In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, December 30, 2015

మాధవరావ్ దేశ్‌పాండే (శ్యామా) - 3


Play Audio


గ్రంథ సేకరణ
బాబా కొన్ని గ్రంథాలను శ్యామాకు ఇవ్వడం జరిగింది. చాలామంది భక్తులు బాబా ఆశీర్వాదం కోసం కొన్ని గ్రంథాలను తెచ్చేవారు. బాబా చాలా వరకు వారి గ్రంథాలు వారికి ఇచ్చేవారు. కొన్నిసార్లు ఒకరు తెచ్చిన గ్రంథాలు ఇంకొకరికి ఇచ్చేవారు. బాబా సర్వజ్ఞుడు. మనము ఏది, ఎప్పుడు చదవాలో ఆయనకు బాగా తెలుసు. అట్లా తెచ్చిన వాటిలో కొన్నింటిని శ్యామాకు ఇచ్చి, జాగ్రత్తగా భద్రపరచమని చెప్పేవారు. షిరిడి పవిత్ర క్షేత్రానికి దేశదేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ కలసి జ్ఞానయజ్ఞం చేస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు అవసరమవుతాయి. నేను నా ధామానికి వెళ్ళిపోయాక శ్యామా దీనిని తీసి చూపుతాడు. ఈ గ్రంథాలు నా ప్రతిరూపాలు అవుతాయి. పరమపావనమైన ఈ గ్రంథాలు షిర్డిలో కాని, ఇతర ప్రదేశాలలో కాని చదివితే బాబా గుర్తుకు వస్తారు. పుస్తకాల సంగ్రహణకు కారణం ఇదే అయి ఉంటుందని హేమద్‌పంత్ సాయిసచ్చరితలో రాస్తారు.

బాబా శ్యామాకు ఇచ్చిన గ్రంథాలు
·        విష్ణు సహస్రనామము
·        ఏకనాధ్ భాగవతం
·        వివేక సింధూ
·        పంచరత్న గీత
·        సంత్‌లీలామృతము
·        భక్త లీలామృతము
·        దశావతార స్తోత్రాలు
·        దశావతార చిత్రాలు

విష్ణు సహస్రనామం-రామదాసి సాధువు కథ
శ్యామాకు బాబాపై అపరిమితమైన భక్తి ఉన్నట్లే, బాబాకు కూడా శ్యామాపై అత్యంత ప్రేమ ఉండేది. ఒకసారి ఒక రామదాసి సాధువు మశీదులో ఉండి గ్రంథ పఠనం చేసేవాడు. ఆయన విష్ణు సహస్రనామం చక్కగా చదివేవాడు. ఆ తరువాత ఆధ్యాత్మ రామాయణం కూడా పారాయణం చేసేవాడు.

              బాబా తనకు కడుపులో నొప్పిగా ఉన్నదని, సోనాముఖి అనే మందు తెమ్మని అతన్ని పంపించి, ఆ విష్ణు సహస్రనామ పుస్తకం శ్యామాకు ఇస్తారు. శ్యామా అప్పుడు దేవా! ఆ రాందాసి ముక్కోపి నాకు ఈ పుస్తకం వద్దు. నాకు ఈ సంస్కృత పదాలు నోరుతిరగవు నన్ను దీంట్లో ఇరికించవద్దు అని అంటాడు. కాని బాబా ఆ పుస్తకం తీసుకోమని చెప్పి దాని విశిష్టత ఇలా చెప్తారు.

              "శ్యామా దీనిలో గొప్ప గుణాలు ఉన్నాయి. అందువల్లె దీనిని నీకు ఇస్తున్నాను, చదివిచూడు. ఒకసారి నాకు చాలా బాధ కలిగింది. గుండె దడ దడ లాడింది. ప్రాణం రెపరెప లాడింది. నేను బ్రతుకుతానన్న నమ్మకం పోయింది. ఆ సందర్భంలో ఈ పుస్తకం ఎంతగా ఉపయోగపడిందో నీకెలా చెప్పను? శ్యామా ఈ పుస్తకం వలననే ఈ
ప్రాణాలు రక్షించబడ్డాయి. ఒక్క క్షణం గుండెకు హత్తుకోగానే వెంటనే ప్రాణం కుదుట పడింది. దేవుడే నాలో ప్రవేశించి నా ప్రాణాలు కాపాడాడు అని అనిపించింది. దీనివలననే జీవుడు బతికాడు. అందువల్ల శ్యామా! నీవు దీనిని తీసుకొని వెళ్ళి మెల్లమెల్లగా చదువు. రోజూ ఒకటో అరో మాటలను నేర్చుకో. గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది" అని చెప్పారు.
              తరువాత రామదాసి సాధువు వచ్చి ఆణ్ణాచించినీకర్ ద్వారా జరిగిన సంగతి తెలుసుకొని శ్యామాపై విరుచుకుపడ్డాడు. నువ్వు ఒక పథకం ప్రకారం ఈ పుస్తకం కొట్టేశావు. నా పుస్తకం నాకు ఇవ్వకపోతే నీ ఎదుటే తలబద్ధలు కొట్టుకుని రక్తం చిందిస్తాను. మాధవరావు ఎన్నో విధాల నచ్చచెప్పినా రామదాసు శాంతించలేదు. అప్పుడు శ్యామా చాలా శాంతంగా "నేను కపటినని నాపై నిందవేయకు. వృధాగా నాకు దోషాన్ని అంటకట్టకు. ఆ పుస్తకం విశేషమేమిటీ? అది ఎక్కడా లభించదా? నీ పుస్తకాలకు రత్నాలు పొదిగారా, లేక బంగారం తొడిగారా? బాబాపైన కూడా నీకు విశ్వాసం లేదు. ఇది సిగ్గు పడవలసిన విషయం" అని అన్నాడు. 

అప్పుడు బాబా రామదాసి సాధువుని చూసి ఈ విధంగా అన్నారు. "రామదాసూ! ఇప్పుడు ఏం మునిగి పోయింది? అనవసరంగా ఎందుకు బాధ పడుతున్నావు. శ్యామా మన కుర్రవాడే కదా, నీవు ఊరికే ఎందుకు నరాలు తెంచుకుంటున్నావు? వృధాగా ఎందుకింత కష్టపడుతున్నావు? ప్రపంచానికి తమాషా చూపిస్తున్నావు. ఎందుకిలా కయ్యానికి కాలు దువ్వుతున్నావు. చక్కగా మంచిగా మాట్లాడు రామా? ఈ పుస్తకాలను నిరంతరం చదువుతావు, అయినా నీ అంతకరణం ఇంకా శుద్ధి కాలేదు. నీవు ఎటువంటి రామదాసువయ్యా? నీకు అన్నింటి యందు అనాసక్తి ఉండాలి. కాని నీకీ పుస్తకం పైనే వ్యామోహం పోలేదు. రామదాసుకు మమత ఉండరాదు. సమత ఉండాలి. ఆ పుస్తకాన్ని నేనే శ్యామాకు ఇచ్చాను. అదంతా నీకు కంఠస్థం కదా!"
              
