ఈ అధ్యాయంలో దీక్షిత్ గారి గురించి చాలా విషయాలు చెప్పారు. అలానే వాసుదేవ స్వామి గారు బాబాకు కొబ్బరికాయ పంపడం మరియు బలరాం దురంధర్ గారి కుటుంబం గురించిన విషయాలు పొందుపరిచారు.
దీక్షిత్ గారి
పూర్తిపేరు హరి సీతారాం దీక్షిత్. ఆయనను బాబా ముద్దుగా కాకా అని పిలిచేవారు. ఆయన
1864వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్టంలో భాండ్వా అనే
తాలూకాలో జన్మించారు. ఆయన
నాగరి బ్రహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య ఖాండ్వాలో మరియు హింగన్
షూట్‌లలో జరిగింది. తరువాత ఆయన ఆల్పిస్టన్ కాలేజీ (బొంబాయి)లో చేరి, యల్.యల్.బి.
డిగ్రీని సంపాదించి ఒక లాయర్‌గా బయట పడ్తారు. అప్పటికి ఆయన వయస్సు 19 సంవత్సరాలు
మాత్రమే. ఆ తరువాత అవసరమైన పరిక్షలన్నింటిలో ఉత్తీర్ణుడై, 21వ సంవత్సరంలో లిటిల్
& కో అనే సంస్థలో పనిచేస్తారు. ఆ తరువాత తనంతట తనే ఒక సంస్థను పెట్టి చాలా
మంచిపేరు తెచ్చుకొని బాగా డబ్బు సంపాదిస్తారు. మంచి బంగళాలు కూడా కట్టిస్తారు.
ఇన్ని పనులలో తలమునకలైనా రోజూ ఆధ్యాత్మిక
గ్రంధాలను చదివేవారు.
ఆయన చాలా మంది
కేసులను తీసికొని బాగా పేరు తెచ్చుకున్నారు. వీటిలో ముఖ్యమైనవి బాల గంగాధర్ తిలక్
గారి కేసు, టైమ్స్ ఆఫ్ ఇండియా పూణా వైభవ్ వంటి ప్రాముఖ్యమైన వాటిల్లో విజయం
సాధించారు. ఆయనకు అటు బ్రిటిష్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ అధినేతలతో మంచిపేరు
వస్తుంది. ఆయన బొంబాయి కౌన్సిల్లోకి ఎన్నిక అయ్యారు. ఇది 1901వ సంవత్సరంలో
జరిగింది. 1904వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి సెక్రటరి అయ్యారు. ఆయనకు
బొంబాయి విశ్వవిద్యాలయంలో కూడా ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. ఇలా ఎన్నో అత్యున్నత
పదవులు ఆయనను అలంకరించినవి. ఇలా జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ఆయన జీవితం మలుపు
తిరగాల్సిన సమయం ఆసన్నమైంది.
1906వ సంవత్సరంలో
దీక్షిత్‌గారు లండన్ వెళ్ళడం జరిగింది. ఆయన అప్పుడే బయలుదేరిన రైలులో ఎక్కడానికి
ప్రయత్నించినప్పుడు ఆయన క్రింద పడి కాలుకు దెబ్బ తగులుతుంది. ఈ దెబ్బ ఆయన
జీవితాన్ని మార్చివేసింది. చాలా వైద్యాలు చేపించినా ఆయన సరిగ్గా నడవలేక పోయారు. ఈ
అవిటితనం ఆయనను చివరి దాకా వెన్నంటే ఉంది. ఇది
ఆయనను ఒక రకమైన మానసిక రుగ్మతకు గురిచేసింది. కొంచం దూరం నడిస్తే కాలులో నెప్పి వచ్చేది. బయటకు ఈ దెబ్బ ఆయన ప్రాపంచిక జీవితంలో ఒక లోపంగా కనిపించినా అధ్యాత్మిక జీవితానికి మాత్రం ఇది తొలిమెట్టు. ఆయనలో ఒక రకమైన మానసిక విశ్లేషణ ప్రారంభమయింది. దీంట్లో నుంచి వైరాగ్యం ఆవిర్భవించింది. ఇలా 1909వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆయనకు 45 ఏళ్ళు వచ్చాయి. అదే సమయంలో ఆయన దత్తమహారాజ్ లాంటి ఆధ్యాత్మిక గురువులను కలిశారు. ప్రాపంచిక విషయాలలో ఏమి సారం లేదని ఈ జీవితం యొక్క అర్ధం ఏమిటి అనే ఆలోచన కలిగింది.
