In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, May 31, 2017

భగవద్గీత 3- కర్మయోగం



భగవద్గీత మూడో అధ్యాయం కర్మ యోగంగా చెప్తారు. ఈ కర్మయోగాన్ని అవలంభించాలి అంటే మనం కొన్ని సూత్రాలను అర్ధం చేసుకోవాలి. మొట్టమొదటిగా జీవితం యొక్క లక్ష్యం తెలుసుకోవాలి. లక్ష్యం లేని ఏ పని అయినా దారి తెన్నులేకుండా ఉంటుంది. అర్జునుడు సాంఖ్య యోగం అంతా విని ఒక పెద్ద సందేహం వ్యక్తపరుస్తాడు. భగవానుడు కర్మ గురించి, జ్ఞానం గురించి చెప్పిన తరువాత వీటిల్లో ఏది ఆచరించాలో తెలియక అర్జునుడు తికమక పడిపోతాడు. ఇవన్ని విని నా బుద్ధి భ్రమకు లోనవుతుంది. కనుక నీవే నాకు శ్రేయస్కరమైన ఒక మార్గాన్ని నిశ్చయంగా తెలుపు అని వేడుకున్నాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్పారు. 

లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయానఘ !
జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం !!

ఓ అనఘా! అర్జున ! ఈ లోకంలో రెండు నిష్ఠలు ఉన్నాయని ఇంతకుముందే చెప్పాను. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మ యోగం ద్వారా నిష్ఠ కలుగును.   

మనము ఏ నిష్ఠను ఆచరించినా కర్తవ్య కర్మాచరణను మాత్రము విస్మరించరాదు. మనుష్యులు కర్మలను ఆచరించకుండా నైష్కర్మ్యము అనే యోగనిష్ఠ సిద్ధించదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సాంఖ్య నిష్ఠను పొందజాలరు. 

మనం కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము. నిద్రలేచిన దగ్గరనుండి మళ్ళా పడుకునే దాకా మనం చాలా పనులు మనం చేస్తాము. నిలబడుట, కూర్చోవడం, తినుట, తాగుట, నిద్రించుట, కలలు గనుట, ఆలోచించుట ఇలా మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. అసలు మనం కర్మ అనేది ఎందుకు చేస్తాము. ప్రకృతిలో ఉన్న సత్వ, రజో మరియు తమో గుణాలు మనలను కర్మలు చేయడానికి ప్రేరేపిస్తాయి. కాని గుణాతీతుడైన జ్ఞాని ఈ గుణములకు వశుడై ఉండకుండా కర్మలను ఆచరిస్తారు. ఫలితంపై ఆసక్తి లేకుండా చేసిన కర్మలు మనలను కర్మ యోగం వైపు నడిపిస్తాయి. 

శ్రీ సద్గురు సాయి ఈ విషయాలనే చాలా సరళంగా మనకు అర్ధం అయ్యేలాగా చెప్పారు. అసలు ఈ నిష్కామ కర్మలు మన జీవితాన్ని పండించాలి అంటే మనం ఏమి అర్ధం చేసుకోవాలి? 

సాయి భక్తులమైన మనం శ్రీ సాయి సత్చరిత ద్వారా ఈ ధర్మాన్ని నేర్చుకోవచ్చు. సాయి చిన్న చిన్న జీవిత సంఘటనలతో మనకు ఈ సత్యాన్ని బోధించారు. 

సత్ చిత్ ఆనందం అనే మూడు మిళితం అయి ఉన్న తత్వమే పరతత్వం. సద్వస్తువు ఉన్న చోట జ్ఞానానందాలు తప్పక ఉంటాయి.  ధర్మ సంస్థాపనకొరకు , మరియు తాపత్రాయాలతో తపించి పోతున్న ఈ లోకాన్ని ఉద్దరించటానికి, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మానవ రూపంలో గురువుగా అవతరిస్తారు. అటువంటి నిరాకార పరబ్రహ్మమే, శ్రీ సాయినాథుని రూపంలో సాకార పరబ్రహ్మగా అవతారం దాల్చింది. ధర్మార్ధ కామ మోక్షాలనే పురుషార్ధాలలో మోక్షానికి మూలం అయినది ధర్మము. ధర్మం ఆచరింప బడితే మోక్షం దానంతట అదే వస్తుంది. అందుకే ఏ మతమైన, ఏ శాస్త్రమైన ఈ ధర్మాన్నే బోధించటం జరిగింది. కాని మానవులుగా దాన్ని మనం అర్ధం చేసుకునే విధంగా అర్ధం చేసుకుంటున్నామా, లేక మనకి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నామా!  ధర్మానికి పెడర్ధాలు తీస్తే, మనం మోక్షానికి దూరం అవుతాము.  

ధర్మాన్ని అనుసరించాలి అంటే కర్మ యోగమంటే ఏమిటో తెలుసుకోవాలి. కర్మను కర్మ యోగంగా ఎలా మార్చుకోవాలో మూడో అధ్యాయం మనకు నేర్పిస్తుంది. ఈ కర్మయోగం ద్వారా మన జీవితాన్ని కూడా సుగమం చేసుకుందాము.  ఈ కర్మ యోగాన్ని మనకు అర్ధం అయ్యేలా చేసి , మన జీవితాన్ని మార్చుకొనే శక్తి మనకు శ్రీ సాయి ఇవ్వాలని ప్రార్ధిద్దాము.    

ఓం శ్రీ సాయి రామ్!

Bhagavadgita -3- Karma Yoga - Introduction



Bhagavan gave good narrative of Karma and Karma Yoga in the third chapter of Bhagavadgita. We have to understand certain principles before we can practice this Karma Yoga. We can not travel without having a goal to reach. It is essential to have the knowledge of the object that we want to achieve and means to reach that object. Arjuna was confused after listening to Bhagavan about Saankya Yoga and Karma. He could not decide the path that he needs to adopt. He prostrates to Lord Sri Krishna and asks him to show him the path which is good for him. He felt that he was losing his mind, so he begged Lord Krishna to rescue him. Then Bhagavan said the following verse.

Loke'smin -dvividhaa Nishtaa Puraa Prokthaa Maya anaghaa!
Jnanayogena Saankyanaam Karma Yogena yoginaam !!

In this world there is a two -fold path, as I said before: O sinless one; the "Path of knowledge" of the Saankyaas and the path of action of the Yogis. 

There are two paths that were described in the above verse; one is The Path of Knowledge and second one is Path of Action. We have to adopt one of these paths. No one can avoid karma and humans cannot achieve salvation without performing Karmas (action). In a similar way we cannot reach the goal just with knowledge. So we need both of them. 