రామదాసు బాబా చెప్పిన మాటలు విని కోపంగా బాగా ఎర్రబారిన ముఖంతో శ్యామాను ఉద్దేశించి ఇదిగో నీకిప్పుడే చెబుతున్నా దీనికి బదులుగా నువ్వు పంచరత్న గీతను ఇవ్వు అన్నాడు. తరువాత శ్యామాకు బాగా నిష్ఠ కుదిరి దీక్షిత్ మరియు నార్కెల సాయంతో మెల్లగా విష్ణుసహస్ర నామం నేర్చుకొని తరించాడు. ఇక్కడ బాబా విష్ణుసహస్రనామం యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా చెప్పారు.

              విష్ణుసహస్రనామాలను స్వహస్తాలతో శ్యామా కంఠానికి కట్టి అతని భవ, భయ, బాధలనుండి ముక్తుణ్ణి చెయ్యాలని ఆ పుస్తకం శ్యామాకు ఇవ్వడం జరిగింది. బాబా ఇంకా ఇలా చెప్పారు. అతనికి నామంపై ప్రీతి కలిగిస్తాను. నామం పాపాలనే పర్వతాలను పగలగొట్టుతుంది. నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది. నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరికివేస్తుంది. నామం కాలుని మెడను విరిచేస్తుంది. నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది.

శ్యామాకు ఇటువంటి సహస్రనామం మధురమవ్వాలి. ప్రయత్న పూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది. అప్రయత్నంగా నామ జపం చేసినా చెడుకలగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించినా నామ ప్రభావం ప్రకటమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్ధాన్ని పోషిస్తుంది. నామ జపానికి స్నానం చేయాల్సిన పనిలేదు. అట్లే నామానికి విధి విధానాలేవి లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు ప్రక్షాలన మవుతాయి. మెల్లమెల్లగా లోలోపల నా నామాన్ని జపించే వారు ఉత్తమ గుణ సంపన్నులకంటే ఉత్తములు.

సాయి బంధువులారా! మరి మనమందరమూ సాయి నామం తోనే తరించవచ్చు. సాయి మనలను సరయిన మార్గంలో నడిపిస్తారు. 

బాబా మహాసమాధి తర్వాత శ్యామా జీవితం
బాబా మహా సమాధి అనంతరం శ్యామా ధీక్షిత్ వాడాలో ఉన్నారు. అప్పట్లో ధీక్షిత్ మరియు బూటి ఈ వ్యవహారాలు చూసేందుకు జీతం కూడా ఇచ్చేవారు. శ్యామా అక్కడే ఉండి వచ్చే యాత్రికులకు వీలైనంత సహాయం చేస్తుండేవాడు. తనకు బాబా ఇచ్చిన ఊధిని రెండు కుండల్లో జాగ్రత్తగా భద్రపరచి, వచ్చిన వారికి ఇస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఈ ఊధి బాబా స్వయానా శ్యామాకు ఇచ్చింది.  

  కొన్ని రోజుల తర్వాత సాయి సంస్థాన్ ఏర్పడడం జరిగింది. ఆ సంస్థాన్‌లోని సభ్యులకు శ్యామాకు కొన్ని విషయాల్లో అవగాహన కుదరక, శ్యామాను వాళ్ళు ధీక్షిత్ వాడా నుంచి పంపించవలసి వచ్చింది. అప్పుడు శ్యామా బాబా పాదుకలను మరికొన్ని వస్తువులను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. సంస్థాన్ వారు ఆ వస్తువులను అడిగినా శ్యామా  ఇచ్చేందుకు ఇష్టపడలేదు. తరువాత  ధుమాలు మొదలైన వారు, ఒక ఊరేగింపుగా భజన్లు చేస్తూ శ్యామా ఇంటికి వెళ్ళి ఆ వస్తువులను అడిగి తీసికొని వచ్చారు. ఆ తరువాత ఆ పాదుకలను ద్వారకామాయిలో భక్తుల దర్శనార్ధం ఉంచడం జరిగింది.

              శ్యామా తరువాత తన ఇంటిలోనే ఉంటూ, వచ్చిన భక్తులకు బాబా విషయాలను వివరిస్తూ బాబాను సేవిస్తూ గడిపాడు. 1940  ఏప్రియల్  నెలలో తన జీవితం చాలించారు.

ఓం శ్రీ సాయి రామ్!  

Shyama - 3

Collection of Sacred books:
Baba gave some books to Shyama to save them for the future. Some of the devotees wanted to bring their books so that Baba can bless them. Sometimes Baba did not give the same book that they wanted. He gave some other book to their surprise. He knows what we need and when we should read a particular book. This way he gave few books to Shyama. He predicted that lots of people will come to Shirdi and they will do Jnaana Yagna (Recitation of sacred books). Then all these books will become handy. If we study these scriptures with devotion our minds will automatically think about Baba.

Books given to Shyama by Baba:
These are some of the books given to Shyama by Baba.
 Eknath Bhagavath, Vishnu Sahasranama, Viveka Sindhu, Santh Leelamrut, Bhakta Leelamrut, Pancha Ratna gita, Dasavatara Sthotras and Dasavatara pictures.

Vishnu Sahasranama – Ramadasi Sadhu Story:
Just as Shyama was an ardent devotee, so was Baba’s love for him. A desire, therefore, arose in Baba to put him to some regular practice for his spiritual progress.

The story from Satcharita goes as follows;

One day, in the masjid, there was a Ramdasi Bua. It was his regular practice to read the Ramayana. Early morning, after doing his ablutions, taking his bath and doing the Sandhya after applying the sacred ashes and wearing ochre robes, he sat at a fixed place to read.
He read the Vishnusahasranama and Adhyatma Ramayan6, thereafter. He read these books often and often. Madhavrao’s services had borne fruit. It was time now to put him into some regular practice and give him some prasad of the path of devotion, so that he would get relief in the worldly life. When Baba thought like this, he called the Ramdasi near him and said: “I have a shooting pain in my stomach. It is as if the intestines are tearing apart. Go, this pain in the stomach is not abating. Quickly bring some senna pods. Unless I take some small quantity, this vexing ache will not stop.”

