In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, July 26, 2017

భగవద్గీత -కర్మ యోగం 3. 7 ప్రాణులు - ప్రకృతి స్వభావం



భగవానుడు కర్మ యోగం అనుసరించడం మంచిది అని చెప్పి మనలను మేల్కొలిపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రాణులన్ని కర్మలను ఎందుకు చేస్తాయి అన్న విషయం గురించి చెప్తున్నారు. మనం ఒకరి స్వభావాన్ని ఎందుకు మార్చలేము అన్న విషయాన్ని కూడా చర్చించారు.

సదృశం చేష్టతే స్వస్యా: ప్రకృతే : జ్ఞానవానపి !
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి !! 3. 33

సమస్త ప్రాణులు తమ తమ స్వభావానికి లోబడి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవరైనా పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజించగలరు?

మన ఆలోచనలే మన మాటల రూపంలో వ్యక్తం అవుతాయి. మనం చేసే కర్మలు మన ఆలోచనా విధానాన్ని అనుసరించే చేయబడతాయి. మనం పోయిన జన్మల్లో లేదా ఈ జన్మలో పొందిన అనుభవాల ఆధారంగా మనం మన కర్మలను చేస్తాము. పుట్టటంతోటే మనకు ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఇవి మన స్వభావంగా వ్యక్తం అవుతాయి. అందుకే ఎవరికీ ఇష్టం లేకుండా ఏ పని అయినా చేయించాలి అంటే కష్టం. కాని సమస్త ప్రాణులు వాటి స్వభావాన్ని అనుసరించే కర్మలు చేస్తాయి. ఒక్క మానవునికి మాత్రం మార్చుకొనే అవకాశం ఉంది. ఎందుకంటే మన పూర్వజన్మ సంస్కారాలు మనలను మారకుండా అడ్డు పడతాయి. ఒక తేలుకి కుట్టే స్వభావమే ఉంటుంది. ఒక పాము దానికి హాని కలుగుతోంది అనుకున్నప్పుడు కాటు వేయడం దాని స్వభావం. అలానే ప్రకృతిలో వేటి స్వభావం వాటికి ఉంటుంది. అలా అని నేను మారను అని కూర్చుంటే కష్టపడేది మనమే.
జ్ఞానులు కర్మలు చేస్తూ ఉన్నట్లు అనిపించినా, వాస్తవముగా వారికి కర్మ సంస్కారములతో ఏ విధమైన సంబంధము లేదు. వారు ఆ శరీరంలో చేయవలిసిన కర్మలన్ని లోక హితార్ధమై మాత్రమే చేస్తారు. వారికి కర్తృత్వ భావన ఉండదు. అంటే వారు చేసే ప్రతి పని కర్మ యోగమే అవుతుంది. అందుకే వారికి కర్మ బంధం ఉండదు.
మనం మన చుట్టూ ఉండే వారిని మనకు అనుగుణంగా లేక మనకు మంచిది అనిపించిన విధంగా మార్చాలి అని విశ్వప్రయత్నం చేస్తాము. వారు మారకపోతే, మన మాట వినకపోతే మనకు ఎనలేని దుఃఖం కలుగుతుంది. ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సిన కొన్ని విషయాలను పరిశీలిద్దాము.

మనం ఎవరినీ వారి స్వభావానికి బిన్నంగా మార్చలేము అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మనం చెప్పినంత మాత్రమే వారు మారారు అని అనుకుంటే పొరపాటు. వారు మారాలి అనుకున్నారు కాబట్టి వారు మారతారు.

మనం పుట్టినప్పుడే పూర్వజన్మ వాసనలు, అనుభవాలతో పుడతాము. మన కర్మ ఫలితాలకు భిన్నంగా మనం ఫలితం ఆశించడం, వాటిని పొందడం కష్టతరం.

మనం ఎక్కడ జీవించాలి అనేది కూడా పూర్వజన్మల కర్మ ఫలితమే. ఒక్కోసారి సమిష్టిగా ప్రకృతి వైపరీత్యాలను అనుభవించాలి.

మనం పూర్వజన్మలలో చేసిన కర్మలను వెనకకు వెళ్లి మార్చలేము. కాని ఇప్పుడు తెలుసుకొని సత్కర్మలను చేస్తూ, సత్సాంగత్యముతో మెలుగుతూ, భగవంతుని వైపు నడవడం నేర్చుకోవాలి. ఇలా చేస్తూవుంటే ఒక రోజు మనకు శాస్త్రాలలో ఉన్న సత్యం బోధించే గురువులు ఎదురుపడతారు. వారిద్వారా ఈ సత్యం అనుభవంలోకి వస్తే మన జీవిత లక్ష్యం నెరవేరినట్లే. అప్పుడు ఈ కర్మ బంధంనుంచి శాశ్వత ముక్తి లభిస్తుంది.