We do so many karmas in daily life such as getting up from sleep, eating, drinking, breathing, eliminating waste from the body, sleeping, dreaming, thinking etc. All these can not be avoided. These are the involuntary aspects of the human life. The trigunas (Satva, Rajo and Tamo) are the main reason why we are gravitated towards doing karmas. A Jnaani also goes through all these actions but a jnaani does not have the interest in the fruits of those actions. That's why they are not influenced by good or bad outcomes of those actions. If we can practice not getting attached to the results of an action, then we also can also travel towards salvation easily. 

Sri Shirdi Sai emphasized the same kind of practice by teaching the practical aspects of life and how to adopt these techniques through routine events of life. Sri Sai focused on Dharma and we can learn this through the stories of Sai Satcharita. We have to read scriptures to learn this Dharma. If we do not know the rules of the game, how can we even conduct ourselves this so called Life show. We have to learn to revere great souls who can teach us these principles and lead us in this path. Otherwise we will be wandering in this jungle of life without a proper direction. 

Lord Sri Krishna beautifully portrays the art of converting each karma into Karma Yoga in the third chapter of Bhagavadgita. We will all pray to our Guru Sri Sai to give us the wisdom to understand this Karma yoga so that we can incorporate into our daily life.


OM SRI SAI RAM! 





   

Wednesday, May 24, 2017

భగవద్గీత 2- స్థితప్రజ్ఞత - అచలప్రతిష్ఠం



భగవానుడు భగవద్గీతను సంక్షిప్తంగా రెండో అధ్యాయంలోనే దాదాపు చెప్పేసారు. అధ్యాయము చివరలో స్థితప్రజ్ఞుడు గురించి చెపుతూ ఇంద్రియాలను ఎలా నియంత్రించుకోవాలో చెప్పారు. ఇక ఈ అధ్యాయము ముగిస్తూ ఇంకా స్థితప్రజ్ఞుడు ఈ లోకంలో ఎలా వ్యవహరిస్తాడో చెప్తున్నారు.

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ !
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే: !!

నిత్య జ్ఞానస్వరూపుడైన స్థితప్రజ్ఞుడు పరమానంద ప్రాప్తినందు మేల్కొని ఉండును. అది ఇతర ప్రాణులకు రాత్రి వంటిది. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నియు మేల్కొని ఉండును. ఇది స్థితప్రజ్ఞుడైన మునికి రాత్రితో సమానము.

ఈ శ్లోకం కేవలము మాటల అర్ధంతో మాత్రమే చూడకూడదు. దీని భావార్ధాన్ని గ్రహించాలి. సామాన్యంగా అందరూ ఆరాటపడే వాటిపై జ్ఞానికి ఏ మాత్రము మనసు పోదు. అవి అశాశ్వతము అని తనకు తెలుసు. ఆ వస్తువుల విషయంలో జ్ఞాని నిద్రపోవడం అంటే, వాటికి ఏమి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం. అలానే పరమాత్మ విషయంలో మామూలు ప్రాణులన్ని నిర్లిప్తంగా ఉంటాయి. అంటే వారు పరమాత్మ విషయంలో నిద్రిస్తున్నట్లు. కాని జ్ఞాని మాత్రము ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉంటాడు. జ్ఞాని దేని కోసం ఆరాటపడకుండా తనకు లభించినా వాటితో సంతోషంగా ఉంటాడు.

ఈ వస్తు ప్రపంచాన్ని మాయ అనే రంగు కళ్లద్దాలు పెట్టుకొని మనం చూడడం నేర్చుకున్నాము.  దీన్నే అజ్ఞానము అంటారు. మన మనస్సు మనపై ఒక రకమైన మాయాజాలాన్ని చేస్తుంది. అంతటా వ్యాపించిఉన్నభగవంతుని అసలు రూపాన్ని మనం చూడలేము.  ఒక సాధకునికి తన అసలు రూపం ఏమిటో అనుభవం అయినప్పుడు ఇక అంతా పరమాత్మ తత్వమే గోచరిస్తుంది. ఒకవేళ ఈ జ్ఞాని మనకు ఈ ప్రపంచంలో మునిగి ఉన్నట్లు కనిపించినా ఈ వస్తువులు వారిని ఏ విధంగా కదపవు. ఆ మాయ అనే కళ్లద్దాలు లేక పొతే మనకు పరమాత్మ తత్త్వం ఏమిటో తెలుస్తుంది. 

తరువాత శ్లోకంలో భగవానుడు మనకు తేలికగా అర్ధం అయ్యే ఉదాహరణ చెప్పారు.

ఆపూర్యమాణం అచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ !
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ !!

అన్ని దిక్కులనుండి పొంగి ప్రవహించి వచ్చి చేరిన నదులన్నియును పరిపూర్ణమై నిశ్చలమైన సముద్రమును ఏ మాత్రము చలింపచేయకుండగనే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములు స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కల్గించకుండానే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమ శాంతిని పొందును. భోగములపై ఆసక్తి ఉన్న వారు శాంతిని పొందజాలరు.

ఇక్కడ భగవానుడు చాలా తేలికగా అందరికి అర్ధం అయ్యేలాగా మంచి ఉదాహరణతో పోల్చి చెప్పారు. ఎంత నీరు వచ్చి చేరినా సముద్రం అలాగే ఉంటుంది. అలానే సూర్యుడు తాపంతో ఎంత నీరు ఆవిరి అయినా దాని మట్టం ఏమి మారదు. అందుకే భూమిమీద దేని కొలతలన్నా చెప్పాలి అంటే అవి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాయో చెప్తారు. దీని వల్ల మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, చిన్న చిన్న వాటికి తొణకకుండా వాటిని బాధ్యత ప్రకారం నిర్వర్తించడం నేర్చుకోవాలి. కంగారు పడకూడదు. ప్రతిదానికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకుండా, అవసరాన్ని బట్టి స్పందించడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ జీవితంలో వచ్చే ఆటుపోట్లను భరించగలుగుతాము.

మనం ఎప్పుడైతే సమస్థితిలో ఉండడం నేర్చుకుంటామో, మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. అది బయటకు స్పష్టంగా కనపడుతుంది. దీనివల్ల మన చుట్టూ ఉండే వారు కూడా ప్రభావితులు అవుతారు. ఇదే విషయాన్ని భగవానుడు ఈ రెండో అధ్యాయము చివరలో చెప్పారు. దీన్నే మన శాస్త్రాలు బ్రాహ్మీస్థితి అని అంటాయి. ఈ స్థితిలో ఉన్న వారు కోరికలన్నిటిని త్యజించిన వారై, మమతా, అహంకార, స్పృహ రహితులై చరిస్తారు. వీరు అన్నివేళలా పరమ శాంతితో ఉంటారు. మనం కూడా ఈ స్థితిని రోజు గాఢ నిద్రలో అనుభవిస్తాము. కాని ఈ స్థితిని మనం ఏమి తెలియకుండానే, ఒక రకమైన తామసిక స్థితిలో అనుభవిస్తాము. ఎలాంటి శారీరక, మానసిక బాధ ఉన్నా మనకు గాఢనిద్రలో తెలియదు. అలానే స్థితప్రజ్ఞుడికి ఎల్లవేళలా ఆ స్థితి ఉంటుంది. మనం అందరం ఎప్పుడు ప్రయత్నించేది ఈ శాశ్వత సుఖం కోసమే. కాని మనం పరుగులు తీసే దారి దీనికి భిన్న మైన దారిలో తీసుకు వెళ్తుంది. డబ్బు, హోదా, పరపతి, పదవులు, మన వారిపై ఎనలేని ప్రేమ ఇలాంటివి ఎన్నో మనలను పక్క దారులు పట్టిస్తాయి. మన సమస్య ఇవన్నీ కూడా కాదు. వాటిపై మనకున్న ఆసక్తి మాత్రమే మనలను మాయలో పడవేస్తుంది.