ఆయనను ఒక రకమైన మానసిక రుగ్మతకు గురిచేసింది. కొంచం దూరం నడిస్తే కాలులో నెప్పి వచ్చేది. బయటకు ఈ దెబ్బ ఆయన ప్రాపంచిక జీవితంలో ఒక లోపంగా కనిపించినా అధ్యాత్మిక జీవితానికి మాత్రం ఇది తొలిమెట్టు. ఆయనలో ఒక రకమైన మానసిక విశ్లేషణ ప్రారంభమయింది. దీంట్లో నుంచి వైరాగ్యం ఆవిర్భవించింది. ఇలా 1909వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆయనకు 45 ఏళ్ళు వచ్చాయి. అదే సమయంలో ఆయన దత్తమహారాజ్ లాంటి ఆధ్యాత్మిక గురువులను కలిశారు. ప్రాపంచిక విషయాలలో ఏమి సారం లేదని ఈ జీవితం యొక్క అర్ధం ఏమిటి అనే ఆలోచన కలిగింది.
1909వ సంవత్సరంలో సెలవలకై తన బంగళాకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ
ఉన్న సమయంలో నానా సాహెబ్ చందోర్కర్‌ను కలుస్తారు. వీరిద్దరు కలసి చదువుకున్నారు.
నానా ప్రభుత్వ ఉద్యోగం తీసుకొని స్థిరపడతాడు. దీక్షిత్ మాత్రం లాయర్‌గా
స్థిరపడ్డాడు. ఆ తరువాత వాళ్ళు కలవడం ఇదే మొదటిసారి. వారు అనేక విషయాలు
మాట్లాడుకుంటూ చివరికి దీక్షిత్ కాలు దెబ్బ గురించి చెప్పుకుంటారు. అప్పుడు నానా
సాయి గురించి చెప్తారు. సాయి నీ కాలుని సరి చేస్తారు అని నానా అంటే అప్పుడు
దీక్షిత్ ఈ కాలు బాగుకావడం ముఖ్యం కాదు నా మనసు కుంటితనం పోవాలి. నాకు మోక్షం
కావాలి. నాకు గురు దర్శనం కావాలి. అల్ప
సుఖభోగాల కోసం కాదు, బ్రహ్మ జ్ఞానమే పరమ సుఖం. అంతకు మించిన సుఖం మరేమిలేదు. నేను ఎన్నెన్నో పూజలు చేశాను, భజనలు చేశాను, అలసి పోయాను. ఈ మనసు
మాత్రం నిశ్చలం కావడం లేదు. మనసును ఎంతగానో నిగ్రహిస్తున్నాను. అయినా అది
చలిస్తూనే ఉంటుంది. నా మనసు కుంటితనం నయం అవ్వాలి, అని దీనంగా చెప్తాడు.
1909వ
సంవత్సరంలోనే విధాన సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ప్రచార సందర్భంలో అతను అహ్మద్‌నగర్
వెళ్తారు. అక్కడ సర్ధార్ మీర్‌కర్ అనే స్నేహితుడు దగ్గర బస చేస్తారు. వారు గుర్రాల
ప్రదర్శనకు వెళ్తారు. అక్కడ దీక్షిత్ తను బాబాను కలవాలి అని అంటారు. మీర్‌కర్
కుమారుడు బాలా సాహెబ్ మీర్‌కర్ కూడా కోపర్‌గావ్ నుంచి అక్కడకు వస్తారు. అదే సమయంలో
తన అత్తగారికి బాగుండలేదని శ్యామా అహ్మద్‌నగర్ వస్తారు. ఈ విషయం తెలిసి మీర్‌కర్
శ్యామాకు కబురుపెడ్తారు. శ్యామాను చూడగానే
దీక్షిత్‌కు ఎక్కడా లేని ఉత్సాహం వచ్చి బాబాను చూసినంత అనుభూతి పొందుతారు. ఇంక
ఆయనలో ఆతృత పెరుగుతుంది. అక్కడ క్షణం కూడా ఉండాలని అనిపించలేదు. ఎప్పుడు బాబాను
కలుస్తాను అన్న భావనతో మనసు
నిండిపోయింది.