ఓం శ్రీ సాయి రామ్ !









Bhagavadgita Karma Yogam 3.7 - Living beings and their nature



Bhagavan is trying to awaken us by teaching Karma yoga and now he is talking about why all the living beings do their actions. He is also focusing on why it is hard to change one's own nature.

Sadrusam chestathe swasyaah prakruteh jnaanavaanapi !
Prkrutim yaanthi bhutaani nigrahah kim karishyati !! 3.33

Living beings follow their own nature; even a wise man acts in accordance with is own nature. what can restraint do?

Our thoughts are usually expressed as our conversations. The actions that we perform will depend upon our thought process. Our actions are mostly based on our experiences from the past lives or this life. That's why we have likes and dislikes even from the birth it self. This is why it is hard to make any one to work against their will. All the beings work according to their own nature. Poisonous creatures like a snake or scorpion will try to sting you when they feel threatened. They can not change their nature. But a human being can change their nature if they want to. If we decide not to change, no one can change us. 

The wise men appears to be functioning in this world as normal people, but their actions are not bound by the Karma.  They will perform their actions for the good of the society. They will never have feeling that they are the doers. That's why they are never bound by their actions. 
We always want to change the people around us or the circumstances according to our convenience. Sometimes we will advise people based on our thinking.  If they do not listen to us or change the way we want, we become upset. This sometimes can  cause sorrow. 

Let us focus on certain traits and characters that we all go through. 

We are bound to action all the time and these actions are based on our likes and dislikes.

We do all kinds of karmas (good, bad, neutral) and they create impressions. These impressions determine our actions.

We have to realize that no will change because of these impressions. They will change only when it is time to change. If we feel that someone changed because of us, we are just fooling ourselves. 

The external environment in which a person lives is determined by his past impressions. This includes his or her physical and mental body. 

Some times we can not change our environment but we can change how we respond to it. This can give us enormous peace. 

We can not go back and change what we did in the past but we can learn to good deeds now. We can follow the teachings of our great teachers and scriptures. By doing this we can walk towards God. If we keep doing this, one day we will be blessed. This will lead us to hear the truth behind our scriptures. This truth will remove the bondage that we are in. Then we will experience the ultimate happiness that is liberation from this birth and death cycle. 


OM SRI SAI RAM!



Wednesday, July 19, 2017

భగవద్గీత - 3.6 కర్మ యోగం - శరణాగతి



మనము రోజు కర్మలు చేస్తూనే ఉంటాము కాని వాటిని కర్మ యోగంగా మార్చుకోనే సాధనాలు కావాలి. ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి ?

కర్మను కర్మ యోగంగా మార్చాలి అంటే, ఆ పని చేయడానికి ముఖ్యమైన కారణాన్ని అర్ధం చేసుకోవాలి. ఈ పని చేయడంవల్ల మనము మానసికంగా ఎదగాలి. ఇది మన ఆలోచన శక్తి ఉన్నతంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. ఒక పని చేయడానికి వెనక నిస్స్వార్ధ బుద్ధి ఉండాలి. అప్పుడు మనలను మనం అర్ధం చేసుకోగలుగుతాము. దీనివల్ల ప్రతిపని కర్మయోగంగా మారే అవకాశం ఉంది. ఇదే మన జీవం విధానం అయినప్పుడు మోక్షమార్గానికి చేరువ అవుతాము. మనందరికి కర్మ యోగం ఆచరించడం కష్టం అనిపిస్తుంది కాబట్టి భగవానుడు ఒక తేలిక మార్గాన్ని ఈ క్రింది శ్లోకంలో చెప్పారు. 


మయి సర్వాణి కర్మాణి  సన్న్యస్య ఆధ్యాత్మచేతసా !
నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః !! 3.30

అంతర్యామినైన నా యందు లగ్నమైన మనసు ద్వారా అన్ని కర్మలను నాకే అర్పించి, ఆశ, మమతా, సంతాపములను వీడి యుద్ధం చేయుము. 

మనం చేసే పనులను భగవంతుడికి సమర్పించడం ఎలా? 
అలా మనం మనసులో అనుకుంటే సరిపోతుందా! 