స్థితప్రజ్ఞుడు మనస్సు అహంకారాలకు అతీతంగా ఉంటారు. అందుకే ఈ రెండో అధ్యాయంలో భగవానుడు చాలా సూత్రాలను చెప్పారు. వాటిని మనం చాలా తేలిక భాషలో చెప్పుకుందాము. ఇవి కనక మనం కొంచమైనా అనుసరించ కలిగితే మనం చాలా సంతోషంగా ఉండచ్చు.

మనకు అవసరంలేని ప్రపంచ విషయాలలో ఆసక్తిని తగ్గించుకోవాలి. ఈ విషయాలను పూర్తిగా చూడకుండా ఉండడం కష్టం. కాని వాటిమీద ఆసక్తి తగ్గించుకోవాలి.

మనం రోజు తినే ఆహారపదార్ధాలపై మనకు ఎంత ఆసక్తి ఉందొ అర్ధం చేసుకోవాలి. వాటి రుచి కోసమే తినకుండా, కేవలం శరీర పోషణ కోసం తినాలి.

ఆధ్యాత్మిక సాధకుడుగా ఉన్న వారు, అందరిని మార్చాలని, అందరికి అన్ని చెప్పాలి అనే  తపనను తగ్గించుకోవాలి. ఎవరినైతే ఆ విధి మన ముందు ప్రవేశపెడుతుందో వారితో మాత్రమే ఈ జ్ఞానాన్ని పంచుకోవాలి.

ఎవరితో కూడా అనవసరమైన వాగ్వివాదములలో దిగకూడదు.

నేను నాది అనే భావాలు ఎక్కడ బయట పడుతున్నాయో అర్ధం చేసుకోవాలి.

ఎక్కడైతే వ్యతిరేఖ భావాలు ఉంటాయో, అక్కడ జాగ్రత్తను వహించాలి. అతివాద సిద్ధాంతాలు ఉన్నచోట ఏ పక్షం వహించరాదు. తెలివిగా అక్కడనుండి బయటపడాలి.

ఎవరి గురించి చెడు ఆలోచనలు చేయకూడదు. ఎవరిపై తొందరగా ఒక అభిప్రాయాన్ని ఏర్పడుచుకోకూడదు.

అందరు మనలను ప్రేమించాలి లేదా మనం అందరి ఆప్యాయతను పొందాలి అనే ఆసక్తిని వదలాలి. మనం అందరిని ప్రేమించడం నేర్చుకోవాలి.

మనం ఏకాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఏకాంతం అంటే ఒంటరిగా ఉండడం కాదు. మనం సమ స్థితిలో ఉంటే పదిమందిలో ఉన్నా ఏకాంతంగా ఉండచ్చు. మనలో ఈ సమస్థితి లేకపోతే ఒంటరిగా మాత్రమే ఉండగలుగుతాము.

చివరిగా భగవంతుని ప్రేమించడం నేర్చుకోవాలి. శాస్త్రాలను అవగాహన చేసుకోవాలి. పరమాత్మను ధ్యానించడం నేర్చుకోవాలి.



ఓం శ్రీ సాయిరామ్!




Sunday, May 21, 2017

Bhagavadgita Stithaprajna – Achalaprathistam




Bhagavan described all of the Bhagavadgita in a nutshell in the second chapter to Arjuna. He emphasized the importance of controlling the senses and mind in the last few verses and now he is trying to conclude the second chapter by talking about the steady state that Stithaprajna has and how that person is balanced in every aspect of this material life. The following verses beautifully portray the state of that kind of person.
Ya nisaa sarvabutaanaam tasyam jaagarti samyami!
Yasyaam jaagrati bhutaani sa nisaa pasyate muneh!!
That which is night to all beings, in that the self -controlled person wakes; where all beings are awake, that is the night for the sage who sees.
This verse has deeper meaning and we cannot just translate word to word and take the meaning as it is. A self -realized soul views this world in a totally different way than an ordinary person. The things that attract the regular humans in this world are viewed by a jnani as MITHYA. That means that person knows the real nature of these objects. They are not permanent and they cause suffering if they are wished for. The Jnani enjoys whatever comes across in his path and but he won’t seek those pleasures.
As a person living in this materialistic world we see the world with tainted glasses that is called Ajnana. Our mind plays tricks on us due to our ignorance about the universal consciousness and not knowing the omnipresence of God. Bhagavan says a Muni sleeps when everybody is awake and he is awake when everybody is asleep.  This means we pay attention to the unnecessary things and we have a blind eye to the most important aspect of human life that is attaining self-realization. The Muni is always immersed in this universal truth and has no importance to the worldly things.


The Lord teaches us in the next verse about the balance that we need to have with a perfect analogy.
Aapuryamaanam achalaprathistam Samudram aapah pravisanti yadvat!
Tadvat kaamaa yam pravisanti sarve sa saantim aapnothi na kaamaa- kamami !!
He attains peace into whom all desires enter as waters enter the ocean which, filled from all sides, remains unmoved; but not the desirer of desires.  
This is a perfect example of describing the Stithaprajna and Lord Krishna talks in a simple language and uses perfect analogy.  Although gallons of water reach the ocean through various rivers, yet the level of water in the ocean does not change even by a fraction.  In a similar way no matter how much water evaporates due to Sun, the ocean level never goes down. This is the reason why we measure the height of any object on the earth with the sea level.
We have to learn not to react to various circumstances of life but respond as required. Reaction is not the right way but we have to learn to respond according to the situation. We have to try really hard to be balanced in dealing with pains and pleasures of life.
At the end of second chapter, Lord Krishna talks about “Bramhi Stithi” which means a person with steady wisdom. Whoever abandons all desires, moves about without longing and without the sense of “I- ness” and “My-ness” will attain the Peace. The goal here is not to have attachment to desires. We can control the senses but mind will still show interest in those desires. The ego is the cause of all sense attachments and longings. In deep sleep there is no ego, so we have no desires or longings.  This is the character of Stithaprajna. What can we learn from this? The suffering in this world is caused by our own misconceptions and arrogance related to the demands of wealth and endless desires.