అంతలో ఒక విచిత్ర
సంఘటన జరిగింది. బాలా సాహెబ్ మీర్‌కర్ వారింట్లో ఉన్న బాబా చిత్రంపై నున్న తెరను
తొలగించాడు. అది మేఘా పూజించే సాయిపటం. దాని అద్దం పగిలితే బాగుచేయించేందుకు
అహ్మద్‌నగర్ తీసుకువస్తారు. బాబా దర్శనం కాగానే దీక్షిత్ ఆ పటం ముందు మోకరించాడు.
మనస్సులో ఏదో తెలియని అనుభూతి, ఈ పటాన్ని వీరిద్దరికి ఇచ్చి శిరిడి పంపాలని
నిశ్చయించారు. శ్యామా మరియు దీక్షిత్ ఆ రాత్రి 10 గంటలకు రైలులో శిరిడికి బయలు
దేరారు. రెండవ తరగతి కిక్కిరిసి ఉండటంతో ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. అంతలో దీక్షిత్ రైలు గార్డుని కలిసి మొదటి
తరగతిలో ప్రయాణం చేస్తారు. వారు కోపర్‌గావ్‌లో దిగగానే నానాసాహెబ్ చందోర్కర్
కలుస్తారు. ముగ్గురు టాంగా మాట్లాడుకొని శిరిడికి వస్తారు.
దీక్షిత్
ద్వారకామాయిలో అడుగుపెట్టగానే "రా లంగడా
కాకా" అని ఆహ్వానం
పలుకుతారు. దీక్షిత్ కళ్ళు చెమరుస్తాయి. ఆ తొలిదర్శనం దీక్షిత్ మనసులో చెరగని
ముద్ర వేస్తుంది. ఆయన కళ్ళు ఆర్పకుండా బాబాను అట్లానే చూస్తుండి పోతాడు. వెంటనే
బాబా పాదాలపై తన తలను ఉంచుతాడు. అప్పుడు బాబా ప్రేమతో "నీ కోసం ఎదురు
చూస్తున్నాను అందుకే శ్యామాను నీదగ్గరకు పంపించాను" అని చెప్పగా దీక్షిత్
హృదయం పులకరించిపోయింది. సాయి స్పర్శతో అపారమైన ఆనందాన్ని పొంది సాయి ప్రేమకు
ఆశ్చర్యపడ్డాడు. ఆ రోజు నవంబర్ 2,
1909వ సంవత్సరం దీక్షిత్‌కు మొదటిసారిగా పుణ్యపావనమైన సాయినాధుని దర్శనం
లభించింది, అని ఎంతో చక్కగా హేమద్‌పంత్ వర్ణించారు.
సాయి సేవ
చేయడానికి ఒక వాడాను షిర్డీలో నిర్మించి అనేక సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. జూలై నెల 1926 వ సంవత్సరం, దీక్షిత్, హేమద్‌పంత్, తెండుల్కర్ కూడా
ఉన్నారు. జూలై 4వ తేది 1926న దీక్షిత్ గజేంద్ర మోక్షము అనే భాగవత ఘట్టాన్ని
పారాయణం చేశారు. ఆరోజు రాత్రి బాబా కలలో కనిపించారు. ఆ కలలో హేమద్‌పంత్ బాబాను
కౌగిలించుకున్నట్లుగా కనిపించింది. ఆ తరువాత రోజు ఈ కల గురించి అందరికి చెప్పారు.