After he left the Masjid, Baba took Vishnusahasranama book and gave it to Madhavrao (Shyama). Baba then said: “Shyama, you know this pothi. See it is very beneficial. Therefore, I am giving it to you. You should read it. Once I suffered intensely. My heart began to palpitate. I was restless and I had no hope for myself. Shyama what can I tell you of that experience? How that book proved useful! This life was saved by it. I hugged it to my heart for a while and immediately felt relief. It seemed as if Allah himself had come down and this life was saved by it. Therefore Shyama take it with you. Read it gradually. Every day, take one or two words. It will give you great joy.” Shama said: “I do not want it. The Ramdasi will be furious with me and he will say that I have behind his back, done this wrong. As it is, he is half-crazy, irascible, ill-tempered and ever complaining. Why, unnecessarily, pick up this quarrel with him? I do not want this annoyance. Besides, the pothi is in Sanskrit. My speech is crude and rustic. My tongue cannot twist round these joined words. I cannot pronounce them clearly”. Seeing all Baba’s actions, Shyama thought that Baba wanted to set him up against the Ramdasi but he had no idea of Baba’s heart-felt concern for him.

That Ramadasi returned soon bringing the senna-pods medicine. And found out what happened. The Ramdasi was, as it is, ill-tempered. Moreover, he had suspicions about Madhavrao. He said: “He made Baba the intermediary to snatch away my book”. He launched a vicious verbal attack on Madhavrao. His violent anger was uncontrollable and he showered a lot of abusive language on him. “The stomach ache was just a pretext. It was you who instigated Baba. You had an eye on my book. I will not tolerate it. I am a fearless Ramdasi, as my name itself suggests. If you do not return the book without creating any problems, I will dash my head in front of you and scatter my blood profusely. You coveted my book, planned out this insidious drama, and putting the whole blame on Baba, kept yourself aloof”. Madhavrao tried his best to make him understand but the Ramdasi would not be pacified.

Then listen to what Madhavrao said very calmly. “Do not falsely accuse me of being deceitful. Why are you fussing so much about that book of yours? It is not a rarity. Is your book decorated with gold and studded with gems? If you don’t have faith in Baba, despicable is your existence”.

Seeing the Ramdasi’s insistence, Baba very sweetly said to him: “Oh, Ramdasi, what is the problem? Why are you unnecessarily distressed?

Is not Shyama our lad? Why do you quarrel loudly and vehemently, for no reason creating a scene? Why are you always ready to fight? Can you not speak soft and sweet words? Though you read these books regularly, your mind is still impure.

Every day you read the Adhyatma Ramayan and recite the Sahasranama. Yet you have not discarded your passions which are uncontrolled. And you call yourself a Ramdasi! What kind of a Ramdasi are you? You should be absolutely detached; but you are not able to overcome your intense desire to possess the book. What name can be given for this behavior? A true Ramdasi should have no attachment but look at the young and old with equality. You are harboring enmity for this boy and coming to blows for this book! Go and sit in your place. Books can be had in plenty for money but not men, till the end of time. Remember this well. Shyama has no knowledge about the worth of your book. I picked it up, on my own and gave it to him myself. You know the book by heart. I thought of giving it to Shyama who will read it, repeatedly recite it and obtain the utmost benefit”.

Ramdasi realized the situation. Yet he said to Madhavrao with anger: “Instead of this book, I will take Panch-ratni Gita from you. I am telling you clearly now”. Madhavrao was pleased that the Ramdasi was pacified. “Why one, I will give you ten copies of the Gita,        instead.” Be it so. The dispute was thus resolved. The Gita was accepted as security.

But why did a man unacquainted with the deity in the Gita demand it?
One who constantly read the Adhyatma Ramayan in front of Sai, why should that Ramdasi be rude to Baba and quarrel right in front of him?

Later on, Shyama’s faith was developed. Dixit and Narke taught him to pronounce the words correctly, by repeating and conning them over and over again and to know their meanings. He learnt the book by heart.


Here Baba gave us an important lesson and told us about the greatness of Vishnu Sahasranama.  

Baba said that he will tie the necklace of this Vishnusahasranama around Shyama’s neck to free him from the miseries of the worldly existence by giving him a fondness for reciting it.

God’s Name can break down mountains of sin.

The Lord’s Name breaks the shackles of the body.

God’s Name pulls out millions of ill desires from their roots.

God’s Name humbles the pride of death and ends the cycle of birth and death.

The Lord’s Name chanted with full intent is very effective but even an unintentional pronouncement can be beneficial. Its power is manifested even when it is uttered unawares.

For the purification of the Inner Self there is not another simpler means than chanting the Lord’s Name.

The Lord’s Name is the adornment of the tongue.

The Lord’s Name sustains spirituality.

It is not necessary to have a bath to say the Lord’s Name.

Taking the Lord’s Name is not regulated by the rules of the Shastras (Scriptures).

The Lord’s Name destroys all sins.

The Lord’s Name is always pure.

The continuous chanting of My Name itself will ferry you across the ocean of existence. No other means are necessary to achieve salvation.

Whoever frequently repeats My Name, his sins will be burnt. I consider him more virtuous than the virtuous, whoever constantly hums my name’.

  
Shyama’s Life after Baba’s Mahasamadhi:

After Baba's Mahasamadhi, Shyama was asked to manage the Dixit wada. He was looking after the welfare of the devotees and resided in Dixit wada itself. After the formation of Sai Sansthan Committee, the Committee demanded agreement from him for his residence in Dixit wada. Shyama first refused. But later, Shri S. B. Dhumal and Shri B. V. Dec intervened and Madhava Rao gave the agreement.

After some days, the committee had vacated Shyama from his residence in Dixit Wada. Whne he was leaving, he took Baba's silver Padukas, Baba's Photos etc. to his house from Dixit wada. After knowing this, the Committee asked Madhava Rao to hand over the above articles of Baba to the Sansthan. He refused to give it to them. He told them that Baba gave it to him with love and he cannot return them. But Shri S. B, Dhumal went to his house with a big procession of bhajan, band etc. On seeing this procession Madhava Rao handed over all the above articles of Baba to Shri S. B. Dhumal. These Baba's Padukas were placed before Baba's Photo in Dwarakamayee wherein millions of devotees are taking darshan these Padu­kas. In a similar way other articles were also preserved.

Shyama then lived in his home and used to worship Baba. He shared his experiences with visitors. He also had some udi which was given to him directly by Baba. He used to give it to people and helped them in difficulties. He lived in Shirdi until he died in April of 1940.   


OM SAI RAM!

Wednesday, December 23, 2015

మాధవరావ్ దేశ్‌పాండే (శ్యామా) - 2



Play Audio


బాబాపై నమ్మకం
మాధవరావ్ చాలా సంవత్సరాలు బాబాను చూస్తూ ఉన్నా ఆయన్ని పూర్తిగా నమ్మటం జరగలేదు. సాయిదగ్గరలో ఉన్నా, బాబాను ఒక ఫకీరులాగ భావించాడు తప్ప గురువుగా చూడలేదు. కాని ఆయన పరమ విష్ణు భక్తుడు రోజు పూజచేసుకోవడం అందరికి సహాయ పడటం, పిల్లలకు పాఠాలు చెప్పడం ఆయన రోజు వారి కార్యక్రమం. ఇలా దాదాపు 16 సంవత్సరాలు గడిచిపోయాయి. శ్యామాకు దాదాపు 31 సంవత్సరాలు వచ్చాయి. శ్యామాకు సాయి ఎవరు అన్న విషయం తెలియదు. కాని కొన్ని సంఘటనల తరువాత సాయి యొక్క గొప్పతనం తెలుసుకున్నాడు.