Until we renounce our ego, we may not reach this steady state of wisdom but we can make our lives happy by trying to follow certain tips.

One should not show longing to talk or listen anything concerning worldly affairs.

One should learn to eat what is available without any concern on the taste.

One should not attempt to teach anything to anyone unless asked.

One should not argue with anyone on any topic.



One should try not to judge anyone.

One should learn to drop the ego (Me & mine) in all the words and deeds.

One should never take sides when caught up between two extreme views.


One should try not to long for love and affection shown by others.

One should learn to live alone and be happy.

One should spend time meditating on God and reflecting on Vedanta.


OM SRI SAI RAM!

Wednesday, May 17, 2017

భగవద్గీత స్థితప్రజ్ఞత - క్రోధమోహాలు



భగవానుడు ఇంద్రియాల సంయమనం ఎంత ముఖ్యమో తెలుపుతూ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో కూడా చెప్పారు. విషయ చింతన చేసే వారికి ఆ విషయములందు ఆసక్తి ఏర్పడుతుంది. ఈ ఆసక్తే ఈ విషయాలను పొందాలనే తపనను పెంచుతుంది. ఆ కోరికలు తీరకపోతే క్రోధం కలుగుతుంది. స్థితప్రజ్ఞుడు సమదృష్టితో ఉంటాడు. పరమాత్మ ప్రాప్తి పొందిన వారిని ఈ విషయాలు, ఆసక్తి అనేవి ఏమి చేయలేవు. వారెప్పుడు సమదృష్టితో ఉంటారు.

విషయాసక్తి ఉన్న వారి పరిస్థితి ఏమిటి అనే అంశం గురించి భగవానుడు ఇలా చెప్పారు.

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః !
స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో  బుద్ధినాశాత్ ప్రణశ్యతి !!

కోపం వల్ల వ్యామోహం కలుగుతుంది. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమవుతుంది. స్మృతి పొతే బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశమైతే మనుష్యుడు తన స్థితినుండి పతనమగును.

రాగము, ద్వేషము, భయము మరియు క్రోధములనే వాటికి మనం లొంగిపోతే ఏమిజరుగుతుందో మనం బాగా అర్ధం చేసుకోవాలి.

ఒక దాన్ని ఇష్టపడితే ఆ వస్తువు మనతోనే ఉండాలి అని అనుకోవడం - రాగం.

ఎవరైనా మనకు అనుకూలంగా లేకపోతే మనకు ఇష్టం లేకుండా ఉండటమే - ద్వేషం.

మనం కోరుకున్నవి, మనకు ఇష్టమైనవి మనకు దూరమవుతాయనే మానసిక వ్యథే - భయం.

మనం అనుకున్నది జరుగక పోయినా, మనకు ఎవరైనా ప్రతికూలంగా ఉంటే కలిగేదే - క్రోధం.

ఒక విషయంపై మనకు ఆసక్తి ఏర్పడితే దాన్ని గురించే మనం ఆలోచిస్తాము. దానిపట్ల మనకు సంగమం ఏర్పడుతుంది. అప్పుడు ఇంద్రియాలు, మనసు దానికొరకు తపిస్తాయి. అప్పుడు ఆ వస్తువుని ఎలాగైనా పొందాలి అనే తపన మొదలవుతుంది. ఇదే కామం లేదా కోరిక అంటారు. ఈ కోరిక తీరకపోతే మనలో క్రోధం మొదలవుతుంది. క్రోధం కాస్తా మనలను ఒక రకమైన మోహంలో పడేస్తుంది. అప్పుడు మనకు నిజం అబద్దంగా, నిజం కానిది నిజంగా కనిపిస్తుంది. మనలో ఒక ఏమరుపాటు కలుగుతుంది. దీన్నే స్మృతి విభ్రమం అంటారు. ఒక్కో సారి జ్ఞాపక శక్తి కూడా నశిస్తుంది. అప్పుడు బుద్ధి నాశనం జరుగుతుంది. ఇలా బుద్ధి నాశనం జరిగితే మనిషికి పతనం తప్పదు. ఇక్కడ పతనం అంటే డబ్బు, ఆస్తులు, హోదా ఇవి పోవడం కాదు. మనిషికి తన నిజ స్వరూపం ఏమిటో అర్ధం కాకపోవడం. బుద్ధి అనేది మనకు నిజానిజాలను తెలియ చేస్తుంది. ఆ బుద్ధే నశిస్తే ఇంద్రియాలకు, మనసుకు నిజం చెప్పేది ఎవరు?

అందుకే భగవానుడు ఇలా చెప్పారు.
నాస్తి బుద్ధిరయుక్తస్య న  చాయుక్తస్య భావనా !
న చాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖం !!

ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అటువంటి వానికి ఆస్తిక (పరమాత్మ) భావమే కలుగదు. అలాంటి వారికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వారికి సుఖం ఎట్లా లభించగలదు.

ఇంద్రియాలను అదుపులో ఉంచలేక, మానసిక వత్తిడితో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, గాలివానలో చిక్కుకుపోయిన నావలాంటిది. గాలి ఎటు వీస్తే, అలలు ఎటు తోస్తే అటు నెట్టబడుతుంది. అందుకే విషయాసక్తిని అర్ధం చేసుకోవాలి. మనలో ఉన్న బుద్ధి సూక్ష్మతను బయటకు తేవాలి. మన జీవితంలో జరిగే సంఘటనలలో ఉన్న సత్యాన్ని అర్ధం చేసుకోవాలి. మనం జీవించడానికి ఏమి అవసరమో, వాటికి ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలి అనే విషయాలను పరిశీలించి జీవితంలో అన్వయించుకోవాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా మనకు తగని వాటిపై మన దృష్టి ఉండకూడదు.

ఇంద్రియములను ఇంద్రియార్ధముల నుండి అన్నివిధములుగా నిగ్రహించిన మానవునియొక్క బుద్ధి స్థిరముగా ఉండును అని అర్జునితో భగవానుడు చెప్పారు. ఇలా స్థిరముగా ఉన్నవారినే స్థితప్రజ్ఞుడు అంటారు.



ఓం శ్రీ సాయి రాం!

Bhagavadgita - Stithaprajnata - Kaama Krodha



The Lord Krishna emphasized the importance of controlling senses and described the status of Stithaprajna with a balanced mind. Whenever we pay attention to material objects in this world, we develop some kind of desire and interest towards them. Then we want to possess them. If we do not achieve them there comes anger. But in case of Stithaprajna it is a different situation. Stithaprajna might appear to enjoy the objects around him or her, but they are detached from those objects. They have a balanced state of mind.

Bhagavan also described how these objects destroy our buddhi in the next verse.

Krodhat bhavati sammohah Sammohaat smruthi vibramah!
Smruthi bhramsaat buddhi naaso buddhinasaat pranasyathi !!