ఇప్పుడు కర్మను కర్మ యోగంగా మార్చుకోవడానికి ఉపయోగపడే అంశాలను పరిశీలిద్దాము. 

 భగవంతుడు సర్వ వ్యాపి, సర్వాధారుడు అలానే సర్వజ్ఞుడు. అందరిలోనూ కొలువై ఉన్నాడు. ఈ సత్యాన్ని మొట్టమొదటగా మన చిత్తంలో నింపుకోవాలి. మనకు ఒకరి మీద పూర్తి నమ్మకం లేక పొతే  సమర్పణ భావం రాదు. అందుకే శ్రద్ధ అనేది మొట్టమొదటి సాధనం.


కర్మాచరణలో ఆలోచనా విధానం సరళంగా, ఉన్నతంగా ఉండాలి. 

మనమందరము కర్మకు బద్ధులము. ఎవరు కర్మ చేయకుండా ఉండలేరు.  

ఈ కర్మలే మన జీవితాన్ని, ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తాయి. ఒక శరీరంలో ఎంతవరకు కర్మలు చేయాలో అంతవరకు మాత్రమే మన ఆయుష్షు. అలానే ఈ ప్రపంచం కూడా ఎంతవరకు ఉండాలో ఉండి ఆ తరువాత పరమాత్మలో లీనమవుతుంది. 

మనం చేసే పనులు బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యత అనే ఉన్నతమైన భావం ఉంటే చేసే ప్రతిపనికి ఒక అర్ధం ఉంటుంది. 

మన సంస్కృతిని, శాస్త్రాలను ఆధారంగా చేసుకుని మన కర్తవ్య కర్మలు నిర్వర్తించాలి. వీటిని మన పెద్దవారినుంచి, గురువులనుంచి తెలుసుకోవాలి. 

ధర్మాధర్మాలను  అర్ధం చేసుకొని వ్యవహరించాలి. ఏది ధర్మమో తెలియక పొతే మనం చేసే కర్మలు ఎప్పటికి కర్మ యోగంగా మారలేవు. 

మనం చేసే పనులవల్ల కలిగే ఫలితం మీద ఆసక్తిని వీడాలి. ఫలితాన్ని అనుభవించద్దు అని భగవానుడు చెప్పలేదు. కాని దాని మీద ఆసక్తిని మాత్రమే వదలమన్నారు. 

మనం చేసే కర్మలు బుద్ధిని ఆధారంగా చేసుకొని చేయాలి. బుద్ధిని వాడకపోతే మనలోని  విచక్షణా శక్తిని ఉపయోగించుకోలేము. 

మనం చేసే కర్మలు ఇష్ట అయిష్టాలకు అతీతంగా ఉండాలి. ఆ సమయానికి ఏది అవసరమో అది నిస్వార్ధ బుద్ధితో చేయాలి. 


ఎప్పడు నేను చేస్తున్నాను అన్న భావనను రానివ్వకూడదు. మనమే కనుక కర్తలం అయితే, మనకు ప్రతి సారి విజయం రావాలి. కాని అలా జరగడం లేదు. అందుకే మన గొప్పతనం ఏమి లేదు అని అర్ధం చేసుకోవాలి. మనమంతా కర్మకు బద్ధులము.
 

మనం చేసే ప్రతి కర్మను భగవదర్పితం చేయడం నేర్చుకోవాలి.
 


భగవానుడు ఇప్పుడు తాను చూపించిన మార్గం అనుసరిస్తే కలిగే ఉపయోగం తెలిపి, అలానే అనుసరించకపోతే కలిగే నష్టాన్ని కూడా చెప్పారు.
 

యే మే మతమిదం నిత్యమనుతిష్ఠన్తి మానవాః !
శ్రద్ధావంతో -నసూయంతో ముచ్యంతే తే అపి కర్మభిః !! 3. 31

ఏ మనుష్యులైతే శ్రద్దా భక్తులతో దోషదృష్టి లేకుండా నా ఈ మతమును అనుసరించెదరో వారు సమస్త కర్మబంధములనుండి ముక్తులు అయ్యెదరు.
 

అలా అనుసరించనిచో కలిగే నష్టాన్ని తరువాత చెప్తున్నారు.
 

యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠన్తి మీ మతం !
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః !! 3. 32 

కాని నా యందు దోషారోపణ చేయుచు, నా ఈ ఉపదేశాన్ని అనుసరించని మూర్ఖులు సమస్త అజ్ఞాన విషయములందు మోహితులై భ్రష్టులై కష్టాలపాలు అయ్యెదరు.
 