జూలై 5వ తేది 1926న దీక్షిత్ విల్లేపార్లే నుండి బొంబాయిలో నున్న డా|| దేశ్‌ముఖ్ వైద్యశాలకు బయలు దేరాడు. అక్కడ తన కుమారుడైన రామకృష్ణ అస్వస్థతతో
ఉన్నారు. ఆయనను చూసేందుకు
బయలు దేరాడు. ఆరోజు రైలు ఆలస్యంగా వచ్చింది. ఇంతలో హేమద్‌పంత్, తెండూల్కర్ కూడా
అక్కడకు వచ్చి
అందరూ రైల్లో ఎక్కారు. అప్పుడు దీక్షిత్ ఈ విధంగా అన్నారు. అన్నాసాహెబ్ చూడు సాయి ఎంత దయామయుడో ఈ రైలు ఆలస్యంగా వచ్చేట్లు చేశారు. ఇది ఆలస్యంగా రాబట్టి మనందరం కలుసుకోగలగాము. అలా వారు సాయి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కొంతసేపట్లో దీక్షిత్ ధ్యానంలోకి వెళ్ళినట్లుగా అనిపించింది. ఏమిటా అని పలకరిస్తే పలకలేదు. అప్పుడు అర్ధమైంది. ఆయనను బాబా విమానంలో తీసుకువెళ్ళారని. ఈ విధంగా ఏకాదశి రోజున జులై 5, 1926 న దీక్షిత్ తన శరీరం వదిలి వేశారు. బాబా ఆయనకు సద్గతి ప్రసాధించారు.
అందరూ రైల్లో ఎక్కారు. అప్పుడు దీక్షిత్ ఈ విధంగా అన్నారు. అన్నాసాహెబ్ చూడు సాయి ఎంత దయామయుడో ఈ రైలు ఆలస్యంగా వచ్చేట్లు చేశారు. ఇది ఆలస్యంగా రాబట్టి మనందరం కలుసుకోగలగాము. అలా వారు సాయి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కొంతసేపట్లో దీక్షిత్ ధ్యానంలోకి వెళ్ళినట్లుగా అనిపించింది. ఏమిటా అని పలకరిస్తే పలకలేదు. అప్పుడు అర్ధమైంది. ఆయనను బాబా విమానంలో తీసుకువెళ్ళారని. ఈ విధంగా ఏకాదశి రోజున జులై 5, 1926 న దీక్షిత్ తన శరీరం వదిలి వేశారు. బాబా ఆయనకు సద్గతి ప్రసాధించారు.
దీక్షిత్ యొక్క
జీవితం మనందరికి ఆదర్శం కావాలి ఆయన సంసార జీవితంలో ఉండి కూడా పరమార్ధాన్ని
సాధించగలిగారు. ఇది కేవలము సాయి సమర్దుల దయవలన మాత్రమే సాధ్యం. ప్రపంచంలో ఉండే
వస్తువులను ఇచ్చి గురువు ఋణం తీర్చుకోవడం కలలో కూడా సాధ్యం కాదు. ఆత్మను చూపించే
గురువు ఋణం తీర్చుకోవాలి అని అనుకోవడం అవివేకం. సద్గురువు శాశ్వతమైన సత్యవస్తువును
ప్రసాదించే దాత.
శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి
భక్తులను
ఉద్దరించడానికి సాయి ఆయా పాత్రలను స్వయంగా నటిస్తూ పరమార్ధాన్ని బోధిస్తారు. ఈ
విషయాన్ని తెలిపే ఒక చిన్న కథను ఇక్కడ చెప్పారు. ఆత్మ సాక్షాత్కారము పొందిన
వారందరు చైతన్యమే తాము అని అనుభవం పొందిన వారు. మరి వారు ఏ సంప్రదాయంలో ఉన్నా వారు
సోదరులే. ఒక సారి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రాజమండ్రిలో మకాం చేశారు.
నాందేడు నుంచి పుండలీకరావు అనే బాబా భక్తుడు
కలిసి ఆయనను సేవిస్తాడు.