From anger arises delusion; from delusion comes confused memory; Confused memory creates loss of reasoning; one will be completely ruined without reasoning.

We have to understand how Raaga, Dwesha, fear and Krodha will influence us. 

If we like some object or person we develop what is called - Raaga - Attachment. 

We develop hatred or dislike when some one is against our wishes and this is called Dwesha.

We develop Fear when we are worried about losing the loved ones, or some thing that belongs to us. 

We are outraged and angry when we do not achieve what we wish for. 

we start thinking about a particular thing when we have interest in it. Then we develop some kind of attachment. Then senses are stimulated by the mind. We then develop intense desire to some how possess that object. This desire if not fulfilled turns into Anger. Once the anger sets in we lose sight of our circumstances. This causes a blur in reality. If we lose our intellect, we are doomed. The intellect component of mind keeps us on the track and if we lose that we can not function well. We make irrecoverable mistakes which can affect us for years or life times to come. 

The intellect tells the mind about the reality of this world. Who is going to clear this delusion if we lose this Buddhi?

Bhagavan continues to say;

Naasthi buddhirayuktasya na chaayuktasya bhaavanaa!
Na chaabhaavayatah saanthirasaanthasya kutah sukham!!

He who has not controlled his mind and senses, can have determinate intellect and can not contemplate. Without contemplation there will be no peace; and how can there be happiness for one lacking peace of mind?

When we can not control our senses, our mental state is disturbed. This is like a boat caught up in the turbulent water and wind of a hurricane. The wind blows the boat away in different directions. In a similar way, the disturbed mind will create a havoc on the Indriyas (senses) and buddhi is severed. Then one will lose the discrimination of real from unreal. We have to learn to give only enough importance to material objects so that we can exist in this world without losing our intellect. Then the senses will be under control. 

Stithaprajna is one whose senses are completely restrained from their objects. The objects and people aroud us are not the problem, the interest and desire in them is the problem. The Lord never says not to enjoy any thing around us but to be careful not to have attachment for that object. After all this is his creation. So let us learn to detach our selves from the objects and continue to derive happiness.

OM SRI SAI RAM!  




  

Wednesday, May 10, 2017

స్థితప్రజ్ఞత - నిరాహారి



స్థితప్రజ్ఞునికి ఇంద్రియాలమీద పూర్తి అవగాహన ఉంటుంది. వారికి వీటివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఐదు జ్ఞానేంద్రియాలు బయట ఉన్న వస్తువులకు తగినట్లుగా వ్యవహరిస్తాయి. ఇవి మనస్సు చెప్పినట్లుగా నడుచుకుంటాయి. ఒకవేళ సాధకుడు వీటిని గట్టిగా బంధించినా అది కొంతకాలం మాత్రమే. వాటిమీద పట్టుసడలితే మళ్ళా విజృంభిస్తాయి. ఎదురుగా ఉన్న అందమైన వస్తువు ఒక గుడ్డి వాడిని కదిలించలేక పోవచ్చు అంతమాత్రం చేత అతనికి ఇంద్రియాల మీద నియంత్రణ ఉన్నట్లు కాదు. భగవానుడు అందుకే  ఇలా చెప్పారు. స్థితప్రజ్ఞుడికి ఇంద్రియాలనన్నింటిని నియంత్రించే శక్తి ఉంటుంది. విషయాల మధ్య ఉన్నా, వారు వాటిని అనుభవిస్తున్నట్లు అనిపించినా వారికి వీటివల్ల ఎటువంటి అవరోధం ఉండదు.  ఒక సాధకుడు ప్రత్యాహారమనే యోగ ప్రక్రియ ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నిస్తాడు. ఇది తేలికగా సాధించే ఉపాయం షిర్డీ సాయి చెప్పారు. అదే భగవంతుని పట్ల అపారమైన నమ్మకం. పూర్తి శ్రద్ధ కలిగి ఉండి సభూరితో వ్యవహరించాలి. గీతలో ఈ విషయం  గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది.

విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః !
రస వర్జమ్ రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే !!

ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వానినుండి ఇంద్రియార్ధములు మాత్రమే వైదొలుగును. వాటిపై ఆసక్తి మిగిలిఉండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువల్ల వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలిగిపోవును.

 ఒక అజ్ఞాని బలవంతంగా ఇంద్రియాలను కట్టడి చేసినా వాటిపై ఆసక్తి మాత్రం నశించదు. కావున అతని ఇంద్రియాలు విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి. అవి వారి మనస్సుని ప్రశాంతంగా ఉండనివ్వవు. డయాబెటిస్ ఉన్నవారు షుగర్ పెరుగుతుంది అని తీపి పదార్ధాలను త్యజించవచ్చు. కాని వాటిపై ఆసక్తి మాత్రం పోకపోవచ్చు. అలానే కొన్ని పనులు మనం చేయలేక పోవచ్చు కానీ వాటిమీద ఉన్న ఆసక్తే వాసనగా మిగిలిపోతుంది. ఇది జన్మజన్మలకు మనలను వేధిస్తూ ఉంటుంది. అందుకే భగవానుడు పరమాత్మ సాక్షాత్కారమైతే ఈ వాసనలన్నీ నాశనం అవుతాయి అని చెప్పారు.

పైన నిరాహారస్య అనే పదాన్ని వాడారు. నిరాహారి అంటే కేవలం నాలుకకు సంబంధించినదే కాదు. అన్ని జ్ఞానేంద్రియాలకు వర్తిస్తుంది. మనం కనులతో చూసేవి, చెవితో వినేవి ఇలా అన్ని ఇంద్రియాలతో మనం గ్రహించేవి ఒక్కోసారి వాసనలుగా మిగిలిపోతాయి. ఈ ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో చెప్తూ బాబా నానాచందోర్కరుకు  శమదమాది షట్ సంపత్తి గురించి ఇలా చెప్పారు.

శమ, దమ, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ మరియు సమాదానాలనే ఆరింటిని శమదమాధిషట్కము అంటారు.

శమము: ఇంద్రియ విషయముల యందు మనోనిగ్రహము కలిగి ఉండటమే శమము అంటారు.

దమము : ఒకవేళ కొన్ని విషయాల యందు ఆసక్తి కలిగిన వెంటనే ఆ చాంచల్యాన్ని బలవంతంగా అణిచివేయటమే దమము అంటారు.

తితీక్ష : మనకు ప్రారబ్ధవశాన ప్రాప్తించిన వాటిని ఓర్పుగా సహించటమే తితీక్ష.

ఉపరతి : మాయాజాలంలో చిత్తం చిక్కు పడక, కాంత, కనకములు, సంతానము, ఆప్తులు వీళ్ళంతా మిధ్య అని గ్రహించడం ఉపరతి అంటారు.

