In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, February 21, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం - 23



హేమద్పంత్ గారు ఈ అధ్యాయంలో బాబా యొక్క వినమ్రతను వర్ణిస్తూ భక్తులలో ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. బాబా ఎల్లప్పుడూ భగవంతుడే సర్వాధికారి అని చెప్తూ, నేను ఆయన దాసుడ్ని అనే భావంతో మెలిగేవారు. వారు ఎవ్వరితోను పోల్చుకునేవారు కాదు. అలానే ఇతరులను కూడా పోల్చుకోనిచ్చేవారు కాదు. వారు ఎవరిని తిరస్కించేవారు కాదు. ఎవరిని తుచ్ఛంగా చూసేవారు కాదు. పుణ్యసంచయం ఉంటె కాని సత్పురుషులను గురించిన విషయాలు విని ఆనందించాలన్న కోరిక జనించదు. 


ఒక సారి ఒక యోగాభ్యాసి నానా చాందోర్కర్ ద్వారా బాబా గురించి విని షిర్డీకి వస్తాడు.  ఈయన పతంజలి యోగ సూత్రములు మరియు ఇంకా యోగ శాస్త్రాన్ని పూర్తిగా అభ్యసించాడు. కాని దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోలేక, సమాధిస్థితి పొందలేక, బాబా అనుగ్రహం ఉంటె తాను ఈ స్థితి పొందగలనేమో అనే ఉద్దేశంతో బాబా దాగరకు వస్తాడు. అక్కడ బాబా ఒక ఎండు చద్ది రొట్టె మరియు ఉల్లిపాయను తింటూ ఉంటె చూసి బాబా తనకు ఏమి నేర్పించగలరు అని భావిస్తాడు. అప్పుడు బాబా "నానా ఉల్లిని జీర్ణం చేసుకోగలిగిన వారు మాత్రమే తినాలి" ఆ మాటలు విన్న యోగాభ్యాసి చకితుడయ్యాడు. అప్పుడు అతనికి బాబాపై నమ్మకం గలిగి తన సందేహాలకు సమాధానాలు పొంది బాబా ఆశీర్వాదంతో అది పొంది సంతోషంగా వెళ్ళిపోయాడు. 

శ్యామా శరణాగతి: ఒకసారి శ్యామాని ఒక పాము కరుస్తుంది. విషము బాగా నర నరాల్లో పాకుతుంది. వాళ్ళ ఆచారం ప్రకారం పాము కరచిన వారిని ఆ ఊరి గుడికి తీసుకువెళ్తారు. కాని శ్యామా దానికి ఒప్పుకోలేదు. చావు అయిన బ్రతుకు అయినా బాబానే నా దేవుడు అని గట్టి నమ్మకంతో చెప్పాడు. అప్పుడు ఆయన్ని బాబా దగ్గరకి తీసుకురావడం జరిగింది. బాబా శ్యామాని బతికించడం అంతా మనకి తేలిసినదే.  శ్యామా మహానుభావుడు. అంతటి నమ్మకం, భక్తి మనకి కూడా రావాలి.

ఒకసారి షిర్డీలో కలరా వ్యాధి బాగా ప్రబలి గ్రామవాసులు భయపడుతూ బయట ఊర్లతో రాకపోకలు మానేస్తారు. గ్రామ పంచాయతీ వారు సభచేసి రెండు అత్యవసర నిర్ణయాలు తీసుకుంటారు. మొట్టమొదటిగా ఆ ఊరిలోకి కట్టెల బళ్ళు రాకూడదని, రెండవ నిబంధన ఎవరు కూడా మేకలను కోయకూడదు. ఇలా ఉంటె ఒక రోజు ఒక కట్టెలబండి వస్తుంది. అందరు దాన్ని వెనుకకు పంపివెయ్యాలి అనుకుంటే బాబా వచ్చి ద్వారకామాయి వైపు రమ్మని తీసుకువెళతారు. బాబాకు తెలుసు ఈ నిభందనలు అర్ధం లేనివి మరియు మూఢనమ్మకాలతో కూడుకున్నవని. దీనికి తోడు కట్టెలు లేక ఆ ఊరివారందరు వంట చేసుకునేందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఈ సమస్యను బాబా పరిష్కరించి రెండో నిబంధనను ఈ విధంగా ఒక లీల ద్వారా ధిక్కరించెదరు. 

