In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, June 27, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 41



హేమద్పంత్ గారు 40వ అధ్యాయంలో బాబా చిత్రపటం రూపంలో భోజనానికి వచ్చినట్లు చెప్పారు. బాబా ఆయనకు కలలో కన్పించి నేను భోజనానికి వస్తున్నాను అని చెప్పి ఆయన కోరికను సరైన సమయంలో పూర్తిచేసి అందరిని సంబ్రమాశ్చర్యాలలో ముంచివేస్తారు. కాని హేమద్పంత్ గారి మదిలో బాబా చిత్రపటం అలీమొహమ్మద్ ద్వారా బాబా చెప్పిన సమయానికి ఎలా చేరింది అన్న ఉత్సుకత మిగిలిపోయింది. ఈ విషయాన్నే ఆయన 41వ అధ్యాయంలో చెప్పారు. 

అలీమొహమ్మద్ గారు 7 నెలల తరువాత హేమద్పంత్ మదిలో ఉన్న ఉత్సుకతను సమాధానపరుస్తారు. ఒకసారి అలీ బజార్లో నడుస్తూ ఉంటె ఒక వర్తకుని దగ్గర మహానుభావుల చిత్రపటాలు కనిపిస్తాయి. అందులో బాబా పటం పట్ల తాను ఆకర్షితుడై, ఆ పటం కొని తన ఇంట్లో గోడకు ఉంచి రోజు బాబా దర్శనం చేసుకుంటూ బాబాపై ప్రేమను పెంచుకుంటాడు. హేమద్పంత్ గారికి ఈ పటం ఇచ్చే మూడు నెలల ముందు అలీ ఆరోగ్యం దెబ్బతిని ఆయన సోదరి ఇంట్లో ఉంటాడు. సోదరి భర్త పేరు నూర్ మొహమ్మద్ పీర్ భాయ్. అలీ కాలు వాచి శస్త్రచికిత్స కూడా అవసరం అవుతుంది. తన బాంద్రా ఇంట్లో ఎవరు లేక తాళం పెట్టి ఉంచుతారు. ఆలీకి మహానుభావుల చిత్రపటాలు కొనే అలవాటు ఉంది. అలానే నూర్ మోహామ్మద్ కు అబ్దుల్ రహమాన్ బాబా చిత్రపటం ఇస్తాడు. నూర్ మౌలానా సాహెబును గురువుగా భావిస్తాడు. ఈ పటం ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకువెళ్లి సజీవప్రమాణమంత పెద్దదిగా
చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెడతాడు. అందులో ఒకటి ఆలీకి కూడా ఇస్తాడు. ఇంకొక ప్రతిని తన గురువైన మౌలానా గారికి  కానుకగా  ఇవ్వగా ఆయన కోపగించి నూర్ను అక్కడనుంచి తరిమివేస్తారు. విగ్రహారాధన గురువుకి ఇష్టం లేకుండెను. ఈ విషయం అర్ధం చేసుకొని అన్ని ప్రతులను తన వారిదగ్గర నుంచి తెప్పించి సముద్రంలో ముంచివేసెను. యోగుల పటాలు సముద్రంలో పడవేసిన తన వ్యాధి నయం అవునని అనుకోని అలీ కూడా తన మేనేజర్ను  తన ఇంటికి పంపించి ఆ పటాలు నీటిలో పడవేయమని చెప్తాడు. రెండు నెలల తరువాత అలీ తన ఇంటికి వెళ్లగా అక్కడ బాబా పటం అలానే ఉంటుంది. మిగిలిన చిత్రాలన్ని తీసివేసి బాబా పటం ఒక్కటే ఎలా మిగిలింది అని ఆశ్చర్యపోతాడు. వెంటనే దానిని తీసి తన బీరువాలో దాచిపెడతాడు. ఈ పటాన్ని నూర్ చూస్తే దీన్ని కూడా నాశనం చేయునని తలచి ఎవరికైనా ఈ చిత్రం ఇచ్చేయాలి అని అనుకుంటాడు. అలీ ఇస్ముముజావర్ను కూడా కలిసి అలోచించి హేమద్పంత్ గారికి ఇస్తే మంచిది అనుకోని ఆయనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాబాకు జరుగుతున్న జరగపోయే విషయాలు తెలిసి హేమద్పంత్ గారిని కరుణించడం జరిగింది. బాబా తన భక్తుల కోరికలను ఎప్పుడు తీరుస్తూనే ఉంటారు.    
   