శ్రద్ధ : దృడ విశ్వాసముతో మెలగడం శ్రద్ధ అని అంటారు.

సమాధానం : సుఖదుఃఖాలను సమభావముతో చూస్తూ అంతరంగంలో ఎలాంటి తడబాటు లేక నిశ్చలంగా ఉండటమే సమాధానము. 

ఈ ఆరింటిని అర్ధం చేసుకుని ఆచరిస్తే ఇంద్రియాలను నియంత్రించడం తేలిక అవుతుంది. ఇప్పుడు నియంత్రణకు కావలసిన సూత్రాలను చూద్దాము. ఈ విషయవాంఛలకు మూలం ఏమిటో పరిశీలిద్దాము.

ఎవరైనా ఒక వస్తువుని అనుభవించాలి అంటే మూడు అంశాలు కలవాలి.

విషయవస్తువు: ఈ ప్రపంచం అంతా విషయవస్తువులతో నిండియున్నది. మానవులుగా మనకు వీటివెనక పరుగులు తప్పడంలేదు.

జ్ఞానేంద్రియాలు: మనం బయటనున్న వస్తువులను అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే మనకు జ్ఞానేంద్రియాలు కావాలి. వయసు వచ్చేకొద్దీ వీటిలో పటుత్వం కాస్త తగ్గచ్చు. కాని మనం ఈ వస్తువులను వదలలేము. మనం వేరే రకంగా కష్టపడి మనం అనుభవించలేనివన్నీ మన పిల్లలుకు దక్కాలి అని కోరుకుంటాము. 

మనస్సు: ఈ మూడుంటిలో మనస్సు ప్రధానమైనది. ఇంద్రియాలన్నింటికి రాజు. మనసు చెప్పినట్లు మిగిలినవన్ని పనిచేయక తప్పదు. మనకు అన్ని ఎదురుగా ఉన్నామనసుగనుక ఇష్టం చూపించకపోతే మనం ఆ వస్తువుని అనుభవించలేము.

ఒక్కో సారి ఆ వస్తువుని వదిలివేయడంవల్ల కూడా మనం సుఖం పొందుతాము. లేదా వేరేవాళ్లు ఆ వస్తువుతో సుఖపడితే మనకు చెప్పలేని ఆనందం కలుగుతుంది. తల్లితండ్రులు కష్టపడి తమ బిడ్డలను పెద్ద స్థితికి ఎదిగేలాగా చేస్తారు. వారు సంపదలతో మంచి ఉద్యోగాలతో సుఖపడితే తల్లితండ్రుల సంతోషానికి అంతే ఉండదు. ఈ ఉదాహరణలో ఆ వస్తువు మన దగ్గర లేకుండానే మనం ఆనందాన్ని పొందుతున్నాము. ఇది ఎలా సాధ్యం! అంతా మన ఆలోచనా విధానంలో ఉంది.

సరిగా అర్ధం చేసుకుంటే ఈ మనసుని నియంత్రించడం మనకు పెద్ద కష్టం కాదు. ఈ ప్రపంచంలో ఉన్న సుఖం అంతా మనదే. ఈ స్థితే స్థితప్రజ్ఞత. సమదర్శిగా ఉండటం అలవాటు చేసుకుంటే మనం కూడా ఈ స్థితిని పొందవచ్చు.


ఓంశ్రీ సాయిరాం!

Bhagavadgita- Stithaprajna 3- Niraahaari:


Stithaprajna is supposed to have full control on his or her senses.  The human beings have 5 senses which are like extensions and they grasp all external stimuli. These stimuli in turn reach the mind and create disturbances. For a seeker of yoga who can forcibly control these senses, there will be a temporary abstinence. They will come to life when this practice of yoga takes a break. For example, a blind man may not fall for a beautiful object that comes across. It does not mean that that person has control of senses. Lord Krishna says that a man of steady state of wisdom is he who has the capacity to fold back the senses from all the fields of activity. This practice is called Pratyaahara in yoga. But for a devoted individual this is relatively easy because of his or her devotion towards his God or Guru. For a Jnani also this comes naturally through self- analysis. So for an ordinary student of spirituality this might be difficult that’s why Lord Krishna talks about a solution in the next verse.
Vishyaa Vinivartante niraaharasya dehinah !
Rasa-varjam rasopyasya param drishtva nivartate!!
The objects of the senses turn away from the abstinent man leaving the longing behind; but his longing also turns away on seeing the Supreme.
Even though sense objects may temporarily seem to turn away from one who is abstinent, the deep taste for these objects is ingrained in the mind. These impressions are very difficult to get rid of and erase. The turbulent senses do violently carry away the mind of a wise man though he is striving to control them. The Lord assures that these impressions can be erased if the seeker transcends the ego and experiences the Self.
The above verse talks about the word “Niraahrasya” and this is very important to understand. This will empower us to control the senses and shows the way to regain control on the senses.


We call some one who does fasting as "Niraahaari". Lord Krishna used this term in relation to all the senses in our body. If we do not eat food we are only working on the tongue. But the interest on food does not spare us. All the senses grasp outward objects in their own way. So having control on all senses is essential to be called as "Niraahaari".
Controlling the senses is one of the four Sadhanas in the spiritual path. Samadamaadi shatsampatti along with Nitya anitya vastu viveka, dispassion and Mumukshta are important pieces of the puzzle. every one of them are equally important. But with out controlling the senses it gets harder to walk the path. 

Sama is to possess mental restraint towards sensory objects.
Dama is to forcibly restrain the body and the senses from seeking sensory enjoyment.
Titiksha is forbearance. It is to bear with equanimity all that is happening one as a result of prarabhda karma.
Uparati is the withdrawal of the senses so that one does not fall into the maya of considering objects, children, relatives and friends as true.
Sraddha is the faith and devotion to one's guru.
Samadhana is to look at happiness or misery with an equal eye.

If we understand these principles and practice them, then it becomes easier to gain control on the senses. Let us look at some practical tips to gain this control. These tips are good for everyone but mainly for the people in the spiritual world.

Practical tips to be NIRAAHAARI.

To have any experience we need three things. 

First is the availability of a sense object: This world is full of sense objects which will give us sensory pleasures. We are in constant pursuit of these sensory objects. They could be objects, people, conditions and other pleasures. 

Next comes the sense organs: We need the these sense organs to respond to the objects in this world. When we are young these are at their peak, but as we get older our sensory organs does not always cooperate with the objects out side.Then the real misery follows. Still we do not want to leave these objects and we want to enjoy these through our loved ones. Then we will start saying "We could not enjoy when we are young but our children should not suffer". We push ourselves to work hard so that we can attain all these objects.

The last piece is the mind: This is the most important of all as it controls the whole deal of this ordeal. Even if both the above conditions are met, we may not be happy because the mind may refuse to cooperate. When we are in bad mood or sorrow, we prefer not to enjoy these pleasures. 