              చిదంబర కేశవ్‌గాడ్గిల్ అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ దగ్గర పనిచేసే  కార్యదర్శి. తను ఒక మహాత్ముడు చెప్పగా షిర్డిలో ఉన్న సిద్ధ పురుషుడ్ని కలవాలి అని వచ్చారు. అప్పుడు వారు శ్యామాను కలవడం జరిగింది. మాఊరిలో అటువంటి సిద్ధపురుషుడు ఎవరు లేరు ఒక ఫకీరు మాత్రమే ఉన్నాడు అని వాళ్ళకు శ్యామా చెప్పాడు. గాడ్గిల్ కొంత అవిశ్వాసంతో బాబాను చూడడం జరిగింది. అప్పుడు బాబా నేను సిద్ధపురుషుడను కాను నేను ఒక పిచ్చి ముస్లిం ఫకీరును. మీరు ఆ భీమశంకర ఆలయంలో ఉన్న మహాత్ముడినే సేవించండి. అదే మీకు మంచిది, వెళ్ళండి అని అరవడంతో సాయి యొక్క గొప్పతనం గాడ్గిల్‌కు అర్ధం అయింది.

              తరువాత 1885 లో ఆనంద స్వామి అనే గురువుని దర్శించటానికి శ్యామా, నందురాం మార్వాడిలో కలసి వెళ్ళాడు. వాళ్ళు షిర్డి నుంచి వచ్చారని తెలిసి ఆనంద స్వామి బాబాని చూడాలని వాళ్ళతో కలిసి వచ్చారు. ఆయన బాబా ఎంతటి పరమ గురువో అని పొగడటం జరిగింది. దేవిదాసు, జానకి దాసు సాయితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఇవన్ని చూసి శ్యామాకు బాబాపై కొద్దిగా నమ్మకం కుదిరింది.

              ఒకసారి ఒక భక్తుడు బాబాకు రెండు రూపాయిల దక్షిణ పంపించడం జరిగింది. బాబా అప్పుడు అక్కడ లేకపోవడంతో శ్యామా సంతకం చేసి ఆ డబ్బులు తీసుకున్నాడు. బాబాని పరిక్షీద్దామని ఆ డబ్బులను మశీదులో ఒక చోట పాతిపెట్టాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్యామా ఇంటిలో దొంగలు పడి 200 రూపాయల వస్తువులు పోతాయి. అప్పుడు శ్యామా బాబా దగ్గరకు వెళ్ళి డబ్బులు పోయిన సంగతిచెప్తాడు. అప్పుడు బాబా "నీకు చెప్పుకోవడానికి నేను ఉన్నాను, నా రెండు రూపాయలు పోయి ఆరు నెలలు అయింది, నేనవరితో చెప్పుకోవాలి" అని బాబా అనడంతో, శ్యామా బాబా యొక్క సర్వజ్ఞత్వం అర్ధం చేసుకున్నాడు. అప్పటి నుంచి తను దేహం చాలించినంత వరకు బాబాపై నమ్మకం చెక్కుచెదరలేదు. మనం ఇక్కడ నేర్చుకోవలసినది చాలా ఉంది. మనము ఒకసారి గురువును నమ్మితే ఆ నమ్మకం ఎప్పటికి పోకూడదు. ఎట్టి పరిస్థితులలో అది సడలకూడదు.

బాబా మాధవరావ్‌ని శ్యామా అనిపిలవడం
బాబా మాధవరావ్‌తో 72 జన్మల సంబంధం ఉందని చెప్పడం, శ్యామ అని పిలవడం, ఆయనను బాబా ప్రతినిధిగా చెప్పడం చూస్తే, శ్యామా ఎంతటి పుణ్యాత్ముడో అర్ధం అవుతుంది. శివుడ్ని చేరుకోవాలంటే నందీశ్వరుని యొక్క అనుగ్రహం ఎట్లా కావాలో, అట్లే బాబాతో ఏదైనా విన్నవించుకోవాలి అంటే శ్యామా ద్వారా వెళ్తే పని జరిగేది. బాబా మాధవరావ్‌ని శ్యామా అని ఎందుకు పిలిచారో అనే విషయం బాబాకే తెలియాలి. శ్యామా అంటె చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. యమునానదిని శ్యామా అని పిలుస్తారు. మన శ్రీ కృష్ణుడిని శ్యామా అనిపిలుస్తాము. అశ్వమేధ యజ్ఞంలో వాడే అశ్వం పేరు శ్యామకర్ణ అని పిలుస్తారు. మహల్సాపతి మనవడు మనోహర్‌మార్తాండ్ శ్రీ రమణానంద మహర్షిగారికి ఈ విధంగా చెప్పాడు. బాబా పాఠశాలను శాల అనేవారు. మాధవరావు మాష్టారు కావడం వలన మాష్టారులో మొదటి అక్షరం మా, శాలలో శా తీసుకుని శ్యామా అని పిలవడం జరిగింది అని చెప్పారు.

              శ్యామా ఒకసారి బాబాపై నమ్మకం కుదిరిన తరువాత సాయికి పరమ భక్తుడు అయ్యాడు. ఇక వెనుదిరిగి చూడలేదు. ప్రతి పని బాబా అనుమతి లేకుండా చేసేవాడు కాదు. బాబా అంటే ప్రాణం తన సర్వస్వంగా బావించాడు. అందుకే బాబా కూడా శ్యామాతో ఎంతో చనువుగా ఉండేవారు. ఎవ్వరు అడగలేని కొన్ని ప్రశ్నలు శ్యామా ద్వారా మనకు లభించినవి. అటువంటి ప్రత్యేక సంఘటనలను పరిశీలిద్దాము.

బాబా మూడురోజుల సమాధి రహస్యం
సాయి 72 గంటల సమాధి అనంతరం భక్తులందరు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు. కాని ఎవ్వరు బాబాను దానికి సంభందించిన విషయాలు అడగలేక పోయారు. అప్పుడు శ్యామా పరుగున వచ్చి దేవా మీరు ఎక్కడకు వెళ్ళారు?  ఏంచేసారు?  అని ప్రశ్నల వర్షం కురిపించాడు. అప్పుడు బాబా ఇట్లా చెప్పారు.