పైన చెప్పిన అంశాలను మనం అవలంబించడం నేర్చుకుంటే శరణాగతి చేయడం తేలిక అవుతుంది. శరణాగతి ఎక్కడైతే ఉందో అక్కడ కర్మ యోగం తప్పకుండా ఉంటుంది. భగవంతుడికి సమర్పించడం అలవాటైతే రాగ ద్వేషాలకు దూరంగా ఉండగలుగుతాము. మనం చేసే పని మంచిదో కాదో అన్న ఆలోచన మనలో వస్తుంది. ఈ విచక్షణా జ్ఞానం మనలను సరైన దారిలో నడిపిస్తుంది.
 


ఓం శ్రీ సాయి రామ్ !



Bhagavadgita 3.6- Karma Yoga - Surrender



Our life is bound by Karma (actions) and we have to learn to perform all our actions as Karma Yoga. But we have to know what are the tools that we need to change karma to Karma yoga. 

We first have to understand what is our motive behind each and every action. Then only we will be able to change every action into Karma Yoga. Each action should elevate our personality and we should become more mature. This is possible only when our thoughts are pure and original. These thoughts need to be selfless and universal. When our thoughts are open and service minded, we will get closer to our self. When we are close to our self we are more peaceful. This quality is essential to attain salvation. This might seem difficult but Bhagavan gave some direction and the following verse reflects that truth.  



Mayi Sarvaani Karmaani Sanyasya Aadhyaatmachetasa!
Niraasi Nirmamo Bhutvaa Yudyaswa Vigatajwarah! 3.30

Renouncing all actions in me, with the mind centered on the self, free from hope and egoism, and free from mental fever, do fight. 

How do we surrender all our actions to God?

Is it enough if we think in our mind like that?

Now let us examine important tools that can help us in this process.

God is omnipresent, omniscient and divine. We have to first understand the qualities of God. We need to have utmost faith in God. This is the most essential quality in our search for the universal truth.

We are all bound by action and no one can escape not doing karma.

Our actions need to arise from pure mind and self less attitude.

The universe is functioning with a common cause and our actions also need to be part of the bigger picture and higher cause.

We need to adhere to Dharma no matter what and in any circumstance.

We need to conduct ourselves without the notion "I am the doer". We need to be humble in our expression. 

Our actions need to reflect the scriptures and the teachings of great people. Our Guru should play a big role in our life. 

We should not base our actions based on likes and dislikes of the mind.

Our actions need to under the direction of intellect and should not be reactive based on our mind. 

We need to do our duty to the best of our ability all the time. We need to make wholehearted attempt all the time.

We need to do our duty as an offering to God.

We need to surrender all our actions to God and accept the results of our action as a gift from God.


Bhagavan in the following verses talks about the outcome when we follow his teaching and what happens if we do not follow. 

Ye me matamidam nityam anutishtanti maanavaah!
Sraddhaavanto-naasuyanto muchyante tepi karmabhih!! 3.31

One who executes his duties according to my teaching and who follows this teaching faithfully, without being critical, becomes free of bondage of actions.


Ye tvetad-abhaya-suyanto naanu-tishtanti me matam !
sarvajnaana vimudhaamstaanividdhi nashtaanachetasah!! 3.32

But those who criticize my teaching, disregard these teachings and do not practice them regularly, are completely deluded and doomed to bondage. 

If we learn and practice all the tips mentioned above, we can convert the actions we perform everyday into Karma Yoga. Whenever our actions are devoid of selfishness and not attached to the fruits of actions, the task becomes easy. We are not going to be bound by the serious consequences of these actions. We can also face the consequences of any action with ease. This is like handling a serpent with out fangs. 

The purification of mind is possible only when we are humble, surrender to God, and be in the company of good people. We need to sing the glory of God. We need to listen to the scriptures through able teachers.



OM SRI SAI RAM!







Wednesday, July 12, 2017

భగవద్గీత 3. 5 కర్మ యోగం - ప్రకృతి గుణాలు




భగవానుడు కర్మలను యజ్ఞముగా లోకహితం కోసమే ఆచరించమని చెప్పి, ఇప్పుడు కర్మాచరణలో జ్ఞానికి మామూలు మనుషులకు తేడాలు ఏమిటో సెలవిస్తున్నారు. ఎందుకంటే ఈ తేడాలు అర్ధం చేసుకోపోతే మనం ఎప్పటికి మారలేము. మనకు ఆసక్తిరహిత కర్మలు చేయడం ఎందుకు కష్టం అయింది? వీటికి సమాధానంగానే భగవానుడు ఇలా చెప్తున్నారు. 

