సాయి సద్గురు! మీరు ఆనందసాగరం. మీరు ఏ ఆకారంలేని నిరాకారం. మీరే శ్రుతులు చెప్పిన ఆత్మ
తత్త్వం. మిమ్ములను ప్రార్థిస్తే చాలు కలి కష్టాలన్నీ
నశిస్తాయి. మిమ్ములనే ఎల్లప్పుడూ ఈ మనసు ధ్యానిస్తూ ఉండాలి. అందుకే బాబాను ఇలా
ప్రార్ధించాలి. ఓ సాయి! మీ స్వరూప దర్శనం తప్ప మాకు ఏది రుచించదు. పరమ సుఖాన్ని
పొందటానికి శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ చరణాలు తప్ప మాకు వేరే గతి లేదు. అందుకే బాబా కూర్చునే విధానం సాయిభక్తులకు అనువుగా ఉంటుంది. వారు
కాళ్ళను ఒక దానిపై ఇంకొకటి వేసి కూర్చుంటారు. ఎడమ చేతి వేళ్ళు కుడిపాదంపై వేసి
ఉంటారు. కుడికాలి బొటనవేలిపై చూపుడు వ్రేలున్ను, మధ్య వ్రేలున్ను ఉంటాయి. ఈ
కూర్చున్న విధానాన్ని బట్టి బాబా మనకు ఇలా తెలియచేస్తున్నారు. "నా ప్రకాశం
చూడాలి అంటే అహంకారం విడిచి మిక్కిలి అణుకవతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు
మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశం చూడగలరు. ఇది భక్తికి
సులభమైన మార్గము".
బాబా తన భక్తులను ఎలా విషజంతువులనుంచి
కాపాడారో అనే విషయాలను ఈ అధ్యాయంలో హేమద్పంత్ గారు
పొందుపరిచారు.
బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంకు మామలతదారుగా
ఉండేవారు. అతను చితలీ గ్రామ పర్యటనకు వెళ్తూ బాబాను కలిసేందుకు షిర్డీ వస్తారు.
బాబా అతని యోగక్షేమాలు అడిగి "నీకు ద్వారకామాయి తెలియునా? నీవిప్పుడు
కూర్చున్నదే అది. ఎవరైతే ఆమె వొడిలో కూర్చొనెదరో వారిని ఆమె కష్టములనుండి
తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి.
వారిని ఆమె ఆపదలనుండి తప్పించును. అని చెప్తూ "నీకు ఆ పొడవాటి వ్యక్తి
తెలియునా? అదే సర్పము". అని అంటారు. బాబా తమ ఎడమ చేతిని మూసి కుడి చేతివద్దకు
తెచ్చి పాము పడగవలె నుంచి, అతడు మిక్కిలి భయంకరమైన వాడు కాని ద్వారకామాయి బిడ్డలను
అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుతుండగా పాము ఏమి చేయగలదు అనెను. తరువాత మిరీకర్ వెళ్ళబోతూ ఉంటె శ్యామాను కూడా వెళ్ళమని బాబా
చెప్తారు. కాని మిరీకర్ అనవసరంగా శ్యామాను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మొదట వద్దని
తరువాత ఇద్దరు కలిసి వెళ్తారు. వారు చితలీ వెళ్లి అక్కడ ఉన్న మారుతి ఆలయంలో బస
చేస్తారు. ఆయన వార్తాపత్రిక చేదువుతూ ఉంటె ఒక పాము ఆయన అంగ వస్త్రంపై జారుచు
కిందకు దిగి వెళ్ళిపోతుంది. కాని ఆయనకు ఎట్లాంటి హాని జరగదు. అప్పుడు మిరీకర్ బాబా
చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు. ఆయన కళ్ళు భక్తిభావంతో నిండిపోతాయి.