  అల్లా దగ్గరకు వెళ్ళాను, నేను తిరిగి రాదలుచుకోలేదు. అయితే అల్లా గదాదరుడ్ని ముందు తనలో కలుపుకున్నారు. అతని పూర్వ పుణ్యఫలం అవతారకార్యం నీవు తీసుకొనుము అని నన్ను పంపించడం జరిగింది.

              ఈ గదాదరుడే రామకృష్ణ పరమహంస. ఆయన రాత్రి గం.1.02 నిమిషాలకు మహాసమాధి అయితే అదే రాత్రి బాబా 3 గంటలకు బాబా మూడు రోజుల తరువాత సమాధి నుండి బయటకు రావడం జరిగింది.
1886వ సంవత్సరం తరువాత బాబా లీలలు నలుదిశలా వ్యాపించి చాలా మంది భక్తులు ఆయన కృపకు పాత్రులయ్యారు.

త్రిమూర్తుల దర్శనం
ఒకరోజు శ్యామా బాబాను వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకం అనేవి నిజమా? అని ప్రశ్నించారు.  అప్పుడు బాబా ఏమి సమాధానం ఇవ్వకుండా శ్యామాను తనదగ్గరకు రమ్మని పిలిచారు. బాబా శ్యామా తలపై చేయిపెట్టారు. సాయి, శ్యామాకు బ్రహ్మలోకం చూపించారు. శ్యామా బ్రహ్మదేవుని రత్నఖచిత సింహాసనం, వారి కొలువును దర్శించడం జరిగింది. ఆ సత్యలోక దర్శనం వర్ణించటానికి  వీలుకానిదీ అని అని తర్వాత శ్యామా చెప్పడం జరిగింది. అట్లానే విష్ణులోకం మరియు కైలాసం కూడా చూపించడం జరిగింది. శ్యామాకు ఈ సుందర దృశ్యాలు చూసి ఆనందంతో పాటు భయం కూడా కలిగింది. ఈ విశ్వరూప దర్శనంతో శ్యామా బాబా ముందు అర్జునుడు లాగా భయపడుతూ కూర్చున్నాడు. ఆ సాయికృష్ణుడు తన అభయ హస్తంతో శ్యామాను సంయమన  పరిచి ఈ విధంగా చెప్పారు. "శ్యామా ఈ లోకాలన్ని మనకి కాదు, మన లక్ష్యం వేరు ఆ లక్ష్యం వైపే మన దృష్టి ఉండాలి".

              ఇక్కడ బాబా ఆత్మసాక్షాత్కారం గురించి చెప్పడం జరిగింది. మానవుడు ఎప్పుడూ ఈ లక్ష్యాన్ని మరచిపోకూడదు. ఈ లక్ష్యం మనం మరచినప్పుడు, మన ఆత్మహత్య చేసుకున్నట్లే అని మన శాస్త్రాలు చెప్పాయి. ఇక్కడ కూడా మనలను బాబా సరియైన దారిలో నడిపించడానికే ప్రయత్నించారు.     

రామాయణంలో వారధి (సేతువు)

శ్యామా ఒకసారి బాబాను ఈ విధంగా అడిగారు.
దేవా! రాముడు లంకకు వెళ్ళడానికి వారధి నిర్మించారు కదా. దాన్ని ఒక కోటి వానరాలు నిర్మించినట్లు చెప్తారు. ఇదంతా నిజమేనా!
అప్పుడు బాబా, శ్యామా అదంతా నిజమే, సముద్రం నిజం, రాముడు నిజంగా అక్కడ ఉన్నాడు.
శ్యామా!  దేవా! అన్ని వానరాలు ఎక్కడ కూర్చున్నాయి అక్కడ అంత ప్రదేశం ఉందా!
బాబా:  ఆ కోతులన్ని కొమ్మలమీద, చెట్ల మీద, ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కూర్చున్నాయి. అవన్ని చీమల్లాగా కనిపించినవి.
శ్యామా: బాబా నీవు నిజంగా ఇవన్ని చూశావా!
బాబా: స్వయానా నా కళ్ళతో నేను చూశాను శ్యామా!
శ్యామా: బాబా నిన్ను మొదట చూసినప్పుడు నీకు సరిగ్గా మీసం కూడా రాలేదు, మరి నీవు ఇవన్ని ఎట్లా చూశావు.
బాబా: శ్యామా మనిద్దరం చాలా జన్మల నుండి కలసి ఉన్నాము. నాకు అవి గుర్తు ఉన్నాయి. నీకు అవి గుర్తులేవు.
శ్యామా: నీకు అప్పుడు ఎన్ని సంవత్సారాలు దేవా!
బాబా: "నువ్వు ఎట్లా నన్ను చూస్తున్నావో అట్లానే అప్పుడు ఉన్నాను"
శ్యామా: దేవా ఇది నిజంగా సత్యమేనా!
బాబా: శ్యామా నేనెప్పుడైన ద్వారాకామాయిలో అబద్ధం చెప్పానా! అంతా నిజమే!
ఈ విధంగా శ్యామా ద్వారా మనకు బాబా నుంచి మంచి విషయాలు తెలియడం మన అదృష్టం.

నిద్రలో బాబా జపం
కపర్డె గారు శ్యామా నిద్ర గురించి ఈ విధంగా రాశారు. అది డిశంబరు 8, 1911 వ సంవత్సరం. ఆరోజు కార్యక్రమాలన్ని పూర్తి అయిన తర్వాత దీక్షిత్ వాడా వరండాలో కూర్చున్నారు. బొంబాయి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు చక్కగా భజన్లు పాడారు. భీష్మ కూడా ఒకటి రెండు భజనలు పాడారు. మాధవరావ్ ఆరోజు అక్కడే పడుకున్నాడు. నేను కళ్ళారా చూసి నా చెవులతో విని ఆశ్చర్యపోయాను. ప్రతిసారి ఆయన గాలి తీసుకుని వదిలేటప్పుడు చక్కగా ఈ శబ్దం వినిపిస్తోంది.

              "ఆ సాయినాధ్ మహారాజ్ సాయినాద్ బాబా" ఇటువంటి అద్భుతమైన సంఘటన చూడడం ఆయన అదృష్టంగా భావించారు. శ్యామా గాఢ నిద్రలో కూడా బాబా నామం ఆయన గురకలో పలకడం ఎంతటి భాగ్యము.

ఓం శ్రీ సాయి రామ్!

Shyama - 2

Faith in Baba:
Madhavrao was observing Sai for several years but never had faith. He used to go to him to smoke Chilim (Cigar) and thought that he is a mad Fakir. He was unable to recognize greatness of Sai. He used to worship his God Vishnu every day. His routine was doing worship in the morning, teaching kids at school and helping others in need. He was living a pious life. While Baba was there he almost did not recognize Baba for16 years. When he was 31 years of age, few incidents made him realize this fact.