ప్రకృతే: క్రియమాణాని గుణై: కర్మాణి సర్వశ: !
అహంకార విముడాత్మా కర్తాహమితి మన్యతే !!

వాస్తవముగా కర్మలన్నియు అన్నివిధముల ప్రకృతిగుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకారవిముడాత్ముడు ఈ కర్మలన్నిటికిని నేనే కర్తను అని భావించును. 

ప్రకృతి మూడు గుణాల సమ్మేళనం. అవి సత్వ రజో మరియు తమో గుణాలు. ఈ గుణాలే 23 తత్వ రూపములుగా పరిణితి చెందినవి. అవే మనస్సు, బుద్ధి, అహంకారము, పంచ మహా భూతాలు (ఆకాశం, గాలి, అగ్ని, నీరు మరియు భూమి); దశ ఇంద్రియములు (5 కర్మేంద్రియములు - 5 జ్ఞానేంద్రియములు) ; శబ్దాది పంచ విషయములు (శబ్ద, స్పర్శ, రూప, రస మరియు గంధ). ఇవి అన్ని కూడా ప్రకృతి యొక్క గుణములు. అంతే కాక సత్వ రజో తమో గుణాలు వీటి ద్వారానే వ్యక్తం అవుతాయి.  మనం ఏ కర్మలు చేయాలన్నా ఈ గుణాల ప్రేరణ వల్లనే చేస్తాము. 

ఈ 23 ప్రకృతి గుణాలు నేను అని నమ్మి కర్మలు చేసే వారిని భగవానుడు అహంకార  విముడాత్మా అని సంబోధిస్తున్నారు. అంటే అహంకారముచే మోహితమైన అంతఃకరణములుగల అజ్ఞాని అని చెప్పారు. ఇలా ప్రభావితం అయిన వారు ఈ శరీరమే నేను అని, ఈ మనస్సు, బుద్ధి నేనే అని ఆలోచిస్తారు. ఇలా అనుకోవడాన్నే "అహంకారం" అంటారు. అప్పుడు మనలో వివేకశక్తి నశిస్తుంది. ఏది నిజమో ఏది నిజం కాదో తేల్చుకోలేము. అంటే ఆత్మ అనాత్మ బేధం చూడలేము. 

గుణాతీత స్థితియే ఆత్మస్థితి అని మన శాస్త్రాలు చెప్తాయి. కాని మనం ఈ గుణాలకు లోబడిపోయి ఉన్నాము. నిజముగా ఆత్మకు కర్మకు ఏమీ సంబంధం లేకపోయినా మనం ఈ 23 తత్వాలను మన వ్యక్తిత్వంగా చేసుకొని, నేనే ఈ కర్మలు చేస్తున్నాను అనే భ్రాంతికి లోనవుతాము. జ్ఞానేంద్రియాలు వాడినప్పుడు, నేను వాసన చూస్తున్నాను, వింటున్నాను, నేను కంటితో చూస్తున్నాను, ఇలా అన్నిటికి కర్త మనమే అయి వాసనలు పెంచుకుంటున్నాము. అప్పుడు ఆ కర్మలతో బంధం ఏర్పడి, వాటి ఫలితాన్ని కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఇలా ఈ కర్మ చక్రంలో పడి నలిగిపోతున్నాము. మనం ఈ సత్యాన్ని అర్ధం చేసుకొని మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. కర్మలు చేసేటప్పుడు వాటి ఫలితాన్ని దృష్టిలో ఉంచుకొవాలి. అందుకే జ్ఞానులైన వారు కర్మాసక్తులైన వారికి శాస్త్రవిహిత కర్మలను ఆచరణాత్మకంగా ఆచరించమనే చెప్తారు. గురు స్థానంలో ఉన్న వారు ఎప్పుడు కర్మలను త్యజించవద్దు అని బోధించరు. అందుకే భగవానుడు జ్ఞానులైన వారికి ఇలా చేయవద్దు అని హెచ్చరిక చేశారు. 

మనం కర్మలు త్యజించడం వల్ల మోక్షాన్ని పొందలేము. ఆ కర్మల ద్వారా వచ్చే ఫలితం మీద ఆసక్తిని వదలాలి. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని యొక్క గుణ ప్రభావ స్వరూపములను తెలుసుకొని వాటిపై విశ్వాసముంచవలెను.  ఆ గుణాల అధీనంలో మనమందరం ఉంటాము. కాని గుణాలన్ని పరమేశ్వరుని అధీనంలో ఉంటాయి. పరమేశ్వరుడు గుణాతీతుడు.