We can enjoy by rejecting these objects or by offering to God. 

Sometimes we can derive utmost happiness by just hearing good news about our loved ones. Parents hear that their son who lives abroad, bought a house or car or got a great job and their happiness is without limits. Even though this son never gave any thing to these parents. He just enjoys his wealth. Here even we are not attaining these objects still we are able to derive happiness. We have to use this character in loving God and to be righteous. We have to adopt good qualities and stay away from bad qualities.    

If we can start enjoying like the parent described above in every aspect of life and have the same feeling towards everyone in this world, then this person is seen as Stithaprajna. 

We have to thrive to get to this state then all other sensory objects can not attract us. Our goal is to reach to that higher level of pleasure which is beyond sensory objects, sense organs and mind. Once the mind starts enjoying this ultimate pleasure, it is difficult for the mind to run away from this eternal happiness. 


OM SRI SAI RAM!

Wednesday, May 3, 2017

స్థితప్రజ్ఞుడు 2 - స్థిర బుద్ధి


 స్థితప్రజ్ఞుడు ఎప్పుడూ  స్థిరబుద్ధితో ఉంటారు అని భగవద్గీత చెపుతుంది. కాని స్థిర బుద్ధి అంటే ఏమిటి? అది ఎలా పొందవచ్చు? దీనికి అడ్డంకులు ఏమిటి? 

కోరికలయందు ఆసక్తి తొలిగిపోయి, ఆత్మ యందు సంతుష్టుడై ఉన్న వానిని స్థితప్రజ్ఞుడు అని చెప్తారు. ఇక్కడ కోరికలన్ని పూర్తిగా తొలిగిపోతే కాని ఈ లోకంలో కష్టాలు లేకుండా పోవు అని చెప్పచ్చు. కాని ఇది సాధ్యమేనా! ప్రపంచంలో ఎన్నో విషయాలు, ఈ విషయాలు మాటి మాటికి మనలను బాహ్య ప్రపంచములోకి లాగుతాయి. ఈ విషయాలు సుఖం కాని లేదా దుఃఖం కూడా కలగచేయవచ్చు. అందుకే స్థిర బుద్ధి ఉంటే వీటిని సమ స్థితిలో ఎదుర్కోవచ్చు. మనం ఈ ప్రపంచాన్ని నియంత్రించలేము, కాని మనం ఈ ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చుకోవచ్చు. మన ఆలోచనా సరళిని మార్చుకోవచ్చు. మనకు అప్పుడు ఈ విషయాలు అంత కష్టం అని అనిపించకపోవచ్చు. ఈ విషయాలనే భగవానుడు ఈ శ్లోకంలో చెప్పారు. 

యః సర్వత్రానభి స్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ !
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠతా !!

దేనియందును మమతాసక్తులు లేనివారై, అనుకూల పరిస్థితులయందు హర్షము, ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోనుకాని వారిని స్థితప్రజ్ఞులు అని అనబడును. 

పైన చెప్పిన స్థితిలో స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడో తెలుసుకున్నాము. ఇది మనకు సాధ్యమేనా! 

మన మనస్సుని అదుపులోకి తెచ్చుకొని భగవంతుడు వైపు తిరగాలి అంటే మనకు అభ్యాస, వైరాగ్యాలు కావాలి. మనం ఒక విషయం నేర్చుకోవాలి అంటే దాన్ని గురించి తెలుసుకోవడమే కాకుండా, అది పొందుతాము అనే నమ్మకం ఉండాలి. అది పొందినదాకా వేరే విషయాలపై వైరాగ్యం ఉండాలి. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. అవన్నీ మనలను తప్పుదోవ పట్టిస్తాయి. మనలను గమ్యం వైపు వెళ్లకుండా అడ్డుపడతాయి. అందుకే భగవానుడు తరువాత శ్లోకంలో మనం ఎలా ఉండాలో చెప్తున్నారు.

యదా సంహరతే చాయం కూర్మ అంగానీవ సర్వశ:!
ఇంద్రియాణి ఇంద్రియార్ధేభ్య : తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా !!

తాబేలు తన అంగములను అన్ని వైపులనుండి లోనికి ముడుచుకొనునట్లుగా, ఇంద్రియములను విషయములనుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావించవలెను.

ఒక విద్యార్థికి చదువుకన్నా ముఖ్యమైనది ఏదీ ఉండకూడదు. మిగిలిన విషయాలు ఎంత వరకు అవసరమో అంతవరకే పట్టించుకోవాలి. లేకపోతె పక్క దారులు పట్టే అవకాశం ఉంటుంది. అలానే ఒక సాధకుడు భగవంతుని గూర్చిన ఆలోచనలోనే ఉండాలి. మిగిలిన కర్మలు ఈ శరీరానికి ఎంత అవసరమో అంత వరకే నిర్వర్తించాలి. అప్పుడు ఈ విషయవలయంలో ఇరుక్కోకుండా ఉంటాము. ఈ సాధనకు మరీ భంగం వాటిల్లే పరిస్థితి వచ్చినప్పుడు ఒక తాబేలు లాగా అన్ని ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవాలి.

మనకు భగవంతుడు ఎందుకు కావాలో అర్ధం చేసుకోవాలి. ఆత్మ తత్త్వం ఎందుకు అవసరమో తెలుసుకోవాలి. ఒక పిల్లవాడికి ఒక తినే వస్తువు, ఒక కట్ట డబ్బులు చూపించి ఏది కావాలి అంటే ఆ పిల్లవాడు తినే వస్తువే తీసుకుంటాడు. ఆ పిల్లవాడికి డబ్బుల విలువ తెలియదు. ఆ డబ్బులతో చాలా తినుబండారాలు కొనుక్కోవచ్చు కాని వాడికి ఆ తినే వస్తువే పరమ సంతోషాన్ని ఇస్తుంది. అలానే మనం కూడా భగవంతుడు అనే అమూల్యమైన సత్యాన్ని వదిలివేసి, స్వల్ప సంతోషాన్ని ఇచ్చే వస్తువుల వెంట పడుతున్నాము. మనం ఏమి పోగొట్టుకుంటున్నామో అర్ధం చేసుకోవడం లేదు.

స్థిరబుద్ధికి అవసరమైన సాధనాలు:

జీవిత లక్ష్యం ఏమిటో అర్ధం చేసుకోవాలి:
మన గమ్యం ఏమిటో, మనం ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకోవాలి. ఇది ఒక్కోసారి అంత సులభం కాదు అందుకే మనకు ఒక మార్గదర్శి (శాస్త్రాలు -గురువు) కావాలి. అందరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా ఏమి చేస్తున్నారు, ఎందుకు సుఖంగా ఉండలేక పోతున్నారు అనే ప్రశ్నలను ఎవరికి వారు వేసుకొని వారి గమ్యం ఏమిటో తెలుసుకోవాలి.