Chidambara keshav Gadgil of Ahamadnagar District came to Shirdi. He was a secretary to the District Collector. He was told by a Guru from his place that there is a great Guru in Shirdi and to have his blessings. Then he approached Shyama. Shyama told him that we do not have any such great person.  But we have a mad Fakir living in a masjid. Gadgil went to see Baba with some questions in his mind. Baba told him that he is a Mad Fakir and he should not see him. He should go and worship the guru in Bhimashankar Temple. Then Gadgil realized how Sai was and he knew everything they talked about.

Another time, Shyama and Naduram Marwadi went to meet a swami by name Ananda Swami in a nearby place. After the meeting, Swami realized that they are from Shirdi and he wanted to come with them to meet Baba. He praised Baba as the Greatest Guru. 

In a similar way, Gangaghir Baba who is adored by Shirdi village, praised Baba as a Jewel. Devidas and Janakidas always enjoyed the company of Sai. After all these incidents, Shyama started seeing Sai as person with some powers. What changed him was another incident where a devotee of Sai sent a Money order of 2 rupees. But Sai was not there to take the money, Shyama signs for this and wanted to test Baba. So he hid 2 rupees in a secret place in the Masjid. Shyama had a break in and lost about 200 rupees worth of objects. Then he goes to Baba and complains that he lost all this. Then Baba says, “You have at least me to complain about your stolen stuff, but who should I report about my 2 rupees which was stolen 6 months ago”. Then Shyama realized that Baba knows everything. He never again doubted Baba again in his entire life. There is so much to learn from Shyama’s devotion to Baba and how we need to trust Baba in every situation.

Baba calling Madhavrao “Shyama”:
 Baba called Madhavrao “Shyama” and he told him at one point that their relationship is of 72 lives. Baba made Shyama as his representative and used to love him so much. Their relationship was like Lord Shiva and Nandi. To reach Shiva you have to go through Nandi first. In a similar way, people used to request Shyama first and then were able to see Baba. 

Why Baba called him Shyama? Baba should only know the answer. Shyama means Lord Krishna. Sacred River Yamuna is called as Shyama. In Ashwamedha Yagna, the horse is named as Shyamakarna. Sri Ramanananda Maharshi interviewed Manohar Marthand (Grandson of Mhalsapati) and he told him about Shyama’s name. Baba used to call the school as Sala and Madhavrao worked as a master in school. So Baba combined the first letters of Sala and Master as Sama (Shyama). Only Baba will know the real reason why he called him Shyama. Baba used to call him as “Maza Shamya” (“My Shamya” in Marathi) with great affection. At other times He would call him just Shyama



Once Shyama had faith in Baba, he never looked back and became a staunch devotee of Baba. In every walk of life, he asked Baba for direction and never wanted to do anything without Sai’s permission. He served Baba as his God and Baba was everything for him. That’s why Baba was very close to Shyama. Shyama always felt comfortable asking some difficult questions. Now Let us look at those circumstances.

Baba’s comments about 72 hours Samadhi:
When Baba came back following 3 days of Samadhi, people rejoiced and celebrated. But Shyama was different and he asked Baba several questions. He asked Baba “Deva! Where did you go? What did you do?

Then Baba replied “I went to Allah and I did not want to come back. But Gadadhar from Bengal wanted to merge in God first. Allah asked me to take all his past good deeds and his cause. So I have to come back to follow this”.

This incident happened in 1886 and Baba comes back at 3 AM and the same night Rama Krishna Parama Hamsa leaves his body at 1.02 AM. After this incident, Baba’s miracles extended beyond Shirdi and other states. So many devotees experienced Baba’s grace.

Shyama experiencing the 3 divine worlds:
One day Shyama was sitting with Baba and asked him whether Brahma, Vishnu and Shiva’s worlds are real. Baba told him to come near him and places his hand over his head. Then Shyama could see Brahma Lok and most beautiful diamond studded throne on which Lord Brahma was sitting along with his ministers. He was holding his court. Baba told him Shyama this is Satya Lok. Then baba showed him Vaikunta and Kailasa also. Shyama was overwhelmed by seeing all these divine worlds at once. He was like Arjuna after seeing Viswarupa of Krishna. So Shyama was very blessed by our Sai Krishna. After showing the three divine worlds, Sai again emphasized “Shyama all this is not for us, our goal is quiet unusual.”

Baba was reminding us that our goal is self-realization and we should never forget this goal. The scriptures say that who ever forgets this goal, it’s like they committed suicide.

Baba’s explanation of Bridge in Ramayana:

Sai Baba replied, "Yes this is true. The sea is real and Lord Rama was really there."

Shyama inquired, "Deva, where did so many monkeys sit? And how did they sit?

Sai Baba replied, "They sat on the trees and clung to the branches. They looked like myriads of ants."

Then Shyama asked Sai Baba, which perhaps only he could lovingly dare, "Did you see this with your own eyes?"

Sai Baba replied, "Yes, yes I saw them with my own eyes, Shyama."

Shyama again said what only he could lovingly dare, "When I first saw You, You hardly had stubble of mustache (a popular way in India to suggest youngsters). Then how and when did you go to see 'Vanara Sena (troops of monkeys)."

Sai Baba replied, "Shamyaa (as He lovingly called Shama) you and I have been together for many generations. I remember them but you do not."

In wonders Shyama asked, "How old were you then?"

Sai Baba, "Just as you see me now."

Shyama could not grasp the immensity of this spiritual fact or truth. He persisted, "Is this really true?"

Sai Baba as always, "Have I ever lied sitting here in the Dwarkamai? What I say is true. I swear by you."

Shyama did a great favor by asking these questions and we are blessed to read these answers that were given by our Sai Samardha.

 Shyama snores Baba’s name:
G.S Kaparde wrote in his famous book (Kaparde’s Dairy; dated December 8th,1911, Friday) as follows; 

“I saw with my own eyes, & heard with my own ears what I only read about but never experienced that with every outgoing & in drawing breath of Madhavrao Deshpande comes the clear sound of “Sayin Nath Maharaj Sayin Nath Baba” This sound is as clear as clear can be & when Madhavrao snores, the words can be heard even at a distance. This is really wonderful & he is in deep sleep all the time.”

This is incredible and amazing to read about this. Imagine how blessed Shyama is!

He was able to recite Baba’s name even in his sleep. 

OM SAI RAM! 