ఓం శ్రీ సాయి రామ్!








Bhagavadgita 3.5 Karma Yoga- Qualities of the Nature




Bhagvan asked us to perform our actions for the sake of welfare of this world and now he talks about the differences between the actions of a Self realized soul and an ordinary person. If we do not understand these differences it is hard for us to change our attitude and view of this world. It might be difficult to perform selfless actions, but Bhgavan explains in the next verse why it is difficult.

Prakruteh kriyamaanaani gunaih karmaani sarvasah!
Ahamkaara vimudaathmaa kartaahamithi manyate!!

All the actions that are performed are merely by the qualities of nature (Gunas) in all cases. He, whose mind is deluded by egoism, thinks "I am doer". 

The world, nature is made up of three qualities and they are Satva, Rajo and Tamo gunas. These three qualities manifested in the form of 23 forms (Tatva Rupas). These are Mind, intellect, Ego (Ahamkaara), 5 elements (Space, Air, Fire, Water, and Earth), 10 indriyas (5 organs of actions & 5 sense organs) and 5 perceptions (Sabda, Sparsa, Rupa, Rasa and Gandha). The three qualities of nature is expressed through all these factors. All the actions are triggered by these qualities only. 

If we manifest Satva (noble) quality in our thoughts, our perception of the world will be noble. So whatever quality we project that is what we are going to experience. When the thoughts are tainted with agitation, the actions are also lased with unstable mood and confused. If the thoughts are dull (Tamas), then the actions are also baseless, vicious and tainted with laziness. Thus mind's projection of our world manifests because of past impressions. When we perform our actions by merging with these qualities and with a sense that "I am the doer" then we are called as Vimudaathma. This is the word Bhagavaan uses for these kind of people. They feel that they are this body and mind and attached to the actions that they perform. If we are attached to the fruits of our actions, then we lose sight of the reality. We can not distinguish right from wrong. 

The self realization is nothing but crossing these qualities of nature and staying beyond these 3 qualities. But we are bound by these three gunas. We made these 23 factors as our nature and as our personality. In reality there is no relationship between Atma and karma. Because of this adoption of 23 factors, we tend to fall into the illusion that we are this body and mind. When we use our senses, we feel that we are visualizing things, hearing sounds, tasting food items and feeling objects etc. Then we feel that we are the doer of all these actions. We are increasing the impact of these objects in the form of impressions. These impressions drive us to do more actions with attachment. Teh attachment causes pain and suffering. This becomes vicious cycle. We have to change by understanding this very nature of these gunas and change our thinking. Then our attitude towards the world will change. We have to make sure that we understand the consequences of the actions. We can not avoid doing actions but we can detach ourselves from getting attached to the fruits of these actions. Bhagavn reiterated to the Jnaanis that they should never unsettle those with imperfect knowledge. 

We can never attain Moksha by quitting actions. We have to let go the attachment of those actions. We have to watch the desires and control the desire to perform actions that are agitated and dull. Good and positive thoughts always keep us on the track. We pay attention to the higher causes of actions. This higher thinking will make us think about the Supreme God who is devoid of all these Gunas. We are bound by the these gunas. But these Gunas are in control of Supreme God. The whole world is his Abode.   


OM SRI SAI RAM!



Wednesday, July 5, 2017

గురు పూర్ణిమ - గురు కృప



సత్ చిత్ ఆనందం అనే మూడు మిళితం అయి ఉన్న తత్వమే పరతత్వం. సద్వస్తువు ఉన్న చోట జ్ఞానానందాలు తప్పక ఉంటాయి. 

ధర్మ సంస్థాపనకొరకు , మరియు తాపత్రాయాలతో తపించి పోతున్న ఈ లోకాన్ని ఉద్దరించటానికి, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మానవ రూపంలో గురువుగా అవతరిస్తారు. అటువంటి నిరాకార పరబ్రహ్మమే, శ్రీ సాయినాథుని రూపంలో సాకార పరబ్రహ్మగా అవతారం దాల్చింది.

అసలు ధర్మం ఎందుకు స్థాపించాలి?
ధర్మార్ధ కామ మోక్షాలనే పురుషార్ధాలలో మోక్షానికి మూలం అయినది ధర్మము. ధర్మం ఆచరింప బడితే మోక్షం దానంతట అదే వస్తుంది. అందుకే ఎ మతమైన, ఎ శాస్త్రమైన ఈ ధర్మాన్నే బోధించటం జరిగింది. కాని మానవులుగా దాన్ని మనం అర్ధం చేసుకునే విధంగా అర్ధం చేసుకుంటున్నామా, లేక మనకి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నామా! ఇలా ధర్మానికి పెడర్ధాలు తీస్తే, మనం మోక్షానికి దూరం అవుతాము. 

