి ప్రతిష్ఠలయందు కోరిక, పైకి ధ్యానం
చేస్తున్నట్లు నాటకము, కామాక్రోధాలు లోపల రగులుతుంటే ఇక ఇంతకన్నాఅజ్ఞానం వేరే ఏముంటుంది.
మనసులో చెడు భావాలు
ఉండి పైకి మహాభక్తునిగా జ్ఞానిగా ఉండటం ఎంత దుర్భరము. ఈ భావాలు ఒక్కోసారి బయటికి
తెలియవచ్చు లేదా కొన్నిసార్లు వీటిని పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే
మానవుడు ఆచారవ్యవహారాల పేరు మీద ఒక్కొసారి తన ఉనికిని మర్చిపోతాడు. తను చేసే
ప్రతిపని తనకు న్యాయమనిపిస్తుంది. అహంకారం ఆలోచనాశక్తిని హరింపచేస్తుంది. బయటకు
నిష్ఠా గరిష్ఠులు కాని అహంకారం వాళ్ళకి తెలియకుండా మిగేస్తుంది. సాయి కొన్ని
వ్యవహారములను ఎవరికి తెలియకుండా చేస్తారు. చిన్న పనైన పెద్ద పనైన కారణం ఎప్పుడూ
తెలిసేది కాదు. కాని చెప్పకుండానే ఎప్పుడూ ఆ కార్యం మాత్రం క్రమక్రమంగా జరిగేది.
కొన్ని పనులు సహజంగా ఉపక్రమింపబడేవి. కాని వానికి మూలకారణం, పేరు, నిర్దేశింపబడేవి
కావు. పైగా ఇవన్నీ బాబా లీలలుగా కనిపించేవి. ఇటువంటి పరమగురువులు పరోపకారం కోసమే
జగత్తులో అవతరిస్తారు. సంకల్పించిన కార్యం పూర్తి కాగానే చివరకు అవ్యక్తంలో
కలిసిపోతారు.
మనం ఎక్కడ నుంచి
వచ్చాం? ఎక్కడికి వెళతాం? ఎందుకొరకు పుట్టాము. ఈ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి? అన్న
ప్రశ్నలకు మూలకారణాలు మనకు తెలియవు. ఇష్టమొచ్చిన రీతిలో జీవితాన్ని
గడిపేస్తున్నాము. తరువాత మరణ కాలం సమీపిస్తుంది. మన ఎదురుగా మన బంధువులంతా
చనిపోవడం చూస్తున్నాము. అయినా మన మనసులో ఇట్లాంటి ఆలోచనలు రావు. నాకు ఈ రోజు ఏం జరుగదు అన్న ధీమా. అందుకే మన గురువులు
చెప్తారు. నలుగురితో నారాయణ అనుకోవడం కాదు. నారాయణుడవు నీవే అని తెలుసుకో. మనము ఈ సత్యాలను గురించి తెలుసుకోవడమే జ్ఞానమార్గం. ఇవి ఎప్పుడో ముసలితనం వచ్చిన తరువాత నేర్చుకొనేవి కాదు.
అప్పుడు దాని ఉపయోగం ఎంత? మన శరీరం కదల్లేనప్పుడు ఇది తెలిసి ఏమిటి ప్రయోజనం.
మనకు జ్ఞానం అనేది
ఎప్పుడూ కావాలి. జీవితం పట్ల అవగాహన రావాలి. కష్ట సుఖాలలో ఈ జీవన సమరం సాగించడమా
లేక నిజాన్ని అర్ధం చేసుకొని శాశ్వత ఆనందాన్ని పొందడమా? మనము ఎప్పుడూ సుఖాన్నే
కోరుకుంటున్నామని అనుకొంటాము. కాని నిజానికి
అది సుఖము కాదు. రోజు మనం నిర్వర్తించే కార్యక్రమాలలో సత్యాసత్యాలను అర్ధం చేసుకోవాలి. ఏవి ముందు ఏవి వెనుక, దేనికి మనము
ప్రాముఖ్యత నివ్వాలి. ఏది మనకు శ్రేయమైనది. మనకున్నఈ అహంకారాన్ని ప్రక్కకు పెడ్తే, మనము ఎంత సుఖపడ్తామో మనకు అర్ధం కాదు.
ఎప్పుడు నేను చెప్పే మాటే నెగ్గాలనే మన ప్రయత్నానికి గండి కొట్టితే, ఈ సంకెళ్ళలో
నుంచి బయటపడ్తాము. స్వార్ధము మనలను అధోగతిపాలు చేస్తుంది. బాబా సర్వమానవాళిలో,
సర్వప్రాణులలో, కదిలే వాటిలో కదలని వాటిలో తననే చూడమని చెప్పడానికి కారణం ఇదే.
మనలో ఈ సద్గుణాలను ఏర్పరిచి చెడు గుణాలను అంతమొందించడానికే అని మనం అర్ధం చేసుకొని
బాబా బోధించిన జ్ఞాన మార్గం తెలుసుకోవాలి.
తరువాత ఈ అధ్యాయంలో సమాధిమందిరం ఎలా కట్టబడిందో చెప్పబడింది. బాపుసాహెబు బూటీ సకుటుంబంగా వచ్చి షిర్డీలో ఉండేవాడు. తనకు అచ్చట ఒక సొంతభవనం ఉంటె బాగుంటుందని అనే ఆలోచన ఉండేది. ఒక సారి దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా బాబా స్వప్నంలో కనపడి అక్కడ మందిరంతో కూడిన ఒక వాడా కట్టమని చెప్తారు. అదే సమయంలో అక్కడే నిద్రించుచున్న శ్యామాకు కూడా బాబా ఇలాంటి దృశ్యమే చూపిస్తారు. అప్పుడు శ్యామాకు ఏడుపు వస్తుంది. అప్పుడు బూటీ కారణం అడిగితె శ్యామా తనకు బాబా వాడ గురించి చెప్పారు అని అంటాడు. ఇద్దరికీ ఒకే స్వప్నం రావడంవల్ల బూటీకి వాడా కట్టాలి అనే నిశ్చయం కలుగుతుంది. అప్పుడు బాబా దగ్గర అనుమతి తీసుకునేందుకు ద్వారకామాయికి వెళ్తారు. వారు ఒక నమూనా కూడా బాబాకు చూపెడతారు. బాబా వెంటనే అనుమతి ఇస్తారు. శ్యామా దగ్గరే ఉండి నిర్మాణ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ఉంటాడు. బాబా కూడా లెండీకి వెళ్తున్నప్పుడు తన సలహాలు చెప్పేవారు. బూటీకి మధ్యలో మురళీధరుని విగ్రహం పెట్టాలి అనే ఆలోచన కలిగింది. బాబా దీనికి కూడా సరే అని చెప్తూ , మనమే వాడాలో ఉందాము అంటారు. ఆ తరువాత బాబా మహాసమాధి చెందిన తరువాత ఈ మందిరమే బాబా మందిరం అయ్యింది. బాబా సమాధి చెందక ముందు నన్ను రాతి వాడాలో ఉంచండి అని చెప్పారు. అప్పట్లో ఈ మందిర నిర్మాణానికి దాదాపు లక్ష రూపాయలు ఖర్చు అయ్యింది అని చెప్పారు. ఇలా మురళీధరునికి నిర్ణయించిన స్థలంలో బాబాని ఉంచారు. బూటీ వాడానే సమాధిమందిరం అయ్యింది. సాయి భక్తులందరికీ బాబానే మురళీధరుడు.

No comments:
Post a Comment