Wednesday, December 16, 2015

మాధవరావ్ దేశ్‌పాండే (శ్యామా) - 1



Play Audio




సాయి భక్తులందరిలోకి శ్యామాకు ప్రత్యేక స్థానం ఉంది. బాబానే స్వయంగా ఈ విషయం చాలాసార్లు చెప్పడం జరిగింది. వారి ఇద్దరి మధ్య 72 జన్మల సంబంధం ఉందని బాబానే స్వయంగా చెప్పారు. అట్లానే శ్యామాని తన ప్రతినిధిగా కొన్ని సార్లు బాబా పంపించడం జరిగింది. మరి ఇంతటి గౌరవాన్ని పొందిన భక్తుడు శ్యామా. అచంచల విశ్వాసముతో అపారమైన నమ్మకంతో బాబాను సేవించిన వారిలో మొట్టమొదటి వ్యక్తి శ్యామా. తనని పాము కరచి ప్రాణాపాయ స్థితిలో కూడా బాబాని తప్ప మరెవరిని నమ్మని భక్తితత్పరత శ్యామాలో ఉంది. బాబా నేర్పిన శ్రద్ధ, సబూరి తత్వాన్ని శ్యామా దగ్గర నుంచి మనము నేర్చుకోవాలి. అటువంటి మహానుభావుడి గురించి మనము తెలుసుకోవడం మన పూర్వజన్మ పుణ్యం మరియు బాబా అనుగ్రహం ఉండటం వల్ల మనకు ఈ సత్సంగ భాగ్యం లభించింది.
              
మాధవరావు దేశ్‌పాండే సుమారుగా 1858-1860 ప్రాంతంలో పుట్టి ఉండవచ్చు. ఆయనకు బాబా పెట్టిన ముద్దుపేరు శ్యామా. ఆయన షిరిడికి 20 మైళ్ళ దూరంలో ఉన్న నిమోన్ అనే గ్రామంలో పుట్టారు. శ్యామా తండ్రి మూడు వివాహాలు చేసుకున్నా సంతానం కలగలేదు. చివరికి ఆయన షిరిడి గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే ఆయన సోదరిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారికి పిల్లలు పుట్టారు. శ్యామాకు కాశీనాధ్, బాపాజి బల్వంత్ అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. శ్యామా 2 సంవత్సరాల వరకు నిమోన్ గ్రామంలో పెరిగారు. తరువాత వారి కుటుంబం షిర్డికి వచ్చి స్థిరపడింది. శ్యామా తన మూడవ సంవత్సరం నుంచి షిర్డిలోనే పెరిగారు. ఆయన 6వ తరగతి వరకు చదివి అక్కడి మరాఠి బడిలోనే ఉద్యోగంలో చేరారు. ఆయనను షిర్డి ప్రజలు చాలా గౌరవించే వారు. ఒక పోలీస్ అధికారి దానంగా ఇచ్చిన ఒక ఇంటిని బడిగా ఉపయోగించేవారు. ఆ బడి బాబా ఉన్న మశీదు ప్రక్కనే ఉండేది.

              శ్యామాను గురించిన విషయాలు మనకు బి.వి. నరసింహస్వామి గారు ద్వారా కొన్ని లభించాయి. ఆయన శ్యామాను 1938 మార్చి నెలలో చూడడం జరిగింది. అప్పటికి సుమారుగా శ్యామాకు 80 ఏళ్ళు ఉండవచ్చని ఆయన రాయడం జరిగింది. ఈ సంభాషణల ద్వారా మనకు సచ్చరితలో లేని విషయాలు కూడా కొన్ని తెలియడం జరిగింది. కొన్ని విషయాలు సాయిలీల పత్రిక ద్వారా మరియు కపర్డ డైరి అనే పుస్తకం ద్వారా మనం తెలుసుకోవచ్చు.

              శ్యామాకు, బాబాకు 72 జన్మల సంబంధం ఉన్నప్పటికి చాలా సంవత్సరాలు శ్యామా బాబాని గురువుగా నమ్మలేదు. తను పనిచేసే బడి, మశీదు ప్రక్కనే ఉండేవి. ఇప్పుడు అది శ్యామసుందర్ గదిగా చెప్పబడుతుంది. శ్యామా ఒక్కోసారి ఆ బడిలోనే నిద్రించే వాడు. ఆ బడి కిటికీలో నుంచి బాబాను పరిశీలిస్తూ ఉండేవాడు. చాలా సంవత్సరాలు బాబాని ఒక పిచ్చి ఫకీరుగా అనుకునేవాడు. శ్యామా దీన్ని గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది. బాబా ఒక్కోసారి మశీదులో మరొకసారి మారుతి గుడిలో కూర్చునేవారు. జోలి వేసుకుని భిక్షాటనకు వెళ్ళేవారు. ఆయన కాళ్ళకు గజ్జలు కట్టి నాట్యం చేసేవారు. ఒక్కోసారి చాలా చక్కగా పాటలు పాడేవారు. రాత్రిళ్ళు మశీదులో నుంచి మరాఠి, ఉర్డు, హింది, ఇంగ్లీషు బాషలో మాటలు వినబడుతూ ఉండేవి. బాబా ఒక్కరే మాట్లాడుతూ ఉండేవారు. నేను ఆయన దగ్గరకు చిలుము పీల్చటానికి వెళ్తూ ఉండేవాడిని అని చెప్పారు.  

శ్యామా కుటుంబ వివరాలు
మాధవరావ్ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మొట్టమొదటి భార్యపేరు సావిత్రిబాయి. ఆమె ద్వారా ఒక కొడుకు పుట్టారు. అతని పేరు ఏకనాథ్‌పంతు. శ్యామా రెండవ భార్య పేరు ద్వారకాబాయి. ఆమెకు ఇద్దరు పుత్రులు (జగన్నాథ్‌పంతు మరియు ఉద్ధవరావ్) ఒక పుత్రిక (బిజితాయి). వీరిలో ఉద్ధవరావ్ ఎక్కువగా బాబా దగ్గరకు వెళ్ళేవాడు. బాబా ఇచ్చే స్వీట్లు మరియు ఇతర తినుబండారములు కోసం వెళ్ళేవాడు. ఉద్ధవరావు 6 సంవత్సరములు వచ్చినా విధ్యాభ్యాసం మొదలు పెట్టలేదు. శ్యామా ఎంత బయపెట్టినా స్కూలుకి వెళ్ళేవాడు కాదు. ఒకసారి శ్యామా అతనిని కొట్టబోతే పరిగెత్తి బాబా దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు బాబా శ్యామాని వారించి, వాడి సంగతి నేను చూసుకుంటానులే అని చెప్పారు. అదే విధంగా ఉద్ధవరావ్ పెద్ద అయిన తరువాత షిర్డి సంస్థానంలో పూజారిగా పనిచేయడం జరిగింది. మిగిలిన పిల్లలు సాయికి అంత దగ్గరగా ఉన్నట్లు చెప్పబడలేదు.