సరే ఈ ధర్మం మనకు ఎవరు బోధిస్తారు?
పరమగురువులు మనకు ఈ ధర్మాన్ని వారి వాక్కుల ద్వారా మనకు అందిస్తారు. వారి వాక్కులే మనకు మార్గనిర్దేశంగా నిలుస్తాయి. అలా సాయి నాధుని గళంలో నుంచి వెలువడిన అధ్భుత జ్ఞాన ప్రవాహమే శ్రీ సాయి సచ్చరిత. ఈ జ్ఞాన వాణి మన జీవితాల్లో ఒక కొత్త వెలుగుని నింపుతుంది.  ఇక ముందు కూడా ఇది వెలుగుని నింపుతూనే ఉంటుంది. 

శ్రీ సాయి సచ్చరిత ఎంతోమందిని ఎన్నో విధాలుగా కాపాడింది. వారిని సాయి భక్తులుగా మార్చింది. శ్రీ సాయి దివ్య చరితమనే అమృతాన్ని ఎన్నో లక్షలమంది ఆస్వాదిస్తున్నారు. వారి జీవితాలలో మార్పులను వారే స్వయంగా గమనిస్తున్నారు. మనిషి జీవితంలో మార్పు తీసుకురాలేని ఏ బోధకాని, ఏ శాస్త్రం గాని, ఏ ప్రవచనం గాని  సంపూర్ణం అవ్వదు. ఇది సంపూర్ణం అవ్వాలి అంటే దాని మీద నమ్మకం ఉండాలి. అలా నమ్మిన దాన్ని సభూరితో అనుసరించాలి. అప్పుడే దానికి సార్ధకత. అందుకే శ్రీ సాయి సచ్చరిత నమ్మకమనే పునాదితో మొదలపెట్టి మెల్లగా మన కర్మలకనుగుణంగా మనకు సభూరి నేర్పించి మనందరిని ఆధ్యాత్మిక పథంలో నడిపిస్తుంది.  

మన బాబా చేతల గురువు. అయన ఏది బోధించాలన్నా అనుభవ పూర్వకంగానే నేర్పిస్తారు. ఆయనను గట్టిగా పట్టుకుంటే మనకింక వేరే దారులు అవసరం లేదు. 

సచ్చిదానంద పరబ్రహ్మ శ్రీ సాయి రూపంలో అవతరిస్తే,
శ్రీ సాయిపరమాత్మ తత్త్వం శ్రీ సాయి సచ్చరిత రూపంలో వెలిసింది. 

సద్గురువులు తమ సమాధి అనంతరం కూడా తమ దివ్య వాణి రూపంలో అమరులు అయి ఉంటారు. అందుకే బాబా ఏకాదశ సూత్రాలలో ఇలా చెప్పారు. 
ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను. 
నా సమాధి నుండియే నేను సర్వ కార్యములను నిర్వహింతును. 
నాయన్దెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము. 

ఇంత ఖచ్చితంగా భరోసా ఇచ్చి, మనలను కాపాడగల్గిన పరమ గురువు మన సాయి. అందుకే అయన మనకు ప్రసాదించిన శ్రీ సాయి సచ్చరిత అనే గ్రంధరాజాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. 

ఇదే మన ధర్మం కావాలి. 

ఈ ధర్మమే మన జీవితం కావాలి. 

ఈ జీవితమే సాయి నాధునికి అంకింతం చెయ్యాలి. 

ఈ అంకిత భావంలోనుంచి అపరంపారమైన భక్తి జనించాలి. 

ఈ భక్తి అనే అమృతంతో సాయికి పూజ అభిషేకాలు జరగాలి. 

అప్పుడు ప్రసాదంగా కేవలం సాయి కృపని మాత్రమే కోరుకోవాలి. 

కేవలం గురు కృప మాత్రమే మానవునిలో ఉన్న మూడు ఆవరణలలో చివరిది అయిన అజ్ఞానమనే ఆవరణను తొలిగిస్తుంది. ఈ అజ్ఞానం వీడితే సాయిపరబ్రహ్మ స్వస్వరూపంగా వ్యక్తమవుతారు. 