జీవన ప్రయాణం గురించి తెలుసుకోవాలి:
ప్రయాణంలో వచ్చే లోటుపాట్లు తెలుసుకొని అవసరమైనవి సమకూర్చుకోవాలి. ఈ ప్రయాణంలో ఎక్కడ ఏది అవసరం అవుతుందో అడిగి తెలుకోవాలి. ప్రయాణం చేసిన వారి దగ్గర నుంచి అడిగి తెలుసుకోవాలి.

శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకోవాలి:
శరీరంపై వ్యామోహం ఉండకూడదు అని మన శాస్త్రాలు చెప్తాయి కాని ఆ శరీరమే లేక పొతే మనం ఈ ప్రయాణం చేయలేము. శరీరమే లేకపోతే ఆధ్యాత్మిక సాధనే లేదు. అందుకే మనకు మానవ జన్మ వచ్చింది అని మన శాస్త్రాలు చెప్తాయి. మనం మన శరీరాన్ని ఒక సాధనం లాగా వాడుకోవాలి అని బాబా కూడా చెప్పారు. దానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అర్ధం చేసుకోవాలి. ఒకరికి దాహం వేసింది, అంటే శరీరానికి నీరు అవసరం అయింది.కాని మన మనస్సు సాఫ్ట్ డ్రింక్ కావాలి అంటుంది.లేక పొతే నాలుకకు టేస్ట్ ఉండదు. అందుకని శరీరానికి అక్కరలేనిది ఇస్తాము. మరి ఆరోగ్యం సంగతి ఏంటి? ఇలా చెప్పుకుంటే మనం మన శరీరాన్ని నాలుక ఆధారంగా హింసించడం నేర్చుకున్నాము.

మానసిక ఆరోగ్యం పాడవకుండా చూసుకోవాలి:
మనసుని కలుషితం చేసే వాటికి దూరంగా ఉండటం నేర్చుకోవాలి. కోపము, ద్వేషము, పగ, అసూయ, భయము, ఆదుర్దా పడడం, అతిప్రేమ, అహంకారము మొదలైనవన్ని మనసుని ఉద్రిక్తతకు గురి చేస్తాయి. జీవితంలో కొన్ని నిబంధనలు ఉండాలి. మనం వాటిని దాటకూడదు. దైవ చింతన, సత్సంగము, మంచి ఆలోచనలు, దయా గుణం, క్షమాగుణం అలవాటు చేసుకొని, వీటిని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. అప్పుడే మన మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మన బుద్ధి స్థిరంగా ఉండాలి అంటే ఇవన్నీ చేయక తప్పదు.

ధర్మాన్ని అనుసరించాలి:
మనం ధర్మాన్ని వదిలితే మానసిక క్షోభ తప్పదు. మనం చేసే పనిని మనం ఎంత సమర్ధించుకున్నా తప్పు తప్పే అవుతుంది. మనం కళ్ళు మూసుకున్నా దాని ఫలితం మనలను వెంటాడుతుంది. మనం ఒక అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇంక స్థిరబుద్ధి ఎక్కడ నుంచి వస్తుంది.

విచక్షణ- విచారణ అలవాటు చేసుకోవాలి:
మనం చేసే ప్రతి కర్మలో ఉన్న సత్యాన్ని అర్ధం చేసుకోవాలి. ఈ కర్మ వల్ల ఎవరికి కష్టం నష్టం జరగకుండా చూసుకోవాలి. ఒక పని చేసే ముందు అది ఎంత వరకు మన ప్రయాణంలో ఉపయోగపడుతుందో అర్ధం చేసుకోవాలి. ఒక ట్రైన్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో చాలా స్టేషన్స్ వస్తాయి. ఒక ఊరు చాలా బాగుంది అని మన గమ్యం రాకముందే అక్కడ మనం దిగము. మనం ట్రైన్ దిగకుండానే దాన్ని ఎంత వరకు ఆస్వాదించాలో అంత వరకే ఎంజాయ్ చేస్తాము. అలానే మనకు అవసరం లేని వాటిని ఎంత వరకు పట్టించుకోవాలో అంతవరకే పట్టించుకోవాలి. వేరేవాళ్లు చేస్తున్నారని వాటివెంట పరుగులు తీయకూడదు. మనస్సుకి అనవసరమైనవి ఇస్తూ ఉంటే, బుద్ధికి స్థిరత్వం ఉండదు.

జీవితానికి అవసరమైన వస్తువుల మీద నియంత్రణ ఉండాలి:
సంపాదన అనేది జీవితంలో ముఖ్యమైన అంశం. అలానే మన దగ్గర ఉన్న సంపదను ఎలా ఖర్చు చేస్తామనేది కూడా ముఖ్యమే. ఇవి మన జీవితంలో ఎటువంటి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయో అర్ధం చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో ప్రమాణం ఉంటుంది. కాని ఈ సంపాదన మనకు సంతోషాన్ని ఇవ్వకపోతే ఉపయోగం ఏంటి? మనం సంపాదించేదే సుఖపడడానికి కదా! మరి ఈ సత్యాన్ని ఎందుకు అర్ధం చేసుకోకూడదు? ఈ వస్తువులు మనకు ప్రయాణంలో ఉపయోగపడాలి. అంతే కాని వాటికోసమే మనం మన ప్రయాణం మార్చుకోకూడదు. ఈ వస్తు సేకరణే మనలను స్థిరబుద్ధికి దూరం చేస్తుంది. స్థితప్రజ్ఞుడు చాలా సంపాదించవచ్చు కాని దానిమీద ఏ మాత్రము ఆసక్తి ఉండదు.

అంతర్గత సుద్ధి - ధ్యానం:
మనం పైన చెప్పినవన్ని చేస్తూవుంటే మానసిక సుద్ధి జరుగుతుంది. అప్పుడు చిత్తం ప్రశాంతతను పొంది, బుద్ధి నిర్మలమవుతుంది. బుద్ధి స్థిరంగా ఉండాలి అంటే ధ్యానం చాలా అవసరం. ధ్యానం కుదరాలి అంటే ఊరికినే కూర్చుంటే సరిపోదు. రోజంతా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే బాబా ఇలా చెప్పారు. మీరుచేసే పనులన్నింటిని నాకు సమర్పించండి. అప్పుడు మీలో ఈ పని చేయాలా వద్దా అన్న విచక్షణ మొదలవుతుంది. ఇదే మిమ్మల్ని రక్షిస్తుంది.

స్థితప్రజ్ఞుడికి స్థిరబుద్ధి అనేది స్వభావసిద్ధం. కాని సాధకులకు ఇది ఒక సాధన అంశం. సమాజంలో ప్రతి వ్యక్తి సుఖంగా ఉండటానికి ఈ సూత్రాలు ఎంతో సహాయ పడతాయి. అందుకే భగవానుడు వీటికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చారు.


ఓం శ్రీ సాయిరాం!