మనం ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అని శ్రద్ద చూపిస్తే బాబా తప్పక మనలను ప్రేమించి అనుగ్రహించి మన కష్టాలను తీర్చి మన దారి సుగమం చేస్తారు. అలాంటి సన్నివేశమే బి వి దేవ్ గారి విషయంలో కూడా జరిగింది. దేవ్ గారు మరాఠి భాషలో మరియు సంస్కృత భాషలో మంచి ప్రావిణ్యతో ఉంటారు. ఆయనకు మంచి గ్రంధాలు పరాయణచేయడం ఇష్టం. వీటి ద్వారా తాను ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్న కోరిక. అలానే తను జ్ఞానేశ్వరిని అర్ధం చేసుకొని పారాయణ చేయాలి అని ఎన్ని సార్లు ప్రయత్నం చేసిన మనసు కుదిరేది కాదు. ఆ భగవద్గీత సారం బోధపడేది కాదు. అప్పుడు తనకు బాబా అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే అది చదవాలి అని నిర్ణయించుకుంటాడు. 1914లో కుటుంబసమేతంగా షిర్డీకి వెళ్తాడు. జోగ్ తనతో మాట్లాడుతూ జ్ఞానేశ్వరి ప్రస్తావన వస్తుంది. అప్పుడు జోగ్ ఒక పుస్తకము బాబాకు ఇచ్చి ఆయన అనుగ్రహంతో మరల తీసుకుంటే నువ్వు చదవగలుగుతావు అని చెప్తాడు. బాబాకు తన ఉద్దేశ్యం తెలుసుకదా ఆయన చెప్పినప్పుడే నేను చదువుతాను అనుకోని జోగ్ చెప్పినట్లు చేయడు. 

దేవ్ బాబా దగ్గరకు వెళితే దక్షిణ ఇవ్వమంటే 20 రూపాయలు ఇస్తాడు. తరువాత వాడాలో బాలకరామ్ అనే వ్యక్తిని బాబా అనుగ్రహం ఎలా సాధించారు అని అడుగుతాడు. ఆ తరువాత రోజు ద్వారకామాయి వెళ్లగా బాబా తనను మరల 20 రూపాయల దక్షిణ అడిగితె చెల్లిస్తాడు. తరువాత ఒక మూలకు వెళ్లి కూర్చొని మరల బాలకరామ్ కలిస్తే తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పబోతూ ఉంటె, బాబా ఇంకో భక్తుని పంపి దేవ్ గారిని తన దగ్గరకు పిలిపించుకుంటారు. బాబా ఏమిచేస్తున్నావు అని అడిగితె బాలకరామ్ విషయం చెప్తాడు. మరల బాబా 20 రూపాయల దక్షిణ అడుగుతారు. అప్పుడు బాబా " నా గుడ్డ పీలికలు నాకు తెలియకుండా ఏల దొంగిలించితివి? అని అంటారు. దేవ్ అప్పుడు " నాకు ఈ గుడ్డ పీలికల గురించి ఏమి తెలియదు" అని అంటాడు. బాబా అప్పుడు " ఇక్కడ నీవు తప్ప ఇంకెవరు లేరు నీవే దొంగిలించితివి" అని గట్టిగా చివాట్లు పెడతారు. తరువాత వాడకు వెళ్లి జోగ్ బాలకరాములకు జరిగిన విషయం చెప్తాడు దేవ్. తరువాత బాబా అందరిని మసీదుకు రమ్మంటారు. బాబా మరల 12 రూపాయల దక్షిణ అడిగితె దేవ్ వసూల్ చేసి బాబాకు ఇచ్చి సాష్టాంగనమస్కారము చేస్తాడు. అప్పుడు బాబా జ్ఞానేశ్వరి చదువు అని చెప్తారు. ప్రతిరోజూ కొంచెం అయినా చదువు నేనే నీకు అర్ధం అయ్యేలా చేస్తాను. నీకు మంచి వస్త్రాలు నేనే ఇస్తానైతే గుడ్డపీలికల కోసం అందరిని అడగవలిసిన అవసరం లేదు అని అంటారు. దేవ్ కు అప్పుడు ఆ గుడ్డపీలికల విషయం అర్ధం అవుతుంది. 

ఆలా బాబా తనను కరుణించి జ్ఞానేశ్వరి పారాయణము చేయాలి అన్న తన కోరికను నెరవేర్చారు. ఊరికినే పారాయణ చేయడమే కాకుండా, మరల బాబా తనకు స్వప్నంలో కనిపించి "జ్ఞానేశ్వరి అర్ధం అవుతున్నదా? అని నీవు తొందరపడుతున్నావు. నా ముందర చదువుము అని అంటారు. అప్పుడు దేవ్ ఏమి చదవవలెను అని అడిగితె ఆధ్యాత్మ చదువు అని బాబా చెప్తారు. ఇలా తన భక్తులను సరైన దారిలో నడిపించి పరమార్ధం బోధించే సద్గురువులే మన సాయి. 

సాయి భక్తులమైన మనం ముఖ్యంగా అర్ధం చేసుకోవాల్సిన సత్యం సాయే మన ప్రేరణ. శాస్త్రాల్లో చెప్పిన శాశ్వత సుఖమే సాయి. సాయే మన సాధన కావాలి. సాయి కృపే మన ద్యేయం. ఈ కృపే మనలను లక్ష్యం వైపు నడిపిస్తుంది. 

ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!





No comments:

Post a Comment