సదా స్వస్వరూపం  చిదానంద కందం 
జగత్సంభవ స్థాన సంహార హేతుం ! 
స్వభక్తెచ్చయా  మానుషం దర్శయన్తమ్ 
నమామి ఈశ్వరం  సద్గురుం సాయి నాధమ్  !!


 ఓం శ్రీ సాయి రామ్ !

Guru Purnima-Guru Seva



We might have had so many experiences both spiritually and temporally as Sai’s devotees. We will continue to feel his presence. Sai might have helped each one of us either with our family, health, or wealth related issues.  As a guru he is second to none in guiding us on the spiritual path.

How can we pay him back for the mercy that he shows?

A mother will do anything for her children. In a similar way, mother Sai will not only protect us in this life but in future incarnations. How can we offer our gratitude to our Guru. A Guru is considered as God, mother, father, friend, and teacher. Guru is everything for us in this world and beyond. Whatever service we offer to Guru, it is never enough. We can never serve him enough for his mercy. 

The service that we can offer to Sai has to be with lots of devotion. A service without utmost devotion is not fruitful if you want to advance in your life. 

We have to express this love towards our Guru in an exemplary manner. To raise our faith to that level, we have to first know him very well. 

Once we start learning about him, our love towards him will exponentially grow. 

That love has to grow into a huge tree. 

The roots of that tree of love have to go deeper into the ground. 

This tree of love is vulnerable to natural calamities and other forces of nature. These calamities are nothing but our senses, our bad habits, or even drifting away from the teachings of our own Guru. 

We should not yield to these pressures. Our path is clear and that is the way of Sai. We cannot deviate from this path. We should never lose our faith towards Baba. This is the real service that we can offer to our Guru. 

The seva has to come from the depths of our inner soul. 

This service should be filled with love but not out of fear or selfishness. From this selfless love comes out real devotion and dedication. Then one will be immersed with Sai’s blessings.  So to experience this, we need to know Sai. 

What is the best way to learn about any one?  The answer is simple.
One has to read Sri Sai Satcharita. This is the best way to learn about Sai, his leelas and his teachings. We have to then understand the spiritual significance behind his stories and teachings. We have to cement his teachings in our hearts. When Sai was in flesh the devotees did not have the luxury of reading our Guru’s story but now we can. In those days Baba wanted some of his devotees to read Guru Charitra. Lots of people benefited from reading this. Now our Guru Charitra is Sri Sai Satcharita. This is our Scripture and our Veda.

While writing Sri Sai Satcharita, Hemadpant described as follows.
Sri Sai Satcharita is like an ocean which is unfathomable, vast, and it has so many valuable things.  

Baba himself said the following words.

You perform your duty. Do not have the least doubts in your mind. Have full faith in my words and be of resolute mind.  If you write about my leelas, it will wipe out the faults which have arisen due to ignorance. And when you listen to it with faith your worldly involvements will disappear.  It will cause waves of love and devotion to rise on the ocean of the mind; and, diving into them now and then, will bring up gems of knowledge ”.

Whoever sings with feelings of my life, eulogizes my powers, virtues and excellence, I will protect him totally, by surrounding him. Those devotees who have become one with me with heart and
soul, they will, naturally, be bound to be happy by listening to the story of my life.

Whoever sings my praises, I will bestow upon him complete happiness, permanent pleasure and contentment. Believe this as the Truth. It is my promise to redeem the one who, with faith sings my
praises, totally surrenders to me, remembers me constantly and meditates on me.

How will anyone be longing for worldly pleasures, who thinks of my name, worships me, studies me, whose holy readings are of me, who meditates on me and who continuously thinks of me?

From the very jaws of death I will snatch away my devotees. Just by listening to my stories diseases will disappear. Listen to the story with due reverence, meditate fully upon it, intently contemplate upon it and you will attain peace.

The ‘You and I’ will disappear. The minds of the listeners will be absorbed in God. The mind will be a store of divine energy and full of single-minded and complete faith.

Repetition of the name ‘Sai’ will burn away all the sins of Kali-Yuga. Once having prostrated, past sins born of speech and hearing will be destroyed ”.

There is no other service to Sai greater than doing Satcharita Parayana (study). 

This service is the best offering every one can perform so easily. 

We should take advantage of this service. People can say that they do not have time and they are very busy. We have to be realistic and if we think we do not have 10 minutes in our daily routine we are not being fair.  Can we make an effort to read at least 1 page or we can remind ourselves a story of Sai. Some how we can spend some time thinking about our Sai. 


Let Sai Paramatma's grace shower on all of us.