1. శరీరమ్ సురూపమ్ తథా వా కళత్రమ్
యశస్చారు చిత్రమ్ ధనమ్ మేరుతుల్యమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్
భావం : సకల సౌందర్యవంతమైన చక్కని రూపంగల అందమైన భార్య, మేరు పర్వతమంత చాలా డబ్బు, ఇతరులకు సహాయం చేసే మంచి గుణం - కీర్తి, ఇతరులకు కష్టనష్టాలు కలిగించకుండా మంచి జరిగేలా సహాయపడే మనస్తత్వం వంటివన్నీ కలిగి వున్నప్పటికీ.. గురువు పాదాల వద్ద తన మనస్సు, శిరస్సును నిలపలేనివాడికి ఎటువంటి లాభం చేకూరదు.
2. కళత్రమ్ ధనమ్ పుత్ర పౌత్రాధి సర్వమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్
భావం : మంచి ఇల్లు, సంపద, భార్య, పుత్రులు, మనుమలు, బంధువులు వంటివారు కలిగిన ఒక గొప్ప కుటుంబంలో పుట్టినవాడు గురువు పాదాల వద్ద తన మనస్సును, శిరస్సును నిలపలేనివాడికి ఎటువంటి లాభం లభించదు. అటువంటివాడు భూమి మీద జన్మెత్తి ఏమి లాభం?
3. షడన్గాది వేదో ముఖే శాస్త్ర విద్య
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్
భావం : ఆరు అంగములలోను, నాలుగు వేదాలలోను ఎంతటి పారంగతుడివైనా గానీ... గద్య, పద్య రచనలలో ఎంతటి ప్రజ్ఞావంతుడివైనా గానీ... గురువు ఆజ్ఞలను శిరసావహించనివాడికి, ఆయన పాదాల వద్ద తన మనస్సును, శిరస్సును నిలుపలేని వాడికి ఎటువంటి లాభం దక్కదు.
4. విదేశేషు మాన్య, స్వదేశేషు ధన్య
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్
భావం : విదేశాలలో ఎంతటి గొప్పవాడివైనా... స్వదేశంలో ఎంతటి ధనవంతుడివైనా... ఇతరుల ద్వారా సదాచార వృత్తిగలవానిగా జీవించేవాడునంటూ నిత్యం పొగడబడినా... గురువు పాదాల వద్ద మనస్సును నిలుపలేనివాడికి ఎటువంటి లాభాలు అందవు.
5. క్షమా మండలే భూప భూపాల వృందై
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్
భావం : ఒక దేశాన్ని పాలించే రాజువైనా... ఎందరో రాజులు - రారాజులు నీ పాదాలను సేవిస్తూ, నీ దగ్గరే బంధీగా వుంటూ, నీ గురించి ఎంతగా పొగిడినా.. గురువు పాదాల వద్ద తన మనస్సును నిలుపలేని వాడికి అవన్నీ ఎటువంటి లాభాలను పొందపర్చలేవు.
6. యశో మే గతమ్ భిక్షు దాన ప్రతాప
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్
భావం : కష్టసమయాల్లో వున్నవారిని సహాయం చేయడం... ఇతరులకు చేతనైంతవరకు దానాలు చేయడం వంటి గుణాల వల్ల నీ కీర్తి అన్నివైపులా వ్యపించినా... నీ మంచి సద్గుణాలకు తోడుగా ప్రపంచం మొత్తం నీకు సహాయంగా వున్నా.. గురువు ఆజ్ఞలను శిరసావహించనివాడు.. ఆయన పాదాల వద్ద మనస్సును నిలపవేనివాడు ఎప్పటికీ ప్రయోజితుడు కాలేడు. అటువంటి వాడికి ఏ లాభాలు చేకూరవు.
7. న భోగే, న యోగే, న వా వాజి రాజౌ
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్
భావం : భోగము, యోగము, అగ్నిహోమము, స్త్రీ సుఖము, ధనము వంటివాటిపై ఎంత శ్రద్ధ చూపించినప్పటికీ... గురువు పాదాల వద్ద తన మనస్సును నిలపలేనివాడికి అటువంటి కార్యాల వల్ల ఎటువంటి లాభం దక్కదు.
8. అరణ్యే న వాసస్య గేహే న కార్యే
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్
భావం : అడవిలోగానీ, ఇంట్లోగానీ వుండాలనే కోరిక లేనివారైనా... తన ఒంటిమీద శ్రద్ధలేని వారైనా... ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోయినవారైనా... గురువు పాదాల వద్ద తమ మనస్సును నిలుపలేకపోతే ఎటువంటి లాభాలు అందవు.
9. గురోరష్టకం యః పఠేత్పురాయదేహీ
యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ
లమేద్వాచ్ఛితాథం పదం బ్రహ్మసంఙ్ఞం
గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్
ఎంతటి పవిత్ర వ్యక్తులైనా, సన్యాసులైనా, రాజయినా, సజ్జనులైనా, బ్రహ్మచారులైనా, చివరికి పాపాత్ములైనా, ఎవరైనా ఈ గురు అష్టకాన్ని నిత్యం పారాయణం చేసి.. గురువును శ్రద్ధతో సేవిస్తారో.. వారు కోరుకున్న కోరికలను సాక్షాత్తూ బ్రహ్మదేవుడే తీరుస్తాడు.
శ్రీ సాయి గురవే నమః !
No comments:
Post a Comment