మేకను చంపేకథ
జీవుడు వాస్తవానికి త్రిగుణాతీతుడు కాని మాయా మోహితుడై తన సచ్చిదానంద స్వరూపాన్ని మరచిపోయి శరీరమే తాను అని అనుకుంటాడు. ఆ శరీరాభిమానంతో నేను కర్తను, నేను భోక్తను అని తలచి అనర్ధమైన జనన మరణ పరంపరలో పడి బాధపడతాడు. వాటి నుంచి బయటపడే మార్గమే ఎరుగడు. గురువు పాదాలయందు ప్రేమపూర్వకమైన భక్తి యోగమే అనర్ధాలను ఉపశమింపచేసే మార్గం. ఆ గురువు పట్ల శ్రద్ధను తెలియచేసేదే ఈ కథ.

             ఒకసారి మరణానికి సిద్ధంగా ఉన్న మేకను ఎవరో తీసుకొని వచ్చారు. దానిని చూడటానికి జనం వచ్చారు. ఏ దిక్కులేని వారిని రక్షించే దైవమే సాయిమాత. అప్పుడు బాబా ప్రక్కనే ఉన్న బడేబాబాను "ఒక దెబ్బతో దీన్ని చంపేసి బలి ఇవ్వు" అని అన్నారు. అప్పుడు బడేబాబా "దీన్ని ఊరికే ఎందుకు వధించాలి" అని అన్నాడు. అక్కడే ఉన్న శ్యామాతో బాబా "శ్యామా నీవైన వెళ్ళి కత్తి పట్టుకురా ఈ మేకను కోద్దాం, వెళ్ళు" అని ఆజ్ఞాపించారు. శ్యామా, రాధాకృష్ణబాయి దగ్గరకు వెళ్ళి కత్తి తెచ్చి బాబా ముందుంచాడు. ఇంతలో ఈ విషయం రాధాకృష్ణ బాయికి తెలిసి, ఆమె కత్తిని తెప్పించుకున్నది. శ్యామా మరో కత్తి తేవడానికి వెళ్ళి వాడాలో కూర్చుంటాడు. తరువాత కాకా దీక్షిత్ మనసు పరిక్షించాలని బాబా "నీవు వెళ్ళి కత్తిని పట్టుకురా, ఈ మేకను భాద నుండి విముక్తి చేద్దాం" అని ఆజ్ఞాపించారు. గురువు ఆజ్ఞ మేరకు సాఠె వాడాకు వెళ్ళి కత్తిని తెచ్చాడు. దీక్షిత్ కత్తిని దృడంగా పట్టుకున్నాడు. దీక్షిత్ పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించి, పుట్టినది మొదలు అహింసా వ్రతాన్ని ఆచరించినవాడు. గురువు ఆజ్ఞా పాలనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. కాని గుండె దడదడ లాడింది. శరీరం చెమటలు పట్టింది. దీక్షిత్ ఒకచేతిలో పంచెను నడుముకు బిగించి, రెండవ చేతిలో కత్తిని పుచ్చుకొని చొక్కాను పైకి జరుపుకుంటూ మేక దగ్గరకు వచ్చాడు. మరలా బాబాను అడిగాడు "బాబా దీన్ని నరకమంటారా" దీక్షిత్ మేకను చంపాలని త్వరపడినా అతని హృదయంలో కరుణ వలన చేయి వెనుకకే కాని ముందుకు సాగటం లేదు. "ఇంకా చూస్తూన్నావేమి? చంపేసేయి" అని బాబా అన్నారు. అప్పుడు కాకా చేయి ఎత్తి కత్తిని కిందకు దించపోతున్నాడు. ఇంతలో బాబా "వద్దులేరా ఊరుకో! బ్రాహ్మణుడవై ఇంత కఠోరంగా హింస చేయడానికి సిద్దమయ్యావు నీ మనసుకు ఆలోచనే లేదా" అని అడిగారు.
             అప్పుడు దీక్షిత్ కత్తిని కిందపడేశారు. కాకా అప్పుడు "బాబా! మీ అమృత వచనాలు మాకు ధర్మశాసనం మేము రెండో ధర్మాన్ని ఎరుగం, మాకు సిగ్గు, లజ్జ లేవు, గురువచనా పాలనే మా కర్తవ్యం. ఇదే మాకు వేదం. అహింస మేమెరుగం. మమ్ము తరింప చేసేవి సద్గురుచరణాలు. ప్రాణాలు ఉండనీ, పోనీ మాకు గురువు ఆజ్ఞయే ప్రమాణం" అని ఎంతో చక్కగా వివరించాడు. తరువాత బాబా కాకాతో ఈ నీళ్ళ డబ్బా పట్టుకో నేను ఇప్పుడు హలాల్ చేసి సద్గతిని కలిగిస్తానని అన్నారు. అంతలో ఫకీర్ బాబా ఈ మేకను తకియాలో వధించటానికి అనుమతి తీసుకున్నాడు. దాన్ని బయటకు తీసుకు వెళ్ళగానే చనిపోయింది. మేక చావటం తధ్యం అని అందరకు తెలుసు కాని బాబా ఈ లీల చూపించటానికే ఇదంతా చేశారు.