మాటలలో తాను సాయి భక్తుడని తెలుసుకొని ఒక కొబ్బరి కాయను బాబాకు సమర్పించమని
పుండలీక రావుకు ఈ స్వామి ఇస్తారు. అప్పుడు తాను స్నేహితులతో కలిసి షిర్డీ ప్రయాణం
అవుతాడు. మార్గంలో ఆకలి వేసి తన మిత్రులతో కలిసి అటుకులు తింటూ
కొబ్బరి ఉంటె బాగుంటుంది అని వారి దగ్గర ఉన్న కాయను తింటారు. కొంత సమయం తరువాత
తాను చేసిన తప్పు అర్ధం అవుతుంది. బాబాకు నిజం తెలుసు. వారు అబద్దం చెప్పలేరు.
షిర్డీ వెళ్లిన తరువాత బాబా వారిని నా సోదరుడు ఇచ్చిన వస్తువు కావాలి అని
అడుగుతారు. నిజం చెప్పి క్షమించమని అడుగుతాడు పుండలీక రావు. బాబా అతనిని ఓదార్చి
ఇలా అంటారు. " ఆ విషయమై నీవే మాత్రము చింతింపనవసరం లేదు . అది నా సంకల్పం
వల్లనే నీకు ఇవ్వబడింది. దారిలో నీవు తినడం కూడా నా సంకల్పమే. నీవు కర్తవు అని అనుకోరాదు. నా భక్తులు తిన్న నేను తిన్నట్లే. అందుకే గర్వాహంకార
రహితుడవై ఉండుము" అని చక్కటి బోధ చేస్తారు.
బాలారాం దురంధర్
తరువాత బాలారాం
దురంధర్ అనే న్యాయవాది బాబా అనుగ్రహాన్ని ఎలా పొందారో చెప్పడం జరిగింది. ఆయన
బొంబాయిలో ఒక న్యాయవాద కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేస్తుంటారు. ఆయనకు ఇద్దరు
తమ్ముళ్లు ఉంటారు. వారందరు భక్తులు , పవిత్రులు మరియు సత్చింతన కలిగిన వారు.
బాలారాం చాలా ఆధ్యాత్మిక గ్రంధాలు చదివాడు. అతను పాండురంగని భక్తుడు. 1912 లో బాబా
పరిచయం ఏర్పడెను. అంతకు ముందు తన సోదరులు బాబా దర్శనం చేసుకుని చెపితే మరల అందరు
షిర్డీ వెళ్లాలని నిశ్చయిస్తారు. వారు అక్కడకు వెళ్లే రోజు బాబా అక్కడ ఉన్నవాళ్లతో
నా దర్బారు మనుషులు వస్తున్నారు అని చెప్తారు. వారితో 60 తరాల పరిచయం అని బాబా చెప్తారు. బాలారాం బాబా దర్శనంతో
మిక్కిలి ఆనందం పొందుతాడు. బాబా పాదాలను వత్తుతూ ఉంటె చిలుము తాను పీల్చి
బాలారాంకు ఇస్తారు బాబా. తనకు చిలుము పీల్చే అలవాటు లేదు ఆయినా బాబా ఇచ్చారు అని
పీలుస్తాడు. అంతే ఎప్పటినుంచో బాధపెడుతున్న ఉబ్బసం వ్యాధి తెరిపిస్తుంది. మరల బాబా
మహాసమాధి అయిన తరువాత ఒక రోజు
ఉబ్బసం వస్తుంది. బాలరాంకు పాండురంగని లాగా దర్శనం ఇస్తారు బాబా. దురంధర్ తరువాత
తుకారాం జీవితం గురించి మరాఠీలో ఒక పుస్తకం రాస్తారు. ఇలా ఆయనను ధన్యుడిని చేస్తారు బాబా.
హేమద్పంత్ గారు
ఇలా మనకు ఎన్నో బాబా లీలలను, ఆయన బోధలను మనకు శ్రీ సాయిసత్చరిత గా అందించి చివర
అధ్యాయంలో ఫలశృతిని చెప్తారు.
ఓం
శ్రీసాయినాథార్పణమస్తు!
No comments:
Post a Comment