ఒక సారి బాపుసాహెబు బూటీ గారిని నానా డేంగ్లే అను జ్యోతిష్కుడు తనకు ఆ రోజు
అశుభము అని, ప్రాణ గండం ఉన్నది అని హెచ్చరిస్తాడు. తరువాత బాబా దగ్గరకు
వెళ్ళినప్పుడు బాబా ఇలా అంటారు. "ఈ నానా ఏమంటున్నాడు? నీకు మరణమున్నదని
చెప్తున్నాడా, ఏమి బయపడనక్కర్లేదు. మృత్యువు ఎట్లు చంపునో చూచెదము గాక! అని
చెప్పారు. ఆనాటి సాయంకాలం బాపుసాహెబు బూటీ మరుగు దొడ్డికి పోయెను. అప్పుడొక పామును
చూచెను. అతని నౌకరు దానిని చూసి ఒక రాయి ఎత్తి కొట్ట బోయెను. బూటీ గారు కర్ర
తెమ్మని చెప్తారు. ఇంతలో ఆ పాము అక్కడనుంచి అదృశ్యమవుతుంది. బూటీ గారికి అప్పుడు బాబా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
బాబా తన
భక్తులను రక్షించిన విధానాలు భక్తుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ
అనుభవాలగురించి ఎంత చెప్పుకున్నా తనివితీరదు. అలానే ఇంకొక భక్తుని బాబా ఎలా
రక్షించారో ఇప్పుడు చూద్దాము. అమీర్ శక్కర్ కమీషను వ్యాపారం చేస్తూ ఉండే వాడు.
ఆయనకు కీళ్ల వాతం ఉండేది. మిక్కిలి బాధ పడే వాడు. ఆయన షిర్డీకి వచ్చి బాబాను శరణు వేడుతాడు. అప్పుడు బాబా అతనిని చావడిలో ఉండమని చెప్తారు. అక్కడ చాలా
తేమగా ఉండి ఇంకా నెప్పులు ఎక్కువ అవ్వచ్చు కాని బాబా ఆదేశం కూడా ఔషధమే. బాబా కూడా
రోజుమార్చి రోజు అక్కడే ఉండే వారు. ఈ విధంగా బాబా దర్శన భాగ్యం కూడా కలిగింది.
పూర్తిగా తొమ్మిది మాసములు అక్కడ ఉండెను. తరువాత అతనికి విసుగు కలిగి ఒక రోజు
చెప్పకుండా కోపర్గామ్ పారిపోయెను. అక్కడ ఒక ఫకీరు చనిపోయే స్థితిలో ఉంటె ఆయనకు
మంచి నీళ్లు ఇస్తే అవి తాగి ఆ ఫకీర్ చనిపోతాడు. అక్కడ ఉంటె తన మూలానే చనిపోయాడని
తనని అనుమానిస్తారని మరల షిర్డీకి వెళ్తాడు. బాబా మాట వినకుండా వచ్చినందుకు తనకు ఈ
శాస్తి జరిగింది అని అనుకుంటాడు. మరల అక్కడ చావడిలోనే ఉండి తన కీళ్ల వాతం
పోగొట్టుకుంటాడు. ఒక రోజు మధ్య రాత్రి బాబా "అబ్దుల్ నా
పరుపువైపు ఎదో దుష్ట ప్రాణి వచ్చుచున్నది" అని అరిచెను. లాంతరు తీసుకొని
అబ్దుల్ వస్తే అక్కడ ఏమి ఉండదు కాని అమిర్ శక్కర్ దిండుకి సమీపంలో ఆ పాము
కనిపిస్తుంది. వెంటనే దానిని అక్కడ ఉన్న వారు చంపేస్తారు. ఇలా సకాలంలో హెచ్చరించి అమిర్ శక్కర్ను రక్షిస్తారు.
ఇంకా ఈ
అధ్యాయంలో చివరగా స్వయానా హేమద్పంత్ గారిని తేలునుంచి మరియు పాము నుంచి
రక్షిస్తారు. బాబా సర్వ
ప్రాణులపట్ల ప్రేమ భావంతో ఉండేవారు. విషజంతువులను కూడా కరుణించి దయ చూపాలి అని
బోధించేవారు. అందరిని రక్షించేవాడే దైవం.
ఓం శ్రీ
సాయినాథార్పణమస్తు !
No comments:
Post a Comment