శ్యామా వృత్తి వివరాలు
శ్యామా షిర్డి మరాఠి బడిలో ఆరవ తరగతి వరకు చదివాడని చెప్పుకున్నాము. సుమారు 15-16 సంవత్సరాల వయస్సులో అదే బడిలో ఉపాధ్యాయునిగా చేరాడు. నానా రత్నపార్కె అనే ఆయన వాళ్ళకి ప్రధాన ఉపాధ్యాయుడు. లక్ష్మణ మాష్టారు అనే ఆయన కూడా అక్కడ పనిచేసేవాడు. శ్యామా టీచరుగా సుమారు 6 సంవత్సరాలు పనిచేశారు. ఆ తరువాత బదిలీ అయితే షిర్డి వదలి వెళ్ళడం ఇష్టం లేక ఉద్యోగం మానేస్తారు.


              ఆ తరువాత కొంత వైద్యం నేర్చుకుని బాబా అనుగ్రహంతో వైద్యుడిగా సేవ చేయడం జరిగింది. రోగుల నాడి చూసి జబ్బు కనుక్కోవడంలో మంచి పేరు తెచ్చుకొంటారు. ఆయుర్వేద మరియు కొన్ని ఇంగ్లీషు మందులు ఇచ్చేవారు. బాబా ఊది కలిపి మందులను ఇచ్చేవారు. ఈ విధంగా కొంత డబ్బుని  సంపాయించే వారు. కాని ఆయన మాత్రము ఈ మందులు వాడేవారు కాదు. బాబా చెప్పిన వైద్యం మాత్రమే చేసుకునేవారు. మెల్లగా షిర్డికి వచ్చిన యాత్రికుల మంచి, చెడ్డలు చూడటం వారికి వసతి సౌకర్యాలు ఏర్పరచటం లాంటి పనులలో నిమగ్నమై ఉండేవారు. బాబాకు కావల్సిన పనులన్ని చేసిపెట్టేవారు. బాబాని ఎవరైనా వారి ఇండ్లకు రమ్మని ఆహ్వానిస్తే తనతరపున బాబా శ్యామాను పంపేవారు. ఈ విధంగా శ్యామా బాబా సేవయే తన వృత్తిగా చేపట్టిన పుణ్యాత్ముడు. నానాసాహెబ్‌చందోర్కరు, దీక్షిత్, కపర్డె బూటి వంటివారు శ్యామాకు బాబాతో సమానమైన గౌరవం ఇచ్చేవారు.
ఓం శ్రీ సాయి రామ్ !

Tuesday, December 15, 2015

Shyama - 1



Introduction and Birth details:
Madhavrao deserves special place among the devotees of Sri Sai Baba. Baba himself reiterated this several times. Once Baba told him that their relationship is for 72 lives. Baba used to send Shyama as his representative whenever people requested him to attend any major household functions. Such is the importance of Madhavrao Deshpande. He had utmost faith in Baba. His faith was undisturbed even in the mist of adversity. When he was bitten by a snake and about to die even then his faith towards Baba was indescribable. He is the perfect example and lived the life of Shradda and Sabhuri. We are really blessed to learn about such a person and Baba’s blessings will be always with us.

Madhavrao Deshpande might have born around 1860. Sai named him as Shyama. He was born in Nimon village of Ahamadnagar district. He grew up there until age2. His father got married three times without any children. Then he gets married to sister of one by name Laxman Kulkarni in Shirdi village. Then he had 3 boys. Shyama was the oldest. His 2 brothers were Kashinath and Bapaji Balwant, By age 3, Shyama’s father moved his family to Shirdi. 

Shyama had his elementary education in Marathi school. He finished 6th grade. He joins as a teacher in the same school later. He reportedly did not learn either Sanskrit or English. Being a village teacher he was well respected. In those days teachers were respected really well. This school was next to Dwarakamai. At that time the masjid was dilapidated. One of the Circle Inspector donated the rooms for the school. Later years Radhakrishna Aai used to live there. After that this became the place for Baba’s Horse Shyamasundar.

Pujyasri B V Narasimha Swami ji interviewed Shyama in 1938 and gave us some details. Shyama was probably approaching 80 years of age at that time. Through Sai leela magazine, khaparde dairy and other sources gave us lot of details about Madhavrao Deshpande.  Shyama did not realize the greatness of Baba for several years. Shyama while working as a school teacher, sometimes used to sleep in the school. Through the window of the school he used to observe Baba’s routine. Baba sometimes used to sit in Marurhi Temple near the masjid. He used to go for Bikshaw (Alms). Some times Shyama heard different languages from the Dwarakamai such as Hindi, Urdu, Persian, English and Marathi. Baba was observed to be alone during those times. At times he used to dance with bells in his legs and sing songs in a rhythmic way. He showed all kinds of talents. He used to use 2 earthen pots to water the plants. This was his routine as described by Shyama.


Shyama’s family details:
Madhavrao got married twice. His first wife was Savitribai. He had one son, Eknathpant, from her. Madhavrao’s second wife was Dwarkabai. They had two sons - Jagannathpant and Uddhavrao  and a daughter – Babitai. Uddavrao was the only one who frequently accompanied his father to visit Baba. Baba also loved Uddavrao very much and used to give sweets and other food items. He did not want to go to school even at the age of 6. Shyama was worried that he was not showing interest in studies. One day he ran after him to discipline and Uddavrao ran to Baba. Baba told Shyama that he will take care of him and not to worry. As promised, Uddavrao later worked as a Priest for Shirdi Sansthan for number of years. There was no mention of other kids in relation to Sai. Madhavrao was tall, well-built and very healthy. His complexion was wheatish. Up to the age of 72, he did not suffer from any ailments. He did not suffer even from simple maladies like fever or head-ache.

Shyama’s Work details:
 After completing his education, he taught in the village Marathi school, as an Assistant Teacher, for a few years. Nana Ratna Parkhe was his Headmaster and superior. One Laxman Master was another teacher above him. When Madhavrao started working in the school, his age was about 14-15. Madhavrao worked as a teacher for five or six years. He gave up that place, when he was transferred from Shirdi. 

After resigning the teacher job, till the end of his life, he worked as a village doctor. He used to give medicines after taking Baba’s name. Madhavrao was an expert at diagnosing various diseases and knowing properties of various medicines. He was also very good at diagnosing the ailment by merely feeling the pulse. He had gained the knowledge on his own and did not learn it from anyone. He carried a stock of Indian and foreign medicines. He could earn some money by practicing medicines. He used to mix Baba’s Udi in the medicines. Besides, he also used to refer to books on Ayurveda from time to time. He used medicines manufactured in the factories. He also prepared some of the medicines himself. 


Madhavrao had some income from a piece of land at village Nimon as well as from his medical practice. He did not use any of the medicines for himself. He always relied on Baba for every ailment. After a while, he started taking care of visitors who came to see Baba. He helped them in arranging lodging and communicated their needs to Baba. In this way he worked relentlessly all his life in serving Baba. Everyone gave similar kind of respect as they used to give Baba.

 OM SAI RAM!