             ఈ విషయంలో దీక్షిత్ పరిక్షలో నెగ్గారు. అందుకే బాబా దీక్షిత్‌ను ఎప్పుడూ పొగిడేవారు. ఆయనకు నిన్ను విమానంలో తీసుకుపోతా అని వాగ్దానం చేశారు. ఇటువంటి శిష్యుడే బ్రహ్మజ్ఞానానికి అర్హుడు. గురుసేవా తత్పరులు, గురువు ఆజ్ఞ యందు గౌరవం ఉన్నవారు తమ ఇష్టాయిష్టాలను, ఆలోచనలను గురువు శిరసుపై ఉంచుతారు. గురువు ఆజ్ఞను పాటించేవారు మంచి చెడులను, సారాసారాలను చూడరు. వారి చిత్తం సాయి నామస్మరణలో, దృష్టి సాయి సమర్దుని చరణాలలో ఉంటాయి. మనోవృత్తి సాయిధ్యాన ధారణల యందు ఉంటుంది. వారి శరీరం సాయి కొరకే. గురువు ఆజ్ఞను, ఆజ్ఞా పాలనను రెండింటిలో ఒక్క క్షణమైన ఆలస్యం సహింపరానిది. ఇది విలక్షణమైన విధానం.

             ఈ విధంగా దీక్షిత్ బాబా మాటే వేదవాక్కు లాగా పాటించటానికి వెనకాడలేదు. ఈ మహాభక్తుని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. గురువు మీద అపార నమ్మకం ఉండటం అంటే ఇదేనేమో. ఎవరైనా గురువు చెప్పిన మంచి పనులు చేస్తారు. కాని గురువుని పూర్తిగా నమ్మి తన జీవితాన్నే పణంగా పెట్టగలిగిన శిష్యులు ఎంత మంది ఉంటారు.

ఈ అధ్యాయంలో చివరగా హేమద్పంత్ గారు శిష్యులను మూడురకములుగా చెప్పారు. ఉత్తములైన శిష్యులు గురువులకేమి కావాలో వారు అడగకుండానే తెలుసుకుని నెరవేర్చేవారు. మధ్యములు గురువు అడిగితే మాత్రమే చేసే వారు. ఇక చివరగా అధములు గురువు చెప్పినా  కాని ఆ పనిని వాయిదా వేస్తూ తప్పులు చేసే వారని చెప్పారు. మనం ఉత్తమ భక్తులుగా బాబా చూపిన మార్గంలో పయనిద్దాము. 

ఓం శ్రీ సాయినాథార్పణమస్తు 







No comments:

Post a Comment